abhiruchi madhu
-
రౌడీ రాజ్యం
నంద్యాల్లో మాజీ ఎమ్మెల్సీ చక్రపాణి రెడ్డిపై హత్యాయత్నం - నడిరోడ్డుపై వేట కొడవలితో అధికార పార్టీ నేత అభిరుచి మధు వీరంగం - రెండు రౌండ్లు కాల్పులు జరిపిన గన్‌మ్యాన్ - కనీసం అదుపులోకి తీసుకోని పోలీసులు నంద్యాల పట్టణంలోని సూరజ్ గ్రాండ్ హోటల్ ప్రాంతం.. గురువారం మిట్ట మధ్యాహ్నం ఒంటి గంట కావస్తోంది.. దారికి అడ్డంగా ఓ వాహనం ఉండటంతో మాజీ ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి వాహనం అక్కడికొచ్చి ఆగింది.. వాహనాన్ని పక్కకు తీయండని డ్రైవర్ చెబుతుండగానే ఎదుటి వైపు నుంచి రాళ్ల దాడి మొదలైంది.. టీడీపీ నేత మధు చేత్తో వేట కత్తి పట్టుకుని ఊగిపోతూ ఆవేశంతో రంకెలేస్తున్నాడు.. అంతలోనే ఆయన పక్కనున్న మరో వ్యక్తి చేతిలో రివాల్వర్ ప్రత్యక్షమైంది.. చేయి పైకెత్తి టపా..టపా.. మని కాల్పులు జరిపాడు.. ఫ్యాక్షన్ సినిమాలోని సీన్‌ను తలదన్నేలా సాగిన ఈ సన్నివేశం సాక్షాత్తూ పోలీసుల కళ్లెదుటే జరిగింది.. స్థానికులను భయభ్రాంతులకు గురి చేసింది. సాక్షి ప్రతినిధి, కర్నూలు: కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికలో ఓటమి భయంతో అధికార పార్టీ అరాచకాలకు తెరలేపింది. పోలింగ్ రోజున పోలింగ్ శాతం పెరిగే కొద్దీ మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు విచ్చలవిడిగా ఎన్నికల నిబంధనలను తుంగలో తొక్కుతూ నియోజకవర్గం మొత్తం కలియదిరుగుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారు. తాజాగా పోలింగ్ ముగిసిన మరుసటి రోజే గురువారం మాజీ ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణి రెడ్డిపై అధికార పార్టీకి చెందిన అభిరుచి మధు ఏకంగా వేట కొడవలితో హత్యాయత్నం చేశాడు. మధు గన్‌మ్యాన్ శిల్పాను లక్ష్యంగా చేసుకుని రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. నంద్యాల నడిరోడ్డులో కార్లతో అటకాయించి మరీ.. చక్రపాణి రెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడిన వైనం మొత్తం సీసీ కెమెరాల్లో రికార్డు అయిం ది. ఈ తతంగమంతా పోలీసుల కళ్లెదుటే జరిగింది. అయినప్పటికీ బాధితులు శిల్పా చక్రపాణి రెడ్డి, ఆయన అనుచరులపైనే తొలు త కేసు నమోదు చేశారు. పోలీసుల కళ్లెదుటే టీడీపీ నేత మధు వేట కత్తి పట్టుకుని వీరంగం సృష్టిస్తుంటే కనీసం దానిని లాక్కొని అదుపు లోకి తీసుకునే ప్రయత్నం చేయలేదు. రౌడీషీటర్‌గా ఉన్న అధికార పార్టీకి చెందిన అభిరుచి మధును పోలీసులు కనీసం వారించే ప్రయత్నం జరగకపోవడం.. నిందితులను వెనకేసు కొస్తూ మంత్రి అఖిలప్రియ మాట్లాడటాన్ని గమనిస్తే అంతా స్కెచ్ ప్రకారమే వ్యవహారం నడిచిందన్న అనుమానాలు బలపడుతున్నా యి. మధుపై రౌడీషీట్ ఎత్తివేయడంతో పాటు ఉప ఎన్నికకు ముందు హడావుడిగా గన్‌మ్యాన్ ను కేటాయించడం చర్చనీయాంశమైంది. అంటే ఉప ఎన్నికకు ముందు అధికార