Ahmed nadeem
-
ఆ‘సారా’ ఉండదు..!
గుడుంబా స్థానంలో సారాయి ప్రవేశపెడితే అసలుకే మోసమంటున్న ఆర్థిక శాఖ ఐఎంఎల్, బీర్ల విక్రయాలపై ఆదాయ లక్ష్యం రూ. 10,500 కోట్లు ఇందులో 40 శాతం వాటా చీప్లిక్కర్దే.. సారాతో చీప్‌లిక్కర్ ఔట్ లాభనష్టాలను బేరీజు వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మహారాష్ట్రలో దేశీదారు అమ్మకాలను పరిశీలించి వచ్చిన ఎక్సైజ్ బృందం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గుడుంబాకు అడ్డుకట్ట వేసేందుకు సర్కారీ సారాయిని ప్రవేశపెట్టాలని భావిస్తున్న ప్రభుత్వం... దానివల్ల ఎక్సైజ్ రెవెన్యూ తగ్గిపోతుందేమోనని తర్జనభర్జన పడుతోంది. ఐఎంఎల్ (స్వదేశీ తయారీ మద్యం), బీర్ల అమ్మకాల ద్వారా ఏటా రూ. 10 వేల కోట్ల ఆదాయం సమకూరుతుండగా... చీప్‌లిక్కర్ కన్నా తక్కువ ధరకు సారాయి విక్రయిస్తే అసలుకే మోసం వస్తుందేమోనని భావిస్తోంది. 1993లో సారాయిపై ప్రభుత్వం నిషేధం విధించేనాటికి ఐఎంఎల్పై వచ్చే ఆదాయం కన్నా.... సారాయి కాంట్రాక్టులు, అమ్మకాల ద్వారానే అబ్కారీ శాఖకు ఎక్కువగా ఆదాయం వచ్చేంది. సారాపై నిషేధంతో చీప్‌లిక్కర్ ఆ స్థానాన్ని భర్తీ చేయడం, ప్రజల ఆర్థిక స్థితిగతుల్లో వచ్చిన మార్పులు వంటివాటితో ఐఎంఎల్, బీర్ల అమ్మకాలు పెరిగి ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా మారింది. ఇదే సమయంలో కార్మికులు, అల్పాదాయ వర్గాలు తక్కువ ధరలో లభించే ప్రమాదకరమైన నాటుసారా తాగుతుండడంతో అనర్థాలు పెరిగాయి. ఇటీవల సీఎం కేసీఆర్ వరంగల్ పర్యటనలో మహిళలు గుడుంబాపై ఆందోళన వ్యక్తం చేశారు కూడా. ఈ నేపథ్యంలో గుడుంబాకు పరిష్కారంగా ప్రభుత్వ సారాయిని ప్రవేశపెట్టాలని ప్రభుత్వ పెద్దలు అభిప్రాయానికి వచ్చారు. ఈ మేరకు ఎక్సైజ్ మంత్రి, సంబంధిత అధికారులతో సీఎం సమావేశమై... సారాయిని ప్రవేశపెడితే ఎదురయ్యే పరిణామాలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. అయితే సారాను ప్రవేశపెడితే ఎక్సైజ్ శాఖ ద్వారా వస్తున్న రెవెన్యూలో లోటు తప్పదని ఆర్థిక శాఖ తేల్చినట్లు సమాచారం. ప్రస్తుతం మండల కేంద్రాలు, హైవేలకు మాత్రమే వైన్‌షాపులు, బార్లు పరిమితం. సారాయి ప్రవేశపెడితే ఊరూరా దుకాణం ఏర్పాటవుతుందని, అదే జరిగితే చీప్‌లిక్కర్, మీడియం లిక్కర్ తాగేవారు సారా వైపు మొగ్గు చూపుతారేమోనని ఎక్సైజ్ అధికారులు పేర్కొంటున్నారు. ఇదే జరిగితే ఖజానా రాబడి భారీగా తగ్గిపోతుందని ఎక్సైజ్ శాఖ నివేదిక రూపొందించింది. మహారాష్ట్రలో పరిశీలన మహారాష్ట్రలో చౌకమద్యంగా ‘దేశీదారు’కు డిమాండ్ ఉండడంతో... ఎక్సైజ్ కమిషనర్ అహ్మద్ నదీం ఆదేశాల మేరకు రంగారెడ్డి జిల్లా డిప్యూటీ కమిషనర్ రాజశేఖర్‌తో కూడిన బృందం ఆ రాష్ట్రానికి వెళ్లి పరిశీలించింది. అక్కడి ప్రభుత్వం 90 ఎంఎల్ దేశీదారు మద్యాన్ని రూ. 