advanced facilities
-
భారత క్రికెట్లో ‘కొత్త’ కళ
దాదాపు ఇరవై నాలుగేళ్ల క్రితం భారత వర్ధమాన క్రికెటర్లను తీర్చిదిద్దేందుకు, అత్యుత్తమ సౌకర్యాలతో శిక్షణ ఇచ్చేందుకు బీసీసీఐ బెంగళూరులో జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)ని ఏర్పాటు చేసింది... నగరం నడి»ొడ్డున చిన్నస్వామి స్టేడియం ఆవరణలోనే ఇంతకాలం అది కొనసాగింది...క్రికెట్లో వస్తూ వచి్చన మార్పుల నేపథ్యంలో మరింత అధునాతన సౌకర్యాలతో దానిని విస్తరించాలని భావించిన బోర్డు నగర శివార్లలో 2008లోనే భూమిని కొనుగోలు చేసింది. కానీ వేర్వేరు కారణాలతో దాని ఏర్పాటు ఆలస్యం కాగా... ఎట్టకేలకు ఇన్నేళ్ల తర్వాత అద్భుత సౌకర్యాలతో అది సిద్ధమైంది. జాతీయ క్రికెట్ అకాడమీనుంచి పేరు మార్చుకొని బీసీసీఐ ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ గా క్రికెటర్లకు అందుబాటులోకి వచి్చంది. బెంగళూరు: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆధ్వర్యంలో కొత్తగా ఏర్పాటు చేసిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (బీసీఈ)ని అధికారికంగా ప్రారంభించారు. ఆదివారం జరిగిన ఈ ప్రారం¿ోత్సవ కార్యక్రమంలో బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, కార్యదర్శి జై షా, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తదితరులు పాల్గొన్నారు. భారత సీనియర్ జట్టుకు వివిధ సిరీస్‌లకు ముందు క్యాంప్‌లు, యువ ఆటగాళ్లకు శిక్షణ, గాయపడిన క్రికెటర్లకు చికిత్స, స్పోర్ట్స్ సైన్స్, రీహాబిలిటేషన్... ఇలా అన్నింటి కోసం ఇక్కడ అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు సిద్ధంగా ఉన్నాయి. ఆ్రస్టేలియాలోని బ్రిస్బేన్‌లో, ఇంగ్లండ్‌లోని లాఫ్బారోలో ఇలాంటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లు ఉన్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకుంటూనే భారత్‌లో అలాంటి కేంద్రం కావాలని భావించిన బోర్డు దీనిని సిద్ధం చేసింది. 16 ఏళ్ల క్రితమే భూమిని తీసుకున్నా...వివిధ అడ్డంకులతో పని సాగలేదు. తుది అనుమతులు 2020 చివర్లో రాగా, కోవిడ్ కారణంగా అంతా ఆగిపోయింది. ఎట్టకేలకు ఫిబ్రవరి 2022లో పని మొదలు పెట్టి ఇప్పుడు పూర్తి చేశారు. ప్రస్తుతం ఉన్న ఎన్సీఏను దశలవారీగా ఇక్కడకు తరలిస్తారు. 2021 డిసెంబర్ నుంచి ఎన్సీఏ హెడ్‌గా వీవీఎస్ లక్ష్మణ్ వ్యవహరిస్తున్నారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విశేషాలు... → మొత్తం 40 ఎకరాల విస్తీర్ణంలో ఈ కేంద్రం ఉంది. తాజా నిర్మాణంలో 33 ఎకరాలను వాడుకున్నారు. తర్వాతి స్థాయిలో విస్తరణ కోసం మరో 7 ఎకరాలను ఖాళీగా ఉంచారు. → ఐసీసీ ప్రమాణాలకు అనుగుణంగా ఫస్ట్ క్లాస్ స్థాయి మ్యాచ్‌లు నిర్వహించగలిగే మూడు పెద్ద మైదానాలు అందుబాటులో ఉన్నాయి. మూడు భిన్న స్వభావం ఉన్న పిచ్‌లు మన ఆటగాళ్లు అన్ని రకాలుగా సన్నద్ధమయ్యేందుకు పనికొస్తాయి. → ప్రధాన గ్రౌండ్లో ఆధునిక తరహా ఫ్లడ్లైట్లతో పాటు సబ్ ఎయిర్ డ్రైనేజ్ వ్యవస్థ, మ్యాచ్‌ల ప్రసారానికి ఏర్పాట్లు, మొత్తం 13 పిచ్‌లు ఉన్నాయి. ముంబై నుంచి తెప్పించిన ఎర్ర మట్టితో ఈ పిచ్‌లు రూపొందించారు. ఇక్కడి బౌండరీ 85 గజాల దూరంలో ఉండటం విశేషం. → మిగతా రెండు గ్రౌండ్లను ప్రధానంగా ప్రాక్టీస్ కోసం వినియోగిస్తారు. దక్షిణ కర్ణాటకలోని మాండ్యానుంచి, ఒడిషా నుంచి తెప్పించిన నల్లరేగడి మట్టితో మొత్తం 20 పిచ్‌లు తయారు చేశారు. ఇక్కడ బౌండరీ 75 గజాలుగా ఉంది. → మొత్తం 9 వేర్వేరు భాగాలుగా విభజించి 45 అవుట్డోర్ నెట్ ప్రాక్టీస్ పిచ్‌లు అందుబాటులో ఉంచారు. ఫీల్డింగ్ ప్రాక్టీస్ ఏరియా దీనికి అదనం. → ఇండోర్ ప్రాక్టీస్ మైదానంలో ఆ్రస్టేలియా, ఇంగ్లండ్లను పోలిన ఎనిమిది ప్రాక్టీస్ పిచ్‌లు ఉన్నాయి. → నాలుగు ప్రత్యేక అథ్లెటిక్ ట్రాక్‌లు ఈ ప్రాంగణంలో ఉన్నాయి. బీసీఈలోని ఉన్న సౌకర్యాలను మునుŠుమందు క్రికెటేతర ఆటగాళ్లు కూడా వినియోగించుకునేందుకు అవకాశం కలి్పస్తామని...ముఖ్యంగా ఒలింపియన్లు ఇక్కడ సిద్ధమయ్యేందుకు అన్ని సౌకర్యాలు ఉన్నాయని జై షా వెల్లడించారు. నేను ప్రపంచంలో ఇలాంటి ఎన్నో సెంటర్లకు వెళ్లాను. కానీ ఇంత మంచి సౌకర్యాలు ఎక్కడా లేవు. భారత క్రికెటర్లందరి కోసం ప్రపంచంలో అత్యంత ఆధునిక సౌకర్యాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. తాము అన్ని రకాలుగా అత్యుత్తమ ఆటగాళ్లుగా ఎదిగేందుకు ఇక్కడ అవకాశం ఉంది. ఈ క్రమంలో మన జట్టు అన్ని ఫార్మాట్లలో బెస్ట్ టీమ్‌గా ఎదుగుతుంది. ఇకపై అండర్–15 స్థాయి ఆటగాళ్ల మొదలు సీనియర్ వరకు ఏడాది పాటు నిరంతరాయంగా ఇక్కడ కార్యకలాపాలు కొనసాగుతాయి. అన్నింటికంటే ముఖ్యమైంది మూడు భిన్నమైన పిచ్‌లు ఉండటం. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ క్రికెట్ ఆడినా దాని కోసం ఒకే వేదికపై సిద్ధమయ్యే అవకాశం ఇది కలి్పస్తుంది. –వీవీఎస్ లక్ష్మణ్, బీసీఈ హెడ్ -
