ananta venkatramireddy
-
తాడిపత్రిలో టీడీపీ గూండాలు దాడులు.. అనంత వెంకట రామిరెడ్డి ఫైర్
-
అధికారం 'టీడీపీ'దే నని పచ్చ పత్రికల్లో రాతలు : ఎమ్మెల్యే అనంత
అనంతపురం: జిల్లాకు కృష్ణా జలాల రాక ఆలస్యం కావడానికి మాజీ సీఎం చంద్రబాబే కారణమని ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి విమర్శించారు. ఆదివారం ఆయన అనంతపురంలో మీడియాతో మాట్లాడారు. ఉరవకొండ బహిరంగ సభలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే అనంత మండిపడ్డారు. హంద్రీ–నీవా గురించి చంద్రబాబు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. 1985లో హంద్రీ–నీవాకు ఓడీసీ వద్ద ఎన్టీఆర్ శంకుస్థాపన చేస్తే.. 1995లో చంద్రబాబు ఉరవకొండలో 40 టీఎంసీలుగా శంకుస్థాపన చేసి నాలుగేళ్లు ఏమీ చేయకుండా 1999లో దాన్ని 5 టీఎంసీలకు కుదించారని, అప్పట్లో ఉరవకొండ ఎమ్మెల్యేగా పయ్యావుల కేశవ్ ఉన్నారన్న విషయాన్ని గుర్తు చేశారు. కనీసం ఫౌండేషన్ ఖర్చులు కూడా ఇవ్వలేని చరిత్ర బాబుదని ధ్వజమెత్తారు. 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత హంద్రీ–నీవా పనులు వేగవంతం చేశారన్నారు. అప్పట్లో తాను ఎంపీగా ఉన్నానని, 2005లో ఉరవకొండలో శంకుస్థాపన చేసి నీరు తీసుకువచ్చామన్నారు. 2012 నుంచి హంద్రీ–నీవా ద్వారా కృష్ణా జలాలు జిల్లాకు వస్తున్నాయని, అది మహానేత వైఎస్సార్ చలవేనన్నారు. హంద్రీ–నీవాను 3,850 క్యూసెక్కుల నుంచి 6వేలకు పెంచుతామని చెప్పి కనీసం గంపెడు మట్టి తీయని వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు. టీడీపీ పాలనలోనే రైతులు ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. కరువు విలయతాండవం ఆడడంతో వలసలు పెరిగాయన్నారు. రెయిన్గన్ల పేరుతో చంద్రబాబు ప్రభుత్వం దోపిడీ చేసిందన్నారు. రెండు ఎకరాల నుంచి వేల కోట్లకు అధిపతి అయిన చంద్రబాబు నీతులు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీ పాలనలో మంత్రులు, ఎమ్మెల్యేలు అవినీతిలో కూరుకుపోయారన్నారు. 2019లో ఉమ్మడి అనంతపురంలో రెండు సీట్లు టీడీపీకి వచ్చాయని, వచ్చే ఎన్నికల్లో అవి కూడా రావన్నారు. టీడీపీ మళ్లీ అధికారంలో వస్తుందని పచ్చ పత్రికల్లో రాతలు రాసుకుని భ్రమల్లో బతుకుతున్నారన్నారు. ఇవి చదవండి: విచారణకు సహకరించకుంటే బెయిల్ రద్దు కోరండి: సుప్రీంకోర్టు -
జగనన్న సురక్షతో ప్రజలకు ఎంతో మేలు: ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి
-
టీడీపీ నేతలకు కొత్త టెన్షన్.. రూటు మార్చిన పచ్చ పార్టీ లీడర్లు!
అభివృద్ధి అనేది టీడీపీ ఎజెండాలో లేని విషయం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చేస్తున్న పనుల్ని అడ్డుకోవడమే పచ్చ పార్టీ నేతల పని. అన్ని ఆటంకాలు అధిగమించి పనులు సాగుతుంటే మాత్రం ఆ ఘనత తమదే అని డప్పు కొట్టుకోవడంలో కూడా టీడీపీ నేతలు ముందుంటారు. అనంతపురం జిల్లాలోని ఒక టీడీపీ నేత డప్పు ఎలా కొట్టుకుంటున్నారంటే.. అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే, మాజీ మున్సిపల్ ఛైర్మన్ వైకుంఠం ప్రభాకర చౌదరి అభివృద్ధి అంటే నేనే అని డప్పు కొట్టుకోవడంలో ఆరితేరిపోయారు. 2014 నుంచి 2019 వరకు టీడీపీ తరపున జేసీ దివాకరరెడ్డి ఎంపీగా, ప్రభాకర చౌదరి టౌన్ ఎమ్మెల్యేగా కొనసాగారు. అనంతపురం టౌన్లో ఏ పని చేయాలన్నా ఇద్దరి మధ్యా ఏకాభిప్రాయం కుదిరేది కాదు. పట్టణంలో ఏ పనీ చేయకుండా, ఇద్దరు గొడవ పడటంతోనే ఐదేళ్ళు ముగిసిపోయింది. అందుకే టీడీపీ పాలనలో అనంతపురం పట్టణం అభివృద్ధి జరగకపోగా.. మరింత వెనుకపడిపోయింది. గత ఎన్నికల్లో ప్రభాకరచౌదరి మీద విజయం సాధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి అనంత వెంకట్రామిరెడ్డి ఎమ్మెల్యే అయ్యాక నగరం అభివృద్ధి పథంలో సాగుతోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అనంతపురం నగర అభివృద్ధికి ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. అనంతపురం అభివృద్ధికి 650 కోట్ల రూపాయలు విడుదల చేశారు. కేంద్రంతో మాట్లాడి అనంతపురం నగరం మీదుగా ఓ జాతీయ రహదారిని మంజూరు చేయించారు. అనంతపురం నగరంలో కొత్త ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణం పూర్తయింది. హైవే పనులు కూడా 80 శాతం పూర్తి కావటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నగరం అభివృద్ధి అంతా వైఎస్ఆర్సీపీ ఖాతాలోకి వెళ్ళడం టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి నచ్చడంలేదు. ఇలాగే సాగితే నగరంలో పచ్చ పార్టీకి ఉనికి ఉండదని భయపడి.. అభివృద్ధిని వక్రీకరించడం ప్రారంభించారు. అనంతపురం నగరంలో నిర్మాణమవుతున్న 42, 44 జాతీయ రహదారుల లింక్ హైవే టీడీపీ హయాంలోనే మంజూరు అయిందని.. పనులు ప్రారంభం అయ్యే లోగా ప్రభుత్వం మారిపోయిందంటూ ప్రభాకర్ చౌదరి గోబెల్స్ ప్రచారం ప్రారంభించారు. వాస్తవానికి జాతీయ రహదారిగా ఉన్న అనంతపురం సుభాష్ రోడ్డును స్టేట్ హైవేగా మారుస్తూ టీడీపీ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. మద్యం విక్రయాలకు నేషనల్ హైవే నిబంధనలు అడ్డురావటంతో నగర అభివృద్ధి గురించి ఆలోచించకుండా టీడీపీ నేతలు హైవే హోదానే తగ్గించేశారు. అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న ప్రభాకర్ చౌదరి దీనికి ఏ మాత్రం అడ్డుచెప్పలేదు. మద్యం అమ్మకాల కోసం చంద్రబాబు అనంతపురం నగరంలోని జాతీయ రహదారిని రాష్ట్ర రహదారిగా మార్చేశారు. చంద్రబాబు హయాంలో జరిగిన తప్పును గుర్తించిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి, అనంతపురం ఎంపీ తలారి రంగయ్య ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్ళారు. దీంతో అనంతపురం ప్రధాన రహదారిని తిరిగి నేషనల్ హైవే జాబితాలో చేర్చాలని సీఎం జగన్ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అలాగే పంగల్ రోడ్డు నుంచి బళ్లారి రోడ్ దాకా కొత్తగా నాలుగు లేన్ల హైవే నిర్మించాలని.. అనంతపురం క్లాక్ టవర్ దగ్గరున్న పాత బ్రిడ్జి స్థానంలో కొత్త ఫ్లై ఓవర్ నిర్మించాలని కేంద్ర మంత్రి గడ్కరీని స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోరారు. ఈ నేపథ్యంలో 310 కోట్లతో జాతీయ రహదారి మంజూరు అయింది. హైవే పనులు జరక్కుండా అడుగడుగునా అడ్డు పడిన టీడీపీ నేతలు.. అభివృద్ధి పనులు చివరి దశకు చేరటంతో రూటు మార్చారు. అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. పనులన్నీ పూర్తి అయితే అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో టీడీపీ నామరూపాల్లేకుండా పోతుందన్న భయం టీడీపీ నేతల్ని వెంటాడుతోంది. పచ్చ పార్టీ రాజకీయ డ్రామాలు నమ్మవద్దని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ప్రజలకు సూచిస్తున్నారు. ఇది కూడా చదవండి: టీడీపీలో సీటు కోసం నానాపాట్లు.. సీనియర్ నేతకు సర్దుబాటు అవుతుందా? -
అనంత ప్రభుత్వ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం
-
అనంత ప్రభుత్వ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం
సాక్షి, అనంతపురం : అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో అర్థరాత్రి అగ్నిప్రమాదం జరిగింది. సకాలంలో అధికారులు స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. కోవిడ్ వార్డులో పక్కనే ఉన్న రికార్డు రూమ్‌లో అర్థరాత్రి సమయంలో షార్ట్ సర్క్యూట్‌తో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఫర్నిచర్, రికార్డులు దగ్ధం అయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఐడీ వార్డులో ఉన్న 24మంది కోవిడ్ పేషెంట్లను మరో వార్డులోకి తరలించారు. జిల్లా కలెక్టర్ సత్య యేసుబాబు, ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న అనంతపురం ప్రభుత్వాసుపత్రిని ఏపీ డిప్యూటీ సిఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్లనాని బుధవారం ఉదయం పరిశీలించారు. స్టేషనరీ గదిలో మంటలు ఎలా చెలరేగాయన్న దానిపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్, డీఎం అండ్ హెచ్ఓల నుంచి ఆళ్లనాని వివరాలు సేకరించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. కోవిడ్ పేషెంట్లకు ఏలోటూ లేకుండా చర్యలు తీసుకోవాలని ఆళ్ల నాని తెలిపారు. ఖైదీ ఆత్మహత్య అనంతపురం : జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అక్బర్ బాషా లుంగీతో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించి వార్డెన్లు వెంకటకృష్ణ, నవీన్‌కుమార్‌పై అధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. -
సీఎం జగన్ నిర్ణయాలు చరిత్రాత్మకం
సాక్షి, అనంతపురం : సీఎం జగన్ నిర్ణయాలు చరిత్రాత్మకమని మంత్రి శంకర్‌నారాయణ పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు కాపు రామచంద్రారెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డి, తిప్పేస్వామిలతో కలిసి గురువారం మీడియాతో మాట్లాడారు. చరిత్రలో ఒకేసారి 1088 అంబులెన్స్‌లను ప్రజలకు అందుబాటులో ఉంచడం ఎక్కడా జరగలేదని శంకర్‌నారాయణ పేర్కొన్నారు. సీఎం జగన్ గొప్ప మానవతావాది.. ఆయన చరిత్రలో నిలిచిపోతారన్నారు. ప్రజల ప్రాణాలు రక్షించేందుకు సీఎం జగన్ చర్యలు అభినందనీయమని ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి తెలిపారు. ప్రతీదీ రాజకీయం చేయడం చంద్రబాబుకు బాగా అలవాటైపోయిందన్నారు. కాపు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు కుట్రల వల్లే ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు అందలేదంటూ విమర్శించారు. ఉద్దేశపూర్వకంగానే ఆర్థిక బిల్లును చంద్రబాబు అడ్డుకున్నారని, నీచ రాజకీయాలకు పెట్టింది పేరు చంద్రబాబు అని దుయ్యబట్టారు. చంద్రబాబు అనైతిక రాజకీయాల వల్లే ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు ఆలస్యంగా అందుతున్నాయని ఎమ్మెల్యే తిప్పేస్వామి పేర్కొన్నారు. మండలిలో ఆర్థిక బిల్లును టీడీపీ ఎమ్మెల్సీలు కావాలనే అడ్డుకున్నారన్నారు ప్రభుత్వ ఉద్యోగుల ఉసురు చంద్రబాబుకు తప్పదని, ఏపీ అభివృద్ధికి చంద్రబాబే అడ్డుగా ఉన్నారని ఆయన విమర్శించారు. -
‘అది ఇష్టం లేకే బాబు ఇలా చేస్తున్నాడు’
సాక్షి, అనంతపురం: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ప్రతిపక్షనేత చంద్రబాబు పై ఫైర్ అయ్యారు. కరోనాలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నీచ రాజకీయాలు చేయటం సిగ్గుచేటు అని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు హైదరాబాద్ లో కూర్చొని ఏపీ ప్రభుత్వం పై విమర్శలు చేయటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు ఇంట్లో కూర్చొని ప్రభుత్వం పై అభాండాలు వేస్తున్నారని, ప్రజలందరూ టీడీపీకి రాజకీయ సమాధి కట్టాలని పిలుపునిచ్చారు. (కోవిడ్-19 చంద్రబాబు హయాంలో వచ్చుంటే...) కరోనా మహమ్మారి కట్టడి కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేయింబవళ్లు శ్రమిస్తున్నారని తెలిపారు. సీఎం కృషి వల్లే కరోనా పరీక్షలు సామర్ధవంతంగా జరుగుతున్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పనితీరును దేశమంతా అభినందిస్తోందన్న ఆయన చంద్రబాబుకు ఈరర్ఫ్య, అసూయ చాలా ఎక్కువన్నారు. అందుకే జగన్‌కు మంచి పేరు రావడం ఇష్టం లేక లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని వెంకటరామిరెడ్డి ధ్వజమెత్తారు. (‘ప్రతిపక్ష నేత లేక పనికిమాలిన వాడివా’) -
‘కుట్రలకు చంద్రబాబు మారుపేరు’
