Anand Sai
-
యాదాద్రి దేవాలయంలో చాలా మార్పులు చేశాం...!
-
ఎంతమంది భక్తులు వచ్చినా దర్శనం చేసుకునేలా సిద్ధం చేశాం
-
యాదాద్రి దేవాలయం రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి
-
నరసింహ స్వామి యాళి స్తంభం ప్రాముఖ్యత..!
-
కేసీఆర్ వల్లే ఇది సాధ్యమైంది..!
-
దేవుడే నాతో ఉండి కట్టించాడనిపించింది..!
-
స్వామి దశావతారం గురించి యాదాద్రి ఆర్ట్ డైరెక్టర్..!
-
యాదాద్రి ఆలయ విగ్రహాల గురించి ఆనంద్ సాయి మాటలో..!
-
యాదాద్రి దేవాలయం గురించి వివరించిన ఆర్ట్ డైరెక్టర్
-
సీఎం కేసీఆర్ కొండగట్టు పర్యటన బుధవారానికి వాయిదా..!
సాక్షి, హైదరాబాద్/కొండగట్టు: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు బుధవారం కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయాన్ని సందర్శించనున్నారు. దేవస్థానాన్ని రూ. 100 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక అభివద్ధి నిధి కింద గత వారమే ఉత్తర్వులు జారీ చేయడం తెలిసిందే. ఈ నిధులతో ఆలయాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలన్న అంశంపై ప్రత్యక్షంగా దేవాలయ ప్రాంతాన్ని పరిశీలించడంతోపాటు ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం మంగళవారం ఆయన ఆలయ సందర్శనకు వెళ్లాల్సి ఉన్నా ఆ రోజు భక్తులు అధిక సంఖ్యలో ఆంజనేయస్వామిని దర్శించుకోవడానికి వస్తారని.. తన పర్యటన వల్ల భక్తులకు ఇబ్బందులు తలెత్తుతాయన్న ఉద్దేశంతో సీఎం ఆలయ సందర్శనను ఒకరోజు వాయిదా వేసుకున్నట్లు సమాచారం. యాదాద్రి ఆలయ అభివృద్ధి్ధ తరహాలోనే కొండగట్టును అభివృద్ధి చేయాలన్న యోచనలో ప్రభుత్వం ఉంది. యాదాద్రి దేవస్థాన పునర్నిర్మాణానికి ఆర్కిటెక్ట్‌గా వ్యవహరించిన ఆనంద్‌సాయికి ఈ దేవాలయ అభివృద్ధి నమూనాల రూపకల్పన, వాటి అమలును పర్యవేక్షించే బాధ్యత అప్పగించనున్నట్లు తెలిసింది. ముఖ్యమంత్రి వెంట ఆనందసాయి కూడా వెళ్లనున్నట్లు తెలిసింది. దేవాలయంలో భక్తులకు వసతుల కల్పన, రహదారుల అభివృద్ధి తదితర అంశాలపై సీఎం దృష్టిసారించినట్లు సమాచారం. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జగిత్యాల జిల్లాకు చెందిన మంత్రి కొప్పుల ఈశ్వర్, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, కలెక్టర్ యాస్మిన్ బాషా, ఎస్పీ భాస్కర్ సోమవారం కొండగట్టును సందర్శించారు. సీఎం పర్యటనకు అవసరమైన ఏర్పాట్లను పరిశీలించారు. కాగా, సీఎం పర్యటన నేపథ్యంలో 14న సాయంత్రం 4 గంటల నుంచి 15న మధ్యాహ్నం 2 గంటల వరకు ఆర్జిత సేవలు నిలిపివేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. -
యాదాద్రి తరహాలో ‘కొండగట్టు’
