Top Stories
ప్రధాన వార్తలు

తిరువూరు మున్సిపల్ ఎన్నికపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు
సాక్షి,గుంటూరు: తిరువూరు మున్సిపల్ ఎన్నికపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అరగంటలో భద్రతా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. డీసీపీ స్థాయి అధికారితో కౌన్సిలర్లకు భద్రత కల్పించాలని సూచించింది. తిరువూరు మున్సిపల్ ఎన్నికపై వైఎస్సార్సీపీ ఏపీ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్లో వైఎస్సార్సీపీ కౌన్సిలర్లకు భద్రత కల్పించాలని పేర్కొంది. వైఎస్సార్సీపీ దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్‌పై మంగళవారం (మే20) ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా ఎన్నికల కమిషన్ ఆదేశాలను పోలీసులు పాటించడం లేదంటూ వైఎస్సార్సీపీ తరుఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు అరగంటలో డీసీపీ స్థాయి అధికారితో వైఎస్సార్సీపీ కౌన్సిలర్లకు భద్రత కల్పించడమే కాదు, తక్షణమే ప్రశాంత ఎన్నికలకు చర్యలు చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది. కాగా, తిరువూరు మున్సిపల్ ఎన్నిక నేపథ్యంలో నేటి ఉదయం నుండి టీడీపీ నేతలు తిరువూరులో అరాచకం సృష్టిస్తున్నారు. వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను ఎన్నికలకు రాకుండా అడ్డుకునేందుకు కుట్రలకు పాల్పడింది. తిరువూరు వెళ్లే వైఎస్సార్సీపీ కౌన్సిలర్లపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో అరగంటలో డీసీపీ స్థాయి అధికారితో వైఎస్సార్సీపీ కౌన్సిలర్లకు భద్రతకు కల్పించాలని రాష్ట్ర హైకోర్టు పోలీసుల్ని ఆదేశించింది. అంతేకాదు, భద్రతా ఏర్పాట్లు ఎవరు సమీక్షిస్తున్నారో అరగంటలో చెప్పాలని తెలిపింది. డీసీపీ మహేశ్వరరాజుకు వైఎస్సార్సీపీ కౌన్సిలర్ల రక్షణ బాధ్యతలుతిరువూరు ఉప ఎన్నికపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వైఎస్సార్సీపీ కౌన్సిలర్ల రక్షణ బాధ్యతల్ని డీసీపీ మహేశ్వరరాజుకు అప్పగించింది. ఎన్నిక పూర్తయ్యేంత వరకు రక్షణ కల్పించాలని ఆదేశించింది. వైఎస్సార్సీపీ సభ్యులు ఎక్కడ ఉన్నారో అక్కడి నుంచి పూర్తిస్థాయి భద్రతతో ఎన్నికల హాలుకు తీసుకెళ్లాలని సూచించింది. ఎన్నిక పూర్తయ్తేంతవరకు మహేశ్వరరాజుదే బాధ్యత హైకోర్టు చెప్పింది.

వైఎస్సార్సీపీ నేతల వాహనాలపై టీడీపీ గూండాల దాడి
👉వైఎస్సార్సీపీ నేతలు అరెస్ట్‌దేవినేని అవినాష్, అరుణ్‌కుమార్‌లు అరెస్ట్‌తిరువూరు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులురెడ్డిగూడెం స్టేషన్‌కు తరలిస్తున్న పోలీసులు👉తిరువూరులో టీడీపీ గూండాల అరాచకంవైఎస్సార్‌సీపీ నేతల వాహనాలపై టీడీపీ గూండాల దాడిదేవినేని అవినాష్, అరుణ్‌కుమార్ వాహనాలపై దాడివైఎస్సార్సీపీ నేతల కారు అద్దాలు పగలగొట్టిన టీడీపీ గూండాలుదారికాసి వైఎస్సార్సీపీ నేతలను అడ్డుకున్న టీడీపీ గూండాలుఎ.కొండూరు మండలం రేపూడి క్రాస్ వద్ద టీడీపీ గూండాల విధ్వంసంసాక్షి, విజయవాడ: టీడీపీ నేతలు బరి తెగించేశారు.. వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు, వైసీపీ నేతలను తిరువూరు వెళ్లకుండా చేసేందుకు కుట్రలకు తెరతీశారు. తిరువూరు వెళ్లే మార్గంలో రామచంద్రాపురం, చీమల పాడు వద్ద టీడీపీ.. భారీగా కార్యకర్తలను మోహరింపచేసింది. వైఎస్సార్సీపీ నేత స్వామిదాస్ ఇంటిని టీడీపీ గూండాలు ముట్టడించారు. వైఎస్సార్సీపీ కౌన్సిలర్ల కుటుంబసభ్యులపై టీడీపీ గూండాలు బెదిరింపులకు దిగారు.వైఎస్సార్సీపీ నేతల్ని దారికాసి టీడీపీ గూండాలు అడ్డగించారు. అవినాష్, స్వామిదాస్ అరుణ్ వాహనాలను అడ్డగించారు. వాహనాలు కదలకుండా టీడీపీ గూండాలు చుట్టుముట్టారు. అవినాష్, స్వామిదాస్‌పై టీడీపీ తప్పుడు ఫిర్యాదులు చేసింది. 13వ వార్డు కౌన్సిలర్ తండ్రితో టీడీపీ ఫిర్యాదు చేయించింది. ఓటమి భయంతో టీడీపీ గూండాలు దౌర్జన్యాలు చేస్తున్నారు. కాగా.. భద్రత కల్పించడంలో ఎన్నికల కమిషనర్ ఆదేశాలను కూడా పోలీసులు లెక్కచేయడం లేదు. తిరువూరు వైఎస్సార్సీపీ కౌన్సిలర్ల రక్షణ విషయంలో వితండవాదం చేస్తున్నారు.తిరువూరు వస్తేనే భద్రత కల్పిస్తామని పోలీసులు అంటున్నారు. నిన్న టీడీపీ గూండాల దాడితో వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు విజయవాడకు చేరుకున్నారు. విజయవాడ నుంచి ఎన్నిక జరిగే వరుకు కౌన్సిల్ హాలు వరకు రక్షణ కల్పించాలని వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు కోరుతున్నారు. టీడీపీ గూండాల దాడులపై ఈసీకి వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు.తిరువూరు మున్సిపల్ చైర్పర్సన్ పదవిని సంఖ్యాబలం లేకపోయినా తన ఖాతాలో వేసుకునేందుకు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వీధి రౌడీలా వ్యవహరించారు. ఎన్నిక వాయిదా వేయించాలనే కుట్రతో వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను మున్సిపల్ కార్యాలయంలోకి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. మహిళా కౌన్సిలర్లపై చెప్పులు, వాటర్ బాటిళ్లతో దాడికి తెగబడ్డారు. బారికేడ్లను ధ్వంసం చేశారు. దౌర్జన్యకాండను అడ్డుకోవాల్సిన పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించారు. చివరకు కోరం సరిపోలేదంటూ ఎన్నికల అధికారి, ఆర్డీఓ మాధురి నేటికి (మంగళవారం) వాయిదా వేశారు.

తెలంగాణ రాజ్‌భవన్ హార్డ్ డిస్క్ చోరీ కేసులో ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజ్‌భవన్ చోరీ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సస్పెండైన ఉద్యోగి శ్రీనివాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజ్‌భవన్ చోరీ కేసు నిందితుడు శ్రీనివాస్‌ను అరెస్ట్ చేయడం ఇది రెండోసారి. తోటి మహిళా ఉద్యోగిని ఫోటోలు మార్ఫింగ్ చేసి భయభ్రాంతులకు గురి చేయగా.. ఆ కేసులో మొదటిసారి అరెస్ట్ చేశారు. కాగా.. హార్డ్ డిస్క్‌ల చోరీ కేసులో రెండోసారి చేశారు. ఆ ఉద్యోగి వారంలో రెండుసార్లు అరెస్ట్ కావడం సంచలనం రేపుతోంది. సస్పెండ్ అయినా కానీ.. సెక్యూరిటీని మాయ చేసి రాత్రి సమయంలో రాజ్‌భవన్‌లోకి ప్రవేశించాడు. రాజ్ భవన్లో ఉద్యోగం చేస్తున్న సమయంలో శ్రీనివాస్.. ఓ మహిళకు కొన్ని మార్ఫింగ్ ఫొటోలను చూపించాడు. ఎవరో తనకు ఈ ఫోటోలు పంపిస్తున్నారు జాగ్రత్త అంటూ భయపెట్టాడు. దీంతో కలవరపాటుకు గురైన ఆ మహిళ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఆ మార్ఫింగ్ ఫోటోలను సృష్టించింది.. శ్రీనివాసేనని తేల్చారు. శ్రీనివాస్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు.. రిమాండ్‌కు పంపారు. రాజభవన్ అధికారులు శ్రీనివాస్ సస్పెండ్ చేశారు.జైలకు వెళ్లిన శ్రీనివాస్.. రెండు రోజుల తర్వాత బెయిల్‌పై విడుదలయ్యాడు. జైలు నుండి వచ్చిన శ్రీనివాస్ రాత్రి సమయంలో సెక్యూరిటీని మభ్యపెట్టి లోపలికి వెళ్ళాడు. తన కంప్యూటర్లో ఉన్న హార్డ్ డిస్క్‌ను చోరీ చేసుకుని వెళ్లిపోయాడు. ఈ సంఘటనపై రాజభవన్ అధికారులు పోలీసులు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసిన అధికారులు సీసీ కెమెరాల ద్వారా శ్రీనివాస్ చోరీని గుర్తించారు. అతనిని అరెస్ట్ చేసి.. హార్డ్ డిస్క్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ హార్డ్ డిస్క్‌లో మహిళకు సంబంధించిన ఫోటోలు ఉండడంతో ఆ సాక్ష్యాలను డిలీట్ చేసే ప్రయత్నంలో చోరీకి పాల్పడాడ్డని తెలిసింది.

IPL 2025: అభిషేక్ శర్మతో గొడవ.. దిగ్వేశ్ రాఠీపై సస్పెన్షన్ వేటు
ఐపీఎల్ 2025లో భాగంగా నిన్న (మే 19) జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ బ్యాటర్ అభిషేక్ శర్మతో గొడవకు దిగినందుకు గానూ లక్నో బౌలర్ దిగ్వేశ్ సింగ్ రాఠీపై ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చర్యలు తీసుకుంది. రాఠీ మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధించడంతో పాటు ఓ మ్యాచ్ సస్పెన్షన్ విధించింది. రాఠీ కవ్వింపులకు ప్రతిగా స్పందించిన అభిషేక్ కూడా మ్యాచ్ ఫీజులో 25 శాతం కోతకు గురయ్యాడు. అభిషేక్ ఖాతాలో ఓ డీమెరిట్ పాయింట్ కూడా జమయ్యింది.ABHISHEK vs DIGVESH MOMENT 🤯 pic.twitter.com/oEfs0LWhoe— Johns. (@CricCrazyJohns) May 19, 2025సస్పెన్షన్ కారణంగా రాఠీ లక్నో తదుపరి ఆడబోయే మ్యాచ్‌లో (మే 22న గుజరాత్‌తో) ఆడలేడు. ఈ సీజన్లోనే ఐపీఎల్ అరంగేట్రం చేసిన 23 ఏళ్ల రాఠీ.. సీజన్ ప్రారంభం నుంచి చాలా సార్లు ఐపీఎల్ కోడ్ ఆఫ్ కాండక్ట్‌ను ఉల్లంఘించి గవర్నింగ్ కౌన్సిల్ ఆగ్రహానికి గురయ్యాడు. తాజా ఘటనతో ఈ సీజన్లో రాఠీ డీ మెరిట్ పాయింట్ల సంఖ్య ఐదుకు చేరింది. ఈ కారణంగా అతనిపై ఓ మ్యాచ్ సస్పెన్షన్ వేటు పడింది. ఓ సీజన్లో మూడు సార్లు కోడ్‌ను ఉల్లంఘిస్తే ఓ మ్యాచ్ సస్పెన్షన్ విధిస్తారు. రాఠీ ఈ సీజన్లో పంజాబ్ (1), ముంబైతో (2) జరిగిన మ్యాచ్‌ల్లోనూ కోడ్‌ను ఉల్లంఘించి డిమెరిట్ పాయింట్లు మూటగట్టుకున్నాడు.కాగా, దిగ్వేశ్ రాఠీ వికెట్ తీసిన ప్రతిసారి నోట్ బుక్ సెలబ్రేషన్స్ జరుపుకోవడం మేనరిజంగా పెట్టుకున్నాడు. ఎవరి వికెట్ తీసినా ఇదే తంతు కొనసాగిస్తూ వచ్చాడు. తాజాగా సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ అభిషేక్ శర్మ వికెట్ తీసిన ఆనందంలో ఇదే పని చేశాడు. అయితే ఈసారి రాఠీ నోట్ బుక్ సెలబ్రేషన్స్ కాస్త శృతి మించాయి. అభిషేక్‌తో అతను చాలా అవమానకరంగా ప్రవర్తించాడు. వికెట్ తీశాక వెళ్లు.. వెళ్లు అన్నట్లు సైగ చేశాడు. దీంతో పాటు నోటికి కూడా పని చెప్పాడు. రాఠీ ఇంతలా రియాక్డ్ కావడానికి అంతకుముందు అభిషేక్ బాదిన బాదుడే కారణం. రవి బిష్ణోయ్ వేసిన ఇన్నింగ్స్ 7వ ఓవర్లో అభిషేక్ వరుసగా నాలుగు సిక్సర్లు బాదాడు. ఆతర్వాత ఓవర్లో బంతినందుకున్న రాఠీ.. అభిషేక్‌ను తొలి బంతికే ఔట్ చేశాడు. ఈ క్రమంలో నోట్ బుక్ సెలబ్రేషన్స్ చేసుకుని ఓ మ్యాచ్ సస్పెన్షన్‌కు గురయ్యాడు. మ్యాచ్ అనంతరం రాజీవ్ శుక్లా రాజీ కుదుర్చడంతో అభిషేక్, రాఠీ కరచాలనం చేసుకుని, కలియతిరగడం కొసమెరుపు.ఇదిలా ఉంటే, నిన్నటి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ చేతిలో ఓటమిపాలైన లక్నో ప్లే ఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో.. ఓపెనర్లు మిచెల్ మార్ష్ (65), ఎయిడెన్ మార్క్రమ్ (61) అర్ద సెంచరీలతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన సన్‌రైజర్స్ 18.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. అభిషేక్ శర్మ తన సహజ శైలిలో ఊచకోత (20 బంతుల్లో 59; 4 ఫోర్లు, 6 సిక్సర్లు) కోసి సన్‌రైజర్స్ గెలుపుకు బలమైన పునాది వేశాడు. మధ్యలో ఇషాన్ కిషన్ (35), క్లాసెన్ (47), కమిందు మెండిస్ (32 రిటైర్డ్ హర్ట్) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌లు ఆడగా.. అనికేత్ వర్మ (5 నాటౌట్), నితీశ్ రెడ్డి (5 నాటౌట్) మ్యాచ్‌లను లాంఛనంగా ముగించారు. లక్నో బౌలర్లలో దిగ్వేశ్ రాఠీ 2, విలియమ్ ఓరూర్కీ, శార్దూల్ ఠాకూర్ తలో వికెట్ పడగొట్టారు.

ప్రజల ఆశలతో బాబు కపట రాజకీయం!
‘‘ప్రజలకు మరీ ఆశ ఉండకూడదు. దురాశ పనికిరాదు’’ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు తరచూ చేసే వ్యాఖ్య ఇది. ఈమధ్య సోషల్ మీడియాలోనూ ఆయన వాడిన ఈ డైలాగులు ఎక్కవగా కనిపిస్తున్నాయి. ఆయన చెప్పింది వాస్తవమే. ఎందుకంటారా? బాబు, పవన్‌కళ్యాణ్ లాంటి వాళ్లు ఇచ్చినమాటకు కట్టుబడి హామీలన్నీ నెరవేరుస్తారని నమ్మడం ప్రజల అత్యాశే కదా! ఈ దురాశతోనే ప్రజలు టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిని గెలిపించింది! పాపం.. పై పై వాగ్ధానాలు చేసిన వాళ్లు ఎవరు? వారి ట్రాక్ రికార్డు ఏమిటి అన్నది కూడా గుర్తుపెట్టుకోకుండా ప్రజలు అతిగా ఆశపడ్డారు. టీడీపీ ఎన్నికల మానిఫెస్టోలోని ‘ఆడ బిడ్డ నిధి’కి కూడా బాబు అండ్ కో మంగళం పాడేసినట్లేనన్న వార్తలు చూసిన తరువాత ప్రజలను ఇంత గొప్పగా మోసం చేయవచ్చా? అని అనిపించక మానదు. ప్రజలను దురాశా పరులుగా చిత్రీకరించి నిందించవచ్చు కానీ.. ఆ ఆశ పెట్టిన వారి తప్పు మాత్రం ఏమీ లేదన్నచందంగా ఉందీ వ్యవహారం. ప్రజలను ఇంత బాహాటంగా మోసం చేసినందుకు ఇతర దేశాల్లో ఎలాంటి శిక్షలు పడతాయో తెలియదు కానీ.. ఇలాంటి వారు.. ప్రజల ఆగ్రహాన్ని, ఛీత్కారాలనైతే తప్పకుండా చూస్తారు. దురదృష్టకరమైన విషయం ఏమిటంటే ఈ దేశంలో నేతల వైఖరి నమ్మి మోసపోయిన వారిదే తప్పన్నట్టుగా ఉండటం. అయ్యో ఈ నేతలు ప్రజలను పిచ్చోళ్లుగా చూస్తున్నారే అన్న ఆవేదన కలుగుతుంది. నిజాయితీ లేని నేతలు అధికారంలోకి వచ్చి, చెప్పినవి చేయకపోగా, వారినే బెదిరిస్తున్న తీరు, విషయాలను పక్కదారి పట్టిస్తున్న తీరులపై పెద్ద పరిశోధనే చేయవచ్చు. ఆశపెట్టి ఏమార్చడం.. ఆ తరువాత ప్రజలనే నిందించడం చంద్రబాబుకు కొత్తేమీ కాదు. సుమారు రూ.లక్ష కోట్ల రైతు, డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తానన్న హామీతో 2014లో గద్దెనెక్కిన చంద్రబాబు ఆ తరువాత ఏం చేశారో అందరికీ తెలుసు. ఆ రోజుల్లోనే ఆయన ‘‘ఆశకు హద్దు ఉండాలి’’ అని రైతులను ఉద్దేశించి నేరుగానే అన్నారు. తాజాగా 2024 ఎన్నికల్లో బాబు ఇచ్చిన హామీ ప్రతి మహిళకూ రూ.1500 చొప్పున నెల నెల ఇస్తానని! ఈ పథకానికి ఆడబిడ్డ నిధి పేరూ పెట్టారు. ప్రతి ఒక్కరికీ ఇస్తాం. తల్లికి వందనం కింద ఇంట్లో ఉన్న ప్రతి బిడ్డకూ రూ.15 వేలు చొప్పున ఇస్తామని ఊదరగొట్టడంతో మహిళలు చాలామంది ఆశపడ్డారు. ఓట్లేశారు. ప్రస్తుత మంత్రి నిమ్మల రామానాయుడు అప్పట్లో ‘‘నీకు పదిహేను వేలు.. నీకు పదిహేను వేలు’’ అంటూ ప్రచారం చేయడమూ మనం చూశాం. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లు సైతం.. ‘‘ఒకరుంటే రూ.15 వేలు, నలుగురు పిల్లలుంటే రూ.60 వేలు..ఇంకా పిల్లలను కనండి..వారి బాధ్యత మాది’’ అని ప్రచారం చేసి అధికారంలోకి వచ్చారు. ఏడాది పూర్తి అయిపోయింది.. తల్లికి వందనం లేదు. విద్యార్ధులకు సుమారు రూ.13 వేలు ఎగవేశారు. వచ్చే విద్యా సంవత్సరం ఇస్తామని అంటున్నారు. ఏమవుతుందో తెలియదు! ఆర్టీసీ బస్సుల్లో మహిళకు ఉచిత రవాణా సౌకర్యం అన్న హామీని కూడా అటకెక్కించేశారు. అమలు చేసి ఉంటే ఏపీ మహిళలకు ఏడాదికి రూ మూడు వేల కోట్ల వరకూ మిగిలేది! ఈ లెక్క కూడా ఎల్లోమీడియాదే. ఆగస్టు పదిహేను నుంచి ఈ స్కీము అమలు చేస్తామని చంద్రబాబు ఈమధ్య కర్నూలులో ప్రకటించారు. అంటే మరో మూడు నెలలు ఈ స్కీమ్ ఉండదు. దీనిని కూడా లెక్కలోకి తీసుకుంటే మహిళలు మరో రూ.వెయ్యి కోట్లు నష్టపోయినట్లు! ఇదే సభలో చంద్రబాబు ఆడబిడ్డ నిధి స్కీము లేనట్లే తేల్చారని వార్త వచ్చింది. దానికి ఆయన ఇచ్చిన వివరణ చూస్తే మరీ ఇంత పచ్చి పాపమా అనిపిస్తుంది. తాను అధికారంలోకి రావడానికి సూపర్ సిక్స్ పేరుతో ఇచ్చిన హామీలు మోసపూరితమని ఆయనకు తెలుసు. తాను ఆ వాగ్దానాలు ఎందుకు చేసింది.. ఎందుకు అమలు చేయలేకపోతున్నది నిజాయితీగా వివరించడం మానేసి, మరో కొత్త అబద్దాన్ని సృష్టించారు. అదేమిటంటే తాను తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణల పుణ్యమా అని ఏపీలో పేదలు బాగానే సంపాదిస్తున్నట్లు చంద్రబాబే తేల్చేశారు! అందువల్ల వారికి ఆ స్కీమ్ అవసరం లేదని, 2029నాటికి పేదరికం లేకుండా చేసేస్తామని, అప్పటికీ పేదలు ఉంటే పీ-4 కింద దాతలకు అప్పగిస్తామని అన్నారట. కూటమి ప్రభుత్వం వచ్చాక, ప్రజల చేతుల్లో డబ్బులు ఆడక పేదలు, గిట్టుబాటు ధరలు లేక రైతులు, వ్యాపారాలు లేక వ్యాపారస్తులు అల్లాడుతుంటే పేదలంతా బాగా సంపాదించుకుంటున్నారని చంద్రబాబు చెబుతున్నారు. ఇలాంటి వారి మాటలు నమ్మి ఓటు వేసినందుకు తమకు బాగానే శాస్తి అయిందని ప్రజలు అనుకునే పరిస్థితి ఏర్పడింది. ఆడబిడ్డ నిధి స్కీము రాష్ట్రంలోని కోటిన్నర మంది మహిళలకు ఉపయోగపడేది! ఏడాదికి సుమారు రూ.30 వేల కోట్లకుపైగా అవసరమని లెక్క. ఇంత మొత్తం ఎలా సాధ్యమని అప్పట్లో ప్రశ్నించిన వారికి బాబు ఇచ్చిన సమాధానం తాను సంపద సృష్టించగలనూ అని! ఇప్పుడేమో సంపద వచ్చేసిందని చెబుతుంటే బిత్తరపోవడం తప్ప ప్రజలు చేయగలిగేది ఏముంటుంది! ఒకరకంగా చెప్పాలంటే ఈవీఎంల మాయాజాలం సంగతి పక్కనబెడితే అనేక నియోజకవర్గాలలో తల్లికి వందనం, ఆడబిడ్డ నిధి వాగ్దానాలు గేమ్ చేంజర్ గా మారి కూటమిని అధికారంలోకి తెచ్చాయి. ఇప్పుడేమో చేతులెత్తేసి పేదల జీవితాలతో కూటమి నేతలు చెలగాటమాడుతున్నారు. వాగ్దానాల గురించి చెప్పకుండా, చెత్త నుంచి సంపద సృష్టిస్తున్నామని, ఓర్వకల్లో మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేశామని, బుద్దుడి సలహాలు పాటించండని కధలు చెబుతున్నారు. ఇక్కడ ఒక గమ్మత్తు జరిగింది. చెత్త ఎత్తడానికి పనివారు వస్తున్నారా అని చంద్రబాబు ప్రశ్నిస్తే లేదు..లేదు..అని ఎక్కువ మంది చేతులెత్తారు. దాంతో చెత్త గురించి ఆయన చెబుతున్న కబుర్లలో డొల్లతనం బయటపడింది. చెత్త నుంచి విద్యుత్ తయారు చేసే ప్లాంట్లు పెడతామని, లక్ష మంది డ్వాక్రా మహిళలను పారిశ్రామికవేత్తలు చేస్తామని, ఉద్యానవన పంటలను 18 లక్షల హెక్టార్ల నుంచి 36 లక్షల హెక్టార్లు చేస్తామని, ఇలా ఏవేవో సంబంధం లేని మాటలతో ప్రసంగం చేశారు. అక్కడితో ఆగితే ఫర్వాలేదు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని కూడా దబాయించి మరీ చెప్పారు. నవ్వుకుని ఊండిపోవడం అక్కడి ప్రజల వంతైంది. చివరికి బుద్దుడు, ఆయన శిష్యుడి కథ అంటూ చంద్రబాబు ప్రజలకు ఒక స్టోరీ చెప్పారు. దాని ప్రకారం శిష్యుడి కోరిక మేరకు బుద్దుడు కొత్త వస్త్రాలు ఇప్పించారట. ఆ తర్వాత కొద్ది రోజులకు బుద్దుడు పిలిచి పాత వస్త్రాలు ఏమి చేశావని అడిగాడట. వాటితో చిరిగిపోయిన బొంతలో పెట్టి కుట్టుకున్నానని శిష్యుడు చెప్పాడట. మరీ చినిగిపోయిన బొంతలోని వస్త్రాలు ఏమి చేశావు అని బుద్దుడు అడిగాడట. వాటిని కిటికీ తెరలు చేశానని జవాబు ఇచ్చారు.మరి అప్పటికే ఉన్న కిటీకి తెరలు ఏమి చేశావని అడిగితే గది తుడవడానికి వాడుతున్నానని, ఆ వస్త్రాన్ని మసిబట్టగా వాడుతున్నానని, అప్పటిదాకా ఉన్న మసిబట్ట దారాలను కొవ్వొత్తిలో వాడే వత్తులకు వినియోగిస్తున్నానని శిష్యుడు చెప్పారట. ప్రతి వస్తువుకూ ఒక ఉపయోగం ఉంటుందని చెప్పడానికి చంద్రబాబు ఈ కథ చెప్పినా, విన్న వారికి మాత్రం చివరికి ఏపీ పరిస్థితి ఇలా మారిందన్నమాట అని అనుకున్నారనుకోవాలి. ఒక పక్క అమరావతిలో ఇప్పటికే ఉన్న సచివాలయం, అసెంబ్లీ తదితర భవనాలు ఉన్నా, అవి పనికి రావంటూ లక్ష కోట్లు వ్యయం చేస్తూ గొప్పలు చెప్పే చంద్రబాబు ప్రజలు మాత్రం ఈ ఆధునిక యుగంలో చినిగిన వస్త్రాలు సైతం వాడుకోవాలని చెబుతున్నారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చుతున్న చంద్రబాబు ప్రభుత్వానికి బుద్దుడు, శిష్యుడు కథ వర్తించదా అంటే ఏమి చెబుతాం. ఎదుటివాడికి చెప్పేటందుకే నీతులు అన్న సూత్రం చంద్రబాబు వంటివారిని చూసే వచ్చిందనుకోవాలి.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

