Airbus A320
-
పైలట్ తప్పిదం వల్లే ఆ ఘోర ప్రమాదం
కరాచి : గత మే 22న పాకిస్తాన్‌లోని కరాచీలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్(పీఐఏ)కు చెందిన ఎ320 ఎయిర్‌బస్ విమానం ఇంజిన్లు సహకరించకపోవడంతో పైలట్ అర్థంతరంగా ల్యాండింగ్ చేయడానికి ప్రయత్నిస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 97 మంది దుర్మరణం చెందగా, ఇదరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. తాజాగా దీనిపై పాకిస్తాన్ ఏవియేషన్ అధికారులు పీఐఏకు మరోసారి నివేదికను అందించారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సూచనలను పట్టించుకోకుండానే ప్రయాణీకులతో వెళుతున్న ఎ320 ఎయిర్‌బస్ విమానాన్ని పైలట్ ల్యాండింగ్ కోసం ప్రయత్నించాడని పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌కు తెలిపారు. కేవలం పైలట్ తప్పిదం వల్లే ఈ ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుందని ఏవియేషన్ అధికారులు మరోసారి తేల్చి చెప్పారు.(కుప్పకూలిన పాక్ విమానం) 'ప్రమాదం గురించి తాము మూడు సార్లు హెచ్చరికలు జారీ చేశామని.. కానీ పైలెట్ వాటిని పట్టించుకోలేదన్నారు. లాహోర్ నుంచి కరాచీకి ప్రయాణమైన ఎయిర్ బస్ ఏ-320 విమానం జిన్నా ఇంటరర్నేషనల్ ఎయిర్ పోర్టుకు 15 నాటికల్ మైళ్ల దూరంలో ఉండగా ఏటీసీ అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అప్పటికి భూమికి 7 వేల అడుగుల ఎత్తులో ఉండాల్సిన విమానం కాస్తా.. 10,000 అడుగుల ఎత్తులో ఉంది. దాంతో ఏటీసీ అధికారులు ఎత్తును తగ్గించాలల్సిందిగా పైలెట్‌ను హెచ్చరించారు. కానీ అతడు పట్టించుకోలేదు' అంటూ పేర్కొన్నారు. కాగా ఇంతకుముందు సివిల్ ఏవియేషన్ అథారిటీ(సీఏఏ)కు ఇచ్చిన ప్రాథమిక నివేదికలో పైలెట్ విమానాన్ని ల్యాండ్ చేయడానికి ప్రయత్నించినప్పుడు ఇంజన్ మూడు సార్లు రన్‌వేకు తగిలిందని.. దాంతో ఇంజన్ ట్యాంక్, పంపు దెబ్బతిన్నాయని పేర్కొంది. పైలెట్, ఏటీసీ ఇచ్చిన హెచ్చరికలను ఖాతరు చేయకుండా సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల పరిస్థితి అదుపు తప్పిందని.. ఫలితంగా ప్రమాదం ఏర్పడిందని పేర్కొన్నారు.(పాక్‌కు సాయం ఆపేయండి.. అమెరికాకు విజ్ఞప్తి!) పీఐఏ జనరల్ మేనేజర్ అబ్దుల్లా హఫీజ్ ఖాన్ రాయిటర్స్‌తో స్పందిస్తూ.. ' అవును, మాకు లేఖ వచ్చింది, వారు దానిని డాక్యుమెంట్ చేస్తున్నారు. విమానంలోని కాక్‌పిట్ వాయిస్ రికార్డర్, ఫ్లైట్ డేటా బాక్స్‌ను ఫ్రాన్స్‌లోని ఫ్రెంచ్ వైమానిక ఏజెన్సీ బీఏ డీకోడ్ చేస్తోందని' పేర్కొన్నారు. కాగా ఈ ప్రమాదంపై ప్రాథమిక నివేదికను జూన్ 22 న పార్లమెంటుకు అందజేస్తామని పాక్ విమానయాన శాఖ మంత్రి గులాం సర్వార్ ఖాన్ తెలిపారు. -
వైరస్ భయం: ఫ్లైట్‌లో ‘ఆ నలుగురు’
న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి ప్రభావంతో ప్రజల జీవన విధానంలో వేగంగా మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా ప్రయాణాల విషయంలో భౌతిక దూరాని తప్పకుండా పాటించేలా చూసుకుంటున్నారు. ప్రయాణికుల మధ్య ఎడం ఉండేలా సీట్లను వదులుతూ ప్రయాణాలు సాగిస్తున్నారు. కాస్త డబ్బున్న వాళ్లు రద్దీగా ఉండే ప్రజా రవాణాను కాకుండా, సొంత వాహనాల్లోనే ప్రయాణాలు చేస్తున్నారు. కొందరు వ్యాపారవేత్తలైతే గంటల ప్రయాణానికి కూడా లక్షల్లో ఖర్చు చేయడానికి వెనకాడటం లేదు.