Athithi
-
ఈ వారం ఓటీటీల్లో 20 సినిమాలు రిలీజ్
ఎప్పటిలానే మరోవారం వచ్చేసింది. అయితే ఈ సోమవారం వినాయక చవితి. కాబట్టి అందరూ భక్తి మోడ్ పాటిస్తూ ఉంటారు. మరోవైపు కాస్త విశ్రాంతి దొరుకుతుంది కాబట్టి కుదిరితే ఏదైనా కొత్త సినిమా చూద్దామని అనుకుంటూ ఉంటారు. అలాంటి మూవీ లవర్స్ కోసమా అన్నట్లు ఈ వారం (సెప్టెంబరు 18 నుంచి 24 వరకు) దాదాపు 20 సినిమాలు-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్కి రెడీ అయిపోయాయి. (ఇదీ చదవండి: 'బిగ్‌బాస్' 14వరోజు హైలైట్స్.. వెళ్తూ వెళ్తూ షకీలా ఏడిపించేసింది!) గతవారంతో పోలిస్తే ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ నంబర్ తగ్గింది. అయితే పలు స్ట్రెయిట్ మూవీస్, వెబ్ సిరీసులు కొన్ని ఆసక్తి కలిగిస్తున్నాయి. 'అతిథి' వెబ్ సిరీస్‌తోపాటు జానే జాన్, కింగ్ ఆఫ్ కొత్త, ఫాస్ట్ ఎక్స్ సినిమాలు.. కాస్త చెప్పుకోదగ్గ చిత్రాలని చెప్పొచ్చు. వీటితో పాటు మెగ్ 2 సినిమా కూడా కుదిరితే ప్రయత్నించొచ్చు. సరే అదంతా పక్కనబెడితే ఈ వారం ఏ సినిమాలు ఏ ఓటీటీల్లో రాబోతున్నాయి. ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ లిస్ట్ (సెప్టెంబరు 18 -24 మధ్య) నెట్‌ఫ్లిక్స్ ద సెయింట్ ఆఫ్ సెకండ్ ఛాన్సెస్ (ఇంగ్లీష్ సినిమా) - సెప్టెంబరు 19 లవ్ ఎగైన్ (ఇంగ్లీష్ మూవీ) - సెప్టెంబరు 20 జానే జాన్ (హిందీ చిత్రం) - సెప్టెంబరు 21 కెంగన్ అసుర సీజన్ 2 (జపనీస్ సిరీస్) - సెప్టెంబరు 21 సిజర్ సెవన్ సీజన్ 4 (మాండరిన్ సిరీస్) - సెప్టెంబరు 21 సెక్స్ ఎడ్యుకేషన్ సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 21 హౌ టూ డీల్ విత్ ఏ హార్ట్‌బ్రేక్ (స్పానిష్ సినిమా) - సెప్టెంబరు 22 లవ్ ఈజ్ బ్లైండ్ సీజన్ 5 (ఇంగ్లీష్ మూవీ) - సెప్టెంబరు 22 సాంగ్ ఆఫ్ బండిట్స్ (కొరియన్ సిరీస్) - సెప్టెంబరు 22 స్పై కిడ్స్: అర్మగెడ్డోన్ (ఇంగ్లీష్ సినిమా) - సెప్టెంబరు 22 అమెజాన్ ప్రైమ్ కసండ్రో (ఇంగ్లీష్ సినిమా) - సెప్టెంబరు 22 ద కాంటినెంటల్: ఫ్రమ్ ద వరల్డ్ ఆఫ్ జాన్విక్ (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 22 హాట్‌స్టార్ అతిథి (తెలుగు సిరీస్) - సెప్టెంబరు 19 దిస్ ఫుల్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 20 కింగ్ ఆఫ్ కొత్త (తెలుగు డబ్బింగ్ సినిమా) - సెప్టెంబరు 22 నో వన్ విల్ సేవ్ యూ (ఇంగ్లీష్ చిత్రం) - సెప్టెంబరు 22 ద కర్దాషియన్స్ సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 23 జియో సినిమా ఫాస్ట్ X (తెలుగు డబ్బింగ్ సినిమా) - సెప్టెంబరు 18 బుక్ మై షో మెగ్ 2: ద ట్రెంచ్ (ఇంగ్లీష్ మూవీ) - సెప్టెంబరు 18 ఆపిల్ ప్లస్ టీవీ స్టిల్ అప్ (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 22 (ఇదీ చదవండి: 'ఖుషి' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందా?) -
నన్ను హీరోగా సినిమా తీస్తానంటే వద్దని చెప్పా: సుమన్