సాక్షి,అనంతపురం: కుట్రలకు మారుపేరు చంద్రబాబు అని.. స్థానిక ఎన్నికలను ఆయనే వాయిదా వేయించారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ ప్రభంజనం చూసి చంద్రబాబు భయపడ్డారని తెలిపారు. ‘‘రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్‌కుమార్ చౌదరి చంద్రబాబు మనిషి. కావాలనే ఇంటిపట్టాల పంపిణీ ఆపించి వేశారు. ఏపీలో సంక్షేమ పథకాలు ప్రజలకు అందకుండా చంద్రబాబు సైంధవుడిలా అడ్డుకున్నారని’’ నిప్పులు చెరిగారు. చంద్రబాబు కనుసన్నల్లో పనిచేసే సీపీఐ నేతలు ముఖానికి మాస్క్‌లు కట్టుకుని నిన్ననే ప్రెస్ మీట్ పెట్టారన్నారు. కరోనా వైరస్‌పై ఎల్లో మీడియాతో ప్రముఖంగా వార్తలు రాయించారని విమర్శించారు. వ్యూహాత్మకంగానే స్థానిక ఎన్నికలను చంద్రబాబు వాయిదా వేయించారని ఆయన మండిపడ్డారు. (కరోనాకు, ఎన్నికల వాయిదాకు సంబంధమేమిటి?) దేశ ఎన్నికల చరిత్రలో చీకటి రోజు: తలారి రంగయ్య.. దేశ ఎన్నికల చరిత్రలోనే నేడు చీకటి రోజు అని..చంద్రబాబు డైరెక్షన్లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పనిచేయడం దురదృష్టకరమని ఎంపీ తలారి రంగయ్య అన్నారు. స్థానిక ఎన్నికలు జరిగితేనే ఏపీకి ఐదువేల కోట్లు వస్తాయని పేర్కొన్నారు. ఇళ్ల పట్టాల పంపిణీని ఆపే అధికారం ఎన్నికల కమిషనర్‌కు లేదన్నారు. సంక్షేమ పథకాలను ప్రజలకు అందకుండా చేయడానికి టీడీపీ కుట్రలు చేస్తోందని ధ్వజమెత్తారు. ఏపీ అభివృద్ధి చంద్రబాబుకు ఇష్టం లేదా.. వైఎస్సార్సీపీ మెజార్టీ స్థానాల్లో ఏకగ్రీవం అయితే ఎన్నికలు నిలిపేస్తారా అంటూ ఎంపీ రంగయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. (చంద్రబాబు కనుసన్నల్లో రమేష్ కుమార్.. ) -
సిట్ విచారణలో అన్ని వాస్తవాలు బయటకొస్తాయి
-
‘చంద్రబాబు ఆరోపణలు అర్థరహితం’
సాక్షి, అనంతపురం: కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేయటం ద్వారా రాయలసీమకు న్యాయం జరుగుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి అన్నారు. శుక్రవారం అనంతపురంలో ఎమ్మెల్యేలు తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిపాలన అద్భుతమని, ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలన్న ఆయన ప్రతిపాదనలు హర్షణీయమని పేర్కొన్నారు. ఏపీలోని అన్ని జిల్లాల అభివృద్ధికి సీఎం జగన్ కృషి చేస్తున్నారని వ్యాఖ్యానించారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆరోపణలు అర్థరహితమని.. అమరావతి చుట్టూ చంద్రబాబు, ఆయన బినామీలు భూములు కొన్నారని ఎమ్మెల్యే తెలిపారు. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేందుకు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. పోలీసులను జేసీ దివాకర్ రెడ్డి కించపరిస్తే.. చంద్రబాబు నవ్వటం దుర్మార్గ చర్య అని ధ్వజమెత్తారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు హింసకు పాల్పడాలని చంద్రబాబు పరోక్షంగా ప్రోత్సహిస్తున్నారని దుయ్యబట్టారు. గత ఐదేళ్లలో వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై జరిగిన దాడులు చంద్రబాబుకు కనిపించలేదా అని ప్రశ్నించారు. తమ పార్టీ నేతల హత్యలకు చంద్రబాబు బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. 40 ఏళ్ల పొలిటికల్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు రాజకీయ హింసను ప్రేరేపిస్తున్నారని విమర్శించారు. సీఎం జగన్ శాంతి భద్రతలకు పెద్దపీట వేస్తున్నారని, ఆయన పరిపాలన దేశానికే ఆదర్శమని అన్నారు. సీఎం జగన్ నిర్ణయాలతో చంద్రబాబు బెంబేలెత్తిపోయి పోలీసులను బెదిరిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో పోలీసులపై మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసిన కూడా ఆయన ఖండించకపోవడం సిగ్గుచేటన్నారు. 30 సంవత్సరాల నుంచి పోలీసు వ్యవస్థను అడ్డంపెట్టుకుని తాడిపత్రి నియోజకవర్గంలో ఎంతో మందిపై అక్రమ కేసులు బనాయిస్తూ ఇబ్బందులకు గురిచేశారని పేర్కొన్నారు. ప్రస్తుతం జేసీ సోదరుల ఆటలు సాగకపోయేసరికి పోలీసులపై అసభ్య పదజాలంతో అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. జేసీ సోదరులపై దాదాపు 15 కేసులకు పైగా నమోదయ్యాయని, కానీ ఒక్క కేసులో కూడా వారిని అరెస్టు చేయకపోవడం వల్లే పోలీసులంటే భయం పోయిందని ఆయన విమర్శించారు. (చదవండి: బూట్లు నాకే పోలీసులను పెట్టుకుంటా : జేసీ) -
‘బాబు డైరెక్షన్లో పవన్ కల్యాణ్’
సాక్షి, అనంతపురం: చంద్రబాబు, పవన్ కల్యాణ్ అదే పనిగా సీఎం జగన్మోహన్రెడ్డిని విమర్శిస్తున్నారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకర్ నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం ప్రజల అవసరాల కోసమే ఇసుక సరఫరా చేస్తోందని మంత్రి తెలిపారు. కానీ, ముఖ్యమంత్రి జగన్‌ను పవన్, చంద్రబాబు కావాలనే టార్గెట్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. బాబు, పవన్ ఒక్కటేనని ఎద్దేవా చేశారు. అనంతపురం రోడ్లు భవనాల శాఖ అతిథి గృహంలో ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డితో కలిసి శంకర్‌నారాయణ మీడియాతో మాట్లాడారు. ఐదేళ్ల పాలనా కాలంలో ఇసుక మాఫియా ద్వారా వందల కోట్లు సంపాదించిన టీడీపీ నాయకులు ఇప్పుడు ధర్నాలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. చంద్రబాబు డైరెక్షన్లో పవన్ పనిచేస్తున్నారని ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి విమర్శించారు. అందుకనే సీఎం జగన్‌పై పసలేని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీ ఖజానాను చంద్రబాబు ఖాళీ చేశారని, అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనత బాబుదేనని అన్నారు. ఇసుక కొరత రాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు. -
కాకమ్మ కథలు చెప్పకండి
సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైద్య రంగానికి పెద్దపీట వేస్తున్నారని, ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, తీరు మారకపోతే చర్యలు తప్పవని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి హెచ్చరించారు. ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో శిశు మరణాలు పెరిగిన నేపథ్యంలో మంగళవారం ఆయన జిల్లా కలెక్టర్ సత్యనారాయణతో కలిసి తనిఖీ నిర్వహించారు. సాక్షి, అనంతపురం న్యూసిటీ: సర్వజనాస్పత్రిలో వైద్యసేవలు మెరుగుపడాలని, కొందరు వైద్యుల వల్లే సమస్యలొస్తున్నాయని, వారు పనితీరుమార్చుకోకపోతే చర్యలు తప్పవని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి హెచ్చరించారు. సమన్వయలోపంతో ప్రజలను ఇబ్బంది పెడితే ఉపేక్షించేది లేదన్నారు. మంగళవారం ఆయన జిల్లా కలెక్టర్ సత్యనారాయణ, జేసీ–2 సుబ్బరాజుతో కలసి ఆస్పత్రిలోని ఎస్ఎన్సీయూను తనిఖీ చేశారు. యూనిట్లో ఉన్న సదుపాయాలు...అందుతున్న సేవలపై వారు ఆరా తీశారు. చిన్న సమస్యలు పరిష్కరించుకోరా? ఎస్‌ఎన్‌సీయూతో పాటు చాలా వార్డుల్లో ఏసీలు, ఫ్యాన్లు ఎందుకు పని చేయడం లేదని ప్రశ్నించగా..సూపరింటెండెంట్ డాక్టర్ జగన్నాథ్ అన్నీ పనిచేస్తున్నాయని చెప్పగా..ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. సమస్యకు పరిష్కారం చూపకుండా నిర్లక్ష్యంగా సమాధానమెందుకిస్తారన్నారు. చిన్న సమస్యలను పరిష్కరించుకోకపోతే ఎలాగన్నారు. వార్డులవారీగా సమీక్షలు నిర్వహించి ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి సమస్యలను తీసుకెళ్లి మౌలిక సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకుంటామని, అసెంబ్లీ సమావేశాల్లో ఈ విషయాలను ప్రస్తావిస్తామన్నారు. తీరు మారకపోతే చర్యలు అనంతరం వివిధ విభాగాల అధిపతులతో కలెక్టర్, ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. ఆస్పత్రిలో గత ఐదు నెలల్లో 168 మరణాలు చోటు చేసుకోవడం బాధాకరమన్నారు. దీనిపై ప్రశ్నిస్తే వైద్యులు కాకమ్మ కథలు చెబుతున్నారని ఎమ్మెల్యే ‘అనంత’ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జగన్నాథ్, చిన్న పిల్లల విభాగాధిపతి మల్లీశ్వరి కల్పించుకుంటూ ప్రైవేట్ ఆస్పత్రుల నుంచి చివరి క్షణంలో కేసులు వస్తున్నాయని చెప్పగా.. చివరి క్షణంలో కేసులు వస్తే రెఫర్ చేసిన ఆస్పత్రి వివరాలను కేస్ షీటులో ఎందుకు నమోదు చేయలేని ప్రశ్నించారు. ఇక నుంచి ప్రతి రెఫరల్ కేసు వివరాలను నమోదు చేయాల్సిందేనన్నారు. ప్రైవేట్ నర్సింగ్‌హోంలపై నిఘా పెంచేలని డీఎంహెచ్ఓను ఆదేశించారు. అక్కడ పనిచేస్తున్న వైద్యులే చివరి క్షణంలో కేసులను సర్వజనాస్పత్రికి రెఫర్ చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. కలెక్టర్ సత్యనారాయణ సైతం వైద్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వందల సంఖ్యలో మరణాలు ఏవిధంగా చోటు చేసుకుంటాయని ప్రశ్నించారు. గర్భిణులకు అందుతున్న సేవలను పరిశీలన చేయాలని ఐసీడీఎస్ పీడీ చిన్మయాదేవికి సూచించారు. శిశుమరణాలపై నివేదిక ఇవ్వండి ఆస్పత్రిలోని విభాగాల అధిపతులంతా బాధ్యతగా పని చేసి ప్రజలకు మెరుగైన సేవలందించాలని కలెక్టర్ సత్యనారాయణ సూచించారు. వైద్యుల మధ్య సమన్వయలోపం ఎందుకు వస్తోందని సూపరింటెండెంట్ డాక్టర్ జగన్నాథ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. శిశు మరణాలపై విచారణ చేసి త్వరగా పూర్తిస్థాయిలో నివేదిక సమర్పించాలని సూపరింటెండెంట్‌కు, జిల్లా వైద్యాధికారి డాక్టర్ అనిల్ కుమార్‌ను ఆదేశించారు. సమావేశంలో అసిస్టెంట్ ఆర్ఎంఓ డాక్టర్ విజయమ్మ, జిల్లా అంధత్వ నివారణధికారి డాక్టర్ కన్నేగంటి భాస్కర్, హెచ్ఓడీలు డాక్టర్ రామస్వామినాయక్, డాక్టర్ నవీన్, డాక్టర్ నవీద్ అహ్మద్, డాక్టర్ ఆత్మారాం పాల్గొన్నారు. -
జిల్లాకు మహానేత వైఎస్ హయాంలోనే న్యాయం
సాక్షి ప్రతినిధి, అనంతపురం : ‘‘జిల్లా గతిని మార్చేందుకు శాయశక్తులా శ్రమించిన వ్యక్తి ఎవరైనా ఉన్నరంటే అది దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఒక్కరే. సొంత జిల్లా కడప కంటే ‘అనంత’ అభివృద్ధికే పరితపించారాయన. ఫలానా పని కావాలని మేం ఫైలు తీసుకెళితే ఒక్కటి కూడా ‘కాదు.. కూడదు’ అన్న మనిషేకాదు. ‘మీ జిల్లాకు ఎంత చేసినా తక్కువే..’ అంటూ చిరునవ్వుతో సంతకం చేసి పంపేవారు. అలాంటి మహామనిషిని కోల్పోవడం చాలా బాధాకరం. చంద్రబాబు ఐదేళ్లపాలన చూస్తే వంచన, అబద్దాలు, మోసం మినహా మరొకటి లేదు. టీడీపీని ఆదరించిన పాపానికి జిల్లాను వంచించిన తీరు దుర్మార్గం. ఈ జిల్లాకు మళ్లీ న్యాయం జరగాలన్నా.. కష్టాలు తీరాలన్నా.. అభివృద్ధి పట్టాలెక్కి అన్ని వర్గాలు సుఖసంతోషాలతో ఉండాలన్నా వైఎస్ తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డితోనే సాధ్యం. చంద్రబాబు పాలనను ఇన్నేళ్లు చూసిన ప్రజలంతా జగన్‌కు ఒక్క అవకాశం ఇవ్వండి. సంక్షేమపాలన చూస్తారు.’’ అని సీనియర్ నేత, మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి అన్నారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ‘సాక్షి’ ఇంటర్వ్యూలో ఆయన జిల్లా స్థితిగతులు పంచుకున్నారు. సాక్షి: ఇన్నేళ్లు ఎంపీగా పోటీ చేశారు? తొలిసారి ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతున్నారు? ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారని భావిస్తున్నారు? ‘అనంత’: నాలుగుసార్లు ఎంపీగా పోటీ చేశా. నా రాజకీయ జీవితంలో నాకు అత్యంత సంతృప్తినిచ్చింది వైఎస్ ప్రభుత్వం. నేను రైతునే. నీళ్ల విలువ తెలిసినవాడిని. మా నాన్న పేరుతో ‘అనంత’ వెంకటరెడ్డి హంద్రీ–నీవా పథకాన్ని వైఎస్ ప్రారంభించినప్పుడు ఎంతో ఆనందం కలిగింది. హెచ్చెల్సీ ఆధునికీరణ, ఛాగళ్లు, పెండేకల్లు, శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం ద్వారా సగం జిల్లా మంచినీటి సమస్య తీర్చాం. అనంతపురం సిటీ కోసం పీఏబీఆర్ నుంచి పైపులైన్‌తో పాటు ఎన్నో అభివృద్ధి కార్యక్రామలు చేశాం. టీడీపీ నేతలు గత ఐదేళ్లలో ఫలాన అభివృద్ధి చేశామని చెప్పగలరా? వ్యవస్థలను నిర్వీర్యం చేశారు. 