ఎన్టీఆర్ పుట్టినరోజు ప్రత్యేకం.. అందుకే ఆల్‌రౌండర్ అయ్యాడు
జూనియర్ ఎన్టీఆర్‌కు ఒక చరిత్ర ఉంది. స్వర్గీయ ఎన్టీఆర్ అంశ ఈ తారకరాముడు. నందమూరి వంశంలో నేడు అత్యంత ప్రజాదరణ కలిగిన ఏకైక నటుడు.. ఒకరకంగా చెప్పాలంటే నందమూరి అనే బ్రాండ్‌కు తారక్ ఒక ఐకాన్ అని చెప్పవచ్చు. బాల నటుడిగా తెరంగేట్రం చేసి, నూనూగు మీసాల వయసులోనే బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డ్లను దాటుకుంటూ విరుచుకపడ్డాడు. ఇండస్ట్రీలో అందరూ తారక్‌ను ఆల్‌రౌండర్ అంటారు.. దానికి కారణం భారీ డైలాగ్స్, కళ్లు చెదిరే డ్యాన్స్, దుమ్మురేపే యాక్షన్ సీన్స్, కంటతడి పెట్టించే నటన ఇలా అన్నింటిలోనూ ఆయన అగ్రగామి. క్లాస్, మాస్ అంటూ తేడా ఉండదు. సినీ అభిమానులు అందరూ ఆయనకు ఫ్యాన్సే.. నటనలో తారక్ తర్వాతే ఎవరైనా.. అనేలా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని చిత్రపరిశ్రమలో సెట్ చేశాడు. నేడు ఎన్టీఆర్ (NTR) పుట్టిన రోజు (1983 మే 20).. ఈ సందర్భంగా ఆయన గురించి పలు విషయాలపై ఓ లుక్కేద్దాం (Happy Birthday NTR)..తారక్ @ 'మ్యాన్ ఆఫ్ మాసెస్'ఇండియన్ సినిమాలో ఎందరో సూపర్ స్టార్స్, మెగాస్టార్స్, పవర్ స్టార్స్ ఉన్నారు కానీ యంగ్ టైగర్‌కు మాత్రమే ఉన్న ఏకైక బిరుదు 'మ్యాన్ ఆఫ్ మాసెస్'. ఈ బిరుదుకు ప్రధాన కారణం ఆయనకున్న మాస్ ఫాలోయింగ్ అలాంటిది. ఇండియన్ మార్కెట్ నుంచి అంతర్జాతీయ స్థాయికి ఆయన చేరుకున్న తీరు అందరనీ ఆశ్చర్యపరుస్తుంది. కింద పడిన ప్రతిసారి సాలిడ్ బౌన్స్ బ్యాక్‌తో తిరిగొచ్చాడు.తారక్ జీవితంలో ఇవన్నీ ప్రత్యేకం🎥 తారక్ 1983 మే 20న జన్మించారు. హైదరాబాద్‌లోని విద్యారణ్య స్కూల్లో చదివిన ఆయన సెయింట్ మేరీ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు.🎥 పదేళ్ల వయసులోనే బ్రహ్మర్షి విశ్వామిత్రతో బాల నటుడిగా టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా నుంచే జూనియర్ ఎన్టీఆర్ అని పిలిచేవారు.🎥ఎన్టీఆర్ హీరోగా నటించిన తొలి చిత్రం 'నిన్ను చూడాలని'. ఈ సినిమాకు ఆయన రూ.3.5 లక్షల రెమ్యూనరేషన్ తీసుకున్నారని టాక్. ఆ మొత్తాన్ని తీసుకెళ్లి తన తల్లికి ఇచ్చారట.🎥 యమదొంగ, కంత్రి, అదుర్స్, రభస, నాన్నకు ప్రేమతో సినిమాలతో గాయకుడిగానూ తారక్ మెప్పించారు.🎥 జపాన్‌లో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఏకైక తెలుగు హీరో తారక్. బాద్షా సినిమా జపాన్ ఫిలిం ఫెస్టివల్‌కు ఎంపికైంది.🎥 'ఆది' సినిమాలో భారీ డైలాగులు చెప్పగలడా? అని కొందరు పరుచూరి బ్రదర్స్ దగ్గర సందేహించారట. కానీ, ఎన్టీఆర్ వాటంన్నిటినీ సింగిల్ టేక్‌లో చెప్పడంతో తన స్టామినా ఏంటో నిరూపించారు. ఈ సినిమాకు తారక్ నంది అవార్డు సొంతం చేసుకున్నారు.🎥 నంబర్ 9 అంటే తారక్‌కు సెంటిమెంట్. ఆయన వాహనాల నంబర్లన్నీ 9తోనే ప్రారంభమవుతాయి. ఓ కారు కోసం 9999 అనే ఫ్యాన్సీ నంబర్‌ను రూ. 10లక్షలతో కొనుగోలు చేసి 9 అంటే ఎంత ఇష్టమో తెలిపారు.🎥 మాతృదేవోభవ చిత్రంలోని ‘రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే’ పాట అంటే ఎన్టీఆర్‌కు చాలా ఇష్టం.🎥 'ఫోర్బ్స్ ఇండియా' సెలబ్రిటీ లిస్ట్‌లో రెండు సార్లు నిలిచాడు.🎥 పూరీ జగన్నాథ్- ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన 'ఆంధ్రావాలా' సినిమా ఆడియో విడుదల వేడుక తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎప్పటికీ చెరగని రికార్డు నెలకొల్పింది. ఈ వేడుకలో దాదాపు 10లక్షల మంది తారక్ అభిమానులు పాల్గొన్నారు. నిమ్మకూరులో జరిగిన ఈ కార్యక్రమం కోసం రైల్వే అధికారులు కూడా ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు.🎥సుమారుగా 8 భాషల్లో ఎన్టీఆర్ అనర్గళంగా మాట్లాడగలడు. తన వాగ్ధాటితో ఇప్పటికే అన్ని చిత్ర పరిశ్రమల వారిని ఆకర్షించాడు.🎥 2016లో వచ్చిన జనతా గ్యారేజ్‌తో కింగ్ ఆఫ్ బాక్సాఫీస్ అవార్డును IIFA నుంచి అందుకున్నాడు🎥కంత్రి, అదుర్స్,బృందావనం చిత్రాలకు గాను ఉత్తమ హీరోగా ఫిలింఫేర్ అవార్డులను అందకున్న తారక్🎥 బాల రామాయణము,ఆది నంది స్పెషల్ జ్యూరీ అవార్డును అందకున్నాడు 🎥తారక్‌కు ఫేవరెట్ సినిమా 'దాన వీర శూర కర్ణ'. ఇప్పటికి ఈ సినిమాను వందసార్లకు పైగా చూశారట🎥 తారక్- ప్రణతిలకు ఇద్దరు అబ్బాయిలు (అభయ్, భార్గవ్). కాగా, కూతురు లేదనే లోటు ఎప్పటికీ ఉంటుందని ఎన్టీఆర్ ఓ సందర్భంలో చెప్పారు.🎥 జూనియర్ ఎన్టీఆర్, యంగ్ టైగర్, తారక్, దేవర అయనకున్న పేర్లు🎥అమ్మ (శాలనీ) చిరకాల కలను తీర్చిన తారక్.. ఆమె స్వగ్రామం కుందాపురంలో ఉన్న ఉడుపి శ్రీకృష్ణ ఆలయ దర్శనం చేసుకోవాలనే ఆమె కోరికను కొడుకుగా తీర్చాడు.

గాజాపై దాడులు ఆపకుంటే.. ఇజ్రాయెల్‌కు యూకే, ఫ్రాన్స్, కెనడా హెచ్చరిక
టెల్ అవీవ్: గాజా స్ట్రిప్‌లో పూర్తి విజయం సాధించాలనే లక్ష్యంతో ఇజ్రాయెల్(Israel) నిరంతరం తన దాడులను కొనసాగిస్తోంది. ఈ నేపధ్యంలో బ్రిటన్, ఫ్రాన్స్, కెనడా నేతలు ఇజ్రాయెల్ జరుపుతున్న తాజా సైనిక దాడులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటిని వెంటనే ఆపకపోతే కఠిన ఆంక్షలు విధిస్తామని హెచ్చరించారు.ఇజ్రాయెల్ సైన్యం గాజా స్ట్రిప్(Gaza Strip)లో తాజాగా ‘ఆపరేషన్ గిడియన్స్ చారియట్స్’ అనే పేరుతో కొత్త సైనిక దాడిని ప్రారంభించింది. ఉత్తర, దక్షిణ గాజాలో వ్యూహాత్మక ప్రాంతాలను స్వాధీనం చేసుకోవడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ ఈ దాడులకు పాల్పడుతోంది. వీటిని మే 17 నుంచి ప్రారంభించింది. ఈ దాడులలో వందలాది పాలస్తీనియన్లు మరణించారని పాలస్తీనా ఆరోగ్య అధికారులు తెలిపారు. మే 14, 2025న జబాలియాలో జరిగిన ఇజ్రాయెల్ వైమానిక దాడులలో 48 మంది మరణించారు. వీరిలో 22 మంది పిల్లలు ఉన్నారని స్థానిక ఆసుపత్రులు తెలిపాయి.ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు(Benjamin Netanyahu) ఇటీవల ఈ దాడులను పూర్తి విజయం సాధించే వరకు కొనసాగిస్తామని, హమాస్‌ను నాశనం చేయడం, నిరాయుధీకరణ చేయడం, బందీలను విడుదల చేయడమే తమ లక్ష్యమని పునరుద్ఘాటించారు. దీనిపై స్పందించిన బ్రిటన్, ఫ్రాన్స్, కెనడా నేతలు మే 19, ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేసి, ఇజ్రాయెల్ చేపడుతున్న అత్యంత దారుణమైన చర్యలను ఖండించారు. ఇజ్రాయెల్ తన సైనిక దాడులను ఆపకపోతే, సహాయ నిరోధకాలను ఎత్తివేయకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ మూడు దేశాలు గాజాలో తక్షణ కాల్పుల విరమణ కోసం అమెరికా, ఖతార్, ఈజిప్ట్‌లు చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు పలికాయి. కాగా ఇజ్రాయెల్ గత మార్చి నుండి గాజాకు ఆహారం, వైద్య సామగ్రి, ఇంధన సహాయాన్ని నిరోధించింది. దీని వల్ల గాజాలో సంక్షోభం ఏర్పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరించారు. కాగా ఉత్తర గాజాలో పౌరులు తాగునీటి కోసం తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఇదిలావుండగా మే 19న ఇజ్రాయెల్ ఒక ప్రాథమిక పరిమాణంలో ఆహార సహాయాన్ని గాజాకు అనుమతిస్తామని ప్రకటించింది. ఫలితంగా అక్కడ ఆహారం సంక్షోభం నివారణ జరుగుతుందని తెలిపింది. అయితే, ఐక్యరాష్ట్ర సమితి (యూఎన్ఓ) ఈ సహాయాన్ని సముద్రంలో ఒక చుక్కగా అభివర్ణించింది.ఖతార్‌లోని దోహాలో.. గాజాలో కాల్పుల విరమణ, బందీల మార్పిడికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. ఇందులో అమెరికా, ఖతార్, ఈజిప్ట్ మధ్యవర్తిత్వం వహిస్తున్నాయి. హమాస్.. 60 రోజుల కాల్పుల విరమణ, రోజుకు 400 సహాయ ట్రక్కుల అనుమతి తదితర ప్రతిపాదనలను ముందుకు తెచ్చింది. ఇజ్రాయెల్ ఈ దీనిపై ఇంకా బహిరంగంగా స్పందించలేదు. గతంలో గాజా నుంచి సైన్యాన్ని ఉపసంహరించడానికి, యుద్ధాన్ని ముగించడానికి నిరాకరించింది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు.. హమాస్ నిరాయుధీకరణ దిశగా ముందడుగు వేస్తేనే గాజా యుద్ధం ముగుస్తుందని ఖతార్ చర్చలలో స్పష్టం చేశారు.ఇది కూడా చదవండి: ఇన్ఫ్లుయెన్సర్ కుమారుని అనుమానాస్పద మృతి

విజయనగరం ఉగ్రమూలాల కేసు.. వెలుగులోకి కొత్త కోణాలు
సాక్షి, హైదరాబాద్: విజయనగరం ఉగ్రకుట్ర కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో పట్టుబడ్డ ఏపీ విజయనగరానికి చెందిన సిరాజ్ ఉర్ రెహా్మన్, హైదరాబాద్ బోయిగూడకు చెందిన సయ్యద్ సమీర్ భారీ విధ్వంసానికి ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. కర్ణాటక, మహా రాష్ట్ర యువకులు సైతం వీరి గ్యాంగ్‌లో ఉన్నట్టు తెలిసింది. వీరంతా ఇటీవలే హైదరాబాద్‌లో సమావేశమై బాంబుపేలుళ్ల కుట్రలకు సంబంధించి పలు అంశాలు పంచుకున్న ట్టు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఏపీ, తెలంగాణ ఇంటెలిజెన్స్ పోలీసుల జాయింట్ ఆపరేషన్‌లో భాగంగా సిరాజ్, సమీర్‌లను ఆదివారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. విజయనగరం పోలీసులు దర్యాప్తు చేస్తున్న ఈ కేసులో అనేక కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఉగ్రలింకుల నేపథ్యంలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు సైతం రంగంలోకి దిగారు. సోమవారం విజయనగరం వెళ్లి స్థానిక పోలీసులు, ఇరు రాష్ట్రాల ఇంటెలిజెన్స్ అధికారుల నుంచి కీలక సమాచారం సేకరించారు. సౌదీ హ్యాండ్లర్ నుంచి వచి్చన ఆదేశాల మేరకు భారీ పేలుళ్ల కుట్రకు తెరతీసినట్టు కీలక ఆధారాలు ఉండటంతో ఎన్ఐఏ ప్రత్యేకంగా కేసు నమోదుచేసి దర్యాప్తు చేయనున్నట్టు తెలిసింది. ప్రత్యేకంగా ఇన్స్టాగ్రామ్ గ్రూపు ఈ కుట్రలో సిరాజ్, సమీర్‌తోపాటు కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన వారు కలిపి మొత్తం ఆరుగురు ఉన్నట్టు గుర్తించారు. వీరంతా ఇన్‌స్టా్రగామ్‌లో ఒక గ్రూప్ ఏర్పాటు చేసుకోగా.. సౌదీ హ్యాండ్లర్ అన్ని కీలక విషయాలను వీరి గ్రూప్ కు పంపుతున్నాడు. ఇప్పటికే వీరంతా హైదరాబాద్‌లో సమీర్ సహాయంతో ఒక రహస్య ప్రాంతంలో 3 రోజులపాటు గడిపినట్టు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఇందు లో ప్రధానంగా బాంబుల తయారీ, అందుకు అవసరమైన వస్తువుల కొనుగోలు, డమ్మీ బ్లాస్టులు చేయడం, ఆ తర్వాత ఎవరు.. ఎప్పుడు.. ఎక్కడ.. ఎవరిని కలవాలి, తదుపరి కార్యాచరణ వంటి అనేక విషయాలు చర్చించుకున్నారు. సమీర్, సిరాజ్‌కు బాంబుల తయారీ పదార్థాల కొనుగోలు, తయారీ బాధ్యతను హ్యాండ్లర్ అప్పగించాడు. యూట్యూబ్‌లో వీరిద్దరూ బాంబుల తయారీ విధానం చూసినట్టు తెలిసింది. హైదరాబాద్‌లో పేలుడు పదార్థాలు కొనుగోలు చేస్తే అనుమానం వస్తుందని, విజయనగరానికి చెందిన సిరాజ్‌కు ఆ బాధ్యత అప్పగించారు. టిఫిన్ బాక్స్ బాంబులు తయారు చేసేందుకు ప్రయోగాలు చేస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఇందుకు అవసరమైన టిఫిన్ బాక్సులు, వైర్లు, రిమోట్ సెల్స్ అమెజాన్‌లో ఆర్డర్ చేసినట్లు తేలింది. ఏపీ రంపచోడవరం అటవీ ప్రాంతంలో ఇప్పటికే పలుమార్లు రిహార్సల్స్ నిర్వహించినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. హైదరాబాద్‌లో డమ్మీ బ్లాస్టింగ్స్, ఆ తరువాత వరుస పేలుళ్లకు కుట్ర చేసినట్టు గుర్తించారు. సమీర్ గురించి ఆరా.. సికింద్రాబాద్‌లో లిఫ్ట్ మెకానిక్‌గా పనిచేస్తున్న సమీ ర్.. బోయిగూడ రైల్ కళారంగ్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఇక్కడే ఉంటూ ఇన్‌స్టా్రగామ్ గ్రూప్ ద్వారా ఇతర నిందితులకు, సౌదీలోని హ్యాండ్లర్కు టచ్‌లో ఉంటున్నాడు. హైదరాబాద్ కేంద్రంగా మిగిలిన ఆరుగురు సభ్యులకు షెల్టర్ ఇవ్వడం.. బాంబుల తయారీలో సిరాజ్‌కు సహకారం అందించడంలో కీలకంగా ఉంటున్నాడు. సమీర్ ఇంకా ఎవరెవరితో సన్నిహితంగా ఉండేవాడు.. సమీర్‌తో కాంటాక్ట్‌లో ఉన్న వారు ఎవరు అన్న విషయాలపై తెలంగాణ ఇంటెలిజెన్స్ ఆరా తీస్తోంది.

