Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

China imposes additional 84 percent tariff on US goods1
అమెరికాకు షాకిచ్చిన చైనా

బీజింగ్‌: అమెరికాకు షాకిచ్చిన చైనా షాకిచ్చింది. అమెరికా వస్తువులపై ప్రస్తుతం ఉన్న 34 శాతం టారిఫ్‌ను 84 శాతానికి పెంచుతూ చైనా నిర్ణయం తీసుకుంది. అంతకుముందు చైనా వస్తువులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ 104శాతం సుంకాలు విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ట్రంప్‌ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ భారీ మొత్తంలో టారిఫ్‌ను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కొత్తగా విధించిన సుంకాలు ఏప్రిల్‌ 10 నుంచి అమల్లోకి వస్తాయని చైనా ఆర్థిక శాఖ అధికారికంగా ప్రకటించింది. అమెరికా, చైనా మధ్య టారిఫ్ వార్ గట్టిగా నడుస్తోంది. చైనా వస్తువులపై అదనపు సుంకాలను విధించాలని అమెరికా నిర్ణయించింది. ఈ మేరకు యూఎస్ భారీ స్థాయిలో సుంకాలు విధించింది. చైనా వస్తువులపై టారిఫ్ 104 శాతం చేసింది. అంతేకాదు ఏప్రిల్ 9 నుంచే ఈ టారిఫ్స్ అమల్లోకి వస్తాయని అమెరికా ప్రకటించింది.

Top Court Raps Centre On Emergency Aid In Road Accident Cases Details2
ఇది తీవ్రమైన ఉల్లంఘనే.. కేంద్రానికి ‘సుప్రీం’ చీవాట్లు

న్యూఢిల్లీ: రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స (Cashless Treatment) అందించే విషయంలో కేంద్ర ప్రభుత్వ అలసత్వాన్ని సుప్రీం కోర్టు మందలించింది. ఈ విషయాన్ని తీవ్ర ఉల్లంఘనగా పరిగణించాల్సి ఉంటుందని హెచ్చరిస్తూ బుధవారం సంబంధిత అధికారులకు సమన్లు జారీ చేసింది.ప్రమాదం జరిగిన వెంటనే సమీప ఆసుపత్రిలో ఉచిత వైద్య సాయం కల్పించడమే క్యాష్‌లెస్‌ ట్రీట్‌మెంట్‌ స్కీమ్‌ ఉద్దేశం. ప్రత్యేకించి గోల్డెన్‌ అవర్‌ (ప్రమాదం జరిగిన గంటలోపే)తో సహా రోడ్డు ప్రమాద బాధితులందరికీ దీన్ని వర్తింపజేయాల్సి ఉంటుంది. దీని అమలుకుగానూ కేంద్రానికి సుప్రీం కోర్టు మార్చి 14వ తేదీని గడువుగా ప్రకటించింది. అయితే గడువు దాటినా కేంద్రం ఇంతదాకా దీనిని అమలు చేయలేదు.‘‘ప్రభుత్వానికి ఇచ్చిన గడువు ముగిసిపోయింది. దీనిని తీవ్రమైన కోర్టు ఆదేశాల ఉల్లంఘనగా పరిగణిస్తున్నాం’’ అని జస్టిస్‌ అభయ్‌ ఎస్‌ ఓకా ధర్మాసనం బుధవారం వ్యాఖ్యానించింది. ఈ అలసత్వానికి సంబంధించి రోడ్డు రవాణా & జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి, సీనియర్‌ అధికారులకు కోర్టు సమన్లు జారీ చేసింది. ‘‘అధికారులు కోర్టులకు హాజరైతేనే మా ఆదేశాలను తీవ్రంగా పరిగణిస్తారు. ఈ విషయాన్ని మా సుదీర్ఘ అనుభవం ద్వారా మేం తెలుసుకున్నాం. ఏప్రిల్‌ 28వ తేదీన సమన్లు అందుకున్నవాళ్లు కోర్టుకు హాజరై వివరణ ఇవ్వాలి. సకాలంలో చికిత్స అందకపోవడంతో రోడ్డు ప్రమాదాల్లో దేశవ్యాప్తంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక్కడ.. ఒక్క విషయాన్ని మేం స్పష్టంగా చెప్పదల్చుకున్నాం. ఎటువంటి పురోగతి సాధించలేదని మేం గనుక గుర్తిస్తే కోర్టు ధిక్కార నోటీసులు జారీ చేస్తాం అని జస్టిస్‌ ఓకా సంబంధిత అధికారులను హెచ్చరించారు.రోడ్డుప్రమాదాల సమయంలో ఆ దారిన వెళ్లేవాళ్లు, పోలీసులు,కొన్నిసార్లు ఆస్పత్రులు కూడా ఎవరైనా ముందుకు వస్తారేమో అని ఎదురు చూస్తున్నాయి. ఇది ప్రజల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తోంది అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.ఇదిలా ఉంటే.. 2023 డిసెంబర్‌లో నగదు రహిత చికిత్స (Cashless Treatment) అందించే విషయంలో కేంద్రం తొలి అడుగు వేసింది. ప్రమాదాల్లో (Road Accidents) గాయపడిన బాధితులకు ఉచిత, నగదు రహిత వైద్య చికిత్స అందించడం ఎంవీఏ యాక్టు 2019లో భాగం. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు దీన్ని అమలు చేస్తున్నాయి. అయితే.. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సహకారంతో రోడ్డు రవాణా, హైవే మంత్రిత్వశాఖ దీన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలనుకుంది.రోడ్డు ప్రమాదాలు జరిగిన ప్రాణాంతకంగా ఉన్న సమయంలో.. ప్రత్యేకించి గోల్డెన్‌ అవర్‌ టైంలో రోడ్డు ప్రమాద బాధితుడి ప్రాణాలు రక్షించే చికిత్స కోసం నగదు చెల్లింపులు చేయడానికి ఎవరూ లేనప్పుడు ఈ పథకం వర్తిస్తుంది. క్యాష్‌లెస్‌ ఎమర్జెన్సీ ట్రీట్‌మెంట్‌ స్కీమ్‌ కింద.. రోడ్డు ప్రమాదాలకు గురైన వాళ్ల చికిత్స కోసం ఏడు రోజులకుగానూ లక్షా 5 వేల రూపాయల ఖర్చు భరిస్తుంది. అయితే ఇది ప్రమాదం జరిగిన 24 గంటలలోపు పోలీసులకు తెలియజేస్తేనే!. ఇక..ఆస్పత్రులు మోటార్‌ వెహికిల్స్‌ యాక్ట్ ఫండ్‌ నుంచి ట్రీట్‌మెంట్‌ సొమ్మును‌ రీయింబర్స్‌మెంట్‌ ద్వారా పొందుతాయి. ఇదికాక.. అదనంగా హిట్‌ అండ్‌ రన్‌ కేసుల్లో మరణించిన వాళ్ల కుటుంబాలకు ప్రభుత్వం రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా కూడా అందిస్తుంది. అయితే.. ఏడాదిన్నరగా ఈ పథకాన్ని ఆచరణలో పెట్టాలనే ప్రయత్నాలు మాత్రం ముందుకు సాగడం లేదు. ఈ ఏడాది జనవరి 8వ తేదీన సరైన విధివిధానాలతో ఓ పథకం రూపొందించాలంటూ కేంద్రానికి సుప్రీం కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇదే కాకుండా.. మోటార్‌ వెహికిల్స్‌ యాక్ట్‌(సవరణ చట్టం)లోని సెక్షన్‌ 162(2) ప్రకారం.. ఇన్సూరెన్స్‌ కంపెనీలు కూడా బాధితుల చికిత్సకు అయ్యే ఖర్చును భరించాల్సి ఉంటుంది. కానీ, ఇది కూడా అమలు కావడం లేదని సర్వోన్నత న్యాయస్థానం గుర్తించింది.

