Assembly electons
-
Lok sabha elections 2024: అరుణాచల్‌లో ఆమె ప్రాతినిధ్యమేది?
ఈటానగర్: చట్టసభల్లో మహిళా ప్రాతినిధ్యం విషయంలో అరుణాచల్ ప్రదేశ్ అందుకు మినహాయింపేమీ కాదు. రెండు లోక్‌సభ స్థానాలతో పాటు రాష్ట్రంలో 50 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఏకకాలంలో ఏప్రిల్ 19న ఎన్నికలు జరగననున్నాయి. కానీ ఈ ఈశాన్య రాష్ట్రంలో ఎన్నికల బరిలో దిగిన మహిళల సంఖ్య మాత్రం అంతంతే... ఇప్పటివరకు 15 మంది... అరుణాచల్ ఈస్ట్, అరుణాచల్ వెస్ట్ రెండు లోక్‌సభ స్థానాలకు మొత్తం 14 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా.. గణ సురక్ష పారీ్టకి ప్రాతినిధ్యం వహిస్తున్న టోకో శీతల్ ఒక్కరే మహిళ. 50 అసెంబ్లీ స్థానాలకు ఎనిమిది మంది మహిళలు మాత్రమే నామినేషన్లు వేశారు. వారిలో అధికార బీజేపీ నుంచి నలుగురు, కాంగ్రెస్ నుంచి ముగ్గురు కాగా ఒకరు ఇండిపెండెంట్. వీరిలో హయులియాంగ్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి దా సంగ్లు పుల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1987లో అరుణాచల్ ప్రదేశ్ పూర్తిస్థాయి రాష్ట్రంగా ఏర్పడినప్పటి నుంచి కేవలం 15 మంది మహిళలు మాత్రమే అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఇప్పటివరకు రాష్ట్రం నుంచి ఒక మహిళ మాత్రమే రాజ్యసభలో ప్రాతినిధ్యం వహించారు. సిబో కైను 1978లో అసెంబ్లీకి గవర్నర్ నామినేట్ చేశారు. పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ (పీపీఏ) అభ్యర్థిగా సెప్పా నియోజకవర్గం నుంచి 1980లో అసెంబ్లీకి ఎన్నికైన మొదటి మహిళ న్యారీ వెల్లి. కోమోలి మొసాంగ్ 1980లో నాంపాంగ్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యరి్థగా ఎన్నికయ్యారు. 1990లో కాంగ్రెస్ అభ్యర్థిగా తిరిగి ఆమె విజయం సాధించారు. ఒమేమ్ మోయోంగ్ డియోరీ 1984లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1990లో కాంగ్రెస్ టిక్కెట్‌పై లేకాంగ్ అసెంబ్లీ స్థానం నుంచి కూడా గెలుపొందారు. బలమైన గొంతుకలు కావాలి.. సాంస్కృతిక అడ్డంకులు, సామాజిక–ఆర్థిక పరిమితులు, అవగాహన లేమి వంటి అనేక అంశాలు ఎన్నికల రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యాన్ని ప్రభావితం చేస్తున్నాయనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. రాజకీయ ప్రక్రియలో మహిళల ప్రమేయాన్ని ప్రోత్సహించే వాతావరణాన్ని సృష్టించేందుకు ప్రభుత్వం, పౌర సమాజ సంస్థల సమష్టి కృషి అవసరమని అరుణాచల్ ప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ కెంజుమ్ పాకం అన్నారు. రాజకీయాల్లో మహిళలకు రిజర్వేషన్లపై చట్టాన్ని వీలైనంత త్వరగా అమలు చేయాలని రాజీవ్ గాంధీ విశ్వవిద్యాలయంలో రాజనీతి శాస్త్ర అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ నాని బాత్ సూచించారు. అప్పుడే అరుణాచల్ వంటి చోట్ల వారికి ప్రాతినిధ్యం దక్కుతుందన్నారు. -
Rajasthan Elections 2023: స్టయిల్ మారింది!
