ancient temples
-
ఈ వాస్తు చిత్రలేఖనం.. ఇప్పుడొక ట్రెండ్!
సాక్షి, సిటీబ్యూరో: ప్రాచీన ఆలయాలు, గోపురాలు, గృహాలు వాస్తు శాస్త్రం ప్రకారమే నిర్మించారని భారతీయ వాస్తు శాస్త్రం చెబుతుంది. వాస్తు అంటే బలం, విశ్వాసం! అందుకే ఇల్లు కొంటున్నామంటే చాలు వాస్తు చూడనిదే నిర్ణయం తీసుకోరు. ఈ వాస్తుకు శిల్ప శా్రస్తాన్ని, చిత్రలేఖనాన్ని జోడించిన వాస్తు చిత్రలేఖనానికి కూడా ప్రాధాన్యం పెరిగిపోయింది. గృహాలు, కార్యాలయాలు, హోటళ్లు వంటి అన్ని రకాల భవన నిర్మాణాల్లో వాస్తు పెయింటింగ్‌లను ఏర్పాటు చేస్తున్నారు.చూపరులను ఆకట్టుకునే ఈ వాస్తు చిత్రలేఖనం ఇప్పుడొక ట్రెండ్! దేవాలయానికి, శిల్పకళకు అవినాభావ సంబంధం ఉంది. విశ్వఖ్యాతిగాంచిన భారతీయ శిల్ప కళకు రెండువేల ఏళ్ల నాటి చరిత్ర ఉంది. ఇక్షా్వకులు మొదలుకొని విజయనగర చక్రవర్తుల వరకూ వేర్వేరు కాలాల్లో శిల్ప–చిత్రకళాభివృద్ధికి దోహదం చేశారు. వాస్తు, శిల్పశాస్త్రం, చిత్రలేఖనం మూడు వేర్వేరు కళలను మిళితం చేసి.. నేటి తరానికి, అవసరాలకు అనుగుణంగా అందుబాటులోకి వచి్చందే వాస్తు పెయింటింగ్.బ్రహ్మ ముహూర్తంలోనే.. ఒక కుటుంబంలోని అందరి వ్యక్తుల జాతకం, నక్షత్రం ప్రకారం ఆ ఇంటిలో ఎవరి నక్షత్రం బలంగా ఉంటుందో వారు పూజించాల్సిన దేవుడిని నిర్ణయిస్తారు. ఆ ఇంటి వాస్తు, నక్షత్రం తిథి ప్రకారం బ్రహ్మ ముహూర్తం నిర్ణయిస్తారు. దేవుడిని స్మరిస్తూ, ధాన్యంతో వస్త్రం మీద ఈ పెయింటింగ్‌ను వేస్తారు. ఈ చిత్రలేఖనం జరిగినన్ని రోజులు ఆ నక్షత్రానికి బలం చేకూర్చేందుకు జరగాల్సిన అన్ని రకాల హోమాలు, యోగాలు, క్రతువులు ఆగమ శాస్త్రం ప్రకారం చిత్రకారుడే పూర్తి చేస్తాడు. నరఘోష నివారణకూ పెయింటింగ్ వేస్తుంటారు.ఎన్ని రోజులు పడుతుందంటే.. ఒక పెయింటింగ్ పూర్తవడానికి నక్షత్రాన్ని బట్టి 41 నుంచి 108 రోజుల సమయం పడుతుంది. వీటి ధర నక్షత్రాన్ని బట్టి రూ.10 వేల నుంచి ప్రారంభమవుతుంది. యాక్రాలిక్, మిక్స్డ్ కలర్లను వినియోగిస్తారు. నక్షత్ర బలాన్ని బట్టి వీటిని పూజ గదిలో, హాల్లో ఇంటిలోపల పెట్టే చోటును నిర్ణయిస్తారు.ఇళ్లు, ఆఫీసుల్లో.. రాజకీయ నేతలు, ప్రముఖులు, సెలెబ్రిటీల గృహాలు, విల్లాలు, ఫామ్ హౌస్‌లలో ఈ వాస్తు పెయింటింగ్‌లను వేయిస్తున్నారు. ఆఫీసులు, హోటళ్ల, కార్పొరేట్ కార్యాలయాల్లో కూడా చూపరులను ఆకట్టుకునే ఈ చిత్రలేఖనాలు కనిపిస్తున్నాయి. దక్షిణామూర్తి, అభయ హనుమాన్, యంత్రోద్ధారక హనుమాన్, నందీశ్వర, కలియుగ వేంకటేశ్వర్లు, ఇష్టకామేశ్వరి దేవి, ఆగమనం (పుణ్యపురుషులు), నరదృష్టి నారాయణ యంత్రం, తాండవ గణపతి, నయన దర్శనం, శృంగార దేవి, కొలువు శ్రీనివాసమూర్తి, నర్తకి, అభయ సూర్యనారాయణమూర్తి వంటి దేవుళ్ల పెయింటింగ్స్ వేస్తుంటారు.వాస్తు పెయింటింగ్‌తో మనశ్శాంతి వాస్తు పెయింటింగ్ ఉన్న ఇళ్లలో సానుకూల భావాలను కలిగిస్తుంది. మనశ్శాంతి లభిస్తుంది. చేసే పని మీద ఏకాగ్రత పెరుగుతుంది. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునే వివేకం కలుగుతుంది. – కంభంపాటి, ప్రముఖ వాస్తు చిత్రకారుడుఇవి చదవండి: వయనాడ్ విలయం : ఆమె సీత కాదు...సివంగి -
పురాతన ఆలయాలకు ‘శ్రీవాణి’ వైభవం
తిరుమల: పురాతన ఆలయాల పునరుద్ధరణ, నూతన ఆలయాల నిర్మాణం, హిందూ ధార్మిక ప్రచార, సేవా కార్యక్రమాలే లక్ష్యంగా శ్రీవాణి ట్రస్టు ముందుకు దూసుకుపోతోంది. భక్తుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు శ్రీవాణి ట్రస్ట్ నిధులతో 176 పురాతన ఆలయాలను పునరుద్ధరించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో 2,273 నూతన ఆలయాలు నిర్మించి పూజా కార్యక్రమాలు ప్రారంభించారు. అలాగే 501 ఆలయాలకు ధూపదీప నైవేద్యం కింద ప్రతి నెల రూ.5 వేలు చొప్పున చెల్లిస్తున్నారు. శ్రీవాణి ట్రస్ట్ నిధులతో పెద్ద ఎత్తున హిందూ ధార్మిక ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. 2019లో ట్రస్ట్ విధివిధానాలు ఖరారు: నూతన ఆలయాల నిర్మాణం, పురాతన ఆలయాల పునరుద్ధరణ కోసం టీటీడీ శ్రీవాణి ట్రస్ట్‌ను ప్రారంభించింది. 