Cm Revanth Key Comments On Bjp At Ahmedabad Aicc Meeting3
అహ్మదాబాద్‌ వేదికగా.. ప్రధానిపై సీఎం రేవంత్‌ ఘాటు వ్యాఖ్యలు

అహ్మదాబాద్‌ (గుజరాత్‌): మతాల మధ్య ప్రధాని మోదీ చిచ్చుపెడుతున్నారని.. గాంధీ విధానాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారంటూ అహ్మదాబాద్‌ వేదికగా జరుగుతున్న ఏఐసీసీ ప్లీనరీ సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గాడ్సే సిద్ధాంతాన్ని మోదీ ప్రోత్సహిస్తున్నారని.. ఎట్టిపరిస్థితుల్లోనూ తెలంగాణలో బీజేపీని అడుగుపెట్టనివ్వం అంటూ రేవంత్‌ వ్యాఖ్యానించారు.వచ్చే రోజుల్లో బీజేపీని ఓడించే బాధ్యత కార్యకర్తలు తీసుకోవాలి. దేశంలో కుల గణన చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ. బ్రిటీష్‌ వాళ్లు ఎలా దేశాన్ని లూటీ చేశారో.. బీజేపీ నేతలు కూడా అలానే లూటీ చేస్తున్నారు. బిట్రీష్‌ వాళ్ల కంటే బీజేపీ వాళ్లే ప్రమాదకరం. బ్రిటీష్‌ వాళ్లను తరమికొట్టినట్టే బీజేపీని కూడా ఓడగొట్టాలి. సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చారు.’’ అని రేవంత్‌ చెప్పుకొచ్చారు.

key decision on Union Cabinet meeting today4
Union Cabinet: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

ఢిల్లీ : కార్గో,ఎక్స్‌ప్రెస్,ప్యాసింజర్‌ రైళ్ల రాకపోకల కోసం కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది.ఏపీలోని (చిత్తూరు, తిరుపతి) మీదుగా తమిళనాడు (వెల్లూరు) వరకు వెళ్లే రైల్వే లైన్‌లో మరో అదనపు రైల్వే లైన్‌ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం రూ.1332 కోట్లు ఖర్చు చేయనుంది. బుధవారం కేంద్ర కేబినెట్‌ సమావేశం జరిగింది. కేబినెట్‌ సమావేశంలోని నిర్ణయాలను కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు. తిరుపతి -పాకాల - కాట్పడి మధ్య 104 కిలోమీటర్ల రైల్వే లైన్ డబ్లింగ్‌కు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా రైల్వే శాఖ రూ.1332 కోట్ల రూపాయల ఖర్చుతో డబ్లింగ్ చేయనుంది. తద్వారా 400 గ్రామాలు,14 లక్షల మందికి ప్రయోజనం చేకూరనుంది. తిరుపతికి కనెక్టివిటీ పెరగనుంది. నాలుగు మిలియన్ టన్నుల సరుకు రవాణా ఏడాదికి పెరిగే అవకాశం ఉంది. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో నేరుగా 35 లక్షల పని దినాలతో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలగనున్నాయి’ అని అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు. 👉పీఎంకేఎస్‌వైలో కమాండ్ ఏరియా డెవలప్మెంట్ అండ్ వాటర్ మేనేజ్మెంట్ పథకానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 2025-26 సంవత్సరానికి గాను కమాండ్ ఏరియా అభివృద్ధికి కేంద్రం రూ.1600 కోట్లు ఖర్చు చేయనుంది. Union cabinet approves modernization of Command Area Development and Water Management (M-CADWM) as a sub-scheme of Pradhan Mantri Krishi Sinchayee Yojana (PMKSY) for the period 2025-2026 with an initial total outlay of Rs.1600 crore. pic.twitter.com/SB3g4Mcqoq— ANI (@ANI) April 9, 2025