కొండగట్టు(చొప్పదండి): జగిత్యాల జిల్లా కొండగట్టు శ్రీఆంజనేయస్వామి ఆలయాన్ని ఆగమశాస్త్రం ప్రకారం యాదాద్రి తరహాలో అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారని వాస్తు సలహాదారు, ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయి వెల్లడించారు. సీఎం కేసీఆర్ ఈ నెల 14న కొండగట్టు పర్యటనకు రానున్న నేపథ్యంలో ఆనందసాయి ఆదివారం స్వామివారి సన్నిధికి చేరుకున్నారు. అంజన్న దర్శనం తర్వాత కలెక్టర్ యాస్మిన్ బాషా, ఎస్పీ భాస్కర్, ఇతర అధికారులు, నాయకులతో సమావేశమై ఆలయ మాస్టర్‌ప్లాన్‌పై చర్చించారు. ఆలయంలో ఇప్పుడున్న ప్రాకారంతోపాటు మరోదానిని నిర్మించాల్సి ఉందన్నారు. పుణ్యక్షేత్రంలో 1980 నాటి భవనాలు ఉన్నాయని, గర్భగుడిలోని స్వామివారు భక్తులకు కనిపించడంలేదని చెప్పారు. ఆలయానికి నాలుగువైపులా గోపురాలు, ముఖమండపం నిర్మాణాన్ని ప్రత్యేకంగా డిజైన్ చేస్తామని ఆనందసాయి వివరించారు. ఆలయంలోకి వచ్చే భక్తులకు స్వామివారి చరిత్ర తెలిసేలా ప్రతీస్తంభంపై రాసి ఉంచుతామని చెప్పారు. ఆలయంలో 108 అడుగుల పొడవైన ఆంజనేయస్వామి విగ్రహం ఏర్పాటు చేయాలని సీఎం యోచిస్తున్నారని పేర్కొన్నారు. భేతాళ స్వామి, శ్రీరాముడి ఆలయం, సీతమ్మ కన్నీటిధారలు పరిశీలించిన ఆనంద్‌సాయి ఆలయంలో చాలామార్పులు ఉంటాయని వెల్లడించారు. ఈ సమాచారం మొత్తాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు. -
Yadagirigutta Temple: అదిగదిగో యాదాద్రి
సాక్షి, హైదరాబాద్: యాదగిరి లక్ష్మీ నారసింహుడు.. తెలంగాణ ఇలవేల్పు.. ఏడాదికోసారైనా ఇంటిల్లిపాదీ ‘గుట్ట’కు వెళ్లి దర్శించుకోవటం ఆనవాయితీ. ఇప్పుడా నారసింహుడి ఆలయం అద్భుతమైన ‘యాదాద్రి’గా మారి వెలుగులు విరజిమ్ముతోంది. పూర్తి కృష్ణశిలల నిర్మాణం, అబ్బురపడే శిల్పాలతో సరికొత్త రూపాన్ని సంతరించుకుని.. భక్తజన కోటిని ఆనంద పారవశ్యంలో ముంచెత్తేందుకు సిద్ధమైంది. ఆరేళ్ల తర్వాత భక్తులకు స్వయంభూ లక్ష్మీనరసింహుడు తనివితీరా దర్శనమివ్వనున్నాడు. సోమవారం (28వ తేదీన) మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమం ముగిసిన తర్వాత సాధారణ భక్తులకు దర్శనం మొదలుకానుంది. మరో తిరుమలగా..! ఏపీలోని తిరుమల వెంకన్న సన్నిధి నిత్యం భక్తులతో కిటకిటలాడుతూ, ప్రపంచంలోనే గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా వెలుగొందుతోంది. సాధారణ రోజుల్లోనే 40 వేల మంది వరకు.. సెలవులు, ప్రత్యేక పర్వదినాల్లో దాదాపు 70– 80 వేల మంది దాకా వెంకటేశ్వరస్వామిని దర్శించుకుంటున్నారు. ఇప్పుడు యాదాద్రి లక్ష్మీనరసింహుడి సన్నిధి తెలుగు రాష్ట్రాల్లో తిరుమల తర్వాత అంతగా భక్తుల తాకిడి ఉండే ఆలయంగా నిలుస్తుందని అంచనా. గత ఆరేళ్లలో బాలాలయంలో నరసింహస్వామిని.. సాధారణ రోజుల్లో 8 వేల మంది వరకు.. సెలవు రోజులు, ప్రత్యేక సందర్భాల్లో 30, 40 వేల వరకు దర్శించుకున్నారు. ఇప్పుడు ప్రధానాలయం, స్వయంభూ మూర్తి దర్శనం మొదలైతే.. భక్తుల సంఖ్య భారీగా పెరుగుతుందని అధికారులు చెప్తున్నారు. సాధారణ రోజుల్లో 20వేల మంది వరకు.. సెలవు రోజులు, ప్రత్యేక సందర్భాల్లో 40, 50వేల మంది వరకు వస్తారని పేర్కొంటున్నారు. ‘‘ఆలయ పునర్నిర్మాణ పనులు మొదలవకముందటితో పోలిస్తే.. పనులు మొదలై బాలాలయంలో స్వామి దర్శనాలు మొదలుపెట్టాక అనూహ్యంగా భక్తుల సంఖ్య పెరిగింది. 