చరిత్ర సృష్టించిన అఫ్గాన్ యువ సంచలనం.. ప్రపంచంలోనే?
షార్జా క్రికెట్ గ్రౌండ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి వన్డేలో 92 పరుగుల తేడాతో అఫ్గానిస్తాన్ చారిత్రత్మక విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో అఫ్గాన్ యువ స్పిన్నర్ అల్లా ఘజన్ఫర్ సంచలన ప్రదర్శన కనబరిచాడు. ఘజన్ఫర్ స్పిన్ ఉచ్చులో చిక్కుకుని బంగ్లా బ్యాటర్లు విల్లవిల్లాడారు.ఈ మ్యాచ్‌లో 6.3 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసిన ఘజన్ఫర్ కేవలం 26 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో ఘజన్ఫర్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.ఘజన్ఫర్ సాధించిన రికార్డులు ఇవే..👉వన్డే క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన రెండో అఫ్గానిస్తాన్ బౌలర్‌గా 18 ఏళ్ల ఘజన్ఫర్ నిలిచాడు. ఈ జాబితాలో రషీద్ ఖాన్ అగ్రస్ధానంలో ఉన్నాడు. 2018లో గ్రాస్ ఐలెట్‌లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో రషీద్ ఖాన్ 18 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టాడు.👉అంతర్జాతీయ వన్డేల్లో 6 వికెట్ల ఘనత సాధించిన మూడో అత్యంత పిన్న వయష్కుడిగా ఘజన్ఫర్ రికార్డులకెక్కాడు. ఈ అఫ్గానీ 18 సంవత్సరాల 231 రోజుల వయస్సులో ఈ ఫీట్ నమోదు చేశాడు. ఈ జాబితాలో పాకిస్తాన్ దిగ్గజం వకార్ యూనిస్(18 సంవత్సరాల 164 రోజులు) అగ్రస్ధానంలో ఉండగా, రషీద్ ఖాన్(18 సంవత్సరాల 174 రోజులు) రెండో స్ధానంలో ఉన్నాడు.👉అదే విధంగా బంగ్లాదేశ్-అఫ్గాన్ వన్డేల్లో గణాంకాలు నమోదు చేసిన బౌలర్‌గా కూడా ఘజన్‌ఫన్ చరిత్ర సృష్టించాడు. ఇంతకుముందు ఈ రికార్డు బంగ్లాదేశ్ స్టార్ ప్లేయర్ షకీబ్ అల్హసన్ పేరిట ఉండేది. 2019లో సౌతాంప్టన్‌లో అఫ్గాన్‌తో జరిగిన వన్డేల్లో షకీబ్ 29 పరుగులిచ్చి 5 వికెట్ల పడగొట్టాడు. తాజా మ్యాచ్‌లో 6 వికెట్లు పడగొట్టిన ఘజన్‌ఫన్.. షకీబ్ అల్‌టైమ్ రికార్డును బ్రేక్ చేశాడు. From 132/3 to 143 all out! 🤯Bangladesh have just been routed by the spin wizardry of AM Ghazanfar! 🪄#AFGvBANonFanCode pic.twitter.com/vLUXe6Xc56— FanCode (@FanCode) November 6, 2024