మూడేళ్ల నాటి విఫల తిరుగుబాటు. సీఎం కుర్చీలో ఉన్న ప్రత్యర్థి నుంచి చీటికీ మాటికీ సూటిపోటి మాటలు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అన్నీ తానై వ్యవహరించినా ఈసారి మాత్రం ప్రచారంతో సహా ఎందులోనూ పెద్దగా ప్రాధాన్యం దక్కని వైనం. అన్నింటినీ ఓపికగా సహిస్తూ సాగుతున్నారు రాజస్తాన్ కాంగ్రెస్ నేత సచిన్ పైలట్. అసమ్మతి నేతగా ముద్ర తప్ప తిరుగుబాటుతో సాధించిందేమీ లేకపోవడంతో ఈ యువ నేత తెలివిగా రూటు మార్చారు. అసమ్మతి రాగాలకు, సొంత ప్రభుత్వంపై విమర్శలకు ఫుల్స్టాప్ పెట్టారు. అవకాశం చిక్కినప్పుడల్లా అధిష్టానానికి విధేయతను చాటుకుంటూ వస్తున్నారు. విధేయత, వెయిటింగ్ గేమ్ అంతిమంగా తనను అందలమెక్కిస్తాయని ఆశిస్తున్నారు... రాజస్తాన్‌లో 2018 అసెంబ్లీ ఎన్నికల వేళ పీసీసీ చీఫ్‌గా పార్టీ బరువు బాధ్యతలన్నింటినీ తన భుజాలపై మోశారు పైలట్. అన్నీ తానై వ్యవహరించి పార్టీని విజయ తీరాలకు చేర్చారు. ఆయనే సీఎం అని అంతా భావించారు. కానీ అధిష్టానం మాత్రం అనూహ్యంగా సీనియర్ అశోక్ గహ్లోత్‌కే పట్టం కట్టింది. కొంతకాలం తర్వాత చాన్సిస్తామన్న అధిష్టానం మాట తప్పడంతో పైలట్ ఆగ్రహించి 21 మంది ఎమ్మెల్యేలతో పైలట్ తిరుగుబాటుకు దిగడం, అగ్ర నేత రాహుల్‌గాంధీ జోక్యంతో వెనక్కు తగ్గడం చకచకా జరిగిపోయాయి. డిప్యూటీ సీఎంగిరీ, పీసీసీ చీఫ్ పదవి రెండూ ఊడటం మినహా ఆయన సాధించిందంటూ ఏమీ లేకపోయింది. అయినా వెనక్కు తగ్గలేదాయన. గహ్లోత్ ప్రభుత్వంపై బాహాటంగానే విమర్శలు ఎక్కుపెట్టడం, ధిక్కార స్వరం విని్పంచడం వంటివి చేస్తూనే వచ్చారు. ఈ ఏడాది మొదట్లో ఏకంగా సొంత ప్రభుత్వ పనితీరునే విమర్శిస్తూ ధర్నాకు దిగడమే గాక పాదయాత్ర తలపెట్టి సంచలనం సృష్టించారు. తీరు మారింది... కానీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ పైలట్ తీరే పూర్తిగా మారిపోయింది. ఒక్కమాటలో చెప్పాలంటే సహనమూర్తిగా మారారు. ప్రచారంలో తనకు ముఖ్య బాధ్యతలేవీ అప్పగించకపోయినా పెద్దగా పట్టించుకోలేదు. పైగా గహ్లోత్ సర్కారుపై బీజేపీ విమర్శలను పైలట్ దీటుగా తిప్పికొడుతూ కాంగ్రెస్ నేతలనే ఆశ్చర్యపరుస్తున్నారు! అంతేగాక ఇటీవల గహ్లోత్ కుమారుడికి ఈడీ సమన్లను, పీసీసీ చీఫ్ గోవింద్‌సింగ్ నివాసంపై ఈడీ దాడులను కూడా పైలట్ తీవ్రంగా ఖండించారు. గహ్లోత్‌పై విమర్శలు, ఆరోపణలకు పూర్తిగా ఫుల్స్టాపే పెట్టడమే గాక ఆయనతో కలిసి పని చేసేందుకు సిద్ధమని సంకేతాలిచ్చారు. వాటిని గహ్లోత్ పట్టించుకోకపోయినా, చాన్స్ దొరికినప్పుడల్లా తనకు చురకలు వేస్తున్నా, పార్టీ పట్ల తన చిత్తశుద్ధిని పదేపదే ప్రశి్నస్తున్నా వ్యూహాత్మక మౌనాన్నే ఆశ్రయిస్తున్నారు. ఎన్నికల ప్రచారమంతా గహ్లోత్ వన్ మ్యాన్ షోగానే సాగుతున్నా ఇదేమని ప్రశ్నించడం లేదు. పార్టీ గెలిస్తే సీఎం పదవి డిమాండ్ చేస్తారా అని ప్రశ్నించినా అది అధిష్టానం తీసుకోవాల్సిన నిర్ణయమని ఆచితూచి బదులిస్తున్నారు. అదే సమయంలో, వ్యక్తిగత ప్రతిష్ట కోసం సీఎం కావాలన్న దుగ్ధ తనకు లేదంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేస్తున్నారు. తద్వారా ఇటు గహ్లోత్‌కు, అటు అధిష్టానానికి ఇవ్వాల్సిన సంకేతాలు స్పష్టంగానే ఇస్తున్నారన్నది పరిశీలకుల అభిప్రాయం. ఫలిస్తున్న వ్యూహం! పైలట్ విధేయత వ్యూహం బాగానే ఫలిస్తోందంటున్నారు. గాంధీ త్రయం సోనియా, రాహుల్, ప్రియాంక కొద్ది రోజులుగా ఆయన అభిప్రాయానికి బాగా విలువ ఇస్తున్నారని పీసీసీ వర్గాలు కూడా అంగీకరిస్తున్నాయి. పైలట్ విధేయత, గహ్లోత్ గతేడాది చూపిన అవిధేయత రెండింటినీ అధిష్టానం బేరీజు వేసుకుంటోందని కూడా ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. సీఎంగిరీ వదులుకోవాల్సి వస్తుందనే కారణంతో కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేయాలన్న సోనియా ఆదేశాలను గహ్లోత్ బేఖాతరు చేయడం తెలిసిందే. ఆయన కోసం మెజారిటీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గత సెపె్టంబర్లో ఏకంగా తిరుగుబాటుకు సిద్ధపడటం అధిష్టానానికి తలవంపులుగా మారింది. ఈ నేపథ్యంలో ఐదేళ్లకోసారి అధికార పార్టీని మార్చేసే రాజస్థాన్‌లో ఈసారి కాంగ్రెస్ ఓడితే రాష్ట్ర పార్టీ పైలట్ చేతుల్లోకి రావచ్చు. నెగ్గితే మాత్రం సీఎం పీఠం కోసం గహ్లోత్, పైలట్ మధ్య పెనుగులాట తప్పకపోవచ్చు. అప్పుడు అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరం! – సాక్షి, నేషనల్ డెస్క్ -
గాడిద సవారీతో నామినేషన్‌కు..