(‘కోహ్లి.. అనుష్కకు విడాకులు ఇచ్చేయ్’) వైరస్ భయంతో ఓ వ్యాపారవేత్త కుటుంబం ఏకంగా 180 సీట్ల సామర్థ్యం ఉన్న విమానాన్ని కేవలం నలుగురి ప్రయాణానికి బుక్ చేసుకుంది. భోపాల్ నుంచి ఢిల్లీకి నలుగురు ప్రయాణించడానికి ఎయిర్‌బస్ ఏ320 విమానాన్ని బుక్ చేశారు. ప్రయాణించిన వారిలో తల్లి, ఇద్దరు పిల్లలు, వారి పనిమనిషి ఉన్నారు. ఇందుకు రూ.10 లక్షలు వరకు ఖర్చుచేసినట్టు విమానయాన సంస్థ వర్గాలు తెలిపాయి. రెండు నెలల తర్వాత సోమవారం నుంచి దేశీయ విమాన సర్వీసులు పునఃప్రారంభమైన విషయం తెలిసిందే. ఏ320 విమానం ఢిల్లీ నుంచి సోమవారం ఉదయం 9.05 గంటలకు కేవలం పైలట్, క్యాబిన్ క్రూతో బయలుదేరి భోపాల్ చేరింది. అక్కడ నలుగురిని ఎక్కించుకుని ఉదయం 11.30 గంటలకు తిరిగి బయలుదేరి 12.55కి ఢిల్లీకి చేరుకుంది. కరోనా మహమ్మారి సమయంలో ఇతరులతో కలిసి ప్రయాణించడం గురించి చాలామంది వ్యాపారవేత్తలు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి వారికి విమానయాన సంస్థలు, చార్టర్ విమానాలను ఆఫర్ చేస్తున్నాయి. విమాన ప్రయాణానికి అతిపెద్ద నిర్వహణ వ్యయం అయిన ఇంధన ధరలు ప్రస్తుతం చాలా తక్కువగా ఉన్నందున, తక్కువ ధరకే విమానాలను అద్దెకు ఇవ్వడానికి పలు సంస్థలు సిద్ధంగా ఉన్నాయని ఓ అధికారి తెలిపారు. (నేను సిద్ధం, ఉద్యోగులను లాగొద్దు : ట్విటర్ సీఈఓ) -
‘పైలెట్‌ను 3 సార్లు హెచ్చరించాం.. పట్టించుకోలేదు’
కరాచీ: రెండు రోజుల క్రితం పాకిస్తాన్లో ఘోర విమాన ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. అయితే పైలెట్ తప్పిదం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ఏటీసీ) అధికారులు తెలిపారు. ప్రమాదం గురించి తాము మూడు సార్లు హెచ్చరికలు జారీ చేశామని.. కానీ పైలెట్ వాటిని పట్టించుకోలేదన్నారు. లాహోర్ నుంచి కరాచీకి ప్రయాణమైన ఎయిర్ బస్ ఏ-320 విమానం జిన్నా ఇంటరర్నేషనల్ ఎయిర్ పోర్టుకు 15 నాటికల్ మైళ్ల దూరంలో ఉండగా ఏటీసీ అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అప్పటికి భూమికి 7 వేల అడుగుల ఎత్తులో ఉండాల్సిన విమానం కాస్తా.. 10,000 అడుగుల ఎత్తులో ఉంది. దాంతో ఏటీసీ అధికారులు ఎత్తును తగ్గించాలల్సిందిగా పైలెట్‌ను హెచ్చరించారు. కానీ అతడు పట్టించుకోలేదు. (‘సీటు బెల్టు తీసి.. కిందకు దూకేశా’) తర్వాత విమానాశ్రయానికి 10 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్నప్పుడు విమానం ఎత్తు 3 వేల అడుగుల ఎత్తులో ఉండాలల్సింది. కానీ అప్పుడు విమానం 7 వేల అడుగుల ఎత్తులో ఉంది. దాంతో ఏటీసీ అధికారులు మరో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కానీ పైలెట్ మాత్రం ఏం పర్వాలేదని.. తాను హ్యాండిల్ చేయగలనని చెప్పాడు. సివిల్ ఏవియేషన్ అథారిటీ(సీఏఏ) ఇచ్చిన నివేదిక ప్రకారం పైలెట్ విమానాన్ని ల్యాండ్ చేయడానికి ప్రయత్నించినప్పుడు ఇంజన్ మూడు సార్లు రన్‌వేకు తగిలిందని.. దాంతో ఇంజన్ ట్యాంక్, పంపు దెబ్బతిన్నాయని పేర్కొంది. పైలెట్, ఏటీసీ ఇచ్చిన హెచ్చరికలను ఖాతరు చేయకుండా సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల పరిసస్థితి అదుపు తప్పిందని.. ఫలితంగా ప్రమాదం ఏర్పడిందని పాకిస్తాన్ దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. (కుప్పకూలడానికి ముందు.. భయంకరమైన క్షణాలు) ఇంధనం అయిపోవడం వల్ల ప్రమాదం సంభవించిందని ప్రచారం అవుతున్న వార్తల్ని కొట్టి పారేశారు. అంతేకాక విమానంలో సరిపడా ఇంధనం ఉందని అధికారులు స్పష్టం చేశారు. విమానంలో ఉన్న ఇంధనంతో దాదాపు 2.34 గంటల పాటు ప్రయాణించగలదని.. కానీ ప్రమాద సమయానికి కేవలం 1.30 గంటలపాటే ప్రయాణించిందని అధికారులు తెలిపారు. (ఆ విమానంలో లేను : నటి) -