12 అసెంబ్లీ, 2 ఎంపీ స్థానాలు గెలిపిస్తే అభివృద్ధి, సంక్షేమాన్ని విస్మరించారు. ధనార్జనే ధ్యేయంగా పనిచేశారు. సాక్షి: చెరువులకు నీళ్లు ఇచ్చామని చెబుతున్నారు? ‘అనంత’: హంద్రీ–నీవా ద్వారా 3.50లక్షల ఎకరాలకు సాగునీరు, అన్ని చెరువులకు నీళ్లివ్వాలని జీఓ ఉంది. 7 ఏళ్లుగా నీళ్లు వస్తున్నాయి. 30 ఎకరాలకు నీరివ్వలేదు. ఏడాదిలోపు సాగునీరు ఇస్తామన్నారు. 25సార్లు సీఎం వచ్చారు. నీరివ్వలేదు. పాదయాత్ర ద్వారా కృష్ణాజలాలను 2012 నవంబర్ 29న జీడిపల్లికి తీసుకొచ్చాం. సాగునీరు ఉంటే వలసలు ఆగేవి. కేంద్ర ప్రభుత్వ సర్వేలో ‘అనంత’లో కనీవినీ ఎరుగని రీతిలో వలసలు ఉన్నాయని తేలింది. 280మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. కలెక్టర్ ఆధ్వర్యంలో కేరళకు ఓ బృందం వెళ్లింది. అయినా చీమకుట్టినట్లయినా లేని ప్రభుత్వం ఇది. సాక్షి: పారిశ్రామిక అభివృద్ధికి టీడీపీ ప్రభుత్వం పాటుపడలేదా? ‘అనంత’: ప్రత్యేకహోదా వచ్చి ఉంటే జిల్లా బాగుపడేది. చంద్రబాబు అడ్డుకున్నారు. బెల్, సెంట్రల్ కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ అకాడమీలకు పసుపు, కాషాయ కండువాలు కలిపి వేసుకుని చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఇప్పుడు ఆ రాళ్లు కూడా ఉన్నాయో లేదో తెలీదు. కియా వచ్చిందని చెబుతున్నారు. బినామీ పేర్లతో భూములు కొనుగోలు చేసి రియల్ఎస్టేట్ వ్యాపారం చేశారు. ఏపీఐఐసీ సేకరించిన భూములు ఇప్పటి వరకూ కియాకు బదిలీ చేయలేదు. ముడుపులు ఇవ్వలేదని ఆ ప్రక్రియ నిలిపేశారు. కియాలో చంద్రబాబుకు భాగస్వామ్యం ఉందని తెలుస్తోంది. అధికారపార్టీ నేతలంతా కియా పేరుతో చేయని అవినీతి లేదు. అయినా సీఎం మాట్లాడలేదంటే ఆయనకు వాటాలు ఉండటమే. సాక్షి: అనంతపురం రైల్వేబ్రిడ్జి తానే తెచ్చానని ఎంపీ జేసీ చెబుతున్నారు? ‘అనంత’: సిగ్గుపడాలి.రాయదుర్గం–తుముకూరు రైల్వేలైన్ వైఎస్ హయాంలో తెస్తే 90శాతం పనులు పూర్తి చేశాం. తక్కిన 10శాతం ఇప్పటికీ ఈయన చేయించలేదు. గుంతకల్లు–బెంగళూరు లైన్‌కు ఎలక్ట్రిఫికేషన్ మంజూరు చేస్తే ఇప్పటికీ పూర్తి చేయలేదు. ఇదీ ఆయన పరిస్థితి. రాంనగర్ రైల్వేబ్రిడ్జికి నేను నిధులు మంజూరు చేయించా. అంతేకాదు.. నగరంలో మంచినీటిపైపులైన్ పనులకు నా హయాంలో టెండర్లు కూడా వేశారు. అవి ఇప్పడు వీరు చేస్తున్నారంతే. కొత్తగా వీళ్లు పూచిక పుల్ల తీసుకురాలేదు. ఎంపీ, ఎమ్మెల్యే, మేయర్ మూడు కుంపట్లలా కొట్టుకుని అభివృద్ధిని విస్మరించారు. ఆధిపత్యపోరు కోసం కార్పొరేటర్లు, టీడీపీ కేడర్‌ను విభజించి నిత్యం తగవులాడుతున్నారు. కార్పొరేషన్ అవినీతిలో కూరుకుపోయిందని ఎంపీ, ఎంపీ కళ్లజోడు తీస్తే తెలుస్తుందని మేయర్, జేసీ చిట్టా మొత్తం నా వద్ద ఉందని ఎమ్మెల్యే అన్నారు. ఈ గుట్టు ఎంటో ముగ్గురూ ప్రజలకు చెప్పి ఓట్లు అడగాలి. సాక్షి: మీరు గెలిచి, మీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏం చేస్తారు? ‘అనంత’: వైఎస్ హయాంలో కేంద్రం నుంచి జేఎన్యూఆర్ గ్రాంటు ద్వారా రూ.72కోట్లతో అనంతపురానికి మంచినీళ్లు తెచ్చాం. ఈరోజు 90శాతం ఇళ్లలో ఆటోల ద్వారా మినరల్ వాటర్ కొంటున్నారు. నేను గెలిస్తే ప్రతీ ఇంటికి స్వచ్ఛమైన తాగునీళ్లు ఇస్తాం. అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, రింగ్‌రోడ్డు పూర్తి చేసి డంప్‌యార్డు తరలిస్తాం. వైఎస్ హయాంలో కురుగుంట, ఉప్పరపల్లెలో వేల మందికి ఇళ్లు నిర్మించి ఇచ్చాం. మళ్లీ ఇళ్లు లేనివారికి ఇళ్లు ఇస్తాం. ఇళ్లకోసం ప్రభాకర్‌చౌదరి ప్రజల సొమ్ముతో డీడీలు తీయించారు. ఇవేవీ లేకుండా ఇళ్లు ఇస్తాం. సాక్షి: చివరగా మీ ప్రభుత్వం ఎలాంటి పాలన అందిస్తుంది? ‘అనంత’: ఎమ్మెల్యేల ఇళ్లే తహసీల్దార్, పోలీసు కార్యాలయాలు అయ్యాయి. మేం అధికారంలోకి వస్తే ప్రతీ ఉద్యోగి తన ఉద్యోగ ధర్మాని అంతఃకరణ శుద్ధితో చేయగలిగే స్వేచ్ఛ ఇస్తాం. నా అనుభవాన్ని నియోజకవర్గంతో పాటు జిల్లా అభివృద్ధికి ఉపయోగిస్తా. 2 ఎంపీ, 14మంది ఎమ్మెల్యేలను గెలిపించండి. జగన్‌కు అవకాశం ఇవ్వండి, సుభిక్షపాలన అందిస్తారు. సాక్షి: మీ ప్రత్యర్థి ప్రభాకర్ చౌదరిపై రెండు మాటల్లో చెప్పమంటే..? ‘అనంత’: కబ్జాకోరు. మునిసిపల్ చైర్మన్‌గా ఉన్నప్పుడు ట్రస్టులు పెట్టుకుని ప్రభుత్వ ఆస్తులు దోచుకున్నారు. సంఘమిత్రకు 99 ఏళ్లు లీజుకు ఇవ్వడం చట్టవిరుద్ధం. తీసుకున్నారు. ఇంటివద్దే మునిసిపల్ స్కూలుకు నాటకరంగం పేరుతో 99 ఏళ్లకు లీజుకు తీసుకున్నారు. 5ఎకరాలకుపైగా కార్పొరేషన్ స్థలాలు అమ్మేశాడు. సాక్షి: అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, రింగ్‌రోడ్డు నిర్మించక పోతే నామినేషన్ వేయనని గత ఎన్నిల్లో ప్రభాకర్ చౌదరి చెప్పారు? ఇప్పుడు మళ్లీ బరిలో ఉన్నారు? ఏమంటారు? ‘అనంత’: అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, రింగ్‌రోడ్డు పూర్తి చేస్తేనే నామినేషన్ వేస్తా. లేదంటే పోటీ చేయనని 2014లో చెప్పారు. ఇప్పుడు ఇంకో అవకాశం ఇవ్వండని సిగ్గులేకుండా అడుగుతున్నారు. ఎంపీ, ఎమ్మెల్యే ఇద్దరూ కలిసి వారి జెండా కింద నిలబడలేని వ్యక్తులు. వీరు సమన్వయంతో జిల్లా, నగరం అభివృద్ధికి పాటుపడతారా? ఆలోచించాలి. ఎంపీగా రంగయ్య, ఎమ్మెల్యేగా నాకు అవకాశం ఇ వ్వండి. మూన్నెల్లలోపు అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులు మంజూరు చేస్తాం. ట్రాఫిక్ నిర్మూలన కోసం రింగ్‌రోడ్డు పూర్తి చేసి, మరో టౌన్షిప్ నిర్మిస్తాం. వ్యాపారులకు ఇబ్బంది లేకుండా ఒప్పించి రోడ్ల విస్తరణ చేస్తాం. కేంద్ర నిధులతో తిలక్‌రోడ్డులో సిమెంట్‌రోడ్లు వేయించా. రూ.40కోట్లతో శివారు ప్రాంతాల్లో రోడ్లు వేశాం. రోడ్ల వెడల్పును ఓ సమస్యగా చిత్రీకరించి ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారు. ఈ సమస్యను సీఎం కూడా పరిష్కరించలేకపోయారు. ఇతను ఒక ముఖ్యమంత్రా? సర్పంచ్ కంటే అధ్వానంగా వ్యవహరించారు. -
‘హోదా సాధించటంలో బాబు విఫలం’