భోపాల్: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ఊపందుకుంది. కొందరు అభ్యర్థులను వినూత్న మార్గాల్లో నామినేషన్లు వేస్తున్నారు. బుర్హాన్పూర్ నియోజకవర్గానికి ప్రియాంక్ ఠాకూర్ అనే స్వతంత్ర అభ్యర్థి గాడిదపై వచ్చి నామినేషన్ సమరి్పంచారు. ‘అన్ని రాజకీయ పార్టీలు తమ ఆశ్రితులకే టికెట్లు ఇస్తున్నాయి. ప్రజలను గాడిదలుగా, అంటే మూర్ఖులుగా తయారు చేస్తున్నాయి. అందుకే గాడిదపై సవారీ చేస్తూ వచ్చి నామినేషన్ వేయాలనుకున్నాను’ అని ఆయన అన్నారు. ఇదే సీటుకు కాంగ్రెస్ అభ్యర్థి ఠాకూర్ సురేంద్ర సింగ్ ఎడ్ల బండిపై మద్దతుదారులతో కలిసి వచ్చి నామినేషన్ వేశారు. బీజేపీ ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలపై నిరసన తెలిపేందుకే ఇలా చేసినట్లు చెప్పుకున్నారు. సన్వేర్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి రీనా బొరాసి ట్రాక్టర్‌పై వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. రైతుల సమస్యలను తెలిపేందుకే ఇలా చేశానన్నారు. రాష్ట్ర మంత్రి, బీజేపీ అభ్యర్థి విశ్వాస్ సారంగ్ స్కూటర్‌పై వచ్చి నరేలా నియోజకవర్గానికి నామినేషన్ పత్రాలను అందజేశారు. నామినేషన్ల దాఖలుకు ఈ నెల 30 చివరి తేదీ. -
గత హామీలు ఏమయ్యాయి?
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ ఓట్ల కోసం మళ్లీ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని, ప్రజల చెవుల్లో గులాబీ పూలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. గతంలో ఇచ్చిన హామీలు విస్మరించి ఎన్నికల నేపథ్యంలో మళ్లీ ప్రజలను మభ్యపెట్టి మోసం చేసేందుకు కొత్తవి ప్రకటించారని మండిపడ్డారు. వందల హామీలు ఇచ్చి ప్రజలకు వెన్నుపోటు పొడిచారని, కేసీఆర్ సకల జనుల ద్రోహి అని దుయ్యబట్టారు. ఆదివారం కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ తాజాగా విడుదల చేసిన మేనిఫెస్టోపై స్పందించారు. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికలు, 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఏ హామీలు ఇచ్చారో కేసీఆర్ బయట పెట్టి మాట్లాడాలని డిమాండ్ చేశారు. 2014 నుంచి ఇప్పటివరకు ఏ ఎన్నికల్లో ఇచ్చిన హామీనీ అమలు చేయలేదన్నారు. అప్పులు పెంచారు.. అవినీతి పెంచారు.. అహంకారం పెంచుకున్నారు తప్ప.. రాష్ట్ర సంపద పెంచలేదని విమర్శించారు. పెట్రోల్‌పై పన్ను తగ్గించని ఏకైక రాష్ట్రం కేసీఆర్ మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని 80 వేల పుస్తకాలు చదివిన జ్ఞానంతో అప్పులపాలు చేసి భ్రష్టు పట్టించారని కిషన్‌రెడ్డి మండిపడ్డారు. పెట్రోల్ మీద కేంద్రం తమకు వచ్చే ఆదాయం తగ్గించుకొని ట్యాక్స్ తగ్గిస్తే... అన్ని రాష్ట్రాలూ కేంద్రంతో కలిసి కొంత పన్ను తగ్గించాయి. పన్ను తగ్గించని ఏకైక రాష్ట్రం తెలంగాణ అని విమర్శించారు. ‘24 జిల్లా కేంద్రాల్లో నిమ్స్ స్థాయిలో 24 ఆస్పత్రులు కడతామని హామీ ఇచ్చి ఒక్కటీ కట్టలేదు. మూడెకరాల సాగు భూమి, దళితులకు 50 వేల కోట్ల ప్రత్యేక నిధులు, సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించకుండా చూడటం, మహిళా బ్యాంకులు, జర్నలిస్టులకు ఇంటి స్థలాలు, జర్నలిస్టుల సంక్షేమ నిధి లాంటి ఎన్నో హామీలిచ్చి ఒక్కటీ అమలు చేయలేదు. మూతపడ్డ కంపెనీలు తెరుస్తామని ఒక్కటీ తెరవలేదు. హైదరాబాద్ నుంచి వరంగల్‌కు ఇండ్రస్టియల్ కారిడార్ అన్నారు.. అది ఎక్కడ పోయింది?’ అని కిషన్‌రెడ్డి నిలదీశారు. గ్రాఫిక్స్ చూపెట్టి మభ్యపెట్టారు ‘ప్రతి ఊరిలో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ.. ప్రతి గ్రామంలో ఇంటర్నెట్.. హామీలు ఏమయ్యాయి? కేంద్రం ఇచ్చే నిధులు తప్ప గ్రామాలకు రాష్ట్రం నిధులు ఇవ్వడం లేదు. మూసీ నదిని ప్రక్షాళన చేస్తామని, పునరుజ్జీవనం చేస్తామన్నారు.. ఏదీ లేదు.. హైదరాబాద్ ఉత్తరాన విమానాశ్రయం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కొత్తది అటుంచితే.. వరంగల్ ఎయిర్‌పోర్టుకు ల్యాండ్ ఇవ్వమంటే ఇవ్వట్లేదు. ఆకాశ హరŠామ్యలు.. గ్రాఫిక్స్ చూపెట్టి ప్రజలను మభ్యపెట్టిన పార్టీ బీఆర్ఎస్. ఎఫ్ఆర్బీఎం నుంచి తప్పించుకోవడానికి మూసీకి ఒక కార్పొరేషన్, రోడ్లకు ఒక కార్పొరేషన్.. హుస్సేన్ సాగర్‌కు ఒక కార్పొరేషన్.., వాటర్‌కు ఒక కార్పొరేషన్, కాళేశ్వరంకు ఒక కార్పొరేషన్.. ఇలా లెక్కలేనన్ని కార్పొరేషన్లు చేస్తున్నారు. అనేక కార్పొరేషన్లు పెట్టి నాబార్డు, బ్యాంకుల్లో విచ్చలవిడిగా అప్పులు చేశారు’ అని కిషన్‌రెడ్డి అని ధ్వజమెత్తారు. ఇవన్నీ ప్రజలకు చెప్పకుండా.. తెలంగాణను ఉద్ధరిస్తామని మళ్లీ మేనిఫెస్టో తెచ్చారంటూ మండిపడ్డారు. రాష్ట్ర ఆదాయంలో 20 శాతం వడ్డీలకే పోతోందన్నారు. ప్రభుత్వ చేతగానితనంతో, పరీక్షలు నిర్వహించే సామర్థ్యం లేక.. నోటిఫికేషన్లు వాయిదా పడుతుంటే.. దిక్కుతోచని స్థితిలో నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారన్నారు. బెస్ట్ కరప్షన్ ఫ్యామిలీ పాలసీ ‘బెస్ట్ ఎకనమికల్ పాలసీ అని కేసీఆర్ అంటున్నాడు... అది బెస్ట్ కాదు.. వరస్ట్ ఎకనామికల్ పాలసీ. పవర్ పాలసీ బెస్ట్ పాలసీ అని అన్నడు.. అది బెస్ట్ కాదు.. డేంజర్ పవర్ పాలసీ. రూ.45 వేల కోట్ల అప్పులతో డిస్కంలు, విద్యుత్ వ్యవస్థ కుప్పుకూలిపోయే స్థితిలో ఉన్నది. బెస్ట్ డ్రింకింగ్ వాటర్ పాలసీ అట.. అది బెస్ట్ డ్రింకింగ్ వాటర్ పాలసీ కాదు.. బెస్ట్ లిక్కర్ డ్రింకింగ్ వాటర్ పాలసీ. బెస్ట్ ఇరిగేషన్ పాలసీ అన్నడు.. అది బెస్ట్ కమీషన్ ఇరిగేషన్ పాలసీ. అత్యుత్తమ దళిత పాలసీ అని కేసీఆర్ అంటున్నాడు.. కానీ కేసీఆర్ బెస్ట్ కరప్షన్ ఫ్యామిలీ పాలసీ, చీటింగ్ పాలసీ అమలుచేస్తున్నాడు’ అని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. -
మోదీ శంఖారావం
న్యూఢిల్లీ: ఏడాదిన్నర ముందే ప్రధాని మోదీ ఎన్నికల శంఖం పూరించారు. ‘‘లోక్‌సభ ఎన్నికలు కేవలం 400 రోజుల దూరంలోనే ఉన్నాయి. ఇక టాప్ గేర్‌లో దూసుకెళ్లాల్సిన సమయం వచ్చేసింది. చరిత్ర సృష్టిద్దాం పదండి’’ అంటూ బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. దేశ రాజధానిలో జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో చివరి రోజైన మంగళవారం కీలకాంశాలపై లోతైన చర్చ జరిగింది. ఈ ఏడాది 9 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై అన్ని రాష్ట్రాల నుంచి హాజరైన 350 మంది బీజేపీ అగ్ర నేతలు, కేంద్ర మంత్రులు, సీఎంలు కూలంకషంగా చర్చించారు. చివరగా మోదీ కీలకోపన్యాసం చేశారు. భావి కార్యాచరణపై నేతలు, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. 