asocham
-
150 బిలియన్ డాలర్లకు ఫిన్‌టెక్ పరిశ్రమ
న్యూఢిల్లీ: భారత ఫిన్‌టెక్ స్టార్టప్‌ల వృద్ధి అసాధారణ స్థాయిలో ఉందని.. ఈ మార్కెట్ 2025 నాటికి 150 బిలియన్ డాలర్ల స్థాయికి (రూ.11.55 లక్షల కోట్లకు) విస్తరిస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి అన్నారు. అసోచా మ్ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడా రు. భారత ఫిన్‌టెక్ రంగం భారీ వృద్ధిని చూస్తోందని.. దేశంలోనే కాకుండా, విదేశీ ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్నట్టు చెప్పారు. ‘‘దేశంలో మెజారిటీ స్టార్టప్‌లు ఏర్పాటై పదేళ్లు కూడా కాలేదు. కానీ గత కొన్నేళ్లుగా ఇవి చూపిస్తున్న వృద్ధి, పనితీరు అద్భుతంగా ఉంది’’అని చెప్పారు. ఫిన్‌టెక్ ఆమోద రేటు అంతర్జాతీయంగా సగటున 64 శాతంగా ఉంటే, ఇది మన దేశంలో 87 శాతంగా ఉన్నట్టు చౌదరి తెలిపారు. ఆధార్ ఆధారిత చెల్లింపుల వ్యవస్థ బ్యాంకింగ్‌లో ఎంతో మార్పునకు దారితీసినట్టు, బ్రిక్ అండ్ మోర్టార్ శాఖల అవసరాన్ని తొలగించినట్టు యూఐడీఏఐ సీఈవో సౌరభ్ గార్గ్ ఇదే కార్యక్రమంలో పేర్కొన్నారు. దేశవ్యాపప్తంగా 50 లక్షల బ్యాంకింగ్ కరస్పాండెంట్లు ఆధార్ ఆధారత వ్యవస్థతో నగదు స్వీకరణ, నగదు చెల్లింపుల లావాదేవీలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. చదవండి: రుణాలపై వడ్డీ రేట్ల బాదుడు షురూ.. ఈ బ్యాంకుల్లో ఎంతంటే? -
దేశంలో విద్యుత్ కష్టాలు పోవాలంటే..ఈ పనిచేయాల్సిందే!
న్యూఢిల్లీ: దేశంలో విద్యుత్ కష్టాలు ప్రత్యేకించి వేసవి కాలంలో తొలగిపోవాలంటే బొగ్గు సుంకం రహిత దిగుమతికి అనుమతించాలని పారిశ్రామిక సంస్థ– అసోచామ్ స్పష్టం చేసింది. దీనితోపాటు బొగ్గు రవాణా చేయడానికి రైల్వే రేక్‌ల లభ్యత భారీగా పెరగాలని, క్యాప్టివ్ జనరేటర్లకు డీజిల్ వేర్వేరు ధరలకు లభ్యమయ్యేలా చూడాలని కోరింది. అసోచామ్ సెక్రటరీ జనరల్ దీపక్ సూద్ ఈ మేరకు చేసిన ప్రకటనలో ముఖ్యాంశాలు... ► విద్యుత్ సరఫరాలో వాణిజ్య వినియోగదారులతో విభేదాలు లేకుండా చూసుకోవాలని మేము రాష్ట్రాలు, డిస్కమ్‌లను కోరతాము. ఇది చాలా కీలకం. ఎందుకంటే మొత్తం ఆర్థిక పునరుద్ధరణ ఉన్నప్పటికీ పారిశ్రామిక ఉత్పత్తిలో వృద్ధి ఇంకా మందగమనంలోనే ఉంది. ► ప్రపంచ సరఫరా పరిమితులు, అంతర్జాతీయ మార్కెట్లో ధరలు భారీగా పెరగడం వల్ల విద్యుత్ ఉత్పత్తి చేసే కంపెనీలు, డిస్కమ్‌లు తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ►ప్రస్తుతం బొగ్గుపై దిగుమతి సుంకం 2.5 శాతం ఉన్నప్పటికీ, ఒత్తిడి పరిస్థితుల దృష్ట్యా ప్రస్తుతానికి సుంకాన్ని రద్దు చేయాలని మేము కోరుతున్నాము. ►భారతదేశానికి ఆస్ట్రేలియా నుంచి ప్రధానంగా బొగ్గు దిగుమతి అవుతోంది. ఇటీవల ఆ దేశంతో భారత్‌కు కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) దేశ మధ్య, దీర్ఘకాలిక బొగ్గు సరఫరాల సమస్య పరిష్కారానికి దోహదపడుతుందని భావిస్తున్నాం. తగిన బొగ్గు సరఫరాలు దేశంలో సకాలంలో అందేలా చర్యలు అవసరం. ►అనేక రాష్ట్రాలు విద్యుత్ కొరతతో కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ సంవత్సరం ప్రారంభంలోనే అదనపు సాధారణ హీట్‌వేవ్ వల్ల పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. ►వర్షాలకు ఇంకా చాలా కాలం ఆగాల్సిన పరిస్థితి. విద్యుత్ సమస్య పరిష్కారానికి కేంద్ర, రాష్ట్రాలు, పరిశ్రమలు సంయుక్తంగా నిరంతరం పర్యవేక్షణతో పరిస్థితిని నిర్వహించాల్సిన ఉంటుంది. ►ఎదురవుతున్న సవాళ్లను అధిగమించడంపై అసోచామ్ ఇప్పటికే సభ్యులపై సంప్రతింపులు జరిపింది. ఆయా అంశాలను ప్రభుత్వానికి విన్నవించడం జరుగుతుంది. ►డిస్కమ్‌ల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడానికి కేంద్రం ప్రారంభించిన విద్యుత్ సంస్కరణలను మరింత వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది. ►ఉత్పాదక సామర్థ్యాన్ని పెంపొందించడంపై కేవలం దృష్టి సారిస్తే సరిపోదు. పంపిణీకి సంబంధించి కంపెనీలు ఎదుర్కొంటున్న సవాళ్లను కేంద్ర, రాష్ట్రాలు పరిష్కరించాలి. అయితే, కేంద్రం ఈ దిశలో అనేక చర్యలతో ముందుకు వస్తోంది. వీటిని అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఇందుకు రాష్ట్రాల సహకారం కూడా అవసరం. ఇప్పటికే ప్రధానికి వినతులు... పరిశ్రమ బొగ్గు కొరత సమస్యలను సత్వరం పరిష్కరించాలని, ఇందుకు తగిన చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీకి పరిశ్రమ వర్గాలు విజ్ఞప్తి చేశాయి. బొగ్గు కొరత వల్ల ఎక్సే్చంజీల నుంచి అధిక రేట్లకు విద్యుత్ కొనుక్కోవాల్సి వస్తోందని పేర్కొన్నాయి. తయారీ, క్యాప్టివ్ విద్యుత్ ప్లాంట్లపై (సీపీపీ) ఆధారపడే సంస్థలు, 10 పరిశ్రమల అసోసియేషన్లు కలిసి ఈ మేరకు ప్రధానికి సంయుక్తంగా ఒక వినతిపత్రం సమర్పించాయి. బొగ్గు సరఫరా సుదీర్ఘ సమయంగా తగ్గిపోవడం వల్ల అల్యుమినియం, సిమెంటు, ఉక్కు తదితర పరిశ్రమలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోందని ఆ వర్గాలు పేర్కొన్నాయి.పరిశ్రమ వర్గాల ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సీపీపీలు, ఉక్కు, సిమెంటు, స్పాంజ్ ఐరన్ వంటి రంగాలకు బొగ్గు సరఫరా 32 శాతం వరకూ తగ్గిపోయింది. -
ప్రజా సంక్షేమమే అంతిమ లక్ష్యం
