addressed
-
ప్రపంచ చోదక శక్తి యువతే
సాక్షి, అమరావతి: ఐక్యరాజ్య సమితి (యూఎన్ఓ)లో జరిగే సుస్థిరాభివృద్ధి లక్ష్యాల (ఎస్డీజీ) సదస్సుకు వెళ్లిన మన రాష్ట్ర విద్యార్థులు శనివారం జనరల్ అసెంబ్లీలో జరిగిన సదస్సులో ప్రసంగించారు. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన ఎస్డీజీ యాక్షన్ వీకెండ్ సదస్సులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు తమ గళం వినిపించారు. వివిధ దేశాల అధినేతలు, కేంద్ర మంత్రులు, యూఎన్ మెంబర్స్ పాల్గొన్న ఈ సదస్సులో తొలిరోజు దడాల జ్యోత్స్న, పసుపులేటి గాయత్రి, అల్లం రిషితారెడ్డి, మోతుకూరి చంద్రలేఖ, షేక్ అమ్మాజాన్, వంజివాకు యోగేశ్వర్ మాట్లాడారు. 2030 నాటికి భవిష్యత్ తరాలకు స్థిరమైన అభివృద్ధిని అందించాలన్న నినాదంతో నిర్వహించిన ఈ సదస్సులో విద్యార్థులు సుస్థిరాభివృద్ధిలో యువత ప్రాధాన్యం చాలా అవసరమని, అభివృద్ధికి యువత టార్చ్ బేరర్‌గా బాధ్యత తీసుకోవడం ఎంతో అవసరమని పేర్కొన్నారు. ప్రపంచంలో ప్రస్తుతం ఉన్న 1.9 బిలియన్ల మంది యువత ప్రపంచ చోదక శక్తిగా మారాలని, సానుకూల సామాజిక మార్పుకు దిక్సూచిగా ఉండాలని అంతర్జాతీయ ప్రతినిధుల ముందు చేసిన ప్రసంగం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 2030 నాటికి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించేందుకు, ప్రపంచాన్ని తిరిగి సరైన మార్గంలో నడిపించేందుకు యువత కృతనిశ్చయంగా ఉండాలన్నారు. తొలిసారి ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించడంపై విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. తొలిరోజు సదస్సులో ఐక్యరాజ్య సమితి స్పెషల్ స్టేటస్ మెంబర్ ఉన్నవ షకిన్‌కుమార్, సమగ్ర శిక్ష ఏపీ ఎస్పీడీ శ్రీనివాసరావు, కేజీబీవీ కార్యదర్శి మధుసూదనరావు, ఉత్తర అమెరికా రాష్ట్ర ప్రతినిధి పండుగాయల రత్నాకర్ పాల్గొన్నారు. -
ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు
న్యూఢిల్లీ : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారిపై నిర్లక్ష్యం తగదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హితవు పలికారు. వైరస్ సోకకుండా, వ్యాప్తి చెందకుండా ప్రజలంతా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రభుత్వాల సూచనలను తు.చ తప్పకుండా పాటించాలని కోరారు. కరోనాపై పోరులో భాగంగా.. ఈ ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు దేశ ప్రజలంతా ‘జనతా కర్ఫ్యూ’ పాటించాలని ప్రధాని పిలుపునిచ్చారు. ప్రజల కోసం, ప్రజలే స్వచ్ఛందంగా విధించుకునే ఈ జనతా కర్ఫ్యూ సందర్భంగా.. ఆ రోజు ప్రజలు పూర్తి సమయం తమ ఇంట్లోనే ఉండాలని, ఇంట్లో నుంచి అడుగు కూడా బయటపెట్టకూడదని సూచించారు. ఈ జనతా కర్ఫ్యూ కరోనాపై పోరులో దేశ ప్రజల నిబద్ధతకు తార్కాణంగా