9 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు కీలకమైన 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఘన విజయమే లక్ష్యంగా పని చేయాలని పిలుపునిచ్చారు. అతి విశ్వాసానికి ఎక్కడా చోటివ్వొద్దని హెచ్చరించారు. ‘‘బోహ్రాలు, పాస్మాండాలు, సిక్కులు... ఇలా సమాజంలోని ప్రతి వర్గానికీ చేరువ కండి. ఎన్నికల లబ్ధి గురించి ఆలోచించకుండా వారి సంక్షేమం కోసం పాటుపడండి. ప్రభుత్వ సంక్షేమ పథకాలను మరింతగా ప్రజల వద్దకు తీసుకెళ్లండి. అన్నిచోట్లా, ముఖ్యంగా సరిహద్దు గ్రామాల్లో ముమ్మరంగా ప్రత్యేక కార్యక్రమాలు, మోర్చాలు నిర్వహించండి. అక్కడి ప్రజలకు మరింత చేరువ కండి. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను కూడా అక్కడికీ చేరవేయండి. సరిహద్దు గ్రామాల యువతను బీజేపీ కార్యకర్తలుగా తీర్చిదిద్దండి. తద్వారా అక్కడా పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయండి. 18–25 ఏళ్ల యువతకు దేశ రాజకీయ చరిత్ర తెలియదు. గత ప్రభుత్వాల హయాంలో జరిగిన విచ్చలవిడి అవినీతి, తప్పిదాలు తెలియవు. వీటన్నింటిపైనా వారికి అవగాహన కల్పించండి. అంతటి దుష్పరిపాలనను బీజేపీ ఎలా సుపరిపాలనగా మార్చి చూపించిందో యువతలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి’’ అని సూచించారు. ‘‘రానున్నది మన దేశానికి అత్యుత్తమ సమయం. వచ్చే పాతికేళ్ల అమృత కాలాన్ని కర్తవ్య కాలంగా మార్చుకుని కష్టపడితేనే దేశాన్ని ముందుకు తీసుకెళ్లగలం. ప్రజలకు సేవ చేసేందుకు అన్ని విధాలుగా కష్టపడదాం’’ అన్నారు. ‘‘అతి విశ్వాసానికి పోతే ప్రతికూల ఫలితాలు తప్పవు. 1998లో మధ్యప్రదేశ్‌లో దిగ్విజయ్‌సింగ్ సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉన్నా బీజేపీ కేవలం అతి విశ్వాసం వల్లే ఓడింది. కాబట్టి జాగ్రత్తగా ఉందాం’’ అంటూ నేతలను హెచ్చరించారు. మోదీ ప్రసంగం స్ఫూర్తిదాయకంగా మాత్రమే గాక సరికొత్త దిశానిర్దేశం చేసేదిగా సాగిందని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పేర్కొన్నారు. ప్రసంగ విశేషాలను ఆయన మీడియాకు వెల్లడించారు. ‘ఏక్ భారత్, శ్రేష్ఠ్ భారత్’ సాకారానికి కృషి చేయాల్సిందిగా బీజేపీ కార్యకర్తలకు మోదీ పిలుపునిచ్చారు. పార్టీ కంటే దేశానికి ప్రాధాన్యమిస్తూ రాజకీయ నాయకునిగా గాక రాజనీతిజ్ఞుడిగా ఆయన ప్రసంగం సాగింది’’ అని ఫడ్నవీస్ చెప్పారు. ధర్తీ బచావో... పర్యావరణ పరిరక్షణకు నడుం బిగిద్దామని బీజేపీ శ్రేణులకు మోదీ పిలుపునిచ్చారు. ‘‘బేటీ పఢావో మాదిరిగా ధర్తీ బచావో (భూమిని కాపాడండి) ఉద్యమానికి శ్రీకారం చుడదాం. రసాయన ఎరువులపై ఆధారపడటాన్ని తగ్గించుకుందాం. కాశీ–తమిళ సంగమం తరహాలో భిన్న సంస్కృతులను, ప్రాంతాలను కలిపే వారధిగా పార్టీని తీర్చిదిద్దుకుందాం’’ అని సూచించారు. సినిమాలపై అనవసర వ్యాఖ్యలొద్దు: మోదీ సినిమాలు తదితర అంశాలపై అనవసర ప్రకటనలకు, వివాదాస్పద వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని బీజేపీ నేతలను, శ్రేణులను మోదీ ఆదేశించారు. ‘‘ఏదో సినిమా గురించి మనవాళ్లలో ఎవరో ఏదో అంటారు. టీవీల్లో, మీడియాలో రోజంతా అదే వస్తుంది. అభివృద్ధి అజెండా తదితర అసలు విషయాలన్నీ పక్కకు పోతాయి. అందుకే అనవసర వ్యాఖ్యలేవీ చేయకండి’’ అని కరాఖండిగా చెప్పినట్టు సమాచారం. షారుఖ్‌ఖాన్ నటించిన పఠాన్ సినిమాలో కాషాయాన్ని కించపరిచారంటూ దాని బహిష్కరణకు నరోత్తం మిశ్రా, రామ్ కదమ్ తదితర బీజేపీ నేతలు, మంత్రులు బహిరంగంగా పిలుపునివ్వడం, దానిపై విమర్శలు చెలరేగడం తెలిసిందే. -
ఐదు రాష్ట్రాల ఎన్నికలు.. ఎగ్జిట్‌పోల్స్ ఏం చెబుతున్నాయంటే?
