ATM center
-
పంజగుట్ట: మేనేజర్ ఏటీఎం కార్డు నుంచి డబ్బులు డ్రా చేసుకొని..
సాక్షి, పంజగుట్ట: యువతి కనిపించకుండా పోయిన సంఘటన పంజగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు... చాంద్రాయణగుట్ట ఇబ్రహీం మజ్జిద్ సమీపంలో నివసించే ఉజ్మా బేగం(22) పంజగుట్టలోని ఓ ప్రైవేట్ సంస్థలో పని చేస్తుంది. ఈ నెల 16వ తేదీ సాయంత్రం 7 గంటల సమయంలో ఆఫీస్ మేనేజర్‌కు కొద్దిగా డబ్బులు కావాలని అడిగింది. మేనేజర్ ఏటీఎం కార్డు ఇచ్చి డ్రా చేసుకోవాలన్నాడు. ద్వారకాపూరి కాలనీ సాయిబాబా ఆలయం వద్ద ఉన్న ఏటీఎంలో డబ్బులు డ్రా చేసుకుని సహోద్యోగికి కార్డు ఇచ్చి మేనేజర్‌కు ఇవ్వాలని వెళ్లిపోయింది. ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆఫీస్‌లో చుట్టుపక్కల ఆరా తీసినా ఫలితంలేదు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్‌లో ఉంది. దీంతో బుధవారం ఆమె తల్లి నజ్మాబేగం పంజగుట్ట పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: భూవివాదంలో మంత్రి మల్లారెడ్డి బావమరిది -
గ్యాస్ కట్టర్‌తో ఏటీఎంలు తెరిచి.. రూ.65 లక్షలు ఊడ్చేశాడు
డోన్ టౌన్: కర్నూలు జిల్లా డోన్ పట్టణ నడిబొడ్డున గల ఏటీఎం సెంటర్లో ఆదివారం అర్ధరాత్రి దాటాక ఓ దొంగ భారీ చోరీకి పాల్పడ్డాడు. అక్కడ ఉన్న రెండు ఏటీఎం మెషిన్లను గ్యాస్ కట్టర్ సహాయంతో తెరిచి రూ.65,44,900ను అపహరించుకుపోయాడు. స్థానిక శారద కాన్వెంట్ సమీపంలోని స్టేట్ బ్యాంక్ ఏటీఎం కేంద్రానికి రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఉన్న రెండు మెషిన్లలో శుక్రవారం బ్యాంక్ అధికారులు రూ.80 లక్షల నగదు ఉంచారు. ఆదివారం రాత్రి వరకు రూ.14,55,100 నగదును వినియోగదారులు విత్ డ్రా చేసుకోగా.. మిగిలిన రూ.65,44,900ను దుండగుడు అపహరించాడు. మంకీ క్యాప్ ధరించి.. ఆపై టోపీ పెట్టాడు ఆదివారం రాత్రి 2.50 గంటల సమయంలో మంకీ క్యాప్, దానిపై మరో టోపీ ధరించిన గుర్తు తెలియని వ్యక్తి ఏటీఎం కేంద్రం ముందు బయట వైపున ఉన్న సీసీ కెమెరా ధ్వంసం చేసి పక్కనే ఉన్న డ్రైనేజీలో పడేశాడు. తన వెంట తెచ్చుకున్న చిన్న గ్యాస్ కట్టర్, ఐరన్ రాడ్డు, వాటర్ బాటిల్ సాయంతో రెండు ఏటీఎంలను లాఘవంగా తెరిచాడు. గ్యాస్ కట్టర్ వినియోగించే సమయంలో నోట్లు కాలిపోకుండా నీళ్లు పోస్తూ పని ముగించినట్టు లోపల ఉన్న మరో సీసీ కెమెరాలో రికార్డయింది. సోమవారం ఉదయం ఏటీఎం కేంద్రం బయట సీసీ కెమెరా పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో చోరీ విషయం వెలుగు చూసింది. ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు వర్షం పడటంతో ఆ దారిలో ఎవరూ వెళ్లకపోవడం కూడా ఆగంతకుడికి అనుకూలించింది. సీఐ మల్లికార్జున, డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, జిల్లా క్రైం విభాగపు డీఎస్పీ శ్రీనివాస్ ఏటీఎం కేంద్రానికి చేరుకుని పరిశీలించారు. కర్నూలు నుంచి డాగ్ స్క్వాడ్, ఫింగర్ ప్రింట్ నిపుణులు వచ్చి ఆధారాలు సేకరించారు. బ్యాంక్ అకౌంట్స్ డిప్యూటీ మేనేజర్ బి.ప్రాన్సిస్ రుబిరో ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. చోరీకి పాల్పడిన వ్యక్తి పాత నేరస్తుడా లేక ఏటీఎం మెషిన్ల తయారీ, మెకానిజంలో నైపుణ్యం గల వ్యక్తా అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. దొంగను గుర్తించేందుకు పట్టణంలో అన్నివైపులా గల సీసీ కెమెరాల్లోని ఫుటేజీని పరిశీలిస్తున్నారు. -
ఏ టీ ఎం సెంటర్ నుంచి భారీ మంటలు శబ్దాలు
-
నో..క్యాష్!