KSR Comments On Nara Lokesh red Book5
అణచివేతలో.. ఇందిరమ్మకు తీసిపోని లోకేశ్‌‌?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కుమారుడు, మంత్రి నారా లోకేశ్‌ మాటల తీరు, చేష్టలు ప్రజలను భయభ్రాంతులను చేస్తున్నాయి. రాష్ట్ర పరిస్థితులు కూడా 1975 నాటి ఎమర్జెన్సీని తలపిస్తున్నాయి. విపక్ష నేతలందరినీ జైల్లో పెట్టి రాజ్యమేలిన ఇందిరాగాంధీ అప్పట్లోనూ ప్రతిపక్షాలను అభివృద్ధి నిరోధకులుగానే అభివర్ణించారు. పోలీసుల అకృత్యాలకు తట్టుకోలేక ఇతర పార్టీల నేతలు కార్యకర్తలు చాలా మంది అధికార కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఇందిర కుమారుడు సంజయ్ గాంధీ యువజన కాంగ్రెస్ సారథి. ప్రభుత్వాన్ని ఆయనే నడుపుతున్నారా? అనుకునేంత పవర్ ఫుల్‌. కేంద్ర మంత్రి ఒకరు సంజయ్ గాంధీ చెప్పులు మోశారన్న విమర్శలు వచ్చాయంటే పరిస్థితి ఏమిటన్నది అర్థమవుతుంది.మీడియాలో అయితే అంతా భజన వార్తలే ఇవ్వాలి. రామ్‌నాథ్‌ గోయాంకాకు చెందిన ఆంధ్రప్రభ, ఇండియన్ ఎక్స్ ప్రెస్ వంటి పత్రికలే ప్రభుత్వం తప్పులపై విమర్శలతో వార్తలు ఇచ్చేవి. వాటిని కూడా సమాచార శాఖ అధికారులు సెన్సార్ చేసేవారు. దానికి నిరసనగా వార్తల బదులు ఖాళీగా ఉంచి పత్రికలను ముద్రించేవారు. దాదాపు రెండేళ్లపాటు దేశం అంతటా ఇలాంటి పరిస్థితి ఎదుర్కుంది. ఏపీలోనూ ఇప్పుడు ఆ పరిస్థితి పునరావృతమవుతుందా? అన్న భయం కలుగుతోంది. టీడీపీలో చేరకపోతే వైఎస్సార్‌సీపీ నేతలపై ఏదో ఒక కేసు పెట్టి వేధిస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి. ఏ జైలు చూసినా వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు అధికంగా కనిపిస్తున్నారట.ఒకవైపు టీడీపీ ఎమ్మెల్యేలు, ఇతర నేతల అరాచకాలను తట్టుకోవడం కష్టంగా ఉంటోంది. చంద్రబాబు ప్రభుత్వం వారిని నియంత్రించడం లేదు. పోలీసులు పట్టించుకోవడం లేదు. మిగతా నేరాల అదుపు చేయడం సంగతి ఎలా ఉన్నా పోలీసులు బృందాలు, బృందాలుగా ఇతర రాష్ట్రాలకు వెళ్లి వైఎస్సార్‌సీపీ నేతలను అరెస్టు చేసే పనిలో బిజీగా ఉంటున్నారట. ఇదంతా లోకేశ్‌ రెడ్ బుక్ ప్రభావమే. దానిని ఆయన కూడా నిర్ధారిస్తున్నట్లే మాట్లాడుతున్నారు. ప్రాజెక్టులు అడ్డుకుంటే రెడ్ బుక్ లోకి పేరు ఎక్కించి వేధిస్తామని రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ఒక మంత్రి అంటుంటే, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి చేష్టలుడిగి చూస్తుంటే ఏపీలో ప్రజలను రక్షించేదెవరన్న ప్రశ్న వస్తోంది. ప్రస్తుతం ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కన్నా, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ల కన్నా లోకేశ్‌కే అధిక ప్రాధాన్యత లభిస్తోంది. టీడీపీ వారంతా లోకేశ్‌ దృష్టిలో పడితే చాలన్నట్లు వ్యవహరిస్తున్నారు. లోకేశ్‌ జోక్యం చేసుకోని ప్రభుత్వ శాఖ ఉండడం లేదట. వేర్వేరు శాఖల మంత్రులు కూడా ప్రభుత్వ కార్యక్రమాలకు లోకేశ్‌నే ప్రధాన అతిధిగా పిలుస్తూన్నారు.తండ్రి ముఖ్యమంత్రి కాకుంటే, ఈయన మంత్రి అయ్యేవారా? ప్రస్తుతం యువరాజు మాదిరి ఇదంతా తమ సామ్రాజ్యం అన్నట్లు వ్యవహరించ గలిగేవారా?. తన ఆదేశాల మేరకే రెడ్ బుక్ పనిచేస్తోందని, తానే దానికి బాధ్యుడనని మరింత ఓపెన్ గా మాట్లాడుతున్నారంటే చంద్రబాబు ఎంత వీక్ అయింది అర్థమవుతోంది. చంద్రబాబు గతంలో సీఎంగా ఉన్నప్పుడు పాలన ఇంత అధ్వాన్నంగా లేదు. లోకేశ్‌ అండ్ కో ఆదేశాల మేరకు రాజకీయంగా వ్యతిరేక పార్టీ అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ కు చెందిన అనేక మందిపై తప్పుడు కేసులు పెట్టడం, పోలీసు శాఖ దుర్వినియోగం, ఒక కేసులో బెయిల్ వస్తుందని అనుకుంటే మరికొన్ని కేసులు పెట్టి అరెస్టు చేయడం, రాష్ట్రంలో ఆ మూల నుంచి ఈ మూలకు తిప్పడం వంటివి చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని అడ్డం పెట్టుకుని తప్పుడు కేసులు కూడా పెడుతున్నారు. ఏపీలో ఎవరినైనా ఎక్కువగా వేధించాలని అనుకుంటే వెంటనే ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తితో ఒక కేసు పెట్టిస్తున్నారు.నటుడు పోసాని కృష్ణ మురళి వయసును కూడా పరిగణనలోకి తీసుకోకుండా దాదాపు నెల రోజుల పాటు వందల కిలోమీటర్ల దూరం ప్రతి రోజు తిప్పుతూ వేధించారంటే ఈ ప్రభుత్వానికి, ఈ పోలీసులకు అసలు మానవత్వం ఉందా అన్న ప్రశ్న వస్తుంది. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డిపై ఒక ఎస్టీ వ్యక్తితో ఫిర్యాదు చేయించారట. మరో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై కూడా అదే చట్టం పెట్టి బెయిల్ రాకుండా చేయడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు ఏకంగా లోకేశ్‌ నేరుగా రెడ్ బుక్ అంటూ ప్రజలను భయపెడుతున్నారు. ఆయన వైఎస్సార్‌సీపీ వారిని ఉద్దేశించి చెప్పినట్లు కనిపించినా, నిజానికి ఆయన బెదిరించింది ప్రజలనే. ఆయా చోట్ల ప్రాజెక్టులు వచ్చినప్పుడు, స్థానిక ప్రజలు రకరకాల సమస్యలు ఎదుర్కొంటారు. భూముల పరిహారం, కాలుష్యం తదితర సమస్యలు వస్తాయి. వాటిపై ప్రజలు తమ అభిప్రాయాలు చెబుతారు. వారికి రాజకీయ పార్టీలు అండగా ఉంటాయి. ఆ సమస్యలలో వాస్తవమైనవి ఉంటే ప్రభుత్వం జోక్యం చేసుకుని పరిష్కరించాలి. అంతే తప్ప పోలీసులను పెట్టి కొట్టిస్తామని, వేధిస్తామని అన్నట్లుగా రెడ్ బుక్ తో భయపెడతామన్నట్లుగా స్వయానా ఒక మంత్రి మాట్లాడితే ఏమి చేయాలి? అలాంటివి ఎల్లకాలం సాగవన్న సంగతి గుర్తుంచుకోవాలి.