ఎకో ఫ్రెండ్లీ వెడ్డింగ్!
పెళ్లి వేడుకలు అనగానే...ఎంత ఖర్చు చేస్తే అంత గొప్ప అనే భావన చాలామందిలో ఉంది. అయితే కొందరు అందుకు భిన్నంగా ఉంటారు. చెన్నైకి చెందిన లైఫ్‌స్టైల్ అండ్ కమ్యూనిటీ బ్లాగర్ ఉమా రామ్ రెండో కోవకు చెందిన మహిళ. తన వివాహాన్ని ఎకో–ఫ్రెండ్లీ వెడ్డింగ్‌గా జరుపుకొని అందరి దృష్టిని ఆకర్షించింది. శుభలేఖల నుంచి పెళ్లి వేడుకల ముగింపు వరకు ప్రతి దశలోనూ పర్యావరణ దృష్టితో అడుగులు వేసింది.వివాహ వేడుకలో వ్యర్థాలను తగ్గించడానికి స్వచ్ఛంద సంస్థ ‘కనెక్ట్ టు భూమి’ సహాయం తీసుకొన్నారు. డైనింగ్ నుంచి డెకార్ వరకు వృథాను వెట్, డ్రై వేస్ట్‌గా వేరు చేశారు. వివాహ వేడుకల్లో ఉపయోగించిన పువ్వులు, పండ్లు, ఇతర కంపోస్టు చేయగల వ్యర్థాలను న్యూట్రీయెంట్–రిచ్ మాన్యూర్గా మార్చారు. పెళ్లి ఆహ్వాన పత్రికలను సీడ్ పేపర్ నుంచి తయారుచేశారు. ‘మనసు ఉంటే మార్గం ఉంటుంది’ అంటారు. ఈ మంచి సూత్రాన్ని వివాహ వేడుకలలో కూడా అనుసరిస్తే... పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుంది. ఇదీ చదవండి: Yoga: ప్రాణాయామంతో అమోఘమైన ఆరోగ్య ఫలితాలు

‘యుద్ధాన్ని ముగించాలనుకుంటున్నాం.. కానీ’
కాల్పుల విరమణ దిశగా రష్యా, ఉక్రెయిన్ తక్షణం చర్చలు మొదలు పెడతాయని.. ఇరు దేశాధినేతలు వ్లాదిమిర్ పుతిన్, జెలెన్స్కీ ఇందుకు అంగీకరించినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించిన సంగతి తెలిసిందే.. పుతిన్‌తో ట్రంప్ సోమవారం రెండు గంటలకు పైగా సుదీర్ఘంగా ఫోన్ చర్చలు జరిపారు. అనంతరం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతోనూ కూడా చర్చించారు.ఈ క్రమంలో యుద్ధం ముగింపునకు తాము సిద్ధంగా ఉన్నామని.. అయితే రష్యా అందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపించడం లేదంటూ జెలెన్స్కీ వ్యాఖ్యానించారు. రష్యా నియమాలు ఏంటో తనకు తెలియదన్న జెలెన్స్కీ.. ఈ యుద్ధంలో మేము చాలా కోల్పోయామన్నారు. ఎలాంటి షరతులు లేకుండా పూర్తి కాల్పుల విరమణకు తాము సిద్ధం.. కానీ.. రష్యా అందుకు రెడీగా ఉన్నట్లు తనకు అనిపించడం లేదంటూ జెలెన్స్కీ చెప్పుకొచ్చారు.ముందుగా కాల్పుల విరమణను రష్యా అంగీకరించాలని.. ఆ తర్వాత యుద్ధాన్ని పూర్తిగా ఆపేయాలంటూ జెలెన్స్కీ కోరారు. మరో వైపు, ఈ కాల్పుల విరమణను ప్రతిపాదించినందుకు ట్రంప్‌నకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
IPL 2025: ముంబై ఇండియన్స్‌లోకి బెయిర్‌స్టో.. మరో ఇద్దరి పేర్లు కూడా ఖరారు
War యుద్ధాల్లో ఓడేది శ్రామిక ప్రజలే!
నాన్నే అమ్మను రాయితో గుద్ది చంపేశాడు..!
ప్రముఖ శాస్త్రవేత్త నార్లికర్ కన్నుమూత.. సాగించిన పరిశోధనలివే..
ఈజ్ మై ట్రిప్ సీఈఓను విచారించిన ఈడీ
ఎన్నికల కమిషనర్‌ను కలిసిన వైఎస్సార్సీపీ నేతలు
ముక్కులో దూది.. నోటికి పది రౌండ్లు టేపు చుట్టుకుని..
మెట్రోలో ఇన్ఫ్లూయెన్సర్ సందడి మాములుగా లేదు! వీడియో వైరల్
PKL వేలం.. అతడిపై కన్నేసిన ఫ్రాంఛైజీలు.. రిటెన్షన్ జాబితా ఇదే
దిగొచ్చిన బంగారం ధర! తులం ఎంతంటే..
అనసూయ నూతన గృహప్రవేశం.. పూజా కార్యక్రమం (ఫోటోలు)
సీఎం గారూ.. యుద్ధంలో ఉన్నా.. రాలేకపోతన్న..
వైఎస్సార్సీపీదే విజయం.. మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక ఏకగ్రీవం
ఇండియా ఇంత బలహీనమైనదా?
అందుకే నా కొడుకుకు ఆయన పేరు పెట్టుకున్నా: అనసూయ పోస్ట్ వైరల్
గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన స్టార్ హీరో కూతురు
ఆర్థిక సంక్షోభం రాబోతోంది!.. రాబర్ట్ కియోసాకి హెచ్చరిక
సంక్రాంతికి రఫ్ఫాడించేద్దాం
కోట్ల విలువైన విల్లా కొనుగోలు చేసిన బిగ్‌బాస్ రోహిణి.. ధర ఎంతంటే?
నైనై తుర్కియే..! కేవలం రెండు రోజుల్లోనే..
..ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదట వెళ్లండి!
హీరోయిన్‌తో కమల్ ముద్దు సీన్.. ఏజ్ గ్యాప్‌పై విమర్శలు
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
రేపటి నుంచే భూముల రీసర్వే.. రెవెన్యూ వర్గాల ఆందోళన
ఇండియన్ ఆర్మీ కీలక ప్రకటన
మనం దెబ్బతిన్న ప్రతీసారి శాంతి చర్చలనడం మనకు ఆనవాయితీ సార్!
బంగ్లా ప్లేయర్ విధ్వంసకర శతకం.. రికార్డులు బద్దలు
ఓటీటీలోకి వచ్చేసిన సస్పెన్స్ థ్రిల్లర్.. తెలుగులో స్ట్రీమింగ్
వారికి నా కంటే అందగాడు కనిపించలేదేమో!
స్లీపర్ ప్రయాణికులకు ఇక ఆ సౌకర్యం లేదు..
IPL 2025: ముంబై ఇండియన్స్‌లోకి బెయిర్‌స్టో.. మరో ఇద్దరి పేర్లు కూడా ఖరారు
War యుద్ధాల్లో ఓడేది శ్రామిక ప్రజలే!
నాన్నే అమ్మను రాయితో గుద్ది చంపేశాడు..!
ప్రముఖ శాస్త్రవేత్త నార్లికర్ కన్నుమూత.. సాగించిన పరిశోధనలివే..
ఈజ్ మై ట్రిప్ సీఈఓను విచారించిన ఈడీ
ఎన్నికల కమిషనర్‌ను కలిసిన వైఎస్సార్సీపీ నేతలు
ముక్కులో దూది.. నోటికి పది రౌండ్లు టేపు చుట్టుకుని..
మెట్రోలో ఇన్ఫ్లూయెన్సర్ సందడి మాములుగా లేదు! వీడియో వైరల్
PKL వేలం.. అతడిపై కన్నేసిన ఫ్రాంఛైజీలు.. రిటెన్షన్ జాబితా ఇదే
దిగొచ్చిన బంగారం ధర! తులం ఎంతంటే..
సీఎం గారూ.. యుద్ధంలో ఉన్నా.. రాలేకపోతన్న..
వైఎస్సార్సీపీదే విజయం.. మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక ఏకగ్రీవం
ఇండియా ఇంత బలహీనమైనదా?
అందుకే నా కొడుకుకు ఆయన పేరు పెట్టుకున్నా: అనసూయ పోస్ట్ వైరల్
గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన స్టార్ హీరో కూతురు
ఆర్థిక సంక్షోభం రాబోతోంది!.. రాబర్ట్ కియోసాకి హెచ్చరిక
సంక్రాంతికి రఫ్ఫాడించేద్దాం
కోట్ల విలువైన విల్లా కొనుగోలు చేసిన బిగ్‌బాస్ రోహిణి.. ధర ఎంతంటే?
నైనై తుర్కియే..! కేవలం రెండు రోజుల్లోనే..
..ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదట వెళ్లండి!
హీరోయిన్‌తో కమల్ ముద్దు సీన్.. ఏజ్ గ్యాప్‌పై విమర్శలు
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
రేపటి నుంచే భూముల రీసర్వే.. రెవెన్యూ వర్గాల ఆందోళన
ఇండియన్ ఆర్మీ కీలక ప్రకటన
మనం దెబ్బతిన్న ప్రతీసారి శాంతి చర్చలనడం మనకు ఆనవాయితీ సార్!
బంగ్లా ప్లేయర్ విధ్వంసకర శతకం.. రికార్డులు బద్దలు
ఓటీటీలోకి వచ్చేసిన సస్పెన్స్ థ్రిల్లర్.. తెలుగులో స్ట్రీమింగ్
స్లీపర్ ప్రయాణికులకు ఇక ఆ సౌకర్యం లేదు..
వారికి నా కంటే అందగాడు కనిపించలేదేమో!
సారూ.. మా ఊరు పేరు మార్చండి
సినిమా

'అనుకున్నదే అయింది.. విశాల్‌తో పెళ్లిపై హీరోయిన్ అఫీషియల్ ప్రకటన'
కోలీవుడ్ స్టార్ విశాల్, హీరోయిన్ సాయి ధన్సిక పెళ్లి బంధంతో ఒక్కటి కానున్నారు. తాజాగా విశాల్ పెళ్లిపై మరోసారి రూమర్స్ రావడంతో హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలోనే హీరోయిన్ సాయి ధన్సిక అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. తన మూవీ యోగిదా ఈవెంట్లో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. తాను విశాల్‌ను పెళ్లి చేసుకోబోతున్నట్లు వేదికపై వెల్లడించింది.అవును.. నేను, విశాల్ మంచి స్నేహితులం.. మేమిద్దరం కలిసి నడవబోతున్నాం.. ఈ ఏడాది ఆగస్టు 29న పెళ్లి బంధంలోకి అడుగుపెడుతున్నాం అంటూ సంతోషం వ్యక్తం చేసింది సాయి ధన్సిక. ఈ ప్రకటనతో అటు విశాల్ ఫ్యాన్స్.. ఇటు సాయి ధన్సిక అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు విశాల్‌కు అభినందనలు తెలుపుతున్నారు. కాగా.. కోలీవుడ్‌కు చెందిన సాయి ధన్సిక తెలుగులో తెరకెక్కిన షికారు, అంతిమ తీర్పు, దక్షిణ వంటి చిత్రాల్లో హీరోయిన్గా నటించారు.ఇటీవలే హింట్ ఇచ్చిన విశాల్..ఇటీవల నడిగర్ సంఘం బిల్డింగ్ నిర్మాణం కూడా పూర్తయింది. ఇటీవల ఓ సమావేశంలో తన పెళ్లి గురించి మాట్లాడారు. త్వరలోనే పెళ్లి చేసుకుంటానని తెలిపారు. నాది ప్రేమ వివాహమేనని.. త్వరలోనే మరిన్ని వివరాలు తెలియజేస్తానని విశాల్ వెల్లడించారు. కాగా.. విశాల్‌కు గతంలో అనీషా అనే నటితో నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. కానీ ఆ తర్వాత వీరి నిశ్చితార్థం క్యాన్సిల్ అయింది. Official Actor #Vishal is going to marry #SaiDhanshika on August 29, 2025 💍♥️pic.twitter.com/ePWoIljAuA— Sugumar Srinivasan (@Sugumar_Tweetz) May 19, 2025

రబ్బరు గాజులు సాంగ్.. థియేటర్లోనే ఇరగదీసిన ఫ్యాన్స్!
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్- దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం యమదొంగ. 2007లో బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన ఈ చిత్రం సూపర్‌హిట్‌గా నిలిచింది. అప్పట్లో థియేటర్లలో ఓ రేంజ్లో వసూళ్లు రాబట్టింది. అయితే ఈ నెల 20న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేశారు. ఈ అత్యాధునిక టెక్నాలజీతో అభిమానులు సినిమాను ఈరోజు థియేటర్లలో ప్రదర్శించారు.అయితే ఈ సినిమాను చూసేందుకు వచ్చిన ఫ్యాన్స్ హడావుడి మామూలుగా లేదు. ఈలలు, కేకలతో థియేటర్లను హోరెత్తించారు. దాదాపు 18 ఏళ్ల తర్వాత యమదొంగ బిగ్ స్క్రీన్‌పై సందడి చేయడంతో అభిమానులు ఆనందంలో చిందులు వేశారు. రబ్బరు గాజులు పాట రాగానే పూనకంతో ఊగిపోయారు. ఈ సినిమా చూస్తూ థియేటర్లో రబ్బర్ గాజులు సాంగ్‌కు స్టెప్పులు వేస్తూ అలరించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.(ఇది చదవండి: ఎన్టీఆర్ బర్త్‌డే స్పెషల్.. థియేటర్స్‌లో ‘యమదొంగ’)కాగా.. ఈ చిత్రంలో మోహన్ బాబు యమధర్మరాజు పాత్రలో మెప్పించారు. ఈ మూవీలో ప్రియమణి, మమత మోహన్‌దాస్ హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీకి ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. ఇద్దరి ఇరగదీశారు మాటల్లేవ్ 💟💟❤️🔥❤️🔥ఇదేం క్రేజీ రా బాబు మామూలుగా లేదుగా సెలబ్రేషన్ 😍😍🥵🥵👌👌#Yamadonga4K @tarak9999 #ManOfMassesNTR pic.twitter.com/ZN1j0zj5kF— Shivam🐉🔱🚩 (@tarak9999SM) May 19, 2025

యంగ్ టైగర్ బర్త్ డే.. వార్-2 అప్డేట్ వచ్చేసింది!
బాలీవుడ్ సూపర్‌స్టార్ హృతిక్ రోషన్, టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటిస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ ‘వార్ 2. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలకు ముందే సంచలనాలు నమోదు చేయడం మొదలైంది. హృతిక్, ఎన్టీఆర్ కాంబినేషన్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఆగస్టు 14, 2025న విడుదల కానుంది. ఈ చిత్రంలో మొదటి సారిగా ఎన్టీఆర్ విలన్ పాత్రలో కనిపించనుండటంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.అయితే ఈనెల 20న ఎన్టీఆర్ బర్త్ డే కావడంతో వార్ -2 మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా వార్-2 గ్లింప్స్ విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. మంగళవారం ఉదయం 11 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు పోస్టర్ పంచుకున్నారు. జూనియర్‌కు బర్త్ డే విషెస్ చెబుతూ టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ పోస్టర్ షేర్ చేశారు. ఈ తాజా ప్రకటనతో వార్-2 అప్డేట్స్ కోసం ఎదురు చూస్తోన్న యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా.. ఈ చిత్రంలో గేమ్ ఛేంజర్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది.అత్యధిక ధరకు తెలుగు రైట్స్..తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా వార్ 2 పాన్ ఇండియా స్థాయిలో భారీ హైప్‌ను సొంతం చేసుకుంది. ఆర్ఆర్ఆర్, దేవర... ఎన్టీఆర్ నటించిన మూవీ కావడంతో సినిమా రైట్స్ కోసం టాలీవుడ్ నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. ఈ సినిమా ప్రాంతీయ హక్కుల కోసం ఎదురైన గట్టి పోటీని తట్టుకుని చివరికి ప్రముఖ నిర్మాతలు నాగ వంశీ, సునీల్ నారంగ్ ఈ డీల్‌ను చేజిక్కించుకున్నారు. విడుదలకి ముందే ఈ చిత్రం తెలుగు థియేట్రికల్ హక్కులు రూ. 85–100 కోట్ల మధ్య ధరల్లో అమ్ముడైపోయాయని వార్తలొస్తున్నాయి. #HappyBirthdayNTR Can’t wait for this BANGER 💥💥💥💥💥💥 pic.twitter.com/2hg9aAZgNJ— thaman S (@MusicThaman) May 19, 2025

ట్రైలర్ లాంచ్ ఈవెంట్.. స్టేజీపై డ్యాన్స్‌తో అదరగొట్టిన హీరోయిన్!
హీరోయిన్ ఆదితి శంకర్ తన డ్యాన్స్‌తో అదరగొట్టింది. భైరవం ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు హాజరైన ముద్దుగుమ్మ.. వేదికపై స్టెప్పులతో అభిమానులను అలరించింది. ఓ వెన్నెల అంటూ సాగే పాటకు తనదైన స్టైల్లో డ్యాన్స్ చేసి అక్కడున్న వారిని మెప్పించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.కాగా.. కోలీవుడ్ హీరోయిన్ ఆదితి శంకర్ భైరవం సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించేందు వస్తోంది. ఈ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ హీరోలుగా నటించారు. ఈ సినిమాకు విజయ్ కనకమేడల దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ఆనంది, దివ్య పిళ్లై కూడా హీరోయిన్లుగా కనిపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న భైరవం మే 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. #AditiShankar Live Dance Performance for #OVennela Song at #Bhairavam Event#BellamkondaSaiSreenivas #ManchuManoj #NaraRohith pic.twitter.com/ehgv08ARi5— The Cult Cinema (@cultcinemafeed) May 18, 2025 View this post on Instagram A post shared by Aditi Shankar (@aditishankarofficial)
న్యూస్ పాడ్‌కాస్ట్
క్రీడలు

ధోనికి ఒకటి.. సంజూకు రెండు.. ఒకే మ్యాచ్‌లో భారీ మైలురాయిపై కన్నేసిన సీఎస్కే, రాజస్థాన్ కెప్టెన్లు
ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (మే 20) నామమాత్రపు మ్యాచ్ జరుగనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఇదివరకే నిష్క్రమించిన సీఎస్కే, రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల కెప్టెన్లు ధోని, సంజూ శాంసన్ ఓ భారీ మైలురాయిపై కన్నేశారు.ధోని ఓ సిక్సర్, సంజూ రెండు సిక్సర్లు బాదితే టీ20ల్లో 350 సిక్సర్ల మార్కును తాకుతారు. పొట్టి క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు 33 మంది మాత్రమే ఈ మైలురాయిని తాకారు. పొట్టి క్రికెట్లో అత్యధిక సిక్సర్లు (1056) బాదిన రికార్డు క్రిస్ గేల్ పేరిట ఉంది. గేల్ తర్వాతి స్థానాల్లో పోలార్డ్ (908), రసెల్ (747), పూరన్ (634), అలెక్స్ హేల్స్ (560), మున్రో (557), రోహిత్ (542), జోస్ బట్లర్ (537), మ్యాక్స్‌వెల్ (530) ఉన్నారు (టాప్-10లో).ఇదిలా ఉంటే, నేటి మ్యాచ్ నామమాత్రం కావడంతో ఇరు జట్ల బ్యాటర్లు చెలరేగే అవకాశం ఉంది. ముఖ్యంగా రాజస్థాన్ ఆటగాళ్లు ఆకాశమే హద్దు అన్న రీతిలో బ్యాటింగ్ చేయవచ్చు. ఈ సీజన్లో ఆ జట్టు బ్యాటర్లు మొదటి నుంచి విధ్వంసం సృష్టిస్తున్నప్పటికీ లక్ కలిసి రాలేదు. యశస్వి జైస్వాల్, కుర్ర బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ మరో సారి తెగబడి ఆడే ఛాన్స్ ఉంది. కొత్తగా జట్టులోకి వచ్చిన ప్రిటోరియస్ కూడా బ్యాట్‌కు పని చెప్పవచ్చుఈ సీజన్లో చాలా మ్యాచ్‌ల్లో రాయల్స్ గెలుపు వాకిట బోల్తా పడింది. ఇలా జరిగినందుకు ఈ సీజన్లో ఆ జట్టుపై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ సీజన్లో రాయల్స్ ఇప్పటివరకు ఆడిన 13 మ్యాచ్‌ల్లో కేవలం మూడు విజయాలు మాత్రమే నమోదు చేసి పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది. నేడు సీఎస్కేతో జరుగబోయే మ్యాచ్ రాయల్స్‌కు ఈ సీజన్లో చివరిది. కాబట్టి సీజన్‌ను గెలుపుతో ముగించి పరువు కాపాడుకోవాలని రాయల్స్ భావిస్తుంది.సీఎస్కే విషయానికొస్తే.. ఈ జట్టు బ్యాటర్లు కూడా నేటి మ్యాచ్‌లో విజృంభించే అవకాశం ఉంది. ఈ జట్టు బ్యాటర్లు ఎదురుదాడి చేస్తే పోయేదేముందన్న రీతిలో బ్యాటింగ్ చేయవచ్చు. ముఖ్యంగా టాపార్డర్ బ్యాటర్లు మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడే అవకాశం ఉంది. కుర్ర బ్యాటర్లు ఆయుశ్ మాత్రే, ఉర్విల్ పటేల్, డెవాల్డ్ బ్రెవిస్ నుంచి రికార్డు విన్యాసాలు ఆశించవచ్చు. ఈ సీజన్లో ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడిన సీఎస్కే కేవలం మూడు విజయాలతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. ఇరు జట్లు ఐపీఎల్లో ఇప్పటివరకు 30 మ్యాచ్‌ల్లో తలపడగా.. సీఎస్కే 16, రాయల్స్ 14 మ్యాచ్‌ల్లో గెలుపొందాయి. 2020 నుంచి ఇరు జట్ల మధ్య జరిగిన 9 మ్యాచ్‌ల్లో రాయల్స్ ఏడింట విజయాలు సాధించింది. నేటి మ్యాచ్ నామమాత్రం కావడంతో ఇరు జట్లు ప్రయోగాల బాటపట్టవచ్చు.తుది జట్లు (అంచనా)..సీఎస్కే: ఆయుష్ మ్హత్రే, డెవాన్ కాన్వే, ఉర్విల్ పటేల్, రవీంద్ర జడేజా, డెవాల్డ్ బ్రీవిస్, శివమ్ దూబే, MS ధోని (కెప్టెన్), ఆర్ అశ్విన్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, ఖలీల్ అహ్మద్, నాథన్ ఎల్లిస్/మతీషా పతిరానారాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, సంజు శాంసన్ (కెప్టెన్), రియాన్ పరాగ్, ధృవ్ జురెల్, లువాన్-డ్రే ప్రిటోరియస్, వనిందు హసరంగా, క్వేనా మఫాకా, తుషార్ దేశ్‌పాండే, కుమార్ కార్తికేయ, నాంద్రే బర్గర్, అశోక్ శర్మ/శుభమ్ దూబే

అవును.. మందు మానేశాను: స్టార్ క్రికెటర్
లండన్: ఇంగ్లండ్ టెస్టు జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ ఐదు నెలల విరామం తర్వాత మళ్లీ మైదానంలోకి దిగేందుకు సిద్ధమయ్యాడు. తరచు గాయాల బారిన పడుతూ మళ్లీ మళ్లీ ఆటకు దూరమవుతున్న 33 ఏళ్ల స్టోక్స్ గత ఏడాది డిసెంబర్ తర్వాత అసలు ఏ స్థాయి మ్యాచ్ కూడా ఆడలేదు. తొడ కండరాల గాయంతో తప్పుకున్న అతను ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాడు. వేగంగా ఫిట్నెస్ అందుకునే క్రమంలో భాగంగా ‘రీహాబిలిటేషన్’ సమయంలో మద్యానికి దూరంగా ఉన్నట్లు వెల్లడించాడు. ‘నాకు తొలిసారి గాయమైనప్పుడు నా శరీరం చికిత్సకు సరిగా స్పందించలేదు. ఇది ఎలా జరిగిందని ఆలోచిస్తే వారం రోజుల క్రితం బాగా మద్యం తాగిన విషయం గుర్తుకొచి్చంది. బహుశా అది కూడా కారణం కావచ్చనిపించింది. దాంతో ఈసారి గాయం తర్వాత చాలా జాగ్రత్తగా ఉన్నాను. నేను మారితే మంచిదని భావించా. అయితే పూర్తిగా అది సాధ్యం కాదు కాబట్టి రీహాబిలిటేషన్ వరకు నియంత్రణలో ఉండేందుకు ప్రయత్నించా. మైదానంలోకి దిగే వరకు దీనిని పాటించాలని ప్రయతి్నస్తున్నా. అందుకే ఈ ఏడాది జనవరి నుంచి మద్యం మానేశా. అప్పటి నుంచి ఇప్పటి వరకు దానిని ముట్టలేదు’ అని స్టోక్స్ చెప్పాడు. గురువారం నుంచి జింబాబ్వేతో జరిగే ఏకైక టెస్టులో బరిలోకి దిగనున్న స్టోక్స్...ఆ తర్వాత భారత్‌తో టెస్టు సిరీస్, యాషెస్ సిరీస్ కోసం సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించాడు.

వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్‌కు అర్హత సాధించిన నేపాల్, థాయ్‌లాండ్
నేపాల్, థాయ్‌లాండ్ జట్లు ఆఖరి నిమిషంలో మహిళల టీ20 వరల్డ్‌కప్-2026 గ్లోబల్ క్వాలిఫయర్స్‌కు అర్హత సాధించాయి. ఆసియా క్వాలిఫయర్స్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన ఈ రెండు జట్లు వరల్డ్‌కప్ బెర్త్ కోసం పోటీ పడేందుకు అర్హత సాధించాయి. తమ చివరి లీగ్ మ్యాచ్‌ల్లో యూఏఈపై విజయాలు సాధించిన నేపాల్, థాయ్‌లాండ్ వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్‌కు అర్హత సాధించాయి. గ్లోబల్ క్వాలిఫయర్స్‌కు ఇదివరకే స్కాట్లాండ్, బంగ్లాదేశ్ జట్లు అర్హత సాధించాయి. యూరప్, ఆఫ్రికా క్వాలిఫయర్స్ నుంచి అర్హత సాధించే జట్లేవో తెలియాల్సి ఉంది. ఈ రెండు టోర్నీల నుంచి రెండు జట్లు వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్‌కు అర్హత సాధిస్తాయి. అనంతరం గ్లోబల్ క్వాలిఫయర్స్‌లో ఆరు జట్లు పోటీ పడి, నాలుగు జట్లు వరల్డ్‌కప్‌కు అర్హత సాధిస్తాయి. కాగా, 2026 మహిళల టీ20 వరల్డ్‌కప్ ఇంగ్లండ్ వేదికగా జరుగనుంది. ఈ టోర్నీలో మొత్తం 12 జట్లు రెండు గ్రూప్‌లుగా విడిపోయి పోటీ పడతాయి. ఆతిధ్య దేశ హోదాలో ఇంగ్లండ్ తొలుత ఈ వరల్డ్‌కప్‌కు అర్హత సాధించగా.. ఐసీసీ ర్యాంకింగ్స్ ఆధారంగా ఆస్ట్రేలియా, భారత్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, వెస్టిండీస్, పాకిస్తాన్, శ్రీలంక దేశాలు మెగా టోర్నీకి నేరుగా అర్హత సాధించాయి. మిగిలిన నాలుగు బెర్త్‌లు గ్లోబల్ క్వాలిఫయర్స్ ద్వారా డిసైడ్ అవుతాయి. ఈ టోర్నీలో న్యూజిలాండ్ డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగుతుంది.

IPL 2025: చరిత్ర సృష్టించిన సన్‌రైజర్స్ హైదరాబాద్
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఇదివరకే నిష్క్రమించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిన్న (మే 19) లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఊరట పొందే విజయం సాధించింది. ఈ గెలుపుతో సన్‌రైజర్స్‌కు ఒరిగిందేమీ లేనప్పటికీ.. లక్నో ప్లే ఆఫ్స్ ఆశలను మాత్రం ఆవిరి చేసింది. ఈ మ్యాచ్‌లో ఓటమితో లక్నో ప్లే ఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించింది.చరిత్ర సృష్టించిన సన్‌రైజర్స్ లక్నోలోని ఎకానా స్టేడియం వేదికగా ఎల్ఎస్జీతో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో గెలుపొందిన సన్‌రైజర్స్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఐపీఎల్ చరిత్రలో ఈ స్టేడియంలో అత్యధిక లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా రికార్డు నెలకొల్పింది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ లక్నో నిర్దేశించిన 206 పరుగుల లక్ష్యాన్ని మరో 10 బంతులు మిగిలుండగానే ఛేదించింది. ఈ స్టేడియంలో 200కు పైగా లక్ష్యాన్ని ఛేదించడం ఇదే మొదటిసారి (నాలుగు ప్రయత్నాల్లో).మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్.. ఓపెనర్లు మిచెల్ మార్ష్ (65), ఎయిడెన్ మార్క్రమ్ (61) అర్ద సెంచరీలతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. లక్నో ఇన్నింగ్స్‌లో పూరన్ (26 బంతుల్లో 45) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా.. రిషబ్ పంత్ (7) తన వైఫల్యాల పరంపరను కొనసాగించాడు. మిగతా బ్యాటర్లలో ఆయుశ్ బదోని 3, అబ్దుల్ సమద్ 3, శార్దూల్ ఠాకూర్ 4, ఆకాశ్‌దీప్ (6 నాటౌట్) పరుగులు చేశారు.ఓపెనర్లు అందించిన శుభారంభానికి ఈ మ్యాచ్‌లో లక్నో ఇంకాస్త భారీ స్కోర్ సాధించి ఉండాల్సింది. అయితే చివరి ఓవర్లలో లక్నో బ్యాటర్లు తడబడ్డారు. వేగంగా పరుగులు సాధించే క్రమంలో వికెట్లు కోల్పోయారు. నితీశ్ రెడ్డి వేసిన చివరి ఓవర్లో లక్నో మూడు వికెట్లు (2 రనౌట్లు) కోల్పోయింది. సన్‌రైజర్స్ బౌలర్లలో ఎషాన్ మలింగ 2, నితీశ్ రెడ్డి, హర్షల్ పటేల్, హర్ష్ దూబే తలో వికెట్ పడగొట్టారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన సన్‌రైజర్స్ 18.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. అభిషేక్ శర్మ తన సహజ శైలిలో ఊచకోత (20 బంతుల్లో 59; 4 ఫోర్లు, 6 సిక్సర్లు) కోసి సన్‌రైజర్స్ గెలుపుకు బలమైన పునాది వేశాడు. మధ్యలో ఇషాన్ కిషన్ (35), క్లాసెన్ (47), కమిందు మెండిస్ (32 రిటైర్డ్ హర్ట్) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌లు ఆడగా.. అనికేత్ వర్మ (5 నాటౌట్), నితీశ్ రెడ్డి (5 నాటౌట్) మ్యాచ్‌లను లాంఛనంగా ముగించారు. లక్నో బౌలర్లలో దిగ్వేశ్ రాఠీ 2, విలియమ్ ఓరూర్కీ, శార్దూల్ ఠాకూర్ తలో వికెట్ పడగొట్టారు. సన్‌రైజర్స్ ఇన్నింగ్స్ సందర్భంగా గొడవ పడిన అభిషేక్, దిగ్వేశ్ మ్యాచ్ పూర్తయ్యాక ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. రాజీవ్ శుక్లా ఈ ఇద్దరి మధ్య రాజీ కుదిర్చాడు.
బిజినెస్

ఎస్బీఐ ఎఫ్డీ రేట్లలో కోత
దేశంలోనే దిగ్గజ బ్యాంక్ ఎస్బీఐ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 20 బేసిస్ పాయింట్ల (0.20 శాతం) మేర తగ్గించింది. ఈ నిర్ణయం ఈ నెల 16 నుంచే అమల్లోకి వచ్చింది. బ్యాంక్ వెబ్సైట్లో ఉంచిన సమాచారం మేరకు.. రెండేళ్ల నుంచి మూడేళ్లలోపు కాలవ్యవధి డిపాజిట్లపై గరిష్టంగా 6.7 శాతం రేటు ఇకమీదట లభించనుంది.మూడేళ్ల నుంచి ఐదేళ్లలోపు డిపాజిట్లపై రేటు 6.55 శాతం అమల్లోకి వచ్చింది. 5–10 ఏళ్లలోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు సాధారణ ప్రజలకు 6.30 శాతానికి తగ్గింది. ఏడాది నుంచి రెండేళ్లలోపు ఎఫ్డీలపై 6.5 శాతం రేటు అమలవుతుంది. అమృత్ వర్ష్(444 రోజుల డిపాజిట్)పై రేటు 7.05 శాతం నుంచి 6.85 శాతానికి తగ్గింది. ఇదీ చదవండి: యాప్ ఒక్కటే.. సేవలు బోలెడు!60 ఏళ్లు నిండిన, 80 ఏళ్లు నిండిన వృద్ధులకు ఎప్పటి మాదిరే వడ్డీ రేటులో అదనపు ప్రయోజనం కొనసాగనుంది. గత నెలలోనూ ఎస్బీఐ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 10–25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించడం గమనార్హం. ఆర్బీఐ ఇప్పటివరకు రెండు విడతల్లో కలిపి అర శాతం మేర రెపో రేటును తగ్గించడంతో ఈ మేరకు డిపాజిట్ రేట్లను బ్యాంక్‌లు సర్దుబాటు చేస్తుండడం గమనార్హం.

ఫండ్స్ ఆస్తులు రూ.65.74 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణ ఆస్తులు (ఏయూఎం) గత ఆర్థిక సంవత్సరంలో (2024–25) 23 శాతం పెరిగి రూ.65.74 లక్షల కోట్ల రికార్డు స్థాయికి చేరుకున్నాయి. మార్కెట్ ర్యాలీతో పెట్టుబడుల విలువ పెరగడానికి తోడు, నికర పెట్టుబడుల రాక ఏయూఎం వృద్ధికి తోడ్పడింది. 2023–24 చివరికి మ్యూచువల్ ఫండ్స్ ఏయూఎం రూ.53.40 లక్షల కోట్లుగా ఉంది. ‘‘ఆస్తుల పరిమాణం పెరగడానికి మార్క్ టు మార్కెట్ (ఎంటీఎం) పెరుగుదల సానుకూలించింది. నిఫ్టీ 50 టీఆర్ఐ 6 శాతం, సెన్సెక్స్ టీఆర్ఐ 5.9 శాతం చొప్పున పెరగడం ఇందుకు దోహదం చేసింది. డెట్ విభాగంలోనూ ఎంటీఎం పెరగడం అనుకూలించింది’’అని యాంఫి తెలిపింది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో అన్ని రకాల పథకాల్లోకి రూ.8.15 లక్షల కోట్ల పెట్టుబడులు రావడం ఫండ్స్ నిర్వహణ ఆస్తుల వృద్ధికి దారితీసింది. ముఖ్యంగా ఈక్విటీల్లోకి రికార్డు స్థాయిలో రూ.4.17 లక్షల కోట్లు వచ్చాయి. ఇన్వెస్టర్లు, పెట్టుబడి ఖాతాలు, మ్యూచువల్ ఫండ్స్ ఇలా అన్నింటా వృద్ధి కనిపించింది. మ్యూచువల్ ఫండ్స్ ఫోలియోలు 23.45 కోట్ల గరిష్టానికి చేరాయి. ఇన్వెస్టర్ల సంఖ్య 5.67 కోట్లకు పెరిగింది. 1.38 కోట్ల మంది మహిళా ఇన్వెస్టర్లు కావడం గమనార్హం. ముఖ్యంగా ఈక్విటీ పథకాలకు సంబంధించి ఫోలియోలు 33 శాతం పెరిగి 16.38 కోట్లుగా ఉన్నాయి. అంటే మొత్తం ఫోలియోల్లో ఈక్విటీ ఫోలియోలే 70 శాతం మేర ఉండడం గమనార్హం. హైబ్రిడ్ ఫండ్స్ ఫోలియోలు 16 శాతం పెరిగి 1.56 కోట్లుగా ఉన్నాయి. ఇండెక్స్ ఫండ్స్, ఈటీఎఫ్‌ల (ప్యాసివ్ ఫండ్స్) ఫోలియోలు 48 శాతం పెరిగి 4.15 కోట్లుగా ఉన్నాయి. ఎన్‌ఎఫ్‌వోల జోరు గత ఆర్థిక సంవత్సరంలో న్యూ ఫండ్ ఆఫర్లు (ఎన్‌ఎఫ్‌వోలు) కూడా పెద్ద సంఖ్యలోనే వచ్చాయి. 70 ఈక్విటీ ఎన్‌ఎఫ్‌వోలు మార్కెట్ నుంచి రూ.85,244 కోట్ల పెట్టుబడులను సమీకరించాయి. 2023–24లో వచ్చిన ఈక్విటీ ఎన్‌ఎఫ్‌వోలు 58కాగా, అవి ఇన్వెస్టర్ల నుంచి సమీకరించిన నిధులు రూ.39,297 కోట్లుగానే ఉన్నాయి. డెట్ ఫండ్స్‌లోకి నికరంగా రూ.1.38 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి.సిప్ పెట్టుబడులు రూ.2.89 లక్షల కోట్లు.. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో గత ఆర్థిక సంవత్సరంలో మ్యూచువల్ ఫండ్స్‌లోకి రికార్డు స్థాయిలో రూ.2.89 లక్షల కోట్ల పెట్టుబడులు తరలి వచ్చాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోల్చి చూసినప్పుడు 45 శాతం పెరిగాయి. సిప్ నిర్వహణ ఆస్తులు 24.6 శాతం పెరిగి రూ.13.35 లక్షల కోట్లకు చేరాయి. దీంతో మ్యూచువల్ ఫండ్స్ మొత్తం నిర్వహణ ఆస్తుల్లో సిప్ ఏయూఎం 20.31 శాతానికి పెరిగింది. మహిళా ఇన్వెస్టర్ల సంఖ్య గత ఆర్థిక సంవత్సరంలో 24 శాతం మేర పెరిగి 1.38 కోట్లుగా (ప్రతి నలుగురిలో ఒకరు) ఉంది. మహిళల్లోనూ ఆర్థిక స్వాతంత్య్రం, అవగాహన పెరుగుతోందని యాంఫి నివేదిక తెలిపింది. ఆర్థిక అక్షరాస్యతకు తోడు, ఉద్యోగాల్లో మహిళల భాగస్వామ్యం పెరుగుతుండడం ఇందుకు నేపథ్యంగా పేర్కొంది. ఇక గత ఆర్థిక సంవత్సరంలో ఈక్విటీ ఆధారిత ఫండ్స్‌లోకి నికరంగా రూ.4.17 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలి్చతే రెట్టింపయ్యాయి. దీంతో ఈక్విటీ పథకాల నిర్వహణ ఆస్తుల విలువ 25 శాతానికి పైగా పెరిగి రూ.29.45 లక్షల కోట్లకు చేరుకుంది.

క్యూ4లో వృద్ధి రేటు @ 6.9 శాతం
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 6.9 శాతంగా ఉండొచ్చని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా వెల్లడించింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఇది 6.3 శాతానికి పరిమితం కావొచ్చని పేర్కొంది. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్వో) ఫిబ్రవరిలో ప్రకటించిన అంచనాల కన్నా ఇది తక్కువ. 2024–25లో తొలి మూడు త్రైమాసికాల్లో నమోదైన 6.5 శాతం, 5.6 శాతం, 6.2 శాతం వృద్ధి ప్రాతిపదికన పూర్తి ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 6.5 శాతం స్థాయిలో ఉండొచ్చంటూ ఎన్ఎస్వో ఫిబ్రవరిలో ప్రకటించింది. ఎన్ఎస్వో చెబుతున్న 6.5 శాతం స్థాయిలో వృద్ధి ఉండాలంటే మార్చి క్వార్టర్లో 7.6 శాతం వృద్ధి సాధించాల్సి ఉంటుంది. క్యూ1 నుంచి క్యూ3 వరకు డేటాలో చెప్పుకోతగ్గ స్థాయిలో మార్పులు చేర్పులు ఉంటే తప్ప వృద్ధి రేటు 6.3 శాతానికి పరిమితం కావచ్చని ఇక్రా పేర్కొంది. పూర్తి ఆర్థిక సంవత్సరం, నాలుగో త్రైమాసికం ప్రొవిజనల్ అంచనాలను ఎన్ఎస్వో మే 31న విడుదల చేయనుంది. టారిఫ్లపరమైన అనిశ్చితి కారణంగా క్యూ4లో ప్రైవేట్ వినియోగం, పెట్టుబడులు హెచ్చుతగ్గులకు లోనైనట్లు ఇక్రా వివరించింది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి 9.2 శాతంగా నమోదైంది.

బిట్‌కాయిన్‌పై స్పష్టమైన విధానం ఎందుకు లేదు?
న్యూఢిల్లీ: క్రిప్టో కరెన్సీల నియంత్రణ విషయంలో స్పష్టమైన విధానాన్ని కేంద్రం ఎందుకు తీసుకురాలేకపోతోంది? అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. బిట్‌కాయిన్ ట్రేడింగ్‌ను చట్టవిరుద్ధమైనదిగా, హవాలా వ్యాపారంగా జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్ ధర్మాసనం వ్యాఖ్యానించింది. సమాంతర మార్కెట్ కలిగి ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపిస్తున్నట్టు పేర్కొంది. నియంత్రణల ద్వారా క్రిప్టోకరెన్సీ ట్రేడ్లపై దృష్టి సారించొచ్చని అభిప్రాయం వ్యక్తం చేసింది. గుజరాత్లో బిట్‌కాయిన్ ట్రేడ్ వ్యాపారానికి సంబంధించిన కేసులో నిందితుడు శైలేష్ బాబూలాల్ భట్ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ అభిప్రాయాలు వ్యక్తం చేసింది. 2020లో ఆర్బీఐ సర్క్యులర్‌ను సుప్రీంకోర్టు కొట్టివేయడంతో దేశంలో బిట్‌కాయిన్ ట్రేడింగ్ చట్టవిరుద్ధం కాదంటూ పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు.
ఫ్యామిలీ

సైబర్ మోసాలు : చదువుకున్నవారే ఎక్కువగా..!
హాస్టళ్లలో దొంగతనాలు ఎక్కువ ప్రధాన కూడళ్లలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలుమాదాపూర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ విజయ్‌నాయక్ మాదాపూర్: సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని.. చదువుకున్న వారే ఎక్కువగా మోసపోతున్నారని మాదాపూర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ డి.విజయ్‌నాయక్ తెలిపారు. సోషల్ మీడియా, ఫెడెక్స్ మోసాలు, రెంటల్, ఇన్వెస్ట్మెంట్, లోన్స్, బెట్టింగ్ యాప్, కస్టమర్ కేర్ మోసాలు అధికంగా జరుగుతున్నాయని, సైబర్ నేరగాళ్ల బారిన పడినపుడు సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ఫోన్.1930కి.. ఇతర సమస్యలు ఎదురైతే 100కి డయల్ చేయాలని ఆయన తెలిపారు. ఈ నేరాలపై ప్రధాన కూడళ్లలో, కళాశాలల్లో, జన సమ్మర్ధం ఉన్నచోట వీటిపై అవగాహన కల్పిస్తున్నాం. మాదాపూర్ డిటెక్టివ్ టీంలో 10 మంది ఉన్నారు. సైబర్ క్రైంలో ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నవారు ఇద్దరున్నారు. నేరాలు పెరిగిపోతున్న తరుణంలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆయన వివరించారు.ఇదీ చదవండి: టెక్ నగరాన్ని ముంచెత్తిన వరద : జేసీబీలో ఎమ్మెల్యే, వైరల్ వీడియో ప్రశ్న: మాదాపూర్ ప్రాంతంలో ఎలాంటి నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి? ఇన్స్పెక్టర్: సైబర్ నేరాలతో పాటు ఎక్కువగా హాస్టళ్లలో దొంగతనాలు జరుగుతున్నాయి. సరైన భద్రత లేకపోవడం వల్ల రూంలలోకి చొరబడి ల్యాప్టాప్స్, ఫోన్స్, నగదుతో పాటు ఖరీదైన వస్తువులను దొంగిలిస్తున్నారు. 24 గంటల పాటు సెక్యూరిటీని నియమించాలి. హాస్టల్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఐడీ కార్డు ఇవ్వాలి. లోపలికి వెళ్ళేవారు తప్పని సరిగా ఐడీ కార్డులను చూపాలనే నిబంధన ఉండాలి. అప్పుడే దొంగతనాలను అరికట్టవచ్చు. ప్ర: ఫెడెక్స్ మోసం గురించి? జ: గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి మీకు ఎయిర్‌పోర్టు నుంచి పార్సిల్ వచి్చందని అందులో డ్రగ్స్ ఉన్నాయని.. మీరు ఫలానా పోలీస్‌స్టేషన్‌కు రావాలని భయపెడతారు. కొంత సమయం తరువాత మీరు డబ్బు చెల్లిస్తే కేసు కొట్టివేస్తామని చెప్పి వారివద్ద నుంచి డబ్బు వసూలు చేసి ఫోన్లను స్విచ్చాఫ్ చేస్తారు. ఇలాంటి మోసాల బారిన విద్యావంతులేపడుతున్నారు. ఎవరికి వారు అప్రమత్తంగా ఉండాలి. ప్ర: ట్రాన్స్‌జెండర్స్, సోషల్‌మీడియా ద్వారా ఎదురవుతున్న ఇబ్బందులు ఏమిటి? జ: ఖాళీ ప్రదేశాల వద్ద, ప్రధాన కూడళ్లలో ట్రాన్స్‌జెండర్స్ ఎక్కువగా ఇబ్బందులు పెడుతున్నారు. వారి ప్రలోభాలకు లోనుకాకుండా ఉండాలి. వారి వద్ద ఆగవద్దు. ఏవైనా సమస్యలు వస్తే వెంటనే 100కి డయల్ చేయాలి. అమ్మాయి, అబ్బాయిలు కలిసి ఉన్నప్పుడు తీసుకున్న ఫొటోలు వారు విడిపోయిన తరువాత మారి్ఫంగ్ చేసి డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. పర్సనల్ విషయాలు ఎవరితోనూ పంచుకోవద్దు. ప్ర: బెట్టింగ్ యాప్‌ల ద్వారా జరుగుతున్న మోసాలు ఏమిటి..జ: ప్రస్తుతం బెట్టింగ్‌కి అలవాటు పడ్డారంటే ప్రాణాలు కోల్పోవాల్సిందే. చిన్న చిన్న బెట్టింగ్‌లు కట్టినప్పుడు తిరిగి డబ్బును చెల్లించి ఆసక్తి కలిగిస్తారు. అలవాటు అయిన తరువాత పెద్దమొత్తంలో డబ్బులు పెట్టినప్పుడు పోతాయి. ఇలాంటి అలవాట్లతో బంధువుల వద్ద, స్నేహితుల వద్ద అప్పులు చేస్తుంటారు. నష్టపోయాక దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చెడు వ్యసనాలకు బానిసలై ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నారు. బెట్టింగ్ యాప్‌ల జోలికి పోవద్దు.చదవండి: అనంత్-రాధిక సండే షాపింగ్ : లవ్‌బర్డ్స్ వీడియో వైరల్ మాదాపూర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ విజయ్‌నాయక్

భారతీయ వంటకాలు అమోఘం..! విదేశీ జంట ప్రశంసల జల్లు
భారతదేశంలోని పలు ప్రదేశాలు..వాతావరణం తదితరాలను ఎందరో విదేశీయలు మెచ్చుకున్నారు. ఇక్కడ సాంస్కృతి సంప్రదాయాలు ఎంతగానో నచ్చాయని ఇక్కడే నా పిల్లలను పెంచుతానని ఒక విదేశీ తల్లి సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చింది. ఇవన్నీ మరువక ముందే ఇప్పుడు మరో విదేశీ జంట ఇక్కడ వంటకాలపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. భారతీయులు వంటకాలు వండే పద్ధతి గురించి ఏం చెబుతున్నారో ఆ జంట మాటల్లోనే విందామా..భారతీయు రోజువారీ వంటల్లో ఆకుపచ్చని పదార్థాలను విరివిగా వినియోగిస్తారని అన్నారు. ఇక్కడ పచ్చిగా ఉన్నవాటిని చక్కగా పచ్చళ్లు పట్టేస్తారు లేదా ఘుమ ఘుమలాడే కూరల్లా మార్చేస్తారు. అదే పండిన వాటిని పండ్లు మాదిరిగా ఉపయోగిస్తారని చెబుతున్నారు. పండని కూరగాయలు, పండ్లతో చేసే వంటకాలని అసాధారణ ఆవిష్కరణలుగా అభివర్ణించారు. ముఖ్యంగా ఆకుపచ్చని మామిడిపండ్లతో పట్టే ఊరగాయ, పనపండుతో చేసే వంటకాలు అమోఘం అని ప్రశంసించారు. భారతదేశంలో తినడానికి ఏది పచ్చిగా ఉండదు. వాళ్ల చేతిమహిమతో అద్భుతమైన రుచిగా మార్చేస్తారు. పువ్వులను పకోడాలుగా మార్చేయడంలో వారి పాక నైపుణ్యం ఊహకందనిదని అన్నారు. పచ్చిగా ఉండే సబ్జీలో ఉడికించి తినడం మరింత అద్భుతమని అన్నారు. అందుకు సంబంధించిన వీడియోకి 'భారతదేశంలో తినడానికి ఏది పచ్చిగా ఉండదు' అనే క్యాప్షన్ జోడించి మరీ పోస్ట్ చేశారు. అయితే నెటిజన్లు..భారతీయులుగా మేము చాలా వాటిని పచ్చిగా తింటున్నామనే విషయాన్ని గమనించలేదు. అయినా మా ఆహార సంస్కృతి ప్రాంతాల వారీగా మారుతుందని అది కూడా తెలుసుకోండి అంటూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Life in India with Guru and Lila (@guru_laila) (చదవండి: గోల్డ్ మ్యాన్ అందించే '24 క్యారెట్ల గోల్డ్ కుల్ఫీ'..! ధర ఎంతంటే.. )

టెక్ నగరాన్ని ముంచెత్తిన వరద : జేసీబీలో ఎమ్మెల్యే, వైరల్ వీడియో
టెక్ నగరం బెంగళూరు వరదలతో మరోసారి అతలాకుతలమవుతోంది. భారీ వర్షం కారణంగా అనేక ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకుపోయాయి. అనేక నివాస ప్రాంతాలలోకి నీళ్లు చేరాయి. రోడ్లు, భవనాలు తీవరంగా దెబ్బతిన్నాయి. రోడ్లన్నీ జలమయం కావడంతో రోజువారీ జీవితానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ సందర్భంగా బాధిత ప్రజలను పలకరిచేందుకు, వారికి భరోసా కల్పించేందు స్థానిక ఎమ్మెల్యే ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. దీనికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఏ జరిగిందంటే..బెంగళూరులో గత 48 గంటల నుండి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నగరంలోని అనేక లోతట్టు ప్రాంతాలలో మోకాళ్ల లోతు నీరు నిలిచి పోయింది. నివాస ప్రాంతాలలోని అనేక ఇళ్లలోకి కూడా నీరు ప్రవేశించింది. చాలా ఇళ్లు నీటమునిగాయి. అధికారులు బాధిత నివాసితులను సురక్షితమైన ప్రాంతానికి తరలించారు. అయితే బాధతులను పరామర్శించేందుకు స్థానిక ఎమ్మెల్యే బి బసవరాజ్ బుల్డోజర్లో ప్రభావిత ప్రాంతాన్ని సందర్శించారు. సోమవారం సాయి లేఅవుట్లోని ప్రభావిత ప్రాంతాన్ని జెసీబీలో వెళ్లి మరీ వారిని పలకరించారు. అక్కడి పరిస్థితిని సమీక్షించారు. నివాసితుల ఇళ్లలోకి నీరు ప్రవేశించిన ప్రదేశా,నీరు నిలిచిపోయిన ప్రాంతాల్లో అధికారులు జెసిబిలను ఉపయోగిస్తున్నారు #Bengaluru continued to #experience #heavyrains, leading to #water entering homes in several parts and #flooding in #low-#lying #areas of the #city. As of 8 a.m., the #city received 105 mm of #rainfall in the past 24 hours, according to the (IMD). pic.twitter.com/iKYkdqk9xM— Lokmat Times Nagpur (@LokmatTimes_ngp) May 19, 2025మరోవైపు ఆకస్మిక వర్షాల కారణంగా బెంగళూరు డ్రైనేజీ వ్యవస్థ మరోసారి అస్తవ్యస్తంగా మారిపోయింది. అనేక చెట్ల కొమ్మలు పడిపోయాయి. వాహనాలు ధ్వంసమయ్యాయి. దీంతో ట్రాఫిక్ కష్టాలకు పెట్టింది పేరు బెంగళూరు పరిస్థితి మరోసారి అధ్వాన్నంగా మారిపోయింది. ప్రభావిత జిల్లాల్లో బెంగళూరు అర్బన్, బెంగళూరు రూరల్, కోలార్, చిక్కబళ్లాపుర, తుమకూరు, మండ్య, మైసూరు, హసన్, కొడగు, బెళగావి, బీదర్, రాయచూర్, యాద్గిర్, దావణగెరె మరియు చిత్రదుర్గ ఉన్నాయి. సాయి లేఅవుట్ ,హోరామావు ప్రాంతం అత్యంత ప్రభావిత ప్రాంతాలుగా ఉన్నాయి.ఇదీ చదవండి: అనంత్-రాధిక సండే షాపింగ్ : లవ్‌బర్డ్స్ వీడియో వైరల్కర్ణాటక తీరప్రాంతంలో భారీ వర్షాలు అంటూ భారత వాతావరణ శాఖ (IMD) 'ఎల్లో' అలర్ట్ జారీ చేసింది, ఉత్తర , దక్షిణ ఇంటీరియర్ కర్ణాటకలో అతి భారీ వర్షాలకు 'ఆరెంజ్' అలర్ట్ జారీ చేసింది. బెంగళూరులో, ఉడిపి, బెలగావి, ధార్వాడ్, గడగ్, హవేరి, శివమొగ్గ వంటి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది.

దౌత్యవేత్త తలరాతనే మార్చేసిన ప్రేమ మైకం..! కట్‌చేస్తే..
ఎలా పుడుతుందో లేదా చిగురిస్తుందో తెలియని ఈ ప్రేమ..జీవితాలనే తలకిందులు చేస్తుంది. అంతా సవ్యంగా ఉంటే కథా సుఖంతమవుతుంది. అయితే ఇది వలుపు వల లేదా ట్రాప్ అన్నది పసిగట్టగలిగితే సేఫ్‌గా ఉండొచ్చు. కానీ అసలు చిక్కు అంత అక్కడే ఉంటుంది. బహుశా దానికున్న శక్తి వల్లనో.. ఏమో..! ..ఎంతటి అత్యున్నత హోదాలో ఉన్న వ్యక్తినైనా దభాలున పడగొట్టేస్తుంది. తానేం చేస్తున్నది మర్చిపోయేలా దిగజార్చేస్తుంది. అచ్చం అలానే ఓ మహిళ గౌరవప్రదమైన హోదాలో ఉండి..కేవలం రెండక్షరాల ప్రేమ మాయలో పడి అపఖ్యాతీ పాలైంది. దేశ ప్రతిష్టనే దిగజార్చే పనులకు పూనుకుని కళంకితగా మిగిలింది. ఇటీవల అరెస్టు అయినా జ్యోతి మల్హోత్రా యూట్యూబర్ కథతో నాటి దౌత్యవేత్త మాధురి గుప్తా కథ నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది. ఇంతకి ఎవరామె..? ఎలా పట్టుబడిందంటే..ఇటీవల జ్యోతి రాణిగా పిలిచే జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేసిన ఆరోపణలపై అరెస్టు అయ్యిన సంగతి తెలిసిందే. ఆమె తోపాటు మొత్తం ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె అరెస్టుతో భారత నిఘా వ్యవస్థ అప్రమత్తమైంది. ఇలా ఎలా మన దాయాది దేశానికి గూఢచారులుగా మారుతున్నారని విచారణ చేస్తుంటే..ప్రేమ, డబ్బు తదితరాలే కారణాలుగా వెల్లడవుతున్నాయి. ఇదొక హనీట్రాప్ మాదిరిగా జరుగుతున్నట్లు దర్యాప్తులో తేలింది. అచ్చం అలానే నాటి భారతీయ దౌత్యవేత్త అపఖ్యాతీ పాలై దోషిగా నిలబడిన ఘటన కళ్లముందు మెదులుతోంది. యావత్ దేశం తలదించుకునేలా దుశ్చర్యకు పాల్పడింది. అత్యున్నత హోదాలో ఉండి..అన్నేళ్లు అనుభవం అంతలా ఎలా దిగజారిపోయిందన్న అనుమానాలు లేవనెత్తాయి. ఇంతకీ ఎవరామె అంటే..ఆమె కథ ఓ బాలీవుడ్ సినిమాని తలపించేలా ఉంటుంది. ఇస్లామాబాద్‌లో దౌత్యవేత్తగా పనిచేస్తున్న మాధురి గుప్తా పాకిస్తానీ వ్యక్తిని ప్రేమలో పడి.. ఆ దేశం కోసం గుఢచారిగా మారిపోయింది. ఉర్దూలో నిష్ణాతురాలైన ఆమె సూఫీ కవిత్వంలో అతడికి పడిపోయినట్లు తెలుస్తోంది. 2010లో ముంబై దాడుల అనంతరం 18 నెలలు తర్వాత భారతదేశ ఇంటెలిజెన్స్ బ్యూరో (IB)లో గుసగుసలు వినిపించాయి. ఇస్లామాబాద్‌లో దౌత్యవేత్తగా పనిచేస్తున్న మాధురి పాక్‌కి గుఢాచారిగా పనిచేస్తుందంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో క్లోక్-అండ్-డాగర్ నిఘా ఆపరేషన్ చేపట్టి నిజనిజాలు వెలికితీసింది. ఆ ఆపరేషన్లోనే..విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. దాదాపు మూడు దశాబ్దాలకు పైగా దౌత్యవేత్తగా పనిచేసిన ఆమె పాక్ అపరిచిత యువకుడితో ప్రేమలో పడటంతోనే..అమె అపార అనుభవం మంటగలిసిపోయిందని తేలింది. అస్సలు ఆమె అలా చేస్తుందని నమ్మబుద్ది కానీ విధంగా జాగ్రత్తపడిందని అన్నారు నిఘా అధికారుల. ఇక్కడ మాధురి గుప్తా పాకిస్తాన్‌లోని భారత హైకమిషన్ ప్రెస్ అండ్ ఐటీ విభాగంలో సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే ఆమె అక్కడ పాక్ ఇంటర్-సర్వీస్ ఇంటెలిజెన్స్ (ISI) కోసం గూఢచర్యం చేయడం ప్రారంభించిందని తేలింది. అదీగాక ఆమెకు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA)లో మంచి పలుకుబడి, గౌరవం ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే ఆమెను ఇస్లామాబాద్‌లో దౌత్యవేత్తగా పనిచేసేలా బాధ్యతలు కట్టబెట్టినట్లు తెలుస్తోంది. అక్కడ ఆమె 30 ఏళ్ల జంషెడ్ అలియాస్ జిమ్‌ను కలిసింది. కొద్దికాలంలోనే అతడి ప్రేమలో పడింది. చెప్పాలంటే ఆమె హనీట్రాప్‌లో చిక్కుకుందని చెప్పారు అధికారులు. దేశ రహస్యాలను తెలుసుకోవడం కోసం ఆమెను వాడుకునేందుకు ఇలా ప్రేమ వలపును విసిరాడు జిమ్. అతడిపై ఉన్న గుడ్డిప్రేమతో ఆమె మన దేశ నిఘా కార్యకలాపాలను, రహస్య సమాచారాన్ని చేరవేయడం ప్రారభించిందని తెలిపారు. ఆమె మెయిల్ అకౌట్ స్వాధీనం చేసుకున్నప్పుడు ఈ విషయం బయటపడింది. ఆ ఈమెయిల్లో వారి మధ్య జరిగిన చాటింగ్ సంభాషణ బట్టి వారి మధ్య సాన్నిహిత్యం కాస్తా.. వివాహేతర బంధంగా మారిందని తేలింది. దీంతో నిఘా అధికారులు.. సార్క్ శిఖరాగ్ర సమావేశం నెపంతో ఆమెను ఏప్రిల్ 2010లో ఢిల్లీకి పిలిపించారు. అక్కడే భారత ఇంటిలిజెన్సీ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించారు. అక్కడ ఆమె చేసిన నేరాలన్నింటిని అంగీకరించడం తోపాటు..ఇంత సమయం పట్టిందా నన్ను అదుపులోకి తీసుకోవడానికి అని అధికారులే అవాక్కయ్యేలా సమాధానమిచ్చింది మాధురి గుప్తా. ఆమెను అరెస్టు చేసి కోర్టుమందు హాజరుపరిచారు.అక్కడ ఆమె కేసు సంత్సరాల తరబడి కొనసాగింది. చివరికి వాదోపవాదనల అనంతరం మే 2018లో తీర్పు వెలువరించింది కోర్టు. ఆమె నేరపూరిత కుట్ర, గూఢచర్యం కేసులో దోషిగా నిర్థారిస్తున్నట్లు కోర్టు పేర్కొంది. అలాగే ఒకప్పుడూ గౌరవనీయమైన హోదాలో ఉండి దేశ ప్రతిష్టను దెబ్బతీసిలా పనులకు పూనుకోవడమే గాక మన దేశ భద్రతకు ముప్పుగా మారిందని పేర్కొంటూ శిక్ష విధించింది. ఇలా చేయడానికి రీజన్.. కేవలం ఒంటరితనం, వృత్తిపరమైన సంఘటర్షణ లేదా వ్యవస్థపై ఉన్న కోపంతోనో ఇలా చేసి ఉండొచ్చనేది నిపుణులు అంచనా. కానీ ఈ స్టోరీలో దౌత్యవేత్తగా అత్యున్నత హోదాలో ఉన్న ఆమె పార అనుభవం, తెలివితేటలు 'ప్రేమ' అనే రెండు అక్షరాల ముందు ఎందుకు పనికిరాకుండా పోయిందా అనేది మింగుడుపడని అంశంగా కనిపించింది అధికారులకి.(చదవండి: మెరిసిన చేనేత..మురిసిన భామలు)
ఫొటోలు
అంతర్జాతీయం

ఎవరెస్ట్‌పైకి 19వసారి!
కఠ్మాండు: ప్రఖ్యాత బ్రిటిష్ పర్వతారోహకుడు కెంటన్ కూల్ (51) సరికొత్త రికార్డు నెలకొల్పారు. ప్రపంచంలోనే ఎత్తయిన శిఖరం ఎవరెస్ట్‌ను రికార్డు స్థాయిలో 19వ సారి అధిరోహించారు. ఈ ఘనత సాధించిన తొలి షెర్పాయేతరుడిగా నిలిచారు. ఈ విషయంలో కూల్ తన రికార్డును తానే అధిగమించడం విశేషం. మౌంటెయిన్ గైడ్ అయిన కూల్ ఇతర అధిరోహకులతో కలిసి ఆదివారం 8,849 మీటర్ల ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. ఆయన 2004లో తొలిసారి ఎవరెస్ట్‌ను అధిరోహించారు. అప్పటినుంచి 2014, 2015, 2020ల్లో మినహా ఏటా ఎవరెస్ట్ ఎక్కుతూ వస్తున్నారు. మంచు చరియలు విరిగిపడటం వల్ల 2014లో, భూకంపంతో 2015లో, కరోనా కారణంగా 2020లో ఎవరెస్ట్ యాత్ర జరగలేదు. ఎవరెస్ట్‌ను అత్యధిక పర్యాయాలు అధిరోహించిన రికార్డు మాత్రం నేపాలీ షెర్పాలదే. షెర్పా గైడ్ కమి రిటా అత్యధికంగా 30సార్లు ఈ ఘనత సాధించారు. ప్రస్తుతం ఆయన మరోసారి శిఖరాన్ని చేరుకునే ప్రయత్నంలోనే ఉండటం విశేషం!

సముద్రగర్భంలో పెను విస్ఫోటం!
అగ్నిపర్వతం బద్దలైనప్పుడు నిప్పులు చిమ్ముతూ లావా నింగిలోకి ఎగసిపడటం, విపరీతంగా ధూళి సమీప గ్రామాలపై దుమ్ము దుప్పటి కప్పేయడం టీవీల్లో చూసే ఉంటారు. వీటికి పూర్తిభిన్నమైన అగ్నిపర్వతం అతి త్వరలో బద్దలుకానుందని ఖగోళ శాస్త్రవేత్తలు ప్రకటించారు. అమెరికాలోని ఒరెగాన్ రాష్ట్రంలోని ఆస్టోరియా నగర తీరానికి 300 మైళ్ల దూరంలో పసిఫిక్ మహాసముద్రం లోపల ఈ అగ్నిపర్వతం దాగి ఉంది. దీని పేరు యాక్సియల్ సీమౌంట్. భూ ఉపరితలం మీద కాకుండా పసిఫిక్ మహాసముద్రం ఉపరితలానికి 1.4 కిలోమీటర్ల లోతులో ఉండటమే ఈ అగ్నిపర్వతం ప్రత్యేకత. ఎందుకంత ప్రత్యేకత? ఈ అగ్నిపర్వతం రెండు భూ పలకలు ఢీకొనే చోట ఏర్పడింది. పసిఫిక్ భూ పలక, జువాన్ డీ ఫ్యూకా భూ పలకలు తరచూ అత్యంత స్వల్పంగా కదులుతుంటాయి. ఈ క్రమంలో ఇవి పరస్పరం తగులుతూ భూమి ఉపరితల పొరల కదలికలకు కారణం అవుతున్నాయి. వీటి సమీపంలో ఉన్న ఈ అగ్నిపర్వతం త్వరలో బద్దలయ్యే అవకాశం ఉందని శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో తేలింది. ఒరెగాన్ స్టేట్ యూనివర్సిటీలోని హ్యాట్‌ఫీల్డ్ మెరైన్ సైన్స్ సెంటర్లో పరిశోధకుడైన బిల్ చాడ్విక్ ఈ వివరాలను వెల్లడించారు. ‘‘భూకేంద్రంలో ద్రవరూపంలోని శిలలు అగ్నిపర్వతం ద్వారా బయటకు వస్తాయి. ఈ శిలాద్రవం (మాగ్మా) వెంటనే సముద్ర జలాలకు తగిలి చల్లబడుతుంది. ఈ క్రమంలో అక్కడి సముద్ర జలాలు వేడెక్కుతాయి’’ అని చాడ్విక్ చెప్పారు.వేల కొద్దీ భూకంపాలు! ‘‘అగ్నిపర్వతం ఎత్తు కేవలం 3,300 అడుగులు. కానీ అత్యంత క్రియాశీలంగా తయారైంది. ఇటీవలికాలంలో శిలాద్రవం బయటికొచ్చే అవకాశాలు ఎక్కువయ్యాయి. భూమి కంపిస్తోంది. అగ్నిపర్వతం తాజా స్థితిని తెల్సుకునేందుకు మేం సమీప ప్రాంతం దాకా కేబుల్ వ్యవస్థ ద్వారా భూకంప తీవ్రతలను కనిపెట్టే ఏర్పాట్లుచేశాం’’ అని ఆయన చెప్పారు. ‘‘ అగ్నిపర్వతం బద్దలయ్యే ముందు భూమి వందల సార్లు కంపిస్తుంది. ఇక అగ్నిపర్వతం బద్దలైన సందర్భాల్లో వేల సార్లు కంపిస్తుంది. 2015 ఏప్రిల్‌లో చివరిసారిగా అగ్నిపర్వతం బద్దలైంది. అప్పుడు విపరీతంగా శిలాద్రవం బయటకు ఎగజిమ్మింది. అప్పుడు 24 గంటల వ్యవధిలో ఈ ప్రాంతంలో 10,000 చిన్నపాటి భూకంపాలు వచ్చాయి. ఈసారి కూడా అదే స్థాయిలో భూమి కంపించే వీలుంది’’ అని ‘యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ స్కూల్ ఆఫ్ ఓషనోగ్రఫీ’లో మెరైన్ జియోఫిజిసిస్ట్, ప్రొఫెసర్ విలియం విల్కుక్ స్పష్టంచేశారు. జీవవైవిధ్యానికి బాసట అగ్నిపర్వతం బద్దలైనప్పుడు భారీ స్థాయిలో శిలాద్రవం మహాసముద్రజలాల్లో కలిసిపోతుంది. ఈ శిలాద్రవంలో ఎన్నో రకాల మూలకాలు ద్రవరూపంలో ఉంటాయి. ఇవన్నీ సముద్రజలాల్లో సమ్మిళితమై అక్కడి సూక్ష్మజీవులకు ఆహారంగా మారతాయి. ఈ సూక్ష్మజీవులపై ఆధారపడిన చిన్న జలచరాలు, వాటిని ఆహారం తీసుకునే చేపలు.. ఇలా ఆహార చక్రం సదా సవ్యంగా కొనసాగేందుకు అగ్నిపర్వతం పరోక్షంగా సాయపడుతోంది. అత్యంత వేడితో సెగలు కక్కే మాగ్నా సముద్ర ఉపరితలానికి ఎగసిపడగానే అక్కడ జీవులు కొన్ని చనిపోయినా తర్వాత మాత్రం అక్కడ జీవరాశి పెరుగుదలకు దోహదపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సముద్రంలో జీవం మనుగడకు అగ్నిపర్వతాలు సైతం తమ వంతు సాయం చేస్తున్నాయని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్లో మెరైన్ జియోలజీ, జియోఫిజిక్స్ విభాగ ప్రొఫెసర్ డెబీ కెల్లీ వ్యాఖ్యానించారు. – సాక్షి, నేషనల్ డెస్క్

పాక్‌కు ఐఎంఎఫ్ మరో 11 షరతులు
ఇస్లామాబాద్: పాకిస్తాన్‌కు బెయిల్ ఔట్ ప్యాకేజీ నిధులు విడుదల చేసే విషయంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) 11 కొత్త షరతులు విధించింది. అలాగే భారత్‌తో ఉద్రిక్తతలు పెంచుకోవడం తగదని హితవు పలికింది. ఉద్రిక్తతలు పెంచుకొంటే మీకే ఎక్కువ సమస్యలు వస్తాయని తేల్చిచెప్పింది. ఆర్థికంగా మరిన్ని ఇబ్బందులు తలెత్తుతాయని, సంస్కరణ లక్ష్యాలను సాధించడం కష్టమవుతుందని తేల్చిచెప్పింది. బిలియన్ డాలర్ల(రూ.8,540 కోట్లు) రుణానికి సంబంధించిన నిధులు పొందాలంటే షరతులకు కట్టుబడి ఉండాల్సిందేనని తేల్చిచెప్పింది. తాజాగా విధించిన 11 షరతులతో కలిపి పాకిస్తాన్‌పై విధించిన ఐఎంఎఫ్ షరతుల సంఖ్య 50కి చేరుకోవడం గమనార్హం. రూ.17.6 ట్రిలియన్ల బడ్జెట్‌కు పార్లమెంట్ ఆమోదం తెలపాలని, విద్యుత్ బిల్లులపై రుణ సరీ్వసింగ్ సర్‌చార్జి పెంచాలని, మూడేళ్లు దాటిన పాత కార్ల దిగుమతిపై ఆంక్షలు ఎత్తివేయాలని ఐఎంఎఫ్ పేర్కొంది. మొత్తం బడ్జెట్లో రూ.1.07 ట్రిలియన్ల సొమ్మును అభివృద్ధి కోసం కేటాయించాలని నిర్దేశించింది. పాక్‌లోని నాలుగు ప్రావిన్సుల్లో కొత్త వ్యవసాయ ఆదాయపు పన్ను చట్టాలని అమలు చేయాలని తేల్చిచెప్పింది.

ట్రంప్ సలహా సంఘంలో మాజీ ఉగ్రవాదులు
వాషింగ్టన్: కరడుగట్టిన అల్‌కాయిదా, లష్కరే తోయిబా ఉగ్రసంస్థలకు చెందిన మాజీ ఉగ్రవాదులకు ఏకంగా అమెరికా అధ్యక్షుని సలహా సంఘంలో చోటు దక్కింది! వారిలో ఒకరు ఉగ్రవాదం, సంబంధిత కేసుల్లో దోషిగా జైలుశిక్ష అనుభవించి విడుదలైన ఇస్మాయిల్ రాయర్ కాగా మరొకరు హమాస్, ముస్లిం బ్రదర్హుడ్లతో సంబంధాలున్న మాజీ ఉగ్రవాది షేక్ హమ్జా యూసుఫ్. వారిని రిలీజియస్ లిబర్టీ కమిషన్ ఆధ్వర్యంలో పనిచేసే అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ లే లీడర్స్‌లో సభ్యులుగా ట్రంప్ సర్కారు ఎంపిక చేసింది. వారిద్దరూ అమెరికాలో ఇస్లామిక్ బోధనల్లో ప్రముఖులుగా మంచిపేరు తెచ్చుకున్నారని చెప్పుకొచి్చంది. కరడుగట్టిన ఉగ్ర చరిత్ర ఉన్న మాజీలను సలహా సంఘంలోకి కూర్చోబెడతారా అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ట్రంప్ రెండో హయాంలో అమెరికాలో నెలకొన్న అవ్యవస్థకు ఇది మరో నిదర్శనమంటూ పలువురు మండిపడుతున్నారు. ఈ సలహా సంఘం మతస్వేచ్ఛ, మత విశ్వాసాలకు అనుగుణంగా విధాన నిర్ణయాల్లో అధ్యక్షుడికి సలహాలిస్తుంది.ఎవరీ ఇస్మాయిల్? ఇతను అమెరికా జాతీయుడు. అసలు పేరు ర్యాండల్ టోడ్ రాయర్. 1992లో ఇస్లాం స్వీకరించి ఇస్మాయిల్‌గా పేరు మార్చుకున్నాడు. లష్కరే తోయిబా, ఈజిప్‌్టలోని ముస్లిం బ్రదర్హుడ్, ‘వర్జీనియా జిహాద్ నెట్వర్క్’, పాలస్తీనాలోని హమాస్ ఉగ్ర సంస్థతో సత్సంబంధాలున్నాయి. ప్రత్యేక ఉగ్రశిక్షణ కోసం 2000లో పాక్ వెళ్లాడు. అమెరికాపై యుద్ధం కోసం పలువురికి ఉగ్ర తర్ఫీదు ఇచ్చేలా ప్రణాళికలు వేశాడు. జమ్మూ కశీ్మర్లో సైనిక స్థావరాలపై రాకెట్ ప్రొపెల్డ్ గ్రనేడ్ దాడికి సహచర ఉగ్రవాదికి శిక్షణ ఇచ్చాడు. అల్ఆయిదా, లష్కరేలకు సాయపడ్డ నేరానికి 2003లో ఇస్మాయిల్‌పై కేసు నమోదైంది. దోషిగా తేలడంతో 20 ఏళ్ల జైలుశిక్ష పడ్డా స్రత్పవర్తన కారణంగా 2017లో విడుదలయ్యాడు. అమెరికాలోని రిలీజియస్ ఫ్రీడం ఇన్స్టిట్యూట్లో డైరెక్టర్‌గా ఉన్నాడు.ఎవరీ షేక్హమ్జా యూసుఫ్? అమెరికాలో తొలి ముస్లిం లిబరల్ ఆర్ట్స్ కాలేజీ అయిన జేతునా కాలేజ్ సహవ్యవస్థాపకుడు. ఈ కాలేజీలో షరియా చట్టాలను బోధిస్తారు. యూసుఫ్‌కు ముస్లిం బ్రదర్హుడ్, హమాస్‌లతో లింకులున్నట్టు తేలింది. వాటితో ఇప్పటికీ సంబంధాలు కొనసాగిన్తున్నట్టు చెబుతారు. ఇతని బోధనలకు పలువురు ఉగ్రవాదులు ఆకర్షితులైనట్టు స్పష్టమైంది. అమెరికా జాత్యహంకార దేశమంటూ వ్యాఖ్యలు చేశాడు. 1990ల నాటి శకంలో న్యూయార్క్ బాంబు దాడుల కేసు నిందితుడు షేక్ ఒమర్ అబ్దుల్ రహా్మన్పై దర్యాప్తులో అమెరికా ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించడం లేదని విమర్శలు గుప్పించాడు. అమెరికా పోలీస్ ఉన్నతాధికారిని హత్య చేసిన జమీల్ అల్ అమీన్ అనే వ్యక్తికి మద్దతుగా యూసుఫ్ ప్రసంగించాడు. తర్వాత రెండు రోజులకే అమెరికాపై 9/11 దాడి జరిగింది. దాంతో అతన్ని ఎఫ్‌బీఐ విచారించింది. ముస్లిం దేశాల్లో అత్యంత ప్రముఖ ఇస్లామిక్ విద్యావేత్తగా పేరొందాడు.
జాతీయం

శరణార్థులపై.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు
ఢిల్లీ: శ్రీలంక శరణార్థుల అంశానికి సంబంధించి దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. శ్రీలంక శరణార్థులు పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు.. ప్రపంచంలోని నలుమూలల నుంచి వచ్చే శరణార్థులకు ఆతిథ్యం ఇచ్చేందుకు భారత్ ధర్మశాల కాదని స్పష్టం చేసింది. శ్రీలంక శరణార్థుల పిటిషన్‌పై సోమవారం(మే 19 వ తేదీ) విచారించిన ధర్మాసనం... విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది.ప్రపంచంలోని నలుమూలల నుంచి వచ్చే శరణార్థులకు ఆతిథ్యం ఇచ్చేందుకు భారత్ ధర్మశాల కాదని స్సష్టం చేసింది. ప్రపంచ నలుమూలల నుంచి వచ్చే శరణార్థులకు భారత్ ఆతిథ్యం ఇవ్వాలా? భారత్‌లో 140 కోట్ల మంది జనాభా ఉన్నారు. అన్ని ప్రాంతాల నుండి వచ్చే విదేశీ పౌరులకు ఆతిథ్యం ఇచ్చేందుకు ధర్మశాల కాదు. వెంటనే దేశంలోని శరణార్థులు దేశం విడిచి వెళ్లాలని జస్టిస్ దీపాంకర్ దత్తా వ్యాఖ్యానించారు. కేసు పూర్వాపరాల్ని పరిశీలిస్తే.. శ్రీలంకలో ప్రత్యేక తమిళ ఈలమ్ కోసం పోరాడిన నిషేధిత తీవ్రవాద సంస్థ ఎల్టీటీఈ సానుభూతి పరుడైన శ్రీలంక జాతీయుడైన పిటిషనర్ మరో ఇద్దరు నిందితులతో కలిసి దేశంలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడంతో 2015లో ఆధారాలతో పోలీసులు అరెస్ట్ చేశారు. 2018లో పిటిషనర్‌ను దోషిగా పరిగణలోకి తీసుకున్న న్యాయ స్థానం 2018లో చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ)కింద పది సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించింది. జైలు శిక్ష కొనసాగుతున్న సమయంలో 2022లోమద్రాస్ హైకోర్టు అతని శిక్షను ఏడు సంవత్సరాలకు తగ్గించడమే కాకుండా, శిక్ష పూర్తయ్యాక వెంటనే భారత్ నుండి వెళ్లాలని, ఇక్కడ ఉండకూడదనే సూచించింది. మద్రాస్ ఇచ్చిన నాటి తీర్పుతో పిటిషనర్ మరికొద్ది రోజుల్లో దేశం విడిచి వెళ్లాల్సి ఉంది.India is not a "dharamshala" that can entertain refugees from all over the world, the Supreme Court orally observed, while refusing to interfere with the detention of a Sri Lankan Tamil national.Read more: https://t.co/LhaVOoiHtu#SupremeCourt pic.twitter.com/6fZD2EoiRq— Live Law (@LiveLawIndia) May 19, 2025 మద్రాస్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కానీ తాను, భారత్‌ను విడిచి శ్రీలంకకు వెళ్లలేనని, తనని ఇక్కడే ఉండేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ మద్రాస్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై సుప్రీంకోర్టు జస్టిస్ దీపాంకర్ దత్తా, కృష్ణన్ వినోద్ చంద్రన్ (K. Vinod Chandran) నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం(మే19) విచారణ చేపట్టింది. భారత్ ధర్మశాల కాదువిచారణ సందర్భంగా జస్టిస్ దీపాంకర్ దత్తా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోని నలుమూలల నుంచి వచ్చే శరణార్థులకు ఆతిథ్యం ఇచ్చేందుకు భారత్ ధర్మశాల కాదు. శరణార్థులకు ఇక్కడ ఆతిథ్యం ఇవ్వలేం. వెంటనే శరణార్థులు దేశం విడిచి వెళ్లాలని ఆదేశించారు. మద్రాస్‌కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ పిటిషనర్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. ‘మీకు ఇక్కడ స్థిరపడేందుకు ఎలాంటి హక్కు ఉంది?’అనంతరం, పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టులో తన వాదనలు వినిపించారు. పిటిషనర్ శ్రీలంక జాతీయుడు. శ్రీలంక నుంచి భారత్‌కు వీసాతో వచ్చాడు. తన దేశంలో ప్రాణ భయముందని అన్నారు. పిటిషనర్ మూడేళ్లపాటు జైలు కస్డడీలో ఉన్నారని, ఆ సమయంలో అతని దేశం నుంచి పంపించేందుకు ఎలాంటి చర్య తీసుకోలేదని ప్రస్తావించారు. పిటిషనర్ తరుఫు న్యాయవాది వాదనలపై సుప్రీం జస్టిస్ దీపాంకర్ దత్తా..‘మీకు ఇక్కడ స్థిరపడేందుకు ఎలాంటి హక్కు ఉంది?’ అని ప్రశ్నించారు.భారత్ కాకుండా వేరే దేశంలో స్థిరపడండిఅందుకు.. పిటిషనర్ న్యాయవాది స్పందిస్తూ.. ‘అతను శరణార్థి. అతని భార్య, పిల్లలు ఇక్కడే స్థిరపడ్డారని ప్రకటించారు. పిటిషనర్ శ్రీలంకకు వెళితే తనకు ప్రాణ హాని ఉందన్న పిటిషనర్ అభ్యర్థనపై జస్టిస్ దీపాంకర్ దత్తా మాట్లాడుతూ.. పిటిషనర్‌కు తన దేశంలో ప్రాణ భయం ఉందని అన్నారు కదా.. భారత్‌యేతర దేశంలో స్థిరపడండి’ అని వ్యాఖ్యానించారు. సారీ.. దేశం విడిచి వెళ్లాల్సిందేఅదే సమయంలో పిటిషనర్ 2009లో శ్రీలంక యుద్ధంలో ఎల్టిటి సభ్యుడిగా పాల్గొన్నట్లు చెప్పారు. అందువల్ల తాను శ్రీలంకకు వెళితే మళ్లీ అరెస్ట్ అవ్వడంతో పాటు, తన ప్రాణానికి అపాయం వాటిల్లే అవకాశం ఉందని తెలిపారు. తన భార్య ఆరోగ్యపరమైన కారణాలతో బాధపడుతుండగా, తన కుమారుడు గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు పేర్కొన్నారు. చివరిగా ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు.. జైలు శిక్ష పూర్తయిన తర్వాత దేశం విడిచి వెళ్లాలన్న మద్రాస్ హైకోర్టు తీర్పును సమర్ధించింది. శ్రీలంకకు వెళ్లే అవసరం లేకుండా భారత్‌లో స్థిరపడేందుకు అవకాశం ఇవ్వాలని పిటిషనర్ అభ్యర్థనను సున్నితంగా తిరస్కరించింది.

బెంగళూరులో భారీ వర్షం.. కర్ణాటక అతలాకుతలం.. షాకింగ్ వీడియోలు
బెంగళూరు: తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న ఐదు రోజులు పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరోవైపు.. రెండు రోజులుగా కర్నాటకలో భారీ వర్షం కురుస్తోంది. ఆదివారం బెంగళూరు నగరంలో ఈ సీజన్లోనే అతిపెద్ద వర్ష పాతం నమోదైంది. దీంతో, రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ఈ క్రమంలో సహాయక చర్యలను పరిశీలించేందుకు వరద నీటిలోనే ఎమ్మెల్యే జేసీబీపై వెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నగరంలోని అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎడతెరిపి లేకుండా వర్షం (rain) కురవడంతో వరదలు వచ్చాయి. మాన్యత టెక్ పార్క్, హంపీనగర, కాటన్ పేట్, అంజనాపుర, బాగలకుంటె, జక్కూరు, హొరమావు, శెట్టిహళ్లి, విశ్వేశ్వరపురా, విద్యాపీఠ, హెమ్మిగెపురా, సిల్క్ బోర్డులో ప్రాంతాలు నీట మునిగాయి. బెంగళూరు రూరల్, కోలార్, చిక్కబళ్లాపూర్, రామనగర, మైసూరు, హాసన్, తుమకూరు మరియు ఇతర జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. యలహంక, కేఆర్‌పురం, ఇతర ప్రాంతాల్లో నీరు ఇళ్లలోకి చేరడంతో నివాసితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.Silk Board Metro Station, Bengaluru…Congress is ruling the state so it’s ok…. pic.twitter.com/reKKwbMTdE— Mr Sinha (@MrSinha_) May 19, 2025 Today: Significant flooding in Bengaluru, Karnataka, India, leading to major traffic disruptions and impacting daily activities for residents. #BengaluruRains #KarnatakaRains pic.twitter.com/0Ph7vHBHUt— Weather Monitor (@WeatherMonitors) May 19, 2025భారీ వర్షాల నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే బస్వరావు సహాయక చర్యలను పరిశీలించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోకి జేసీబీపై వెళ్లారు. స్థానికులను పరామర్శించి.. వరద సహాయక చర్యల్లో పాల్గొన్నారు.After hiking the price of bus ride and metro fare ; Karnataka Congress Govt to launch FERRY SERVICE? Seems so.Congress CM Siddaramaiah has 'gifted' people of Karnataka and Bengaluru especially lakes in the form of water stagnation.This is Congress govt for you. They can't… pic.twitter.com/dKvPLqTnUx— Cons of Congress (@ConsOfCongress) May 19, 2025 #bengalururains #BangaloreRains Avoid Koramangala 80 feet road with knee deep water and bus stranded in it. Video footage time 8 AM. pic.twitter.com/ctyhefMwH9— Agan (@ngrjms) May 19, 202522 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. బెంగళూరు సహా 22 జిల్లాలకు వాతావరణ శాఖ ‘ఎల్లో అలర్ట్’ ప్రకటించింది. మే 22 వరకు ఉడిపి, బెలగావి, ధారవాడ, గడగ్, హవేరి ప్రాంతాల్లో 30-40 కిమీ వేగంతో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. దాదాపు వారం రోజుల పాటు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు ప్రయాణించవద్దని సూచించింది. ಮುಂದಿನ 7 ದಿನಗಳ #ಹವಾಮಾನ #ಮುನ್ಸೂಚನೆ ಮತ್ತು #ಎಚ್ಚರಿಕೆಗಳು: (ಮೂಲ: IMD)ರಾಜ್ಯದಾದ್ಯಂತ ಅಲ್ಲಲ್ಲಿ ಗುಡುಗು, ಮಿಂಚು ಸಹಿತ ಕರಾವಳಿ ಜಿಲ್ಲೆಗಳಲ್ಲಿ ಚದುರಿದಿಂದ ವ್ಯಾಪಕವಾಗಿ ಸಾಧಾರಣ ಮಳೆ ಹಾಗೂ ಅಲ್ಲಲ್ಲಿ ಭಾರಿ ಮಳೆ, ದಕ್ಷಿಣ ಒಳನಾಡು ಜಿಲ್ಲೆಗಳಲ್ಲಿ ಇಂದು ಮತ್ತು ನಾಳೆ, ಉತ್ತರ ಒಳನಾಡು ಜಿಲ್ಲೆಗಳಲ್ಲಿ ಮೇ 19 ರಿಂದ 22 ರವರೆಗೆ ಹಾಗೂ pic.twitter.com/OHLsQQ5j6d— Karnataka State Natural Disaster Monitoring Centre (@KarnatakaSNDMC) May 19, 2025#BengaluruRains The Hennur-Bagalur Road, which is the alternative route to Kempegowda International airport in Bengaluru, was flooded. Motorists & traffic cops had a tough time. (📹 by TOI Syed Asif)@timesofindia pic.twitter.com/xZTRTU9Btv— TOI Bengaluru (@TOIBengaluru) May 19, 2025BANGALORE WATER PARK #Bengaluru #bengalurufloods #BengaluruRains pic.twitter.com/QpBqXmgl5T— Bihar Buzz (@buzz_bihar) May 19, 2025