17కే సరఫరా చేస్తుండడంతో అల్పాదాయ వర్గాలు, కార్మిక వర్గాల్లో డిమాండ్ ఎక్కువగా ఉంది. అయితే మహారాష్ట్రలో దేశీదారు అమ్మకాలు, ఆదాయం, దేశీదారు వల్ల ఐఎంఎల్ అమ్మకాలకు జరిగే నష్టం తదితర అంశాలను రాష్ట్ర ఎక్సైజ్ బృందం పరిశీలించింది. రాష్ట్రంలో సారాయిని ప్రవేశపెడితే ఒక్కో మండలంలో ఎన్ని దుకాణాలకు అనుమతులు ఇవ్వాలి, లెసైన్స్ ఫీజు, సారాయి ధర ఎంత ఉండాలనే వివరాలతో నివేదికను ఎక్సైజ్ కమిషనర్‌కు ఇచ్చింది. అలాగే, సారాయిని 90 ఎంఎల్‌కు బదులు 180 ఎంఎల్ బాటిల్‌గా రూ. 35 కనీస ధరగా ఉండాలని కూడా తెలిపినట్లు సమాచారం. ఆదాయం ఔట్? రాష్ట్రంలో జనవరి నెలలో 17.90 లక్షల కేసుల ఐఎంఎల్ మద్యం, 25 లక్షల కేసుల బీర్లు అమ్ముడయ్యాయి. తద్వారా వచ్చిన రెవెన్యూ రూ.767 కోట్లు. ఈ మొత్తం ఆదాయంలో చీప్ లిక్కర్ అమ్మకాల ద్వారా వచ్చేది 40 శాతానికిపైగా ఉంటుంది. అదే సారాయిని ప్రవేశపెడితే చీప్‌లిక్కర్ అమ్మకాలు తగ్గిపోయే అవకాశం ఉంది. దీంతో ప్రస్తుతం రూ. 10,500 కోట్ల ఆదాయ లక్ష్యంగా సాగుతున్న ఎక్సైజ్ రెవెన్యూలో సారాయి వల్ల భారీగానే కోత పడుతుందని ఎక్సైజ్, ఆర్థికశాఖలు ప్రాథమికంగా తేల్చాయి. అయితే సారాయి వల్ల రాష్ట్రవ్యాప్తంగా రూ. 2,500 కోట్ల వరకు ఆదాయం సమకూరుతుందని తేల్చినట్లు సమాచారం. ఇక ప్రస్తుతం మద్యం దుకాణాలు, బార్లు ఏర్పాటు చేసేందుకు లెసైన్స్ ఫీజు రూ. 35 లక్షల నుంచి రూ. 90 లక్షల వరకు ఉంది. ఈ ఫీజు రూపంలోనే ఏటా వెయ్యి కోట్ల వరకు ఆదాయం సమకూరుతుంది. -
‘గ్రీవెన్స్’పై ఒక్కొక్కరిది ఒక్కో విధానం
కలెక్టరేట్ : నేరుగా జిల్లా కలెక్టర్‌ను కలిసి సమస్యను విన్నవిస్తే సత్వర పరిష్కారం లభిస్తుందనేది ప్రజల ఆశ. అందుకు ప్రతీ సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజాఫిర్యాదుల విభాగం(గ్రీవెన్స్) వేదికవుతోంది.మండలాల్లో అధికారులు ఉన్నా సమస్యను నేరుగా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తే పరిష్కారం లభిస్తుందని ఎన్నో వ్యయప్రయాసాలకోర్చి జిల్లా నలుమూలల నుంచి ఆదిలాబాద్‌కు తరలి వస్తుంటారు. అన్ని శాఖల అధికారులు ఒకే చోట ఉండడం వల్ల పరిష్కారానికి మార్గం సులువు అవుతుంది. ఈ కార్యక్రమాన్ని కలెక్టర్లు తమదైన శైలీలో నిర్వహిస్తూ వస్తున్నారు. ప్రజా సమస్యలు నేరుగా తెలుసుకునేందుకు కలెక్టర్లు సైతం ఈ ప్రక్రియ కొనసాగింపునకు ఆసక్తి చూపుతున్నారు. గత ఐదేళ్లలో ఫిర్యాదుల విభాగంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. అహ్మద్ నదీం.. డివిజన్ కేంద్రాల్లోకి.. 