ఇక్కడ ఇంకో చిత్రం ఏమిటంటే ప్రస్తుతం లోకేశ్‌ ప్రకాశం జిల్లాలో శంకుస్థాపన చేసిన ప్రాజెక్టు గతంలో జగన్ ప్రభుత్వ కాలంలో మంజూరు అయినదే. రిలయన్స్ కంపెనీ అధినేత ముకేష్ అంబానీ స్వయంగా ఏపీకి వచ్చి జగన్‌తో కలిసి ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. జగన్ పారిశ్రామిక విధానాన్ని మెచ్చుకుంటూ ప్రసంగించారు. అయినా అవేవో తామే తెచ్చినట్లు లోకేశ్‌ బిల్డప్ ఇచ్చుకున్నారు. అలా చేసినంత వరకు ఆక్షేపించనవసరం లేదు. కానీ, ఆ సందర్భంలో కూడా జగన్ టైమ్ లో పరిశ్రమలు వెళ్లిపోయాయని అంటూ అసత్య ప్రచారాలు చేశారు. ఈ విషయంలో తన తండ్రి చంద్రబాబును మించి అబద్దాలు చెప్పాలన్న లక్ష్యంతో ఉన్నట్లుగా మీడియాలో వచ్చిన కథనాలు చూస్తే అర్థం అవుతుంది. జగన్ టైమ్‌లో కర్నూలు వద్ద వచ్చిన గ్రీన్-కో ఎనర్జీ ప్లాంట్‌ను ఎద్దేవా చేసింది లోకేశ్‌ కాదా?. దానిని చెడగొట్టడానికి ఎల్లో మీడియా ఈనాడు ఎన్ని వ్యతిరేక కథనాలు రాసిందీ ఒక్కసారి పాత పత్రికలు తిరగేస్తే తెలుస్తుంది. ఈయన చెప్పినదాని ప్రకారం అయితే ఆ రెడ్ బుక్ ను ప్రయోగించవలసింది వారిపైనే కదా!.అదానీ, తదితరులు రెన్యుబుల్ ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటుకు ముందుకు వస్తే అదానికి రాష్ట్రాన్ని రాసిస్తున్నారని మరో టీడీపీ మీడియా ఆంధ్రజ్యోతి ప్రచారం చేసిందే. తుని వద్ద జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేయతలపెట్టిన బల్క్ డ్రగ్ పార్కుకు అనుమతి ఇవ్వవద్దని లేఖ రాసింది స్వయంగా టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు కాదా?. తాజాగా వచ్చిన ఒక సమాచారం ప్రకారం గురజాల ఎమ్మెల్యే బెదిరింపులతో రెండు సిమెంట్ పరిశ్రమలు మూతపడ్డాయట. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి. జగన్ దావోస్‌ వెళ్లి వేల కోట్ల పెట్టుబడులు తీసుకు వస్తే అవేం కంపెనీలు అంటూ మాట్లాడిన లోకేశ్‌ తాము అధికారంలోకి వచ్చాక ఆర్భాటంగా దావోస్ వెళ్లి ఉత్తచేతులతో తిరిగి వచ్చారే. పైగా పెట్టుబడుల కోసం వెళ్లలేదని, ఏపీ బ్రాండ్ ప్రచారం కోసమని చెప్పుకున్నారే. ఆ తర్వాత ఆరున్నర లక్షల కోట్ల విలువైన పెట్టుబడులతో పరిశ్రమలు పెట్టడానికి ఒప్పందాలు అయ్యాయంటూ, అవేమిటో చెప్పకుండానే ప్రచారం ఆరంభించారే. ఇప్పుడేమో కర్నూలు గ్రీన్ ఎనర్జీ కంపెనీని, కడప ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ తామే తీసుకువచ్చామని చెప్పుకుంటున్నారే. కడపలో ఎలక్ట్రానిక్స్ క్లస్టర్ ను జగన్ తీసుకువస్తే దానిని అమరావతికి తరలించే యత్నం చేశారా? లేదా?.గతంలో జగన్ పాలనలో అనేక పరిశ్రమలు వస్తే వాటికి అడ్డు పడడానికి తెలుగుదేశం కాని, ఎల్లో మీడియా కాని చేయని ప్రయత్నం లేదు. ప్రభుత్వం ఏ స్కీమ్ చేపట్టినా పచ్చి అబద్దాలు ప్రచారం చేసిందీ వీరే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వీరికి బ్యాండ్ వాయించే వారు. ఆ రోజుల్లో జగన్ ప్రభుత్వం కేసులు పెట్టి ఉంటే కొన్ని వందల కేసులు నమోదై ఉండేవి. ఉదాహరణకు యువగళం పేరుతో పాదయాత్ర చేస్తూ లోకేశ్‌ ఎందరిని బెదిరించారో అందరికీ తెలుసు. జిల్లా ఎస్పీలను సైతం పేరుపెట్టి హెచ్చరికలు చేసేవారు. ఇప్పటి మాదిరిగా అడ్డగోలుగా కేసులు పెట్టి ఉంటే లోకేశ్‌పై ఎన్ని కేసులై ఉండేవి. ఇప్పటం వద్ద అనుమతి లేకుండా కారు పైన కూర్చుని పవన్ కళ్యాణ్ హడావుడి చేశారు. మరోసారి రోడ్డుపై అడ్డంగా పడుకుని పోలీసుల విధులకు ఆటంకం కల్పించిన పవన్‌పై ఆ రోజుల్లో కేసులు పెట్టారా? లేదే!.మహిళలు మిస్ అయ్యారని తప్పుడు ఆరోపణ చేసిన పవన్ కళ్యాణ్ పై కేసు పెట్టి ఉండవచ్చు కదా?. అయినా అలా చేయలేదే. చంద్రబాబు, లోకేశ్‌లు అప్పటి సీఎం జగన్‌ను సైకో అంటూ, పలు అభ్యంతరకర పదాలు వాడారా? లేదా?. అయినా వారి మీద కేసులు రాలేదు. కానీ ఇప్పుడు ప్రతి చిన్న విషయానికి పోలీసులు వైఎస్సార్‌సీపీ వారిపై, సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపైన కేసులు పెట్టి హింసిస్తున్నారే!. ఏ రాజ్యాంగం వీటికి అనుమతి ఇస్తుంది?. ఈ విషయంలో ఏపీ హైకోర్టు సైతం పలుమార్లు పోలీసులను హెచ్చరించినా వీరి ధోరణి మారడం లేదు. సూపర్ సిక్స్ హామీల గురించి అడుగుతూ ఒక జూనియర్ లెక్చరర్ ప్రశ్నిస్తే ఆయన వద్ద నాటు సారా దొరికిందని కేసు పెట్టారట. ఇలా ఒకటి కాదు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఉప ఎన్నికలలో పోలీసులను అడ్డం పెట్టుకుని ఎన్ని అరాచకాలకు పాల్పడ్డారో చూశాం.ఇవన్నీ రెడ్ బుక్ లో భాగమేనని లోకేశ్‌ గర్వంగా ఫీల్ అవుతుండవచ్చు. కానీ షాడో సీఎం స్థాయి నుంచి అసలు సీఎం అవ్వాలని ఆశపడుతున్న లోకేశ్‌ నిజంగానే ఆ పదవిలోకి వస్తే రాష్ట్రం ఇంకెంత ఘోరంగా తయారవుతుందో అన్న భయం ప్రజలలో ఏర్పడదా?. నిత్యం అబద్దాలు చెప్పడం కాకుండా, కాస్త నిజాయితీగా మాట్లాడుతూ, హుందాగా వ్యవహరిస్తూ, రెడ్ బుక్ పిచ్చిగోలను వదలి వేయకపోతే రాజకీయంగా లోకేశ్‌కే నష్టం కలుగుతుంది. కక్ష పూరిత రాజకీయాలతోనే అధికారంలో కొనసాగాలనుకుంటే అది ఎల్లకాలం అయ్యే పని కాదని ఎమర్జెన్సీ అనుభవం తెలియచేస్తుంది.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Not Shreyas Navjot Singh Names 24 Year Old As A Miracle After Sachin6
సచిన్‌ టెండుల్కర్‌ తర్వాత అంతటి ‘అద్భుతం’ అతడే!