యోగేశ్వర్, అతిథి జంటగా నటిస్తోన్న చిత్రం 'పరారి'. ఈ చిత్రానికి సాయి శివాజీ దర్శకత్వం వహిస్తున్నారు. జీవీవీ గిరి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని శంకర ఆర్ట్స్ బ్యానర్‌పై గాలి ప్రత్యూష సమర్పిస్తున్నారు. ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ చిత్రం మార్చి 30న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ నిర్వహించిన ప్రి రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథులుగా సీనియర్ నటులు సుమన్, ప్రసన్న కుమార్, కాంగ్రెస్ లీడర్ అంజన్ కుమార్ యాదవ్ ట్రైలర్‌ను విడుదల చేశారు. సుమన్ మాట్లాడుతూ.. 'మన తెలుగు సినిమాకు ఆస్కార్ వచ్చేలా కృషి చేసిన ఆర్ఆర్ఆర్ టీంకు కంగ్రాట్స్. తెలుగు వారందరూ గర్వించే రోజు. ఇలాగే మన తెలుగు వారు మంచి సినిమాలు తీసి మరిన్నీ ఆస్కార్ అవార్డులు తీసుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నిర్మాత గిరి నన్ను హీరోగా పెట్టి సినిమా తీస్తానంటే వద్దని తన కుమారుడిని హీరోగా పరిచయం చేయడం జరిగింది. యోగేష్ చాలా బాగా నటించాడు. ఈ నెల 30 న ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలి.' అని అన్నారు నటి కవిత మాట్లాడుతూ.. 'ఈ సినిమా పాటలు చాలా బాగున్నాయి. ఇందులో హీరో చాలా చక్కటి నటనను ప్రదర్శించాడు. మంచి కథతో ఈ నెల 30 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న పరారి చిత్రం గొప్ప విజయం సాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.' అని అన్నారు. అంజన్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. 'యోగేష్ హీరోగా బాగా నటించారు. గిరి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తీశారు. మంచి కథతో వస్తున్న ఈ సినిమా యూనిట్ అందరికి ఆల్ ది బెస్ట్' అని అన్నారు. ఈ చిత్రంలో సుమన్, భూపాల్, శివాని సైని, రఘు కారుమంచి, మకరంద్ దేశముఖ్, షయాజి షిండే, అలీ , శ్రవణ్, కల్పాలత, జీవ తదితరులు ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు హనుమంత రావు(మాజీ రాజ్య సభ) , గాలి అనిల్ కుమార్, రవతు కనకయ్య, పొన్నం ప్రభాకర్, అనిల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. -
'అదితి' కోసం ప్రత్యేక బృందాలు
-
ఆ నష్టం నా వల్ల కాదు
అతిథి చిత్ర నిర్మాణంలో జాప్యానికి, అధిక నిర్మాణ వ్యయానికి తానేమి కాణం కాదని నటి అనన్య స్పష్టం చేసింది. ఎంగేయుం ఎప్పోదుం, నాడోడిగళ్ చిత్రాలతో తమిళంలో ప్రాచుర్యం పొందిన మలయాళ భామ అనన్య. ఈమె నటించిన తాజా చిత్రం అతిథి ఇటీవల తెరపైకి వచ్చింది. అయితే ఈ చిత్ర నిర్మాత, ప్రతినాయకుడు నిఖేష్‌రామ్ నటి అనన్య చాలా ఇబ్బందులకు గురి చేసిందని, ఆమె వల్ల 50 లక్షల వరకు నష్టం కలిగిందని తీవ్ర ఆరోపణలు చేశారు. అనన్య సరైన సమయానికి షూటింగ్‌కు వచ్చేది కాదని నక్షత్ర హోటల్లో తన భర్తతో కలిసి బస చేసి ఇష్టానికి ఖర్చు చేసిందని పలు ఆరోపణలు గుప్పించారు. అయితే నటి అనన్య అవన్నీ అవాస్తవ ఆరోపణలని కొట్టిపారేసింది. ఆమె స్పందిస్తూ తన వల్ల అతిథి చిత్రానికి ఎలాంటి సమస్యలు కలగలేదని పేర్కొంది. చిత్ర షూటింగే ప్రణాళిక ప్రకారం జరగలేదని చెప్పింది. ఇతర కారణాల వల్లే చిత్ర షూటింగ్ చాలా సార్లు రద్దు అయ్యిందని తెలిపింది. అందువల్ల తన కాల్షీట్స్ చాలా వృథా అయ్యాయని అంది. తన బసకు ఏర్పాటు చేసిన హోటల్ నచ్చక పోవడంతో వేరే హోటల్‌కు మారానని అందుకు అయిన అదనపు ఖర్చును తానే భరించానని చెప్పింది. చాలాసార్లు షూటింగ్ ప్రారంభానికి ముందే స్పాట్‌కు వచ్చేదానినని తెలిపింది. షూటింగ్ లేకుండా చాలా రోజులు ఖాళీగా గడిపానని చెప్పింది. కాబట్టి షూటింగ్ జాప్యానికి తాను కారణం కాదని స్పష్టం చేసింది. తన కెన్యా పర్యటన రద్దు అయ్యిందని అందువల్లే ఆ ఖర్చును చెల్లించమని అడిగానంది. అలాగే మలయాళ చిత్రాల షూటింగ్లలో బిజీగా ఉండడంతో అతిథి చిత్ర ప్రచార కార్యక్రమంలో పాల్గొనలేక పోయానని అనన్య అంది.