2007 జూన్ నుంచి 2010 ఏప్రిల్ వరకు కలెక్టర్‌గా పనిచేసిన అహ్మద్ నదీం అప్పట్లో ప్రతీ డివిజన్ కేంద్రంలో ప్రజాఫిర్యాదుల విభాగం నిర్వహించారు. ఒక్కో సోమవారం ఒక్కో డివిజన్ కేంద్రానికి వెళ్లి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వీలైన వాటికి అక్కడికక్కడే పరిష్కారం చూపేవారు. అర్జీల స్వీకరణలో వృద్ధులు, వికలాంగులకు ప్రాధాన్యం ఇచ్చేవారు. అర్జీలపై సమీక్షించి అధికారులు శ్రద్ధ వహించే విధంగా చూడడంతో ప్రజలకు కొంతమేర సత్ఫలితాలు వచ్చాయి. ఈ క్రమంలో ఆయన బదిలీ అయ్యారు. వెంకటేశ్వర్లు.. నేనున్నాను మీ కలెక్టర్ 2010 ఏప్రిల్ నుంచి 2011 ఏప్రిల్ వరకు కలెక్టర్‌గా ఉన్న పి.వెంకటేశ్వర్లు ప్రజల సమస్యలపై ప్రత్యేక చొరవ చూపారు. సమస్యలు విన్నవించేందుకు దూర ప్రాంతాల్లోని ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా మండల కేంద్రాల్లో ‘నేనున్నాను మీ కలెక్టర్’ అనే పెట్టెలను ఏర్పాటు చేయించారు. జిల్లా కేంద్రానికి రాకుండా నేరుగా ఆ పెట్టెలో తమ సమస్యకు సంబంధించిన అర్జీని వేసే సౌకర్యం కల్పించారు. మండలం నుంచి అవి నేరుగా రెవెన్యూ అధికారుల ద్వారా కలెక్టర్‌కు చేరేవి. ఈ క్రమంలో ఆయన బదిలీపై వెళ్లారు. అశోక్.. అర్జీలకు రశీదు 2011 ఏప్రిల్ నుంచి 2013 జూన్ వరకు కలెక్టర్‌గా ఉన్న డాక్టర్ అశోక్ రాత్రి వరకూ అర్జీలు స్వీకరించేవారు. మండల, డివిజన్, జిల్లా స్థాయిలో కూడా స్వీకరించారు. ప్రతీ సోమవారం డివిజన్ కేంద్రాలకు వెళ్లి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించేవారు. అర్జీ సమర్పించిన వారికి రశీదు అందజేయడం ఆయన హయాంలోనే మొదలైంది. అధికారుల అలసత్వం, వచ్చిన అర్జీలను కింది స్థాయి అధికారులకు అప్పగించడంతో సమస్యలు పరిష్కారానికి నోచుకోకుండా పోయాయి. ఫలితంగా మళ్లీ మళ్లీ అర్జీలు సమర్పించాల్సి వచ్చేది. గాడిలో పెట్టిన కలెక్టర్ అహ్మద్ బాబు 2013 జూన్ నుంచి 2014 జూన్ వరకు కలెక్టర్‌గా కొనసాగిన అహ్మద్ బాబు ప్రజాఫిర్యాదుల విభాగాన్ని గాడిలో పెట్టారు. ప్రజల సమస్యలపై వెనువెంటనే స్పందించి పరిష్కారం చూపేవారు. దీంతో అర్జీల తాకిడి ఎక్కువైంది. ప్రతీ సమస్యకు పరిష్కార మార్గం చూపే విధంగా ఆన్లైన్ ద్వారా అర్జీలు స్వీకరించే విధానాన్ని ప్రవేశపెట్టారు. 2014 జనవరి నుంచి గ్రీవెన్స్ మేనేజ్మెంటు సిస్టం(జీఎంఎస్) అమలు చేశారు. ఆన్లైన్లో అర్జీదారుల సమస్యలను నమోదు పరిష్కారమార్గం చూపడంతో ప్రజల నుంచి స్పందన లభించింది. ప్రతీ వారం సుమారు 600 వరకు అర్జీలు అందేవి. ఆన్లైన్ విధానం ద్వారా ఆరు నెలల్లోనే పది వేల అర్జీలు నమోదయ్యాయి. ఈ విధానాన్నే కొనసాగిస్తే మేలు జరుగుతుందని అర్జీదారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మార్పులు ఉంటాయా..? ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజాఫిర్యాదుల విభాగంలో కొత్త కలెక్టర్ జగన్మోహన్ మార్పులు చేస్తారా..? పాత విధానాన్నే కొనసాగిస్తారా..? అనే సందేహం అధికారుల్లో వ్యక్తమవుతోంది. గతంలో కలెక్టర్లు మారినప్పుడల్లా గ్రీవెన్స్‌లో మార్పులు తీసుకురావడం పరిపాటిగా మారింది. ప్రస్తుత విధానంపై బాధితుల్లో మంచి అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