ప్రియాన్ష్‌ ఆర్య.. 24 ఏళ్ల ఈ ఢిల్లీ కుర్రాడి పేరు క్రికెట్‌ వర్గాల్లో మారుమ్రోగిపోతోంది. చెన్నై సూపర్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో కేవలం 39 బంతుల్లోనే ఈ ఎడమచేతి వాటం బ్యాటర్‌ శతకం బాదాడు. తద్వారా ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యంత వేగంగా సెంచరీ చేసిన అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు.సంచలన ఇన్నింగ్స్‌చెన్నైతో మ్యాచ్‌లో మొత్తంగా 42 బంతులు ఎదుర్కొన్న ప్రియాన్ష్‌ ఆర్య (Priyansh Arya).. ఏడు ఫోర్లు, తొమ్మిది సిక్సర్ల సాయంతో ఏకంగా 103 పరుగులు సాధించాడు. 245కు స్ట్రైక్‌రేటుతో దంచికొట్టి చెన్నైపై పంజాబ్‌ కింగ్స్‌ (Punjab Kings) విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. 88 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును తన సంచలన ఇన్నింగ్స్‌తో గట్టెక్కించిన తీరుపై ప్రశంసల వర్షం కురుస్తోంది.This is what we pay our internet bills for... ❤️pic.twitter.com/mE38MmXFB0— Punjab Kings (@PunjabKingsIPL) April 8, 2025 సచిన్‌ టెండుల్కర్‌ తర్వాత అంతటి ‘అద్భుతం’!ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్‌ నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధు ప్రియాన్ష్‌ ఆర్యను ఆకాశానికెత్తాడు. టీమిండియా దిగ్గజం, బ్యాటింగ్‌ లెజెండ్‌ సచిన్‌ టెండుల్కర్‌ (Sachin Tendulkar) తర్వాత అంతటి అద్భుతాన్ని ఇప్పుడే చూశానంటూ అతడిని కొనియాడాడు. మైదానం నలుదిశలా షాట్లతో హోరెత్తించాడని.. సీఎస్‌కేలో ఉన్న ప్రపంచస్థాయి బౌలర్లను కూడా సమర్థవంతంగా ఎదుర్కొన్న తీరు అమోఘమని ప్రశంసించాడు.‘‘ప్రియాన్ష్‌ ఆర్య... టీమిండియాకు సుదీర్ఘకాలం పాటు ఆడగల సత్తా ఉన్న ఆటగాడు. సచిన్‌ టెండుల్కర్‌ తర్వాత.. విపత్కర పరిస్థితుల్లో అంత గొప్పగా ఆడిన రెండో ఆటగాడు ఇతడే. సచిన్‌ తర్వాత నేను చూసిన అద్భుతం ఇతడే.క్లిష్ట పరిస్థితుల్లో మేటి బౌలర్లను ఎదుర్కొంటూ సెంచరీ చేయడం సామాన్యమైన విషయం కాదు. అది కూడా ఇంచుమించు 250 స్ట్రైక్‌రేటుతో శతక్కొట్టడం ఊహకు అందని విషయం. శ్రేయస్‌ అయ్యర్‌, నేహాల్‌ వధేరా, ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ అవుటైన తర్వాత.. ఒంటిచేత్తో పంజాబ్‌ను ఆదుకున్నాడు.ఆకాశమే హద్దుగాపాయింట్‌, కవర్లు.. ఒక్కటేమిటి మైదానం అన్ని వైపులకు బంతిని తరలిస్తూ సిక్సర్ల వర్షం కురిపించాడు. పతిరణ, జడేజా, అశ్విన్‌, నూర్‌ అహ్మద్‌ వంటి బౌలర్లను ఏమాత్రం లెక్కచేయకుండా ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఓడిపోతుందనుకున్న మ్యాచ్‌లో పంజాబ్‌ను గెలిపించాడు’’ అని నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధు ప్రియాన్ష్‌ ఆర్యపై ప్రశంసల జల్లు కురిపించాడు. సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్న వీడియోలో ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.వరుసగా నాలుగో ఓటమికాగా ముల్లాన్‌పూర్‌ వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన పంజాబ్‌ తొలుత తొలుత బ్యాటింగ్‌ చేసింది. చెన్నై ఆరంభంలోనే వికెట్లు తీసి శుభారంభం అందించినా.. ప్రియాన్ష్‌ ఆర్య (103), శశాంక్‌ సింగ్‌ (52 నాటౌట్‌), మార్కో యాన్సెన్‌ (34 నాటౌట్‌) దంచికొట్టడంతో.. పంజాబ్‌ 20 ఓవర్లలో 219 పరుగులు స్కోరు చేసింది.లక్ష్య ఛేదనలో చెన్నై 201 పరుగులకే పరిమితమైపోయింది. ఓపెనర్లు రచిన్‌ రవీంద్ర (23 బంతుల్లో 36), డెవాన్‌ కాన్వే (49 బంతుల్లో 69 రిటైర్డ్‌ అవుట్‌), శివం దూబే (42), మహేంద్ర సింగ్‌ ధోని (27) ఓ మోస్తరుగా ఆడారు. అయితే, విజయానికి 18 పరుగులు దూరంలో చెన్నై నిలిచిపోయింది. ఇక ఐపీఎల్‌-2025లో చెన్నైకి ఇది వరుసగా నాలుగో ఓటమి కాగా.. పంజాబ్‌ ఇప్పటికి నాలుగింట మూడు గెలిచింది.ఐపీఎల్‌-2025: పంజాబ్‌ వర్సెస్‌ చెన్నై స్కోర్లుపంజాబ్‌: 219/6 (20)చెన్నై: 201/5 (20)ఫలితం: 18 పరుగుల తేడాతో చెన్నైపై పంజాబ్‌ గెలుపుచదవండి: ఎగిరి గంతేసిన ప్రీతి జింటా.. కోపం పట్టలేక ధోని.. రియాక్షన్స్‌ వైరల్‌

