anil desai
-
రాజ్యసభకు శివసేన అభ్యర్ధి
మహారాష్ట్ట్రలో ఆరు రాజ్యసభ స్థానాలకు జరుగునున్న ఎన్నికలకు వివిధ పార్టీలు నామినేషన్ దాఖలు చేశాయి. శివసేన నుంచి పార్టీ కార్యదర్శి అనిల్ దేశాయ్ నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఎంపీగా గెలవాలి అంటే 42 మంది ఎమ్మేల్యేల మద్దుతు అవసరం కాగా.... ప్రస్తుంత శివసేనకు 63 మంది మద్దతు ఉంది. దీనితో ఆయన ఎన్నిక నల్లేరుమీద నడకే. ఆరు స్థానాలకు మార్చి23న ఎన్నిక జరుగనుంది. దీనిలో 122 స్థానాలతో అధికార బీజేపీ మూడు స్థానాలకు కైవసం చేసుకోనుంది. కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీ ఒక్కో స్థానం కోసం తమ అభ్యర్థులను బరిలో నిలిపారు. శివసేన నుంచి ప్రస్తుంత రాజ్యసభ సభ్యుడు అనిల్‌దేశయ్ పోటి చేస్తున్నారని పార్టీ చీఫ్ ఉద్ధవ్‌ఠాక్రే ప్రకటించారు. ఆయన రాజ్యసభకు పోటిచేయడం ఇది రెండోసారి. కాంగ్రెస్ మాత్రం ఇంకా తమ అభ్యర్థి ఎవరనేది స్పష్టం చేయాల్సిఉంది. ఒక్క స్థానం కోసం రజనీ పటేల్, రాజీవ్‌శుక్లా ఇద్దరు పోటీలో ఉన్నారని సమాచారం. ప్రతిపక్ష నేత రాధాకృష్ణ వీకే పటేల్ ఢిల్లీ పెద్దలతో చర్చించిన అనంతరం ఈరోజో రేపో అభ్యర్థి పేరును ప్రకటించే అవకాశం ఉంది. మాజీ కాంగ్రెస్ నేత మహారాష్ట్ర్ర స్వాభిమాన్ వ్యవస్థాపక సభ్యులు నారాయన్‌రాణే కుడా నామినేషన్ వేయనున్నట్లు తన కుమారుడు ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మేల్యే నితీష్ రాణే తెలిపారు. కాగా రాణేకు శివసేన మద్ధతు ఉంటుందని రాణే ప్రకటించారు. మద్దతు విషయంలో తమ నిర్ణయం ఇదివరకే తెలిపామని, అంతమ నిర్ణయం మాత్రం పార్టీ చీఫ్ ఉద్దవ్‌ఠాక్రే తీసుకుంటారని దేశాయ్ తెలిపారు. -
మా వల్లే అధికారంలోకి..
సాక్షి, ముంబై: బీజేపీపై తమ మిత్రపక్షం శివసేన మరోమారు ఫైర్ అయ్యింది. బీజేపీ ఒంటరిగా పోటీ చేసి ఎక్కువ స్థానాలు గెలుపొందినా.. శివసేన లేకుండా అధికారం దక్కించుకోలేక పోయిందని ఆ పార్టీ నేత అనీల్ దేశాయ్ ఎద్దేవా చేశారు. ‘ఒంటరిగా పోటీ చేయడం వల్లే మా బలం తెలిసింది. పొత్తు లేకుండా పోటీ చేయడం వల్లే 120 స్థానాలు గెలుపొందాం’ అని ఆదివారం కొల్హాపూర్‌లో జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర ్గ సమావేశాల్లో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. దీనిపై తీవ్రంగా స్పందించిన అనీల్ సోమవారం మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలే శివసేన బలమని, శివసేన అనేది ఒక శక్తి అని అభివర్ణించారు. అయితే బీఎంసీ ఎన్నికల్లో కలసి పోటీ చేయనున్నట్టు ఫడ్నవీస్ ప్రకటించడాన్ని ఆయన స్వాగతించారు. రాష్ట్రంలో బీజేపీతో కలసి ప్రభుత్వంలో పాలుపంచుకుంటున్నా.. తమ పాత్రను శివసేన స్పష్టంగా తెలుపుతూ వస్తోందని అన్నారు. వసాయి-విరార్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు విషయాన్ని త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు. -
అనిల్ దేశాయ్‌కి కేంద్ర మంత్రి పదవి?