జ్యోతి మల్హోత్రా కేసులో సంచలన విషయాలు.. హైదరాబాద్, పూరీలో ఏం జరిగింది?
ఢిల్లీ: దాయాది పాకిస్తాన్‌కు గూఢచర్యం చేస్తూ పలువురు భారతీయులు అరెస్ట్ అవుతున్నారు. ఇప్పటికే హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్ట్ కాగా, తాజాగా యూపీకి చెందిన షహజాద్ అనే వ్యక్తిని.. అధికారులు అరెస్టు చేశారు. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా విడుదల చేశారు. ఉత్తరప్రదేశ్‌లో ఉంటూ పాకిస్తాన్ కు కీలక సమాచారాన్ని అందిస్తున్నట్లు గుర్తించి అతన్ని అరెస్టు చేశారు. మరోవైపు.. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. హైదరాబాద్‌లోనూ జ్యోతి మల్హోత్రా జాడలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసు విచారణలో పలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పహల్గాంలో ఉగ్రదాడి (Pahalgam Terror Attack) జరగడానికి కొన్ని నెలల ముందు ఆమె ఆ ప్రాంతానికి వెళ్లినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఒకసారి చైనాకూ వెళ్లొచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. పహల్గాం సమాచారాన్ని పాక్ ఏజెంట్లకు చేరవేసి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. పాకిస్తాన్ ఐఎస్ఐతో సంబంధాలున్న ఆ దేశ హైకమిషన్ ఉద్యోగి డానిష్‌తో జ్యోతికి సన్నిహిత సంబంధాలున్నట్లు తెలిసింది. ‘ఆపరేషన్ సిందూర్’ అనంతరం నెలకొన్న ఉద్రిక్తతల సమయంలో ఆమె ఢిల్లీలోని పాక్ రాయబార కార్యాలయంలోని అధికారి డానిష్‌తో టచ్‌లో ఉన్నట్లు నిర్ధరించారు. జ్యోతిని అతడు ట్రాప్ చేసినట్లు గుర్తించారు. దీనిపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. Jyoti Malhotra met Mariyam Nawaz in Pakistan, Hindu influencers are trapped by ISI, Sources claimed ISI motto is to prepare a Hindu to do terrorist attack in IndiaNaam : Jyoti MalhotraKaam : Gaddari A Woke Girl Can never be a True Patriot!!#JyotiMalhotra #YouTuber pic.twitter.com/7H5mPMgoeb— Sumit (@SumitHansd) May 17, 2025హైదరాబాద్‌తో టచ్‌లో..జ్యోతి మల్హోత్రా జాడలు హైదరాబాద్‌లోనూ కనిపించాయి. 2023 సెప్టెంబరులో ప్రధాని మోదీ వర్చువల్‌గా హైదరాబాద్-బెంగళూరు వందేభారత్ రైలును ప్రారంభించిన సమయంలో ఆమె హడావుడి చేశారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో అప్పటి గవర్నర్ తమిళిసైతోపాటు కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ పాల్గొన్న కార్యక్రమంలో యూట్యూబర్‌గా వీడియోలు చేస్తూ హల్చల్ చేశారు. తాజాగా ఆమె అరెస్ట్ కావడంతో అప్పటి ఆమె వీడియోలు, చిత్రాలు తాజాగా సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే, హైదరాబాద్ వచ్చిన సమయంలో ఆమె ఎవరినైనా కలిశారా? కలిస్తే అక్కడ ఏమైనా వీడియోలు తీశారా? అన్న కోణాల్లో నిఘా వర్గాలు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇది చర్చనీయాంశంగా మారింది.YouTuber से जासूस तक: Jyoti Malhotra का चौंकाने वाला सफर #JyotiMalhotraArrested #JyotiMalhotraYoutuber #jyotimalhotra pic.twitter.com/UJ2PkufpSA— Rubika liyaquat (@RubikaLiyakatFC) May 19, 2025పూరీలోనూ జాడలు..ఇదిలా ఉండగా.. తాజాగా జ్యోతి మల్హోత్రాతో పూరీకి చెందిన మరో యూట్యూబర్ ప్రియాంక సేనాపతికి ఉన్న సంబంధంపై ఒడిశా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పాక్‌కు గూఢచర్యం కేసులో జ్యోతితోపాటు ఆమెకు సహకరించిన మరో ఆరుగురిని హర్యానా పోలీసులు అరెస్టు చేశారు. నిందితురాలి సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించగా, ఆమెకు ఒడిశాలోని పూరీకి చెందిన ప్రియాంకతో సన్నిహిత సంబంధాలున్నట్లు గుర్తించారు. ఆ విషయాన్ని పూరీ పోలీసు యంత్రాంగానికి తెలియజేయడంతో ఎస్పీ వినీత్ అగర్వాల్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు.News Flash 🔴 ବେଶ୍ ନିବିଡ଼ ଥିଲା ଜ୍ୟୋତି ଓ ପ୍ରିୟଙ୍କାଙ୍କ ସମ୍ପର୍କ❗ପାକିସ୍ତାନ ପାଇଁ ଗୁପ୍ତଚରୀ ଅଭିଯୋଗରେ ଗିରଫ ୟୁଟ୍ୟୁବର ଜ୍ୟୋତି ମାଲହୋତ୍ରା ଲିଙ୍କର ଖୋଳତାଡ଼, ପୁରୀର ୟୁଟ୍ୟୁବର ପ୍ରିୟଙ୍କା ସେନାପତିଙ୍କୁ ଇଣ୍ଟେଲିଜେନ୍ସ ବ୍ୟୁରୋ ପରେ ପୁରୀ ପୋଲିସର ପଚରାଉଚରା ସୂଚନା #ONL #Jyoti #PriyankaSenapati #Puri #Odisha pic.twitter.com/WSbg7BziAi— OdishaNewsLive (@OdishaNews_Live) May 18, 2025 2024 సెప్టెంబరు 26న పూరీ వచ్చిన జ్యోతి.. ఇక్కడి శ్రీక్షేత్రాన్ని సందర్శించినట్లు తెలిసింది. స్థానికంగా ఓ హోటల్లో ఉన్న ఆమె దర్శనీయ ప్రాంతాలకు వెళ్లారు. ఆ సమయంలో ప్రియాంక ఆమెతో కలిసి తిరిగారు. శ్రీక్షేత్రంపై ఉగ్రవాదుల కళ్లున్నాయని కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం ఉంది. ఈ పరిస్థితిలో జ్యోతి జగన్నాథస్వామి దర్శనానికి వచ్చారా? లేక రెక్కీ చేసి, పాక్‌కు ఏదైనా సమాచారం అందించారా? అన్న దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక, ప్రియాంక మూడు నెలల క్రితం పాక్‌లోని కర్తార్‌పుర్‌ను సందర్శించారు. ఈ నేపథ్యంలో ఆమె ఆ దేశానికి ఎందుకు వెళ్లారు? అక్కడ ఏం చేశారు? ఎవరెవర్ని కలిశారు? అన్న అంశాలు కీలకంగా మారాయి.Puri: IB questioned Odisha YouTuber Priyanka Senapati over suspected Pakistan ties, following Jyoti Malhotra's espionage arrest. Jyoti had visited Puri last year, including the Jagannath Temple, raised security concerns due to sensitive footage.#JyotiMalhotra #PriyankaSenapati pic.twitter.com/MTjO5EuYh8— Ishani K (@IshaniKrishnaa) May 18, 2025 BIG BREAKING 🚨#YouTuber Jyoti Malhotra was arrested on charges of Spying for Pakistan.📍Pakistan Link According to an FIR, #JyotiMalhotra met Ehsan-ur-Rahim alias Danish, a Pakistan High Commission staffer in New Delhi, in 2023. Danish, her alleged handler, connected her… pic.twitter.com/dNRKDq5ogP— তন্ময় l T͞anmoy l (@tanmoyofc) May 17, 2025

నాజిల్ సమస్యే!.. నాలుగో దశను కూల్చివేసిన ఇస్రో
పీఎస్ఎల్వీ.. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్. ఇది నాలుగు అంచెల రాకెట్. ఈ రాకెట్లో తొలి, మూడో దశల్లో ఘన ఇంధనం వాడతారు. ఇక రెండు, నాలుగో దశల్లో ద్రవ ఇంధనం వినియోగిస్తారు. 101వ ఉపగ్రహం ‘రీశాట్-1బి’ని రోదసికి పంపేందుకు నేటి ‘శతాధిక’ ప్రయోగంతో కలిపి పీఎస్ఎల్వీతో ఇస్రో 63 ప్రయోగాలు నిర్వహించింది. వీటిలో ఈ రాకెట్ విఫలమైన సందర్భాలు మూడు. 2017 తర్వాత రాకెట్లో లోపం కనిపించడం ఇదే తొలిసారి. నిజానికి మూడో దశలో రాకెట్ ఫెయిల్ కావడం అరుదు. 114 సెకండ్లపాటు సాగే ఈ మూడో దశలో హెచ్టీపీబీ (హైడ్రాక్సిల్-టర్మినేటెడ్ పాలీబ్యూటడీన్) ఘన ఇంధన మోటార్ వాడతారు. ఈ ఇంధనం ఆదర్శ స్థితిలో 240 కిలో న్యూటన్ల చోదకశక్తి ఇస్తుంది. తాజా ప్రయోగ వైఫల్య కారణాలను నిగ్గుతేల్చేందుకు ఇస్రో నుంచి ఒకటి, ప్రభుత్వం నుంచి మరొకటి వంతున రెండు కమిటీలు రంగంలోకి దిగాయి. రాకెట్ వేగం, ఎత్తు, ఇంజిన్ల పనితీరు అంశాలపై అవి అధ్యయనం చేస్తాయి. మోటారులో ఇంధన ప్రవాహం సరిగా లేదా? నాజిల్ సమస్యలు తలెత్తాయా? మోటారు డిజైన్/తయారీపరమైన లోపాలున్నాయా? ఇలా పలు కోణాల్లో విశ్లేషణ కొనసాగనుంది. కచ్చితమైన కారణం ఇంకా తెలియనప్పటికీ... రాకెట్ మూడో దశలో మోటార్ కేస్ లోపలి చాంబర్ ప్రెజర్లో అకస్మాత్తుగా పీడనం తగ్గడానికి ఫ్లెక్స్ నాజిల్ నియంత్రణ వ్యవస్థలో తలెత్తిన లోపమే కారణమని ఇస్రో ప్రాథమిక నిర్ధారణకు వచ్చింది. రాకెట్ వేగం, చోదక దిశలను నిర్దేశించేది ఈ కీలక భాగమే. ‘కంబశ్చన్ చాంబర్’లో ఇంధనం దహనమై విపరీత పీడనంతో వేడి వాయువులు నాజిల్ గుండా వెలుపలికి తన్నుకొస్తేనే రాకెట్ ప్రయాణం ముందుకు (పైకి) సాగుతుంది. ఈ ‘చర్యకు ప్రతిచర్య’ అనే మౌలిక సూత్రం ఆధారంగానే రాకెట్ పనిచేస్తుంది. రబ్బరు లాంటి స్థితిస్థాపక గుణం (లేయర్డ్ ఎలాస్టోమెరిక్) గల పదార్థాల పొరలతో ఫ్లెక్సిబుల్ నాజిల్స్ తయారవుతాయి. హైడ్రాలిక్ శక్తిని యాంత్రిక శక్తిగా మార్చి తద్వారా వాల్వులను కదిలిస్తూ ద్రవ/వాయు ప్రవాహాలను నియంత్రించేందుకు సాధారణంగా హైడ్రాలిక్ యాక్చువేటర్లను వినియోగిస్తుంటారు. వీటి పనితీరు సంక్లిష్టంగా ఉంటుంది. అందుకే పీఎస్ఎల్వీ రాకెట్ మూడో దశ మోటారులో హైడ్రాలిక్ యాక్చువేటర్లు కాకుండా… పరిమిత కోణాల్లోనే అయినప్పటికీ అన్ని దిశల్లో కదులుతూ కచ్చితమైన చోదకశక్తిని అందించేందుకు ఫ్లెక్సిబుల్ బేరింగ్ గల ఫ్లెక్స్ నాజిల్స్ ఉపయోగిస్తున్నారు. ఈ వ్యవస్థలో ఉత్పన్నమైన సమస్య వల్లనే తాజా ప్రయోగం విఫలమైనట్టు అనుమానిస్తున్నారు. నాజిల్ యాక్చువేటర్లు, ఫ్లెక్సిబుల్ జాయింట్, కంట్రోల్ సిగ్నల్స్... వీటిలో ఏదో ఒక సమస్య ఏర్పడి చాంబర్ ప్రెజర్లో పీడనం తగ్గి, మరింత ఎత్తుకు ప్రయాణించడానికి చాలినంత చోదకశక్తి లభించక రాకెట్ గతి తప్పడం ఆరంభించింది. దాన్ని అలాగే వదిలేస్తే జనావాసాలపై కూలి ప్రాణ-ఆస్తి నష్టం సంభవించే అవకాశముంది. అందుకే భద్రతా నిబంధనల ప్రకారం ఇస్రో దాన్ని ‘మిడ్ ఎయిర్-అబార్ట్’ చేసింది. అంటే... రాకెట్లో పేలోడ్ (ఉపగ్రహం) ఉన్న చివరిదైన నాలుగో దశను వేరే దారి లేక ఇస్రో కూల్చివేయాల్సి వచ్చింది.-జమ్ముల శ్రీకాంత్..
ఎన్ఆర్ఐ

తెలంగాణ కల్చరల్ సొసైటీ, సింగపూర్ ఆధ్వర్యంలో మే డే సంబరాలు
తెలంగాణ కల్చరల్ సొసైటీ, సింగపూర్ (TCSS) ఆధ్వర్యంలో కార్మికుల దినోత్సవం (మే డే) సందర్భంగా సొసైటీ అధ్యక్షులు గడప రమేష్ గారు సింగపూర్ లో పనిచేస్తున్న తెలంగాణ మరియు ఇతర కార్మికులకు అందరికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ మే డే సందర్భంగా సింగపూర్ లో మల్టీనేషనల్ కంపెనీ (Toa Corporation) లో పని చేస్తున్న అందరికీ దాదాపు 200 మంది కార్మికులకు పండ్లు, శీతల పానీయాలు అందజేసి ఆ కంపెనీకి అలాగే అందులో పని చేస్తున్న ప్రతి కార్మికుడికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన చెట్టిపల్లి మహేష్ తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) తరుపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ప్రతిఒక్కరికి సొసైటీ అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి రాము బొందుగుల మరియు కోశాధికారి నంగునూరి వెంకట రమణ , సొసైటీ ఉపాధ్యక్షులు బసిక ప్రశాంత్ రెడ్డి, దుర్గ ప్రసాద్, భాస్కర్ గుప్త నల్ల, జూలూరి సంతోష్ కుమార్ ఉపాధ్యక్షురాలు మిర్యాల సునీత రెడ్డి, సంస్థాగత కార్యదర్శి కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు బొడ్ల రోజా రమణి, నడికట్ల భాస్కర్, శశిధర్ రెడ్డి, రవి కృష్ణ విజాపూర్,సంతోష్ వర్మ మాదారపు మరియు కార్యవర్గ సభ్యులు శివ ప్రసాద్ ఆవుల, పెరుకు శివ రామ్ ప్రసాద్, రవి చైతన్య మైసా, భాస్కర్ రావు పులిగిళ్ల, విజయ మోహన్ వెంగళ, ప్రవీణ్ మామిడాల, సతీష్ పెసరు, మణికంఠ రెడ్డి, రావుల సుగుణాకర్ రెడ్డి ,చల్ల కృష్ణ మొదలగు వారు అందరికి శుభాకాంక్షలు తెలియజేసారు. మరిన్ని ఎన్ఆర్ఐ వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి

TANA: ‘ఆంధ్ర బాలానంద సంఘం’ ముచ్చట్లు విజయవంతం
డాలస్, టెక్సస్, అమెరికా: తానా ప్రపంచసాహిత్యవేదిక ఆధ్వర్యంలో “నెల నెలా తెలుగు వెలుగు” పేరిట ప్రతి నెల ఆఖరి ఆదివారం నిర్వహిస్తున్న కార్యక్రమాలలో భాగంగా “రేడియో అన్నయ్య, అక్కయ్య గార్ల స్మృతిలో – “85 వసంతాల ఆంధ్ర బాలానంద సంఘం ముచ్చట్లు” అనే అంశంపై జరిపిన 79 వ అంతర్జాల అంతర్జాతీయ దృశ్య సమావేశం పెద్దల ప్రసంగాలు, బాలానందం పిల్లల పాటలతో కోలాహలంగా జరిగింది.తానా అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు పాల్గొన్న అతిథులందరికీ స్వాగతం పలుకుతూ, బాలలకోసం ఏర్పడిన ఒక సంస్థ 85 వసంతాలు జరుపుకోవడం వెనుక ఈ సంస్థ స్థాపకులైన రేడియో అన్నయ్య, రేడియో అక్కయ్య గార్ల కృషి ఎంతైనా ఉందని అన్నారు.తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు, డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “పిల్లలకు పసిప్రాయంలోనే గేయాలు, రూపకాలు, ఆటలు, పాటలతో తెలుగు భాష, సాహిత్యంపట్ల ఆసక్తి కల్గించి, వారిలో క్రమశిక్షణ, మానసిక వికాసం, విజ్ఞానం, సృజనాత్మకత, నాయకత్వ ప్రతిభను కల్గించడంలో ఆకాశవాణిలో కొన్ని దశాబ్దాలపాటు వారం వారం ‘బాలానందం’ కార్యక్రమంతో పిల్లలకు పెద్దపీట వేసిన రేడియో అన్నయ్య, రేడియో అక్కయ్య గార్ల కృషి అజరామరం అన్నారు. పిల్లలకు చిన్నవయస్సులోనే ఇలాంటి విషయాల పట్ల అవగాహన, ఆసక్తినికల్గించి సరైన దిశానిర్దేశం చెయ్యవలసిన బాధ్యత తల్లిదండ్రులదేనన్నారు. ప్రత్యేక అతిథులుగా పాల్గొన్న శారదా శ్రీనివాసన్ (రేడియో హీరోయిన్, సుప్రసిద్ధ ఆకాశవాణి కళాకారిణి), డా. మండలి బుద్ధప్రసాద్ (అవనిగడ్డ శాసనసభ్యులు, రేడియో అన్నయ్య, అక్కయ్యగార్లతో ప్రత్యక్ష పరిచయం ఉన్నవారు), పద్మభూషణ్ పురస్కార గ్రహీత డా. కె.ఐ. వరప్రసాదరెడ్డి (బాలానంద కార్యక్రమాలను ఆస్వాదించినవారు), డా. మోహన్ కందా, ఐ.ఎ.ఎస్ (ఆంధ్రప్రదేశ్ పూర్వ ప్రధాన కార్యదర్శి, బాలానంద సంఘ పూర్వసభ్యులు), జంధ్యాల కామేశ్వరి-పాప (రేడియో అన్నయ్య గారి మేనకోడలు, ఆంధ్ర బాలానంద సంఘం అధ్యక్షులు), కలగా కృష్ణమోహన్ (బాలానందం పూర్వ సభ్యులు, ఆంధ్ర బాలానంద సంఘం ఉపాధ్యక్షులు, ప్రముఖ గీత రచయిత, సంగీత దర్శకులు) బాలానందం కార్యక్రమంతోను, రేడియో అన్నయ్య, అక్కయ్య గార్లతో తమకున్న ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలతోపాటు ఎన్నో ఆసక్తికర విశేషాలను పంచుకుని వారికి ఘననివాళులర్పించారు. విశిష్టఅతిథులుగా - ఎన్.వి. అశోక్ (విశ్రాంత ఇంజనీర్, ‘బాలానందం’ పూర్వసభ్యులు), రావులపర్తి రాజేశ్వరి (విశ్రాంత బ్యాంకు అధికారి, ‘బాలానందం’ పూర్వ సభ్యురాలు),నండూరి సీతా సాయిరాం (విశ్రాంత ఉపాధ్యాయిని, ‘బాలానందం’ పూర్వ సభ్యురాలు),మాడభూషి బద్రినాథ్ (బాలానందం-నృత్య దర్శకులు), డా. ఆవుల హరిత (బాలానందం-కార్యవర్గ సభ్యురాలు), చినముత్తేవి కరుణ (బాలానందం-గాయకబృందం, శిక్షణా విభాగపు కార్యవర్గసభ్యురాలు), మాలెంపాటి నవ్య (ఐఐటి ఖర్గపూర్, ‘బాలానందం’ సంగీత, నృత్య కళాకారిణి), గోవిందు దేవరాజ (బాలానందం-గాయకబృందం, శిక్షణా విభాగపు కార్యవర్గసభ్యులు) పాల్గొని తమ స్వీయ అనుభవాలను, రేడియో అన్నయ్య, అక్కయ్య గార్లు ఎంతో దూరదృష్టితో స్థాపించిన ఆంధ్ర బాలానందం సంఘం తమ పిల్లల జీవితాలలో తీసుకువచ్చిన మార్పులను వివరించి వారిరువురికి ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా తక్కువే అన్నారు. తానా ప్రపంచసాహిత్యవేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ మాట్లాడుతూ - ఒక సంస్థ ఎనిమిదన్నర దశాబ్దాలగా నిరాటంకంగా కొనసాగడం ఒక చరిత్ర అని, ఏ ఆశయంతో రేడియో అన్నయ్య, అక్కయ్య గార్లు ఈ బాలానందం స్థాపించారో, అదే స్ఫూర్తితో ఉత్సాహంగా ఆంధ్ర బాలానంద సంఘం నిర్వహిస్తున్న అధ్యక్షురాలు జంధ్యాల కామేశ్వరి (పాప) వారి కార్యవర్గ సభ్యులకు, ఈ నాటి కార్యక్రమంలో శ్రావ్యంగా పాటలు పాడి ఆనందపరిచిన 25 మందికి పైగా పిల్లలకు, పాల్గొన్న అతిథులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