సాక్షి, అమరావతి : ప్రజల క్షేమం, ప్రజా సంక్షేమమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అంతిమ లక్ష్యమని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అన్నారు. కరోనాకు ముందు కరోనాకు తర్వాత అనేలా పారిశ్రామికాభివృద్ధి మారిందని పేర్కొన్నారు. శనివారం "బియాండ్ ది లాక్డౌన్" (లాక్డౌన్ మరో కోణం) పేరుతో అసోచామ్ నిర్వహించిన ఆన్ లైన్ సమ్మిట్‌లో ఆయన పాల్గొన్నారు. వినూత్న సమ్మేళనానికి శ్రీకారం చుట్టిన అసోచామ్‌కు మంత్రి మేకపాటి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నమ్మకమే జీవితమని, ముందుగా కార్మిక శక్తికి విశ్వాసాన్ని కలిగిస్తామని చెప్పారు. సౌకర్యాలతో కార్మికులకు రక్షణ, కరోనాను ఎదుర్కొంటూ ముందుకెళ్లేలా శిక్షణ ఇస్తామన్నారు. అన్ని వర్గాల్లో ఆత్మవిశ్వాసం నింపి రెట్టించిన ఉత్సాహంతో ముందడుగు వేస్తామని తెలిపారు. ప్రజల రక్షణకు అవసరమైన అన్ని విషయాలపై అవగాహన కలిగిస్తామని చెప్పారు. ఎలాంటి అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కొనేలా ఆత్మస్థైర్యం కలిగించగలిగామని అన్నారు. కరోనా నేపథ్యంలోనూ సంక్షేమ పథకాలు కొనసాగడం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దార్శనికతకు నిదర్శనమని కొనియాడారు. ఆయన తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ‘‘ ఎమ్ఎస్ఎమ్ఈల ప్రాముఖ్యతను గుర్తించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఎమ్ఎస్ఎమ్ఈలకు ఇప్పటికే రూ.905 కోట్ల ప్రోత్సాహక బకాయిలను చెల్లించాం. 14 రోజుల కిందటే ఎమ్ఎస్ఎమ్ఈ రంగానికి 3 నెలల కాలంలో పవర్ డిమాండ్ చార్జీలు రూ.188 కోట్లు మాఫీ చేశాం. సూక్ష్మ,చిన్న తరహా పరిశ్రమల ఆర్థిక పరిపుష్ఠి కోసం బ్యాంకుల గ్యారంటీ ద్వారా సిడ్బీతో ఒప్పందం కుదుర్చుకుని రూ.200కోట్లు అందించే ఏర్పాటు చేశాం. అన్ని వర్గాల ప్రజలకు ఆర్థిక పరిపుష్ఠిని పెంచాం. 2 నెలల కరోనా కాలంలోనూ ఆదర్శనీయ కార్యక్రమాలు చేపట్టాం. అమ్మఒడి, రైతు భరోసాలతో ప్రజల్లో భరోసా కలిగించాం. అత్యధిక కరోనా నిర్ధారణ పరీక్షలు చేసిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ( అపోహలకు చెక్ పెట్టిన ఏపీ సర్కార్ ) వైరస్ ఇన్ఫెక్షన్ రేటును తగ్గించగలిగాం. రెడ్ జోన్లో ఉన్న ప్రాంతాలను ప్రణాళికలతో గ్రీన్ జోన్లుగా మారుస్తున్నాం. వలసకార్మికులకు ఏ లోటు లేకుండా సొంత మనుషుల్లా చూసుకుంటున్నాం. మైళ్ల కొద్దీ నడుస్తున్న వలసకార్మికుల ఆకలితీర్చి గమ్యాలకు చేరుస్తున్నాం. అందివచ్చిన అన్ని అవకాశాలను ఆంధ్రప్రదేశ్ అందిపుచ్చుకుంటుంది. ఐ.టీ, లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించుకుని ప్రజల ఇబ్బందులు తొలగిస్తాం. ఐ.టీ రంగంపై ప్రత్యేక శ్రద్ధ పెడతాం, యువత భాగస్వామ్యంతో ఉరకలెత్తిస్తాం. ప్రజలకు ఏ కష్టం వచ్చినా సహించని ముఖ్యమంత్రే మా బలం’’ అని అన్నారు. -
ఇన్వెస్టర్లు చూస్తున్నారు... జాగ్రత్త