పార్టీ.. ప్రతిపక్ష పార్టీ నేతలపై దాడులకు వ్యూహాత్మ కంగా రంగం సిద్ధం చేసిందని తెలుస్తోంది. జరిగింది ఇదీ... నంద్యాలలోని సలీంనగర్లో నివాసం ఉంటు న్న వైఎస్సార్సీపీ మైనార్టీ నాయకుడు చింపిం గ్ బాషా బుధవారం అనారోగ్యంతో మృతి చెందారు. ఈ కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్సీ చక్రపాణిరెడ్డితో పాటు నలుగురు కౌన్సిలర్లు పరామర్శించి తిరిగి వస్తున్నారు. అధికార పార్టీకి కేంద్రంగా ఉన్న సూరజ్ హోటల్ సెంటర్లో టీడీపీ నేత అభిరుచి మధుతో పాటు మరికొందరు కార్యకర్తలు తమ కార్లను అడ్డంగా నిలిపి ఉంచి చక్రపాణి రెడ్డి కారును అటకాయించారు. దీంతో సైడ్ ఇవ్వమని చక్రపాణిరెడ్డి కారు డ్రైవర్ పదే పదే విజ్ఞప్తి చేసినప్పటికీ ఏ మాత్రం వారు స్పందించలేదు. అనంతరం నానాబూతులు తిడుతూ చక్రపాణి రెడ్డి కారువైపు అభిరుచి మధుతో పాటు మరికొందరు రాళ్లు రువ్వుతూ వేట కొడవళ్లతో దూసుకొచ్చారు. దీంతో చక్రపాణిరెడ్డి వెంట ఉన్న వారు ప్రతిఘటించేందుకు యత్నించా రు. ఈ సందర్భంగా మధు గన్‌మ్యాన్ సోమ భూపాల్ (నం.1681) రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ తతంగం జరుగుతుండగా అక్కడ పోలీసులు కూడా ఉన్నారు. అయితే వారు మధు చేతిలోని వేట కొడవలిని లాక్కునేందుకు కానీ, అతన్ని అదుపులోకి తీసుకునే ప్రయత్నం కానీ చేయలేదు. కొంత సేపటి తర్వాత చక్రపాణిని ఇంటికి పంపించా రు. అభిరుచి మధును బుజ్జగిస్తూ అతన్ని కూడా కారు ఎక్కించి మరీ సాగనం పారు. కనీసం ముందస్తు జాగ్రత్త చర్యలో భాగంగా అతన్ని అదుపులోకి తీసుకునే యత్నం కూడా చేయకపోవడం విమర్శలకు తావిచ్చింది. బాధితులపైనే కేసులు ఏదైనా సంఘటన జరిగితే మొదటగా ఎవరైతే బాధితులో వారి పక్షాన పోలీసులు నిలవాలి. అయితే ఇక్కడ మాత్రం పోలీసు యంత్రాంగం మొత్తం అధికార పార్టీకి కొమ్ముకాసే విధంగానే వ్యవహరించిందన్న అభిప్రాయం వ్యక్తమవు తోంది. నడిరోడ్డుపై వేట కొడవలి పట్టుకుని వీరంగం సృష్టించడంతో పాటు గీత గీసి మరీ సవాల్ విసిరిన మధును కనీసం ముందస్తు జాగ్రత్తలో భాగంగా అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయలేదు. పైగా ఒకడుగు ముం దుకు వేసి మధు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా చక్రపాణి రెడ్డితో పాటు ఇతర నేతలపై కేసులు నమోదు చేశారు. ఆ తర్వాత వైఎస్సార్సీపీ నేత జగదీశ్వర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మధుతో పాటు మున్నా అలియాస్ ఖాదర్, షేక్ చిన్ను, వేణు, గన్‌మ్యాన్ సోమభూపాల్‌పై కేసు నమోదు చేశారు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు పేర్కొంటున్నారు. రౌడీషీట్ ఎత్తేసి ప్రోత్సహించారు.. వాస్తవానికి టీడీపీ నేత అభిరుచి మధు వ్యవహారంపై అనేక ఆరోపణలు ఉన్నాయి. గతంలో కూడా అనేక మందిపై నడిరోడ్డుపై దాడి చేయడంతో పాటు పలు బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో ఆయనపై 2009లో నంద్యాల టూటౌన్ పోలీసు స్టేషన్లో రౌడీ షీటు నమోదైంది. వరుస దాడులతో జిల్లా ఉపాధ్యక్షుడి పదవి కూడా పోయింది. అయితే తిరిగి బాబు, లోకేశ్‌లను కలసి పదవి సంపా దించుకున్నారు. 