
మహారాష్ట్ట్రలో ఆరు రాజ్యసభ స్థానాలకు జరుగునున్న ఎన్నికలకు వివిధ పార్టీలు నామినేషన్ దాఖలు చేశాయి. శివసేన నుంచి పార్టీ కార్యదర్శి అనిల్ దేశాయ్ నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఎంపీగా గెలవాలి అంటే 42 మంది ఎమ్మేల్యేల మద్దుతు అవసరం కాగా.... ప్రస్తుంత శివసేనకు 63 మంది మద్దతు ఉంది. దీనితో ఆయన ఎన్నిక నల్లేరుమీద నడకే. ఆరు స్థానాలకు మార్చి23న ఎన్నిక జరుగనుంది. దీనిలో 122 స్థానాలతో అధికార బీజేపీ మూడు స్థానాలకు కైవసం చేసుకోనుంది. కాంగ్రెస్, శివసేన, ఎన్‌సీపీ ఒక్కో స్థానం కోసం తమ అభ్యర్థులను బరిలో నిలిపారు. శివసేన నుంచి ప్రస్తుంత రాజ్యసభ సభ్యుడు అనిల్‌దేశయ్ పోటి చేస్తున్నారని పార్టీ చీఫ్ ఉద్ధవ్‌ఠాక్రే ప్రకటించారు. ఆయన రాజ్యసభకు పోటిచేయడం ఇది రెండోసారి.
కాంగ్రెస్ మాత్రం ఇంకా తమ అభ్యర్థి ఎవరనేది స్పష్టం చేయాల్సిఉంది. ఒక్క స్థానం కోసం రజనీ పటేల్, రాజీవ్‌శుక్లా ఇద్దరు పోటీలో ఉన్నారని సమాచారం. ప్రతిపక్ష నేత రాధాకృష్ణ వీకే పటేల్ ఢిల్లీ పెద్దలతో చర్చించిన అనంతరం ఈరోజో రేపో అభ్యర్థి పేరును ప్రకటించే అవకాశం ఉంది. మాజీ కాంగ్రెస్ నేత మహారాష్ట్ర్ర స్వాభిమాన్ వ్యవస్థాపక సభ్యులు నారాయన్‌రాణే కుడా నామినేషన్ వేయనున్నట్లు తన కుమారుడు ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మేల్యే నితీష్ రాణే తెలిపారు. కాగా రాణేకు శివసేన మద్ధతు ఉంటుందని రాణే ప్రకటించారు. మద్దతు విషయంలో తమ నిర్ణయం ఇదివరకే తెలిపామని, అంతమ నిర్ణయం మాత్రం పార్టీ చీఫ్ ఉద్దవ్‌ఠాక్రే తీసుకుంటారని దేశాయ్ తెలిపారు.