స్వరలయ ఆర్ట్స్ సింగపూర్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ 6 వ వార్షికోత్సవ వేడుకలు
స్వరలయ ఆర్ట్స్ సింగపూర్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ 6 వ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్ లర్ ఆచార్య వెలుదండ నిత్యానందరావు హాజరయ్యారు. సింగపూర్ లోని తెలుగు వారంతా అన్ని విధాలా సుసంపన్నులని ఈ విధంగా లలిత కళలను ప్రోత్సహించడం ఆనంద దాయకమన్నారు. చిన్నారులు పాడిన పాటలు ఎంతో బాగున్నాయి అని , ఇంత చక్కగా నేర్పిన గురువును నేర్చుకున్న వారి శిష్యులను వారి తల్లిదండ్రులను ప్రశంసించారు. సంగీతం, నాట్యం వంటి కళల ద్వారా మనలో మృదుత్వం కలుగుతుందని, నేటి యాంత్రిక జీవితంలో ఈ మాధ్యమం ఎంతో ముఖ్యం అని కాబట్టి కళల పైన ఉన్న ఆసక్తిని తమ తమ ఆర్థిక సంపాదన రధ చక్రాల కింద పడి నలిగి పోనివ్వవద్దని కోరారు.ఈ కార్యక్రమానికి STS వైస్ ప్రెసిడెంట్ జ్యోతీశ్వర్ , శ్రీ సాంస్కృతిక కలసారథి అధ్యక్షులు కవుటూరు రత్న కుమార్,TCSS అధ్యక్షులు గడప రమేష్, TAS (మనం తెలుగు ) అసోసియేషన్ అనిత రెడ్డి , కమల క్లబ్ మాజీ అధ్యక్షులు, సారీ కనెక్షన్ అడ్మిన్ పద్మజ నాయుడు , మగువ మనసు అడ్మిన్ వీర మాంగోస్ ఉష , సింగపూర్ తెలుగు టీవి రాధాకృష్ణ గణేశ్న , జయంతి రామ, భాగవత ప్రచార సమితి భాస్కర్ ఊలపల్లి, H& H శ్యామల , విష్ణు ప్రియ , సింగపూర్ తెలుగు వనితలు అడ్మిన్స్ క్రాంతి, దేదీప్య, జయ, ప్రత్యూష , అమ్ములు గ్రూపు నుండి అడ్మిన్ సునీత రామ్, , KCAS దివ్య ఇంకా పలువురు సింగపూర్ తెలుగు కమ్యూనిటీ వ్యవస్థాపకులు హాజరయి అందరూ కలిసి వైస్ ఛాన్స్‌లర్‌ను సన్మానించారు. స్వరలయ ఆర్ట్స్, సింగపూర్ వ్యవస్థాపక అధ్యక్షురాలు యడవల్లి శేషుకుమారి వారి శిష్యులు,స్నేహితులు కీర్తనలను ఆలపించారు. పద్మజ నాయుడు మాట్లాడుతూ శేషు గాన కోకిల అని పొగడగా ఆచార్య నిత్యానందరావు గారు కోకిల ఒక కాలంలో మాత్రమే పాడుతుందని కాని ఈమె 365 రోజులు గానం ఆలపిస్తారు అన్నారు. శ్యామల మాట్లాడుతూ వారి వెంకటేశ్వర గానామృతం కార్యక్రమానికి శేషు కుమారి 70 పాటలు 40 రాగాలలో స్వర పరిచి మూడున్నర గంటల సేపు పాడి అందరినీ అలరించిన వైభవం గుర్తు చేసి ఈ రోజుకి ఆ పాటలు తమ చెవులలో ప్రతి ధ్వనిస్తూ పరవసింప చేస్తాయని ప్రశంసించారు.పొట్టి శ్రీరాములు, తెలుగు విశ్వవిద్యాలయం సర్టిఫికేట్ కోర్సు మొదటి వత్సరం, రెండవ సంవత్సరం పరీక్షల్లో ఉత్తీర్ణత పొందిన స్వరలయ ఆర్ట్స్ విద్యార్థులకు వైస్ ఛాన్స్ లర్ బహుమతి ప్రధానం చేశారు. అతిథులకు మొమెంటోలను బహుకరించారు ఈ నెల ఆరవ తారీఖున స్వరలయ ఆర్ట్స్ వారు నిర్వహించిన త్యాగ రాజ ఆరాధన ఉత్సవాలలో పాల్గొని తమతో కలిసి పంచరత్నాలు పాడిన సౌభాగ్య లక్ష్మి తంగిరాల, షర్మిల చిత్రాడ, సౌమ్య ఆలూరు, శరజ అన్నదానం, రాధికా నడదూర్, ప్రియ లకు మొమెంటోలను బహుకరించారు. శివ కుమార్ మృదంగం పై వాయిద్య సహకారం అందించారు ఈ కార్యక్రమానికి శ్రీమతి చైతన్య వ్యాఖ్యాతగా వ్యవహరించారు. పలువురినీ లలిత కళారంగంలో ఉత్సాహ పరుస్తూ ముందుకు నడిచే ఇటువంటి కార్యక్రమానికి దాదాపుగా 200 మంది హాజరు కావటమే కాకుండా, సాంఘిక మాధ్యమాల ద్వారా కూడా వీక్షించి విశేషస్పందనలను తెలియజేయటం అభినందనీయం.

9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు ’’ విశేష సంచిక ఆవిష్కారం
ఖతార్ దేశ రాజధాని దోహా మహానగరంలో 2024 నవంబర్‌లో జరిగిన "9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు" యొక్క సభా విశేష సంచిక అంతర్జాల మాధ్యమంలో ఆదివారం ఆవిష్కరించారు. 'వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా' ,'ఆంధ్ర కళా వేదిక - ఖతార్' సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహింపబడి, మధ్య ప్రాచ్య దేశాలలోనే తొలి సాహితీ సదస్సుగా రికార్డును సృష్టించిన ఈ '9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సులో పది దేశాల నుండి పాల్గొన్న వక్తలు, కవులు, రచయితలు ప్రసంగించిన అన్ని అంశాలను పొందుపరుస్తూ 380 పేజీలతో ఈ సభా విశేష సంచిక రూపొందించబడింది. ఈ ఉద్గ్రంధానికి సంపాదకులుగా రాధికా మంగిపూడి, విక్రమ్ సుఖవాసి, వంగూరి చిట్టెన్ రాజు, లక్ష్మి రాయవరపు, శాయి రాచకొండ వ్యవహరించారు.సదస్సు నిర్వాహకవర్గము, సంచిక సంపాదకులు, సదస్సులో వివిధ దేశాల నుండి పాల్గొన్న వక్తలు, రచయితలు అందరి సమక్షంలో ఈ పుస్తక ఆవిష్కరణ జరగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకించి అంతర్జాల మాధ్యమంలో ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు. మరిన్నిNRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి!వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వ్యవస్థాపకులు డా. వంగూరి చిట్టెన్ రాజు, ఖతార్ ఆంధ్ర కళా వేదిక నుండి విక్రమ్ సుఖవాసి ప్రధాన నిర్వాహకులుగా, వారి అధ్యక్షతన, రాధిక మంగిపూడి సభానిర్వహణలో దాదాపు మూడు గంటల పాటు ఆదివారం సాయంత్రం నిర్వహింపబడిన ఈ కార్యక్రమంలో భారత్, ఖతార్, అమెరికా, సౌదీ అరేబియా, బహరైన్, యూఏఈ, సింగపూర్ తదితర దేశాలనుండి వక్తలు, తెలుగు సంస్థల ప్రతినిధులు, రచయితలు పాల్గొన్నారు.అమెరికా నుండి చెరుకూరి రమాదేవి, శాయి రాచకొండ, భారత్ నుండి డా. వంశీ రామరాజు, డా. అద్దంకి శ్రీనివాస్, డా. బులుసు అపర్ణ, ఆచార్య అయ్యగారి సీతారత్నం, ఆచార్య త్రివేణి వంగారి, కస్తూరి అలివేణి, డా. దేవులపల్లి పద్మజ తదితరులు, బహరైన్ నుండి మురళీకృష్ణ, సౌదీ అరేబియా నుండి కోనేరు ఉమామహేశ్వరరావు, చివుకుల పట్టాభిరామ శర్మ, సింగపూర్ నుండి కవుటూరు రత్నకుమార్, యూఏఈ నుండి షేక్ రఫీ, డా. తాడేపల్లి రామలక్ష్మి, ఖతార్ నుండి శ్రీసుధ, గోవర్ధన్ రెడ్డి, మనీష్, మాధవి లలిత, గౌరీ బొమ్మన తదితరులు ఆసక్తిగా పాల్గొని సదస్సు యొక్క జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.ఈ సభా విశేష సంచికలో నిర్వాహక సంస్థల పరిచయాలు, అధ్యక్షుల, సంచాలకుల ముందుమాటలు, సదస్సు ప్రకటనలు, వక్తలందరి ఫోటోలు, వ్యాసాలు, కథలు, కవితలతో పాటు, సదస్సు అనంతరం అందరూ అందించిన స్పందనలు కూడా జోడించడం, ఆనందంగా ఉందని, జీవితంలో ఒక మధుర జ్ఞాపకంగా చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈ సంచిక ఉందంటూ సంపాదకులను నిర్వాహకులను అభినందించారు.డా. వంగూరి చిట్టెన్ రాజు మాట్లాడుతూ "మధ్యప్రాచ్య దేశాలలో తెలుగు సాహిత్య అభిమానులందరికీ ఈ సదస్సు కొత్త స్ఫూర్తిని అందించిందని, సదస్సు ప్రభావం వలన ఎంతోమంది సాహిత్యంపై చక్కటి ఆసక్తి పెంచుకోవడం, కొత్త రచయితలు జనించడం.. ఆనందదాయకమని తెలియజేశారు. ఇటువంటి సదస్సులు మరిన్ని జరగాలని, కొత్త రచయితలు యువతరం ముందుకు రావాలని పిలుపునిచ్చారు. విక్రమ్ సుఖవాసి ఆంధ్ర కళావేదిక తరపున మరొకసారి అందరికీ తమ దేశానికి విచ్చేసి కార్యక్రమంలో పాల్గొన్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ తొలిసారి ప్రపంచ సదస్సుకు సంచాలకునిగా ఈ సంచికకు సహసంపాదకునిగా ఉండడం చాలా ఆనందంగా ఉందన్నారుఈ సంచికకు రూపకల్పన సహకారం అందించిన జేవి పబ్లికేషన్స్ అధినేత్రి జ్యోతి వలబోజు కూడా ఈ ఆవిష్కరణలో పాల్గొన్నారు. ఇతర మధ్యప్రాచ్య దేశాల సంస్థల ప్రతినిధులు మాట్లాడుతూ తమ దేశాలలో కూడా ఇటువంటి సాహిత్య సదస్సులు నిర్వహించడానికి తాము సిద్ధంగా ఉన్నామని 10వ ప్రపంచ సదస్సు జరపడానికి అవకాశం ఇమ్మని కోరుతూ తమ ఉత్సాహాన్ని వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమం వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా యూట్యూబ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారమైంది.
క్రైమ్

మంచి మాటలు చెప్పినందుకు...
మేడ్చల్: మద్యానికి బానిసై సంసారాన్ని ఎందుకు చెడగొట్టుకుంటున్నావ్ మంచిగా ఉంటూ భార్యా పిల్లలను బాగా చూసుకో అంటూ నాలుగు మంచి మాటలు చెప్పినందుకు ఓ వ్యక్తి తన బావ వరుసైన వ్యక్తిని నడిరోడ్డుపై కత్తితో పొడిచి దారుణంగా హత్య చేసిన సంఘటన స్థానిక సరస్వతీనగర్‌లో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గుజరాత్‌కు చెందిన సోలంకి మోతీలాల్(43), అతడి మేనత్త కుమారుడు శంకర్(35) కుటుంబాలతో కలిసి రైల్వె స్టేషన్ సమీపంలోని సరస్వతీ నగర్లో ఉంటూ భవన నిర్మాణ కారి్మకులుగా పని చేస్తున్నారు. కాగా మద్యానికి బానిసైన శంకర్ కుటుంబ సభ్యులను వేధిస్తున్నాడు. ఆదివారం సాయంత్రం కూడా మద్యం తాగి వచి్చన అతను కుటుంబ సభ్యులతో గొడవ పడి సమీపంలోని రైల్వే ప్లాట్ ఫారంపై పడుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న మోతీలాల్ అక్కడికి వెళ్లి శంకర్‌కు నచ్చజెప్పేందుకు యతి్నంచాడు. అయితే మద్యం మత్తులో ఉన్న శంకర్ అతడిని దుర్బాషలాడాడు. అనవసరంగా భార్యా పిల్లలతో గొడవలు ఎందుకని అతడికి సర్దిచెప్పిన మోతీలాల్ శంకర్‌ను ఇంట్లో దిగబెట్టి తన ఇంటికి వెళ్లాడు. సోమవారం ఉదయం పనికి వెళ్లేందుకు సిద్ధమైన మోతీలాల్ తన బంధువుల ఇంటి వద్దకు వెళుతుండగా అతడిని అడ్డుకున్న శంకర్ తన కుటుంబ విషయాల్లో ఎందుకు జోక్యం చేసుకుంటున్నావంటూ అతడిని తిడుతూ దాడి చేసేందుకు వెళ్లాడు. దీంతో మోతీలాల్ ఈ విషయాన్ని శంకర్ తల్లికి చెప్పేందుకు వెళుతుండగా ఆగ్రహానికి లోనైన శంకర్ తన వెంట తెచ్చుకున్న కత్తితో మోతీలాల్పై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన అతను అక్కడే కుప్పకూలడంతో శంకర్ అక్కడి నుంచి పరారయ్యాడు. కుటుంబసభ్యులు మోతీలాల్‌ను 108లో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. మేడ్చల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చేపట్టారు.

కాళ్లు.. చేతులు కట్టేసి.. గొంతుకు తాడుతో బిగించి చంపేశారు
రాయచోటి టౌన్(అన్నమయ్య): కాళ్లు.. చేతులు కట్టేశారు.. గొంతుకు తాడుతో బిగించారు.. చనిపోయిన తరువాత ఆనవాళ్లు లభించకుండా చేసేందుకు పెట్రోలు పోసి నిప్పు పెట్టారు. అయితే మృతి చెందిన మహిళ చేతి పై ఉన్న పచ్చబొట్టు ఆధారంగా పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి హత్య జరిగిన వా రం రోజుల్లోనే నిందితులను అరెస్టు చేశారు. మృతురాలు మదనపల్లె నియోజకవర్గం పరిధిలోని రామసముద్రం ప్రాంతానికి చెందిన వెంకటరమణ భార్య బూసిపల్లె శివమ్మ(27) గా గుర్తించారు. జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సోమవారం విలేకరుల స మావేశంలో వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి..అన్నమయ్య జిల్లా మదనపల్లె పరిధిలోని రామసముద్రం మండలం చెంబుకూరు ఎలకపల్లె రహదారిలో ఈనెల 11వ తేదీ గుర్తు తెలియని మహిళ మృతదేహం కనిపించింది. రామసముద్రం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ సాగించారు. మృతదేహంపై పెట్రోలు పోసి తగలబెట్టడంతో ఎలాంటి ఆధారాలు లభించలేదు. అక్కడ పెట్రోల్ కోసం వాడిన బాటిల్ మాత్రమే ఉండింది. అయితే మృతురాలి చేతిపై యస్మిత అనే పచ్చబొట్టు ఉండటంతో దాని ఆధారంగా దర్యాప్తు వేగవంతం చేశారు. పచ్చ బొట్టును సోషల్ మీడియాలో పెట్టడంతో ఆమె ఏ ప్రాంతానికి చెందిన మహిళ అనే విషయం తెలిసింది. అలాగే డాగ్‌స్క్వాడ్ సంఘటన స్థలం నుంచి బెంగళూరు రోడ్డు వైపు వెళ్లడంతో ఆ మేరకు టెక్నాలజీని ఉపయోగించి నిందితులను గుర్తించారు. నిందితులంతా మృతురాలి బంధువులే అని తేలడంతో ముగ్గురిని అరెస్టు చేశారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో బెంగళూరులో నివాసం ఉంటున్న ఎం.నీలావతి, రామసముద్రం మండలం గుండేవారిపల్లె నడింపల్లె ప్రాంతానికి చెందిన కన్నెమడుగు గణేష్, బెంగళూరులోని బి.హోసహళ్లి సజ్జాపురం ప్రాంతం అంబేద్కర్ కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ హెచ్వీ గోపాల్ ఉన్నారు.ఎందుకు హత్య చేశారంటే..మృతురాలు బూసిపల్లె శివమ్మ అదే ప్రాంతానికి చెందిన సంతోష్ అనే వ్యక్తితో వెళ్లిపోయింది. ఈ విషయాన్ని జీర్ణించుకోలేని ఆమె బంధువులు భర్తకు తెలియకుండా ఆమెను హత్య చేసేందుకు పథకం రచించారు. ఇందులో భాగంగా మృతురాలి బంధువైన నీలావతి బెంగళూరుకు చెందిన ఆటో డ్రైవర్ హెచ్వీ గోపాల్‌తో హత్య చేసేందుకు బేరం కుదుర్చుకుంది. వీరికి కన్నెమడుగు గణేష్ అనే వ్యక్తి సహకరించాడు. ఆ తర్వాత వారు రామసముద్రం వచ్చి శివమ్మకు మాయమాటలు చెప్పి ఆమెను తమ వెంట శివారు ప్రాంతంలోకి తీసుకెళ్లారు. తాళ్లతో కాళ్లు, చేతులు కట్టేసి గొంతుకు తాడు బిగించి అత్యంత కిరాతకంగా హత్య చేశారు. ప్రాణం పోయిందని నిర్ధారించుకున్నాక ముందుగానే తమ వెంట తెచ్చుకున్న పెట్రోలును మృతదేహంపై పోసి నిప్పంటించారు. అయితే ఆమె చేతిపై ఉన్న పచ్చబొట్టు ఆధారంగా పోలీసులు కేసు మిస్టరీని ఛేదించారు. మదనపల్లె డీఎస్పీ ఎస్.మహేంద్ర, రూరల్ సీఐ సత్యనారాయణ, రామసముద్రం ఎస్ఐ జి.రవికుమార్, మరికొంతమంది సిబ్బంది చాకచక్యంగా నిందితులను గుర్తించి అరెస్టు చేశారని ఎస్పీ ప్రశంసించారు. ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు తెలిపారుసోషల్ మీడియాలో తప్పుడు సమాచారం పోస్ట్ చేస్తే కఠిన చర్యలురాయచోటి టౌన్ : సమాజంలో ప్రజలను ఉద్రేకపరిచేలా, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా పోస్ట్‌లు పెడితే అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని అన్నమయ్య జిల్లాఎస్పీ విద్యా సాగర్‌నాయుడు హెచ్చరించారు. మదనపల్లెలో హనుమాన్ శోభాయాత్రలో జరిగిన సంఘటనపై సోమవారం ఆయన స్పందించి విలేకరులతో మాట్లాడారు. శోభాయాత్ర నిర్వాహకులు ముందుగా తమతో అనుమతులు పొందే సమయంలో ఇచ్చిన రూట్‌మ్యాప్ ప్రకారం కాకుండా వేరే దారిలో వెళ్లేందుకు ప్రయత్నించారన్నారు. పోలీసులు ఎంత నచ్చజెప్పినా వినకుండా సమస్యలు సృష్టించాలని చూశారన్నారు. ప్రకటించిన సమయానికి రాకుండా సుమారు ఒకటిన్నర గంట ఆలస్యంగా రావడమే కాకుండా దారి మళ్లించి సమస్య ను సృష్టించడంతో తమ పోలీసులు స్వల్పంగా లాఠీచార్జి చేయాల్సి వచ్చిందన్నారు. కావాలనే శోభాయాత్రను దారి మళ్లించి సమస్యలు సృష్టించేందుకు కారణమైన వారిపై కేసు నమోదు చేశామని చెప్పారు. అయితే అక్కడ ఏదో జరిగిందని ఒక వర్గాన్ని అణచివేస్తున్నట్లుగా తప్పు డు సమాచారాన్ని సోషల్ మీడియా వేదికగా పోస్టు చేస్తున్నారన్నారు. అలాంటి వారిపైన కూడా కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. చట్టం ముందు అందరూ సమానమేనని గుర్తించుకోవాలని సూచించారు.

మామిడికాయ పచ్చడి విషయంలో గొడవ
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): మామిడికాయ పచ్చడి పెట?్ట విషయంలో తలెత్తిన గొడవలో భార్యను గొంతు నులిపి చంపాడు భర్త. ఈ ఘటన పందిళ్ల గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన సూర అంజలి– సూర రాజ్‌కుమార్ దంపతులు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆదివారం సాయంత్రం మామిడికాయ పచ్చడి పెట్టేందుకు అంజలి సన్నద్ధమైంది. ఇందుకోసం అవసరమైన వెల్లుల్లి కొనుక్కు రావాలని భర్త రాజ్‌కుమార్‌కు సూచించింది. ఈ విషయంలో దంపతుల మధ్య గొడవ జరిగింది. కోపోద్రిక్తుడైన రాజ్‌కుమార్.. అంజలి(27)ను గొంతు నులిమి చంపేశాడు. ఈమేరకు మృతురాలి తండ్రి సంపంగి మల్లేశ్ సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు శవాన్ని పరిశీలించి పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. మృతురాలి భర్త రాజ్‌కుమార్‌పై కేసు నమోదు చేశామని ఎస్సై వెంకటేశ్ తెలిపారు.

పెంటకోట తీరంలో ఇద్దరు విద్యార్థుల గల్లంతు
పాయకరావుపేట: పెంటకోట తీరంలో సోమవారం సాయంత్రం సముద్ర స్నానానికి దిగి ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. బంధువుల ఇంట్లో జరిగిన శుభకార్యానికి వచ్చి ఇలా గల్లంతు కావడంతో పట్టణంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఎస్ఐ జె.పురుషోత్తం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పాయకరావుపేట పట్టణం పాత హరిజనవాడకు చెందిన గంపల తరీష్(17) ఐటీఐ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈయన స్నేహితుడు రాజవొమ్మంగికి చెందిన పిల్లి అభిలాష్(19) హైదరాబాద్‌లో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఇద్దరూ పట్టణంలోని బంధువుల ఇంట్లో సోమవారం జరిగిన శుభకార్యానికి హాజరయ్యారు. అనంతరం సాయంత్రం 5 గంటల సమయంలో పెంటకోట సముద్ర తీరానికి కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లారు. స్నానం చేస్తుండగా అభిలాష్ సముద్రంలో మునిగిపోతుండగా.. తరీష్ గమనించాడు. స్నేహితుడిని రక్షించే ప్రయత్నంలో తరీష్ కూడా గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న మైరెన్ పోలీసులు, స్థానిక పోలీసులు, గజ ఈతగాళ్లు గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి అయినా విద్యార్థుల ఆచూకీ తెలియరాలేదు. మంగళవారం ఉదయం మళ్లీ గాలింపు చేపడతామని ఎస్ఐ తెలిపారు. ఎస్డీఆర్ఎఫ్ దళాలతో కూడా గాలింపు చర్యలు చేపడతామన్నారు. ఇద్దరు విద్యార్ధులు శుభకార్యానికి వచ్చి, సరదాగా సముద్ర స్నానానికి వెళ్లి గల్లంతు అవ్వడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.