న్యూఢిల్లీ: స్టాక్ ఎక్స్చేంజిల్లో లిస్టయిన కంపెనీలు మంచి కార్పొరేట్ గవర్నెన్స్ ప్రమాణాల్ని పాటించాలని, ఇన్వెస్టర్ల అప్రమత్తత పెరిగిన నేపథ్యంలో కార్పొరేట్లు ఎటువంటి అవకతవకలకు పాల్పడరాదని, కఠినమైన డిస్క్లోజర్ నిబంధనల్ని పాటించాలని పారిశ్రామిక సంఘాల సమాఖ్య అసోచామ్ సూచించింది. కార్పొరేట్ గవర్నెన్స్ పాటించని కార్పొరేట్లను స్టాక్ మార్కెట్ ఇటీవలికాలంలో తీవ్రంగా శిక్షిస్తున్నదని, షేర్‌హోల్డర్ల విలువను పెంచడంపైన ప్రమోటర్లు దృష్టినిలపాలని ఆదివారంనాడు అసోచామ్ విడుదల చేసిన ప్రకటనలో కోరింది. ఎలాంటి ప్రమాణాలు పాటించినా చెల్లుబాటవుతుందనుకునే ప్రమోటర్ల గత పద్దతులకు కాలం చెల్లిందని, ఇన్వెస్టర్ల అవగాహన, అప్రమత్తత పెరగడం ఇందుకు కారణమని, తెలిసి జరిగినా, తెలియక జరిగినా, అవకతవకల్ని ఇన్వెస్టర్లు క్షమించడం లేదని అసోచామ్ హెచ్చరించింది. ఇటీవల కొన్ని కంపెనీల అనుమానాస్పద లావాదేవీల కారణంగా వాటి షేర్ల ధరలు తీవ్ర ఒడిదుడుకులకు లోనై, ఇన్వెస్టర్ల సంపదను హరించివేసిన వైనాన్ని అసోచామ్ గుర్తుచేసింది. మార్కెట్లో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు, దేశీయ మ్యూచువల్ ఫండ్స్ విస్తరించిన నేపథ్యంలో చిన్న పొరపాటు కన్పించినా, అవకతవకగా అన్పించినా, షేరు ధర నిలువునా పతనమై, సంపద హరించుకుపోతున్నందున...కార్పొరేట్లు అత్యంత జాగరూకతతో వుండాలని అంతర్జాతీయ కార్పొరేట్ గవర్నెన్స్ ప్రమాణాలు పాటించాలని అసోచామ్ ప్రధాన కార్యదర్శి డీఎస్ రావత్ హితవు పలికారు. -
వ్యవస్థలను బలోపేతం చేసుకోవాలి
ముంబై: పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ) స్కామ్ ఆర్థిక వ్యవస్థలో భయాందోళనకు, అచేతనానికి దారితీయరాదని ఫిక్కీ సూచించింది. ఈ విధమైన పరిస్థితి ఏర్పడకుండా చూడాలని ఆర్బీఐ, ప్రభుత్వాలకు లేఖ రాసినట్టు ఫిక్కీ ప్రెసిడెంట్ రషేష్ షా తెలిపారు. షా ఎడెల్వీజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చైర్మన్‌గానూ వ్యవహరిస్తున్నారు. పీఎన్బీ స్కామ్ యూపీఏ–2 హయాంలోని చివరి రోజులను గుర్తు చేస్తోందని, నాడు సీబీఐ, సీవీసీ, కాగ్ అంటే భయం ఉండేదని షా పేర్కొన్నారు. ఈ తరహా స్కామ్‌ల తో బ్యాంకింగ్ వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందన్న ఆయన, 1992లో హర్షద్ మెహతా స్కామ్, 2001లో కేతన్ పరేఖ్ స్కామ్‌ల తర్వాత పరిస్థితిని గుర్తు చేశారు. పీఎన్బీ స్కామ్‌ను వ్యవస్థల బలోపేతా నికి అవకాశంగా సూచించారు. రుణాలపై ప్రభావం పడరాదు పీఎన్బీ స్కామ్‌తో దర్యాప్తు సంస్థలు, బ్యాంకులు అతిగా స్పందించడం వల్ల వాణిజ్య, పారిశ్రామిక రంగాలకు రుణాల జారీపై ప్రభావం పడుతుందని అసోచామ్ హెచ్చరించింది. బ్యాంకులు, నియంత్రణ సంస్థలు, ప్రభుత్వ చర్యలు నష్టాన్ని పరిమితం చేసే విధంగా ఉండాలని సూచించింది. ‘‘కుంభకోణాలు బయటకు వచ్చాక, మీడియాలో ప్రముఖంగా వార్తలు రావడంతో ఈ స్థాయి హడావిడి సాధారణమే. కానీ, ఇది బ్యాంకుల విశ్వాసానికి విఘాతం కలిగిస్తుంది. కనుక ఎంతో నిగ్రహంతో ఈ సందర్భాన్ని ఓ అవకాశంగా భావించి వ్యవస్థాపరమైన సమస్యల పరిష్కారానికి వినియోగించుకోవాలి’’ అని అసోచామ్ సెక్రటరీ జనరల్ డీఎస్ రావత్ సూచించారు. -