2014లో చంద్రబాబు వచ్చాక రౌడీషీటర్‌ను కూడా ఎత్తివేశారు. ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలపై దాడులు చేసేందుకు వీలుగా ఏకంగా గన్మ్యాన్లను ప్రభు త్వం కేటాయించింది. జరిగిన సంఘట నలను విశ్లేషిస్తే పక్కా స్కెచ్ ప్రకారమే వ్యవ హారం నడిచిందని అర్థమవుతోంది. రౌడీషీట ర్గా రికార్డు ఉన్న మధుకు గన్మ్యాన్లను (1+1)ఎలా కేటాయిస్తారన్న ప్రశ్న ఇప్పుడు ఎదురవుతోంది. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో నే భద్రత కల్పించారన్న విమర్శలు వెల్లువెత్తు తున్నాయి. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో మారణాయుధాలతో నడిరోడ్డుపై ఎలా తిరిగారన్న ప్రశ్న ఎదురవుతోంది. -
సీఎం అండతోనే శిల్పాపై హత్యాయత్నం
సాక్షి, హైదరాబాద్: నంద్యాలలో శిల్పా చక్రపాణిరెడ్డిపై జరిగిన దాడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. కాల్పులకు పాల్పడ్డ అభిరుచి మధును తక్షణమే అరెస్ట్ చేయాలని ఆ పార్టీ డిమాండ్ చేసింది. రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... చంద్రబాబు పాలన అంతా రక్తచరిత్రే అని అన్నారు. టీడీపీ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, నడిరోడ్డుపై రౌడీలు వీరవిహారం చేస్తుంటే పోలీసులు పారిపోతున్నారన్నారు. రౌడీషీటర్‌కు గన్ ఎక్కడ నుంచి వచ్చిందని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ఆయుధాలను పోలీస్ స్టేషన్లో ఎందుకు అప్పగించలేదని, టీడీపీ నేతలకు నిబంధనలు వర్తించవా అని అన్నారు. ఎన్నికల పోలింగ్ సందర్భంగా నంద్యాలలో నిన్నంతా టీడీపీ నేతలు వీరంగం సృష్టించారని శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. ఇంకెంతకాలం అరాచకాలు చేస్తారని అన్నారు. ప్రభుత్వమే రౌడీయిజం చేయిస్తోందని, రౌడీలను పరోక్షంగా ప్రోత్సహిస్తోందని వ్యాఖ్యానించారు. నారాయణరెడ్డిని దారుణంగా చంపినా చంద్రబాబు కనీసం చర్యలు తీసుకోలేదని అన్నారు. పోలీసులు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, తప్పు చేసినవారిని శిక్షించాలన్నారు. కళ్ల ఎదురుగానే కాల్పులు జరిపిన వ్యక్తిని ఎందుకు అదుపులోకి తీసుకోలేదని ప్రశ్నించారు. నడిరోడ్డుపై రౌడీలు వీరవిహారం చేస్తుంటే పోలీసులే పారిపోతున్నారన్నారు. నేతల పరిస్థితే ఇలా ఉంటే సామాన్యుల పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే అభిరుచి మధును అదుపులోకి తీసుకోవాలని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కాల్పుల ఘటన ప్రభుత్వ వైఫల్యమే.. నంద్యాలలో టీడీపీ నేతలు రౌడీయిజం