న్యూఢిల్లీ: 2024 సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్‌గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, గోవా రాష్ట్రాల్లో విజయం ఎవరిని వరిస్తుందనేది దేశమంతటా ఆసక్తిగా మారింది. ఇక దేశంలోనే అత్యధిక సీట్లు కలిగిన ఉత్తర ప్రదేశ్‌లో కమలం మరోసారి వికసించనున్నట్లు ఎగ్జిట్‌పోల్ ఫలితాల్లో వెల్లడైంది. ఐదు రాష్ట్రాల ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్ అంచనాలను పరిశీలిస్తే.. యూపీలో బీజేపీ అధికారం నిలబెట్టుకుంటుందా..? ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ అధికారం నిలబెట్టుకుంటుందని పీపుల్స్ పల్స్ సర్వే అంచనా వేసింది. బీజేపీ, మిత్రపక్షాలతో కలిసి 220 నుంచి 240 వరకు సీట్లు సాధిస్తుందని పోస్ట్ పోల్ సర్వే తెలిపింది. సమాజ్‌వాదీ పార్టీ దాని మిత్రపక్షాలకు కలిపి 140 నుంచి 160 స్థానాలు వస్తాయని పేర్కొంది. బహుజన సమాజ్‌వాదీ పార్టీ 12 నుంచి 18 సీట్లు గెలిచే అవకాశముంది. సమాజ్‌వాదీ పార్టీ మిత్రపక్షం ఆర్ఎల్డీ 8 నుంచి 12 స్థానాల్లో విజయం సాధిస్తుందని అంచనా కట్టింది. ఉత్తరాఖండ్‌లో అధికార బీజేపీ మరోసారి గట్టెక్కుతుందా? హోరాహోరీగా సాగిన ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ మరోసారి గట్టెక్కేందుకు పరిస్థితులు అంత సులభంగా లేనట్టు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చెప్తున్నాయి. కాంగ్రెస్ గతంలో కంటే మరింత పుంజుకునే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. 70 అసెంబ్లీ స్థానాలు గల రాష్ట్ర అసెంబ్లీకి ఫిబ్రవరి 16, 23 తేదీల్లో రెండు విడతల్లో ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 36 సీట్లు కావాలి. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 46.5 శాతం, కాంగ్రెస్ 33.5 శాతం ఓట్లు సాధించాయి. బీఎస్పీ 7 శాతం ఓట్లు సాధించాయి. కాగా, తాజా ఎన్నికల్లో పోటీ ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్ మధ్యే ఉన్నప్పటికీ ఈసారి ఆప్ కూడా రంగంలోకి దిగడంతో రసవత్తరంగా మారింది. ప్రస్తుత సీఎం పుష్కర్ సింగ్ ధామి బీజేపీని ఒడ్డున పడేస్తారా? లేక కాంగ్రెస్ కమలానికి షాకిస్తుందా తేలాలంటే మార్చి 10 వరకు వేచి చూడాల్సిందే! పంజాబ్‌లో ఆప్ అధికారంలోకి రానుందా? పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అధికారంలోకి రానుందా? అంటే అవుననే అంటోంది పీపుల్స్ పల్స్ సర్వే. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ అతిపెద్ద పార్టీగా అవతరించబోతోందని అంచనా వేసింది. హైదరాబాద్‌కు చెందిన పీపుల్స్ పల్స్ సంస్థ ఫిబ్రవరి 23 నుంచి మార్చి 1 వరకు పోస్ట్ పోల్ సర్వే నిర్వహించింది. దీని ఆధారంగా ఆమ్ ఆద్మీ పార్టీకి 59 నుంచి 66 సీట్లు వస్తాయని అంచనా వేసింది. అధికార కాంగ్రెస్ 23 నుంచి 28 స్థానాలు గెలుచుకునే చాన్స్ ఉంది. శిరోమణి అకాలీదళ్‌కు 17 నుంచి 21 సీట్లు, బీజేపీకి 2 నుంచి 6 సీట్లు వచ్చే అవకాశాలున్నాయి. మణిపూర్‌లో గెలుపెవరిది? మణిపూర్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను పరిశీలిస్తే అధికార బీజేపీ, కాంగ్రెస్ మధ్యే ప్రధాన పోటీ నెలకొన్నట్టు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్‌ను వెనక్కినెట్టి సీఎం బీరెన్‌సింగ్ నేతృత్వంలోని బీజేపీ మరోసారి అధికారాన్ని చేపట్టనున్నట్లు సర్వేల ఫలితాల్లో తేలింది. మొత్తం 60 సీటల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు 31 సీట్లు గెలుచుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో పీపుల్స్ అనే సంస్థ బీజేపీ 25 నుంచి 29 స్థానాల వరకు గెలుచుకోనున్నట్లు తెలిపింది. కాంగ్రెస్ 17 నుంచి 21 సీట్లు వరకు గెలిచే అవకాశాలు ఉన్నట్లు తేలింది. అదే విధంగా ఎన్పీపీ 7 నుంచి 11, ఎన్పీఎఫ్ 3 నుంచి 5, ఇతరులు 2 నుంచి అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందనున్నట్లు పీపుల్స్ పల్స్ పేర్కొంది. బీజేపీ 33 శాతం.. కాంగ్రెస్ 29 శాతం వరకు ఓట్లు సాధించవచ్చని వెల్లడించింది. గోవాలో మిగతా రాష్ట్రాల్లో కంటే భిన్నంగా.. గోవాలో ఫిబ్రవరి 14న ఒకే విడతలో ఎన్నికలు పూర్తయ్యాయి. మొత్తం 40 స్థానాలున్న రాష్ట్రలో అధికారాన్ని చేపట్టేందుకు 21 సీట్లు రావాల్సి ఉంది. అయితే గోవాలో ఎగ్జిట్ ఫోల్ ఫలితాలు మిగతా రాష్ట్రాల కంటే భిన్నంగా ఉన్నాయి. ఈసారి ఎన్నికల్లో ఆప్ రంగంలోకి దిగడంతో ఇక్కడ హంగ్ ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చెబుతున్నాయి గోవాలో ప్రధాన పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్యే నెలకొన్నప్పటికీ ఏ పార్టీకి సరైన మెజార్టీ రాకపోవడం గమనార్హం. సీఎన్ఎక్స్ ఎగ్జిట్ పోల్ సర్వే వివరాల ప్రకారం, బీజేపీ 16 సీట్లు గెలుచుకోగా.. కాంగ్రెస్ 17 సీట్లు గెలుచుకోనున్నట్లు తెలుస్తోంది. హంగ్ తప్పనిసరైతే.. కింగ్ మేకర్‌గా ఎవరు మారనున్నారో మార్చి 10న తేలనుంది. -