లోక్‌సభ శీతాకాల సమావేశాలు కాగానే ప్రమాణస్వీకారం శివసేన అధినేత ఉద్ధవ్ పచ్చజెండా సాక్షి, ముంబై: శివసేన రాజ్యసభ సభ్యుడు అనిల్ దేశాయ్‌కి కేంద్ర మంత్రి పదవి వరించనుంది. ఢిల్లీలో శీతాకాల పార్లమెంటు సమావేశాలు పూర్తయిన తర్వాత ఆయనకు కేంద్ర మంత్రి పదవి కట్టబెట్టనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ అదేవిధంగా శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో దేశాయ్‌కి మార్గం సుగమమైంది. కొద్ది రోజుల కిందట జరిగిన రెండవ విడత కేంద్ర మంత్రి మండలి విస్తరణలో మిత్రపక్షాల కోటాలో శివసేన తరఫున దేశాయ్ కేంద్ర మంత్రిగా ప్రమాణం చేయాల్సి ఉంది. అయితే బీజేపీ, శివసేన మధ్య రాష్ట్రస్థాయి పొత్తులపై చర్చలు కొలిక్కిరాకపోవడంతో చివరి నిమిషంలో ఆయన ఢిల్లీ నుంచి వెనుదిరిగారు. అయితే అప్పట్లో నెల కొన్న విభేదాలు, కలహాలు ఇప్పుడు సద్దుమణిగాయి. రాష్ట్ర ప్రభుత్వంలో శివసేన భాగస్వామి అయ్యింది. దీంతో అనిల్ దేశాయ్‌కి కేంద్ర మంత్రిపదవి కట్ట బెట్టేందుకు మార్గం సులభతరమైంది. ప్రస్తుతం కేంద్ర మంత్రివ ర్గంలో శివసేనకు చెందిన అనంత్ గీతే ఒక్కరే క్యాబినెట్ మంత్రిగా ఉన్నారు. త్వరలో జరగనున్న విస్తరణలో దేశాయ్ చేరితే ఈ సంఖ్య రెండుకు చేరుతుంది. ఎన్డీయే కూటమిలో శివసేనకు 18 మంది ఎంపీలు ఉన్నప్పటికీ, మంత్రివర్గంలో తగిన వాటా రాలేదు. దీంతో శివసేనలో తీవ్ర అసంతృప్తి ఉంది. త్వరలో జరిగే మంత్రి వర్గ విస్తరణంలో దేశాయ్‌కి చోటు లభించినప్పటికీ శివసేనలో నెలకొన్న అసంతృప్తి పూర్తిగా తొలగిపోదని విశ్లేషకులు భావిస్తున్నారు. -
‘శివసేనను తెలుగువారు ఆదరించాలి’
సాక్షి, ముంబై: ఈ సార్వత్రిక ఎన్నికల్లో శివసేన పార్టీ అభ్యర్థుల విజయానికి తెలుగు ప్రజలు కృషి చేయాలని ఆ పార్టీ నేత, రాజ్యసభ ఎంపీ అనిల్ దేశాయ్ పిలుపునిచ్చారు. దాదర్‌లోని శివసేనభవన్లో ముంబై తెలుగు సేన ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన తెలుగు శివసైనికుల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అనిల్ దేశాయ్ మాట్లాడుతూ...తెలుగు ప్రజల అభివృద్ధికి కట్టుబడి ఉన్నది ఒక్క శివసేన పార్టీయేనన్నారు. తెలుగువారికి ఉగాది, మరాఠీయులకు గుడిపడ్వాతో కొత్త సంవత్సరం మొదలవుతుందని చెప్పారు. మన భాషలు వేరైనా సంప్రదాయం ఒక్కటేనని గుర్తు చేశారు. ఇలా ఒక్కటిగా ఉన్న మనలో విభేదాలు సృష్టించేందుకు ఇతర పార్టీలు ప్రయత్నిస్తున్నాయని, వాటిని తిప్పికొట్టాల్సిన బాధ్యత తెలుగు ప్రజలందరిపైనా ఉందన్నారు. తెలుగు ప్రజల సమస్యల పరిష్కారానికి ఎప్పటిలాగే ముందుంటామని తెలిపారు. బాల్‌ఠాక్రేకు గతంలో రక్షాబంధన్ రోజు మొదట రాఖీ కట్టింది కూడా తెలుగు మహిళే అని గుర్తు చేశారు. ఇంత అవినాభావ సంబంధం ఉన్నందునే తెలుగువారికి కామాటిపుర ఎమ్మెల్యే టికెట్, వర్లీ, ధారావి నుంచి కార్పొరేట్ సీట్లు కేటాయించామని తెలిపారు. ఇది ఒక్క శివసేన వల్లే సాధ్యమైందన్నారు. ఈ ఎన్నికల్లో అరవింద్ సావంత్, రాహుల్ శెవాలె, గజానన్ కీర్తికర్లను గెలిపించాలని కోరారు. గతంలో అభివృద్ధి పనులు చేసిన ఘనతఎన్డీఏకి మాత్రమే ఉందన్నారు. ఉద్దవ్ ఠాక్రే రోడ్ షో ప్రచారంలో ఉన్నందున రాలేకపోయారని తెలిపారు. అనంతరం దక్షిణ ముంబై శివసేన పార్టీ అభ్యర్థి అరవింద్ సావంత్ మాట్లాడుతూ తెలుగు ప్రజలందరూ శివసేన వెంట నడవాలని కోరారు. సభ సమావేశానికి భారీ సంఖ్యలో హాజరైన తెలుగు ప్రజలందరికి ముంబై తెలుగు సేన అధ్యక్షుడు వాసాల శ్రీహరి కృతజ్ఞతలు తెలిపారు. సభలో కార్యాధ్యక్షుడు టి. ప్రకాశ్‌స్వామి, ఉపాధ్యక్షుడు వినోద్‌చారి, మైస బాబు, ప్రధాన కార్యదర్శి వెంకటేశ్ బాల్‌రాజ్, ఉప కార్యదర్శకుడు సురేష్ దాస, జిందం భాస్కర్, గోసికొండ శ్రీహరి, కోశాధికారి అనుమల్ల సుభాష్, సభ్యులు మల్లేశ్ కల్లూరి, అంజయ్య చెరక, శ్రీనివాస్ గుల్పల్లె. మహిళలు..శారద పాపన్, పుష్ప వాసం, నాగరాజ్ శివసైనికులు, నాగేశ్ సింగా, వర్లీ నుండి బొరిగం మల్లేశం, చాప పరమేశ్వర్, క్యాతం ప్రకాశ్, గడాల నారాయణ తదితరులు పాల్గొన్నారు.