2018 ఆగస్టు 18వ తేదీనే ట్రస్ట్‌ను అప్పటి ప్రభుత్వం ప్రారంభించినా విధివిధానాలు మాత్రం 2019 సెపె్టంబర్ 23వ తేదీ ఖరారు చేశారు. అప్పటి వరకు కూడా టీటీడీ ట్రస్ట్‌లకు సంబంధించి లక్ష రూపాయలపైగా ఇచ్చిన దాతలకు మాత్రమే దర్శన సౌలభ్యం కల్పించేది. మొదటిసారి రూ.10 వేలను శ్రీవాణి ట్రస్ట్‌కు విరాళంగా అందించిన భక్తులకు ఎలాంటి సిఫార్సు లేఖలు లేకుండా ప్రోటోకాల్ బ్రేక్ దర్శన సౌకర్యం కల్పించే విధానాన్ని ప్రవేశపెట్టారు. దీంతో శ్రీవాణి ట్రస్ట్‌కు భక్తుల నుంచి విశేష స్పందన లభించింది. ప్రోటోకాల్ బ్రేక్ దర్శనంతో ఆదరణ: వాస్తవానికి శ్రీవాణి ట్రస్ట్‌కు భక్తుల నుంచి విశేష స్పందన రావడానికి ప్రధాన కారణం విధివిధానాలే. అప్పటి వరకు కూడా వీఐపీ బ్రేక్ దర్శనాలకు భక్తులు సిఫార్సు లేఖలు ద్వారా పొందడం లేదా అధిక మొత్తాన్ని దళారులకు చెల్లించి టికెట్లను పొందేవారు. శ్రీవాణి ట్రస్ట్ ప్రారంభంతో ఎలాంటి సిఫార్సు లేఖలు లేకుండా ట్రస్ట్‌కు రూ.10 వేలు చెల్లిస్తే చాలు ప్రోటోకాల్ బ్రేక్ దర్శనం పొందే సౌలభ్యం టీటీడీ కల్పించింది. భక్తులు మరో మాటకు తావివ్వకుండా శ్రీవాణి ట్రస్ట్‌కు విరాళాలు ఇవ్వడం ప్రారంభించారు. ఒక దశలో రోజుకు 2,700 మంది భక్తులు కూడా విరాళాలు అందించడం విశేషం. అంత మందికి ప్రోటోకాల్ వీఐపీ బ్రేక్ దర్శనాలంటే ఎక్కువ సమయం కేటాయించవలసిన పరిస్థితి ఏర్పడింది. సామాన్య భక్తులు దర్శనం కోసం వేచివుండే సమయం అంతకంతకు పెరుగుతూ వచ్చింది. దీంతో సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేందుకు టీటీడీ వాటిని రోజుకు వెయ్యికి మాత్రమే పరిమితం చేసింది. ఆన్లైన్ విధానంలో రోజుకు 500 చొప్పున విడుదల చేస్తుండగా, ఆఫ్‌లైన్ విధానంలో 400 టికెట్లు కేటాయిస్తున్నారు. మరో 100 టికెట్లను ఆఫ్‌లైన్ విధానంలోనే తిరుపతి విమానాశ్రయంలో కేటాయిస్తున్నారు. దీంతో శ్రీవాణి ట్రస్ట్‌కు నెలకు అందే విరాళాలు రూ.30 కోట్లకు పరిమితమవుతుంది. నాలుగేళ్ల కాలంలో శ్రీవాణి ట్రస్టు విరాళాలు రూ. వెయ్యి కోట్లకు చేరుకున్నాయి. ♦ 2019లో రెండు నెలల కాలంలోనే 19,737 మంది భక్తుల నుంచి శ్రీవాణి ట్రస్ట్‌కు రూ.26.25 కోట్లు విరాళం లభించింది. ♦ 2020లో 49,282 మంది భక్తులు రూ.70.21 కోట్లను విరాళంగా అందించారు. ♦ 2021లో లక్షా 31వేల మంది భక్తులు రూ.176 కోట్లు విరాళంగా అందించారు. ♦ 2022లో అయితే ఏకంగా 2 లక్షల 70 వేల మంది భక్తులు రూ.282.64 కోట్లు విరాళంగా అందించారు. ♦2023లో ఇప్పటి వరకు లక్ష 58 వేల మంది భక్తులు రూ.268.35 కోట్లు విరాళంగా అందించారు. -
అయ్యో దేవుడా!.. ధూపదీప నైవేద్యాలకు నోచుకోని ప్రాచీన ఆలయాలు
ఇది నందివనపర్తిలోని ఓంకారేశ్వరాలయం. తాడిపర్తి, నస్దిక్‌సింగారం, నందివనపర్తి, కుర్మిద్ద గ్రామాల పరిధిలో ఈ గుడికి సంబంధించిన 1,450 ఎకరాల భూమి ఉంది. సుమారు 1,200 మంది రైతులు ఇందులో వివిధ పంటలు సాగు చేస్తున్నారు. కౌలు ద్వారా వచ్చిన సొమ్ముతో ఏటా దేవుని కల్యాణం, ఉత్సవాలు నిర్వహించాల్సి ఉంది. కానీ కొంత కాలంగా రైతులు కౌలు చెల్లించడం లేదు. ప్రభుత్వం నుంచి కూడా పైసా రావడం లేదు. దీంతో వేడుకల సంగతి పక్కన పెడితే.. కనీసం ధూపదీప నైవేద్యాలకు సైతం నోచుకోవడం లేదు. కొందుర్గు మండలం పెండ్యాలలోని లక్ష్మీనర్సింహ్మస్వామి దేవాలయం ఇది. ఈ గుడి పేరున 360 ఎకరాల భూమి ఉంది. కొందుర్గులోని కొంత భాగం, లూర్థునగర్ కాలనీలు ఇందులోనే వెలిశాయి. ప్రçస్తుతం 312 మిగిలింది. కౌలు డబ్బులతో ఆలయ నిర్వహణ కొనసాగాలి. మండల కేంద్రంలోని గుడి పరిస్థితి కొంత మెరుగ్గా ఉన్నప్పటికీ.. చారిత్రాత్మకమైన పెండ్యాల ఆలయం మాత్రం శిథిలావస్థకు చేరుకుంది. ఇక్కడ దేవుడికి దీపం పెట్టే దిక్కు లేకుండాపోయింది. సాక్షి, రంగారెడ్డి జిల్లా: గ్రేటర్ జిల్లాలోని పలు దేవాలయాలు ధూపదీప, నైవేద్యానికి నోచుకోవడం లేదు. ఆలయ ఖజానాలో పైసా లేకపోవడం, భక్తుల నుంచి