నిలుస్తుందన్నారు. అలాగే, తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా కరోనాపై అహర్నిశలు పోరాటం చేస్తున్న వైద్య, పారిశుద్ధ్య, విమానయాన, మీడియా.. తదితర వర్గాల వారికి ఆదివారం సాయంత్రం 5 గంటలకు ఐదు నిమిషాల పాటు తమ ఇంట్లోనే ఉండి కృతజ్ఞతలు తెలపాలని ప్రధాని కోరారు. గుమ్మం ముందు, లేక బాల్కనీలో, లేక కిటికీ వద్ద నిల్చుని చప్పట్లు కొట్టడం, గంటలు కొట్టడం, సెల్యూట్ చేయడం లేదా వీలైన ఇతర విధానాల్లో వారికి కృతజ్ఞతలు తెలపాలని సూచించారు. కనీవినీ ఎరుగని ఉత్పాతం కరోనా వైరస్ ముప్పు దేశంలో విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రధాని గురువారం రాత్రి 8 గంటలకు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఇది మామూలు ఉత్పాతం కాదని, మొదటి, రెండో ప్రపంచ యుద్ధాలు కూడా ఈ స్థాయిలో ప్రపంచ దేశాలపై ప్రభావం చూపలేదని వ్యాఖ్యానించారు. ప్రపంచం ఇప్పుడు కనీవినీ ఎరుగని సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని ఆందోళన వ్యక్తం చేశారు. కోవిడ్–19కి కచ్చితమైన చికిత్స కానీ టీకా కానీ లేదన్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ ముప్పును ఎదుర్కొనేందుకు వ్యక్తిగత పరిశుభ్రత, సామాజిక దూరం పాటించాలని దేశ ప్రజలను కోరారు. వ్యక్తిగత స్థాయిలో తీసుకునే చర్యల ద్వారానే ఈ మహమ్మారిని నిరోధించగలమన్నారు. (విమానం దిగగానే క్వారంటైన్కే..) కరోనాపై విజయం సాధించేందుకు తనకు దేశ ప్రజలు తమ సమయం ఇవ్వాలని ప్రధాని కోరారు. ‘నేను ఎప్పుడు, ఏమడిగినా నన్ను మీరు నిరాశ పర్చలేదు. ఇప్పుడు కూడా అభ్యర్థిస్తున్నాను. రానున్న కొన్ని వారాల పాటు మీ సమయాన్ని నాకివ్వండి. ఈ సమయంలో ఇంట్లోనే ఉండండి. అత్యవసరం అయితే తప్ప అడుగు బయట పెట్టకండి. ఇంట్లో నుంచే పని చేసేలా చూసుకోండి’ అని అభ్యర్థించారు. 60 ఏళ్ల వయసు దాటినవారు కొన్ని వారాల పాటు ఇల్లు కదలవద్దని సూచించారు. దృఢ సంకల్పంతో, సంయమనం పాటిస్తూ ఈ మహమ్మారిపై యుద్ధం చేయాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. కరోనాతో భయాందోళనలకు గురై, పెద్ద ఎత్తున నిత్యావసర వస్తువులను కొనుక్కునే ప్రయత్నాలు చేయవద్దని, అన్ని వేళలా నిత్యావసరాలను అందుబాటులో ఉంచుతామని తెలిపారు. నిత్యావసరాలను, ఔషధాలను పెద్ద ఎత్తున నిల్వ చేసుకోవద్దన్నారు. కరోనా అభివృద్ధి చెందిన దేశాలపైననే ప్రభావం చూపుతుందని, భారత్‌ను ఏమీ చేయదని అనుకోవద్దన్నారు. ‘ఈ ఆలోచనాధోరణి సరైంది కాదు. ఈ విషయంలో నిర్లక్ష్యం తగదు. ప్రతీ భారతీయుడు అప్రమత్తంగా, అత్యంత జాగరూకుడై ఉండాలి’ అని హెచ్చరించారు. సత్వరమే చర్యలు తీసుకున్న కొన్ని దేశాలు ఈ వైరస్ వ్యాప్తిని సమర్థంగా ఎదుర్కొన్నాయన్నారు. ప్రజల సహకారంతో భారత్ ఈ వైరస్‌ను జయిస్తుందన్నారు. (కరోనా వ్యాప్తి: ఏంజెలా మెర్కెల్ సంచలన వ్యాఖ్యలు) -
అదృశ్యం.. ప్రత్యక్షం