సుమన్ రాథోడ్‌కు చుక్కెదురు
ఉట్నూర్, న్యూస్‌లైన్ : ఖానాపూర్ ఎమ్మెల్యే సుమన్‌రాథోడ్ ఎస్టీ వివాదంపై హైకోర్టు ఇచ్చిన స్టేను మంగళవారం ఎత్తివేసింది. ఎస్టీ కాదంటూ అప్పటి జిల్లా కలెక్టర్ అహ్మద్ నదీం ఇచ్చిన తీర్పుపై సుమన్ రాథోడ్ హైకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్న విషయం విధితమే. 2009 సాధారణ ఎన్నికల్లో ఖానాపూర్ ఎమ్మెల్యేగా గెలుపొందిన సుమన్‌రాథోడ్ ఎస్టీ కాదంటూ అప్పటి తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షుడు ఉయికే సంజీ వ్తోపాటు పలువురు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అప్పటి కలెక్టర్ నదీం విచారణ చేపట్టి ఆమె మహారాష్ట్రలోని బీసీ కులానికి చెందిన మహిళ అని 2009 అక్టోబర్‌లో తీర్పునిచ్చారు. కలెక్టర్ తీర్పును సవాలు చేస్తూ సుమన్‌రాథోడ్ హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. ఇదే సమయంలో 2009 ఎన్నికల్లో పరాజయం పాలైన కాంగ్రెస్ అభ్యర్థి అజ్మిరా హరినాయక్ హైకోర్టులో కేసు వేయడంతో 2010 డిసెంబర్లో సుమన్‌రాథోడ్ ఎస్టీ కాదంటూ తీర్పు వెలువడింది. పైకోర్టుకు అప్పీ లు చేసుకునే అవకాశం కల్పించడంతో అదే నెలలో సుమన్‌రాథోడ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం 2012 సెప్టెం బర్లో కేసును పూర్తి స్థాయిలో విచారణ జరపాలని విస్తృత ధర్మాసనం త్రిసభ్య కమిటీకి అప్పగించింది. అయితే మంగళవారం 2009 అక్టోబర్‌లో అప్పటి కలెక్టర్ అహ్మద్ నదీం ఇచ్చిన తీర్పుపై విధించిన స్టేను రద్దు చేస్తూ తీర్పు వెలువరించింది. అయితే సుప్రీంకోర్టులో కేసు యథావిధిగా ఉంది. అత్యున్నత న్యాయస్థానంపై నమ్మకం ఉంది.. - సుమన్‌రాథోడ్ మంగళవారం సాయంత్రం సుమన్‌రాథోడ్ తన నివాసం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ తనపై ఉన్న ఎస్టీ కాదనే వివాదంపై కలెక్టర్ ఇచ్చిన తీర్పుకు సంబంధించిన స్టేను మాత్రమే హైకోర్టు రద్దు చేసిందని సుప్రీంకోర్టులో తనకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందన్నారు. -
నల్లబెల్లం వ్యాపారులపై కేసులు పెట్టండి