ఆశించిన మేరకు కానుకలు రాకపోవడం, ప్రభుత్వం నుంచి రావాల్సిన నెలవారీ ప్రోత్సాహకాలు అందకపోవడమే ఇందుకు కారణం. ఫలితంగా ఆయా దేవాలయాల్లో కొలువైన దేవుళ్లతో పాటు నిత్యం కైంకర్యాలు నిర్వహించే పూజారులకు సైతం ఉపవాసం తప్పడం లేదు. ఆలయాల నిర్వహణ, పూలు, పండ్లు, కొబ్బరికాయలు, ఒత్తులు, నూనె, హారతి కర్పూరం బిల్లలు, ఇతర పూజా సామగ్రి కోసం అప్పులు చేయక తప్పడం లేదు. s నాలుగు మాసాలుగా.. ఆలయాల్లో పని చేస్తున్న పూజారుల జీవనభృతి కోసం 2008లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం «ధూపదీప నైవేద్య పథకాన్ని తీసుకొచి్చంది. ఇందులో భాగంగా పూజారులకు మొదట్లో రూ.2,500 ప్రోత్సాహకంగా ఇచ్చేవారు. ఆ తర్వాత అధికారంలోకి వచి్చన కేసీఆర్ ప్రభుత్వం ఈ మొత్తాన్ని రూ.6 వేలకు పెంచింది. ఇందులో రూ.2 వేలు ధూపదీప నైవేద్యాలకు, రూ.4 వేలు పూజారుల నెలవారీ గౌరవ వేతనంగా చెల్లించారు. గత నాలుగు నెలలుగా ఈ ప్రోత్సాహకం అందడం లేదు. గతంలో దేవాదాయ శాఖ కమిషనర్ నుంచే నేరుగా ఈ ప్రోత్సాహాకాలు మంజూరయ్యేవి. ప్రస్తుతం ఈ బాధ్యతలను ఫైనాన్స్ విభాగానికి అప్పగించింది. దీంతో నిధుల జారీలో తీవ్ర జాప్యం చోటు చేసుకుంటోంది. నెలవారీ ప్రోత్సాహకాలు అందకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 3,679 ఆలయాల్లో పని చేస్తున్న 3,600 మంది పూజారులకు ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదు. శివారులో అధ్వానం జీహెచ్ఎంసీ పరి«ధిలో 1,736 ఆలయాలను ధూప, దీప, నైవేద్య పథకం(డీడీఎన్ఎస్)లో చేర్చేందుకు ప్రభుత్వం అవకాశం కలి్పంచి, ఆ మేరకు రూ.12.5 కోట్లు కేటాయించింది. ప్రభుత్వం తీసుకొన 43 రిజిస్ట్రేషన్ ప్రక్రియపై కమిటీలకు అవగాహన లేకపోవడం, ఉన్న వాళ్లు కూడా ఆలయంలోని విగ్రహాలు, ఇతర వస్తువులు, నిత్య కైంకర్యాల ద్వారా లభించే కానుకలు, హుండీ ఆదాయం సహా స్థిరచరాస్తుల వివరాలను పక్కగా లెక్క చూపించాల్సి వస్తుందనే భయంతో ఇందుకు వెనుకాడుతున్నాయి. ఫలితంగా ఇప్పటి వరకు కేవలం 400 ఆలయాలే ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్నాయి. మేడ్చల్ జిల్లాలో 101 ఆలయాలు, రంగారెడ్డి జిల్లాలో 140 ఆలయాలకు అవకాశం కల్పించినా.. మెజార్టీ ఆలయ కమిటీలు ఇందుకు సుముఖత చూపలేదు. దీంతో ఆయా ఆలయాలను నమ్ముకుని జీవిస్తున్న పేద బ్రాహ్మణులకు నెలవారీ ప్రోత్సాహకం అందకుండా పోతోంది. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే గ్రేటర్‌లోని ఆలయాల నిర్వహణ కొంత మెరుగ్గా ఉన్నా.. మారుమూల ప్రాంతాల్లోని ప్రాచీన ఆలయాల పరిస్థితి అధ్వానంగా మారింది. రాజకీయ నిరుద్యోగులకు అడ్డా నిత్యం ఆధ్యాత్మికతతో వెల్లివిరియాల్సిన పలు ఆలయాలు రాజకీయ నిరుద్యోగులకు వేదికలుగా మారాయి. కనీస భక్తి భావం లేని వాళ్లు పాలక మండళ్లలో సభ్యులుగా చేరుతున్నారు. సాధారణ భక్తులు సమరి్పంచే విరాళాలు, నిత్య కైంకర్యాలు, ఇతర సేవల ద్వారా లభించే ఆదాయం పక్కదారి పడుతున్న దాఖలాలు జిల్లాలో కోకొల్లలు. కర్మన్‌ఘాట్‌లోని శ్రీఆంజనేయ స్వామి దేవాలయం సహా ఇంజాపూర్ శ్రీవెంకటేశ్వరాలయం, ఆమనగల్లులోని వీరభద్రస్వామి దేవాలయం, శంషాబాద్ సమీపంలోని నర్కుడ రామాలయం, కడ్తాల్‌లోని మైసిగండి ఆలయం, కాటేదాన్‌లోని శివగంగ ఆలయాలు రాజకీయ నిరుద్యోగులకు నిలయాలుగా మారాయి. ఆలయ పూజారులు కూడా ప్రత్యేక పూజలకు టికెట్లు కొనుగోలు చేసిన వాళ్లను, హుండీల్లో భారీగా కానుకలు సమరి్పంచిన సామాన్య భక్తులను పట్టించుకోకుండా.. పాలక మండలి సభ్యులు, వారి బం«ధుమిత్రులు, ప్రముఖుల సేవల్లోనే తరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. అప్పులు చేయాల్సి వస్తోంది పట్టణ ప్రాంతాల్లోని ఆలయాలకు భక్తులు రెగ్యులర్‌గా వస్తుంటారు. కానీ మారుమూల ప్రాంతాల్లోని ప్రాచీన ఆలయాలకు పెద్దగా రారు. ప్రత్యేక పూజలు, హుండీ ఆదాయం అంతగా ఉండదు. ఫలితంగా ఆలయాల నిర్వహణ, ధూప, దీప, నైవేద్యాలకు ఇబ్బందులు తప్పడం లేదు. పూలు, పండ్లు, పూజ సామగ్రి కోసం అప్పులు చేయాల్సి వస్తోంది. – సునిల్‌జోషి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ధూప, దీప, నైవేద్య అర్చక సంఘం పేద బ్రాహ్మణులు నష్టపోతున్నారు జీహెచ్ఎంసీ పరిధిలోని 1,736 ఆలయాలకు డీడీఎన్‌ఎస్‌లో చేరే అవకాశం కల్పిస్తే.. 