చేస్తున్నారని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. పోలీసులు కూడా వారికే వత్తాసు పలుకుతున్నారన్నారు. ముఖ్యమంత్రి మెప్పు కోసం అధికారులు, పోలీసులు యత్నిస్తున్నారని విమర్శించారు. గత నెలరోజులుగా వైఎస్ఆర్ సీపీ నేతలను టార్గెట్ చేశారని అంబటి అన్నారు. మూడు రోజులుగా శిల్పా కుటుంబాన్నే లక్ష్యంగా చేసుకున్నారని, కాల్పులను ప్రభుత్వ వైఫల్యంగా చూడాలన్నారు. పట్టపగలు టీడీపీ నేతలు కాల్పులు జరపడం దారుణమని, పోలీసుల వైఫల్యం చాలా స్పష్టంగా కనిపిస్తోందన్నారు. టీడీపీ నేతలు కాల్పులు జరుపుతుంటే పోలీసులు పారిపోయారన్నారు. -
ఉద్దేశపూర్వకంగానే నాపై కాల్పులు: చక్రపాణిరెడ్డి
సాక్షి, నంద్యాల: అధికారాన్ని అడ్డం పెట్టుకుని తనపై కాల్పులు జరిపారని వైఎస్ఆర్ సీపీ నేత శిల్పా చక్రపాణిరెడ్డి అన్నారు. ఉద్దేశపూర్వకంగానే తనపై కాల్పులు జరిగాయని ఆయన తెలిపారు. కాల్పుల ఘటనపై శిల్పా చక్రపాణిరెడ్డి మాట్లాడుతూ... ‘కాల్పులు జరిపింది అభిరుచి మధునే. మధు చేతిలో గన్‌తో మాపైకి దూసుకు వచ్చాడు. చుట్టు ఉన్నవారు నిలువరించడానికి ప్రయత్నించినా మధు ఆగలేదు. అంత్యక్రియల కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళితే అటకాయించారు. మా వాహనాలను ముందుకు వెనక్కి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఇదేంటని మా వాళ్లు ప్రశ్నిస్తే.. మీ సంగతి చూస్తామన్నారు. మీ సంగతి తేల్చడానికే ఇక్కడికి వచ్చామని బెదిరించారు. వాళ్ల చేతుల్లో గన్లు ఉన్నాయి. కార్లలో వేట కొడవళ్లు ఉన్నాయి. దాడి విషయాన్ని పోలీసులకు చెబితే తాత్సారం చేశారు. కొత్త సూరజ్ హోటల్ వద్ద దాడి జరిగిందని పోలీసులకు చెబితే పాత సూరజ్‌కు వెళ్లామని చెప్పారు. పోలీసులు నిదానంగా వచ్చి అందరిని పంపే ప్రయత్నం చేశారు. నిన్న మా కార్యకర్తలను కొట్టారు. నేడు నాపై దాడికి ప్రయత్నించారు. అభిరుచి మధుపై రౌడీ షీట్ ఉంది. ఆయనకు నేర చరిత్ర కూడా ఉంది. కార్లలో వేట కొడవళ్లు, కత్తులు ఎందుకు?. మేం గత నెల రోజులుగా సంయమనం పాటిస్తూనే ఉన్నాం. టీడీపీ నేతలు మాత్రం ప్రతిసారి రౌడీయిజాన్ని చూపిస్తున్నారు. ఈ చర్యలకు మేము, మా కార్యకర్తలు భయపడేది లేదు. మేం ఎప్పుడూ ప్రజల పక్షానే ఉంటాం. ఇటువంటి చర్యలను ప్రభుత్వం కూడా ఖండించాలి.’ అని అన్నారు. సంబంధిత వార్త...: నంద్యాలలో శిల్పా చక్రపాణిరెడ్డిపై కాల్పులు! కాగా నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా ఎన్నికల కోడ్ అమలులోకి రాగానే ఆయుధాలను పోలీస్ స్టేషన్లో డిపాజిట్ చేయాలి. అయితే నిబంధనల ప్రకారం గన్‌తో పాటు బుల్లెట్లను కూడా అప్పగించాలి. కౌంటింగ్ పూర్తయ్యేవరకూ ఆయుధాలు పోలీస్ స్టేషన్లోనే ఉండాలి. అయితే నిబంధనలు అతిక్రమించిన టీడీపీ నేతలు తమ వద్దే ఆయుధాలు ఉంచుకున్నారు. -
టీడీపీ నేత అనుచరుల అరాచకం