=నాటుసారా కేంద్రాలపై దాడులు చేయండి =ఎంఆర్పీకి విక్రయించకుంటే చర్యలు =ఎక్సైజ్ శాఖ కమిషనర్ అహ్మద్ నదీమ్ =5 జిల్లాల ఎక్సైజ్ అధికారులతో సమావేశం తిరుపతి క్రైం, న్యూస్‌లైన్: నాటుసారా తయారీదారులకు నల్లబెల్లం విక్రయించే వ్యాపారులపై కేసులు నమోదు చేయాలని, నాటుసారా తయారీని నిరోధంచాలని రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ అహ్మద్ నదీమ్ ఆదేశించారు. తిరుపతిలో బుధవారం కర్నూలు, వైఎస్సార్, అనంతపురం, చిత్తూరు, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల ఎక్సైజ్ డెప్యూటీ కమిషనర్లు, ఎక్సైజ్ సూపరింటెండెంట్లతో రాష్ట్ర కమిషనర్‌తో పాటు, ఎన్ఫోర్స్మెంట్ జాయింట్ కమిషనర్ టి.ప్రసాద్ సమావేశమయ్యారు. ఎస్వీయూ ఆర్ట్స్ బ్లాక్ ఆడిటోరియంలో జరిగిన సమావేశంలో అహ్మద్ నదీమ్ మాట్లాడుతూ నాటుసారా తయారీ కోసం నల్ల బెల్లం సరఫరా చేసే వ్యాపారస్తులను గుర్తించి వారిపై కేసులు నమోదు చేయాలన్నారు. మద్యం దుకాణాల్లో అధిక ధరలకు విక్రయించడాన్ని పూర్తిగా నిరోధించాలన్నారు. పక్క రాష్ట్రాల మద్యం రాకుండా నిరోధించాలని, సరిహద్దు చెక్‌పోస్టుల్లో తనిఖీలు క్షుణ్ణంగా చేయాలని ఆదేశించారు. ఎక్కైడైనా కల్తీ మద్యం దొరికితే సంబంధి స్టేషన్ సీఐ, ఆ జిల్లా ఎక్సైజ్ అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బార్ అండ్ రెస్టారెంట్లు, మద్యం దుకాణాల్లో కల్తీ మద్యం విక్రయాలను అరికట్టేందుకు అధికారులు తనిఖీలు చేయాలని చెప్పారు. నెల్లూరు జిల్లాలో ఎంఆర్పీ ధరల సిండికేట్, కల్తీ మద్యంపై ఫిర్యాదులు అందాయంటూ ఆ జిల్లా డెప్యూటీ కమిషనర్ చైతన్యమురళిపై మండిపడ్డారు. అలాగే వైఎస్సార్ జిల్లా బద్వేల్ ఎక్సైజ్ సీఐ ఖాజాబీ పట్టణంలోని మద్యం వ్యాపారస్తులతో కుమ్మక్కై కల్తీ మద్యం విక్రయాలకు సహకరిస్తున్నారని ఫిర్యాదులు అందాయని ఆ జిల్లా డెప్యూటీ కమిషనర్ నాగలక్ష్మి తెలిపారు. ఇప్పటికే ఈ వ్యవహారంపై పలుమార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశానన్నారు. ఈ సమావేశంలో డెప్యూటీ కమిషనర్లు చంద్రమౌళి(చిత్తూరు), జీవన్‌సింగ్(అనంతపురం), ప్రేమ్‌ప్రసాద్(కర్నూలు), నాగలక్ష్మి(కడప), చైతన్యమురళి(నెల్లూరు)తో పాటు నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల అసిస్టెంట్ కమిషనర్లు పాల్గొన్నారు. -
మద్యం అమ్మకాలు పెంచాలి
కరీంనగర్ క్రైం, న్యూస్‌లైన్ : కరీంనగర్, వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్ ఐదు జిల్లాల పరిధిలో మద్యం అమ్మకాలు పెంచాలని ఎక్సైజ్ కమిషనర్ అహ్మద్ నదీం అధికారులకు సూచించారు. నగరంలోని జడ్పీ సమావేశ మందిరంలో బుధవారం జరిగిన ఐదు జిల్లాల ఎక్సైజ్ అధికారుల సమీక్ష సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అధికారులు నకిలీ మద్యం అరికట్టడంతోపాటు అమ్మకాలు పెంచాలని, లెసైన్స్‌దారులకు అవసరమైన సేవలందించాలని సూచించా రు. ఐదు జిల్లాల అధికారులు, సిబ్బంది ఇచ్చిన ఒక రోజు మూల వేతనం రూ.