400 దరఖాస్తులు వచ్చాయి. ఇతర జిల్లాల నుంచి 1,263 ఆలయాలకు అవకాశం కల్పించగా.. ఆరు వేల అప్లికేషన్లు అందాయి. ఆస్తులు, ఆదాయం భారీగా ఉన్న ఆలయాలు ఇందులో చేరడం లేదు. ఫలితంగా పేద బ్రాహ్మణులు ఇబ్బంది పడాల్సివస్తోంది. - వాసుదేవశర్మ, ధూప, దీప, నైవేద్య అర్చక సంఘం, రాష్ట్ర అధ్యక్షుడు -
పురాతన ఆలయాల అభివృద్ధికి టీటీడీ సహకారం
కాకినాడ రూరల్: ఆంధ్రప్రదేశ్‌లో పురాతన ఆలయాల పునరాభివృద్ధికి టీటీడీ తరఫున సహకారం అందిస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్ సర్పవరం గ్రామంలోని రాజ్యలక్ష్మీ సమేత భావనారాయణస్వామి ఆలయాన్ని శనివారం ఆయన దర్శించుకున్నారు. సీఎం వైఎస్ జగన్ దంపతుల 25వ వివాహ మహోత్సవం సందర్భంగా వారి పేరిట ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం గోపూజలో పాల్గొన్నారు. మీడియాతో వైవీ మాట్లాడుతూ.. భావనారాయణ స్వామి ఆలయం ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ పరిధిలో ఉందని, వారి అనుమతులు తీసుకుని దీన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. నిత్యాన్నదానం ఏర్పాటు చేయాలని భక్తులు, ఆలయ పాలకవర్గం, స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి కురసాల కన్నబాబు కోరగా, త్వరలోనే ఏర్పాటు చేస్తామని సుబ్బారెడ్డి హామీ ఇచ్చారు. వైవీకి ఆలయ విశిష్టతను చైర్మన్ పుల్ల శేషుకుమారి, కమిటీ సభ్యులు, అర్చకులు వివరించారు. కార్యక్రమంలో మంత్రి వేణు, ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే పెండెం దొరబాబు పాల్గొన్నారు. -
ఆలయ కవాటం
కవాటం అంటే తలుపు. ఆలయరక్షణకోసం.. స్వామివారి ఏకాంతం కోసం గుడి తలుపులు ఏర్పాటు చేయబడ్డాయి. ప్రాచీన ఆలయాల నుంచి నేటివరకూ ఆలయతలుపులు దారువు (కొయ్య)తోనే చేసి అవకాశాన్ని బట్టి దానికి ఇత్తడి, రాగి, వెండి, బంగారుతో చేసిన రేకులను బిగిస్తున్నారు. ఇలా లోహాలతోచ శిల్పాలతో తలుపులను అలంకరించడం వలన దేవతల ప్రీతి పొందుతారని ఆగమాలు చెబుతున్నాయి. ఆలయద్వారం, తలుపు చెక్కలను, వాటికి జోడించే నిలువు, అడ్డ పట్టికలను ఒకే జాతికి చెందిన కొయ్యతో నిర్మించడం చాలా మంచిది. అలా కాకుండా మిశ్రదారువులతో చేస్తే విపరీతమైన ఫలితాలు ఎదురౌతాయని ఈశాన శివగురుదేవ పద్ధతి తెలిపింది. ద్వారబంధం శిలతో నిర్మించి తలుపులు కొయ్యతో చేస్తే దోషమేమీ లేదు. ద్వారబంధానికి లోపల ఇరువైపులా రెండేసి ఇనుము కమ్మీలను ఏర్పరచి తలుపులకు గుండ్రని కమ్మీలకు తగిలించి తిరగడానికి చేసే ఏర్పాటుకు భ్రమరకాసంధి అని పేరు. దేవాలయ ద్వారానికి రెండువైపులా జోడు తలుపులు ఉండాలి. వీటిని యుగ్మకవాటం అంటారు. ఆలయాల్లో చిన్న ఆలయాలకు.. ముందున్న రెండు స్తంభాలకు కలిపి తలుపు పక్కకు జరిపి వేసే తలుపులను సంహార కవాటం అంటారు. ఆలయాల్లో గానీ.. గృహాల్లో గానీ గూడు లేదా అల్మరా నిర్మించి వాటికి ఉంచే తలుపులను ధావన కవాటం అంటారు. ప్రాచీన ఆలయాల్లో నేరుగా గర్భగుడికి తలుపులుండవు. అంతరాళ మండపం, అర్ధమండపాలకు మాత్రమే తలుపులు ఉంటాయి. కవాటాల పైన పద్మాలు, చిరుగంటలు లేదా దశావతార శిల్పాలను, అష్టలక్ష్మీ విగ్రహాలను, ఆయా దేవతాలీలల్ని లేదా తిరునామం శంఖచక్రాలు, గరుడ–హనుమ శిల్పాల్ని, అష్టదిక్పాలకులను చెక్కుతారు. అయితే కవాటాలపైన అష్టమంగళ చిహ్నాలు, లతలు, మకర, నర, నారీ, భూత, సింహాలు, గజ.. వ్యాలాది రూపాల్ని వారి వారి ఆలోచనలకు తగ్గట్టు చిత్రించాలని శ్రీప్రశ్నసంహిత సూచించింది. కవాటాలను తెరవడమంటే భగవంతుని కరుణను మనపై కురిపించడమే. ప్రకృతిసిద్ధమైన దేవతారూపాలతో నిండిన కవాటాలు భక్తులకు కటాక్ష వీక్షణా గవాక్షాలు. – కందుకూరి వేంకట సత్యబ్రహ్మాచార్య ఆగమ, శిల్పశాస్త్ర పండితులు -
కనుమరుగవుతున్న చరిత్ర..!
