ate
-
విచిత్రమైన అలవాటు! తన జుట్టును తానే తింటున్న బాలిక!
చాలమందికి పలు రకాలు విచిత్రమైన హ్యబిట్స్ ఉంటాయి. వాటిలో కొన్ని మంచివి, చెడ్డవి కూడా ఉంటాయి. మన అలవాట్లును మన పెద్దలు లేదా తల్లిదండ్రులు గమనించి అవి మంచివో లేక చెడ్డవో వివరించి చెప్పకపోతే ఇక్కడ ఉన్న బాలిక మాదిరి దారుణమైన పరిస్థితిని ఎదుర్కొనక తప్పదు. వివరాల్లోకెళ్తే...చైనాకు చెందిన 14 ఏళ్ల బాలికకు ఒక విచిత్రమైన అలవాటు ఉంది. అదేంటంటే తన జుట్టును తానే తింటుంది. ఐతే దీన్ని ఆమె ఇంట్లో వాళ్లు గమనించకపోవడంతో అదే పనిగా చాలా ఏళ్ల నుంచి తన జుట్టును తానే తింటోంది. దీంతో గత కొద్ది రోజులుగా ఆమె ఆహారం తీసుకోలేనంత దారుణమైన స్థితికి వచ్చేసి నీరసంగా తయారైంది. దీంతో ఆమెను ఆస్పత్రికి తీసుకువెళ్లారు ఆమె కుటుంబసభ్యులు. అక్కడ జరిపిన వైద్య పరీక్షల్లో...ఆమె కడుపు మొత్తం ఏకంగా మూడు కిలోల జుట్టుతో నిండిపోయిందని, అందువల్లే ఆమె ఆహారం తీసుకోలేకపోతుందని అన్నారు. ఆ తర్వాత ఆ బాలికకు వైద్యులు సుమారు రెండు గంటలపాటు సుదీర్ఘ శస్త్ర చికిత్స చేసి ఆ ముడు కిలోల హెయిర్ బాల్(ఉండలుగా ఉన్న జుట్టు)ని తీసేశారు. ఈ మేరకు జియాన్ డాక్సింగ్ హాస్పిటల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ షిహై మాట్లాడుతూ...ఆ బాలిక ఆహారం తీసుకులేని పరిస్థితి ఏర్పడటంతోనే మా వద్దకు వచ్చింది. అసలు ఆమె పొట్టలో ఆహారం పట్టేందుకు అవకాశం లేకుండా జుట్లుతో నిండిపోయిందని, ఆఖరికి ఆమె ఆహార ప్రేగు కూడా మూసుకుపోయిందని చెప్పారు. ఆ బాలిక తల్లిదండ్రులు ఉద్యోగ రీత్యా దూరంగా ఉండటంతో ఆమె అమ్మమ్మ తాతయ్యల వద్ద పెరుగుతుందన్నారు. దీంతో వారు ఆమె విచిత్రమైన అలవాటుని గుర్తించలేకపోయారు. ఆ బాలిక పికా అనే విచిత్రమైన డిజార్డర్‌తో బాధపడుతోందని చెప్పారు. ఇలాంటి సమస్యతో బాధపడే చిన్నారులు, కాగితాలు, సుద్ధ ముక్కలు వంటి తినకూడని వాటిని ఆహారంగా తింటుంటారని చెబుతున్నారు. అంతేగాదు తమ జుట్టును తామే తినడాన్ని రాంపూజ్ సిండ్రోమ్‌గా వ్యవహిరస్తారని చెప్పారు. ఇది ట్రైకోఫాగియా అనే మానసిక రుగ్మత వల్ల వస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఆ చిన్నారి కూడా తన తల్లిదండ్రులకు దూరంగా ఉండటం వల్ల చాల ఏళ్లుగా మానసిక సమస్యలతో బాధపడి ఉండవచ్చని, అందువల్లే ఆమె ఈ విచిత్రమైన అలవాటుకి అడిక్ట్ అయినట్లు వైద్యుడు షిహై చెప్పారు. (చదవండి: డార్విన్ సంతకంతో కూడిన లేఖ వేలంలో ఎంత పలుకుతోందంటే...) -
ఎంచక్కా మాయమైపోండిక!