‘సీటు బెల్టు తీసి.. కిందకు దూకేశా’
‘‘నా చుట్టూ అంతా మంటలు, విపరీతమైన పొగ. విమానం నలుదిక్కుల నుంచి ఏడుపులు. మంటల్లో చిక్కుకున్న పిల్లలు, పెద్దల ఆర్తనాదాలు. అగ్నికీలలే తప్ప మనుషులెవరూ కనిపించలేదు. నొప్పితో విలవిల్లాడుతున్న వారి గొంతులు మాత్రమే వినిపించాయి’’ అంటూ కరాచీ ఘోర విమాన ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన ఇంజనీర్ మహ్మద్ జుబేర్ తనకు ఎదురైన భయంకరమైన అనుభవాలు పంచుకున్నాడు. చావు అంచుల దాకా వెళ్లిన జుబేర్ ప్రస్తుతం కరాచీలోని ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో పాకిస్తాన్ మీడియా జియో న్యూస్‌తో మాట్లాడుతూ.. సీటు బెల్టు తొలగించి.. వెలుతురు కనిపిస్తున్న చోటు వైపుగా నడిచి.. 10 అడుగుల ఎత్తు నుంచి కిందకు దూకి ప్రాణాలు కాపాడుకున్నట్లు తెలిపారు. విమానాన్ని కిందకు దించే క్రమంలో ఏవో ఆటంకాలు ఎదురయ్యాయని.. దాంతో మరోసారి విమానాన్ని ల్యాండ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు పైలట్ చెప్పాడని.. అంతలోనే నేలకు తగిలి విమానం క్రాష్ అయిపోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. (భయానకం: ఆకాశం నుంచి మృతదేహాలు?) కాగా పాకిస్తాన్‌లోని కరాచీలో శుక్రవారం మధ్యాహ్నం జనావాసాల్లో ప్రయాణికుల విమానం కుప్పకూలిన విషయం విదితమే. పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్(పీఐఏ)కు చెందిన ఈ విమానంలో ప్రమాద సమయంలో మొత్తం 99 మంది ఉన్నారు. ఇక బ్యాంక్ ఆఫ్ పంజాబ్ ప్రెసిడెంట్ జఫర్ మసూద్, ఇంజనీర్ జుబేర్‌తో పాటు మరో వ్యక్తి మాత్రమే ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడి మృత్యుంజయులుగా నిలిచారు. కాగా ల్యాండింగ్ గేర్‌లో సమస్య ఏర్పడిందని పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు సమాచారమిచ్చిన కొన్ని క్షణాల్లోనే ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఇక ఇప్పటి వరకు ఘటనాస్థలి నుంచి 82 మృతదేహాలను వెలికితీసినట్లు పాక్ స్థానిక మీడియా పేర్కొంది. ఇదిలా ఉండగా.. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపిన ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఈ దుర్ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ఆదేశించారు.(కుప్పకూలిన పాక్ విమానం) -
కుప్పకూలిన పాక్ విమానం
కరాచీ: పాకిస్తాన్లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. కరాచీలో శుక్రవారం మధ్యాహ్నం జనావాస ప్రాంతంలో ప్రయాణికుల విమానం కుప్పకూలింది. పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్(పీఐఏ)కు చెందిన ఈ విమానంలో మొత్తం 99 మంది ప్రయాణిస్తున్నారు. వీరిలో ఎంతమంది చనిపోయారనే విషయంలో కచ్చితమైన సమాచారం లేదు. అయితే, ఘటనాస్థలం నుంచి 57 మృతదేహాలను వెలికితీశామని అధికారులు తెలిపారు. బ్యాంక్ ఆఫ్ పంజాబ్ ప్రెసిడెంట్ జఫర్ మసూద్ సహా ఇద్దరు ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. కరాచీలోని జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. కరోనా లాక్డౌన్ అనంతరం పాకిస్తాన్లో గతవారమే పరిమిత సంఖ్యలో విమాన సర్వీసులను పునఃప్రారంభించారు. ల్యాండింగ్ గేర్‌లో సమస్య లాహోర్ నుంచి వస్తున్న పీకే–8303 విమానం మరికొద్ది క్షణాల్లో కరాచీ విమానాశ్రయంలో ల్యాండ్ కానుండగా, విమానాశ్రయం పక్కనే ఉన్న జిన్నా గార్డెన్ ప్రాంతంలో ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ పీఐఏ ఎయిర్‌బస్ ఏ320 విమానంలో 91 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో 31 మంది మహిళలు, 9మంది చిన్నారులు ఉన్నారని అధికారులు తెలిపారు. ల్యాండింగ్ గేర్‌లో సమస్య ఏర్పడిందని కూలిపోవడానికి కాసేపటి ముందు పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు సమాచారమిచ్చారు. ఈ ఘటనపై పాకిస్తాన్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ, ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్, ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ జావేద్ బజ్వా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈ దుర్ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ప్రధాని ఇమ్రాన్ అధికారులను ఆదేశించారు. తక్షణమే సహాయ చర్యల్లో పాలు పంచుకోవాలని ఆర్మీని జనరల్ బజ్వా ఆదేశించారు. విమానం కూలిన ప్రాంతంలో ఇళ్లు, కార్లు, ఇతర వాహనాలు ధ్వంసమైన దృశ్యాలను స్థానిక వార్తా చానళ్లు ప్రసారం చేశాయి. ధ్వంసమైన ఇళ్లలో నుంచి పలు మృతదేహాలను వెలికితీశామని పోలీసులు, సహాయ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్న సిబ్బంది తెలిపారు. అలాగే, పలువురు క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించామన్నారు. కనీసం 25 ఇళ్లు ధ్వంసమయ్యాయని పేర్కొన్నారు. కాగా, విమానంలో ఎంతమంది ఉన్నారనే విషయంలో అధికారులు వేర్వేరు రకాలైన సమాచారం ఇచ్చారు. అయితే, 91 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బంది ఉన్నారని పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్(పీఐఏ) అధికార ప్రతినిధి అబ్దుల్లా హఫీజ్ వెల్లడించారు. మధ్నాహ్నం 2.37 గంటల సమయంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో విమానానికి సంబంధాలు నిలిచిపోయాయని హఫీజ్ తెలిపారు. సాంకేతిక సమస్య ఏర్పడిందన్న పైలట్ సజ్జాద్ గుల్‌తో.. ల్యాండింగ్‌కు రెండు రన్వేలు సిద్ధంగా ఉన్నాయని కంట్రోల్ టవర్ అధికారులు చెప్పారని పీఐఏ చైర్మన్ అర్షద్ మాలిక్ తెలిపారు. కూలే ముందు విమానం రెక్కల్లో నుంచి మంటలు వచ్చాయని, ఆ తరువాత క్షణాల్లోనే అది ఇళ్లపై కుప్పకూలిందని ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు. -
విమానం కొనలేనుగా.. అందుకే ఇలా..
ఈశాన్య చైనాలో ఎయిర్‌బస్‌కు సంబంధించిన కొత్త విమానం ఎయిర్‌బస్ ఏ320 రూపుదిద్దుకుంటోంది. పంట పొలాల మధ్య.. ఘుమఘుమలాడే రుచులతో ప్యాసింజర్లకు ఆహ్వానం పలికేందుకు సిద్ధమవుతోంది. అదేంటి విమానం విమానాశ్రయంలోనో.. రన్‌వే మీదో ఉండాలి గానీ పంటపొలాల మధ్య ఉండటమేంటని ఆశ్చర్యపోకండి. ఎందుకంటే ఇది ఎగిరే విమానం కాదు. తన చిన్న నాటి కలను నెరవేర్చుకునేందుకు ఓ రైతు చేసిన వినూత్న ఆలోచనకు నిదర్శనం. జూ యూ.. చైనాకు చెందిన రైతు. ఇతడు ఉల్లి, వెల్లుల్లి పంటలు సాగు చేస్తూంటాడు. విమానాలంటే పడిచచ్చే జూ యూకు చిన్ననాటి నుంచి విమానం కొనాలనే కోరిక