Animator
-
సీఎం సభకు రావాలని బెదిరింపులు
-
సీఎం మీటింగ్కు రాకపోతే రూ.400 కట్
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యే సభకు రాకపోతే రూ.400 కట్ చేస్తామని డ్వాక్రా మహిళా సంఘం లీడర్లకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సీఎం బుధవారం అనంతపురం జిల్లా పర్యటన సందర్భంగా రాప్తాడు నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభకు డ్వాక్రా మహిళలను తరలించే ఏర్పాట్లు చేశారు. సంఘం నుంచి కనీసం ఇద్దరు రావాలని ఫోన్లు చేసి ఒత్తిడి చేస్తున్నారు. రాలేమని చెబుతుంటే బెదిరింపులకు దిగుతున్నారు. అనంతపురం: సీఎం చంద్రబాబు హాజరయ్యే సభకు రాకపోతే రూ.400 కట్ చేస్తామని డ్వాక్రా మహిళా సంఘం లీడర్లకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సీఎం బుధవారం అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలోని రామగిరి మండలం పేరూరుకు వస్తున్నారు. బహిరంగ సభకు జిల్లా వ్యాప్తంగా డ్వాక్రా సంఘాల సభ్యులను తరలించేందుకు అధికార పార్టీ నేతలు రంగం సిద్ధం చేశారు. ప్రతి మహిళా సంఘం నుంచి కనీసం ఒకరిద్దరు కచ్చితంగా రావాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. రామంటే బెదిరింపులకు దిగుతున్నారు. సోమవారం అనంతపురం రూరల్ మండల పరిధిలోని ఓ సంఘం లీడరుకు యానిమేటర్ ఫోన్ చేశారు. వారి మధ్య సంభాషణ ఇలా సాగింది. గ్రూపు లీడరు (అంజనాదేవి): అక్కా చెప్పక్కా! యానిమేటర్ (లక్ష్మీదేవి): అక్కా..పేరూరు మీటింగ్కు రావాలి గ్రూపు లీడరు: అక్కా మేము రాము. మేము వైఎస్సార్ పార్టీవాళ్లము. యానిమేటరు: మీ గ్రూపులో నుంచి ఎవరైన్నా పంపు. నువ్వే రావాలని చెప్పడం లేదు. గ్రూపు లీడరు: నేనైతే ఎవరికీ చెప్పను. రూలేమైనా ఉంటే చెప్పండి. నేను ఫాలో అవుతా. యానిమేటరు: నువ్వ లీడరు కాబట్టి చెబుతున్నా. ఎవర్నైనా పంపు. గ్రూపు లీడరు: నేనైతే ఎవరికీ వెళ్లమని చెప్పను. నేనైతే పక్కా వైఎస్సార్. పదిలక్షలు ఇస్తామంటే కూడా మీటింగ్కు రాను. యానిమేటరు: అవన్నీ అనవసరం. వస్తావా రావా? మనకు రాజకీయాలు అవసరం లేదక్కా? గ్రూపు లీడరు: మీటింగ్ పెడుతున్నారు కాబట్టి ఇది రాజకీయమే. రాజకీయ నాయకుల కోసమే పేరూరుకు పోతుండేది తెలుసు. యానిమేటరు: రాజకీయం కాదు మన డ్వాక్రా వాళ్ల కోసమే సారు బస్సు పంపిస్తున్నాడు. గ్రూపు లీడరు: సారు నంబరు నాకివ్వు. నేను ప్రెస్వాళ్లను పిలిపించి మాట్లాడతా. ఏళ్ల నుంచి గ్రూపులో ఉన్నా రుణమాఫీ కాలేదు. అవన్నీ తీర్చితే ఎన్ని బస్సులకు కావాలంటే అంతమందిని ఎక్కిస్తానని చెబుతా. యానిమేటరు: నువ్వు వస్తేరా లేదంటే లేదు.రాకపోతే రూ.400 కట్ చేస్తా. గ్రూపు లీడరు: మీటింగ్కు పోకపోతే సంఘంలో 400 కట్ చేస్తారా? సరే చేయండి. -
ఐకేపీ యానిమేటర్లపై ఉక్కుపాదం
సాక్షి, విజయవాడ బ్యూరో/హైదరాబాద్: దాదాపు ఏడాదిన్నరగా తమకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన జీతం బకాయిలు చెల్లించాలంటూ డ్వాక్రా యానిమేటర్లు (ఐకేపీ వీవోఏలు) సోమవారం తలపెట్టిన ఛలో అసెంబ్లీ కార్యక్రమంపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఆదివారం రాత్రి పోలీసులు తమ ప్రతాపం చూపించారు. వేతన బకాయిలు చెల్లించమని నెలల తరబడి ఆందోళన చేస్తున్నా పట్టించుకోని ప్రభుత్వం తీరుకు నిరసనగా సుమారు 20 వేలమంది వీవోఏలు అసెంబ్లీని ముట్టడించాలని నిర్ణయించారు. దీన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలతో పోలీసులు తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో అన్ని బస్టాండ్లు, రైల్వేస్టేషన్ల వద్ద మోహరించి యానిమేటర్లు హైదరాబాద్ వెళ్లకుండా చేసేందుకు భయానక వాతవరణం సృష్టించారు. యానిమేటర్లకు నాయకత్వం వహించే మహిళలు, సీఐటీయూ నాయకులను రాత్రి ఇళ్ల వద్దకు వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. శ్రీకాకుళం జిల్లాలో మహిళలను నిర్బంధించిన పోలీసులు సీఐటీయూ నాయకులను అరెస్టు చేశారు. విజయనగరం, విశాఖ, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పలువురిని అదుపులోకి తీసుకున్నారు. కర్నూలు, అనంతపురం జిలాల్లో బస్టాండ్, రైల్వేస్టేషన్లలో మోహరించిన పోలీసు లు పలువురిని హైదరాబాద్ వెళ్లకుండా అడ్డుకున్నారు.వైఎస్సార్ జిల్లాలో పోలీసులు అరెస్టు చేస్తామని హెచ్చరించినా ఆందోళనకారులు హైదరాబాద్ బయలుదేరారు. నెల్లూరు జిల్లాలో కూడా అడ్డుకున్నారు. ప్రకాశం జిల్లాలోనూ అరెస్టులు కొనసాగాయి. ఐకేపీ యానిమేటర్ల ఆందోళనకు పది వామపక్ష పార్టీలు మద్దతు ప్రకటించాయి.