న్యూయార్క్: హ్యారీపోర్టర్ సినిమా చూశారా.. అందులో హీరో అప్పుడప్పుడు మాయం అవుతూ ఉంటాడు.. దీనికి కారణం హీరో వీపు వెనుక ధరించే పరదా వంటి వస్త్రం.. అలాంటి వస్త్రమే మనకు దొరికితే.. ఎంచక్కా మాయమై పోవచ్చు కదా.. అయినా అది సినిమా.. నిజంగా ఉంటుందా అనే కదా మీ అనుమానం. అది త్వరలోనే నిజం కానుంది. కాంతిని అధ్యయనం చేసే శాస్త్రవేత్తలు అలాంటి సాంకేతికతనే అభివృద్ధి చేశారు. వస్తువుపై పడే కాంతి తరంగాల పౌనఃపున్యాన్ని మార్చడం ద్వారా ఈ సాంకేతికతను తయారుచేశారు. దీంతో ఏ వస్తువునైనా అన్ని దిశల నుంచి కనిపించకుండా అంటే మాయం చేయొచ్చన్న మాట. కాంతి గురించి అధ్యయనం చేసే ‘ది ఆప్టిక్ సొసైటీ’అనే కంపెనీ కొత్త పరికరాన్ని అభివృద్ధిపరిచింది. ‘స్పెక్ట్రల్ ఇన్విజిబిలిటీ క్లోక్’అని పిలిచే ఈ పరికరంతో ఏ వస్తువునైనా కనిపించకుండా చేయొచ్చు. ఈ పరికరం కాంతి పౌనఃపున్యాన్ని మారుస్తుందన్న మాట. ఇప్పటి వరకు ఒకే రంగు కాంతి వచ్చే వస్తువులను మాత్రమే మాయం చేసే సాంకేతికత ఉంది. అయితే తాజాగా అభివృద్ధి పరిచిన సాంకేతికతతో అన్ని రంగులున్న వస్తువులను కూడా మాయం చేయగలదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ వివరాలు ఆప్టికా అనే జర్నల్‌లో తాజాగా ప్రచురితమ య్యాయి. అయితే దీన్ని మరింత అభివృద్ధి పరచాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్త జోస్ అజానా పేర్కొన్నారు. -
నరమాంస భక్షకుడి వికృత చర్య
నరమాంస భక్షకుల పేరు వింటేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది. కానీ వెనిజులాలోని ఓ నరమాంస భక్షకుడి చర్యలు గురించి తెలుసుకుంటే వెన్నులో వణుకు పుడుతుంది. ఇతగాడు ఒక వ్యక్తిని చంపి, శరీర భాగాలు భక్షించడమే కాదు.. అతని రక్తం, బూడిదతో బొమ్మలను కూడా చిత్రించిన వైనం కలకలం రేపింది. వెనిజులాలోని బార్లోవెంటో ప్రాంతంలో ఈ షాకింగ్ ఉదంతం చోటు చేసుకుంది. బార్లోవొంటో ప్రాంతానికి చెందిన లూయిస్ అల్ఫ్రెడో గొంజాలెజ్ హెర్నాండెజ్ ఈ భయానక నేరానికి పాల్పడ్డాడు. పోలీసులు ఇతడిని అరెస్ట్ చేసిన అనంతరం విచారణలో నేరాన్ని ఒప్పుకున్నాడు. సైంటిఫిక్, పీనల్, క్రిమినల్ ఇన్వెస్టిగేటివ్ బాడీ (సిఐసిపిసి) నిందితుడి ఫోటోలు ఆన్లైన్లో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. సీఐసీపీసీ డైరెక్టర్ డగ్లస్ రికో ప్రకారం ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే.. బాధితుడే నిందితుడిని ఈ భయంకరమైన చర్య చేపట్టేందుకు (తనని చంపి, శరీర భాగాలు తిని, రక్తం, బూడిదతో పెయింటింగ్స్ వేసేందుకు) నియమించుకున్నాడట. దీనిపై దర్యాప్తు మొదలు పెట్టారు. మరోవైపు ఈ మొత్తం వ్యవహారంలో ఇద్దరి పాత్రపై ఆరా తీస్తున్నారు. సంఘటనా స్థలంలో కొన్ని పెయింటింగ్స్‌ను, ఇతర శరీర అవశేషాలను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు ఇతర వ్యక్తులకు చెందిన కొన్ని అనుమానాస్పద డాక్యుమెంట్లను కూడా కనుగొన్నారు. దీంతో కనిపించకుండా పోయిన వ్యక్తుల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. అలాగే ఈ చిత్రాలు మానవ అవశేషాల నుండి తయారు చేయబడినవో కాదో తెలుసుకునేందుకు ఫోరెన్సిక్ అనాలిసిస్ నిర్వహించనున్నారు. -