అధికార పార్టీ అరాచకాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. తమకు అడ్డొస్తే ఎంతటి వారినైనా వదిలేది లేదనే సంకేతాలిస్తూ.. ప్రజలను భయభ్రాంతులకు లోను చేస్తున్నారు. నంద్యాల పట్టణంలో సోమవారం ఆ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడి అనుచరులు చేసిన వీరంగం చర్చనీయాంశంగా మారింది. కారుకు అడ్డొచ్చారనే చిన్న కారణంతో తండ్రీ కుమారుడిని బెల్టుతో చితకబాదడం.. కుమారుడిని వదిలిపెట్టండని తండ్రి కాళ్లావేళ్లా పడినా కనికరించకపోవడం చూస్తే.. ఆ పార్టీ ప్రజల్లోకి ఎలాంటి సందేశం పంపుతుందో అర్థమవుతోంది. - నడి రోడ్డుపైనే తండ్రీకొడుకులపై దాడి నంద్యాల: టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు అభిరుచి మధు అనుచరులు ముగ్గురు నడిరోడ్డుపై తండ్రీకొడుకులపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఒక అనుచరుడు కుమారుడిని చేతులతో బంధించగా.. మరో ఇద్దరు అనుచరులు బెల్ట్‌తో, చేతులతో చితకబాదారు. తండ్రి చేతులెత్తి మొక్కినా వదల్లేదు. చివరకు పోలీసులు జోక్యం చేసుకోవడంతో విడిచిపెట్టారు. ఈ సంఘటన కర్నూలు జిల్లా నంద్యాలలోని రాజ్‌థియేటర్ జంక్షన్లో సోమవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. టీడీపీ కర్నూలు జిల్లా ఉపాధ్యక్షుడు అభిరుచి మధు కొన్నేళ్లుగా హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ, తరచూ నంద్యాలకు వచ్చి వెళ్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఆయన అనుచరులు మహానంది క్షేత్రానికి వచ్చారు. తిరిగి హైదరాబాద్‌కు వెళ్తూ నంద్యాలలోని మధును కలిసేందుకు బయల్దేరారు. రాజ్‌థియేటర్ జంక్షన్ వద్ద వీరు వెళ్తున్న కారుకు రుద్రవరం మండలం బి.కొట్టాలకు చెందిన తండ్రీకొడుకులు రామలింగారెడ్డి, లింగమూర్తిరెడ్డి వెళ్తున్న బైక్ అడ్డం వచ్చింది. ఆగ్రహంతో ఊగిపోయిన మధు అనుచరులు కారులో నుంచి బయటకు వచ్చి బూతులు తిట్టడం ప్రారంభించారు. ఆ తర్వాత దాడికి పాల్పడ్డారు. కొడుకును వదిలేయమని తండ్రి చేతులెత్తి మొక్కినా ఫలితం లేకపోయింది. ఈ ఘటనతో రాజ్‌థియేటర్ ప్రాంతంలో ట్రాఫిక్ స్తంభించింది. ట్రాఫిక్ కానిస్టేబుళ్లు ఘటనా స్థలానికి చేరుకొని సర్ది చెప్పారు. నడిరోడ్డుపై ట్రాఫిక్ అధికంగా ఉండే ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకోవడంతో ప్రజలు భయభ్రాంతులకు లోనయ్యారు. మధు అనుచరుల చేతిలో దెబ్బలు తిన్న తండ్రీకొడుకులు ఎవరో తెలియరాలేదు. ఘటనా స్థలాన్ని డీఎస్పీ హరినాథరెడ్డి, వన్‌టౌన్ సీఐ ప్రతాప్‌రెడ్డి పరిశీలించారు. ఘర్షణకు సంబంధించి ఎవరూ ఫిర్యాదు చేయలేదని తెలిపారు. నాకు సంబంధం లేదు.. ఘటనతో తనకు సంబంధం లేదని, తాను అమరావతి ఫ్రీజోన్ డిమాండ్‌పై విద్యార్థి సంఘాలు తహసీల్దార్ కార్యాలయం వద్ద చేపట్టిన దీక్షలో పాల్గొన్నానని అభిరుచి మధు విలేకరులకు తెలిపారు. తనను రాజకీయంగా దెబ్బ తీయడానికే ఇలాంటి దుష్ర్పచారం చేస్తున్నారన్నారు.