నెల్లిపాక (రంపచోడవరం): అదృశ్యమైన యువతి 37 రోజుల తరువాత ప్రత్యక్షమైంది. తనను కిడ్నాప్ చేశారని చెప్పడంతో ఎటపాక మండలంలో అలజడి రేగింది. కిడ్నాప్ వ్యవహారంతో గ్రామాల్లో తీవ్ర చర్చ సాగుతోంది. వివరాల్లోకి వెళితే.. ఎటపాక మండలం రేగడగట్ట గ్రామంలో నివాసముంటున్న మడకం నారాయణ పెద్ద కుమార్తె రజిత గతనెల 13న గొల్లగూడెంలో జరిగిన శివరాత్రి జాతరకు వెళ్లి అప్పటి నుంచీ ఆచూకీ లేకుండాపోయింది. రజిత కోసం తల్లిదండ్రుల విచారించగా, సమీప గ్రామానికి చెందిన ఓ యువకుడు ద్విచక్రవాహనంపై యువతిని తీసుకెళ్లినట్టు తెలిసింది. దీంతో ఆ యువకుడిపై అనుమానంతో ఎటపాక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ యువకుడు తనకేమీ తెలియదని యువతిని అదే రోజు రాత్రి గ్రామంలో వదిలిపెట్టానని చెప్పాడు. అప్పటి నుంచీ యువతి కోసం పలుచోట్ల వెతికినా ప్రయోజనం లేకపోయింది. కేసు విచారణలో కూడా పోలీసులు పురోగతి సాధించలేకపోయారు. ఊహించని రీతిలో రజిత గత బుధవారం ఉదయం తన ఇంటికి చేరుకోవడంతో అసలు ఏం జరిగిందో తల్లిదండ్రులకు వివరించింది. కిడ్నాప్ చేసి నిర్బంధించి.. తనను కిడ్నాప్ చేసి నిర్బంధించారని యువతి చెప్పడంతో తల్లి దండ్రులు తీవ్ర ఆందోళన చెందారు. జాతరలో తన స్నేహితురాలు ఓ యువకుడి ద్విచక్రవాహనం ఎక్కించిందని, అయితే ఆ యువకుడు తనను భద్రాచలం సమీపంలోని మోతెగడ్డ జాతరకు తీసుకెళ్లి కొందరు యువకులకు అప్పగించాడని చెప్పింది. వారు ఓ సిమెంటు రేకుల గదిలో నిర్బంధించి మత్తుమందు కలిపిన కూల్‌డ్రింక్స్, జ్యూస్‌లు ఇచ్చేవారని తెలిపింది. యువకులు ముఖాలకు కర్చీఫ్‌లు కట్టుకుని ఉండేవారని పలు విధాలుగా తనను చిత్రహింసలకు గురిచేశారని, తనను విక్రయించాలనే మాటలు వారు మాట్లాడుకునేవారని చెప్పింది. అయితే తనను నిర్బంధించిన గదికి తలుపులు వేయడం మరిచిపోవడంతో మంగళవారం తెల్లవారు జామున మూడు గంటల సమయంలో అక్కడి నుంచి తప్పించుకుని కాలినడకన బుధవారం ఉదయం ఇంటికి చేరానని అంటుంది. తనను నిర్బంచిన ప్రదేశం ఎక్కడో తనకు తెలియదని చెబుతోంది. అయితే గురువారం ఇదే విషయాన్ని చింతూరు ఐటీడీఏ పీవోకు కూడా చెప్పేందుకు గిరిజన సంఘ నాయకులతో కలిసి ఉదయం చింతూరు వెళ్లారు. అక్కడ నుంచి ఎటపాక పోలీస్టేషన్‌కు యువతి, ఆమె బంధువులు వెళ్లారు. అక్కడ ఆ యువతి ఎస్సై రాజేష్‌కు మరో కథ చెప్పింది. తాను జాతరకు వెళ్లిన విషయంపై తల్లిదండ్రులు ఘర్షణ పడుతుండడంతో భయపడి అక్కడి నుంచి మోతెగడ్డకు వెళ్లానని అక్కడి నుంచి అదే గ్రామంలో ఓ మహిళ ఇంట్లో ఉండి అక్కడి నుంచి కొన్ని రోజులు రేఖపల్లి, వెంకటాపురంలో ఉన్నానని ఇలా అనేక విషయాలు చెబుతోంది. కాగా యువతి ఎక్కడెక్కడ ఉందో! అని పోలీసులు ఆరాతీసి బంధువుల ఇళ్లలోనే ఆశ్రయం పొందినట్టు నిర్ధారణకు వచ్చారని సమాచారం. గ్రామాల్లో మాత్రం కిడ్నాప్ జరిగిందనే విషయంపై భయాందోళన చెందుతున్నారు. -
అదృశ్యం.. ప్రత్యక్షం..!
ఖమ్మం, కారేపల్లి: మూడేళ్ల క్రితం కారేపల్లిలో అదృశ్యమైన ఆ యువతి, మదనపల్లిలో ప్రత్యక్షమైంది. తన బిడ్డకు ఏమైందోనని.. ఎక్కడుందోనని ఇన్నేళ్లు మదనపడిన ఆ తండ్రి, ఆమె ఆచూకీ తెలియడంతో ఆనందభరితుడయ్యాడు. కారేపల్లి పోలీసులు తెలిపిన వివరాలు... కారేపల్లి మండలం బాజుమల్లాయిగూడెం గ్రామానికి చెందిన ధంసలపూడి రాములు–ధనమ్మ దంపతులకు కుమార్తె, ఇద్దరు కుమారులు. ధనమ్మ మూడేళ్ల క్రితం అనారోగ్యంతో మృతిచెందింది. కుమార్తె సునీల వికలాంగురాలు. డిగ్రీ, బీఈడీ పూర్తిచేసింది. ఖమ్మంలోని ఓ కన్సెల్టెంట్ (పేపర్లలో ఉద్యోగావకాశాలు పేరిట ఫోన్ నెంబర్లు ఇచ్చి ప్రకటనలు చేయడం) కార్యాలయంలో రిసెప్షనిస్ట్‌గా చేరింది. పత్రికల్లో వచ్చిన ఉద్యోగ ప్రకటనను చూసిన చిత్తూరు జిల్లా మదనపల్లిలోని ఈశ్వరమ్మ కాలనీకి చెందిన ఫైజల్ అలీ.. ఫోన్ చేశాడు. ఇలా వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఇది క్రమేణా స్నేహానికి, ప్రేమకు దారితీసింది. వీరు పెళ్లి చేసుకుందామనుకున్నారు. మతాలు వేరవడంతో తన తండ్రి, కుటుంబీకులు ఒప్పుకోకపోవచ్చని భయపడింది. 2015, ఆగస్టు 18న సునీల తన ఇంట్లో ఎవ్వరికీ చెప్పకుండా ఎటో వెళ్లిపోయింది. కుటుంబీకులు అన్నిచోట్ల గాలించినా ఆచూకీ తెలియలేదు. 2015, ఆగస్టు 22న కారేపల్లి పోలీసులకు తండ్రి ధంసలపూడి రాములు ఫిర్యాదు చేశాడు. అప్పటి నుంచి ఈ కేసు పెండింగులో ఉంది. (కేసుల) పెండింగ్ ఫైళ్లను పరిశీలిస్తున్న కారేపల్లి ఎస్ఐ కిరణ్‌కుమార్ దృష్టిలో ఈ మిస్సింగ్ కేసు పడింది. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టారు. ఆసరాతో ఆచూకీ ఆసరా పథకం.. ఆమె ఆచూకీని కనిపెట్టింది. వికలాంగురాలైన సునీలకు నెలకు రూ.1500 పింఛన్ వస్తోంది. ఆమెకు ఇల్లందులోని ఆంధ్రాబ్యాంకులో ఖాతా ఉంది. అందులోని పింఛన్ డబ్బు జమవుతోంది. ఎస్ఐ కిరణ్‌కుమార్, ఇటీవల ఆ బ్యాంకుకు వెళ్లి ఖాతా వివరాలు సేకరించారు. మూడు నెలలకోసారి, ఐదు నెలలకోసారి చిత్తూరు జిల్లా మదనపల్లిలోని ఏటీఎం ద్వారా పింఛన్ డబ్బు డ్రా చేస్తున్నట్టుగా తెలిసింది. ఆయన వెంటనే హెడ్ కానిస్టేబుల్ మహమ్మూద్ అలీ, కానిస్టేబుల్ రాజేష్‌ను (వారం క్రితం) మదనపల్లి పంపించారు. వారు అక్కడే బస చేశారు. ఏటీఎం సీసీ పుటేజీలను సేకరించారు. ఆమెను కనిపెట్టారు. విచిత్రంగా. ఆమె బురఖా వేసుకుని ఉంది. ఆమే సునీల కావచ్చని ఆ ఇద్దరు కానిస్టేబుళ్లు నిర్థారించుకున్నారు. వారికి ఆ ‘బురఖా’తో చిక్చొచ్చి పడింది. ఆ ఫొటో, వివరాలతో స్థానిక పోలీసుల సాయంతో వారం రోజులపాటు ఇంటింటికీ తిరిగి వాకబు చేశారు. ఈ క్రమంలోనే, మినరల్ వాటర్ సప్లయ్ బాయ్‌కు కూడా ఫొటో చూపించి, వివరాలు (వయసు, వికలాంగురాలు) తెలిపారు. ఆమెను ఆ బాయ్ గుర్తించాడు. ఆచూకీ చెప్పాడు. అక్కడకు పోలీసులు వెళ్లారు. సునీల కనిపించింది. ఆమె తన పేరును రేష్మగా మార్చుకుంది. ఫైజల్ అలీని పెళ్లి