సాక్షి, యాదాద్రి : జైనం, బౌద్ధం, వీరశైవం, వైష్ణవ సంప్రదాయాలకు నిలయమైన పురాతన ఆలయాలు పాలకుల ఆలనాపాలనా లేక కనుమరుగవుతున్నాయి. ఆధ్యాత్మిక, చరిత్రక నేపథ్యం కలిగిన యాదాద్రిభువనగిరి జిల్లాలో వందల ఏళ్ల నాటి చరిత్ర కనుమరుగవుతుంది. ఆదిమ మానవుని మనుగడకు సంబంధించిన సమాధుల నుంచి వివిధ మతాలకు చెందిన ఆలయాలు, రాతి విగ్రహాలు ధ్వంసమవుతున్నాయి. కొండలపై, గుట్టలపై చారి త్రక సంపద ఆనవాళ్లు కోల్పోతుంది. వెలుగుచూస్తున్న ఆలయాలు జిల్లాలోని యాదగిరిగుట్ట మండలం సైదాపురం గుట్టపై ఆలయం వెలుగుచూసింది. 16వ శతాబ్ధానికి సంబం ధించిన వైష్ణవ ఆలయంగా భావిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో భువనగిరిలో వటుక భైరవుని విగ్రహం రెండు సంవత్సరాల క్రితం బయటపడింది. అలాగే సైదాపురం గ్రామంలో కోట గోడల ఆనవాళ్లు లభించాయి. రాయగిరి వెంకటేశ్వరాలయం కోనేటి వద్ద గల శివలింగం, ఇతర విగ్రహాలను గుప్త నిధుల కోసం తవ్వేశారు. ఆత్మకూరు(ఎం), అమ్మనబోలు, మాటూరు, రఘునాథపురం, మాసాయిపేట, గొలనుకొండ, ఆలేరు, ఇక్కుర్తి, కొలనుపాక ఇలా పలుచోట్ల తవ్వకాల్లో బయటపడ్డ విగ్రహాలు, ఆలయాలు ఆదరణకు నోచుకోవడం లేదు. భువనగిరి మండలంలో బయటపడ్డ కాకతీయుల కాలం నాటి శాసనాలు ఎన్నో నిరుపయోగంగా ఉన్నాయి. వీటిని రక్షిం చాల్సిన అవసరం ఉంది. గుప్తనిధుల కోసం తవ్వకాలు.. జిల్లాలోని పలు దేవాలయాలు, గుప్త నిధుల కోసం ధ్వంసం చేశారు. ప్రధానంగా శివాలయాల్లో నంది, శివలింగాలను తవ్వేశారు. జిల్లాలో సుమారు వంద ఆలయాల్లోని విగ్రహాలు, శివలింగాలను గుప్త నిధుల కోసం తవ్వేశారు. కొండలపై, గుట్టలపై గల ఆలయాలు ధ్వంసమయ్యాయి. గుట్టలను పగులగొడుతున్న సమయంలో పురాతన కాలం నాటి ఆలయాలు కనుమరుగవుతున్నాయి. ఆదిమ మానవుడికి సంబంధించిన సమాధులను తవ్వేసి రైతులు పొలాలుగా మార్చుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా పురావస్తు శాఖ అధికారులు ఇటు వైపు కన్నెత్తి చూడటం లేదు. దీంతో వందల సంవత్సరాల సంపద భావితరాలకు లభించకుండాపోతోంది. ఆలయాలపై అధ్యయనం చేయాలి పురాతన ఆలయాలు, వాటి చరిత్రపై ప్రభుత్వం అధ్యయనం చేయాలి. యాదాద్రిభువనగిరి జిల్లాలో జైన, బౌద్ధ, వీరశైవ, వైష్ణవ, సంప్రదాయాలకు సంబంధించిన ఆలయాలు, దేవతామూర్తుల విగ్రహాలు ఉన్నాయి. చాలా వరకు కనుమరుగయ్యాయి. మిగిలిన వాటిని రక్షించుకోవాలి. ఎక్కడైనా ఒక నూతన ఆలయం, విగ్రహం బయటపడితే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించి వారి ద్వారా కలెక్టర్, ప్రభుత్వానికి తెలియజేయాలి. ఈ ప్రాంతంలో శైవం, వైష్ణవ మతాలు రాజుల కాలంలో ఉన్నత స్థితిలో కొనసాగాయి. వాటికి సంబంధించిన ఆనవాళ్లు చాలా వరకు కాలగర్భంలో కలిసిపోయాయి. మిగిలిన వాటిపై పరిశోధనలు జరిపి చరిత్రకు సాక్ష్యంగా నిలపాలి. ఇందుకోసం ప్రభుత్వానికి ప్రజలు సహకరించాలి. –ఎస్.హరగోపాల్, కొత్త తెలంగాణ చరిత్ర పరిశోధకుడు పురాతన దేవాలయాలను రక్షించాలి ప్రభుత్వం చారిత్రక సంపదను కాపాడటానికి చర్యలు తీసుకోవాలి. వెలుగులోకి వచ్చిన పురాతన దేవాలయాలను గుర్తించి వాటిని తమ ఆధీనంలోకి తీసుకోవాలి. తద్వారా రక్షణ కల్పించడానికి వీలవుతుంది. మరుగున పడిన చారిత్రక సంపదను వెలుగులోకి తీసుకురావాలి. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులను కేటాయించాలి. పురాతన ఆలయాలకు రక్షణ కల్పించాలి. -తోట భాను, విశ్వహిందూ పరిషత్ ఉమ్మడి జిల్లాల సహకార్యదర్శి -
సోమేశ్వరుడి కోవెలలో దశాబ్ది ఉత్సవాలు
బెల్లంపల్లిరూరల్ : భక్తుల కొంగు బంగారంగా నిలుస్తున్న మండలంలోని చంద్రవెల్లి సోమేశ్వరుడి ఆలయం దశాబ్ది ఉత్సవాలకు సిద్ధమైంది. 200 ఏళ్ల విశిష్ట చరిత్ర ఉన్న ఈ ఆలయం పునఃనిర్మాణం పూర్తి చేసుకున్న సందర్భంగా దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటుంది. ఎంతో ప్రాధాన్యత, ఘనమైన చరిత్ర గల శ్రీ అన్నపూర్ణ సహిత సోమేశ్వరాలయంపై ప్రత్యేక కథనం.. రెండు వందల ఏళ్ల కిందట పెద్దపల్లి జిల్లాకు చెందిన కొమ్మెర వంశస్థులు బతుకు దెరువు వెతుక్కుంటూ వలస బాట పట్టారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్ సంస్థానాధీశుని వద్దకు వెళ్లి చదువులో నిష్ణాతులైన కొమ్మెర వంశీయులు తమ ప్రతిభను ప్రదర్శించగా, సంస్థానాధీశుడు మెచ్చుకుని తమ ఆధీనంలో ఉన్న చంద్రవెల్లి గ్రామాన్ని అగ్రహారముగా రాసి ఇచ్చాడు. ఈ నేపథ్యంలో గ్రామానికి కొమ్మెర వంశస్థులు వచ్చి స్థిరపడినట్లు ప్రతీతి. మహా శివభక్తులైన ఆ వంశీయులు నిరంతర లింగారాధన, శైవ నామస్మరణతో పూజలు చేసి ఆరాధించారు. అనంతరం గ్రామంలో ఆలయాన్ని నిర్మించడానికి సంకల్పించారు. గ్రామస్తుల సహకారంతో, మట్టి ఇటుకలు, పెంకులతో ఓ చిన్న గుడిని నిర్మించి పూజలుగా వించారు. ఉత్సవ విగ్రహాల కోసం మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్ నుంచి శివ పంచాయతనము, విఘ్నేశ్వరుడు, శివుడు, ఆంజనేయుడు, నాగేం ద్రుడు, నందీశ్వరుడు, దత్తాత్రేయుడి విగ్రహాలు తెచ్చి ప్రతిష్ఠించారు. ఆనాటి నుంచి ఈ దేవాలయం శ్రీ అన్నపూర్ణ సహిత సోమేశ్వర ఆలయంగా ప్రఖ్యాతిగాంచింది. పునఃనిర్మాణం.. వందల ఏళ్ల క్రితం నిర్మించిన దేవాలయం పూర్తిగా శిథిలావస్థకు చేరడంతో 1987లో దేవాలయ కమిటీ, భక్తులు ఏకతాటిపైకి వచ్చి పునఃనిర్మాణానికి పూనుకున్నారు. 