బియ్యం కార్డులు మాయం
కడప నగరం భవానీనగర్‌కు చెందిన కె.రాఘవేంద్రరావు సరుకుల కోసం ప్రభుత్వ చౌక దుకాణానికి వెళ్లాడు. రద్దీ ఎక్కువగా ఉండడంతో గంటల తరబడి క్యూలో నిలబడాల్సి వచ్చింది. తీరా ఆయన వంతు వచ్చింది. బియ్యం, చక్కెర తీసుకెళ్లేందుకు తెచ్చుకున్న సంచి ఓమారు విదిలించాడు. ఇంతలో నీ కార్డు కీరిజిష్టర్ నుంచి తొలగించారు....నీకు సరుకులు ఇవ్వడం కుదరదంటూ ఎఫ్పీ షాపు డీలర్ పిడుగులాంటి వార్త చెప్పడంతో హతాశుడయ్యాడు. చేసేది లేక దిగాలుగా ఇంటిముఖం పట్టాడు. ఒక్క రాఘవేంద్రరావే కాదు.. జిల్లాలో వేలాది మంది పేదలకు ఇదే చేదు అనుభవం ఎదురవుతున్న పరిస్థితి. ఎందుకు తొలగిస్తున్నారో విషయం తెలియదు. ఎవరి దగ్గరా సమాధానం లేదు. ఇదీ మన పౌరసరఫరాలశాఖ, ప్రభుత్వ తీరు. కడప సెవెన్‌రోడ్స్: చాలారోజుల నుంచి తమకున్న రేషన్‌కార్డులను అర్ధంతరంగా ఎందుకు రద్దు చేశారో అర్థం కాక తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ వందలాది మంది పేదలు తిరుగుతున్నారు. ఇలాంటి బాధితులతో తహసీల్దార్ కార్యాలయాలు కిటకిటలాడుతున్నాయి. కార్డులు డైనమిక్ కీ రిజిష్టర్ నుంచి ఎందుకు తొలగించారో స్థానిక పౌరసరఫరాల సిబ్బంది కూడా చెప్పలేకపోతున్నారు. కడప నగరంలో 1,807 కార్డులను ఏ కారణం చెప్పకుండానే తొలగించారు. ప్రజల నుంచి ఒత్తిడి పెరగడంతో వివరణ కోసం రాష్ట్ర పౌరసరఫరాల అధికారులకు రాశారు. అయితే ఇప్పటిదాక ఎలాంటి సమాచారం అందలేదు. ఇచ్చారు..రద్దుచేశారు పోతే మూడవ విడత జన్మభూమి, ప్రజావాణి వంటి కార్యక్రమాల్లో తమకు రేషన్‌కార్డులు మంజూరు చేయాలంటూ వేలాది మంది ప్రజలు అర్జీలు పెట్టుకున్నారు. కార్డుల కోసం ఎంతో ఆశగా ఎదురుచూశారు. జనవరి 2 నుంచి 11వ తేదీ వరకు జరిగిన నాల్గవ విడత జన్మభూమిలో ప్రభుత్వం జిల్లాలో సుమారు 57 వేల కొత్తకార్డులు పంపిణీ చేసింది. కడపలో 7 వేలకుపైగా కొత్త కార్డులు ఇచ్చారు. ఫిబ్రవరి నుంచి బియ్యం, చక్కెర, కిరోసిన్ తదితర నిత్యావసరసరుకులు పొందవచ్చని కార్డుదారులు ఎంతో సంతోషించారు. అయితే వీరి సంతోషం ఆవిరై పోవడానికి ఎంతో సమయం పట్టలేదు. నగరంలో 1,370 కొత్తకార్డులను రద్దు చేశారు. ప్రజా సాధికారసర్వే ఆధారంగా సేకరించిన వివరాల మేరకు వీరంతా అర్హులు కాదని పేర్కొంటూ కార్డులను తొలగించినట్లు చెబుతున్నారు. కార్డుల రద్దుకు దారితీసిన కారణాలను పరిశీలిస్తే ఏమాత్రం సహేతుకంగా లేవని పలువురు విమర్శిస్తున్నారు. ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లిస్తున్నారంటూ కొందరికి కార్డులు రద్దు చేశారు. అయితే తమకు ఎలాంటి ప్రాపర్టీ లేదని, ఉంటే ఎక్కడుందో చూపించాలని కార్డుదారులు ప్రశ్నిస్తున్నారు. దీంతో వారికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాకుండా తహసీల్దార్ కార్యాలయంలోని పౌరసరఫరాల సిబ్బంది తలలు బాదుకుంటున్నారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగాలున్నా..