చేసుకుంది. వీరికి రెండేళ్ల కుమార్తె ఉంది. ఆ ముగ్గురినీ పోలీసులు కారేపల్లికి తీసుకొచ్చారు. ఆ తండ్రి, తన కొడుకులతో కలిసి సునీల కోసం కారేపల్లి పోలీస్ స్టేషన్లో శుక్రవారం ఉదయం నుంచి ఎదురుచూస్తూనే ఉన్నాడు. మధ్యాహ్నం సమయంలో పోలీసులతోపాటు వచ్చిన తన కూతురిని చూసి ఒక్కసారిగా భోరున విలపించాడు. తన బిడ్డ క్షేమంగా ఉందని, తనకు అది చాలని అంటూ చిన్న పిల్లాడిలా ఏడ్చాడు. సునీల కూడా తన తండ్రిని, తమ్ముళ్లను చూసి ఆనంద భాష్పాలు రాల్చింది. మిస్సింగ్ కేసు సుఖాంతమైంది. ఎస్ఐ కిరణ్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ మహమ్మూద్ అలీ, కానిస్టేబుల్ రాజేష్‌ను ఖమ్మం రూరల్ ఏసీపీ సురేష్ రెడ్డి అభినందించారు. మహమ్మూద్ అలీ, రాజేష్‌కు రివార్డు అందించారు. -
డ్రైవ్–ఇన్
ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన నేను డ్రెస్ చేంజ్ చేసి, కాళ్లు ముఖం కడుక్కుని సోఫాపై కూలబడ్డాను. మా ఆవిడ కాఫీకప్పును నా చేతి కందించింది. ఆమె ఇచ్చిన కాఫీని సిప్ చేస్తూ టీపాయ్ మీదున్న ఉత్తరాలని ఒక్కొక్కటిగా పరిశీలిస్తూ వచ్చా. అందులో గృహ ప్రవేశ ఆహ్వాన పత్రిక ఒకటి కంటబడింది. అడ్రస్ వ్రాసిన అక్షరాలని గమనించగానే తెల్సిపోయింది. ఇది నా బాల్యస్నేహితుడు నారాయణ ఉరఫ్ నానిగాడి నుంచేనని. చాల్రోజుల్నుంచి వీడి నుంచి ఓ ఫోన్ కాల్, లేదా ఓ మెసేజ్‌గాని లేదు. నేనే కాల్ చేస్తే ‘‘బిజీగా ఉన్నా, ఆ తర్వాత కాల్ చేస్తా’’నని కాల్ కట్ చేసేవాడు. ఇప్పుడు నేను ఇంట్లో లేని సమయంలో, ఇంటికొచ్చి ఇన్విటేషన్ ఇచ్చివెళ్లాడు వెధవ అనుకుంటూ.. ‘‘సుమా.. నానిగాడు వచ్చివెళ్లాడా.. సుమా.. సుమా..’’‘‘ఏంటండి అది.. కాఫీతోటి కొరుకుడికి ఈవేళ ఏం లేదు. కాఫీతో సరిపెట్టుకోండి. త్వరగా ముగించేస్తా వంట. భోంచేద్దురు గానీ; ఏదైనా కావాల్సివస్తే ఆ ఫ్రిజ్‌లో పళ్లున్నాయి. తీస్కోండి.’’ అంటూ వంటింట్లో నుంచే సమాధానమిచ్చింది మా ఆవిడ. ‘‘అందుక్కాదే నిన్ను పిల్చింది. మా నానిగాడి గృహప్రవేశ పత్రికని ఎవరిచ్చివెళ్లారు? వాడే స్వయంగా వచ్చాడా అని అడుగుతున్నా...’’‘‘అదా.. మీ స్నేహితుడికి తీరికెక్కడుంది పాపం? ఆయనగారి భార్య శ్రీమతి లత.. మా కిట్టీ పార్టీలో వుంది కదా.. నాకు చిక్కుతూనే వుంటారు అప్పుడప్పుడు. ఆయనగారు పూర్తిగా బిజీనట. ఇన్విటేషన్ల పంపకం కార్యక్రమాలన్నీ పెళ్లానికే అప్పగించారట. తానే వచ్చి ఇచ్చి వెళ్లింది. తప్పకుండా రావాలని మరీ మరీ చెప్పి వెళ్లింది. అందులో మీ స్నేహితుడుగారు రాసిన ఉత్తరం వున్నట్లుంది చూడండి. ప్యూర్లీ పర్సనల్ అని వుంది దానిపైన. అందుకే నే దాన్ని చదవలేదు’’ అంది. ‘‘ఊ.. ఏం బిజీనో ఏంటో.. నాకు తెలీని పనులా వాడికి? కాలేజీ చదివే రోజుల్లో వాళ్ల నాన్నగారు వాడికి ప్యాకెట్ మనీ ఇచ్చేవారు. కష్టాల్లో వున్న వాళ్లకి బదులిచ్చి ఆదుకునేవాడు. అయితే వాళ్లు వాపస్ ఇచ్చేటప్పుడు తప్పకుండా వడ్డీ వసూలు