5 వేల మంది దర్శించుకునే రోజుల్లో 10 వేల మంది రావడం మొదలైంది. ప్రత్యేక సందర్భాల్లో 30వేల మంది వరకు వచ్చారు. కొత్త ఆలయ నిర్మాణంతో దేశవ్యాప్తంగా ఆసక్తి పెరిగింది. భక్తులు, సందర్శకుల సంఖ్య భారీగా పెరుగుతుందని భావిస్తున్నాం. రోజుకు 50వేల మంది వచ్చినా ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేశాం’’ అని యాదాద్రి ప్రాంత అభివృద్ధి సంస్థ వైస్‌చైర్మన్ కిషన్‌రావు చెప్పారు. వెయ్యేళ్లకుపైగా నిలిచేలా.. యాదాద్రి ఆలయాన్ని పూర్తిగా కృష్ణశిలలతో నిర్మించారు. నిజానికి 17వ శతాబ్దం తర్వాత రాతి నిర్మాణాలు చాలావరకు నిలిచిపోయాయి. ఇటుకలు, ఆ తర్వాత సిమెంటు వాడకం పెరిగి రాతిని వాడటం ఇబ్బందిగా భావిస్తూ వచ్చారు. జటప్రోలు సంస్థానాధీశులు నిర్మించినవే తెలుగు నేలపై చివరి పూర్తి రాతి మందిరాలు. ఇన్ని వందల ఏళ్ల తర్వాత మళ్లీ తొలిసారి పూర్తి రాతి నిర్మాణానికి యాదాద్రి వేదికైంది. ఆలయం కోసం ఏకంగా రెండున్నర లక్షల టన్నుల కృష్ణ శిలలను వినియోగించారు. 1,200 మంది శిల్పులు రాత్రింబవళ్లు పనిచేసి అద్భుతంగా తీర్చిదిద్దారు. వెయ్యేళ్ల పాటు నిలిచేలా ఇంటర్‌లాకింగ్ పరిజ్ఞానం, బరువు సమతూకం అయ్యేలా డిజైన్ చేసి ఆలయాన్ని నిర్మించారు. పిడుగుపాటుతో నష్టం కాకుండా పటిష్ట ఏర్పాట్లు చేశారు. ప్రధానాలయ విమానగోపురంపై సీఎం కేసీఆర్ సంప్రోక్షణ చేయనున్న నేపథ్యంలో ప్రత్యేకాలంకరణలో ఏర్పాటు చేసిన రంగురంగుల ధ్వజాలు అద్భుత శైలి.. ఆకట్టుకునే విగ్రహాలతో.. సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో దాదాపు రూ.1,200 కోట్ల భారీ వ్యయంతో యాదాద్రి పునర్నిర్మాణాన్ని చేపట్టారు. 2015లో మొదలైన నిర్మాణం ఇటీవలే పూర్తయింది. అబ్బురపడే రీతిలో ఈ ఆలయం రూపుదిద్దుకుంది. ఓ రకంగా చెప్పాలంటే గుడి కాదు ఏకంగా గుట్టనే మారిపోయింది. ► యాదాద్రి ఆలయ నిర్మాణంలో కాకతీయ, చోళ, చాళుక్య, పల్లవ.. ఇలా ఎన్నో అద్భుత నిర్మాణ శైలులను వినియోగించారు. ► వైష్ణవ సంప్రదాయంలో ఎంతో ప్రాధాన్యం ఉన్న ఆళ్వార్లు ఇక్కడ రాతి స్తంభాల రూపంలో ముఖ మండపంలో కొలువుదీరారు. 