అనంతపురం: ప్రత్యేక హోదా సాధించటంలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పూర్తిగా విఫలమయ్యారని మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ అనంతపురం ఎమ్మెల్యే అభ్యర్థి అనంత వెంకట్రామి రెడ్డి తీవ్రంగా విమర్శించారు. అనంతపురంలో విలేకరులతో మాట్లాడుతూ..ఏపీలో 25 ఎంపీ సీట్లలో వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపిస్తే వైఎస్ జగన్ ప్రత్యేక హోదా కచ్చితంగా తెస్తారన్న నమ్మకం ఉందన్నారు. ప్రత్యేక హోదా ఇచ్చే పార్టీకే కేంద్రంలో మా మద్ధతు ఉంటుందన్నారు. వైఎస్ జగన్ ప్రకటించిన మేనిఫెస్టో వల్ల అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరీ, మేయర్ స్వరూప అవినీతి వల్ల అనంతపురం అభివృద్ధి కుంటుపడిందని వ్యాక్యానించారు. హామీలు ఇచ్చి మోసం చేసిన టీడీపీ నేతలకు ఓట్లు అడిగే హక్కే లేదన్నారు. -
చైతన్య గీతిక..అనంతపురం
ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక వర్గాలతో పాటు అన్ని సామాజిక వర్గాలకు నిలయం. విద్యార్థి ఉద్యమాలకు పెట్టింది పేరు. ఎందరో ఉద్దండులను రాష్ట్రానికి అందించిన నేల. దాతృత్వంలోనైనా.. అన్యాయాన్ని ఎదిరించడంలోనైనా ఇక్కడి ప్రజలు ముందుంటారు. అందుకే ఇక్కడి ప్రజలకు రాజకీయ చైతన్యం అనంతం. ఇప్పటిదాకా రెండు ఉప ఎన్నికలతో పాటు 16 సార్లు ఎన్నికలు జరిగాయి. ఇందులో కాంగ్రెస్ అత్యధికంగా 9 సార్లు విజేతగా నిలిచింది. సాక్షి, అనంతపురం : అనంతపురం నియోజకవర్గం 1952లో ఏర్పడింది. గతంలో అనంతపురం పట్టణంతోపాటు రూరల్ మండలం, బుక్కరాయసముద్రం, రాప్తాడు మండలాల్లో కొంత భాగం ఉండేది. 2009లో నియోజక వర్గాల పునర్విభజన జరిగిన తరువాత అనంతపురం పట్టణంతో పాటు రూరల్ మండలంలోని ఎ.నారాయణపురం పంచాయతీ పరిధిలో సగభాగం, రుద్రంపేట, రాజీవ్‌కాలనీ, రూరల్ పంచాయతీలు మాత్రమే ఈ నియోజక వర్గంలోకి వచ్చాయి. బుక్కరాయసముద్రం శింగనమల నియోజవర్గంలోకి వెళ్లగా, రాప్తాడు నియోజకవర్గంగా ఏర్పడింది. ఈ నియోజకవర్గంలోకి అనంతపురం రూరల్ మండలంలో 80 శాతం విలీనం చేశారు.అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 4.50 లక్షల జనాభా ఉంది. అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో 2,22,652 ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 1,10,503 మంది, మహిళలు 1,12,109 మంది ఉన్నారు. థర్డ్ జండర్ 40 ఓట్లు ఉన్నాయి. అనంతపురం నగరంలో 50 డివిజన్లు ఉన్నాయి. అనంతపురం రూరల్ మండలంలోని ఎ.నారాయణపురం, రాజీవ్‌కాలనీ, రుద్రంపేట, అనంతపురం రూరల్ పంచాయతీలు వస్తాయి. ఈ పంచాయతీల్లో 33వేలు ఓట్లు ఉన్నాయి. తక్కిన 1,89,319 ఓట్లు నగర పరిధిలో ఉన్నాయి. మొత్తం 256 బూత్‌లు ఏర్పాటు చేశారు. మున్సిపాలిటీ నుంచి నగరపాలక సంస్థగా హోదా పెరిగిన తరువాత రెండుసార్లు మేయర్ ఎన్నికలు జరిగాయి. అనంతపురం నగర మొదటి మేయర్‌గా కాంగ్రెస్ పార్టీ తరపున రాగే పరశురాం 2009 నుంచి 2014 దాకా పనిచేశారు. రెండో మేయర్‌గా టీడీపీకి చెందిన స్వరూప ప్రస్తుతం కొనసాగుతున్నారు. జిల్లాలో ఉన్న మిగతా 13 నియోజకవర్గాలతో పోల్చితే అనంతపురం నియోజక వర్గంలో పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. గ్రామీణ ప్రాంతాల నుంచి వలసలు వచ్చిన దాదాపు అన్ని సామాజిక వర్గాలు ఇక్కడ స్థిరపడ్డాయి. ఏటా ఇక్కడికి వలసలు వచ్చి ఓటర్లుగా నమోదవుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు, శ్రామికుల ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. ఓట్లు పరిశీలిస్తే బలిజలు, ముస్లింలు, ఆర్యవైశ్యులు ప్రాధాన్యతగా ఉంటాయి. వైఎస్సార్ కృషితో తాగునీటి సమస్య పరిష్కారం 2004కు ముందు అనంతపురం పట్టణంలో విపరీతమైన తాగునీటి ఎద్దడి ఉండేది. మామూలు రోజుల్లోనే నాలుగైదు రోజులకోసారి తాగునీళ్లు వచ్చేవి. ఇక వేసవి కాలం వస్తే 10–15 రోజులకోసారి కూడా వదిలే పరిస్థితి ఉండేది కాదు. రోజూ నీటి ట్యాంకుల వద్ద మహిళల యుద్ధాలు జరిగేవి. ఈ పరిస్థితుల్లో వైఎస్సార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రూ. 67 కోట్లతో పీఏబీఆర్ పథకానికి శ్రీకారం చుట్టారు. కేంద్రాన్ని ఒప్పించి 80 శాతం నిధులు తెప్పించారు. తక్కిన 20 శాతంలో పది శాతం రాష్ట్ర ప్రభుత్వం, తక్కిన 10 శాతం మునిసిపాలిటీ భరించాల్సి ఉన్నా...ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ పది శాతం కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించేలా వైఎస్సార్ చర్యలు తీసుకున్నారు జీఓ విడుదల అయి, పనులు ప్రారంభించి 2010 నాటికి నగరానికి నీళ్లు వచ్చాయి. వచ్చే 30 ఏళ్ల వరకు అంచనాతో ఈ ప్రాజెక్ట్‌ను రూపొందించినా 40 ఏళ్లు దాకా ఎలాంటి ఇబ్బందులుండవని అధికారులు చెబుతున్నారు. పీఏబీఆర్ నీటి పథకం రావడంతో నగరంలోని ఏ కాలనీలోనూ నీటి సమస్యే లేదు. రోజూ ప్రజలకు అవసరం కంటేకూడా ఎక్కువగానే నీటి నిలువ ఉంటోంది. అయితే ప్రస్తుత పాలక వర్గం తప్పిదాలతో చాలా కాలనీలకు నీటి సరఫరా సక్రమంగా జరగడం లేదు. పట్టణంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి రూ.15 కోట్లతో రహదారుల నిర్మాణం, అనంతపురం–తాడిపత్రి రహదారికి రూ.55 కోట్లు వెచ్చించి బైపాస్ రోడ్డు నిర్మాణం చేపట్టారు. వర్షం వస్తే మురుగునీరు రోడ్లు, నివాసాల్లోకి రాకుండా ఉండేందుకు మరువవంక, నడిమివంకల ఆధునికీకరణకు రూ.56 కోట్లు మంజూరు చేసిన కరకట్టలు నిర్మించారు. నడిమివంక దాదాపు పూర్తయినా మరువవంక పెండింగ్ ఉంది. మిగులుగా ఉన్న రూ. 17 కోట్ల నిధులను ప్రస్తుత ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి మరో నియోజకవర్గంలో రోడ్డు నిర్మాణానికి తరలించారు. ఫలితంగా మరువవంక ఆనుకుని ఉన్న కాలనీలను చిన్నపాటి వర్షానికి జలమయం అవుతూ ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. వైఎస్ హయాంలోనే నగరంలోని పేదలకు ఇందిరమ్మ పథకం కింద 2,200 ఇళ్లు నిర్మించి ఇచ్చారు. వేలాది మంది వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు పింఛన్లు మంజూరు చేశారు. ‘అనంత’ను అక్కున చేర్చుకున్న ప్రజలు కాంగ్రెస్ పార్టీ తరుఫున నాలుగుసార్లు ఎంపీగా గెలిచిన అనంత వెంకటరామిరెడ్డి ఈసారి అనంతపురం అసెంబ్లీలో వైఎస్సార్సీపీ తరఫున బరిలో నిలుస్తున్నారు. వివాదారహితుడిగా, సౌమ్యుడిగా పేరున్న ‘అనంత’ నియోజకవర్గ ప్రజలు అక్కున చేర్చుకుంటున్నారు. అనంతపురం నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించిన తర్వాత నగరంలోని 50 డివిజన్లతో పాటు ఎ.