బ్యాంకుల్లో కేంద్రం వాటా తగ్గించుకోవాలి
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకు (పీఎస్బీ)ల్లో కేంద్రం తనకున్న వాటాను 50 శాతం లోపునకు తగ్గించుకోవాలని అసోచామ్ సూచించింది. పీఎన్బీలో బయటపడిన రూ.11,400 కోట్ల కుంభకోణం వాటా తగ్గింపునకు బలమైన సంకేతంగా పేర్కొంది. వాటాదారులకు జవాబుదారీగా, డిపాజిటర్ల ప్రయోజనాల పరిరక్షణ కోణంలో, ప్రైవేటు బ్యాంకుల మాదిరిగా పనిచేసేలా ప్రభుత్వరంగ బ్యాంకులను అనుమతించాలని అసోచామ్ సూచించింది. ‘‘చారిత్రకంగా చూస్తే ప్రభుత్వరంగ బ్యాంకులు ఒక సంక్షోభం తర్వాత ఒక సంక్షోభం ఎదుర్కొంటున్నాయి. వీటిలో ప్రభుత్వం ప్రధాన వాటాదారుగా ఉన్నప్పటికీ పన్ను చెల్లింపులదారుల డబ్బుతో వీటిని ఒడ్డున పడేసే విషయంలో ఒక పరిమితి అంటూ ఉంది’’అని అసోచామ్ తన ప్రకటనలో పేర్కొంది. బ్యాంకుల్లో ఉన్నత పదవులను ప్రభుత్వ ఉద్యోగాలకు కొనసాగింపుగా భావించే పరిస్థితి కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. ప్రభుత్వం తన వాటాను 50 శాతం లోపునకు తగ్గించుకుంటే, వాటికి మరింత స్వతంత్రతతోపాటు సీనియర్ మేనేజ్మెంట్లో బాధ్యత, జవాబుదారీతనం పెరుగుతాయని అసోచామ్ సూచించింది. -
రేట్ల పెంపునకు ఆర్బీఐ దూరంగా ఉండాలి
న్యూఢిల్లీ: ఆర్బీఐ బాండ్ల మార్కెట్లో అధిక ఈల్డింగ్ ఒత్తిళ్లకు అతిగా స్పందించొద్దని, ఈ నెల 7న జరిగే మానిటరీ కమిటీ పాలసీ సమీక్షలో రేట్ల పెంపు నిర్ణయానికి దూరంగా ఉండాలని పారిశ్రామిక సంఘం అసోచామ్ కోరింది. ‘‘రానున్న ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యలోటు 3.3%గా పేర్కొనడం అన్నది క్లిష్టమైనది. బాండ్ల మార్కెట్‌కు సంబంధించిన ప్రతికూలతలు త్వరలోనే తేలికపడతాయి’’ అని అసోచామ్ బడ్జెట్ అనంతరం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. కనీస మద్దతు ధర వల్ల రిటైల్ ద్రవ్యోల్బణం పెరిగిపోతుందన్నది అతిశయోక్తిగా అభివర్ణించింది. కూరగాయలకు క్షేత్ర స్థాయిలో ఎటువంటి కనీస మద్దతు ధర లేని విషయాన్ని గుర్తు చేసింది. ‘‘కనీస మద్దతు ధరను గణనీయంగా పెంచుతామన్న కేంద్రం హామీ లు, బాండ్ల మార్కెట్లో రాబడులకు ఆర్బీఐ అతిగా స్పందించకూడదు. ఫిబ్రవరి 7న జరిగే మానిటరీ పాలసీ కమిటీ సమావేశంలో ఏ విధమైన రేట్ల పెంపునకు కూడా దూరంగా ఉండాలి’’ అని అసోచామ్ సూచించింది. కనీస మద్దతు ధర నిర్ణయంలో రైతుల ప్రయోజనాలు, రిటైల్ ధరలను యంత్రాంగం దృష్టిలోకి తీసుకుని సమతూకం పాటిస్తుందని, ఈ విషయంలో ఏదైనా తక్షణ ఆందోళన అనేది అతియేనని, పాలసీ రేట్ల నిర్ణయంలో ఆర్బీఐ వీటిని పరిగణనలోకి తీసుకోరాదని పేర్కొంది. స్టాక్ మార్కెట్లో కరెక్షన్ అన్నది ఆరోగ్యకరంగా అభివర్ణించింది. -
వచ్చే ఏడాది వృద్ధి రేటు 7 శాతానికి
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది దేశ ఆర్థికాభివృద్ధిరేటు 7 శాతానికి చేరుతుందని అసోచామ్ అంచనా వేసింది. 2019 ఎన్నికలకు ముందు బడ్జెట్ కావడంతో కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల దృష్టితో విధానాలు ప్రవేశపెట్టే అవకాశం ఉండటమే ఇందుకు కారణంగా పేర్కొంది. ‘‘2017–18 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం (ఈ ఏడాది జూలై–సెప్టెంబర్)లో 6.3 శాతంగా ఉన్న జీడీపీ వృద్ధి, 2018 సెప్టెంబర్ నాటికి కీలకమైన 7 శాతం మార్కును చేరుకుంటుంది. ద్రవ్యోల్బణం 4–5.5 శాతం మధ్య వచ్చే ఏడాది సెప్టెంబర్ త్రైమాసికంలో ఉండొచ్చు’’ అని అసోచామ్ రానున్న సంవత్సరంపై తన అంచనాలను నివేదిక రూపంలో వెల్లడించింది. ప్రభుత్వ పాలసీల్లో స్థిరత్వం, మంచి వర్షాలు, పారిశ్రామిక రంగం కార్యకలాపాలు పుంజుకోవడం, స్థిరమైన విదేశీ మారకం రేట్లు తదితర అంచనాల ఆధారంగా చేసుకుని జీడీపీ 7 శాతంగా ఉంటుందని పేర్కొంటున్నట్టు తెలిపింది. రానున్న బడ్జెట్ ప్రధానంగా రైతులు, ఉద్యోగాలు కల్పించే పారిశ్రామిక రంగాలను ముందుకు తీసుకెళ్లేదిగా ఉంటుందని అంచనా వేసింది. గ్రామీణ ఆర్థిక రంగంలో సంస్కరణలు లేకపోవడమే వ్యవసాయ రంగం ఒత్తిళ్లలో ఉండటానికి కారణంగా పేర్కొంది. ‘‘రాజకీయపరమైన హామీలిచ్చినప్పటికీ వ్యయసాయ ఉత్పాదక మార్కెటింగ్ కమిటీ చట్టాన్ని ఇంత వరకు సంస్కరించలేదు. దీంతో రైతులు తమ ఉత్పత్తులను దళారులు చెప్పిన రేటుకే అమ్ముకునేలా నియంత్రిస్తోంది. వ్యవసాయ ఉత్పాదనలకు సంబంధించి రైతులు సరైన ధరలు పొందేలా దిగుమతి, ఎగుమతి విధానాలను మరోసారి సమీక్షించాలి’’ అని అసోచామ్ సూచించింది. స్టాక్ మార్కెట్లలో ఉన్న బుల్లిష్ సెంటిమెంట్ 2018లోనూ కొనసాగుతుందన్న అంచనాను ప్రకటించింది. 7.5 శాతానికి చేరుతుంది: నోమురా భారత ఆర్థిక రంగం జనవరి–మార్చి క్వార్టర్లో వేగంగా కోలుకుంటుందని, 2018 సంవత్సరానికి జీడీపీ వృద్ధి 7.5%గా నమోదవుతుందని అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థ నోమురా తెలిపింది. వృద్ధి పరంగా ఈ ఏడాది అక్టోబర్–డిసెంబర్లో స్థిరీకరణ చోటు చేసుకోవచ్చని, ఆ తర్వాత జనవరి–మార్చి త్రైమాసికంలో వేగంగా పుంజుకుంటుందని తెలిపింది. రీమోనిటైజేషన్ (వ్యవస్థలో నగదు విడుదల), అంతర్జాతీయ డిమాండ్ మెరుగుపడటం ఇందుకు చోదకాలుగా నోమురా తెలిపింది. -
ఒత్తిడిని ఓడించలేక...