రద్దే ఔట్సోర్సింగ్ కింద చిన్నా, చితకా ఉద్యోగాలు చేస్తున్న కొందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా పేర్కొంటూ కార్డులు తొలగించారు. తుమ్మితే ఊడిపోయే ముక్కు లాంటి ఉద్యోగాలు చేసుకుని జీవిస్తున్న తమ కార్డులు రద్దు చేయడం అన్యాయమని పలువురు వాపోతున్నారు. సరైన కారణం చూపకుండా ఎలా పడితే అలా ఇష్టానుసారంగా కార్డులు రద్దు చేయడంపై పేదలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజూ పెద్ద సంఖ్యలో వస్తున్న ఇలాంటి ఫిర్యాదులను స్వీకరించి సమాచారం ఇచ్చేందుకు తహసీల్దార్ కార్యాలయంలో ప్రత్యేకంగా కొంతమంది సిబ్బందిని నియమించారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుంది. బియ్యం ఇవ్వం పొమ్మన్నారు: నాకు రేషన్‌కార్డు ఇచ్చారు. ఏడాది కాలంగా చౌక దుకాణానికి వెళ్లి బియ్యం, ఇతర సరుకులు తెచ్చుకుంటున్నాను. గతనెల కూడా ఇలాగే రేషన్‌షాపు వద్దకు వెళ్లాను. నీ కార్డు తీసేశారని డీలర్ చెప్పడంతో తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాను. – పఠాన్ బీబీ, రామకృష్ణనగర్, కడప రెండు నెలలుగా బియ్యం ఇవ్వలేదు నేను చాలా పేదరాలిని. ప్రభుత్వం మాకు గతంలో బియ్యం కార్డు ఇచ్చింది. అయితే ఉన్నట్లుండి కార్డు తొలగించారు. దీంతో రెండు నెలల నుంచి బియ్యం అందలేదు. తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా ప్రయోజనం కనిపించడం లేదు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాము. – షేక్ బీబీ, మోచంపేట, కడప -
ఖాతాలో నగదు మాయం
అనంతపురం సెంట్రల్ : గత నెలలో ఇషాక్ అనే వ్యక్తి ఖాతాలో నుంచి డబ్బు మాయమైన ఘటన మరువక ముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితుని కథనం మేరకు.... అనంతపురం రూరల్ మండలం రాచానపల్లి గ్రామానికి చెందిన పుల్లలరేవు మనోహర్‌రెడ్డి వ్యవసాయపనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. ఈయనకు సప్తగిరి సర్కిల్‌కు సమీపంలోని కరూర్ వైశ్యాబ్యాంకులో సేవింగ్ బ్యాంక్ అకౌంట్ (1434155000054587) ఉంది. గత నెల 28న నగరంలో కమలానగర్‌లోని రాజేంద్ర ఏజెన్సీలో, ఈ నెల 6న పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో స్వైప్‌మిషన్ ద్వారా దుస్తులు కొనుగోలు చేసినట్లు బాధితుడు తెలిపాడు. అంతకు మించి ఎప్పుడూ స్వైప్‌మిషన్ కానీ, ఏటీఎంకార్డులు కాని వినియోగించలేదన్నాడు. అయితే ఈ నెల 9న తన ప్రమేయం లేకుండా ఖాతా నుంచి రూ.10,200 రెండు విడుతలుగా డ్రా అయిపోయినట్లు బాధుతుడు వాపోయాడు. కేసు నమోదుకు పోలీసులు వెనుకంజ సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయాల్సిన పోలీసులు కేసు నమోదు చేసుకోవడానికే వెనుకంజ వేస్తున్నారు. బాధితుడు మనోహర్‌రెడ్డి ఫిర్యాదు చేయడానికి తిరగని పోలీస్‌స్టేషన్ అంటూ లేదు. తొలుత సైబర్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లగా తాము కేసు తీసుకోబోమని చెప్పారని బాధితుడు తెలిపాడు. అక్కడి నుంచి వన్‌టౌన్ పోలీస్స్టేషన్కెళితే తమ పరిధి కాదన్నారని, టూటౌన్ పోలీస్‌స్టేషన్, రూరల్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లినా కేసు నమోదు చేయలేదని చెప్పాడు. చివరకు ఎక్కడి నుంచి తన ఖాతాలో డబ్బు మాయం అయిందో చెప్పాలని కరూర్ వైశ్యా బ్యాంకు మేనేజర్ వద్దకు వెళ్లినా ప్రయోజనం లేకపోయిందన్నాడు. తనకు న్యాయం చేయాలని కోరాడు.