12 మంది ఆళ్వార్లు 11 అడుగుల ఎత్తుతో 38 అడుగుల ఎత్తున్న ముఖ మండపానికి ఆధారభూతంగా నిలిచారు. ► మరెక్కడా లేనట్టుగా 1,700 అడుగుల పొడవునా.. దాదాపు 80 నుంచి 100 అడుగుల ఎత్తుతో ప్రాకారాలను నిర్మించారు. ► 84 అడుగుల ఎత్తుతో ఏడు అంతస్తుల మహారాజగోపురం.. ఐదు, నాలుగు, మూడు, రెండు అంతస్తులతో మరో ఐదు గోపురాలు, విమాన గోపురం ఇక్కడి మరో ప్రత్యేకత. ► మహారాజగోపురం ఒక్కదానికే ఏకంగా 13 వేల టన్నుల రాయిని వాడారు. ఇది పూర్తవటానికి రెండేళ్లు పట్టింది. ► ఏ దేవాలయంలోనూ లేనట్టు ప్రాకారానికి వెలుపల అష్టభుజి మండపాలను ఏర్పాటు చేశారు. రథయాత్ర సాగినా భక్తులు హాయిగా ఆ మండపాల్లో కూర్చుని చూడొచ్చు. ► సింహం తల, గుర్రం తరహా శరీరం, దిగువ ఏనుగు.. వెరసి యాలీ జంతు రూపం. ఇలాంటి భారీ రాతి శిల్పాలు ఏకంగా 58 కొలువుదీరాయి. నోరు తెరిచి ఉన్నట్టుగా ఉండే ఆ విగ్రహాల నోటిలో అతిపెద్ద రాతి బంతులు ఉండటం విశేషం. ► ఏడు చోట్ల ఐరావతాలు, ప్రవేశం నుంచి ఆలయంలోకి వెళ్లేప్పుడు స్తంభాల రూపంలో ఆంజనేయుడు, ప్రహ్లాదుడు, యాద మహర్షి, రామానుజుల రూపాలు, గర్భాలయ ద్వారంపైన రాతి ప్యానెల్‌పై గర్భాలయ ఉత్సవ మూర్తి రూపం, ప్రహ్లాదచరిత్ర, పంచ నారసింహుల రూపాలు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. ► సాయంత్రం సంధ్యా సమయంలో దీపాలు వెలిగించినట్టుగా అదేతరహా కాంతితో ప్రత్యేక లైటింగ్ వ్యవస్థ ఆకట్టుకుంటోంది. ఇది ఓ తంజావూరు.. ఓ శ్రీరంగం గొప్ప రాతినిర్మాణ దేవాలయం అనగానే మనకు తంజావూరు గోపురం గుర్తుకొస్తుంది. శ్రీరంగం మదిలో మెదులుతుంది. ఇప్పుడా రెండు దేవాలయాలు మనకు యాదాద్రిలో కనిపిస్తాయి. ఇది అసాధారణ నిర్మాణం. సీఎం కేసీఆర్ శ్రీకృష్ణదేవరాయలులాగా నిలిచి, ఆలోచనలు పంచి, ఆర్థిక వనరులు కల్పించి కట్టించారు. రాతి దేవాలయాల నిర్మాణ చరిత్రలో యాదాద్రి చిరకాలం నిలిచిపోతుంది. భక్తులకు ఆధ్యాత్మిక పరిమళాలతోపాటు గొప్ప నిర్మాణంలో గడిపిన అనుభూతిని పంచుతుంది. – ఆనంద సాయి, ఆలయ ఆర్కిటెక్ట్ -
రాజధాని నిర్మాణంలో బాబు తాజా నిర్ణయం
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో సీఎం చంద్రబాబు మరో కొత్త నిర్ణయం తీసుకున్నారు. తెలుగు చరిత్రపై అవగాహన ఉన్న వారి సలహాలు తీసుకోవాలని సీఎం సీఆర్డీఏ అధికారులను ఆదేశించారు. అందులో భాగంగా గౌతమి పుత్ర శాతకర్ణి దర్శకుడు క్రిష్, ఆర్ట్ డైరెక్టర్ ఆనందసాయి సలహాలు తీసుకోవాలని ఆదివారం జరిగిన అమరావతి నిర్మాణ సమీక్షలో ఈ మేరకు నిర్ణయించారు. ఇప్పటికే అమరావతి నిర్మాణంలో దర్శకుడు రాజమౌళిని సీఆర్డీఏ అధికారులు సంప్రదించిన విషయం తెలిసిందే. రాజధాని డిజైన్ల కోసం ఏర్పాటు చేసిన కమిటీలో రాజమౌళిని కూడా చేర్చాలని బాబు అధికారులకు సూచించారు. సీఎం చంద్రబాబు తాజా నిర్ణయంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాజధాని నిర్మాణంలో బాబు పిచ్చి పరాకాష్టకు చేరిందన్నారు. విదేశీ, సినిమా రంగాలపై మోజుతో సరికొత్త దోపిడీకి తెరలేపారని ఆరోపించారు. రాజధాని నిర్మాణంలో భూములిచ్చిన రైతులు, స్థానిక కూలీల భాగస్వామ్యాన్ని సీఎం మర్చిపోయారని ఆర్కే మండిపడ్డారు. -
నిజంగా... నా భార్యకు థ్యాంక్స్ చెప్పాలి