ఉండేది. కానీ ఓ సామాన్య రైతుకు ఇది సాధ్యమయ్యే పనికాదు కదా. అందుకే విమానాన్ని కట్టాలనే నిర్ణయానికి వచ్చేసాడు. ఈశాన్య చైనాలోని గోధుమ చేల మధ్య ‘విమాన హోటల్’ ను నిర్మిస్తున్నాడు. ఇందుకోసం తను సంపాదించిన మొత్తాన్ని (2.6 మిలియన్ యువాన్లు- దాదాపు రెండున్నర కోట్ల రూపాయలు) ఖర్చు పెడుతున్నాడు. అచ్చం నిజమైన విమానంలా కన్పించేలా.. తన చిరకాల కోరికను ఈరకంగానైనా తీర్చుకునేందుకు నిశ్చయించుకున్న జూ యూ ఎయిర్‌బస్ నిర్మాణాన్ని ఆషామాషీగా తీసుకోలేదు. తన కలల సౌధాన్ని నిర్మించేందుకు నిజమైన ఎయిర్‌బస్ 320 కొలతలు తెలుసుకున్నాడు. రెక్కలు, కాక్‌పిట్, ఇంజన్ సహా అన్ని భాగాలకు సంబంధించిన పక్కా సమాచారం సేకరించి మరీ నిజమైన విమానాన్ని తలపించేలా ఈ కట్టడాన్ని నిర్మించాడు. ఇందుకోసం సుమారు 60 టన్నుల ఉక్కును వినియోగించాడు. ‘మధ్యతరగతి జీవిగా ఓ విమానాన్ని కొనడం నాకు సాధ్యమయ్యే పనికాదు. అందుకే కొనలేకపోయినా ఇలా విమానాన్ని నిర్మించి నా కోరిక నెరవేర్చుకున్నాను’ అంటూ జూ యూ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. మొత్తం 156 సీట్లు ఉన్న ఈ విమానంలో 36 సీట్లను ఫస్ట్‌క్లాస్ సీట్లుగా మార్చినట్లు పేర్కొన్నాడు. -
విమాన బాధితుల డీఎన్ఏ పరీక్షలు పూర్తి
ప్యారిస్: జర్మన్ విమాన ప్రమాదంలో మృతిచెందినవారిని గుర్తించేందుకు కావాల్సిన డీఎన్ఏ పరీక్షలు పూర్తయినట్లు ఫ్రాన్స్ అధికారులు తెలిపారు. మొత్తం 150 మంది ప్రయాణీకుల్లో 78 మంది డీఎన్ఏ పరీక్షలు తేలాల్సి ఉండగా వాటిని కూడా పూర్తి చేసినట్లు తెలిపారు. అయితే, వారి పేర్ల జాబితా ఇంకా విడుదల చేయలేదని, మరోసారి క్రాస్ చెకింగ్ అయిపోయిన తర్వాత వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. ఈ ప్రమాదంలో మిగిలిపోయిన ప్రయాణీకులకు చెందిన శిథిల రూప శకలాలను 50 హెలికాప్టర్లలో తరలిస్తున్నామని, చిద్రమైన శరీరభాగాలను ఓ చోటచేర్చేందుకు 50మంది విమానం కూలిపోయిన పర్వత ప్రాంతంలో గాలింపులు చేపడుతున్నట్లు తెలిపారు. ఫ్రాన్స్‌లోని ఆల్ఫ్స్ పర్వతాల్లో జర్మనీ విమానం 'ఎయిర్ బస్ ఏ320' విమానాన్ని కోపైలట్ ఆండ్రియాస్ లూబిడ్జ్ ఉద్దేశపూర్వకంగానే కూల్చివేశాడన్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో విమానంలో ఏ ఒక్కరు కూడా ప్రాణాలతో బయటపడలేదు. -
పిచ్చివాడి చేతికి విమానం
-
పిచ్చివాడి చేతికి విమానం
అతడు తన ప్రాణం తాను తీసుకున్నాడు. అదే సమయంలో మరో 150 మంది ప్రాణాలు తీశాడు. అది ఆత్మహత్య. ఆ 150 మంది ప్రయాణికుల సామూహిక హత్య కూడా. ఇదే సూత్రం మీద ఇప్పుడు ఫ్రెంచ్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. గడచిన మంగళవారం ఫ్రెంచ్ ఆల్ప్స్ పర్వతశ్రేణులలో జర్మన్వింగ్స్ విమానం కూలడం గురించి, ఇందుకు కారకునిగా భావిస్తున్న కో-పైలట్ ఆండ్రియాస్ ల్యూబిట్జ్ గురించి గుండెలు బరువెక్కించే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. ‘ఏదో ఒకరోజు నా పేరు ఈ విశ్వమంతటా మారు మోగిపోతుంది చూడు!’ అంటూ ఐదారు మాసాల క్రితమే తన మాజీ గర్ల్ ఫ్రెండ్‌తో అన్నమాటకు ల్యూబిట్జ్ ఇలా కార్యరూపమిచ్చాడు. నిజమే... ఇప్పు డు ప్రపంచం మొత్తం అతడి పేరునే స్మరిస్తోంది. బ్లాక్ బాక్సుల ద్వారా వెల్లడైన సమాచారం గగనయానం మీద కొత్త ప్రశ్నలను రేకెత్తించే విధంగా ఉంది. ల్యూబిట్జ్ నుంచి విడిపోక తప్పని పరిస్థితి ఈ మధ్యే రావడం ఎంత మంచిదైందో ఆ మాజీ గర్ల్‌ఫ్రెండ్ తలుచుకుని ఇంత విషాదంలోనూ ఆనం దించి ఉండాలి. ఎందుకు విడిపోయారంటే, అప్పటికే అతడిలో ఏదో మానసిక సమస్యకు సంబంధించిన లక్షణాలు మొదలయ్యాయని చెప్పిందామె. ‘మనం పడిపోతున్నాం...మనం పడిపోతున్నాం...!’ అంటూ ల్యూబిట్జ్ చటుక్కున నిద్దట్లోనుంచి లేచిపోయి అరుస్తూ ఉండేవాడట. అతడికి ఎప్పుడూ పీడకలలే. కానీ తన ఆరోగ్య స్థితిని సంస్థ దృష్టికి రాకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నా డు. విమానం కూలిన రోజు, ఆ ముందు రోజు కూడా అంటే,ఈ మార్చి 25, 26 తేదీలలో కూడా అతడు వైద్యులను కలసివచ్చాడు. అయితే ఆస్పత్రిలో ఇచ్చిన రిపోర్టులను అతడు చించిపారేశాడు. నిజానికి ల్యూబిట్జ్ 2009లో పైలట్ శిక్షణ పొందుతున్నప్పుడే వ్యాధి బయటపడింది. 18 మాసాల వైద్యం తరువాత మళ్లీ చేరాడు. 2013 నుంచి ఇతడిలో వ్యాధి లక్షణాలు మరోసారి కనిపిం చాయి. అప్పుడే, 2015 వరకు కూడా ల్యూబిట్జ్ తరచూ వైద్యపరీక్షలు నిర్వహించుకోవాలని ఆస్పత్రి వర్గాలు సూచించాయి. ఇలా ఉండగానే ఈ సంవ త్సరం ఫిబ్రవరిలో అంతుచిక్కని వ్యాధికి అతనికి కొత్తగా చికిత్స మొదలయింది. ల్యూబిట్జ్ వ్యక్తిగత జీవితం సంక్షోభభరితమైంది కావచ్చుననీ, దానితో పాటు కొన్ని ఇతర కారణాలు కూడా ఇంతటి విపరీత నిర్ణయం తీసుకోవడానికి దారి తీసి ఉండవచ్చునని జర్మనీ పత్రికలు విశ్లేషిస్తున్నాయి. ఈ దుర్ఘటనలో అస లు పైలట్‌ను కాక్‌పిట్‌లోకి రానివ్వకుండా లోపల తాళం పెట్టుకుని ల్యూబిట్జ్ విమానాన్ని భూమార్గం పట్టించాడు. ఇది పొరపాటుగా జరిగినది కూడా కాదనీ, ఎందుకంటే, ఏ మీట నొక్కితే విమానం కిందకు దూకుతుందో, అదే మీటను ల్యూబిట్జ్ నొక్కేశాడని నిపుణులు చెబుతున్నారు. ఆ తరువాత ఎనిమిది నిముషాల పాటు అతడు హాయిగా ఊపిరి తీసుకున్న విషయం కూడా కనుగొ న్నారు. మద్యపానం, మత్తుమందులతో వచ్చే సమస్యలు, వివాహ జీవితం భగ్నం కావడం, వ్యక్తిగత వైఫల్యాలు, గతంలో భరించిన లేదా ఇప్పుడు భరి స్తున్న పని ఒత్తిడి వంటి కారణాలు కూడా ఈ దారుణ చర్యకు దారితీయించే అవకాశం ఉందని అక్కడి పత్రికలు అంటున్నాయి. నిజానికి ఇందులో చాలా వరకు ల్యూబిట్జ్ జీవితంలో కనిపిస్తున్నాయి. కానీ అతడు మోంటాబార్ (జర్మ నీ పశ్చిమ ప్రాంతం) అనే చోట తల్లిదండ్రులతో కలసే ఉండడం విశేషం. కానీ డుసెల్డార్ఫ్లో ఒక అపార్టుమెంటు కొని, ఉద్యోగం కోసం అందులో ఉంటు న్నాడు. అయితే ఇది ఒక్క ల్యూబిట్జ్కు సంబంధించిన సమస్య కాదని మార్జోరీ వాలెస్ మాటలను బట్టి తెలుస్తోంది. చారిటీ సేన్ అనే మానసిక రుగ్మతల నివా రణ సంస్థ అధిపతిగా ఉన్న వాలెస్ చెబుతున్నది వింటే గుండె ఝల్లుమంటుం ది. ప్రస్తుతం ఒత్తిడికి వైద్యం చేయించుకుంటున్నవారు వేల సంఖ్యలో ఉన్నా రనీ, అందులో పైలట్లు కూడా ఉన్నారనీ ఆయన అంటున్నారు. ఇంత జరిగాక ఇప్పుడు ఐరోపా విమానయాన భద్రతా సంస్థ (ఈఏఎస్ఏ) ఉలిక్కిపడి మార్చి 28 నుంచే కొత్త నిబంధనలు ప్రకటించింది. ఇక నుంచి కాక్‌పిట్‌లో ఎల్లవేళలా ఇద్దరు ఉండాలని ఆదేశించింది. ఈ పద్ధతిని అమెరికా ఇప్పుటికే పాటిస్తున్నది. పనిలో పనిగా ఐక్యరాజ్య సమితికి చెందిన ప్రపంచ విమానయాన సంస్థ కూడా పైలట్లు తరచు మానసిక పరీక్షలు జరిపించుకోవాలని పిలుపునిచ్చింది. ఏమైనా ఒక హాలీవుడ్ హర్రర్ సినిమాకు తగిన విషాదాన్ని ప్రపంచానికి వదలిపెట్టి వెళ్లాడు ల్యూబిట్జ్. -
డోర్ ఓపెన్ కాలేదట..
వాషింగ్టన్ : ఫ్రాన్సులోని దక్షిణ ఆల్ప్స్ పర్వతాల్లో జర్మనీకి చెందిన ఎయిర్‌బస్ ఎ-320 విమానం కూలిపోవడానికి పైలటే కారణమా? కాక్‌పిట్ తలుపు తెరుచుకోకపోడమే ప్రమాదానికి కారణమా? విమానంలో ఉన్న ఇద్దరు పైలట్లలో ఒకరు కాక్‌పిట్ నుంచి బయటికి వెళ్లడం వల్లనే విమానం కూలిపోయిందా... అసలు ఆ పైలట్ బైటికి ఎందుకు వెళ్లాడు... ఇవన్నీ కాక్‌పిట్ వాయిస్ రికార్డర్‌ను పరిశీలిస్తున్న సీనియర్ సైనిక అధికారి అనుమానాలు. విమాన ప్రమాదంలో కీలకమైన సమాచార సేకరణలో భాగంగా కాక్‌పిట్ వాయిస్ రికార్డర్‌ను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న ఆ అధికారి విమానం కూలిపోవడానికి కొన్ని క్షణాల ముందు ఏం జరిగిందనేది ఇప్పుడే చెప్పలేమన్నారు. అయితే పైలట్ కాక్‌పిట్ నుంచి బయటకు వెళ్లి, మళ్లీ తిరిగి కాక్‌పిట్‌లోకి ఎంటర్ కావడానికి ప్రయత్నించి విఫలమైన విషయం స్పష్టంగా రికార్డు అయినట్లు చెబుతున్నారు. అలాగే పైలట్ ఎందుకు బైటికి వెళ్లాడు? కాక్‌పిట్‌లో రెండవ పైలట్ ఒక్కడే ఉన్నాడా..డోర్ తెరవలేకపోయాడా? అనేది కూడా ఖచ్చితంగా నిర్ధారించలేమంటున్నారు. మొదటి బ్లాక్‌బాక్స్‌లో కొన్ని శబ్దాలు, మాటలు రిజిస్టర్ అయినట్లు ఫ్రాన్స్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో హెడ్ రెమీ జౌటీ కూడా నిర్ధారించారు. పైలట్ తలుపును గట్టిగా కొడుతున్న శబ్దాలు, మాటలు నమోదయ్యాయనీ.. అయితే పూర్తి వివరాలు తెలియడానికి మరికొన్ని రోజులు లేదా వారాలు పట్టవచ్చన్నారు. జర్మన్ వింగ్స్ ఎయిర్‌బస్ ఎ320 మంగళవారం కూలిపోయిన దుర్ఘటనలో ఆరుగురు సిబ్బంది సహా 144 ప్రయాణీకులు అసువులు బాసిన సంగతి తెలిసిందే. కాగా ప్రమాద సమయంలో 150 మంది ఉండగా, ఎవరూ బతికేందుకు అవకాశం లేదని ఇదివరకే ఫ్రాన్స్ ప్రకటించింది. -
ఆ రెండు నిమిషాల్లో ఏం జరిగింది?
సైన్-లెస్-ఆల్ఫ్స్(ఫ్రాన్స్): ఫ్రాన్స్‌లోని ఆల్ఫ్స్ పర్వత శ్రేణిలో మంగళవారం కూలిపోయిన జర్మన్వింగ్స్ ఎయిర్‌బస్ 320 విమానానికి చెందిన బ్లాక్‌బాక్స్ బాగా దెబ్బతింది. ప్రమాదానికి సంబంధించి కీలక సమాచారం నిక్షిప్తం అయ్యే ఈ బ్లాక్‌బాక్స్‌ను అధికారులు సేకరించారు. దీనిని పగులగొట్టి తెరిచారు. మంగళవారం ఉదయం 10:30-10:31 గంటల మధ్యే విమానం కూలిందని, ఈ రెండు నిమిషాల్లో ఏం జరిగిందన్నది బ్లాక్‌బాక్స్ సమాచారంతో వెల్లడికావచ్చని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. బ్లాక్‌బాక్స్‌ను జాగ్రత్తగా పునరుద్ధరించి, దానిలోని సమాచారం సేకరించాల్సి ఉందని ఫ్రాన్స్ అంతర్గత వ్యవహారాల మంత్రి బెర్నార్డ్ కాజెనీవ్ తెలిపారు. ఎయిర్‌బస్ 320 విమానంలో ప్రమాద సమయంలో 150 మంది ఉండగా, ఎవరూ బతికేందుకు అవకాశం లేదని ఇదివరకే ఫ్రాన్స్ ప్రకటించింది. అతి క్లిష్టమైన పర్వత ప్రాంతంలో ఉన్న ప్రమాదస్థలికి చేరుకున్న సైనిక సిబ్బంది సహాయక చర్యల్లో ముమ్మరంగా పాల్గొంటోంది. విమానం బలంగా ఢీకొట్టడంతో శకలాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. అయితే, ప్రమాదం వెనక ఉగ్రవాదం, ఇతర కుట్ర వంటి కోణాలు ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని జర్మనీ ఉన్నతాధికారి ఒకరు స్పష్టంచేశారు. కాక్‌పిట్‌లో పైలట్ల సంభాషణలు, ఇతర అన్ని రకాల శబ్దాలు కూడా రికార్డు అవుతాయి. బ్లాక్‌బాక్స్ సమాచారం డౌన్లోడ్ చేసుకునేందుకు కొన్ని గంటలు పట్టవచ్చని తెలిపారు. అయితే, విమాన సమాచారం నిక్షిప్తం అయ్యే రెండో బ్లాక్‌బాక్స్ ఇంకా లభించాల్సి ఉందన్నారు. ఇదిలా ఉండగా, బ్లాక్‌బాక్స్ నుంచి సేకరించిన ఆడియోలో ఏం ఉందన్న వివరాలు వెల్లడించేందుకు అధికారులు నిరాకరించారు. విమాన సమాచారం నిక్షిప్తం అయ్యే రెండో బ్లాక్‌బాక్స్ ఇంకా లభించాల్సి ఉందన్నారు. కాగా, జర్మన్వింగ్స్ విమాన ప్రమాద స్థలాన్ని బుధవారం ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్ నాయకులు పలువురు సందర్శించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్, జర్మనీ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్, ఫ్రాన్స్ ప్రధాని మారియానో రజోయ్ హెలికాప్టర్ ద్వారా ప్రమాద స్థలిని పరిశీలించారు. మరోవైపు ప్రమాద ఘటనపై దర్యాప్తు వేగవంతం అయింది. ఒకే కుటుంబంలో మూడు తరాలు... ఎయిర్‌బస్ విమాన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన మూడుతరాల వారు మృత్యువాతపడ్డారు. బార్సిలోనాకు చెందిన ఓ విద్యార్థిని, ఆమె తల్లి, నానమ్మ ప్రమాదంలో మృతిచెందారు. నివాళి మరణించిన 16 మంది విద్యార్థులకు హాల్టెన్ నగరంలో స్కూలు వద్ద సహవిద్యార్థులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మరణించిన తోటి విద్యార్థులను తలచుకొని విలపించారు. జర్మన్వింగ్స్ విమానం రద్దు.. జర్మన్వింగ్స్ ఎయిర్‌బస్ విమాన దుర్ఘటన నేపథ్యంలో ఆ సంస్థ విమానం నడిపేందుకు పైలట్లు నిరాకరించడంతో బుధవారం ఓ విమానాన్ని రద్దుచేసినట్లు లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్ వెల్లడించింది. ఒబామా సంతాపం.. ఫ్రాన్స్‌లో విమాన దుర్ఘటన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తన సంతాపం ప్రకటించారు. జర్మనీ, ఫ్రాన్స్, తదితర దేశాలకు చెందిన బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. -
ఆపద సంకేతాలు లేవు-కారణాలు తెలియదు
పారిస్: ఫ్రాన్స్‌లో ప్రమాదానికి గురైన విమానం నుంచి సిబ్బంది ఎటువంటి ఆపద సంకేతాలు పంపలేదని పౌర విమానయాన అధికారులు తెలిపారు. ప్రమాదానికి కారణాలు కూడా తెలియదని వారు చెప్పారు. ప్రమాదానికి గురైన విమానం ఎయిర్‌బస్ ఎ320 విమానం జర్మన్ విమానయాన సంస్థ లుఫ్తాన్సాకు అనుబంధ సంస్థ అయిన జర్మన్‌వింగ్స్‌కు చెందినది. స్పెయిన్ దేశంలోని తీర నగరం బార్సెలోనా నుంచి బయల్దేరిన ఈ విమానం జర్మనీలోని డ్యుసెల్డార్ఫ్ నగరానికి వెళ్లాల్సి ఉంది. అయితే మార్గ మధ్యలో ఫ్రాన్స్‌లోని ఆల్ప్స్ పర్వతాల మధ్య గల బార్సెలోనెటె స్కీ రిసార్ట్ సమీపంలో స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 10:30 -11.00 గంల మధ్యలో ఇదికూలిపోయింది. ఆ విమానంతో సంబంధాలు తెగిపోయాయని పౌర విమానయాన అధికారులు ప్రకటించారు. విమానం కూలినపుడు భారీ శబ్దం వినిపించిందని, ఆ సమయంలో ఆ ప్రాంతంలో స్కీయింగ్ చేస్తున్న ప్రత్యక్ష సాక్షి ఒకరు ఫ్రెంచ్ టెలివిజన్ చానల్‌తో చెప్పారు. ''విమానం కూలిపోవడానికి కారణాలేమిటనేది మాకు తెలియదు. కూలిన పరిస్థితులను బట్టి విమానంలోని 150 మందీ చనిపోయినట్లు అక్కడికి వెళ్లిన సిబ్బంది నిర్ధారించారు'' అని ఫ్రాన్స్ ప్రధాన మంత్రి మాన్యుయెల్ వాల్స్ మీడియాకు చెప్పారు. ఈ ఘోర ప్రమాదంలో మరణించిన వారిలో 67 మంది జర్మన్ వాసులు, 45 మంది స్పెయిన్ పౌరులు ఉన్నట్లు భావిస్తున్నారు. జర్మనీకి చెందిన 16 మంది స్కూలు విద్యార్థులు కూడా ఈ విమానంలో ప్రయాణిస్తున్నట్లు స్పెయిన్ అధికారులు తెలిపారు.