సాక్షి, బెంగళూరు: ఇంటా, బయటా పనుల హడావుడిలో గజిబిజి జీవితాన్ని సాగిస్తున్న నేటి తరం మహిళలు పనిఒత్తిళ్ల కారణంగా తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ కారణంగానే ఉద్యోగినుల్లో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తున్నాయని అసోచామ్ సంస్థ ఇటివల నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. అసోచామ్ సంస్థ తన సర్వేలో భాగంగా బెంగళూరు నగరంలో అటు గృహిణిగా, ఇటు ఉద్యోగినిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న మహిళలపై సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో మహిళల ఆరోగ్యానికి సంబంధించిన ఆందోళన కలిగించే కొన్ని విషయాలు వెల్లడయ్యాయి. లైఫ్ సైటల్ డిసీజెస్ అధికం... సర్వేలో భాగంగా నగరంలోని వివిధ కార్పొరేట్ సంస్థల్లో పనిచేస్తున్న 2,800 మంది ఉద్యోగినుల వివరాలను సేకరించారు. వీరిలో దాదాపు 75 శాతం మంది ఉద్యోగినులు వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా 32 నుండి 58 ఏళ్ల మధ్య వయస్సున్న మహిళల్లో ఈ సమస్య మరింత అధికంగా ఉంది. ముఖ్యంగా వీరంతా ఒబేసిటీ, డయాబిటీస్, హైపర్‌టెన్షన్ వంటి లైఫ్ సైటల్ డిసీజెస్‌తో పాటు వెన్నెముకలో నొప్పి, గుండె, కిడ్నీ తదితర సమస్యలతో బాధపడుతున్నారు. ఇక సరిగా ఆహారం తీసుకోకపోవడం వల్ల కాల్షియం కొరత, రక్తహీనతతో బాధపడే వారి సంఖ్య కూడా అధికంగానే ఉంది. ఉద్యోగినుల్లో ఇంతమంది వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడడానికి కారణాలు తెలుసుకుంటే మనకు ఆశ్చర్యం వేయక మానదు. ఎందుకంటే వీరంతా కనీసం డాక్టర్‌ను కలిసేందుకు కూడా సమయం లేక ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారని అసోచామ్ సర్వే వెల్లడించింది. ఇక మరికొంతమందేమో తమ ఆరోగ్య సమస్యలకు ఇంటి వైద్యాన్నే ఆశ్రయిస్తున్నారు. కాగా ఇంటిని నడిపేందుకు తాము ఉద్యోగం చేయాల్సి వస్తోందని, వైద్యం చాలా ఖరీదవుతున్న ప్రస్తుత రోజుల్లో తాము వైద్య పరీక్షల కోసం ప్రతిసారీ డబ్బు వెచ్చించడం అంటే కష్టమని మరికొందరు మహిళలు ఈ సర్వేలో తెలిపారు. భయం కూడా ఒక కారణమే... ఉద్యోగినులు ఇలా ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకోవడానికి గల ప్రముఖ కారణాల్లో ఉద్యోగ భయం కూడా ఒకటని అసోచామ్ నివేదిక వెల్లడించింది. నగరంలోని వివిధ కార్పొరేట్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగినుల్లో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటోంది. సరైన సమయానికి తిండి, సరైన పనివేళలు కూడా కార్పొరేట్ సంస్థల్లో కనిపించడం లేదంటే నమ్మకతప్పదు. ఇక ఉద్యోగ బాధ్యతల్లో ఇచ్చిన లక్ష్యాలను అందరికన్నా ముందుగా పూర్తి చేయాలని, లేదంటే తమ ఉద్యోగాలను ఎక్కడ కోల్పోవాల్సి వస్తుందో అనే భయం మహిళలను వెంటాడుతోంది. అందుకే తమ ఆరోగ్యాన్ని ఏ మాత్రం పట్టించుకోకుండా అటు ఇళ్లు, ఇటు ఆఫీసు పనులతో నిత్యం సతమతమవుతున్నారు. దీంతో వారిలో శారీరక సమస్యలతో పాటు మానసిక సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. వైద్య పరీక్షలను నిర్లక్ష్యం చేయవద్దు... సాధారణంగా ఒక గృహిణిగా ఉండడంతో పాటు ఉద్యోగ బాధ్యతలు కూడా నిర్వర్తించే మగువల్లో ఆరోగ్య సమస్యలు ఎక్కువగా తలెత్తే ప్రమాదం ఉంటుంది. అది కూడా 30 ఏళ్లు దాటితే ఈ సమస్య మరింతగా పెరుగుతుంది. అందుకే ఏడాదికోసారి తప్పనిసరిగా మహిళలు వైద్య పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. తరచూ వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా స్తన, గర్భాశయ క్యాన్సర్లను చాలా వరకు నిరోధించవచ్చు. ఇక ఎంత పని ఒత్తిడితో ఉన్నా కూడా సరైన సమయానికి ఆహారం తీసుకోవడం, తగినంత విశ్రాంతి తీసుకోవడం ద్వారా లైఫ్సైటల్ డిసీజెస్‌ను అరికట్టవచ్చు. ఇంటిని నడిపే మహిళ ఆరోగ్యంలో సమస్యలు తలెత్తితే ఆ ప్రభావం కుటుంబమంతటిపైనా పడుతుందని మరిచిపోవద్దు. -డాక్టర్ ఫాతిమా, కర్ణాటక క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ప్రతినిధి -
‘బి’ స్కూల్ విద్యార్థులకు కొలువులేవీ?