మనోగతం ఒక రోజు మా చెల్లెలు వినయ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ‘అన్నయ్యా...నాకు అమ్మనూ, నిన్నూ చూడాలనిపిస్తోంది. రేపు బయలుదేరి వస్తున్నాను’ అని ఫోన్ పెట్టేసింది. చెల్లి పెళ్లయి ఏడాది దాటింది. బెంగుళూరులో మకాం. నాన్న చిన్నప్పుడే చనిపోయారు. దాంతో వినయకు అన్నీ నేనే. రాత్రి నా గదిలో కూర్చుని ఏవో అత్తింటి విషయాలు చెబుతోంది. ‘మొన్నే పండక్కి వచ్చి వెళ్లారు కదా వినయా! మళ్లీ ఇప్పుడు ఇంత సడెన్‌గా...అదీ ఏ కారణం లేకుండా....’ అని నా మాటలు పూర్తికాకుండానే... ‘ఏం రాకూడదా అన్నయ్యా?’ అంది కోపంగా. వెంటనే వాళ్ల వదిన ‘అదేంటి వినయా? ఇది నీ ఇల్లు. నువ్వు ఎప్పుడైనా రావొచ్చు, వెళ్ళొచ్చు. నీ భర్త విషయంలో ఏదైనా ఇబ్బంది పడుతున్నావేమోనని ఆయన భయం’ అంది. ‘నెలరోజుల నుంచి ఆయన ప్రవర్తన, మాటలు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. ఆఫీసు నుంచి ఓ గంట ఆలస్యమైతే చాలు... ఎక్కడికెళ్లావు, ఎందుకు ఆలస్యం... అంటూ తిడుతున్నారు. ఒకరోజు నేను షాపింగ్‌కి వెళ్లి వచ్చేసరికి ఓ రెండు గంటలు ఆలస్యమైంది. అంతే! ఎవరితో తిరగడానికి వెళ్లావు...అన్నారు. ఆ మాట విన్నాక నాకు ఆయన మీద అసహ్యం పుట్టింది’ అంది చిరాగ్గా మొహం పెట్టి. పడుకునే ముందు సురేఖతో ‘వినయ అంత బాధపడుతుంటే ఓదార్చాల్సింది పోయి పట్టీపట్టన్నట్లు ప్రవర్తించడం నాకు నచ్చలేదు’ అన్నాను. ‘ప్రపంచంలో ఇలాంటి కష్టం మీ ఒక్క చెల్లెలికే వచ్చినట్టు ఫీలవడం చూస్తుంటే నాకు నవ్వొస్తోందండి’ అంది. వెంటనే నాకు పెళ్లయిన కొత్తలో రోజులు గుర్తొచ్చాయి. సురేఖ అప్పట్లో టీచర్‌గా పనిచేసేది. ఒకరోజు సాయంత్రం బాగా ఆలస్యంగా వచ్చింది. ఆ రోజు ఎవరో తోటి ఉపాధ్యాయురాలు పదవీ విరమణ వేడుకేదో ఉంటే ఆలస్యమైంది. విషయం తెలుసుకోకుండా నేను సురేఖతో నోటికొచ్చినట్టు మాట్లాడాను. ‘అడ్డమైన తిరుగుళ్ల కోసం ఉద్యోగమైతే వెంటనే ఉద్యోగం మానేయ్’ అని నేనన్న మాటలకు సురేఖ వెంటనే ఉద్యోగం మానేసింది. నాకు బాగా గుర్తు ఓ నాలుగురోజులు అన్నం తినలేదు తను. పదిరోజులవరకూ నాతో మాట్లాడలేదు. తర్వాత ఇంట్లో ఆర్థికంగా ఇబ్బందులు మొదలవడంతో మళ్లీ ఉద్యోగంలో చేరింది. ఈ రోజు నా చెల్లెలు ఏడవడం, సురేఖ నవ్వడం...ఏదీ తప్పు కాదని మనసులో అనుకుంటూ నిద్రపోయాను. మర్నాడు పొద్దున వంటింట్లో సురేఖ, వినయకు కౌన్సెలింగ్ ఇస్తోంది. ‘వాళ్లు మనని అంతకంటే పెద్దమాట ఏమనగలరు? ఈసారి అలాంటి మాటలన్నప్పుడు భోరుమంటూ ఏడవకుండా చిన్నగా నవ్వి ఊరుకో. కొన్ని విషయాల్లో లెక్కచేయకపోవడమే పెద్ద శిక్ష. దెబ్బకు దార్లోకి వస్తారు’ అని సురేఖ చెబుతున్న మాటలు నా చెవిన పడ్డాయి. నిజంగా సురేఖకు థ్యాంక్స్ చెప్పాలనిపించింది. ఎక్కడ ‘మీ అన్నయ్యా అలాంటి వాడే’ అని చెబుతుందోనని భయపడ్డాను. ఆరోజు వినయ మొహంలో ఏదో తెలియని ధైర్యం కనిపించింది. - కె. ఆనంద్‌సాయి, విశాఖపట్నం