2008 ఫిబ్రవరి 11 వసంత పంచమి నాడు వేద మంత్రోచ్ఛరణాల మధ్య కొత్తగా నిర్మించిన ఆలయాన్ని పునః ప్రారంభించారు. ఈనెల 22న వసంత పంచమి పురస్కరించుని ఆలయ దశమ వార్షికోత్సవాన్ని వైభవంగా జరపడానికి విస్తృత ఏర్పాట్లు చేశారు. కరువు ఎరుగని గ్రామం.. గ్రామంలో వెలిసిన సోమేశ్వరుడు ఎంతో మహిమ గల దేవుడిగా భక్తుల విశ్వాసం. గ్రామం ఏర్పడిన నుంచి ఇప్పటివరకు ఎన్నడూ కరువు, కాటకాలు సంభవించలేదు. వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పటికీ గర్భగుడిలో శివలింగం మునిగేలా గ్రామస్తులు జలాభిషేకం చేయడం ఆనవాయితీగా వస్తోంది. దీంతో సోమేశ్వరుడు కరుణించి పుష్కలంగా వర్షాలు కురిపిస్తుంటాడని గ్రామస్తులు చెబుతున్నారు. 200 ఏళ్ల నుంచి పంటలు సంవృద్ధిగా పండి కరువుకు ఆస్కారం లేకుండా సోమేశ్వరుడు కాపాడుతున్నాడని విశ్వసిస్తారు. ప్రత్యేక పూజలు.. సోమేశ్వర దేవాలయంలో ప్రతి యేటా ప్రత్యేక పూజలు జరుగుతాయి. తొలి ఏకాదశి, శ్రావణ, కార్తీక మాసాల్లో ఈ ఆలయంలో మహన్యాస, రుద్రాభిషే కం, బిల్వార్చన నిర్వహిస్తారు. వినాయక చవితి, దుర్గాదేవి వేడుకలను, గోపూజ, గ్రామ సంకీర్తన, సామూహిక సత్యనారా యణ వత్రాలు, సహఫంక్తి భోజనాలు కులమతాలకతీతంగా సామూహికంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. -
పురాతన ఆలయాల పునర్నిర్మాణం
కోవెలకుంట్ల: సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం కుందూ వరదలతో కనుమలపాడు అనే గ్రామం కాలగర్భంలో కలిసిపోగా.. ఆ గ్రామానికి సంబం«ధించిన పురాతన ఆలయాలను ఇటీవల పునర్నిర్మించారు. కోవెలకుంట్ల పట్టణ శివారులోని ప్రస్తుతం పాటి ఆంజనేయస్వామిగా పిలుస్తున్న ప్రాంతంలో కనుమలపాడు గ్రామం ఉన్నట్లు పూర్వీకుల చరిత్ర. ఈ గ్రామానికి ఒక వైపు ఆంజనేయస్వామి దేవాలయం, శివాలయం, మరో వైపున భైరవుడి దేవాలయాలు ఉన్నాయి. భైరవ దేవాలయ సమీపంలోని కోనేటిలో ప్రజలు స్నానాలు చేసి ఆయా ఆలయాల్లోని దేవుళ్లకు పూజలు చేసేవారు. ఆలయాలు శిథిలావస్థకు చేరుకోవడంతో పట్టణానికి చెందిన పవన్ ఏజెన్సీ నిర్వాహకులు స్పందించారు. ఆంజనేయస్వామి దేవాలయం, శివాలయాన్ని పునర్నిర్మించారు. -
దేవాధిదేవులంటే ధిక్కారమా..?
శిథిలమవుతున్న పురాతన ఆలయాలు పట్టించుకోని దేవాదాయ శాఖ అధికారులు తాడేపల్లి మండల, పట్టణ పరిధుల్లో ఉన్న దేవాలయాలకు కోట్ల విలువ చేసే భూములు ఉన్నా ధూప దీప నైవేద్యాలు కూడా నోచుకోని పరిస్థితుల్లో ఉన్నాయి. ఓ వైపు ప్రై వేటు వ్యక్తులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం దేవాలయాలు నిర్మించి నిధులను సేకరిస్తుంటే, పురాతన కాలం నుంచి ఉన్న దేవాలయాలు శిథిలావస్థకు చేరుతున్నాయి. అయినా దేవాదాయశాఖ అధికారులు పట్టించుకోవటం లేదు. తాడేపల్లి (తాడేపల్లి రూరల్): రానున్న పుష్కరాలకు దేవాలయాలు అన్నింటికీ మరమ్మతులు నిర్వహించేందుకు దేవాదాయ శాఖ అధికారులు రూ. 40 కోట్లు కేటాయించామని వెల్లడించారు. కానీ తాడేపల్లి పట్టణ, మండల పరిధిల్లో ఉన్న దేవాలయాలకు పైపై అద్దకాలు చేస్తున్నారు తప్పా పూర్తి స్థాయిలో మరమ్మతులు నిర్వహించడం లేదు. కోట్ల ఆస్తులు ఉన్నా, పూజలకు కూడా నోచుకోని పరిస్థితుల్లో దేవాలయాలు ఉన్నాయంటే అధికారుల నిర్వాకం అర్థం అవుతూనే ఉంది. కోట్ల విలువ చేసే భూములు.. సీతానగరం శ్రీకోదండరామాలయానికి కోట్ల విలువ చేసే భూములు ఉన్నాయి. దాంతోపాటు దేవాలయం ముందు భాగంలోనే 80 సెంట్ల స్థలం కూడా ఉంది. ఆ స్థలంలో దేవాదాయ శాఖ అధికారులు అన్ని హంగులతో కార్యాలయాన్ని నిర్మించుకున్నారు తప్పా కనకదుర్గమ్మ దత్తత దేవాలయంగా ఉన్న రామాలయాన్ని మాత్రం పట్టించుకోవడం లేదు. వందల సంవత్సరాల క్రితం ఆలయ నిర్మాణం జరిగింది. ఈ దేవాలయానికి కొన్ని సంవత్సరాల క్రితం దాతల సాయంతో మండపం, ధ్వజస్తంభాలకు వెండి తొడుగులు ఏర్పాటు చేశారు. ఆ తరువాత ఎండోమెంటు శాఖ ఆధీనంలోకి వెళ్లిన తరువాత అభివృద్ధికిS నోచుకోలేదు. ఈ దేవాలయ ప్రాంగణంలో ఉన్న వినాయకుడి గుడి శిథిలావస్థకు చేరడంతో అధికారులు దాన్ని తొలగించారు తప్ప పునర్నిర్మాణం మాత్రం చేపట్టలేదు. కోదండరామస్వామి ఆలయ ఆస్తులు అనుభవిస్తున్నారు తప్ప దాని అభివృద్ధి మాత్రం ఆలోచించడంలేదు. వడ్డేశ్వరంలో దేవాదాయ శాఖ ఆధీనంలో ఉన్న తిరునారాయణ స్వామి దేవాలయానికి రాజధాని పరిధిలో 8 ఎకరాల మాగాణి భూమి, తాడేపల్లి మండలంలో 3.5 ఎకరాలు, అమరావతి మండలంలో 12 ఎకరాల భూమి ఉన్నప్పటికీ దాని అభివృద్ధి మాత్ర శూన్యం. రాజధాని నిర్మాణం పేరుతో.. రాజధాని పరిధిలో ఉన్న కోట్ల విలువ చేసే భూమిని రాజధాని నిర్మాణానికి తీసుకున్నారు. ఇక్కడ కనీసం పూజారులకు జీతాలు కూడా అందజేయలేని పరిస్థితి. ఉండవల్లిలో భీమలింగేశ్వర స్వామి ఆలయంలో నిరంతరం పూజలు నిర్వహించేందుకు దాతలు 2.5 ఎకరాల భూమిని అందించారు. ఆ భూమిని దేవాదాయ శాఖ ఏనాడో అమ్మేసింది. కనీసం ఇక్కడ శివరాత్రికి కూడా దేవాదాయ శాఖ వారు పూజలు నిర్వహించరు. తాడేపల్లి పట్టణ పరిధిలో భీమలింగేశ్వర స్వామి ఆలయానికి 3.75 ఎకరాల భూమి ఉంది. ఆ భూమి కోట్ల విలువ ఉన్నా ఓ ప్రై వేటు సంస్థ క్లబ్ నిర్వహించేందుకు నామమాత్రంగా నగదు చెల్లిస్తుండటంతో ఆలయ అభివృద్ధి జరగడంలేదు. దేవాదాయ అధికారులు దృష్టి సారించి, పూర్వం నుంచి ఉన్న దేవాలయాలను జీర్ణోద్ధరణ చేయాలని పలువురు అర్చకులు, భక్తులు కోరుతున్నారు. -
మబ్బులతో మాట్లాడవచ్చు!
టూర్‌దర్శన్ మంచుకొండల మనోహర సోయగాలు... మైమరపించే పచ్చని వనాల సొగసులు... గుర్రపు జీను ఆకారంలో ఉన్న కొండల మీద వెలసిన అందమైన ఊరు అల్మోరా. అక్కడి కొండల మీదకు వెళ్లి చూస్తే మబ్బులు చేతికందుతాయా అనిపిస్తాయి. ఊరికి ఇరువైపులా పారే కోసీ, సుయాల్ నదుల జలకళ నయనానందం కలిగిస్తుంది. ఇక్కడి కొండలపై కనిపించే ‘కిల్మోరా’ మొక్క కారణంగా ఈ ఊరికి అల్మోరా అనే పేరు వచ్చింది. ఇక ఇక్కడి పురాతన ఆలయాల శిల్పసౌందర్యాన్ని చూసి తీరాల్సిందే. ఏం చూడాలి? * హిమగిరి సొగసులను తనివితీరా చూసి ఆస్వాదించేందుకు పర్యాటకులు ఎక్కువగా ఇక్కడకు వస్తుంటారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో సముద్ర మట్టానికి దాదాపు ఆరువేల అడుగుల ఎత్తున ఉండే అల్మోరాలో వేసవిలోనూ వాతావరణం చల్లగా ఉంటుంది. * అల్మోరా పట్టణంలోను, సమీప పరిసర ప్రదేశాల్లోనూ సుప్రసిద్ధ పురాతన ఆలయాలు చాలానే ఉన్నాయి. కాసర్‌దేవి, నందాదేవి, జాఖన్దేవి, పాతాళదేవి, చితాయి గోలుదేవత, బనరీదేవి వంటి పురాతన శాక్తేయ ఆలయాలకు సుదూర ప్రాంతాల నుంచి కూడా పర్యాటకులు వస్తూ ఉంటారు. * దేశంలో అతి తక్కువగా కనిపించే సూర్యదేవాలయాల్లో ఒకటి అల్మోరాకు చేరువలోని కటార్మల్ గ్రామంలో ఉంది. కట్యూరి వంశానికి చెందిన కటారమల్ క్రీస్తుశకం తొమ్మిదో శతాబ్దిలో నిర్మించిన ఈ ఆలయ కుడ్యాలపై కనిపించే శిల్పకళా సంపద సందర్శకులను ఆకట్టుకుంటుంది. * అల్మోరాకు చేరువలోని చితాయి గ్రామంలో గోలుదేవత ఆలయానికి వచ్చే భక్తులు ఇక్కడి అమ్మవారికి తమ కోరికలను దరఖాస్తులుగా సమర్పించుకుంటారు. అవి తీరితే తిరిగి ఇక్కడకు వచ్చి, తీరిన కోరికకు గుర్తుగా ఆలయ ప్రాంగణంలో గంటలు కడతారు. * అల్మోరా చేరువలోని పాండుఖోలి మరో ప్రసిద్ధ ఆలయం. లాక్షాగృహ దహనం తర్వాత దుర్యోధనుడి బారి నుంచి తప్పించుకోవడానికి పాండవులు కొన్నాళ్లు ఇక్కడ తలదాచుకున్నారని ప్రతీతి. * అల్మోరాలోనే పుట్టిపెరిగిన స్వాతంత్య్ర సమరయోధుడు, ఉత్తరప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి గోవిందవల్లభ్ పంత్ జ్ఞాపకార్థం ఇక్కడ ఆయన పేరిట నిర్మించిన మ్యూజియంలోని పురాతన వస్తువులను, కళాఖండాలను చూసి తీరాల్సిందే. * ఇక్కడకు చేరువలోని లఖుడియా ప్రాంతంలోని కొండగుహలలో చరిత్రపూర్వయుగం నాటి కుడ్యచిత్రాలు ఇక్కడి పురాతన నాగరికతకు ఆనవాళ్లుగా నేటికీ నిలిచి ఉన్నాయి. * అల్మోరాలోని కొండ శిఖరాలపై ఉన్న జీరోపాయింట్, బ్రైట్ ఎండ్ కార్నర్ వంటి ప్రదేశాలకు చేరుకుని సూర్యాస్తమయ దృశ్యాలను, చుట్టుపక్కల కనిపించే దట్టమైన అడవుల పచ్చదనాన్ని తిలకించడం పర్యాటకులకు మధురానుభూతినిస్తుంది. * ఇక్కడకు చేరువలోని బిన్సార్ వన్యప్రాణుల అభయారణ్యంలో విహరిస్తూ ఇక్కడ సంచరించే అరుదైన వన్యప్రాణులను తిలకించవచ్చు. పులులు, చిరుతలు, జింకలు వంటి అరుదైన జంతువులతో పాటు రకరకాల అరుదైన పక్షులు కూడా ఇక్కడ కనిపిస్తాయి. ఏం చేయాలి? * ప్రకృతి సౌందర్యాన్ని తిలకిస్తూ ప్రశాంత వాతావరణంలో గడపాలనుకునే పర్యాటకులకు ఇది పూర్తిగా అనువైన ప్రదేశం. ఇక్కడి హోటళ్లలో, రిసార్టుల్లో ఎక్కడ బస చేసినా ఆరుబయటకు చూస్తే కనుచూపు మేర చుట్టూ పరుచుకున్న పచ్చదనం, సుదూరాన మంచుకొండల ధవళకాంతులు కనువిందు చేస్తాయి. * పర్వతారోహకులకు ఇక్కడి కొండలు సవాలుగా నిలుస్తాయి. ట్రెక్కింగ్‌పై ఆసక్తి గల ఔత్సాహిక పర్యాటకులు ఇక్కడి కొండలపైకి ఎక్కి ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించేందుకు ఉవ్విళ్లూరుతారు. * ఆలయ సందర్శనంపై ఆసక్తిగల పర్యాటకులకు ఇక్కడ అడుగడుగునా కనిపించే అత్యంత పురాతన ఆలయాలు, ఆ ఆలయాల్లోని ఆచార వ్యవహారాలు ఆకట్టుకుంటాయి. * అల్మోరాలోను, ఇక్కడి పరిసరాల్లోని గోవిందవల్లభ్ పంత్ మ్యూజియం, కుమావో రెజిమెంటల్ మ్యూజియం, జగేశ్వర్ ఆర్కియాలాజికల్ మ్యూజియం వంటివి చూసి తీరాల్సిందే. వీటిలో భద్రపరచిన పురాతన వస్తువులు, కళాఖండాల ద్వారా ఇక్కడి ప్రాచీన నాగరికతా వికాసాన్ని ఆకళింపు చేసుకోవచ్చు. ఏం కొనాలి? * మంచుకొండలకు చేరువగా ఉండటంతో అల్మోరాలో ఊలు దుస్తుల వాడకం ఎక్కువ. ఇక్కడి నేతగాళ్లు ప్రత్యేకంగా తయారు చేసిన స్వెట్టర్లు, మఫ్లర్లు, శాలువలు వంటి ఊలు దుస్తులు ఇక్కడ చౌకగా దొరుకుతాయి. * అల్మోరా రాగి వస్తువులకు కూడా ప్రసిద్ధి పొందిన ఊరు. ఇక్కడి కళాకారులు రాగితో తయారు చేసిన పాత్రలు, సంప్రదాయ కళాకృతులు, విగ్రహాలు వంటివి సరసమైన ధరలకే దొరుకుతాయి. * ఇక్కడ ప్రత్యేకంగా దొరికే సింగొరా, బాల్ మిఠాయి వంటి నోరూరించే మిఠాయిలను కూడా కొనుక్కోవచ్చు. ఎలా చేరుకోవాలి? * దూర ప్రాంతాల నుంచి విమానాల్లో వచ్చేవారు డెహ్రాడూన్‌లో దిగాల్సి ఉంటుంది. అక్కడి నుంచి నేరుగా రోడ్డు మార్గంలో బస్సులు లేదా ట్యాక్సీల ద్వారా అల్మోరా చేరుకోవచ్చు. * రైళ్లలో వచ్చేవారు అల్మోరాకు సమీపంలోని కఠ్గోదాం స్టేషన్లో దిగాల్సి ఉంటుంది. అక్కడి నుంచి బస్సులు లేదా ట్యాక్సీల ద్వారా చేరుకోవచ్చు. * ఉత్తరాదిలో ఢిల్లీ, చండీగఢ్ వంటి నగరాలతో పాటు ఉత్తరాఖండ్‌లోని దాదాపు అన్ని పట్టణాల నుంచి అల్మోరా వరకు నేరుగా బస్సు సౌకర్యం అందుబాటులో ఉంటుంది. -
ఆలయంలో నంది విగ్రహం చోరీ
గొండ్యాల్ గ్రామస్తుల రాస్తారోకో పోలీసుల హామీతో ఆందోళన విరమణ హన్వాడ : పురాతన ఆలయంలోని నంది విగ్రహాన్ని దుండగులు ఎత్తుకెళ్లగా, నిందితులను పట్టుకోవాలంటూ గ్రామస్తులు కొద్దిసేపు రాస్తారోకోకు దిగారు. చివరకు పోలీసుల హామీతో ఆందోళన విరమించారు. వివరాలిలా ఉన్నాయి. హన్వాడ మండలంలోని గొండ్యాల్ శివారులోని దేవునిగడ్డకాలనీలో సుమారు 200ఏళ్లనాటి నందీశ్వరాలయం ఉంది. గురువారం అర్ధరాత్రి ఆలయం తాళం పగులగొట్టి నంది విగ్ర హాన్ని గుర్తుతెలియని వ్యక్తులు అపహరించుకెళ్లారు. శుక్రవారం ఉదయం అక్కడికి వచ్చిన భక్తులు విషయం తెలుసుకుని వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాక వేపూర్ రహదారిపై రాస్తారోకోకు దిగారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గతంలో ఈ ఆలయంలో మూడుసార్లు దుండగులు చోరీకి విఫలయత్నం చేశారని ఆరోపించారు. ఈ విగ్రహం అతి ప్రాచీనకాలం నాటిదని, దాని కొమ్ములు, గోపురం, కడుపు ప్రాంతం లో వజ్రాలు ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. దీంతో అక్కడికి ఎస్ఐ లక్ష్మయ్య చేరుకుని వారితో మాట్లాడారు. అనంతరం సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. అక్కడి ఆనవాళ్లను బట్టి దొంగలు భారీ గంభీరంగా కనిపించే ఈ విగ్రహాన్ని తవ్వి తీసి ఓ వాహనానికి కట్టి లాకెళ్లినట్లు భావిస్తున్నారు. త్వరలో నిందితులను పట్టుకుంటామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు శాంతించారు. -
ప్రాచీన ఆలయాలను దర్శించిన తనికెళ్ల భరణి
జడ్చర్ల : ప్రముఖ నటుడు, దర్శకుడు తనికెళ్ల భరణి సోమవారం మహబూబ్‌నగర్ జిల్లాలోని పలు ప్రాచీన ఆలయాలను దర్శించుకున్నారు. తొలుత ఆల్వాన్‌పల్లి సమీపంలోని మీనాంబర దేవాలయంలో శివుడిని దర్శించుకున్న ఆయన, అనంతరం జడ్చర్ల మండలం గంగాపురంలోని లక్ష్మీ చెన్నకేశవస్వామి దర్శనం చేసుకున్నారు. ఆయన వెంట టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు శివకుమార్ ఉన్నారు. భరణి ఓ సినిమా తీసే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. అందులో భాగంగా ప్రాచీన ఆలయాలను సందర్శిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా అడ్డాకుల మండలం కందూరు ఆంజనేయస్వామిని భరణి తరచూ దర్శించుకుంటుంటారు.