లక్ష 7 వేల చెక్కును మృతి చెందిన ఎక్సైజ్ కానిస్టేబుల్ బాలరాజ్ కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఐదు జిల్లా ల సిబ్బందిని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్, వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన ఎక్సైజ్ డిప్యూటీ కమిష నర్లు, అసిస్టెంట్ కమిషనర్లు, సూపరింటెం డెంట్లు, అసిస్టెంట్ సూపరింటెండెంట్లు, ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. -
మద్యం అమ్మకాలు పెంచాలి
కరీంనగర్ క్రైం, న్యూస్‌లైన్ : కరీంనగర్, వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్ ఐదు జిల్లాల పరిధిలో మద్యం అమ్మకాలు పెంచాలని ఎక్సైజ్ కమిషనర్ అహ్మద్ నదీం అధికారులకు సూచించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని జెడ్పీ సమావేశ మందిరంలో బుధవారం జరిగిన ఐదు జిల్లాల ఎక్సైజ్ అధికారుల సమీక్ష సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అధికారులు నకిలీ మద్యం అరికట్టడంతోపాటు అమ్మకాలు పెంచాలని, లెసైన్స్‌దారులకు అవసరమైన సేవలందించాలని సూచించారు. ఐదు జిల్లాల అధికారులు, సిబ్బంది ఇచ్చిన ఒక రోజు మూల వేతనం రూ.1.07 లక్షల చెక్కును మృతి చెందిన ఎక్సైజ్ కానిస్టేబుల్ బాలరాజ్ కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్, వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన ఎక్సైజ్ డెప్యూటీ కమిషనర్లు, అసిస్టెంట్ కమిషనర్లు, సూపరింటెండెంట్లు, అసిస్టెంట్ సూపరింటెండెంట్లు, ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. అనంతరం టీఎన్జీవో ఎక్సైజ్ రాష్ట్ర అధ్యక్షుడు సుద్దాల రాజయ్య, నాలుగు సంఘాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శలు, కె ప్రభువినయ్, లక్ష్మణ్‌గౌడ్, రాజేందర్, కరుణాకర్, కిషన్‌రావు, విజయకుమార్, సిద్ధికీ, నగేశ్ కమిషనర్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. సమస్యలు పరిష్కరించాలి.. అపరిష్కతంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ గౌడ కల్లుగీత సంఘాల జేఏసీ నాయకులు ఎక్సైజ్ కమిషనర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. జిల్లాలో ఎక్సైజ్‌శాఖ నిర్లక్ష్యం మూలంగా 15 సొసైటీలు మూత పడ్డాయని, ఎక్కడా లేని విధంగా వత్తి పన్ను వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చాలాకాలంగా నిలిచిపోయిన నష్టపరిహారం బకాయిలు వెంటనే చెల్లించాలని కోరారు. తెలంగాణ గౌడ కల్లుగీత సంఘాల జేఏసీ గౌరవ అధ్యక్షుడు కొక్కిస రవీందర్‌గౌడ్, చైర్మన్ గోపగాని సారయ్యగౌడ్, కన్వీనర్ సింగం సత్తయ్య గౌడ్ పలువురు కమిషనర్‌ను కలిసిన వారిలో ఉన్నారు.