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు తదితర అంశాల కారణంగా బి–కేటగిరీకి చెందిన బిజినెస్ స్కూల్స్ విద్యార్థులకు కొలువులు దొరకడం కష్టంగా మారుతోంది. కేవలం 20 శాతం విద్యార్థులకే ఉద్యోగాలు లభిస్తున్నాయి. పరిశ్రమల సమాఖ్య అసోచామ్ అధ్యయనంలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. డీమోనిటైజేషన్, వ్యాపార సెంటిమెంట్ అంతంతమాత్రంగా ఉండటం, కొత్త ప్రాజెక్టులు నిల్చిపోవడం మొదలైనవి ఇందుకు కారణంగా ఉంటున్నాయని అసోచామ్ నివేదికలో పేర్కొంది. క్యాంపస్ నియామకాలు గతేడాది కన్నా ఈ ఏడాది మరింత భారీగా క్షీణించిందని వివరించింది. ఇక ఈ విభాగం బిజినెస్ స్కూల్స్, ఇంజినీరింగ్ కాలేజీల విద్యార్థులకు ఆఫర్ చేసే ప్యాకేజీలు కూడా గతేడాదితో పోలిస్తే 40–45 శాతం తక్కువగా ఉంటున్నాయని వివరించింది. లక్షలు పోసి మూడు–నాలుగేళ్ల పాటు బిజినెస్ కోర్సులు చేయాలంటే చాలా మంది విద్యార్థులు, చదివించేందుకు తల్లిదండ్రులు పునరాలోచిస్తున్నారని అసోచాం ఎడ్యుకేషన్ కౌన్సిల్ (ఏఈసీ) పేర్కొంది. -
128 బిలియన్ డాలర్లకి డిజిటల్ కామర్స్ మార్కెట్
న్యూఢిల్లీ: భారత డిజిటలఖ కామర్స్ మార్కెటఖ 2017 నాటికి 128 బిలియన్ డాలర్లకు చేరుతుందని అసోచావఖు, డెలాయిట్ సంస్థలు అంచనా వేశాయి. డిజిటల్ కామర్స్ మార్కెట్ పెరుగుదలకు మొబైల్ వినియోగ వృద్ధి, ఇంటర్నెటఖ వ్యాప్తి, మొబైలఖ-కామర్స్ అమ్మకాలు, అడ్వానఖ్సడ్ షిప్పింగ్ అండ్ పేమెంటఖ ఆప్షనఖ్స, డిస్కౌంట్లు వంటి తదితర అంశాలు గణనీయంగా దోహదపడతాయని వివరించాయి. అసోచావఖు-డెలాయిట్ సంయుక్త సర్వే ప్రకారం.. ప్రస్తుతం 42 బిలియన్ డాలర్లుగా ఉన్న డిజిటల్ కామర్స్ మార్కెటఖ 2017లో 128 బిలియన్ డాలర్లకు పెరగనుంది. ఈ-కామర్స్ కంపెనీలు వాటి వ్యూహాలను పక్కాగా అమలు చేయడానికి, కస్టమర్ల అవసరాలను గుర్తించడం కోసం సోషల్ మీడియాలో కమ్యూనిటీలను ఏర్పాటు చేసుకుంటున్నాయని సర్వే తెలిపింది. ఇనఖఫ్రాస్ట్రక్చర్ వృద్ధి అంతంత మాత్రంగా ఉన్న భారతఖలో మారుమూల ప్రదేశాలకు కూడా వస్తువులను సరఫరా చేయడం కష్టమని, సప్లై చైన్, లాజిస్టిక్స్ విభాగాలు చాలా ఒత్తిడికి గురికావాల్సి ఉంటుందని అసోచావఖు సెక్రటరీ జనరల్ డి ?స రావత్ తెలిపారు. దేశంలో ఈ-బిజినె?సకు సంబంధించిన పన్ను అంశాలు స్పష్టంగా లేవని, దీనిపై పురోగతి రావాల్సి ఉందన్నారు. డి జిటలఖ మార్కెటఖ వృద్ధికి ప్రభుత్వపు డిజిటలఖ ఇండియా కార్యక్రమం దోహదపడుతుందని చెప్పారు.