Trump Tariffs Row: EAM Jaishankar On India China Relations 7
సానుకూల దిశగా చైనా-భారత్‌ సంబంధాలు

న్యూఢిల్లీ, బీజింగ్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నిర్ణయాలతో ప్రపంచం అతలాకుతలం అవుతోంది. మరీ ముఖ్యంగా సుంకాల విధింపు తర్వాత స్టాక్‌ మార్కెట్లు దారుణంగా నష్టపోతున్నాయి. ఈ క్రమంలో.. భారత్-చైనా సంబంధాలు(India-China Relations) బలపడే దిశగా అడుగులు పడుతుండడం గమనార్హం. తాజాగా ఇరు దేశాల సంబంధాలపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌(Jaishankar) కీలక వ్యాఖ్యలు చేశారు. అవి సానుకూల దిశలో పయనిస్తున్నాయని అన్నారాయన. గతంతో పోలిస్తే ఇరు దేశాల సంబంధాలు మెరుగుపడ్డాయి. అయితే.. రెండు దేశాల సంబంధాలను సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు ఇంకా ఎంతో కృషి చేయాల్సి ఉందనే అభిప్రాయం వ్యక్తంచేశారు.2020లో తూర్పు లడ్డాఖ్‌లోని గల్వాన్‌ లోయ(Galwan Valley)లో ఇరు దేశాల జవాన్ల మధ్య జరిగిన ఘర్షణతో సంబంధాలు దిగజారాయి. తర్వాత సైనిక, దౌత్యపరమైన చర్చల ఫలితంగా కీలక గస్తీ ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. దాని ప్రకారం.. 2020 నాటి యథాస్థితి ఎల్‌ఏసీ వెంబడి ఇక కొనసాగనుంది. ఇరు దేశాల సైనికులు 2020లో గస్తీ నిర్వహించిన పెట్రోలింగ్‌ పాయింట్లకు ఇక స్వేచ్ఛగా వెళ్లొచ్చు.మరోవైపు.. ట్రంప్‌ టారిఫ్‌ల(Trump Tariffs) నేపథ్యంలో తొలిసారి స్పందించిన చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ స్పందించారు. పొరుగుదేశాలతో సంబంధాలు బలోపేతం చేసుకుంటామని ప్రకటించారు. విభేదాలను సామరస్యంగా పరిష్కరించుకుంటామని, సప్లై చైన్‌ వ్యవస్థలను మరింత మెరుగుపరచుకుంటామని అన్నారు.చైనాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ 104 శాతం టారిఫ్‌లు ప్రకటించడం తెలిసిందే. ఈ క్రమంలో.. అమెరికా సుంకాల సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్‌, చైనా జత కట్టాలని న్యూఢిల్లీలోని బీజింగ్‌ ఎంబసీ అధికార ప్రతినిధి యూ జింగ్‌ అభిప్రాయపడ్డారు. ‘‘పరస్పర సహకారం, ప్రయోజనాలపై ఇరు దేశాల ఆర్థిక, వాణిజ్య సంబంధాలు ఆధారపడి ఉన్నాయి. ప్రస్తుతం అమెరికా సుంకాల వేధింపుల కారణంగా అనేక దేశాలు, ముఖ్యంగా పేద దేశాలు.. అభివృద్ధి చెందే హక్కును కోల్పోతున్నాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడేందుకు మన రెండు దేశాలు కలిసి నిలబడాలి’’ అని ఆమె ఒక పోస్ట్‌ చేశారు.