చేసేవాడు వెధవ. అందుకే మేం వాణ్ణి కాబూలీవాలా అని పిల్చేవాళ్లం. అలాంటి బిజినెస్‌మైండ్ వాడిది. చదువైపోయిన తరువాత ఒకే ఊళ్లోవున్నా వృత్తిపరంగా వేరైపోయాం. నానిగాడు తన ఉద్యోగంతో పాటూ... తన వడ్డీవ్యవహారాలని కొనసాగిస్తూనే వుండేవాడు. అడిగితే.. ఒరే, ఇది మా కులవృత్తిరా, దీన్ని విడిచిపెట్టడం సాధ్యమా? అని అనేవాడు. వాడి వ్యవహారాలు, లావాదేవీలు ఎక్కువయ్యాయి. దాంతో మేం పరస్పరం కలవటం తక్కువైపోయింది. ఉత్తరంలో ఇలా వుంది..‘ప్రియమైన సుబ్బూ.. వచ్చే ఆదివారం నా నూతన గృహప్రవేశం. నేనే స్వయంగా వచ్చి పిలవాలనుకున్నా కానీ కుదరలేదు. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ పన్లు కొద్దిగా నిల్చిపోవటం వల్ల రాలేకపోతున్నాను. అంతే కాకుండా ఇందులో చేరిపోవడానికి అడ్వాన్స్ ఇవ్వటానికి జనం పోటీ పడుతున్నారు. అల్లాంటప్పుడు నేనిక్కడ లేకుంటే ఎలా? విరామమే లేదనుకో. అందుకే ఈ లేఖ. నీవు కుటుంబ సమేతంగా వచ్చితీరాలి. నీకోసం ఎదురు చూస్తూ వుంటాను. అన్యధాభావించక. ఇట్లు నీ నాని.’ఆహ్వాన పత్రికని చదివా. ఇంటిపేరు చాలా చిత్రంగా వుండటం నాకు నవ్వొచ్చింది. ‘డ్రైవ్–ఇన్’ అట. ఈ మహానుభావుడికి ఇంకో పేరే దొరకలేదు కాబోలు. వేరే పేరే తట్టలేదా వీడికి.? లేదా దీంట్లో కూడా ఏదో పరమార్థం వుందా? ఎందుకంటే మా వాడు సామాన్యుడు కాడే. ఏదో తిరకాసు వుండనే వుంటుంది. ఎలాగూ వెళుతున్నా కదా.. వాణ్ణే అడిగి తెల్సుకుంటే పోలా.. అని సరిపెట్టుకున్నా.ఆదివారం వచ్చేసింది. మా ఆవిడతో సహా వాడి కొత్త ఇంటి ముందు నిలబడ్డా. పేద్ద పందిరి. పచ్చతోరణాలు అడుగడుగునా అతిథులు. చూసి ఆశ్చర్యపోయా. లోనికెళ్లడానికే వీల్లేకుండా కిక్కిరిసిపోయారు. మా ఆవిడకి చిక్కింది సందు నన్ను దెప్పిపొయ్యడానికి.. ‘‘చూశారా? మీ ఫ్రెండ్ నారాయణ ఎంతమందితో కాంటాక్ట్ పెట్టుకున్నాడో.. మీరూ ఉన్నారు ఎందుకూ? పక్కింటివాళ్లని కూడా హలో అని పిలవరాయే..’’ అంది. దాని మాటలు చెవిని పడలేదన్నట్లుగా నటిస్తూ నానిగాడు ఎక్కడైనా కనిపిస్తాడేమోనని, అటూ.. ఇటూ.. తల తిప్పి చూస్తున్నా. ‘‘ఒరేయ్ సుబ్బూ.. ఎందుకురా అక్కడే నిలబడిపోయావ్? ఇటురా లోపలికి..’’ అంటూ ఎక్కణ్ణుంచో ఊడిపడి నా చెయ్యి దొరకబుచ్చుకుని లోనికి లాక్కెళ్లాడు. ‘‘రామ్మా, బిల్డింగ్ చూద్దువుగానీ,’’ అని మా ఆవిడ్ని ఆహ్వానించాడు. ఈయనెవరో నారాయణకి చాలా కావాల్సిన వాడు కాబోలు అనుకుని చుట్టూ వున్న వాళ్లు దారి ఇచ్చారు.మూడంతస్తుల బిల్డింగ్. ముఖద్వారానికి పూజ చేసి అలంకరించిన ఓ పెద్ద బూడిద గుమ్మడికాయ వేలాడుతోంది. అంతటా పూలతోటి అలంకరణ. చుట్టూతా కాంక్రీట్ స్తంభాలు సుభద్రంగా ఉన్నాయి. క్రింది అంతస్థు పార్కింగ్ కోసం కేటాయించాడనుకుని పైకి ఎక్కా. మెట్లకి బదులుగా ఓ కారే వెళ్లగలిగినంత వెడల్పాటి ర్యాంప్. ఎక్కడానికి సులువుగా వుంటుందని ఈ ఏర్పాటు అయివుంటుంది. పై అంతస్థులోనూ అంతే. క్రింది అంతçస్తులాగే స్తంభాలతోటి ఉన్న ర్యాంప్వే కన్పించాయి. ఆశ్చర్యమేసి, ‘‘ఒరే నానీ.. హాల్ లేదు, రూంలు లేవు.. రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లా కన్పించడం లేదు కదరా.. ఏంట్రా ఈ కట్టడం? దీనికోసం అడ్వాన్సులివ్వడానికి పోటీపడుతున్నారా?’’ అన్నా ఆశ్చర్యం అణుచుకోలేక. ‘‘అవన్నీ లేవురా.. ఓన్లీ పిల్లర్స్.. అంతే.. ఇక్కడెవరుంటార్రా.. దీన్నంతట్నీ చూసుకోవడానికని ఇద్దరు సెక్యూరిటీలుంటారు. వాళ్ల కోసం దీని వెనకాల రెండు రూంలు కట్టించా వాళ్లుండటానికి. కావాల్సిన వసతులన్నీ కల్పించా. ఈ బిల్డింగ్ ముందువైపు రెండు పెద్ద గేట్లున్నాయి. రాత్రిళ్లు వాటిని మూసివుంచుతారు సెక్యూరిటీ వాళ్లు. ఏ వెహికల్ వచ్చిందీ.. వెళ్లిందీ.. అనే వివరాలు, వాటి సమయాలు నోట్ చేసి వుంచటమే వాళ్లపని. కార్లు, స్కూటర్స్, మోటారుసైకిళ్లు దొంగతనాలకి గురి అవుతున్నాయి ఇటీవల. చాలా మంది ఇళ్లలో వెహికల్స్‌ని పార్క్ చేయటానికి కావాల్సిన స్థలమంటూ ఉండట్లేదు. అదీకాక ఒక్కోరింట్లో మూడు నాల్గేసి వెహికల్స్. వాటిని ఇంటిముందు రోడ్డు మీద పార్క్ చేయడం కుదరదు కదా. అందుకని ఇలాంటి పార్కింగ్ ప్లేస్ ఎంతైనా అవసరం ఏమంటావ్? ఇది తెలిసే నేను ‘పే అండ్ పార్కింగ్’ లాగా ఈ భవనాన్ని కట్టించా..’’ అన్నాడు.‘‘ఇంతపెద్ద బిల్డింగ్‌కి కావాల్సిన స్థలం ఎప్పుడు కొన్నావురా నాకు తెలీకుండా?’’ అడిగా వాడ్ని నా ఆశ్చర్యం తాలూకా చిహ్నాలు నాలో ఇంకా మాసిపోలేదు.‘‘ఒరే.. ఇది మా తాతగారి ఇల్లు కదట్రా.. చిన్నప్పుడు నీవూ నేను ఆట్లాడుకుంది ఈ ఇంట్లోనే కదరా? గుర్తు లేదా? మా తాతగారి తర్వాత ఇది మా నాన్నగారికి సంక్రమించింది. ఇది నా హస్తగతమయ్యింది. అప్పుడొచ్చింది ఈ ఐడియా. 50/80 సైటు. ఇళ్లు కట్టుకుంటే మూడంతస్తుల్లో ఆరిళ్లు కట్టడానికి చాలా డబ్బు కావాలి. ఒకవేళ కట్టినా ఆ ఆరిళ్లకి వచ్చే అద్దె ఎంత? నెలకి అరవై లేదా డెబ్బై వేలు. బ్యాంక్ నుంచి తెచ్చిన అప్పుకు కట్టే వడ్డీ, కంతులకే సరిపోతుందా అద్దె. అప్పు తీరి, ఇల్లు మన సొంతం కావటానికి కనీసం పదిహేను ఏళ్లయినా కావాలి. ఈ మధ్యకాలంలో, రిపేర్లకని.. అదనీ.. ఇదనీ.. సవాలక్ష ఖర్చులు. ఇప్పుడు చూడు.. ప్రతి అంతస్తులోనూ ఇరవై విశాలమైన పార్కింగ్ స్పేస్‌లు, ప్రతి పార్కింగ్ ప్లేస్‌లో ఓ కారు, రెండు టూ వీలర్స్‌ని పార్క్ చేయవచ్చు. అంతమాత్రానికే నెలకి ఎంత అద్దె ఇస్తారనుకున్నావ్? అన్ని పార్కింగ్ ప్లేస్‌లు అప్పుడే బుక్ అయిపోయాయి. అడ్వాన్స్‌లు కూడా ఇచ్చేశారు. బ్యాంక్‌లోన్ తోటి, నా దగ్గరున్న కొద్దిపాటి డబ్బుతోటి దీన్ని ప్రారంభించా. మొత్తం అన్నింటి నుంచి నెలకి ఓ లక్షా ఎనభైవేలకేమీ ఢోకా లేదు. సెక్యూరిటీలకని, దానికనీ, దీనికనీ నెలకి 30 వేలు పోయినా.. ఓ లక్షా యాభైవేలు మిగులు. ఈ ఆదాయంతో ఓ రెండేళ్లలో బ్యాంక్‌లోన్ తీరుతుంది. ఉండటానికి సొంత ఇల్లు వేరే ఉంది కనుక.. మరో ఇల్లు కట్టుకోవాల్సిన పనిలేదు. ఎలా ఉందంటావ్ నా ప్లాన్??’’