Uttarakhand Exit Poll 2002: ఆ పార్టీకి మెజారిటీకి తగినన్ని సీట్లు పక్కానా?
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తర్ ప్రదేశ్ చివరి దశ (ఏడో దశ) ఎన్నికలు ముగియడంతో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ తుది అంకానికి చేరుకుంది. మార్చి 10న తుది ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈక్రమంలో సోమవారం సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదలయ్యాయి. ఓటర్ల నాడీ ఎలా ఉంది? ఏ పార్టీకి ఓటరు దేవుళ్లు పట్టం కట్టనున్నారో పలు ఎగ్జిట్ పోల్స్ సంస్థలు తమ సర్వే వివరాల్లో తెలిపాయి. కొన్ని సందర్భాల్లో మినహాయించి చాలా సందర్భాల్లో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు నిజమయ్యాయి. ఈనేపథ్యంలో ఉత్తరాఖండ్‌కు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ వివరాలు.. హోరాహోరీగా సాగిన ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ మరోసారి గట్టెక్కేందుకు పరిస్థితులు అంత సులభంగా లేనట్టు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చెప్తున్నాయి. కాంగ్రెస్ గతంలో కంటే మరింత పుంజుకునే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. 70 అసెంబ్లీ స్థానాలు గల రాష్ట్ర అసెంబ్లీకి ఫిబ్రవరి 16, 23 తేదీల్లో రెండు విడతల్లో ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 36 సీట్లు కావాలి. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 46.5 శాతం, కాంగ్రెస్ 33.5 శాతం ఓట్లు సాధించాయి. బీఎస్పీ 7 శాతం ఓట్లు సాధించాయి. కాగా, తాజా ఎన్నికల్లో పోటీ ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్ మధ్యే ఉన్నప్పటికీ ఈసారి ఆప్ కూడా రంగంలోకి దిగడంతో రసవత్తరంగా మారింది. ప్రస్తుత సీఎం పుష్కర్ సింగ్ ధామి బీజేపీని ఒడ్డున పడేస్తారా? లేక కాంగ్రెస్ కమలానికి షాకిస్తుందా తేలాలంటే మార్చి 10 వరకు వేచి చూడాల్సిందే! -
ఢిల్లీలో పంజాబ్ హీట్.. అమిత్‌షాతో అమరీందర్ సింగ్ భేటీ
న్యూఢిల్లీ: పంజాబ్‌లో రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే పంజాబ్ రాజకీయాలు హీట్‌ను పుట్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా, ఢిల్లీలో కేంద్రమంత్రి అమిత్ షా నివాసంలో.. పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్, సుఖ్‌దేవ్ సింగ్ ధిడ్సాల భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్ లోక్ కాంగ్రెస్, బీజేపీ, శిరోమణి అకాళిదళ్ పార్టీ(సాడ్)లో సంయుక్తంగా పోటీ చేయనున్నట్లు కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ సోమవారం ప్రకటించారు. ఈ సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, పంజాబ్ బీజేపీ ఇంచార్జీ గజేంద్ర సింగ్ షెకావత్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికే కెప్టెన్ అమరీందర్ సింగ్ వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలిసి ఎన్నికల పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శిరోమణి అకాళిదళ్ కూడా బీజేపీతో కలవటం ప్రస్తుతం ఆసక్తి కరంగా మారింది. కాగా, మరికొద్ది రోజుల్లో ఆయా పార్టీల నుంచి ఇద్దరు చొప్పున నాయకులు కలిసి వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహలు , సీట్ల కేటాయింపులు, మేనిఫెస్టో తదితర అంశాల గురించి చర్చించనున్నట్లు తెలిపారు. అదే విధంగా షెకావత్ జలంధర్‌లో బీజేపీ ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ దేశాన్ని భ్రష్టుపట్టించిందని విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వస్తే పంజాబ్‌లో మళ్లీ స్వర్ణయుగం వచ్చేలా చర్యలు చేపడతామని అన్నారు. పంజాబ్ ఎన్నికలలో ఏ పార్టీకి మద్దతివ్వాలో రైతులకు బాగా తెలుసన్నారు. కాగా, ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా బీజేపీ చేస్తున్న ఆరోపణలను బలంగా తిప్పికొడుతుంది. అరవింద్ కేజ్రీవాల్.. ఆప్ ఆద్మీ పార్టీ కూడా తమదైన శైలీలో ప్రచారం నిర్వహిస్తున్నాయి. -
రఘువీరాకు తమ్ముళ్ల అభయం!