Know how to convert credit card payments into EMIs with SBI Card Flexipay8
క్రెడిట్‌ కార్డ్‌ బిల్లుల భారం.. ఉందిగా ఉపాయం!

ప్రస్తుతం క్రెడిట్‌ కార్డుల (credit card) వినియోగం బాగా పెరిగింది. దీంతో ఖర్చుల మీద నియంత్రణ లేక క్రెడిట్‌ కార్డుల బిల్లులు భారీగా పెరిగిపోతున్నాయి. ఇలా వచ్చిన భారీ మొత్తం బిల్లులను ఒకేసారి కట్టడానికి కార్డుదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇందు కోసమే దేశంలో అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్‌ ఎస్‌బీఐ (SBI) క్రెడిట్‌ కార్డు వినియోగదారుల కోసం ప్రత్యేక ఫీచర్‌ అందుబాటులో ఉంది.క్రెడిట్ కార్డు పెద్ద మొత్తం బిల్లుల నిర్వహరణను ‘ఎస్‌బీఐ కార్డ్ ఫ్లెక్సీపే’ సదుపాయం సులభతరం చేస్తుంది. ఈ ఫీచర్‌ ద్వారా కార్డుదారులు పెద్ద కొనుగోళ్లను సులభమైన నెలవారీ వాయిదాలుగా (EMI) మార్చుకోవచ్చు. తద్వారా ఒకేసారి ఏకమొత్తం చెల్లించాల్సిన ఇబ్బందిని లేకుండా చేసుకోవచ్చు. అసలేంటీ ఎస్‌బీఐ ఫ్లెక్సీపే ఫీచర్.. అర్హత ప్రమాణాలు, ఇతర వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.ఎస్‌బీఐ ఫ్లెక్సీపేఫ్లెక్సీపే అనేది ఎస్‌బీఐ కార్డ్ అందించే ఫీచర్. ఇది మీ లావాదేవీలను సులభమైన వాయిదాలుగా మార్చుకోవడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. రూ.500 లేదా అంతకంటే ఎక్కువ లావాదేవీలను ఈఎంఐలుగా మార్చుకోవచ్చు. ఇది మూడు, ఆరు, తొమ్మిది, 12, 18, 24 నెలలు వంటి రీపేమెంట్ కాలపరిమితి ఎంపికలను అందిస్తుంది.ఇక రూ.30,000 లేదా అంతకంటే ఎక్కువ కొనుగోళ్లకు 36 నెలల ఈఎంఐ ప్లాన్ ఎంచుకోవచ్చు. ఫ్లెక్సీపే కోసం కనీస బుకింగ్ మొత్తం రూ .2,500, అయితే ఇది ఆఫర్ల ఆధారంగా మారవచ్చు. అలాగే, గత 30 రోజుల్లో చేసిన లావాదేవీలను ఫ్లెక్సీగా మార్చుకోవచ్చు. క్రెడిట్‌ కార్డు బిల్లులను ఈఎంఐలను మార్చుకునే ముందు మీ క్రెడిట్ స్కోర్, క్రెడిట్ యుటిలైజేషన్ రేషియోను ఒకసారి చూసుకోవాల్సి ఉంటుంది.ఈఎంఐలుగా మార్చుకోండిలా..ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా వినియోగదారులు తమ ఎస్‌బీఐ కార్డ్ ఆన్‌లైన్ ఖాతాలోకి లాగిన్ అయి, 'ఈఎంఐ అండ్ మోర్' విభాగానికి వెళ్లి 'ఫ్లెక్సీపే' ఎంచుకోవచ్చు. మార్చాలనుకుంటున్న లావాదేవీని, తగిన కాలపరిమితిని ఎంచుకుని అభ్యర్థనను ధృవీకరించండి.అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొన్న ఎస్‌బీఐ కార్డ్ కస్టమర్ సర్వీస్ హెల్ప్‌ లైన్‌కు కూడా కస్టమర్లు కాల్ చేసి కస్టమర్ సపోర్ట్ టీమ్ సహాయంతో ఈఎంఐ మార్పిడిని అభ్యర్థించవచ్చు. వాళ్లు మీకు ప్రక్రియపై మార్గనిర్దేశం చేస్తారు.అలాగే వినియోగదారులు ఎస్‌బీఐ కార్డ్ మొబైల్ యాప్‌లోనూ ఫ్లెక్సీపే ఎంపికను యాక్సెస్ చేయవచ్చు. అవసరమైతే లావాదేవీ మొత్తాన్ని సవరించి, కాలపరిమితిని ఎంచుకుని అప్లయి చేయవచ్చు.