నారాయణపురం, రాజీవ్‌కాలనీ, రుద్రంపేట, అనంతపురం రూరల్ పంచాయతీల్లో ‘రావాలి జగన్–కావాలి జగన్’ కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో విజయవంతం చేశారు. ఈ కార్యక్రమానికి విశేష ఆదరణ లభించింది. ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో నిర్ణయాత్మకమైన ఓటర్లుగా ఉన్న ముస్లింలు పూర్తిగా వైఎస్సార్సీపీ వైపే ఉన్నారు. గత ఎన్నికల్లో రాష్ట్రంలో నాలుగు అసెంబ్లీ సీట్లు ఇచ్చిన వైఎస్సార్సీపీ, ఈసారి మరోసీటు పెంచి ఐదుసీట్లు ఇచ్చింది. తమకు ప్రాధాన్యత ఇచ్చిన వైఎస్సార్సీపీకి అండగా నిలవాలని ఆ వర్గం నిర్ణయించింది. చౌదరికి ఇంటిపోరు ప్రస్తుత ఎమ్మెల్యే వై.ప్రభాకర్‌చౌదరికి సొంత పార్టీలో అసమ్మతి పోరు ఎక్కువగా ఉంది. కేఎం జకీవుల్లా, జయరాంనాయుడు వర్గాలు ప్రభాకర్‌చౌదరిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి. ఈసారి ఎన్నికల్లో చౌదరికి టికెట్ ఇస్తే తాము పార్టీని వీడతామంటూ ఆల్టిమేటం జారీ చేశారు. పదిమంది కార్పొరేటర్లు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఉన్నారు. బలిజలు కూడా తమకు కేటాయించకపోతే తగిన గుణపాఠం చెబుతామంటూ టీడీపీ అధిష్టానానికి హెచ్చరికలు జారీ చేశారు. ఈ క్రమంలో ప్రభాకర్‌చౌదరి, ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు ఇంటిపోరుతో సతమతమవుతున్నారు. మరోవైపు ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే చౌదరి, మేయర్ స్వరూప మధ్య కూడా విభేదాలున్నాయి. వీరి ముగ్గురూ మూడుముక్కలాట ఆడుతూ పార్టీని భ్రష్టు పట్టించారంటూ కార్యకర్తలు పలు సందర్భాల్లా వ్యాఖ్యానించారు. కార్పొరేషన్ పనుల్లో పర్సెంటీజీల వ్యవహారంలో ఎమ్మెల్యే, మేయర్ మధ్య విబేధాలు తారాస్థాయికి చేరాయి. కాంగ్రెస్ కనుమరుగైన తర్వాత అనంతపురం నియోజకవర్గంలో వైఎస్సార్సీపీకి మంచి ఆదరణ ఉంది. -
చంద్రబాబు జిత్తులమారి నక్క
అనంతపురం సప్తగిరి సర్కిల్: ముఖ్యమంత్రి చంద్రబాబు జిత్తులమారి నక్క అని మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ అనంతపురం పార్లమెంటు అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ధ్వజమెత్తారు. ఈ నెల 11న అనంతపురం శివారులోని అశోక్ లైల్యాండ్ ఎదురుగా నిర్వహించనున్న సమర శంఖారావం సభకు సంబంధించి ఏర్పాట్లను శుక్రవారం ఆయన పరిశీలించారు. సభా వేదికకు సంబంధించి పూజ కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు మరోసారి అధికారంలోకి రావాలని కలలు కంటున్నాడని, ఆయన కుట్రలను వైఎస్సార్సీపీ శ్రేణులో సమర్థవంతంగా ఎదుర్కోవాలన్నారు. రానున్న ఎన్నికల్లో విజయం సాధించాలంటే బూత్ కమిటీలే కీలకమని, అందుకోసమే పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బూత్ కమిటీలతో సమావేశం ఏర్పాటు చేశారన్నారు. ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇవ్వడం, ఆ తర్వాత వాటిని విస్మరించడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. త్వరలో ఎన్నికలు వస్తున్నాయని, ఇప్పుడు ఓటర్లకు తాయిలాలు ప్రకటిస్తున్నారని ధ్వజమెత్తారు. 1996లో చంద్రబాబు సీఎం అయ్యాక అప్పటి వరకు కిలో బియ్యం రెండు రూపాయలు ఉండగా, చంద్రబాబు ఐదు రూపాయల ఇరవై పైసలు చేశారన్నారు. అనంతపురం జిల్లాలో హంద్రీనీవాకు మూడు సార్లు శంకుస్థాపన చేసి ఆ తర్వాత వదిలేశారన్నారు. తాజాగా పెన్షన్ రూ.2వేలు, డ్వాక్రా మహిళలకు రూ.10 వేలు ప్రకటించడం వైఎస్ జగన్ నవరత్నాలను కాపీ కొట్టడమేనన్నారు. తాము అధికారంలోకి వస్తే మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలను అందజేస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతం చంద్రబాబును ప్రజలు నమ్మడం లేదన్నారు. వైఎస్సార్సీపీని, వైఎస్ జగన్మోహన్రెడ్డిని జనం విశ్వసిస్తున్నారని, రానున్న ఎన్నికల్లో ప్రజలు బాబుకు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. నవరత్నాలను తమ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి ప్రకటించిన సమయంలో ఆ పథకాలు అమలు చేయాలంటే కేంద్ర బడ్జెట్ సరిపోదని చెప్పిన ముఖ్యమంత్రి, మంత్రులు ఇప్పుడు వాటినే కాపీ కొడుతున్నారన్నారు. ఎన్నికల సమయంలో పోస్ట్ డేటెడ్ చెక్కులను మహిళా సంఘాలకు ఇవ్వడంలో మోసం ఉందన్నారు. బీసీ సబ్‌ప్లాన్ మోసపూరితమని, సొంత పార్టీ ఎమ్మెల్యేలే దీన్ని వ్యతిరేకిస్తున్నారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల ప్రజల నుంచి తిరుగుబాటు ఎదురవుతోందన్నారు. ఎస్సీల సంక్షేమం కోసం తీసుకొచ్చిన సబ్‌ప్లాన్ నిధులను కూడా ప్రభుత్వం దారి మళ్లిస్తోందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం అగ్రవర్ణాలకు 10 శాతం రిజర్వేషన్ ప్రకటిస్తే, అందులో కాపులకు ఐదు శాతం అంటూ చంద్రబాబు చేసిన ప్రకటన మరోసారి కాపులను మోసగించడమేనన్నారు. కాపులు తమను బీసీల్లో చేర్చాలని డిమాండ్ చేస్తుంటే, ఈబీసీ రిజర్వేషన్లలో వాటా ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. చంద్రబాబు రాజకీయ జీవితమంతా మోసం చేయడమేనని, కులాల వారీగా చీల్చి అన్ని వర్గాల ప్రజలను మోసగిస్తున్నాడన్నారు. ఆయన వెంట వైఎస్సార్సీపీ నేతలు కోగటం విజయ్‌భాస్కర్‌రెడ్డి, చింతా సోమశేఖర్‌రెడ్డి, పెన్నోబిలేసు, సాకే చంద్ర, రోషన్ జమీర్, ప్రకాష్‌రెడ్డి, గోవిందరెడ్డి, నగేష్ తదితరులు ఉన్నారు. -
టీడీపీ నేతల దౌర్జన్యాలు కనిపించడం లేదా?