సాక్షి, అనంతపురం : సార్వత్రిక ఎన్నికల్లో ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డికి తెలుగుదేశం నేతలు సహకరిస్తారా? ఆది నుంచి పెనుకొండ ఎమ్మెల్యే పార్థసారథిని వ్యతిరేకిస్తున్న ఆ పార్టీలోని ఓ వర్గం ఈ ఎన్నికల్లో అతడికి చెక్ పెట్టేందుకు వ్యూహం పన్నుతోందా? తాజా ఘటనలు పరిశీలిస్తే అవుననే సమాధానం వస్తోంది. కళ్యాణదుర్గం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రఘువీరారెడ్డి ఈసారి పెనుకొండ బరి నుంచి దిగుతానని స్పష్టం చేయడం ఇందుకు బలం చేకూరుతోంది. వివరాల్లోకి వెళితే.. 2009లో మడకశిర నియోజకవర్గం ఎస్సీలకు రిజర్వు కావడంతో కళ్యాణదుర్గం నుంచి రఘువీరారెడ్డి పోటీ చేసి విజయం సాధించారు. ఐదేళ్లలో దాదాపు రూ.2 వేల కోట్లతో కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని తరచూ రఘువీరా చెబుతుంటారు. అదే నిజమైతే అక్కడ ప్రజలు ఆయన్ను ఆదరించాలి. అయితే క్షేత్ర స్థాయిలో అభివద్ధి మేడి పండు చందంగా ఉందన్న విమర్శలు ఉన్నాయి. పైగా రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం రోజురోజుకూ పెరుగుతుండడంతో అక్కడి నుంచి పోటీ చేస్తే ఓటమి తప్పదన్న అంచనాకు వచ్చిన రఘువీరారెడ్డి పెనుకొండ నుంచి బరిలోకి దిగాలని భావించినట్లు సమాచారం. ఇదే విషయాన్ని బుధవారం మడకశిర, పెనుకొండలో జరిగిన సమావేశాల్లో ప్రకటించారు. కాగా పెనుకొండ నుంచి పోటీ చేయనున్న రఘువీరాకు ఆ నియోజకవర్గంలోని ఓ వర్గం టీడీపీ నేతలు సహకరించనున్నట్లు తెలిసింది. ఒక సామాజిక వర్గానికి చెందిన ఓట్లు తప్పకుండా మీకే పడేలా చూస్తామని నాయకులు హామీ ఇచ్చినట్లు సమాచారం. పైగా గతంలో జరిగిన ఓ ఘటనలో పరిటాల రవి కుమారుడు పరిటాల శ్రీరాంపై కేసు నమోదైతే అరెస్ట్ కాకుండా మంత్రి హోదాలో ఉన్న రఘువీరా అప్పట్లో సహాయం చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. దీనికి తోడు మొదట్నుంచి పెనుకొండ ఎమ్మెల్యే పార్థసారధిని వ్యతిరేకిస్తున్న ఆ వర్గం నేతలు.. దీన్ని అవకాశంగా తీసుకుని ఆయనకు చెక్ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. తెలుగుదేశం పార్టీ నేతలు ఇచ్చిన అభయంతోనే ఈ సారి పెనుకొండ నుంచి పోటీ చేస్తానని రఘువీరా ప్రకటించినట్లు సమాచారం. పనిలో పనిగా సత్యసాయి ట్రస్ట్ సాయంతో పెనుకొండ నియోజకవర్గంలో తాగునీటి ఇబ్బందులు లేకుండా చేస్తానని హామీ ఇచ్చి ప్రజలను బుట్టలో వేసుకునే ప్రయత్నం చేశారు. ఏదేమైనా ఈ సారి పెనుకొండ ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.