నయా ట్రెండ్...విలేజ్గ్రౌండ్
రోజులు మారాయి. యువత కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నారు. వ్యాపారంలో అయితే వినియోగదారుడి ఆకర్షణ లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. అధునాతన వసతులు కోరుకుంటున్నారు. అందులో భాగంగా పోర్టబుల్ క్యాబిన్ల డిమాండ్ పెరిగింది. తొలుత పెద్ద నగరాలకు పరిమితమైన ధోరణి ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాలకు తరలివచ్చింది. కొందరు పెదకాకానిలో తయారు చేస్తూ ఆకర్షిస్తున్నారు. పెదకాకాని/యడ్లపాడు: పోర్టబుల్ క్యాబిన్లు చకచకా రెడీ అవుతున్నాయి. చిన్న చిన్న ఇళ్లు, ఫామ్‌హౌస్, సెక్యూరిటీ క్యాపిన్స్, పర్సనల్ ఆఫీసు, రియల్ ఎస్టేట్ ఆఫీసులు, టాయిలెట్స్, స్లోరేజ్ క్యాబిన్స్ స్థలాన్ని బట్టి సైజులు, ఆకారాలు, అందమైన డిజైన్లలో తయారవుతున్నాయి. గుంటూరు జిల్లా పెదకాకాని గ్రామ శివారులోని ఆటోనగర్, వెంగళరావునగర్ సమీపంలో సర్వీసు రోడ్డు పక్కనే గత కొంతకాలంగా రెడీమేడ్ గదులు తయారవుతున్నాయి. విదేశాలలో ఇళ్లను ఒక చోట నుంచి మరొక చోటకు మర్చడం, అవసరాన్ని బట్టి ఎత్తు పెంచుకోవడం, తగ్గించుకోవడాన్ని దృష్టిలో పెట్టుకుని ఉత్తరప్రదేశ్‌కు చెందిన మహమ్మద్ తయ్యబ్ సోదరులు బెంగళూరు కేంద్రంగా పోర్టబుల్ క్యాబిన్లు నిర్మాణం పనులు ప్రారంభించారు. స్థానికంగా తయారీ... ఆ తరువాత దేశవ్యాప్తంగా అక్కడక్కడా ఈ తరహా పరిశ్రమ ఏర్పాటు చేసి తయారు చేస్తున్నారు. పెదకాకాని వై జంక్షన్ సమీపంలో పరిశ్రమ ఏర్పాటు చేసుకుని అవసరాన్ని బట్టి క్యాబిన్లు సరఫరా చేస్తున్నారు. వర్కర్లను కూడా ఉత్తరప్రదేశ్ నుంచి పిలిపించి నిర్మాణానికి వినియోగించుకుంటున్నారు. వారి వద్ద పనులు నేర్చుకుని ఈ ప్రాంతానికి చెందిన వారే పెదకాకానిలో మూడో క్యాబిన్ల తయారీ పరిశ్రమ ఏర్పాటు చేసుకున్నారు. ఈ పోర్టబుల్ క్యాబిన్లలో ఇంటీరియల్ డెకరేషన్ ప్రత్యేక ఆకర్షణగా, అందమైన ఇళ్లను తలపిస్తున్నాయి. లక్షరూపాయల నుంచి ఐదు లక్షల రూపాయల వరకూ ప్రజల అవసరాలకు అనుగుణంగా అందంగా ఆకర్షణీయంగా డిజైన్లు చేసి ఇవ్వడం ద్వారా ఆర్డర్లు పెరుగుతున్నాయని వారు చెబుతున్నారు. ఇతర జిల్లాల నుంచి ఆర్డర్లు వస్తున్నాయని, 25 సంవత్సరాల పాటు మన్నిక ఉంటుందని, వారంటీ బిల్లు ఒక సంవత్సరం పాటు ఫీ సర్వీసు ఉంటుందని, సర్వీసు ఎప్పుడూ అందుబాటులోనే ఉంటుందని నిర్వాహకులు పేర్కొన్నారు. రూపులు మార్చుకుంటున్న కాకా హోటళ్లు... కాకా హోటళ్లు...చాయ్ దుకాణాలు అంటే పురాతన కాలంలో పూరి గుడిసెల్లోనూ..ఆ తర్వాత పెంకుటిళ్లు..పక్కా గదుల్లోనూ దర్శనమిచ్చేవి. ఇప్పుడది పూర్తిగా తనషేప్ను మార్చుకుంటుంది. నయాజమానా నయాట్రెండ్ చందానా.. పెద్దపెద్ద సిటీల్లోని కార్పొరేట్ తరహాతో కనిపిస్తున్నాయి. ఒకప్పుడు కంటైనర్లను వివిధ రకాల వస్తువుల్ని తరలించేందుకు వాడుతుంటారు. సిమెంట్, ఇటుకలు, ఐరన్ అనే మాటేలేకుండా ఎంచక్కా ట్రెండీగా వీటిని తయారు చేస్తున్నారు. కంటైనర్లను కేవలం రవాణాకే కాకుండా ఇల్లు.. వ్యాపార దుకాణాలుగా మార్చి వినియోగిస్తున్నారు. పట్టణాల్లోనే కాకుండా వాటిని మారుమూల పల్లెల్లోనూ ఏర్పాటు చేయడంతో అవి అందర్ని అకర్షిస్తున్నాయి. విదేశాల్లో నడిచే ఈ కొత్త ట్రెండ్ మన దేశంలోనూ వేగంగా విస్తరించడం విశేషం. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా ఇప్పుడిప్పుడే వీటికి విశేష ఆదరణ లభిస్తోంది. గతంలో.. సాధారణంగా చాయ్ లేదా ఫాస్ట్‌ఫుడ్ ఇతర వ్యాపార దుకాణాలను ఏర్పాటు చేయాలంటే ఎక్కడైనా కూడళ్లలో నిర్మించిన షాపింగ్ కాంపెక్లŠస్ల్లోని గదుల్ని అద్దెకు తీసుకోవాలి. అడ్వాన్స్‌లు, అవి నిర్మించిన గదులు మనకు అనుకూలంగా లేకుండా మార్పులు చేర్పులకు నిర్మాణాలు, డెకరేషన్లకు అదనంగా డబ్బు ఖర్చు పెట్టాల్సి వచ్చేది. తీరా మనం ఏర్పాటు చేసిన షాపు ‘క్లిక్’ కాకున్నా మనకు ‘లక్’ లేకున్నా..అప్పటి వరకు చేసిందంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. రీ యూజ్ ఇలా.. కంటైనర్లకు 50 ఏళ్ల తర్వాత వాటి జీవిత పరిమితకాలం అయిపోతుంది.వాటిని షిప్పింగ్‌కు వాడకూడదు. అలాంటి వాటిని వేస్ట్‌గా పోనివ్వకుండా తిరిగి ఉపయోగంలోకి తెస్తున్నారు. వాటిని స్క్రాబ్ కింద కొని వీటికి నిపుణులు అందమైన రూపునిస్తూ అద్భుతంగా మలుస్తున్నారు. షిప్పింగ్ కోసం వినియోగించే మెటల్ కంటైనర్లను పోర్టబుల్ హౌసెస్, ఆఫీస్ క్యాబిన్, హోటల్స్, టీస్పాట్, ఫ్యాన్సీ, కిరణా వంటి బిజినెస్ షాప్స్, మెటల్ క్వారీల వద్ద సేఫ్టీరూమ్స్, ఫాంహౌస్‌ల వద్ద మినిగెస్ట్హౌస్లు, భవన నిర్మాణాల సమయంలో స్టాక్గోడవున్ వంటి వాటికి ఈకంటైనర్లను వినియోగిస్తున్నారు. లోపల ఏమేమీ ఉంటాయంటే... లోపల అంతా బైసన్, ఎంటీఎ బోర్డులు, సీలింగ్, వాల్పేపర్లు, డోర్స్, యూపీవీసీ విండోస్, వినైల్ఫ్లోర్స్, టైల్స్, ఎల్ఈడీ లైట్లు, ఫ్యాన్లు, స్విచ్‌బోర్డులు, కబోర్డ్స్, అడ్జస్ట్ఫ్యాన్, ఏసీ, టీవీ పాయింట్స్, కంప్యూటర్స్, హాలు, కిచెన్, వాష్‌రూం, 1000లీటర్ల పైన ట్యాంక్, లోహం కావడంతో వేడి రాకుండా రాక్వోల్ వినియోగించి ప్రీమియం లుక్ తీసుకువస్తున్నాం. అన్నింటికీ అనుకూలత... తక్కువ ఖర్చుతో అన్ని సదుపాయాలతో కొద్దిపాటి స్థలంలోనే ఏర్పాటు చేసుకునే వీలుంది. ఒకచోట నుంచి మరోచోటకు సులభంగా తరలించుకోవచ్చు. మన అవసరం తీరాక కొన్నధరకు పెద్దగా నష్టం రాకుండా తిరిగి వీటిని విక్రయించుకోవచ్చు. జీఏసిస్టం, ఎంఎస్సిస్టం అనే రెండు రకాలుగా సెమీ, ఫుల్లీ ఫర్నిచర్ సౌకర్యాలతో వీటిని తయారు చేస్తున్నారు. ముందుగానే రెడీమెడ్గా తయారు చేసి ఉన్నందున ఎప్పుడు కావాలంటే అప్పుడే తెచ్చుకోవచ్చు. రోజురోజుకు వీటికి మంచి ఆదరణ పెరగడంతో ఇప్పుడు రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లోనూ, ప్రధాన పట్టణాల్లోనూ వీటి తయారీ కార్ఖానాలు వెలిశాయి. మోబుల్ హౌస్, షాపు ఏదైనా... పక్కాగృహ నిర్మాణాల మాదిరిగానే వీటి ధర అడుగుల చొప్పున ఉంటుంది. ఒక్కొక్క అడుగు సుమారు రూ.900 నుంచి రూ.1200 వరకు వారు అందించే నాణ్యతను బట్టి అందిస్తున్నారు. షిప్పింగ్ కంటైనర్..8గీ40 లేదా 8గీ20 మాత్రమే దొరుకుతాయి. పోర్టక్యాబిన్స్తో పోల్చుకుంటే ఇవి స్టాండెండ్‌గా ఉండడంతో పాటు ధరలోనూ సుమారు రూ.లక్ష వ్యత్యాసం ఉండోచ్చు. ఎందుకంటే ఇది స్టాండెడ్గా ఉంటాయి. ఒక్కొక్క షాపు ధర రూ.లక్ష నుంచి రూ.6.50 లక్షలు పడుతుంది. సింగిల్ బెడ్రూం కలిగిన ఇల్లు రూ.30 లక్షలు పలికే ఈరోజుల్లో కంటైనర్ పోర్ట్‌బుల్ హౌస్ 20గీ8 సైజు ఇల్లు రూ.4.50 లక్షలు, అదే పుల్లీ ఫర్నిచర్‌తో రూ.6.50 లక్షలు, 40గీ8 ఇల్లు రూ.8 లక్షలు, ఫుల్లీ ఫర్నిచర్ హౌస్ రూ.8.50 లక్షలకు రావడంతో అంతా ఇటువైపు దృష్టిని సారిస్తున్నారు. కార్ఖానా నుంచి కావల్సిన చోటుకు తరలించే సమయంలో ఎలాంటి డ్యామేజ్ జరిగే అవకాశం లేదు. నిర్మాణం కంటే ప్రత్నామ్యాయంతోనే మేలు... పెరిగిన నిర్మాణ సామాగ్రి ధరలతో ప్రస్తుతం శాశ్వత భవనం లేదా గదుల నిర్మాణాలు చేయాలంటే తలకుమించిన భారం అవుతుంది. దీనికి తోడు కూలీల ధరలు ఇబ్బడిముబ్బడిగా పెరిగాయి. ఇన్ని ఇబ్బందులు పడేకంటే వ్యాపారాలకు కంటైనర్ దుకాణాల్ని కొనుగోలు చేసుకుంటే సమయం, డబ్బు ఆదా కావడంతో పాటు వద్దనుకున్నప్పుడు తిరిగి అమ్ముకోవచ్చు. వీటిని వీధుల్లో పొలాల్లో ఇళ్లమధ్య ఎక్కడైనా పెట్టుకోవచ్చు. అందుకే ఆధార్సెంటర్కు రెడీమెడ్గా కంటైనర్‌ను తీసుకురావడం జరిగింది. – వెంకటనర్సు, యడ్లపాడు -
అంగన్వాడీ స్కూళ్లలో అధునాతన సౌకర్యాలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ స్కూళ్లలో అధునాతన సౌకర్యాలు కల్పిస్తోంది. శాశ్వత భవనాలతో పాటు విద్యుత్, మరుగుదొడ్ల సౌకర్యం తప్పనిసరిగా ఉండేలా చర్యలు చేపట్టింది. అంగన్వాడీ స్కూళ్లను త్వరలో వైఎస్సార్ ప్రీ ప్రైమరీ స్కూళ్లుగా మార్చనున్నందున.. చిన్నారులు స్వేచ్ఛగా చదువుకునేందుకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. మన అంగన్వాడీ నాడు–నేడు కార్యక్రమం ద్వారా స్కూళ్లలో సౌకర్యాల కల్పనకు శ్రీకారం చుట్టింది. 55,607 అంగన్వాడీ స్కూళ్లుండగా.. ప్రభుత్వ భవనాలు 28,169 ఉన్నాయి. ఇవి కూడా 2010కి ముందు నిర్మించినవి కావడంతో.. చాలా వరకు మరమ్మతులకు గురయ్యాయి. దీంతో మరమ్మతులు చేయాల్సిన పనులను ఇంజినీర్ల ద్వారా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఇప్పటికే గుర్తించింది. ప్రస్తుతం 27,438 అంగన్వాడీ స్కూళ్లు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. ఇందులో 3,928 నూతన భవన నిర్మాణాలు 2016 నుంచి వివిధ దశల్లో ఆగిపోయి ఉన్నాయి. ఈ నిర్మాణాలను వెంటనే పూర్తి చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. స్టాండర్డ్ షెడ్యూల్ ఆఫ్ రేట్స్(ఎస్ఎస్ఆర్) ప్రకారం అంచనాలు తయారు చేసి అసంపూర్తి భవన నిర్మాణాలను పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. మొత్తం ఈ నిర్మాణాల పూర్తికి ప్రభుత్వం రూ.214 కోట్ల నిధులు కేటాయించింది. అలాగే స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా 29.17 కోట్లతో మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టనున్నారు. ఇక కొత్తగా 8 వేల అంగన్వాడీ భవనాలను ప్రభుత్వం మంజూరు చేసింది. పిల్లలు ఆడుకునేందుకు, ఆహారం తీసుకునేందుకు వీలుగా ఈ భవనాల నిర్మాణాలుంటాయని అధికారులు చెప్పారు. ప్రస్తుతం అసంపూర్తిగా ఉన్న భవన నిర్మాణాలు పూర్తయ్యి.. కొత్తగా మంజూరైన భవనాల నిర్మాణాలు కూడా పూర్తయితే కొత్తగా 11,928 భవనాలు వస్తాయి. అంటే మరో 15,510 అంగన్వాడీ స్కూళ్లు మాత్రమే అద్దె భవనాల్లో ఉంటాయి. అంగన్వాడీ కేంద్రాల్లో మంచి నీరు సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లోని విద్యార్థులకు మెరుగైన మంచి నీటి వసతి, కుళాయి నీటిని అందించేందుకు ప్రధాని మోదీ ప్రారంభించిన పథకాన్ని 100 శాతం పూర్తి చేసినట్లు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు కేంద్ర జలశక్తి శాఖకు నివేదించాయి. గోవా, హిమాచల్‌ప్రదేశ్, తమిళనాడు, హరియాణా, పంజాబ్ కూడా 100 శాతం టార్గెట్‌ను పూర్తిచేశాయి. -
అత్యాధునికం
పాలమూరు: వలసల జిల్లాలో కార్మికులు, రైతులు, దినసరి కూలీల జనాభానే అధికంగా ఉంది. రెక్కాడితే కానీ డొక్కాడని శ్రామికులకు కాలం కలిసి రాక ఏదైనా జబ్బు చేసినా.. ధీర్ఘకాలిక రోగాలొచ్చినా వైద్యం చేయించుకోవడానికి హైదరాబాద్, కర్నూలు వంటి పట్టణాలకు వెళ్లాల్సి వచ్చేది. వైద్య చికిత్సలకు చెల్లించే బిల్లులతోపాటు వచ్చిపోయే రవాణా చార్జీలతో ఆర్థికంగా చితికిపోయేవారు. ఏడాది కాలంగా ఈ సమస్యలన్నీ తీరిపోయాయి. వైద్యరంగంలో చోటుచేసుకున్న మార్పులతో పాలమూరులోని జనరల్ ఆస్పత్రిలో ఖరీదైన వైద్యం ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. అత్యాధునిక టెక్నాలజీతో కూడిన పరికరాలు రావడంతో ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా పోయింది. పెరిగిన రద్దీ కార్పొరేట్ ఆస్పత్రుల స్థాయిలోనే పేదలకు వైద్యం అందించాలని అధికార యంత్రాంగం చేసిన కృషి ఫలించింది. ప్రభుత్వం వైద్యరంగానికి ప్రాధాన్యం కల్పిస్తూ ప్రత్యేకంగా నిధులు విడుదల చేసింది. ఇటీవల జిల్లా ఆస్పత్రి నుంచి జనరల్ ఆస్పత్రిగా మార్పు చెందిన అనంతరం అధునాతన వసతులు కల్పించే దిశగా చర్యలు చేపట్టేందుకు సమాయత్తమైంది. ప్రస్తుతం 450 పడకల ఆస్పత్రిగా సేవలందిస్తుండగా మరో 200 పడకలు ఏర్పాటు చేసేందుకు చర్యలు నివేదిక పంపారు. నాలుగు జిల్లాల నుంచి రోగుల తాకిడి ఎక్కువగా ఉండటంతో వసతుల కల్పనపై పక్కా ప్రణాళికతో చర్యలు అందించి రోగులకు సర్కారీ వైద్యంపై నమ్మకం కలిగించే దిశగా ప్రయత్నాలుసాగుతున్నాయి. ప్రతి రోజు ఆస్పత్రికి ఇన్‌పేషంట్లు 450 నుంచి 500మంది ఉంగా అవుట్ పేషంట్లు 1400 నుంచి 1600 మంది వరకు ఉంటున్నారు. స్థానికంగానే కార్పొరేట్ వైద్యం సర్కారు వైద్యాన్ని మెరుగుపరిచే దిశగా యంత్రాంగం అడుగులు వేస్తోంది. గతంలో సమస్యలకు నిలయాలుగా ఉండే సర్కారు దవాఖానాలో ఆధునిక సౌకర్యాలు అమలు చేస్తున్నారు. అప్పుడే పుట్టిన చిన్నారులకు పచ్చకామెర్లు ఉండటం సహజం.. వీటి చికిత్సకు నూతంగా ఫొటోథెరపి మిషన్లు అందుబాటులోకి తీసుకువచ్చారు. డెంగీ రోగుల్లో తెల్లరక్త కణాలు తగ్గిపోతుండటంతో ప్రాణాపాయం సంభవిస్తోంది. దీనికి చికిత్స అందించడానికి ఫ్లేట్‌లెట్స్ మిషన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. కిడ్నీ సంబంధ వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నవారికి 7 అత్యాధునిక టెక్నాలజీతో కూడిన మిషన్లతో కూడిన పడకలు ఏర్పాటు చేశారు. ప్రమాదంలో గాయపడి కాళ్లుచేతులు, ఎముకలు విరిగిపోయినా వారికి ఆపరేషన్లు అందించడానికి ఆర్థోపెడిక్ మిషన్లు ఏర్పాటు చేశారు. గర్భిణులను పరీక్షించి, కడుపులో బిడ్డ బాగోగులను గమనించడానికి అల్ట్రా స్కానింగ్ మిషన్లు, అత్యాధుని సదుపాయాలతో లెబర్ రూంను తీర్చిదిద్దారు. అదనపు పడకలకు చర్యలు ప్రస్తుతం ఉన్న జనరల్ ఆస్పత్రిలో 450పడకలు అందుబాటులో ఉన్నాయి. రాబోయో జూన్ నాటికి వీటి సంఖ్య పెంచడానికి అవసరం అయిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరో 200 పడకలు పెంపు చేసి మొత్తం 650 పడకల ఆస్పత్రిగా తీర్చిదిద్దడానికి కసరత్తు జరుగుతోంది. తల్లీపిల్లలకు ఉపయోగకరంగా ఉండేవిధంగా మెటర్నటీ వార్డు, లేబర్‌రూం, ఎన్‌సీయూ, ఎన్ఆర్సీ, ట్రామా కెర్ సెంటర్ విభాగాలకు ప్రత్యేక మరమ్మతులు చేపట్టారు. దీనికోసం ట్రామా కేర్ సెంటర్ నిర్మాణానికి రూ.60లక్షలు మంజూరయ్యాయి. అయితే దీనికి కావాల్సిన సిబ్బంది నియామకం, వైద్య పరికరాలు రావాల్సి ఉంది. ప్రధానంగా పోస్టుమార్టం గది చాలా చిన్నగా ఉండటం వల్ల ఇబ్బంది ఉండేది దీనిని దృష్టిలో పెట్టుకుని మరో మూడు గదులను రూ.10లక్షలతో నిర్మాణం చేస్తున్నారు. దీనికి సంబంధించిన పనులు కూడా ఇటీవలే ప్రారంభించారు. ఖరీదైన మిషన్లు అందుబాటులో.. ఇటీవల జిల్లా జనరల్ ఆస్పత్రికి వచ్చిన ఖరీదైన మిషన్లు వచ్చాయి. వాటిలో రూ.1కోటీ 8లక్షలతో డైరెక్ట్ రేడియోగ్రఫి మిషన్ (డిజిటల్ ఎక్స్‌రే), రూ.50లక్షలతో హిమోగ్లోబిన్ అనాలసిస్ మిషన్, రూ.10 లక్షలతో రేర్ స్పైన్ సర్జరీ ఇన్ ఆర్థోపెడిక్ విభాగం, రూ.42 లక్షలతో సింగల్ డోనర్ ప్లేట్లేట్స్ మిషన్ డెంగ్యూ జ్వరం కోసం, రూ.58లక్షలతో బ్లడ్‌బ్యాంకు మిషన్, రూ.40లక్షలతో లివర్ ఫంక్షన్ పరీక్షల మిషన్ బిగించారు. దీంతో పాటు దంత విభాగంలో డిజిటల్ ఎక్స్‌రేతో పాటు రూట్ కెనాల్ మిషన్లు పెట్టారు. అదేవిధంగా పేదలకు ఎంతో ఉపయోగపడే సీటి స్కానింగ్ సెంటర్‌ను రూ.రూ.1కోటీ 6లక్షలతో నిర్మాణం చేశారు. మొత్తం 16 స్లైడ్స్‌తో కూడిన ఈ మిషన్ ఇన్స్టాల్ చేశారు. బ్రెయిన్‌తో పాటు శరీరంలో ఉండే అన్ని రకాల అవయవాలకు దీని ద్వారా పరీక్షలు చేయడానికి అవకాశం ఉంది. రూజ 15 లక్షల నిధులతో లెబర్ రూం పడకల సామర్థ్యం పెంచి అత్యాధునిక సదుపాయాలు కల్పించారు. పాలియేటివ్ కేర్, తలసేమియా, హిమోఫిలియా బాధితుల కోసం ప్రత్యేక వైద్య సేవలు ఉన్నాయి. నూతన టెక్నాలజీతో వైద్యం ప్రస్తుతం జనరల్ ఆస్పత్రిలో కొత్తగా ఏర్పాటు చేసిన ఆరు కొత్త మిషన్లు అత్యంత టెక్నాలజీతో కూడినవి. రక్తశుద్ధి చేయించుకున్న రోగులకు ఎలాంటి ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండేందుకు నూతనంగా సింగిల్ యూజ్డ్ (ఒకరికి ఉపయోగించిన పరికరం మరొకరికి ఉపయోగించరు) ఈ విధానంతో కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు. మిషన్లలో ఇలాంటి వన్‌టైమ్ ఫిల్టర్ విధానం వాడటం వల్ల రోగులకు కొత్తగా ఎలాంటి వ్యాధులు సోకవు. ప్రస్తుతం ఇలాంటి విధానం కేవలం హైదరాబాద్‌లో కొన్ని ప్రైవేట్ ఆస్పత్రుల్లో తప్ప స్థానికంగా ఎక్కడా లేదు. ఉచితంగా కార్పొరేట్ వైద్యం కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా జనరల్ ఆస్పత్రిలో అత్యాధుని సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందిస్తున్నాం. ఇప్పటికే ఆస్పత్రికి అవుట్ పేషన్ల సంఖ్య పెరిగింది. ఎంఆర్ఐ కోసం రూ.8కోట్ల నుంచి రూ.10కోట్ల బడ్జెట్‌తో ప్రతిపాదనలు పంపించాం. ఈ మిషన్ కూడా అతి త్వరలో రానుంది. – డాక్టర్ రామకిషన్,జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ -
‘గుండె’ గోడు పట్టదా?
• జీవన్‌దాన్ కింద 256 గుండె దాతల నుంచి 26 మాత్రమే స్వీకరణ • మిగిలినవన్నీ వృథా... బాధితుల వివరాలు నమోదు చేయని ఫలితం • గుండె మార్పిడి చేసే అత్యాధునిక వసతులు కూడా కరువు సాక్షి, హైదరాబాద్: ‘అవయవ దానాలు చేయండి... బాధితుల జీవితాల్లో వెలుగు నింపండి... పునర్జన్మ ఎత్తండి’ అంటూ చేసే నినాదాలు దాతలకు ‘ఆత్మ’ఘోషను మిగిలిస్తున్నాయి. అత్యాధునిక మౌలిక వసతులు లేక దాతల హృదయాలు కకావికలమవుతున్నాయి. రాష్ట్రంలో అవయవ దానంపై చైతన్యం పెరుగుతోంది. దాతల వివరాలనూ జీవన్‌దాన్ వెబ్సైట్లో పెడుతున్నారు. ఇప్పటివరకు 8 వేల మంది తాము అవయవదానాలు చేస్తామని వాగ్దానం కూడా చేశారు. కానీ దాతల నుంచి గుండెలను తీసుకొని మార్పిడి చేసే పరిస్థితి, అత్యాధునిక వైద్య సదుపాయాల లేమి రాష్ట్రంలో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత నుంచి ఇప్పటివరకు 256 మంది దాతల నుంచి అవయవాలు స్వీకరించడానికి వీలు కలిగింది. అందులో 444 కిడ్నీలు, 248 కాలేయాలు, 166 గుండె వాల్వులు, 193 కళ్లు, 5 ఊపిరితిత్తులు బాధితులకు మార్పిడి చేశారు. కానీ బ్రెయిన్ డెడ్ అయిన దాతలు 256 మంది ఉన్నా గుండె మార్పిడి మాత్రం కేవలం 26 మందికే చేయడం గమనార్హం. మరోవైపు ఇదేకాలంలో అనేకమంది గుండె అవసరమైనవారు సకాలంలో గుండె మార్పిడి లేక మృత్యువాత పడ్డారు. ఐదు గంటల్లోగా.. బ్రెయిన్ డెడ్ అయిన దాత నుంచి స్వీకరించే గుండెను ప్రత్యేకమైన అత్యాధునిక నిల్వ సాంకేతిక పరిజ్ఞానంతో తరలించాలి. దాన్ని బాధిత వ్యక్తికి ఐదు గంటల్లోగా అమర్చాలి. అప్పుడే అది విజయవంతం అవుతుంది. దాతల నుంచి వచ్చే గుండెలను బాధితులకు చేరవేయడం ఒక పద్ధతైతే డిమాండ్ మేరకు మార్పిడి చేసే ప్రత్యేక ఆపరేషన్ థియేటర్లు, అత్యాధునిక వైద్యపరమైన మౌలిక వసతులు అందుబాటులో ఉండాలి. కానీ రాష్ట్ర రాజధానిలోనే అటువంటి పరిస్థితి లేదు. నగరంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నిమ్స్, గాంధీ, మరో నాలుగైదు ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రుల్లోనే గుండె మార్పిడి శస్త్ర చికిత్సలు జరుగుతున్నాయి. కానీ దాతల నుంచి వచ్చే స్పందనతో పోలిస్తే బాధితులకు గుండె మార్పిడి చేసే సంఖ్య అత్యంత తక్కువ ఉండటం గమనార్హం. ఉదాహరణకు నిమ్స్‌లో గుండెమార్పిడి చేసే ప్రత్యేకమైన ఆపరేషన్ థియేటర్లు అవసరం మేరకు లేవు. నిమ్స్‌లో ఇప్పటివరకు కేవలం ఐదు గుండె మార్పిడులు జరిగాయంటే పరిస్థితి ఏంటో అర్థమవుతుంది. ఇవన్నీ కొరవడటం వల్లే.. గుండె అవసరమైన బాధితుల రిజిస్టర్‌ను పక్కాగా నిర్వహించాలి. వారిని అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. సీరియల్ ప్రకారం బ్రెయిన్‌డెడ్ అయినవారి నుంచి గుండె తీసుకోవాల్సి వస్తే తక్షణమే సమాచారం ఇచ్చి ఆగమేఘాల మీద బాధితులను పిలిపించి వారికి అమర్చే ప్రక్రియ, పరిజ్ఞానం ఉండాలి. ఇవన్నీ కొరవడటం వల్లే దాతలు, బాధితులున్నా గుండెలు వృథాగా పోతున్నాయి. డిమాండ్‌ను, స్వీకరించే డిమాండ్‌నూ రెండింటినీ ఉపయోగించుకునే వ్యవస్థ లేకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడుతోందని ఒక ప్రభుత్వ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. నిమ్స్‌లో రూ.10.50 లక్షలకు గుండె మార్పిడి చేస్తుండగా, ప్రైవేటులో రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు చేస్తున్నారు. -
తలవంపులు !
37 వేల కుటుంబాలకు శౌచాలయాలే లేవు మురికివాడల్లో యలహంకదే మొదటి స్థానం బీబీఎంపీ సర్వేలో వెల్లడైన వాస్తవాలు బెంగళూరు: ఉద్యాన నగరి, ఐటీ నగరి ఇలా అనేక పేర్లతో సుపరిచితమైన బెంగళూరు నగరంలో రోజు రోజుకు అందుబాటులోకి వ స్తున్న అత్యాధునిక సౌకర్యాలు, పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు, ప్రపంచాన్నే ఆకర్షించే ఐటీ క్యాంపస్‌లు. ఇవన్నీ నాణేనికి ఒక వైపు మాత్రమే. మరో వైపు కనీసం సొంత శౌచాలయాలకు సైతం నోచుకోని వేలాది కుటుంబాలు మురికి వాడల్లో జీవితాన్ని గడుపుతున్నాయి. బృహత్ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ) నగరంలో నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. 37 వేల కుటుంబాలకు ‘మరుగు’ లేదు... బెంగళూరు నగరంలో లగ్జరీ భవంతులు, అపార్ట్మెంట్లే కాదు మురికివాడలకు సైతం కొదవ లేదు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి నగరంలో ఉపాధిని వెదుక్కుంటూ బెంగళూరుకు వచ్చిన లక్షలాది మంది మురికి వాడల్లోనే తమ జీవితాన్ని సాగిస్తున్నారు. ఇలాంటి మురికివాడల్లో కనీస మౌలిక సదుపాయాలు సైతం కనిపించడం లేదు. తాగునీరు, రోడ్లు, వీధిలైట్లు ఇలా ఏ సదుపాయాన్ని తీసుకున్నా మురికివాడల్లో కనిపించదు. అంతేకాదు నగరంలోని మురికి వాడల్లో ఉన్న వేలాది కుటుంబాలకు కనీసం సొంత శౌచాలయాలు సైతం లేని పరిస్థితి ఉందంటే మురికివాడల్లోని ప్రజల పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థమవుతుంది. ఇక నగరంలోని మురికి వాడల్లో నివసిస్తున్న ప్రజల్లో మొత్తం 37,183 కుటుంబాలకు సొంత శౌచాలయాలు లేవని బృహత్ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ) ఇటీవల నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. మురికి వాడల్లో నివసిస్తున్న ప్రజల స్థితిగతులపై బీబీఎంపీ ఇటీవల ఈ సర్వే నిర్వహించింది. కాగా, బీబీఎంపీ నోటిఫై చేసిన మురికి వాడల్లో 17,435 కుటుంబాలు వ్యక్తిగత శౌచాలయాలకు దూరం కాగా, బీబీఎంపీ నోటిఫై చేయని మురికి వాడల్లో ఈ కుటుంబాల సంఖ్య 19,748గా ఉంది. యలహంకలోనే అధికం... కాగా నగరంలోనే అత్యధిక మంది యలహంక ప్రాంతంలోని మురికివాడల్లోనే వ్యక్తిగత శౌచాలయాలకు దూరంగా ఉన్నారని ఈ సర్వేలో వెల్లడైంది. యలహంక ప్రాంతంలోని మురికివాడల్లో మొత్తం 14,498గా సర్వేలో తెలిసింది. ఇక బొమ్మనహళ్లి ప్రాంతంలోని మురికివాడల్లో అత్యంత తక్కువగా 229 కుటుంబాలు వ్యక్తిగత శౌచాలయాలకు దూరంగా ఉన్నాయి. కాగా, ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛ నగరాల జాబితాలో బెంగళూరు నగరం 38వ స్థానంలో నిలిచింది. ఇందులో భాగంగానే మురికివాడల్లోని ప్రజలకు వ్యక్తిగత శౌచాలయాలు నిర్మించే దిశగా ప్రణాళికలు రచిస్తున్నట్లు బీబీఎంపీ అధికారి ఒకరు వెల్లడించారు. -
ఎమ్మెల్యేలు, ఎంపీలకు బంగ్లాలు
నియోజకవర్గ కేంద్రాల్లో అధునాతన సదుపాయాలతో నిర్మాణం సాక్షి, హైదరాబాద్: కొత్త సచివాలయం.. కొత్త అసెంబ్లీ.. కొత్త శాసన మండలి భవనం.. అధునాతనంగా సీఎం క్యాంపు కార్యాలయం... ఇదే వరుసలో ఇప్పుడు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఎంపీ, ఎమ్మెల్యేల అధికార నివాసాలు నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. 2016-17 బడ్జెట్లోనే వీటికి నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వచ్చేనెలలోనే వీటికి శంకుస్థాపన చేయాలని, ఏడాది వ్యవధిలో నిర్మాణాలు పూర్తి చేయాలని నిర్దేశించారు. సీఎం ఆదేశాలతో ఆర్అండ్బీ విభాగం సంబంధిత పనులను వేగవంతం చేసింది. వెంటనే నిర్మాణాలకు సరిపడే స్థలాలను గుర్తించి, సైట్ వివరాలతో పాటు సమగ్ర అంచనాలను పంపించాలని అన్ని జిల్లాల ఆర్అండ్బీ ఎస్ఈలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెలాఖరులోగా టెండర్లు పిలిచేందుకు ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రంలో 119 ఎమ్మెల్యేలు, 17 మంది ఎంపీ నియోజకవర్గాలన్నింటా భవనాలను నిర్మిస్తారు. ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులకు ప్రత్యేకంగా నియోజకవర్గాలు లేనందున ఈ సదుపాయాన్ని వర్తింపజేయటం లేదు. ఒక్కో బంగ్లా నిర్మాణానికి దాదాపు రూ.కోటి ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. రానున్న బడ్జెట్లో వీటి నిర్మాణానికి రూ.120 కోట్లు కేటాయించనున్నట్లు సీఎం సూచనప్రాయంగా అధికారులకు వెల్లడించారు. మిగిలిన నిధులు పనుల పురోగతికి అనుగుణంగా విడతల వారీగా విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. గత ఏడాదిలోనే ఆలోచన పార్టీలకు అతీతంగా ప్రతి ఎమ్మెల్యేకు, ఎంపీకి ఒక అధికార నివాసం నిర్మించాలని సీఎం గత ఏడాదే తన ఆలోచనను వెల్లడించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు కుటుంబంతో సహా నివాసం ఉండటంతో పాటు తమ వద్దకు వచ్చే ప్రజలను కలిసేందుకు వీలుగా కార్యాలయం కూడా అందులోనే ఉండాలని సూచించారు. సీఎం సూచనల ప్రకారం ఆర్ అండ్‌బీ ఇంజనీరింగ్ విభాగం డిజైన్లను సిద్ధం చేసింది. ఇటీవలే వీటిని పరిశీలించిన సీఎం రెండతస్తులుండే బంగ్లా నమూనాకు ఓకే చేశారు. ఇటీవల ఆర్అండ్బీ శాఖతో నిర్వహించిన బడ్జెట్ ప్రతిపాదనల సమీక్షలో భవనాల నిర్మాణాలకు ఎంత ఖర్చవుతుందని ఆరా తీసిన సీఎం.. పక్కాగా లెక్కలను అడిగి తెలుసుకున్నారు. మూడు నాలుగు భవనాలకు కలిపి టెండర్! ఒక్కో భవనాన్ని టెండర్ ద్వారా ఒక్కో కాంట్రాక్టరుకు అప్పగించాలా లేదా మూడు నాలుగు భవనాలకు కలిపి ఒకే టెండర్ పిలిచి కాంట్రాక్టర్లకు ఇవ్వాలా అనే అంశంపై కూడా సీఎం సమక్షంలో చర్చ జరిగినట్లు సమాచారం. ముఖ్యమంత్రి కేసీఆర్ రెండో పద్ధతికే మొగ్గు చూపారని, దీంతో కాంట్రాక్టర్ల సంఖ్య తగ్గడంతో పాటు పనుల్లో వేగం పెరుగుతుందని, ప్రభుత్వానికి పని భారం తగ్గుతుందనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తంచేసినట్టు సమాచారం. వాస్తు ప్రకారం నిర్మాణాలు ఆర్అండ్బీ విభాగం రూపొందించిన రెండంతస్తుల నమూనాలో నిర్మాణాలకు సీఎం ఆమోదముద్ర వేశారు. దీని ప్రకారం బంగ్లాలోని గ్రౌండ్ ఫ్లోర్లో కార్యాలయం, మొదటి అంతస్తులో కుటుంబంతో పాటు ఎమ్మెల్యే నివాసం ఉంటుంది. వాస్తు ప్రకారం తూర్పు, ఉత్తరం దిశలకు అభిముఖంగా వీటిని నిర్మిస్తారు. 2,070 చదరపు అడుగుల విస్తీర్ణంలో కింది ఫ్లోర్, అంతే విస్తీర్ణంలో రెండో ఫ్లోర్.. మొత్తంగా 4,140 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణం ఉంటుంది. ఒక్కో చదరపు అడుగుకు రూ.2,415 చొప్పున ఖర్చు అవుతుందని ఆర్అండ్బీ విభాగం అంచనా వేసింది. బంగ్లా నిర్మాణానికి రూ.70.85 లక్షలు, సదుపాయాల కల్పనకు రూ.21.21 లక్షలు ఖర్చు కానున్నాయి. భవన నిర్మాణ అనుమతులు, నీటి సౌకర్యం, పారిశుధ్యం, విద్యుత్ సదుపాయం, కార్ షెడ్, కాంపౌండ్ వాల్లకు అయ్యే ఖర్చులు ఇందులో చేర్చారు. వీటికి తోడుగా వ్యాట్, సీనరేజ్ చార్జీలు, ఎన్ఏసీ, ఇతరత్రా ఖర్చులన్నీ కలిపితే రూ. కోటి అవుతుందని అంచనా వేశారు. -
అత్యాధునికం
రూ. 39.25 కోట్లతో పిణ్యా బస్‌స్టాండ్ ఏర్పాటు ప్రారంభించిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సాక్షి, బెంగళూరు : స్థానిక ప్రముఖ పారిశ్రామిక కేంద్రం పిణ్యాలో అత్యాధునిక సౌకర్యాలతో కేఎస్ఆర్టీసీ బస్టాండ్ ఏర్పాటైంది. 6.29 ఎకరాల్లో రూ. 39.25 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ బస్టాండ్‌ను రాష్ర్ట ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గురువారం ప్రారంభించారు. ఈ బస్టాండ్ పనులు 2008 అక్టోబర్ 24న ప్రారంభమయ్యాయి. కాగా, ఈ బస్టాండ్‌లో వచ్చే నెల 1 నుంచి బస్సులు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. బస్టాండ్ బేస్మెంట్, గ్రౌండ్‌ఫ్లోర్ కాక రెండు అంతస్తులు ఉన్నాయి. ఇందులో కేఎస్ ఆర్టీసీ బస్సులు నిలిపేందుకు బేస్మెంట్లో 26, అప్పర్ ఫ్లోర్లో 17 ప్లాట్‌ఫాంలు ఏర్పాటు చేశారు. బస్టాండ్‌లో ప్రైవేట్ సంస్థలు తమ వాణిజ్య కార్యకలాపాలు సాగించుకునేందుకు సంస్థ అవకాశం కల్పిస్తోందిఇ. మరోవైపు ప్రయాణికుల కోసం పార్కింగ్ వ్యవస్థ, లగేజీ కౌంటర్, వెయిటింగ్ లాంజ్, ముందస్తు రిజర్వేషన్ తదితర సౌకర్యాలను సంస్థ కల్పించింది. ఈ శాటిలైట్ బస్‌స్టాండ్ నుంచి బెంగళూరులోని కెంపేగౌడ, శాంతినగర బస్స్టేషన్లకు 32 కనెక్టింగ్ బీఎంటీసీ బస్సులను కూడా అధికారులు అందుబాటులోకి తీసుకువస్తున్నారు. కాగా, ఇక్కడి నుంచి రాష్ట్రంలోని వివిధ చోట్లకు బయలుదేరే బస్సులు, వాటి సమయం తదితర వివరాల కోసం 080-22221321, 22221223 లో సంప్రదించవచ్చు. -
హీల్.. సేవే గోల్
జిల్లాలో హీల్ సేవా ప్రస్థానం ఆరంభం ఆగిరిపల్లి మండలంలో రూ.50కోట్లతో అనాథ, అంధుల పాఠశాల అత్యాధునిక వసతులతో నిర్మాణం ముందుకొచ్చిన ఎన్ఆర్ఐ దాతలు ఒంటరి అన్న భావన భరించలేనిది. అనాథలా బతకడం భారమైనది. అంతా ఉండి ఎవరూ లేనట్టుగా జీవించడం కష్టమైనది.. జీవితంలో ఇలాంటి నిరాశ, నిస్పృహలు అలముకుని అనాథలుగా బతుకుతున్న చిన్నారులకు నేనున్నానంటూ భరోసా ఇస్తోంది ‘హీల్’ సంస్థ. కారు చీకట్లు కమ్ముకున్న జీవితాల్లో అక్షర కాంతులనే వెలుగు దారులు వేస్తోంది. అనాథలు, అంధుల కోసం రూ.50కోట్లతో ప్రత్యేక వసతులు కలిగిన పాఠశాలను నిర్మించి తన సేవా ప్రస్థానానికి పరిమితి లేదని నిరూపించింది. నరసింగపాలెం (ఆగిరిపల్లి) : అనాథ పిల్లలు, అంధ బాలబాలికల పాలిట వరంగా మారింది హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ ఫర్ ఆల్ (హీల్) ప్యారడైజ్. అనాథలు, తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరిని కోల్పోరుు నిరాదరణకు గురైన పిల్లలు, అంధ బాలికలకు ఆశ్రయం కల్పించి విద్యాదానం చేస్తోంది. ఆగిరిపల్లి మండల పరిధిలోని నరసింగపాలెంలో రూపుదిద్దుకుంటున్న ఈ హీల్ ప్యారడైజ్‌లో 1,300 మంది అనాథలు, అంధులు ఆశ్రయం పొందవచ్చు. ఇందులో అత్యాధునిక వసతులతో ఏర్పాటుచేసిన ప్రాథమిక పాఠశాల గత బుధవారమే ప్రారంభమైంది. ‘హీల్’ ప్రారంభమైంది ఇలా.. 1992లో యూకేలో హీల్ సంస్థ ప్రారంభమైంది. విజయవాడలోని పటమటకు చెందిన కోనేరు సత్యప్రసాద్ ఫౌండర్, చైర్మన్‌గా 1993లో గుంటూరులో హీల్-ఇండియా మొదలైంది. అనంతరం గుంటూరు జిల్లా చోడవరంలో హీల్ విలేజ్ ఏర్పాటుచేశారు. అక్కడ నిర్మించిన ప్రాథమికోన్నత పాఠశాలలో ఒకటి నుంచి పదో తరగతి వరకు 250 మంది అనాథలు చదువుకుంటున్నారు. వీరికి ఉన్నత చదువులతో పాటు బయటి కళాశాలల్లో చదువుతున్న మరో 250మంది పేద విద్యార్థులకు అవసరమైన ఫీజులు, ఇతర అవసరాలను హీల్ సంస్థే చూసుకుంటుంది. జిల్లాలో సేవా ప్రస్థానం కృష్ణాజిల్లాలోని కానూరు జెడ్పీ పాఠశాలను 2009లో దత్తత తీసుకోవడంతో ఇక్కడ హీల్ తన సేవా ప్రస్థానాన్ని ప్రారంభించింది. ఈ స్కూల్ విద్యార్థులకు కావాల్సిన నోట్ పుస్తకాలు, బ్యాగులు, ఫీజులను ఆ సంస్థే చెల్లించింది. సైన్స్ ల్యాబ్‌ను కూడా ఏర్పాటు చేసింది. తరువాతి ప్రయత్నంగా ఆగిరిపల్లి మండల పరిధిలోని నరసింగపాలెంలో ఎటువంటి ప్రభుత్వ సహకారం లేకుండా, దాతల ప్రోత్సాహంతో రూ.50 కోట్లతో హీల్ ప్యారడైజ్‌కు శ్రీకారం చుట్టింది. ఎంతోమంది దాతల సహకారంతో... రూ.50 కోట్లతో నిర్మిస్తున్న ఈ హీల్ ప్యారడైజ్‌లో సుమారు 1,300 మంది అనాథ, అంధ విద్యార్థుల కోసం ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు, కిండర్ గార్డెన్, ఆరోగ్య కేంద్రం, ఇంటిగ్రేటెడ్ ఒకేషనల్ సెంటర్, అంధ పాఠశాల ఏర్పాటుచేయనున్నారు. ప్రాథమిక పాఠశాలను హీల్ ఇండియా వ్యవస్థాపకుడు కోనేరు సత్యప్రసాద్ తన తల్లిదండ్రులు లలిత, రామ కృష్ణారావు జ్ఞాపకార్థం ఇచ్చిన విరాళంతో నిర్మించారు. ఇక్కడ 400 మంది విద్యార్థులకు ఆంగ్లంలో సెంట్రల్ సిలబస్ బోధిస్తారు. బాలబాలికలకు వేర్వేరుగా వసతి సౌకర్యం ఉండేలా ఢిల్లీకి చెందిన హాన్స్ ఇండియా ప్రత్యేక అత్యాధునిక భవనాన్ని నిర్మిస్తోంది. హీల్ ప్యారడైజ్‌లోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు, అంధుల పాఠశాల, కిండర్ గార్డెన్, ఒకేషనల్ శిక్షణా కేంద్రానికి చెందిన విద్యార్థులకు హీల్ ఆధ్వర్యంలోనే వసతి, భోజన సౌకర్యం కల్పిస్తారు. అంధుల పాఠశాలను ప్రవాస భారతీయుడు చుండూరి ధనుంజయరావు దంపతులు వారి కుమారుడు ఫణీంద్ర పేరు మీద అందించే విరాళంతో నిర్మిస్తున్నారు. ఇక్కడ వందమంది అంధ విద్యార్థులకు బ్రెయిలీ లిపిలో ఒకటి నుంచి పదో తరగతి వరకు చదువు చెబుతారు. ఇంటిగ్రేటెడ్ ఒకేషనల్ శిక్షణా కేంద్రాన్ని ప్రవాస భారతీయుడు చుండూరి కృష్ణబాబు తన తల్లి పేరు మీద అందించే విరాళంతో నిర్మిస్తున్నారు. కంప్యూటర్ కోర్సులతో పాటు ఇతర వృత్తివిద్యా కోర్సులపై 150 మందికి శిక్షణ ఇచ్చేందుకు ప్రవాస భారతీయులు డాక్టర్ బెల్లం శివప్రసాద్, విజయ దంపతులు విరాళం ఇచ్చారు. ఈ మేరకు కోటి రూపాయల విరాళాన్ని వారి కుమారుడు కృష్ణ హీల్ ప్యారడైజ్ చైర్మన్ పిన్నమేనేని ధనప్రకాశ్కు గత బుధవారం జరిగిన కార్యక్రమంలో అందజేశారు. ఇందులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ద్వారా ఆగిరిపల్లి, గన్నవరం మండలాల్లోని 30 గ్రామాలను దత్తత తీసుకుని మొబైల్ వైద్యసేవలు అందించనున్నారు. దీని నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. అలాగే, కిండర్‌గార్డెన్ పాఠశాలను ప్రవాస భారతీయులు పిన్నమనేని కవిత, లెనిన్ దంపతుల విరాళంతో నిర్మిస్తున్నారు. హీల్ ప్యారడైజ్ నిర్వహణ కార్యాలయ భవనాన్ని పిన్నమనేని ధనప్రకాశ్ విరాళంతో నిర్మించనున్నారు. అనాథలకే ప్రథమ ప్రాధాన్యం హీల్ ప్యారడైజ్‌లోని ప్రాథమిక పాఠశాలలో ప్రవేశానికి ప్రప్రథమంగా అనాథలు, రెండో ప్రాధాన్యం కింద తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరిని కోల్పోయిన పిల్లలు, మూడో ప్రాధాన్యం కింద ఆర్థిక స్థోమత లేని ఆశక్తులైన తల్లిదండ్రులు కలిగిన పిల్లలకు అర్హత కల్పిస్తాం. ఇందులో ప్రవేశం కావాలనుకునేవారు చిరునామా తెలిపే రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు, నివాస ధ్రువీకరణ పత్రం, సంరక్షకుని వివరాలు ముందుగానే అందజేయాలి. వివరాలకు 0866-2842777, 8500122577 నంబర్లను సంప్రదించాలి. ఈ విద్యా సంవత్సరంలో ప్రాథమిక పాఠశాలలో 200 మంది విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తున్నాం. మరో నాలుగు నెలల్లో వసతిగృహం, అంధుల పాఠశాల, ఒకేషనల్ శిక్షణా కేంద్రాలు పూర్తవుతాయి. వచ్చే ఏడాదికి ప్రాథమికోన్నత పాఠశాల, కిండర్‌గార్డెన్ పాఠశాల, ఆరోగ్య కేంద్రాల నిర్మాణాన్ని చేపట్టి హీల్ ప్యారడైజ్ పరిపూర్ణంగా అందుబాటులోకి వస్తుంది. - పిన్నమనేని ధనప్రకాశ్, మోడల్ డెయిరీ చైర్మన్, హీల్ ప్యారడైజ్ చైర్మన్