అనంతపురం: వైఎస్సార్ సీపీ నేత, మాజీ కార్పొరేటర్ కోగటం విజయభాస్కర్ రెడ్డి పై అట్రాసిటీ కేసు నమోదు చేయడాన్ని మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి తప్పుబట్టారు. జన్మభూమి కార్యక్రమంలో ప్రజా సమస్యలపై నిలదీశారన్న అక్కసుతో విజయభాస్కర్ రెడ్డిపై పోలీసులు అక్రమ కేసు నమోదు చేశారని మండిపడ్డారు. టీడీపీ నేతల చెప్పుచేతల్లో పోలీసులు పని చేయడం బాధకరమన్న వెంకట్రామిరెడ్డి.. సీఐ, ఎస్సైలకు ఎస్పీ ఆదేశాల కన్నా టీడీపీ ఎమ్మెల్యేల ఆశీస్సులే ముఖ్యమయ్యాయని విమర్శించారు. టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి అనుచరులపై కేసు నమోదు చేయడానికి వెనకడుగు వేస్తున్న పోలీసులు.. వైఎస్సార్సీపీ నేతల్ని టార్గెట్ చేస్తున్నారన్నారు. టీడీపీ నేతల దౌర్జన్యాలు పోలీసులకు కనిపించడం లేదా అని వెంకట్రామిరెడ్డి ప్రశ్నించారు. నగరంలో ఛత్రపతి శివాజీ స్కూల్లో గత శుక్రవారం జన్మభూమి-మా ఊరు సభ నిర్వహించారు. ఈ క్రమంలోనే డివిజన్లో సమస్యలను స్థానికులు సభ దృష్టికి తీసుకొచ్చారు. స్థానికునిగా కోగటం కూడా ఒక సమస్య చెప్పగా..45 డివిజన్ కార్పోరేటర్ లక్ష్మిరెడ్డి సమాధానం చెప్పారు. ‘దీనిపై సమాధానం చెప్పడానికి మీరెవరు, మా డివిజన్లోని సమస్యపై అధికారులు సమాధానం ఇవ్వాలి’ అని కోగటం ప్రశ్నించారు. ఇలా నిలదీసినందుకు కోగటంపై అక్కడే ఉన్న బంగి సుదర్శన్ ఫిర్యాదు చేశారు.దాంతో కోగటంపై కేసు నమోదు చేసిన పోలీసులు పలు సెక్షన్లు బనాయించి అధికార పార్టీ మెప్పు పొందడానికి యత్నించారు. కోగటం-బంగిల మధ్య ఎటువంటి వివాదం జరగకపోయినప్పటికీ బంగి ఫిర్యాదును అందుకున్న పోలీసులు ఆగమేఘాలపై కేసు నమోదు చేయడం చర్చనీయాంశమైంది. -
జూలై 2న వంచనపై గర్జన దీక్ష: వైఎస్సార్సీపీ
సాక్షి, అనంతపురం : రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుకు నిరసనగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో జూలై 2న వంచపై గర్జన దీక్షను నిర్వహించనున్నట్లు మాజీ ఎంపీ వైఎస్సార్సీపీ నేతలు అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ... దీక్ష అనంతపురం ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతుందని అన్నారు. ఈ దీక్షలో రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంపీ పదవులకు సైతం రాజీనామా చేసిన నేతలతో పాటు వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ సమన్వయకర్తలు, పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, ముఖ్య నేతలు పాల్గొంటారని ఆయన అన్నారు. దీక్షలో పాల్గొనే నేతలంతా ఆ రోజున తప్పనిసరిగా నల్లదుస్తులు ధరించాలని విజ్ఞప్తి చేశారు. విభజన హామీల అమలు కాకపోవడానికి కారణం సీఎం చంద్రబాబు, ప్రధాని మోదీనే కారణమని ఆయన ఆరోపించారు. -
పరిహారం ఇవ్వాల్సిందే
జిల్లాలో రూ.4 వేల కోట్ల పెట్టుబడి నష్టం వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకట్రామిరెడ్డి డి.హీరేహాళ్: ‘పంటలకు రైతులు బీమా ప్రీమియం చెల్లించారు. పంట ఎండిపోయింది. ఎండిన పంటకు ఎంత నష్టం వాటిల్లితే అంత బీమా కంపెనీ ఇవ్వాలి. లేదంటే ఇన్పుట్ సబ్సిడీ ద్వారా ప్రభుత్వం చెల్లించాలి. కానీ ఎకరాకు రూ.6 వేలు ఇస్తామని చంద్రబాబు చెబుతున్నారు. రైతుకు హక్కుగా రావాల్సిన డబ్బులను చిల్లర రూపంలో భిక్ష వేస్తారా?' అని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకట్రామిరెడ్డి ధ్వజమెత్తారు. సోమలాపురంలో గడపగడపకూ వైఎస్సార్‌లో పాల్గొన్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ''15.15 లక్షల ఎకరాల్లో వేరుశనగ సాగు చేసిన రైతులు రూ.2,500 కోట్లు పెట్టుబడి పెట్టారు. పత్తికి రూ.750 కోట్లు, కంది, జొన్న, మిరప అన్ని పంటలు కలిపి మొత్తంగా 18 లక్షల ఎకరాలకు రూ.4 వేల కోట్లు పెట్టుబడి రైతులు పూర్తిగా నష్టపోయారు. ప్రభుత్వ ముందుచూపులేమి, హంద్రీ–నీవా నీటిని ప్రణాళిక లేకుండా ధారాదత్తం చేసి ప్రత్యక్షంగా, పరోక్షంగా పంట నష్టపోయేందుకు ప్రభుత్వం కారణమైంది. రైతులు ఖర్చు చేసిన డబ్బులు బీమా కంపెనీతో ఇప్పించాలి. లేదంటే ఇన్‌పుట్‌సబ్సిడీ ద్వారా ప్రభుత్వం ఇవ్వాలి. ఇది రైతుల హక్కు! కానీ ఎకరాకు రూ.6 వేలు ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటన చేశారు. రైతులు నష్టపోయిన పెట్టుబడి ఇవ్వాలని డిమాండ్ చేయాల్సిన టీడీపీ నేతలు రాజధానిలో తలూపి వచ్చేశారు. పైగా 2015కు సంబంధించి 63 కరువు మండలాలను ప్రకటించారు. గత నెల 10న ఇన్‌పుట్‌సబ్సిడీపై జీవో జారీ చేశారు. అందులో 8 జిల్లాలు ఉన్నాయి. అనంతపురం పేరు లేదు. ఎందుకు జిల్లాపై ఈ వివక్ష! ఈ ఏడాది నష్టపోయిన పెట్టుబడి పూర్తిగా ఇవ్వాల్సిందే!'' అని ఆయన డిమాండ్ చేశారు. అలాగే హెచ్చెల్సీ, జీబీసీ, ఎల్ఎల్సీ రైతులు కూడా నష్టపోయారు. రాయదుర్గం ఎమ్మెల్యే హెచ్చెల్సీ రైతులకే పంగనామం పెట్టారు. హెచ్చెల్సీ రైతులకు ఆదుకోవాలన్న ఉద్దేశ్యంతో 3.1/2 టీఎంసీల నీటిని జిల్లా రైతులకు హక్కుగా కేటాయించారు. అలాకాకుండా కర్నూలు జిల్లాకు ఆ నీటిని ధారాదత్తం చేసి ఇక్కడ రైతులకు ఎమ్మెల్యే తీవ్ర అన్యాయం చేశారన్నారు. రైతులకు పరిహారం ఇవ్వకపోతే కోర్టుకు ఇడుస్తామని ఆయన హెచ్చరించారు. హెచ్చెల్సీ, వర్షాధారం క్రింద సాగు చేసిన రైతులందరికి బేషరతుగా పంట రుణాలను రద్దు చేయాలి లేదా అంతే మొత్తంలో పరిహారం చెల్లించాలన్నారు. పార్టీ రాయదుర్గం సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ టీడీపీ నాయకులు ఉపాధి నిధులను నీరు – చెట్టు కార్యక్రమానికి మళ్లించి, యంత్రాలతో పనులు చేయిస్తూ కూలీల కడుపుకొడుతున్నారని విమర్శించారు. సీబీఐతో దర్యాప్తు చేయిస్తే అధికారులంతా జైలుకు వెళతారని హెచ్చరించారు. కార్యక్రమంలో రాష్ట్ర రైతు విభాగం ప్రధాన కార్యదర్శి గౌని ఉపేంద్రరెడ్డి, సదాశివరెడ్డి, ఎస్టీ సెల్ కార్యదర్శి భోజరాజు నాయక్, ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి బీటీపీ గోవిందు, బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్టీ సిద్దప్ప, డీసీఎంఎస్ చైర్మన్ మల్లికార్జున, మండల కన్వీనర్లు వన్నూరుస్వామి, మల్లికార్జున, మాజీ ఎంపీపీ రాజగోపాల్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ నాగిరెడ్డి, సర్పంచ్‌లు పాల్గొన్నారు.