Urvashi Rautela: Iam Best Promoter after Shah Rukh Khan9
షారూఖ్‌ తర్వాత నేనే.. మీరు ఒప్పుకుని తీరాల్సిందే!: ఊర్వశి రౌతేలా

వరుస ఐటం సాంగ్స్‌తో నిత్యం ట్రెండింగ్‌లో ఉంటోంది బాలీవుడ్‌ భామ ఊర్వశి రౌతేలా (Urvashi Rautela). ఇటీవల డాకు మహారాజ్‌ మూవీలో దబిడి దిబిడి పాటతో ఓ ఊపు ఊపేయడంతో పాటు ఆ సినిమాలో చిన్న పాత్రలోనూ యాక్ట్‌ చేసింది. జాట్‌ సినిమాలోనూ టచ్‌ కియా అనే ఐటం సాంగ్‌తో అల్లాడించేసింది. తాజాగా ఊర్వశి మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. కాకపోతే ఈసారి పాట వల్లో, పాత్ర వల్లో కాదు.. తన సెల్ఫ్‌ డబ్బా వల్ల! బాలీవుడ్‌ స్టార్‌ షారూఖ్‌ ఖాన్‌ (Shah Rukh Khan) తర్వాత ఆ రేంజ్‌లో ప్రమోషన్స్‌ చేసేది తానేనని చెప్తోంది. షారూఖ్‌ తర్వాత నేనే..ఈ మేరకు ఓ ఇంటర్వ్యూలో మాటట్లాడుతూ.. నేను ఎప్పుడూ నా పనిగురించే ఆలోచిస్తాను. ఉదాహరణకు సినిమాలు ప్రమోట్‌ చేసే విషయానికి వస్తే షారూఖ్‌ ఖాన్‌ తర్వాత ఆ స్థాయిలో ప్రమోషన్స్‌ చేసేది నేనేనని మీరు ఒప్పుకుని తీరాల్సిందే! హాలీవుడ్‌ మేకర్స్‌ కూడా రేచర్‌ మూడో సీజన్‌ కోసం నన్ను ప్రమోషన్స్‌ చేయమని అడిగారు. కాబట్టి మీరే అర్థం చేసుకోండి.. వీలైతే పొగడండి.. ఇది గర్వపడాల్సిన విషయం. అయినా ఆర్టిస్టులుగా మన సినిమాను మనం ప్రమోట్‌ చేయకపోతే ఇంకెవరు చేస్తారు? అని ప్రశ్నించింది.కావాలనే ఇదంతా..ఆమె వ్యాఖ్యలు విన్న పలువురు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఊర్వశి కావాలనే ఇదంతా చేస్తోంది. తనను ట్రోల్‌ చేస్తే కొంతకారం ఆమె గురించి మాట్లాడుకుంటామని, అలాగైనా వార్తల్లో ఉంటామన్నది ఆమె ప్లాన్‌.. జనం అంతా తన గురించి ఏదో ఒకరకంగా మాట్లాడుకోవాలని ఇలా ప్లాన్‌ చేసింది. ఈమె వ్యాఖ్యలు కాస్త పిచ్చిగా ఉంటాయి కానీ అందులో కూడా ఆత్మస్థైర్యం కనిపిస్తోంది అని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో.. ఈమె మళ్లీ మొదలెట్టిందిరా బాబూ అని తలపట్టుకుంటున్నారు.సినిమా..ఊర్వశి విషయానికి వస్తే.. సింగ్‌ సాబ్‌ ద గ్రేట్‌ సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. సనమ్‌ రే, పాగల్‌పంటి, హేట్‌ స్టోరీ 4, వర్జిన్‌ భానుప్రియ, జహంగీర్‌ నేషనల్‌ యూనివర్సిటీ చిత్రాల్లో నటించింది. హిందీలో పలు ఐటం సాంగ్స్‌ కూడా చేసింది. తెలుగులో బాసూ వేర్‌ ఈజ్‌ ద పార్టీ (వాల్తేర​ వీరయ్య), కల్ట్‌ మామా (స్కంద), మై డియర్‌ మార్కండేయ (బ్రో), వైల్డ్‌ సాలా.. (ఏజెంట్‌) సాంగ్స్‌లో చిందేసింది.చదవండి: అంత డబ్బు ఎన్నటికీ సంపాదించలేవు.. బోరున ఏడ్చేసిన నటి

Now Chandrababu Got Paradala CM Tag Officially10
పరదాల మాటున చంద్రబాబు ఇంటి నిర్మాణానికి భూమి పూజ

అమరావతి, సాక్షి: ఎట్టకేలకు ఏపీలో సొంతింటి నిర్మాణం పనులు చేపట్టారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్ర విభజన తర్వాత నుంచి ఉండవల్లిలోని కరకట్టపై ‘అక్రమ’ నివాసంలో ఆయన నివాసం ఉంటున్న సంగతి తెలిసిందే. వరదలు వచ్చిన ప్రతీసారి ఆ నివాసం మునిగిపోతూ వస్తోంది.బుధవారం ఉదయం వెలగపూడిలో పరదాల మాటున సీఎం చంద్రబాబు నివాసానికి భూమి పూజ జరిగింది. సచివాలయం వెనుక.. ఎమ్మెల్యేల క్వార్టర్ల సమీపంలో ఈ ఇంటి నిర్మాణం చేసుకుంటున్నారాయన. ఇందుకోసం ఐదెకరాల భూమిని కొనుగులు చేశారు. ఈ కార్యక్రమానికి పార్టీ నేతలెవరికీ ఆహ్వానం పంపించలేదు. అలాగే.. ఆ స్థలం వైపుగా ఎవరూ వెళ్లకుండా అధికారులు గ్రీన్‌ పరదాలు ఏర్పాటు చేశారు. ఇవాళ జరిగిన నారా వారి గృహ శంకుస్థాపన మహోత్సవంలో నారా లోకేష్‌ దంపతులు పాల్గొన్నారు. మనవడు దేవాన్ష్‌ను చంద్రబాబు పూజలో కూర్చోబెట్టుకున్నారు. ఇప్పటికే చంద్రబాబుకి హైదరాబాద్‌లో ప్యాలెస్‌లాంటి ఇల్లు ఉంది. మూడు దశాబ్దాలకు పైగా ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలోనూ సొంతిల్లు లేకపోవడంతో ఆ మధ్య బాగా విమర్శలు వచ్చాయి. దీంతో అక్కడా ఇంటి నిర్మాణం చేపట్టారు. ఇప్పుడు సీఎం హోదాలో ఏపీలో కొత్తింటిని నిర్మించుకోబోతున్నారు. ఐదెకరాల భూమిలో.. 25 వేల గజాల్లో హైదరాబాద్‌ ప్యాలెస్‌ను తలదన్నెలా భవనం నిర్మించబోతున్నట్లు సమాచారం.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement