Airport Construction
-
కొత్తగూడెం ఎయిర్‌పోర్టుకు ముందడుగు
సాక్షి, హైదరాబాద్: వరంగల్‌లో అంతర్జాతీయ స్థాయి రన్‌వేతో పెద్ద విమానాశ్రయాన్ని నిర్మించేందుకు చకచకా ఏర్పాట్లు చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. ఆ పనులు ప్రారంభమయ్యేనాటికి రాష్ట్రంలో మూడో విమానాశ్రయ నిర్మాణ ప్రక్రియను కూడా కొలిక్కి తేవటానికి చర్యలు ప్రారంభించాయి. హైదరాబాద్, వరంగల్ విమానాశ్రయాల తర్వాత మూడో విమానాశ్రయాన్ని కొత్తగూడెంలో నిర్మించాలని నిర్ణయించాయి. ఇది కూడా రాష్ట్రంలో కీలక విమానాశ్రయంగా మారుతుందని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, దాన్ని వెంటనే మంజూరు చేసి పనులు ప్రారంభించాలని పౌర విమానయాన శాఖను కోరింది. ఆ శాఖ కూడా సానుకూలంగా స్పందించింది. దీంతో వరంగల్ తరహాలో దీన్ని కూడా వేయి ఎకరాల్లో నిర్మించేందుకు ప్రాథమిక కసరత్తు మొదలైంది. పది రోజుల్లో సర్వేకు ఏఏఐ బృందంవిమానాశ్రయం కోసం గుర్తించిన ప్రాంతానికి సంబంధించి గత పదేళ్ల వాతావరణ (మెటియోరాలాజికల్) నివేదికలు, విండ్రోజ్ డయాగ్రామ్ తదితర వివరాలను ఏఏఐకి అధికారులు సమర్పించారు. విమానాశ్రయ నిర్మాణానికి ఈ భూమి యోగ్యమైందో కాదో తేల్చేందుకు మరో పదిరోజుల్లో ఏఏఐ సాంకేతిక బృందం ప్రీ ఫీజిబిలిటీ స్టడీ చేయబోతోంది. అది యోగ్యమైన భూమి అని తేలితే వెంటనే అటవీ శాఖతో సమన్వయం చేసుకుని ఆ భూమిని రాష్ట్ర ప్రభుత్వం సేకరించి ఏఏఐకి అప్పగిస్తుంది. దీనికి బదులుగా అటవీ శాఖకు మరోచోట భూమిని కేటాయిస్తారు. ఇక్కడ విమానాశ్రయ నిర్మాణం వల్ల వన్యప్రాణులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అధికారులు చెబుతున్నారు. ఇక్కడ కూడా పెద్ద రన్‌వే..వరంగల్‌లో దాదాపు 2,800 మీటర్ల పొడవైన రన్‌వేను నిర్మించనున్నారు. కొత్తగూడెంలో కూడా అలాంటి భారీ రన్‌వేను నిర్మించాలని భావిస్తున్నారు. వచ్చే 40 ఏళ్ల అవసరాలను తీర్చేలా, భారీ విమానాలు దిగగలిగే సామర్థ్యంతో ఈ విమానాశ్రయాన్ని నిర్మించనున్నట్టు తెలంగాణ ఏవియేషన్ అకాడమీ పేర్కొంది. 950 ఎకరాల భూమి గుర్తింపు రాష్ట్రంలో ఆరు విమానాశ్రయాలు నిర్మించాలన్న ప్రతిపాదన చాలాకాలంగా పెండింగులో ఉంది. నిజాం హయాంలో కొనసాగిన ఎయిర్్రస్టిప్స్ను పునరుద్ధరించటంతోపాటు మరో మూడు చోట్ల గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టులు నిర్మించాలన్నది ప్రతిపాదన. వీటిల్లో తొలుత వరంగల్ శివారులోని మూమునూరు పాత ఎయిర్‌్రస్టిప్ ఉన్న స్థలంలో ఎయిర్‌బస్ వంటి భారీ విమానాలు కూడా దిగగలిగే రన్‌వేతో విమానాశ్రయం నిర్మాణానికి కేంద్రం పచ్చజెండా ఊపింది. మరో ఆరు నెలల్లో టెండర్ల ప్రక్రియ చేపట్టనున్నారు. ఇప్పుడు దానితోపాటు కొత్తగూడెం విమానాశ్రయాన్ని కూడా అందుబాటులోకి తేవాలన్న యోచనతో ప్రభుత్వాలు ముందుకు సాగుతున్నాయి. ఇక్కడ తొలుత చిన్న విమానాశ్రయాన్ని నిర్మించాలని భావించినా.. ఆ ప్రాంతానికి ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా వరంగల్ తరహాలో వేయి ఎకరాల్లో నిర్మించాలని ఇప్పుడు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) భావిస్తోంది. గతంలో విమానాశ్రయం కోసం పాల్వంచ సమీపంలో గుడిపాడు–బంగారుజాల మధ్య స్థలాన్ని ఎంపిక చేశారు. రాష్ట్రంలో విమానాశ్రయాల నిర్మాణానికి కన్సల్టెన్సీ సేవలందిస్తున్న ఏఏఐ.. ఆ స్థలం ఎయిర్‌పోర్టు నిర్మాణానికి పనికిరాదని ఇటీవల నివేదిక సమరి్పంచింది. ఆ ప్రాంతంలో గుట్టలుండటంతోపాటు భూమి పొరలు కూడా నిర్మాణానికి వీలుగా లేవని పేర్కొంది. దీంతో తదుపరి ప్రక్రియ నిలిచిపోయింది. తాజాగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏఏఐ అధికారులతోపాటు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్నాయుడును కలిసి విమానాశ్రయ ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరారు. ప్రత్యామ్నాయ స్థల సేకరణపై అధికారులతో చర్చించారు. దీనికి ఏఏఐ సమ్మతించటంతో జిల్లా కలెక్టర్‌కు ప్రత్యామ్నాయ స్థల సేకరణ కోసం ఆదేశాలిచ్చారు. దీంతో అధికారులు మూడు మండలాల పరిధిలోకి వచ్చే 950 ఎకరాల స్థలాన్ని గుర్తించారు. కొత్తగూడెం మండలంలోని రామవరం గ్రామం, సుజాతానగర్ మండల పరిధిలోని సుజాతానగర్ గ్రామం, చుంచుపల్లి మండల పరిధిలోని చుంచుపల్లి గ్రామం పరిధిలో 950 ఎకరాల అటవీ భూములను ఎంపిక చేశారు. ఎన్నో ఉపయోగాలు కొత్తగూడెం ప్రాంతంలో విమానాశ్రయ నిర్మాణం వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయన్న మా ప్రతిపాదనకు అంగీకరించిన కేంద్రం.. అక్కడ విమానాశ్రయ నిర్మాణానికి సమ్మతించింది. బొగ్గు గనుల కేంద్రం, సిమెంటు పరిశ్రమల నిలయం, పారిశ్రామికంగా అభివృద్ధి చెందే ప్రాంతం.. ఛత్తీస్‌గఢ్‌కు చేరువగా ఉన్నందున రెండు రాష్ట్రాల అనుసంధానం తేలికవుతుంది. ఇది హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి 300 కి.మీ. దూరంలో ఉన్నందున ఎలాంటి నిబంధనలు అడ్డు రావు. ఇక దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం దేవాలయానికి దేశవిదేశాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చేందుకు ఇది దోహదపడుతుంది.– తుమ్మల నాగేశ్వరరావు, వ్యవసాయశాఖ మంత్రి -
ఎయిర్‌బస్ @ ఓరుగల్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రెండో విమానాశ్రయ నిర్మాణానికి మార్గం సుగమమైంది. వరంగల్ శివారులోని మామునూరులో అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో ఎయిర్పోర్ట్ రూపొందబోతోంది. ఐదారేళ్ల తర్వాత ఎట్టకేలకు అవరోధాలు పరిష్కారం కావటంతో విమానాశ్రయ నిర్మాణం చేపట్టేందుకు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) సంసిద్ధత ప్రకటించింది. దీనిని సొంతంగానే నిర్మించాలని నిర్ణయించగా, అనుమతులు, ఇతర అధికారిక ప్రక్రియను ఆరునెలల్లో పూర్తి చేసి టెండర్లు పిలవబోతోంది. ఎయిర్‌బస్ దిగేలా.. నాలుగేళ్ల క్రితం ఏఏఐ ఆధ్వర్యంలో జరిగిన టెక్నో ఎకనమిక్ ఫీజిబిలిటీ సర్వే రెండు రకాల నివేదికలు సమర్పించింది. చిన్న విమానాశ్రయం నిర్మించేందుకు 724 ఎకరాల భూమి, రూ.248 కోట్ల వ్యయం అవుతుందని, పెద్ద విమానాలను ఆపరేట్ చేసే స్థాయిలో నిర్మించాలంటే 1053 ఎకరాల భూమి, రూ. 345 కోట్ల వ్యయం అవుతుందని పేర్కొంది. తొలుత చిన్న విమానాశ్రయంగానే నిర్మించాలని నాటి ప్రభుత్వం సూచించింది. కానీ భవిష్యత్‌లో విస్తరణ ఇబ్బందిగా ఉంటుందని, కనీసం 30 ఏళ్ల అవసరాలకు తగ్గట్టుగా ఒకేసారి పెద్ద విమానాశ్రయమే నిర్మించాలని గతేడాది చివరలో ఏఏఐ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. దీనికి ప్రభుత్వం సరే అనటంతో పెద్ద విమానాశ్రయమే రూపొందబోతోంది. ఇక్కడ ఎయిర్‌బస్ విమానం దిగేలా దాదాపు 2,800 మీటర్ల పొడవైన్ రన్‌వే నిర్మించబోతున్నారు. మామునూరులో నిజాం ప్రభుత్వం నిర్మించిన ఎయిర్‌్రస్టిప్ శిథిలం అయినా, నాటి రెండు రన్‌వేల ఆనవాళ్లు ఉన్నాయి. అందులో పెద్దది దాదాపు 1,400 మీటర్ల పొడవు ఉంది. ఇప్పుడు అదే డైరెక్షన్లో దానిపైనే కొత్త రన్‌వే నిర్మించనున్నారు. దాని పక్కన గ్లైడర్స్ దిగేందుకు మరో చిన్న రన్‌వే కూడా ఉంది. దానిని కూడా పునరుద్ధరించే యోచనలో ఉన్నారు. సొంతంగానే నిర్మాణం హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జీఎమ్మార్ సంస్థ నిర్మించింది. ఎయిర్‌పోర్టుకు 150 కి.మీ. పరిధిలో మరో విమానాశ్రయం నిర్మించకూడదన్న నిబంధన ఉంది. వరంగల్ ఎయిర్‌పోర్టుకు ఇది అడ్డంకిగా మారటంతో జీఎమ్మార్ సంస్థతో సంప్రదింపులు జరిపారు. వరంగల్ విమానాశ్రయాన్ని కూడా దానికే కేటాయించేలా కూడా చర్చలు జరిగాయి. చివరకు ఆ నిబంధనపై అభ్యంతరం పెట్టకూడదన్న దిశలో చర్చలు సానుకూలంగా జరిగాయి. ఆ మేరకు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎన్ఓసీ తీసుకుంది. ఇప్పుడు ప్రైవేట్ సంస్థలకు కేటాయించకుండా సొంతంగానే వరంగల్ ఎయిర్‌పోర్టును చేపట్టాలని అది నిర్ణయించింది. – విమానాశ్రయానికి 700 మీటర్ల దూరంలో ఉన్న వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిని మళ్లించాల్సిన పరిస్థితి తలెత్తింది. దాదాపు కిలోమీటరు నిడివితో భారీ సొరంగమార్గం నిర్మించి వాహనాలను దాని గుండా మళ్లించాలని ప్రతిపాదించారు. కానీ దీనికి భారీ ఖర్చు అవుతున్నందున, దాని బదులు బైపాస్‌రోడ్డు నిర్మించాలన్న ప్రత్యామ్నాయ ప్రతిపాదనపై ఇప్పుడు పరిశీలిస్తున్నారు. – వరంగల్ మెగా టెక్స్టైల్ పార్కులో జపాన్, తైవాన్ లాంటి విదేశీ సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయి. ఇవి కార్గో ఫ్లైట్ సేవలు కోరుతున్నాయి. కార్గో ఫ్లైట్ ఆపరేషన్ జరగాలంటే పెద్ద రన్‌వే ఉండాలి. దీంతో అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయంగానే దీనిని రూపొందించబోతున్నారు. మూడేళ్ల వయబిలిటీ గ్యాప్ ఫండ్.. మామునూరు విమానాశ్రయాన్ని ‘ఉడాన్’లోని రీజినల్ కనెక్టివిటీ స్కీంతో అనుసంధానించనున్నారు. ఇందులో మూడేళ్ల కాలానికి కేంద్రం వయబిలిటీ గ్యాప్ ఫండ్ అందిస్తుంది. రూట్ల వారీగా బిడ్డింగ్ నిర్వహిస్తే వాటిల్లో ఎంపికైన ఆపరేటర్లకు ఆయా రూట్లు కేటాయిస్తారు. ఆ ఆపరేటర్లు మాత్రమే ఆ రూట్లలో మూడేళ్లపాటు విమాన సర్వీసులు నిర్వహిస్తారు. ఈ కాలంలో సీట్ల వారీగా నష్టాలను బేరీజు వేసి.. డిమాండ్ అంచనా–వాస్తవ డిమాండ్.. ఈ రెంటి మధ్య ఉండే గ్యాప్‌ను కేంద్రం భర్తీ చేస్తుంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వ కాంట్రిబ్యూషన్ కూడా ఉంటుంది. వేయి ఎకరాలు అవసరం కొత్త విమానాశ్రయానికి వేయి ఎకరాలు కావాలి. నిజాం కాలం నాటి పాత విమానాశ్రయానికి చెందిన 696 ఎకరాలు ప్రస్తుతం ఏఏఐ అధీనంలోనే ఉన్నాయి. మిగతా భూమిని రాష్ట్ర ప్రభుత్వం సేకరించాల్సి ఉంది. విమానాశ్రయం నిర్మించేందుకు రూ. 800 కోట్లు ఖర్చవుతాయని అంచనా. త్వరలో ఏఏఐ డీపీఆర్ సిద్ధం చేయనుంది. -
Vizag Green Field Airport: వైజాగ్ గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్‌కు రూ.4వేల కోట్లు
వైజాగ్‌లో గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం కోసం జీఎంఆర్ సంస్థ రూ.4,000 కోట్ల రుణాన్ని ఏర్పాటు చేసుకుంది. ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ (ఐఐఎఫ్‌సీఎల్) నేతృత్వంలోని కన్సార్టియం ఈ నిర్మాణ సమూహానికి నిధులు సమకూరుస్తుంది. ఐఐఎఫ్‌సీఎల్ 14 ఏళ్లకు 10 శాతం వడ్డీ చొప్పున ఈ రుణాన్ని ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఎయిర్పోర్ట్ నిర్మాణ సమయంలో, కార్యకలాపాలు మొదలైన ఏడాది వరకు రుణం చెల్లింపుపై మారటోరియం అవసరం అవుతుందని ఐఐఎఫ్‌సీఎల్ తెలిపింది. ఆర్ఈసీ, పీఎఫ్సీ వంటి ప్రభుత్వ రంగ సంస్థలు బ్యాంకింగ్ కన్సార్టియంలో భాగమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. భవిష్యత్తులో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాల అభివృద్ధికి నిధులు సమకూర్చడానికి సంస్థ ఆసక్తిగా ఉన్నట్లు ఐఐఎఫ్‌సీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ పీఆర్ జైశంకర్ తెలిపారు. వైజాగ్ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాన్ని 2200 ఏకరాల్లో భోగాపురంలో నిర్మిస్తున్నారు. దీన్ని ప్రధానంగా సాయుధ దళాల అవసరాలను తీర్చడానికి ప్రస్తుత విమానాశ్రయానికి ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేస్తున్నారు. -
డిసెంబర్లోనే అయోధ్య ఎయిర్పోర్ట్ సేవలు!
న్యూడిల్లి: అయోధ్యలోని భవ్య రామ మందిరం వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అయితే అంతకంటే ముందే అయోధ్యలో ఎయిర్‌పోర్టు ప్రారంభం కానుంది. ఇప్పటికే విమానశ్రయం నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని అంతా సజావుగా సాగితే ఈ ఏడాది డిసెంబరులోనే ఇక్కడి నుండి రాకపోకలు మొదలయ్యే అవకాశముందని చెబుతోంది సివిల్ ఏవియేషన్ శాఖ. బ్లూప్రింట్ విడుదల.. అయోధ్య రామ మందిరం ప్రారంభానికి ముందు.. డిసెంబరులోనే ఇక్కడి ఎయిర్‌పోర్టు సేవల అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మర్యాద పురుషోత్తమ శ్రీరామ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుగా పిలవబడే.. ఈ పోర్టు విస్తీర్ణంలో కూడా ఇప్పుడున్న ఎయిర్‌పోర్టుకి ఐదు రేట్లు పెద్దదిగా ఉండబోతోందని విమానయాన శాఖ అధికారులు విడుదల చేసిన బ్లూప్రింట్‌లో స్పష్టమవుతోంది. హైదరాబాద్‌కు సేవలు? ఇప్పటికే మొదటి దశ నిర్మాణ పనులు పూర్తయ్యాయని మొదటిగా ఢిల్లీ, ముంబై, బెంగళూరు హైదరాబాద్ నగరాలకు విమాన సేవలు ప్రారంభమవుతాయని స్పష్టం చేశాయి అయోధ్య ఎయిర్‌పోర్టు వర్గాలు. ఇదిలా ఉండగా ప్రస్తుతమున్న ఎయిర్‌పోర్టులో టెర్మినల్ బిల్డింగ్ విస్తీర్ణం 6520 చ.మీటర్లు కాగా బిజీ సమయాల్లో కనీసం 500 మంది ప్యాసింజర్ల వరకు సౌకర్యవంతంగా ఉండేలా దీనిని నిర్మించారు.ఇక 2200 మీటర్ల పొడవైన రన్‌వే కలిగిన ఈ విమానాశ్రయంలో ఒకేసారి నాలుగు విమానాలను నిలిపే సామర్ధ్యముంది. రెండో దశ నిర్మాణంలో.. బ్లూప్రింట్ ఆధారంగా చూస్తే రెండో దశలో నిర్మించబోయే ఎయిర్‌పోర్టులో భారీ ప్రమాణాలతో కూడిన మరిన్ని సౌకర్యాలు కొలువు తీరబోతున్నట్లు తెలుస్తోంది. 30,000 చ.మీటర్ల విస్తీర్ణంలో నిర్మించబోయే నూతన టెర్మినల్ భవనం బిజీ సమయాల్లో కనీసం 3200 మంది ప్రయాణికులకు సౌకర్యం కల్పించనున్నారు. ఇక దీనికి 2200 నుండి 3125 మీటర్ల వరకు రన్ వేను ఎక్స్టెండ్ చేయనున్నారు. రెండో దశలో నిర్మించబోయే టెర్మినల్ వద్ద కనీసం ఎనిమిది ఏ-321 విమానాలను పార్క్ చేయవచ్చని బ్లూప్రింట్‌లో స్పష్టమవుతోంది. ప్రారంభోత్సవం ఎప్పుడంటే.. రామమందిరం నిర్మాణం పూర్తికాక ముందే ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య విపరీతంగా పెరిగిన నేపథ్యంలో మందిరం నిర్మాణం పూర్తయ్యేసరికి భక్తుల తాకిడి మరింత పెరిగే అవకాశముండటంతో రెండో టెర్మినల్ నిర్మాణం ఆవశ్యమని అందుకే దీని నిర్మాణం త్వరితగతిన పూర్తిచేశామని ఈ విమానాశ్రయం భక్తులకు గేట్వేగా వ్యవహరించనుంది తెలిపింది కేంద్ర విమానయాన శాఖ. శరవేగంగా నిర్మాణ పనులను పూర్తి చేసుకుంటున్న ఈ రామ మందిరం ప్రారంభోత్సవం వచ్చే ఏడాది జనవరి 22-24 మధ్యలో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరగనుంది. #Ayodhya Airport New Terminal construction progress. PC-Ayodhya Story pic.twitter.com/1z4HTrJn0E — Chandrashekhar Dhage (@cbdhage) September 11, 2023 ఇది కూడా చదవండి: గణేష్ మండపంలో బుర్ఖాతో డ్యాన్సులు.. అరెస్టు -
కాంట్రాక్టులన్నీ అదానీకే ఎందుకు: రాహుల్
న్యూఢిల్లీ: దేశంలోని ఆరు ఎయిర్‌పోర్టుల కాంట్రాక్టులను అదానీ గ్రూప్‌కే కట్టబెట్టడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంద్రాన్ని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ మేజిక్‌తో అదానీ లాభపడ్డారని పేర్కొన్నారు. సోమవారం మిత్ర–కాల్ పేరుతో రాహుల్ గాంధీ తన సామాజిక మాధ్యమ ఖాతాల్లో ఒక వీడియోను విడుదల చేశారు. ‘మిత్ర–కాల్లో కబ్జారాజ్యం నడుస్తోంది. విమానాశ్రయాలు, పోర్టులు, రోడ్లు, భద్రతాబలగాలు, మీడియా, బొగ్గు, ఇంధనం..ఇలా అన్నిటిపై పెత్తనాన్ని ఒక్కరికే అప్పగించారు. వీటిపై మీడియా మాట్లాడదు. నా ప్రశ్నలకు ప్రధాని మోదీ సమాధానం చెప్పరు’అని రాహుల్ ఆ వీడియోలో పేర్కొన్నారు. అదానీ గ్రూప్‌లో అక్రమాలు, దేశ సంపద లూటీ అవుతున్న తీరుపై పార్లమెంట్లో వెల్లడించిన నిజాలను ప్రభుత్వం రికార్డులనుంచి తొలగించిందని అందులో పేర్కొన్నారు. ‘ఫకీర్ తన మేజిక్‌తో సంచీలోంచి తీసిన ఎయిర్‌పోర్టును అదానీ చేతుల్లో పెట్టారు’అంటూ ఆయన ట్వీట్ చేశారు. గుత్తాధిపత్యాన్నే వ్యతిరేకిస్తాను తప్ప వ్యాపార సంస్థలను కాదని రాహుల్ చెప్పారు. -
సినిమా రేంజ్లో డ్రామా నడిపిన చంద్రబాబు.. అంతా డూపే..
కావలి: దామవరం విమానాశ్రయాన్ని అప్పటి టీడీపీ ప్రభుత్వం ఆద్యంతం డూప్ షోగా సాగించింది. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్మించాల్సిన ఎయిర్‌పోర్టు శంకుస్థాపన డూప్ షో చేసింది. ఐదేళ్లూ అధికారంలో ఉండీ ఏ బడ్జెట్లోనూ రూపాయి నిధులు కేటాంచని చంద్రబాబు ఎన్నికల నోటిఫికేషన్‌కు రెండు వారాల ముందు హడావుడిగా స్టిక్కర్లతో శిలాఫలాలు వేసి శంకుస్థాపన చేశారు. ఎయిర్‌పోర్టు నిర్మాణ కాంట్రాక్ట్ దక్కించుకున్న సంస్థ ప్రతిపాదిత భూముల్లో పిచ్చిమొక్క కూడా పీకలేదు. దీన్ని బట్టి కాంట్రాక్టర్ డూప్ అని తేటతెల్లమైంది. జిల్లాకే ప్రతిష్టాత్మకమైన దామవరం ఎయిర్‌పోర్టుకు టీడీపీ నేతల భూ దోపిడీనే శాపంగా మారింది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని టీడీపీ నేతలు భూ దోపిడీ పర్వాన్ని కొనసాగించారు. ఆ శాపం నుంచి విముక్తి కలిగించేందుకు మూడున్నరేళ్లుగా ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తున్నా సానుకూల ఫలితాలు రావడం లేదు. ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన ప్రతిపక్ష నేత చంద్రబాబు దామవరంలో విమానాశ్రయ నిర్మాణం చేపట్టలేదని రాష్ట్ర ప్రభుత్వంపై చేసిన విమర్శలు స్వయంగా ఆ పార్టీ నేతలనే ఖంగుతినేలా చేశాయి. భూ రాబందుల్లా మారిన టీడీపీ నేతల నిర్వాకం కారణంగానే విమానాశ్రయ నిర్మాణం నిలిచిపోయిందని జిల్లా అంతా తెలిసినా చంద్రబాబు మాత్రం యథావిధిగా ప్రభుత్వంపైనే ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా మారింది. భూ దోపిడీ ద్వారా విమానాశ్రయ నిర్మాణానికి సైంధవుల్లా అడ్డుపడిన జిల్లా నేత, భూ దందా చేసిన నియోజకవర్గ ఇన్చార్జి, అతని బినామీని పక్కన పెట్టుకునే చంద్రబాబు పసలేని విమర్శలు చేయడం విశేషం. ఇదీ విమానాశ్రయం కథ జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేసే క్రమంలో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 2008లో జిల్లా పర్యటనలో విమానాశ్రయాన్ని ప్రకటించారు. నెల్లూరు, ప్రకాశం జిల్లాల ప్రజలకు అందుబాటులో ఉండేలా, జాతీయ రహదారిని ఆనుకుని రవాణాకు సౌకర్యంగా ఉండేలా కావలి నియోజకవర్గంలోని దామవరం వద్ద విమానాశ్రయ నిర్మాణానికి అధికారులు ప్రణాళికలు రూపొందించారు. మొత్తం 2,300 ఎకరాల్లో భారీ విమానాశ్రయం నిర్మించేలా డీపీఆర్ కూడా సిద్ధం చేశారు. ఈ క్రమంలోనే దురదృష్టవశాత్తు ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అకాల మరణం చెందడంతో అనంతరం ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చిన కొణిజేటి రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వాలు దృష్టి పెట్టలేదు. 2009–2014 మధ్య విమానాశ్రయ నిర్మాణంపై నిర్లిప్తత ఆవరించగా భూసేకరణ ప్రక్రియ నత్తనడకన సాగింది. 2014లో టీడీపీ అధికారంలో రావడంతో విమానాశ్రయ అంశం మరోమారు తెరపైకి వచ్చింది. అధికారం అండ చూసుకుని టీడీపీ నేతలు విమానాశ్రయం నిర్మించ తలపెట్టిన భూములు ఉన్న ప్రాంతంపై రాబంధుల్లా వాలిపోయారు. ఎయిర్‌పోర్టు ప్రతిపాదిత ప్రభుత్వ, ప్రైవేట్ భూములపై పడి నకిలీ రిజిస్ట్రేషన్లు, నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారు. దీంతో మండల స్థాయి అధికారుల నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు విమానాశ్రయం కోసం భూసేకరణ వ్యవహారం తల»ొప్పి కట్టేలా చేసింది. దామవరం ప్రతిపాదిత విమానాశ్రయ నిర్మాణ భూముల అసలు యజమానులు ఎవరో, నకిలీలు ఎవరో తేల్చుకోలేక అధికారులు భీతిల్లిపోయారు. ఏ నిర్ణయం తీసుకుంటే తమ ఉద్యోగాలకు ఎసరు తెస్తుందో అని వణికిపోయారు. ఈ క్రమంలో 2016లో అప్పటి కలెక్టర్‌గా ఉన్న జానకి దామవరంలో విమానాశ్రయ నిర్మాణానికి భూసేకరణ చేయడం సాధ్యం కాదని, అన్నీ కూడా వివాదాస్పద భూములే అని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఈ నేపథ్యంలో 2017 మే నెల 18న నెల్లూరుకు వచ్చిన అప్పటి రాష్ట్ర పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు కల్పన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్‌జైన్, కలెక్టర్, జాయింట్ కలెక్టర్‌తో సమావేశం ఏర్పాటు చేసి, దామవరంలో విమానాశ్రయం నిర్మాణ ప్రతిపాదనలను రద్దు చేసి, దానిని పక్క జిల్లాలకు తరలించడానికి చర్యలు తీసుకుంటున్నట్లుగా ప్రకటించారు. దీంతో అన్ని రాజకీయ పారీ్టలు అధికార టీడీపీ నేతల వైఖరిని తూర్పార బట్టాయి. ప్రజల్లో కూడా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే కదలిక 2019లో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం వచ్చాక విమానాశ్రయ నిర్మాణానికి భూ సేకరణపై దృష్టి పెట్టి వివాదాలు పరిష్కరిస్తూ 1,310 ఎకరాలు సేకరిచింది. కేంద్ర విమానాయన శాఖకు చెందిన ‘ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా’ దామవరంలో విమానాశ్రయ నిర్మాణానికి సాంకేతిక అనుమతులు మంజూరు చేసింది. అయితే చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేసిన విమానాశ్రయ నిర్మాణ సంస్థ తమ వద్ద నిధులు లేవని ఏడాదిన్నర తర్వాత చావు కబురు చల్లగా చెప్పింది. ఈ క్రమంలో నిర్మాణ ప్రక్రియ మొదటికి వచ్చింది. ఈ నేపథ్యంలో కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఇటీవల ముంబయికి చెందిన విమానానాశ్రయ నిర్మాణ సంస్థ ప్రతినిధులను సంప్రదించి వారిని దామవరం తీసుకొచ్చి భూములు, విమానాశ్రయ లాభదాయక నిర్వహణ అంశాలను తెలియజేశారు. ఇది ప్రైవేట్, ప్రభుత్వం భాగస్వామ్యంతో నిర్మించి, నిర్వహించే విమానాశ్రయం కావడంతో ఈ రంగంలో అనుభవం ఉన్న పెట్టుబడిదారులను ఆకర్షించే పనిలో కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఉన్నారు. చంద్రబాబు ప్రభుత్వం నడిపిన డ్రామా దామవరం వద్ద ఎయిర్‌పోర్టు రద్దు వివాదం నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం సరికొత్త డ్రామాకు తెరతీసింది. ఇక్కడే ఎయిర్‌పోర్టును నిర్మిస్తున్నట్లు మళ్లీ ప్రకటించి రెండేళ్లకు పైగా షో చేసింది. తొలుత ప్రతిపాదిత భూ విస్తీర్ణాన్ని కుదించింది. - 1,352 ఎకరాల్లో రూ.398.56 కోట్లతో దామవరంలో విమానాశ్రయం నిర్మించడానికి సెప్టెంబర్ 2017లో ఓ నిర్మాణ సంస్థకు చంద్రబాబు బాధ్యతలు అప్పగించారు. - ఈ మేరకు 21 జూన్ 2018లో ఆ నిర్మాణ సంస్థతో ప్రభుత్వం అగ్రిమెంట్ చేసుకుంది. ఆ అగ్రిమెంట్లో నిర్మాణ సంస్థ తన ఆర్థిక వనరులను కనపరచాల్సి ఉంది. అయితే అదే ఏడాది డిసెంబర్ 21వ తేదీ వరకు కూడా నిర్మాణ సంస్థ తన ఆర్థిక వనరులను ప్రభుత్వానికి చూపలేదు. ఇదొక బోగస్ నిర్మాణ సంస్థ అని తెలిసినా.. అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు అసెంబ్లీ ఎన్నికలు సమీపించడంతో ప్రజలను మభ్యపెట్టేందుకు విమానాశ్రయ నిర్మాణానికి 11 జనవరి 2019 శంకుస్థాపన చేశారు. - ఆ తర్వాత ఎన్నికలు జరిగాయి. ప్రభుత్వం మారింది. ఎయిర్‌పోర్టు నిర్మాణ కాంట్రాక్ట్ పొందిన సంస్థ పనులు ప్రారంభిస్తుందని ఏడాది పాటు ప్రభుత్వం ఎదురు చూసింది. పలుమార్లు నోటీసులు జారీ చేసింది. అయినప్పటికీ నిర్మాణ సంస్థ నుంచి ఎటువంటి ప్రతిపాదనలు రాకపోవడంతో 15 జూలై 2019లో నిర్మాణ సంస్థతో ప్రభుత్వం అగ్రిమెంట్‌ను రద్దు చేసింది. - దీన్ని బట్టి నిర్మాణ సంస్థ ఓ బోగస్, శంకుస్థాపన ఒక డూప్ షో అని తేలిపోయింది. దామవరంలోనే విమానాశ్రయం దామవరంలో విమానాశ్రయ నిర్మాణానికి టీడీపీ నాయకులు చేసిన దుర్గార్మాలు దారుణాల వల్లే సమస్య జఠిలంగా మారింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే భూసేకరణ చిక్కుముళ్లను ఎలా హ్యాండిల్ చేయాలో తెలియక అధికారులు దామవరంలో విమానాశ్రయం నిర్మించడానికి సాధ్యపడలేదన్నారు. ఎన్నికలకు ముందు అదే చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఇవన్నీ టీడీపీ ప్రజలను వంచిచే పనులకు పరాకాష్ట. దామవరం విమానాశ్రయ నిర్మాణానికి సంక్లిష్టతగా మారిన భూసేకరణ సమస్యను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అధిగమించింది. కేంద్ర ప్రభుత్వ అనుమతులు కూడా మంజూరు చేయించగలిగింది. అయితే నిర్మాణానికి పెట్టుబడులు పెట్టే వారికి కోసం ప్రయత్నాలు చేస్తున్నాం. – రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే, కావలి -
‘ప్రకాశం’లో ఎయిర్‌పోర్టు
అద్దంకి: ప్రకాశం జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటు ప్రక్రియ వేగ వంతమైంది. కలెక్టర్, ఆర్డీవో ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు 1000 ఎకరాల భూములను గుర్తించడానికి వారం రోజుల నుంచి కసరత్తు చేస్తున్నారు. అద్దంకి మండలంలోని తిమ్మాయపాలెం, అద్దంకి ప్రాంతాల్లో తహసీల్దార్ జే ప్రభాకర్‌రావు పర్యవేక్షణలో అనుకూలమైన భూములను గుర్తించి, మ్యాప్‌ను సిద్ధం చేశారు. ఈ మ్యాప్‌ను శనివారం ఉన్నతాధికారులకు పంపారు. ప్రాథమికంగా అధికారులు సిద్ధం చేసిన నివేదిక ప్రకారం అద్దంకి లేదా తిమ్మాయపాలెం ప్రాంతంలో విమానాశ్రయం ఏర్పాటు కానుంది. అద్దంకి, బొడ్డువానిపాలెం మధ్యలో 1,600 ఎకరాల భూమి పరిశీలన.. అద్దంకి పట్టణంలోని మేదరమెట్ల–నార్కెట్‌పల్లి రాష్ట్రీయ రహదారిలో ధేనువకొండ పునరావాస కాలనీ బలరామకృష్ణపురం సమీపం నుంచి, కొరిశపాడు మండలంలోని బొడ్డువానిపాలెం గ్రామ పొలాలను పరిశీలించారు. ఇక్కడ 1600 ఎకరాల భూమి విమానాశ్రయం ఏర్పాటుకు అనుకూలంగా ఉంటుందని గుర్తించారు.అందులో 109 ఎకరాలు మాత్రమే ప్రభుత్వ భూమి ఉంది. ఇక్కడ విమానాశ్రయం ఏర్పాటుకు 1000 ఎకరాలు అవసరం కాగా ప్రభుత్వ భూమిపోను 900 ఎకరాల పట్టా భూములను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. తిమ్మాయపాలెం కుంకుపాడు రోడ్డుకు పడమరగా.. మండలంలోని తిమ్మాయపాలెంలో కుంకుపాడు రోడ్డునుంచి, ఆంజనేయస్వామి విగ్రహం వద్ద నుంచి వెళ్లే డొంక మధ్యలోని 1,400 ఎకరాల భూమిని అధికారులు గుర్తించారు. ఇందులో 311 ఎకరాల డాటెడ్ ల్యాండ్‌తోపాటు, వాగులు, వంకలు, డొంకలకు సంబంధించిన ప్రభుత్వ భూమి ఉంది. అంటే అవసరమైన 1000 ఎకరాల భూమిలో ప్రభుత్వ భూమి పోను, 689 ఎకరాల ప్రైవేటు భూములు అవసరం అవుతాయని అధికారులు గుర్తించారు. -
రన్‌వేకు అనుకూలమేనా?
సాక్షి, ఆదిలాబాద్: ఆదిలాబాద్‌లో విమానాశ్రయ ఏర్పాటుకు ఆరేళ్లుగా కసరత్తు జరుగుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎయిర్‌పోర్టుల ఏర్పాటుకు చర్యలు చేపట్టడంతో ఒక్కో అధికారుల బృందం ఒక్కో అంశాన్ని పరిశీలిస్తోంది. జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటుకు అనుకూలంగా ఉన్న అంశాలేంటి.? ప్రతికూల పరిస్థితులేంటి.? అనే దానిపై క్షేత్రస్థాయికి వెళ్లి ఆరా తీస్తున్నాయి. వాతావరణ పరిస్థితులు, గాలివాటం, కావాల్సిన స్థలం, రన్‌వే ఏర్పాటుకు మట్టి నమునాల సేకరణ, పెద్దపెద్ద భవనాలు, విద్యుత్ టవర్ల తొలగింపు, తదితర అంశాలను అధ్యయనం చేస్తూ ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందజేస్తున్నాయి. ఇందులో భాగంగా సాయిల్ ఇన్వెస్టిగేషన్ కన్సల్టెంట్ (నేల దర్యాప్తు సలహాదారు) బృందం సభ్యులు సోమవారం రాత్రి జిల్లాకు చేరుకున్నారు. వారం రోజుల పాటు ఇక్కడే ఉండి మట్టి నమూనాలు సేకరించనున్నారు. అయితే నమూనాల సేకరణకు ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) నుంచి అనుమతి రాలేదని, అనుమతి రాగానే మట్టి నమూనాలను సేకరిస్తామని బృందం సభ్యులు తెలిపారు. ఒక్కో బృందం.. ఒక్కో అంశంపై పరిశీలన జిల్లాలో ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా అధికారుల బృందం 2014లో భూమి సర్వే చేపట్టింది. అప్పట్లో ఐదు రోజుల పాటు సర్వే చేసిన అధికారులు ప్రభుత్వ, ప్రైవేట్ భూములు కలిపి 1,562 ఎకరాలు ఉన్నట్లు గుర్తించారు. అనంతరం మూడేళ్ల వరకు విమానాశ్రయ ఏర్పాటులో ఎలాంటి కదలిక లేదు. 2017లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఉడాన్’ పథకంలో భాగంగా రాష్ట్రంలో ఎయిర్‌పోర్టుల ఏర్పాటుపై కదలిక వచ్చింది. ఈ పథకం కింద రాష్ట్రంలోని ఆరు విమానాశ్రయాల ఏర్పాటుకు కేంద్రం అవకాశం కల్పించింది. ఇందులో ఆదిలాబాద్ కూడా ఉండడంతో విమానాశ్రయ ఏర్పాటుపై మళ్లీ ఆశలు చిగురించాయి. అయితే 2019 ఆగస్టులో ఎయిర్పోర్ట్ ఆథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) అధికారుల బృందం జిల్లాకు వచ్చి ఇక్కడి వాతావరణ పరిస్థితులపై అధ్యయనం చేసింది. విమానాశ్రయానికి కావాల్సిన స్థలం, బౌండ్రీలు, గుట్టలు, విద్యుత్ టవర్లు, పెద్ద భవనాలు, ట్రాఫిక్, వ్యాపార అభివృద్ధి అవకాశాలు, తదితర వాటిని పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. నేటి నుంచి మట్టి నమూనాల సేకరణ విమానాశ్రయం ఏర్పాటులో భాగంగా రన్‌వే స్థలంలో ఉన్న మట్టిని పరిశీలించేందుకు నేల దర్యాప్తు సలహాదారు (సాయిల్ ఇన్వెస్టిగేషన్ కన్సల్టెంట్) బృందం సభ్యులు జిల్లాకు వచ్చారు. విమానాశ్రయ స్థలంలో ఉన్న మట్టి రన్‌వేకు అనుకూలంగా ఉందా.? లేదా.. అనేది తేల్చేందుకు మట్టి నమూనాలు సేకరించనున్నారు. అయితే మంగళవారం వరకు ఏఏఐ నుంచి మట్టి నమూనాల సేకరణకు అనుమతి రాకపోవడంతో బృందం సభ్యులు అక్కడే టెంట్ వేసుకొని ఉన్నారు. అనుమతి రాగానే నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపుతామని, తద్వారా ఇక్కడున్న మట్టిని దృష్టిలో ఉంచుకొని రన్‌వే ఏ విధంగా డిజైన్ చేయొచ్చనే ఐడియా వస్తుందని అధికారులు పేర్కొంటున్నారు. కాగా, బుధవారం మధ్యాహ్నం వరకు అనుమతి వస్తే సాయంత్రం నుంచి మట్టి నమూనాలు సేకరించనున్నట్లు బృందం సభ్యులు తెలిపారు. త్వరలో మరో బృందం? ఆదిలాబాద్‌లో విమానాశ్రయ ఏర్పాటుకు పరిస్థితులన్నీ అనుకూలించడంతో త్వరలో మరో అధికారుల బృందం జిల్లాకు రానున్నట్లు సమాచారం. ఇక్కడి సాంకేతిక అంశాలపై ఆ బృందం పరిశీలన చేయనున్నట్లు తెలుస్తోంది. విమానాశ్రయానికి దగ్గరగా ఎలాంటి విద్యుత్ టవర్లు ఉండకూడదు. అయితే రన్‌వే స్థలానికి కొద్ది రూపంలో అనుకుంట గ్రామ శివారులో విద్యుత్ టవర్లు ఉన్నాయి. వాటిని తీసి కొత్త చోట ఏర్పాటు చేయడమా.? లేక విమానాశ్రయ డిజైన్‌ను మార్చడమా.? అనే దానిపై ఆ బృందం ఆరా తీయనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. దీంతో పాటు భూమి స్వాధీనం, విమానాశ్రయం చుట్టు పక్కల అనుకూలతలను పరిశీలన చేయనున్నట్లు తెలుస్తోంది. మట్టి నమూనాలు సేకరిస్తారు విమానాశ్రయ ఏర్పాటు విషయమై జిల్లాకు వచ్చిన అధికారుల బృందాలకు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తున్నాం. ఇప్పుడు వచ్చిన సాయిల్ ఇన్వెస్టిగేషన్ బృందం రన్‌వే ఏర్పాటు కోసం మట్టి నమూనాలు సేకరించనుంది. ఇందుకు సభ్యులకు లోకేషన్, ఇక్కడి పరిస్థితులు, స్థలం, బౌండ్రీలు తదితర విషయాలను వివరించాం. రాబోయే రోజుల్లో మరిన్నీ పరిశీలనలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. – సురేశ్ రాథోడ్, ఆర్అండ్బీ డిప్యూటీ ఈఈ -
గ్రీస్ విమానాశ్రయం ప్రాజెక్ట్ జీఎంఆర్ చేతికి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనుబంధ కంపెనీ జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ (జీఏఎల్) గ్రీస్ క్రీట్లోని హెరాక్లియోన్ అంతర్జాతీయ విమానాశ్రయం డిజైన్, నిర్మాణం, ఫైనాన్సింగ్, ఆపరేషన్, నిర్వహణ బిడ్‌ను దక్కించుకుంది. దీంతో యూరోపియన్ ఎయిర్పోర్ట్ నిర్వహణ బిడ్ గెలిచిన తొలి భారతీయ ఎయిర్పోర్ట్ ఆపరేటర్‌గా జీఎంఆర్ నిలిచింది. జీఏఎల్, దాని గ్రీస్ భాగస్వామి జీఈకే టెర్నా కన్సార్టియం గతేడాది ఫిబ్రవరిలో కన్సెషన్ అగ్రిమెంట్ మీద సంతకాలు చేసిన విషయం తెలిసిందే. విమానాశ్రయ అభివృద్ధికి ఈ కన్సార్టియం 500 మిలియన్ యూరోలకు పైగా పెట్టుబడులు పెట్టనుంది. ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్ నిర్మాణానికి గ్రీస్ ప్రధాన మంత్రి కిరియాకోస్ మిత్సోటాకిస్ పునాది రాయి వేశారు. ఈ సందర్భంగా జీఎంఆర్ గ్రూప్ ఎనర్జీ అండ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్స్ చైర్మన్ శ్రీనివాస్ బొమ్మిడాలా మాట్లాడుతూ.. హెరాక్లియోన్ విమానాశ్రయ బిడ్‌తో జీఎంఆర్ గ్రూప్ ఈయూ రీజియన్‌కు ఎంట్రీ ఇచ్చినట్లయిందన్నారు. ప్రతిష్టాత్మక ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్‌లో భాగస్వామ్యం కావటం ఆనందంగా ఉందని తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఎయిర్‌పోర్ట్‌ను నిర్మిస్తామని చెప్పారు. ప్రాజెక్ట్ కన్సేషన్ పీరియడ్ 35 ఏళ్లు. ఈ ప్రాజెక్ట్‌కు స్థానిక గ్రీస్ ప్రభుత్వం ఈక్విటీ, ఇప్పటికే ఉన్న ఎయిర్‌పోర్ట్స్ నుంచి నిధులను సమకూరుస్తుంది. హెరాక్లియోన్ గ్రీస్‌లోని రెండో అతిపెద్ద విమానాశ్రయం. గత మూడేళ్లుగా 10 శాతం ట్రాఫిక్ వృద్ధిని నమోదు చేస్తుంది. ప్రపంచంలోని ఉత్తమ పర్యాటక ప్రాంతాల్లో గ్రీస్ ఒకటి. ఏటా 33 మిలియన్ల మంది పర్యాటకులు వస్తుంటారు. క్రిట్ అత్యధిక పర్యాటకులను ఆకర్షించే ద్వీపం. -
ఎన్నికల వేళ మరో సర్వే
దొనకొండ (ప్రకాశం): ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న దొనకొండ విమానాశ్రయం నిర్మాణం ఎప్పుడు పూర్తి స్థాయిలో కొలిక్కి వస్తుందో అంతుబట్టడంలేదు. ఢిల్లీ ఏరోనాటికల్ సర్వే విభాగానికి చెందిన అసిస్టెంట్ మేనేజర్ అరివోళి, సర్వేయర్ దినేష్ సెల్వకుమార్‌లు చేపట్టిన ఎయిర్పోర్ట్ సర్వే బుధవారంతో ముగిసింది. దొనకొండలోని భవనాలు ఎంత ఎత్తులో ఉన్నాయి. టవర్స్, నీళ్ల ట్యాంకులు, దొనకొండ విస్తీర్ణం గుర్తించారు. రీజినల్ కనెక్టివ్ స్కీమ్ కింద అబ్స్ట్రాక్టర్ ఓరల్ లిమిటేషన్ ద్వారా సర్వే చేశారు. 476.66 ఎకరాల్లో ఎయిర్ పోర్టు అభివృద్ధి దొనకొండలో రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ఏర్పాటు చేసిన ఎయిర్ పోర్టును 476.66 ఎకరాలతో అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎయిర్‌పోర్ట్‌ల అధికారులు తెలిపారు. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ఇంధనం నింపుకోవడానికి, సిబ్బంది విశ్రాంతి తీసుకోవడానికి దొనకొండలోని ఎయిర్‌పోర్టును ఉపయోగించే వారు. ఈ నేపథ్యంలో ఆల్ ఇండియా ఎయిర్‌పోర్టు ఆధ్వర్యంలో దీనికి పునర్వైభవం తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. 1.57 కి.మీ రన్‌వే సిబ్బందితో సాయంతో రన్‌వే సర్వే చేపట్టారు. ఈశాన్యం నుంచి నైరుతి మూలకు 1.57 కి.మీ రన్‌వే అవసరముందని గుర్తించారు. ఎయిర్పోర్ట్ పూర్తి చేయడానికి రూ.200 కోట్లు అవసరం అవుతుందని నివేదించారు. సర్వే నంబర్ 14లో 136.5 ఎకరాల్లో ఎయిర్‌పోర్టు నిర్మించారని, దీన్ని అభివృద్ధి చేసేందుకు మరో 340.16 ఎకరాలు అవసరమని వివరించారు. ఇక్కడ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీ అవసరాల నిమిత్తం నిమిత్తం రన్‌వే ఉపయోగపడుతుందంటున్నారు. దొనకొండ ప్రాంతం ఎయిర్‌పోర్ట్‌కు అనుకూలంగా ఉంటుందో లేదో సిబ్బంది క్షుణ్ణంగా పరిశీలించారు. గతంలో బ్రిటిష్‌వారు ఎయిర్పోర్ట్ నిర్మించారు కాబట్టే నేల స్వభావం బాగున్నట్లు చెప్పారు. ఎయిర్పోర్ట్ చుట్టూ 15 కి.మీలలో సర్వే ఎయిర్‌పోర్ట్‌కు చుట్టూ 15 కి. మీ వ్యాసార్థంలో ఉన్న చెట్టు, గుట్టలు, కొండలను పరిశీలించారు. గంగదొనకొండ, ఇండ్లచెరువు, వద్దిపాడు, కలివెలపల్లి కొండలను పరిశీలించి ఎత్తుగా ఉన్నట్లు గుర్తించారు. అయితే ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ఇంతవరకు ఎలాంటి బడ్జెట్ కేటాయించలేదు. తాము చేపట్టే సర్వే ప్రాథమిక సర్వేకు సంబంధించిందని.. అవసరమైతే మరోసారి సర్వే చేయాల్సి వస్తుందని అధికారులు తెలిపారు. 1575 మీటర్ల పొడవు, 60 మీటర్ల వెడల్పు, చుట్టూ ఫెన్సింగ్, రన్‌వే, సిబ్బంది వసతి గృహాలు తదితర విషయాలకు సంబంధించి ఎస్టిమేషన్ కోసం సర్వే చేశామన్నారు. సర్వే చేపట్టిన విషయాలను ఢిల్లీ ఎయిర్పోర్ట్ వారికి నివేదిక అందజేస్తామని అధికారులు తెలిపారు. ప్రజలు ఏమనుకుంటున్నారంటే.. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సర్వే చేయిస్తున్నారని, నాలుగు సంవత్సరాలు లేనిది అభివృద్ధి ఆరు నెలలో ఎలా వస్తుందని దొనకొండ ప్రాంతంలో ప్రజలు పెదవి విరిచారు. ఓటు కోసం తాపత్రయం తప్ప, అభివృద్ధి రెండు అడుగులు ముందుకు..నాలుగు అడుగులు వెనక్కి అన్నట్లుగా ఉందని చర్చించుకుంటున్నారు. ఈ ప్రాంతం అభివృద్ధిని ముఖ్యమంత్రి మరిచారు జిల్లాలో వెనకబడిన ప్రాంతం దొనకొండ. ప్రభుత్వ భూములు సుమారు 30 వేల ఎకరాలున్నాయి. 2014 ఎన్నికల ముందు దొనకొండలో ఎయిర్పోర్ట్, పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని కల్లబొల్లి మాటలు చెప్పి కాలం వృథా చేయడమే తప్ప దొనకొండకు చేసిందేమీలేదు. నిరుద్యోగ సమస్య నిర్మూలనకు పరిశ్రమలు ఏర్పాటు చేస్తాం. మీ ప్రాంతంలో ఉద్యోగాలు కల్పిస్తామన్న మాట ముఖ్యమంత్రి మరిచిపోయారు. ఎన్నికలు వచ్చే సరికి దొనకొండ ప్రాంతం గుర్తు వచ్చి ఎయిర్పోర్ట్ అభివృద్ధి చేస్తాం. పరిశ్రమలు ఏర్పాటు చేస్తామనడం విడ్డూరంగా ఉంది. – బత్తుల బాల గురవయ్య ఇంకా బడ్జెట్ కేటాయించ లేదు.. దొనకొండ విమానాశ్రయం అభివృద్ధికి బడ్జెట్ కేటాయించలేదు. ఎప్పటికి తయారవుతుందనేది మేము చెప్పలేం. ఇంకా చాలా సార్లు సర్వే చేపట్టాల్సి వస్తుంది. ఇప్పటికి చేపట్టిన సర్వే ప్రాథమిక సర్వే మాత్రమే. – అరివోళి, అసిస్టెంట్ మేనేజర్ -
ప్రజాభిప్రాయ వేదికా ? పార్టీ కార్యక్రమమా ?
భోగాపురం : మరడపాలెంలో ఎయిర్‌పోర్టు నిర్మాణంపై బుధవారం నిర్వహించిన పర్యావరణ ప్రజాభిప్రాయ వేదిక పార్టీ కార్యక్రమాన్ని తలపించిందని రైతులు దాట్ల క్రాంతి, ఉప్పాడ సూర్యనారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు. స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యాలయం వద్ద వారు విలేకరులతో మాట్లాడుతూ సమావేశానికి అందరినీ ఆహ్వానించినట్లుగా ఆహ్వానించి మార్గమధ్యలోనే పోలీసులు అరెస్టు చేసి జామి పోలీస్ స్టేషన్‌కు తరలించడం అన్యాయం అని అన్నారు. లాండ్ అక్విజేషన్ పూర్తి స్థాయిలో అవ్వకముందే ప్రజాభిప్రాయ సేకరణ ఏవిధంగా చేశారని ప్రశ్నించారు. అధికారులు అందించిన నివేదిక ప్రకారం దానిలో పొందుపరచిన అంశాలపై శాంతియుతంగా అడిగేందుకు మాత్రమే వచ్చామని, కానీ తమను అడ్డుకున్నారని చెప్పారు. రైతులు, ప్రజలతో సంబంధం లేకుండా వారికి నచ్చిన కొద్దిమందితో నిర్వహించిన సమావేశం చెల్లదని, దీనిపై కోర్టుకు వెళతామని చెప్పారు. పోలీసులు రైతులను బెదిరిస్తూ అతిగా ప్రవర్తిస్తున్నారని పేర్కన్నారు. డి పట్టా భూములకు పరిహారం విషయంలో అధికార పార్టీ నాయకులు బ్రోకర్లుగా వ్యవహరించి రైతులను భయభ్రాంతులకు గురిచేసి దందా చేస్తున్నారని విమర్శించారు. సంబంధంలేని ఎంఎల్ఏ, ఎంపీపీ, జెడ్పీటీసీలను సమావేశంలో కూర్చోబెట్టడంలో అధికారుల్లో స్వామి భక్తి ఏవిధంగా ఉందో స్పష్టమైందని చెప్పారు. కార్యక్రమంలో భైరెడ్డి ప్రభాకరరెడ్డి, ఉప్పాడ శివారెడ్డి, దాట్ల శ్రీనివాసరాజు, కొల్లి గురుమూర్తి, పట్న తాతయ్యలు, మైలపల్లి అప్పలకొండ తదితరులు పాల్గొన్నారు. -
తెరపైకి ఓర్వకల్లు విమానాశ్రయం
రెండు రోజుల్లో టెండర్లు పిలిచే అవకాశం నెలాఖరుకు భూమి అప్పగించాలని జిల్లా అధికారులకు ఆదేశాలు బీఐఏసీఎల్‌కు నిర్మాణ బాధ్యతలు ఏడాదికి సుమారు 80వేల మంది ప్రయాణిస్తారని అంచనా కర్నూలు: కర్నూలు జిల్లా ఓర్వకల్లులో విమానాశ్రయం ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. రెండు మూడు రోజుల్లో ఇందుకు సంబంధించి టెండర్లు పిలవనున్నట్లు తెలిసింది. ఈ మేరకు హైదరాబాద్‌లో నిర్వహించిన ఉన్నతాధికారుల సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. టెండర్ దాఖలైన వెంటనే భూ సేకరణ ప్రక్రియ కూడా వేగవంతం కానుంది. ఈ నెలాఖరు నాటికి విమానాశ్రయ ఏర్పాటుకు మొత్తం భూమిని అప్పగించాలని జిల్లా ఉన్నతాధికారులను ప్రభుత్వం ఆదేశించింది. మొత్తం 1,110 ఎకరాల విస్తీర్ణంలో రూ.234 కోట్లతో ఈ విమానాశ్రయం ఏర్పాటు కానుంది. ఇందులో ప్రభుత్వ భూమితో పాటు ప్రైవేటు భూమి కూడా ఉంది. అయితే, తమ భూముల్లో మైనింగ్ నిల్వలు ఉన్నందున భూములివ్వమని మొదట్లో రైతులు వ్యతిరేకించారు. ఆ తర్వాత అధికారుల చర్చల నేపథ్యంలో అంగీకారం లభించింది. విమానాశ్రయ ఏర్పాటు బాధ్యతలను ప్రభుత్వం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ కంపెనీ(బీఐఏసీఎల్)కు అప్పగించింది. ఇదీ ప్రయాణికుల లెక్క.. ఓర్వకల్లు ప్రాంతీయ విమానాశ్రయం ఏర్పడిన తర్వాత ఎంత మేరకు ప్రయాణికులు ప్రయాణిస్తారనే విషయంలో ఇప్పటికే మౌలిక సదుపాయాల సంస్థ అధికారులు ఒక అంచనా రూపొందించారు. ఏడాదికి సుమారు 80 వేల మందికిపైగా విమానయానం చేస్తారని అంచనా వేశారు. అయితే, ఈ సంఖ్య కాస్తా 2020 నాటికి లక్షా 40 వేల మందికి చేరుకుంటుందని భావిస్తున్నారు. 2030 నాటికి 4 లక్షల మంది ప్రయాణికులు ఈ విమానాశ్రయం ద్వారా ప్రయాణిస్తారని అంచనా వేశారు. అదేవిధంగా కార్గో(సరుకు రవా ణా) కూడా ఇదే స్థాయిలో అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నారు. నెరవేరనున్న వైఎస్ కల వాస్తవానికి ఓర్వకల్లు ప్రాంతంలో విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయాలనేది దివంగత నేత వైఎస్ఆర్ స్వప్నం. ఇందుకోసం 2008లోనే ఆయన సీఎంగా ఉన్న సమయంలో టెండర్లు కూడా పిలిచారు. అయితే, ఇక్కడ నుంచి విమానం ఎక్కే ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉంటుందని.. అందువల్ల మరిన్ని రాయితీలు కావాలని బిడ్డింగ్‌లో పాల్గొన్న సంస్థలు కోరాయి. ఈ నేపథ్యంలో 2009లో అధికారంలోకి వచ్చిన తర్వాత మరోసారి టెండర్లు పిలిచేందుకు ఆయన సిద్ధమయ్యారు. ఇంతలోనే ప్రమాదం జరిగి ఆయన మరణించారు. ఆ తర్వాత ఈ ప్రక్రియ కాస్తా మూలకు చేరింది. తాజాగా మరోసారి ఓర్వకల్లు విమానాశ్రయం తెరమీదకు వచ్చింది. -
భూసేకరణ ప్రక్రియ వేగవంతం
దగదర్తి: దగదర్తి మండలం దామవరం వద్ద విమానాశ్రయ నిర్మాణం చేపట్టిన భూసేకర ప్రక్రియను వేగవంతం చేసినట్లు తహసీల్దార్ మస్తానయ్య అన్నారు. తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ భూసేకరణ వివరాలు వెల్లడించారు. విమానాశ్రయ నిర్మాణం కోసం 1399.62 ఎకరాలు సేకరించేందుకు సర్వే పూర్తయిందన్నారు. మొత్తం 1399.62 ఎకరాల్లో పట్టాభూమి 357.24 ఎకరాలు, డీకేటీ ల్యాండ్ 285.40 ఎకరాలు, ప్రభుత్వ భూమి 384.30 ఎకరాలు, సీజేఎఫ్ఎస్ ల్యాండ్ 297.34 ఎకరాలు, ఇతర పోరంబోకు భూమి 61.76 ఎకరాలు వంతున గుర్తించడం జరిగిందన్నారు. మొదటి విడతగా 614 ఎకరాలు సేకరించనున్నట్లు తెలిపారు. ఈనెల 10 లోపు మొదటి విడతగా సేకరించాలనుకున్న 614 ఎకరాలను సేకరించేందుకు చర్యలు వేగవంతం చేశామని వివరించారు. -
కట్..కట్..కట్..!
విభజించు..పాలించు..(డివైడ్ అండ్ రూల్) సిద్ధాంతం బ్రిటిష్ పాలకులదైతే.. రాష్ట్ర సర్కారుది విడదీసి..సేకరించు సిద్ధాంతంలా కనిపిస్తోంది. భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి భూ సేకరణకు ప్రభుత్వం ఇదే విధానాన్ని అవలంబిస్తోంది. రైతులనుంచి ఒకేసారి వ్యతిరేకత రాకుండా, వారినే విడదీస్తూ తన పని తాను చక్కబెడుతోంది. భూ సేకరణకు ప్రిలిమినరీ నోటిఫికేషన్‌ను ఒకేసారి ప్రకటించిన యంత్రాంగం..ఫైనల్ నోటిఫికేషన్‌ను మాత్రం విడతల వారీగా ఇస్తుండడం గమనార్హం. రైతులను ఇబ్బందు లకు గురిచేయొద్దని కోర్టు ఇచ్చిన ఆదేశాలను సైతం అధికారులు పట్టించుకోవడం లేదు. ఓ వైపు సర్వే చేస్తూనే మరో వైపు ఫైనల్ నోటిఫికేషన్లు ఇస్తుండడంతో బాధిత గ్రామాల రైతులు, ప్రజలు ఆందోళన చెందుతున్నారు. విజయనగరం కంటోన్మెంట్: భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టుపై కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా ప్రభుత్వం మాత్రం జోరుగా వ్యవహారాలు చక్కబెడుతోంది. ఓ వైపు సర్వేలు, మరో వైపు ఆర్ ఆర్ ప్యాకేజీ ప్రకటన, డీ పట్టా దారులకు చెల్లింపులు, అభ్యంతరాలకు జవాబులు రిజిస్టర్ పోస్టుల ద్వారా పంపించడంతో పాటు ఇప్పుడు ఫైనల్ నోటిఫికేషన్లను ఒకే సారి కాకుండా కొద్ది పాటి ఎకరాలతో ఇస్తున్నారు. ప్రిలిమినరీ నోటిఫికేషన్‌ను ప్రచురించిన తరువాత సంవత్సరంలోగా ఫైనల్ నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది. లేకుంటే భూసేకరణ చట్టం నిబంధనలు ఒప్పుకోవు. ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇచ్చి ఇప్పటికే దాదాపు ఆరు నెలల పైచిలుకు సమయం అయిపోవడంతో సమయం దగ్గర పడుతున్నదని భావిస్తున్న యంత్రాంగం ఎయిర్‌పోర్టు భూ సేకరణ కార్యక్రమాన్ని రైతులతో చెప్పకుండానే వేగవంతం చేస్తోంది. మీ అనుమతి లేకుండా భూ సేకరణ చేపట్టబోమని రైతులు, ప్రజలతో నిత్యం చెబుతున్న అధికారులు ఆచరణలో మాత్రం భిన్నంగా వ్యవహరిస్తున్నారు. గత ఏడాది ఆగస్టు 31న ఇచ్చిన ప్రిలిమినరీ నోటిఫికేషన్ సందర్భంగా సేకరించిన సుమారు 2,800 పై చిలుకు అభ్యంతరాలకు ఇప్పటికే ఏదో ఒక సమాధానాన్ని ఇచ్చి..మమ అనిపించి.. ఇప్పుడు ఫైనల్ నోటిఫికేషన్‌ను ముక్కలు ముక్కలుగా ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఒక దఫా ఫైనల్‌నోటిఫికేషన్ ఇచ్చిన యంత్రాంగం పలు విడతల్లో నోటిఫికేషన్లు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటోంది. దీనికోసం జిల్లా కేంద్రంలోని భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు భూ సేకరణ కార్యాలయం పనులు జోరుగా చేపడుతోంది. డీ పట్టాదారులకు చెల్లింపులు ఎయిర్‌పోర్టు పరిధిలో గుర్తించిన డిపట్టా భూములకు ఇప్పటికే దాదాపు రూ.32.62 కోట్లు చెల్లించారు. మొత్తం మూడు యూనిట్ల భూ సేకరణలో కౌలువాడ, రావాడ యూనిట్లో 40 మంది రైతులకు రూ. 8 కోట్లు చెల్లించారు. గూడెపు వలస యూనిట్లో 32 ఎకరాలకు 21 మందికి సుమారు రూ. 4.62 కోట్లు చెల్లించారు. మరో యూనిట్లో ఉన్న ముంజేరు, కొంగవాని పాలెం, కంచేరు పాలెం, కంచేరు, సవరవిల్లి, ఎ.రావివలస గ్రామాల్లోని 122 మందికి రూ. 20 కోట్లు చెల్లించారు. మిగిలిన వారికి చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నారు. డిపట్టా భూములకు సంబంధించి ఫైనల్‌నోటిఫికేషన్ ఇచ్చే పరిస్థితి లేదు. జిరాయితీకి తప్పనిసరిగా ఇవ్వాల్సిన నోటిఫికేషన్లను వరుసపెట్టి ఇచ్చేందుకు చర్యలు తీసుకోవడం గమనార్హం. ఆ గ్రామాల్లోనే మీ ఇంటికి మీ భూమి జిల్లా వ్యాప్తంగా మీ ఇంటికి మీ భూమి కార్యక్రమానికి ఇచ్చిన దరఖాస్తులు పెద్దగా పట్టించుకోని అధికారులు భోగాపురం ఎయిర్‌పోర్టుకు సంబంధించి గుర్తించిన గ్రామాల్లో రికార్డులను సరిచేసి కొత్త పాసుపుస్తకాలను ఇస్తున్నారు. రైతులతో మీ ఇష్టప్రకారమే జరుగుతుందని, బలవంతంగా భూములు తీసుకోమని చెబుతున్న యంత్రాంగం వారి ఇళ్లకు వెళ్లి మరీ పట్టాదారు పాసు పుస్తకాలు ఇస్తున్నారు. విడతల వారీగానే ఫైనల్ నోటిఫికేషన్లు భోగాపురం ఎయిర్‌పోర్టుకు సంబంధించి విడతలుగానే ఫైనల్ నోటిఫికేషన్లు ఇస్తాం. ఇప్పటికే ఒక విడత నోటిఫికేషన్ ఇచ్చాం. రైతులను ఇబ్బంది పెట్టకుండానే భూ సేకరణ చేస్తాం. ఆర్ ఆర్ ప్యాకేజీ కూడా ప్రకటించాం. ఎస్ శ్రీనివాసమూర్తి, ఆర్డీఓ, విజయనగరం -
జీఓ 63ను వ్యతిరేకిస్తున్నాం
భోగాపురం: భోగాపురం మండలంలో ఎయిర్‌పోర్టు నిర్మాణం కోసం ప్రభుత్వం విడుదల చేసిన జిఓ నెం.63ని వ్యతిరేకిస్తున్నాం అని సిపిఎం జిల్లా కన్వీనరు టి. సూర్యనారాయణ అన్నారు. స్థానిక మండలపరిషత్ కార్యాలయం ఆవరణలో గురువారం ఉదయం ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఎయిర్ పోర్టు నిర్మాణానికి స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటుచేసి మొత్తం అధికారులను నియమించి ప్యూజ్బులిటీ, ఎన్విరాన్మెంట్,చట్టపరమైన సమస్యలు పరిష్కరించి పనులు ప్రారంభించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం జీఓ జారీ చేసిందని దీనిని తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు. అలాగే ప్రభుత్వం, కలెక్టరు చేస్తున్న ప్రకటనలు రైతులను, గ్రామస్తులను ఆందోళనకు గురిచేసేలా ఉన్నాయన్నారు. ఎయిర్‌పోర్టుకు ఒక్క సెంటు భూమి కూడా ఇచ్చేందుకు ప్రజలు, రైతులు సిద్ధంగా లేరన్న విషయం తెలుసుకున్నామన్నారు. కావున వారి అభీష్టానికి మద్దతుగా సీపీఎం నిలుస్తుందని, ప్రజల తరఫున ఉద్యమించడానికి సిద్దంగా ఉన్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి బి. సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
బాబుగారి భూదాహం
ఎయిర్‌పోర్టుల పేరుతో మరో 22 వేల ఎకరాలపై కన్ను భోగాపురంలో ఎయిర్‌పోర్టుకు 6,500ఎకరాలు చాలన్న అధికారులు.. అదీ ఎక్కువేనన్న నిపుణులు 15 వేల ఎకరాల సేకరణకు నిర్ణయం రైతుల పొట్టకొట్టి బడా సంస్థలకు.. హైదరాబాద్: రాజధాని పేరుతో, భూసమీకరణ ముసుగులో 35 వేల ఎకరాల పచ్చని పంటభూములను గుంజుకున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విమానాశ్రయాల పేరుతో మరో 22 వేల ఎకరాలపై కన్నేసింది. పచ్చని పంటలు పండే వేల ఎకరాల భూములను సిమెంట్ కాంక్రీటుగా మార్చేయడానికి సిద్ధమైంది. అంతర్జాతీయ విమానాశ్రయం పేరుతో విజయనగరం జిల్లా భోగాపురంలో ఏకంగా 15 వేల ఎకరాలు, ఏడు మినీ విమానాశ్రయాల పేరుతో మరో ఏడు వేల ఎకరాలు సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. చంద్రబాబు ఇటీవల పర్యటించిన జపాన్‌లోని హనెడా అంతర్జాతీయ విమానాశ్రయం 1,800 ఎకరాలు మాత్రమే. దేశంలోనే అత్యంత ఎక్కువ ఎయిర్ ట్రాఫిక్ ఉన్న ముంబై విమానాశ్రయాన్ని 1,850 ఎకరాల్లోనే నిర్మించారు. భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి కూడా 6,500 ఎకరాలు సరిపోతుందని అధికారులు ఇచ్చిన నివేదికలో స్పష్టంగా ఉంది. ఈ భూమి కూడా ఎక్కువేనని నిపుణులు చెబుతున్నారు. కానీ చంద్రబాబు నాయుడు సర్కారు మాత్రం 15 వేల ఎకరాలు సేకరించడం ఎవరికి మేలు చేసేందుకన్నది అర్థం కావడంలేదు. భోగాపురంలో తొలి దశ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి రూ.3000 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. స్థల క్లియరెన్స్‌కు ఇప్పటికే కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖకు దరఖాస్తు కూడా చేశారు. ఇందుకోసం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కంపెనీ లిమిటెడ్ పేరుతో స్పెషల్ పర్పస్ వెహికల్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పీపీపీ విధానంలో విమానాశ్రయ నిర్మాణాన్ని చేపట్టనున్నారు. 6,500 ఎకరాలు అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి సరిపోతున్నా 15 వేల ఎకరాలు సేకరించాలని చంద్రబాబు నాయుడు సర్కారు తీసుకున్న నిర్ణయం వెనుక రైతుల పొట్టకొట్టి కార్పొరేట్ సంస్థ జేబులు నింపే ఎత్తుగడ ఉందనే అనుమానాన్ని అధికార వర్గాలే వ్యక్తం చేస్తున్నాయి. అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్న ప్రాంతంలో పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకు భూములను అప్పగించడానికి ఇన్ని వేల ఎకరాలు సేకరించాలని నిర్ణయం తీసుకున్నారని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. భోగాపురంలో అర ఎకరం, ఎకరం, రెండేసి ఎకరాల చిన్న, సన్న కారు రైతులే ఎక్కువగా ఉన్నారని, అలాంటి రైతుల పొట్టకొట్టడం అన్యాయమని అధికారులు పేర్కొంటున్నారు. అన్నీ పీపీపీలే! రాష్ట్రంలో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం పబ్లిక్-ప్రైవేటు భాగస్వామ్య విధానంపైనే ఆధారపడుతుంది. ఇఛ్చాపురం నుంచి తడ వరకు చేపట్టనున్న బీచ్ కారిడార్‌కు బిల్డ్-ఆపరేట్-ట్రాన్స్ఫర్ (బూట్) విధానాన్ని అవలంబించనుంది. దీనివల్ల ప్రయాణికులపై భారీగా టోల్ భారం పడుతుంది. ఇఛ్చాపురం నుంచి తడ వరకు 1000 కిలో మీటర్ల మేర బీచ్ కారిడార్ నిర్మాణం. ఇఛ్చాపురం-విశాఖపట్నం, విశాఖపట్నం-నర్సాపురం, నర్సాపురం-ఒంగోలు, ఒంగోలు-తడ వరకు నాలుగు ప్యాకేజీలు. M>-Mుళం జిల్లా బావనపాడులో 4000 ఎకరాల్లో రూ.3,500 కోట్ల వ్యయంతో పోర్టు ఏర్పాటు. విశాఖపట్టణం, నెల్లూరు, తిరుపతి, గుంటూరు, అనంతపురం జిల్లాల్లో అంతర్జాతీయ స్కూళ్ల ఏర్పాటు. ఒక్కో స్కూలుకు రూ.65 కోట్ల వ్యయం, 20 ఎకరాల స్థలం. తిరుపతి, విశాఖపట్టణాల్లో రూ.400 కోట్ల వ్యయంతో మెగా కన్వెన్షన్ కేంద్రాల నిర్మాణం. ఒక్కో కేంద్రానికి 60 ఎకరాలు చొప్పున స్థలం. విజయవాడలో 30 ఎకరాల స్థలంలో రూ.110 కోట్ల వ్యయంతో కన్వెన్షన్ కేంద్రం. విశాఖ, తిరుపతిలో ఐదు నక్షత్రాల హోటళ్లు. విజయవాడలో మూడు నక్షత్రాల హోటల్. విశాఖపట్టణం, తిరుపతిల్లో 180 కోట్ల రూపాయల చొప్పున వ్యయంతో సమగ్ర క్రీడా కాంప్లెక్స్‌ల నిర్మాణం. ఒక్కో కాంప్లెక్స్‌కు 70 ఎకరాలు. ఏడు జిల్లాల్లో విమానాశ్రయాలకు ఏడు వేల ఎకరాలు మరోవైపు ఏడు జిల్లాల్లో కూడా విమానాశ్రయాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం ఒక్కో జిల్లాల్లో 1000 ఎకరాలు చొప్పున ఏడు వేల ఎకరాలను సేకరించాలని నిర్ణయించారు. ఒక్కో విమానాశ్రయ నిర్మాణానికి 100 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని అంచనా వేశారు. పీపీపీ విధానంలోనే ఈ విమానాశ్రయాలను నిర్మిస్తారు. నెల్లూరు జిల్లా దగ్గదర్తి, కర్నూలు జిల్లా ఓర్వకల్లు, పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం, చిత్తూరు జిల్లా కుప్పం, ప్రకాశం జిల్లా ఒంగోలు, దొనకొండ, గుంటూరు జిల్లా నాగార్జునసాగర్‌లో ఈ విమానాశ్రయాలను నిర్మించనున్నారు.