అని ముగించాడు. వాడి బిజినెస్ బుర్రకు జోహార్లు. అప్పుడు తట్టింది వీడు దీనికి ‘డ్రైవ్ ఇన్’ అని నామకరణం ఎందుకు చేశాడోనని. డొక్కలో ఎవరో పొడిచినట్టయ్యింది. ఎవరోననుకున్నా మా ఆవిడే. చూశారా మీ ఫ్రెండ్ బుర్ర. మీరు వున్నారు ఎందుకని? అన్నట్టుంది ఆ చూపు.మా కాబూలీవాలా నానిగాడి తెలివికి సంతోషిస్తూ వాడికి శుభం కావాలని ఆశిస్తూ.. విందు భోజనం ఆరగించి ఇంటికి చేరాం. కన్నడ మూలం: బి. ఆర్. నాగరత్న అనువాదం: కల్లూరి జానకిరామరావు -
పెండింగ్ అంశాలు 2 వారాల్లో పరిష్కరిస్తాం
• కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ హామీ • వివరాలు వెల్లడించిన వెంకయ్య, సుజనా సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని పెండింగ్ అంశాలను రెండు వారాల్లోపు పరిష్కరిస్తామని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ హామీ ఇచ్చినట్లు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తెలి పారు. మంగళవారం రాజ్‌నాథ్‌తో కేంద్ర మంత్రి సుజనాచౌదరి, వెంకయ్య సమావేశమయ్యారు. విభజన చట్టం హామీల అమలుపై చర్చించారు. అనంతరం సమావేశ వివరాలను మీడియాకు వెంకయ్య వెల్లడించారు. విభజన చట్టంలోని కొన్ని అంశాల అమలు పెండింగ్‌లో ఉందని, దీనిని సత్వరం పరిష్కరించాలని రాజ్‌నాథ్‌ను కోరామన్నారు. ఈ సందర్భంగా హోం శాఖ ముఖ్యకార్యదర్శిని రాజ్‌నాథ్ పిలిపించి పెండింగ్ అంశాలపై కూలంకషంగా చ ర్చించి నట్లు చెప్పారు. ఏ వివాదాలూ లేని అంశాలు, రెండు రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకోవాల్సిన వాటి విషయంలో చొరవ తీసుకొని, పరిష్కారానికి నిర్ణయం తీసుకోవాలని హోం శాఖ కార్యదర్శిని రాజ్‌నాథ్ ఆదేశించారన్నారు. రెండు వారాల్లోపు ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారన్నారు. విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన ప్రాజెక్టులు, ఏపీకి ఇవ్వాల్సిన సంస్థల కేటాయింపునకు హోం మంత్రిత్వ శాఖ నోడల్ ఏజెన్సీగా ఉండి సంబంధిత శాఖల్లో అపరిష్కృతంగా ఉన్న అంశాల పరిష్కారానికి ఆదేశించాలని కోరామన్నారు. ప్రత్యేక హోదాతో కలిగే ప్రయోజనాలపై కేంద్ర ఆర్థిక మంత్రితో చర్చిస్తున్నట్లు చెప్పారు. సీట్ల పెంపుపై ఏజీ అభిప్రాయాన్ని అధ్యయనం చేస్తామన్నారు అసెంబ్లీ సీట్లు పెంపుపైనా సమావేశంలో రాజ్‌నాథ్‌తో చర్చించినట్లు వెంకయ్య తెలిపారు. ఈ విషయంలో అటార్నీ జనరల్ అభిప్రాయాన్ని అధ్యయనం చేసి తదుపరి చర్యలు తీసుకుందామని హోం మంత్రి చెప్పారన్నారు. రాజ్‌నాథ్‌తో భేటీ అనంతరం పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌తో సమావేశమై నెలలోపు ఏపీలో పెట్రోలియం విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశామన్నారు. అలాగే, ఈ నెల 19న మెడిటెక్ పార్క్ ప్రారంభించాలని కోరగా, సూత్రపాయంగా అంగీకరించారని తెలిపారు.