బ్యాంకు ఖాతాదారులను మళ్లీ కరెన్సీ కష్టాలు పలకరిస్తున్నాయి. ఏ బ్యాంకుకు వెళ్లినా, ఏటీఎం సెంటర్‌కు పోయినా నో క్యాష్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం పాత నోట్లు రద్దు చేసిన నాటి నుంచి ప్రారంభమైన నోట్ల ఇబ్బందులు ఇప్పటికి కూడా తొలగలేదు. రోజురోజుకు కొత్త నిబంధనలు రావడం వల్ల బ్యాంకుల్లో డిపాజిట్ చేసే వారు తగ్గిపోతున్నారు. మూడు పర్యాయాల కంటే ఎక్కువ సార్లు డిపాజిట్ చేసినా, డ్రా చేసినా చార్జీలు వసూలు చేస్తున్నారు. దీంతో బ్యాంకుల్లో లావీదేవాలు నిర్వహించే వారు తగ్గిపోతున్నారు. ఉదయం ఎవరైనా డబ్బులు డిపాజిట్ చేస్తే సాయంత్రం ఇస్తామని బ్యాంకు అధికారులు చెప్పడం గమనార్హం. మిర్యాలగూడ : జిల్లా వ్యాప్తంగా డబ్బులు లేక బ్యాంకులన్నీ బోసిపోతున్నాయి. ఖాతాదారులు డబ్బుల కోసం బ్యాంకుల చుట్టు, ఏటీఎంల చుట్టూ ప్రదక్షిణలు చేసినా ప్రయోజనం లేకుండా పోతోంది. జిల్లాలో అన్ని రకాల బ్యాంకులు 270 ఉండగా 1500 ఏటీఎం సెంటర్లు ఉన్నాయి. అయినా పది శాతం ఏటీఎంలల్లోనే డబ్బులు ఉంటున్నాయి. జిల్లావ్యాప్తంగా వారం రోజులుగా డబ్బుల కోసం ఖాతాదారులు ఇక్కట్లు పడుతున్నారు. జూన్ 1వ తేదీ నుంచి ఉద్యోగులకు సైతం కష్టాలు రానున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రైవేట్ ఉద్యోగులకు నెలవారి వేతనాలు బ్యాం కు ద్వారా వచ్చే అవకాశం ఉంది. దీంతో వేతనాల డబ్బు ల కోసం ఏటీఎంలు, బ్యాం కుల చుట్టూ తిరగనున్నారు. క్యాష్‌లెస్ వైపు మళ్లించడానికే.. ఏ వస్తువు కొనుగోలు చేసినా క్యాష్‌లెస్‌తో డబ్బు చెల్లింపుల వైపు మళ్లించడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. రాబోయే రోజుల్లో డబ్బుల మార్పిడి తగ్గిపోయే అవకాశం ఉంది. అందుకు గాను ప్రభుత్వమే తక్కువ డబ్బులు విడుదల చేస్తున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. దీంతో ఆన్లైన్ ద్వారా చెల్లింపుల కారణంగా బ్యాంకులు, ఏటీఎంలలో డబ్బులు లేకున్నా ఖాతాదారుల ఇబ్బందులు తగ్గుతాయని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. క్యాష్‌లెస్ సేవలపై అవగాహన కల్పించడానికి గాను జూన్ 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు అన్ని బ్యాంకుల అధికారులు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అవగాహన కల్పించడానికి ‘క్యాష్‌లెస్ లిటరసీ వీక్’ నిర్వహించడానికి ప్రణాళిక రూపొందించడం విశేషం. ఏటీఎంలో డబ్బులు లేవు ప్రస్తుతం నేను గ్రూప్స్‌కు ప్రిపేర్ అవుతున్నాను. అందులో భాగంగా కొత్త పుస్తకాలు కొనుగోలు చేసేందుకు డబ్బుల కోసం మూడు రోజుల నుంచి ఏటీఎం సెంటర్ వద్దకు వస్తున్నా. కానీ ఎక్కడ కూడా డబ్బులు లేవు. సమయానికి చేతిలో డబ్బులు లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. – భీమ్‌సింగ్, విద్యార్థి, మిర్యాలగూడ -
ఢిల్లీలో ఒకటో తారీఖు కష్టాలు
-
ఏటీఎంలో చోరీకి యత్నం
మానకొండూరు(కరీంనగర్ జిల్లా): మానకొండూరు మండలకేంద్రంలోని మీ-సేవా కేంద్రం వద్ద ఉన్న ఓ ఏటీఎంలోకి చొరబడ్డ దొంగను మంగళవారం రాత్రి పోలీసులు పట్టుకున్నారు. మండలకేంద్రంలోని మీ-సేవా కేంద్రం వద్ద గతేడాది ఇండిక్యాష్ ఏటీఎంను ఏర్పాటు చేశారు. కాగా మంగళవారం రాత్రి పది గంటల ప్రాంతంలో సామాన్య ప్రజల మాదిరిగానే రంజిత్ అనే వ్యక్తి ఏటీఎంలోకి వెళ్లాడు. ఏటీఎం సెంటర్ లోపలికి వెళ్లి షట్టరును మూసేయడంతో అక్కడే ఉన్నవారికి అనుమానం కలిగి బయట రావాలని, ఎవరు నీవు అంటూ ప్రశ్నించారు. కాసేపటికి ఏటీఎం నుంచి బయటికి వచ్చిన అతడు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని రంజిత్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి ఓ స్కూడ్రైవర్ దొరికిందని, సంబంధిత ఏటీఎం నిర్వాహకులకు సమాచారం అందించామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఇంద్రసేనారెడ్డి తెలిపారు. -
ఏటీఎం సెంటర్ సెక్యూరిటీ గార్డే దొంగ..
లక్కిరెడ్డిపల్లె : వైఎస్సార్ జిల్లా లక్కిరెడ్డిపల్లె మండల కేంద్రంలో సోమవారం రాత్రి ఎస్బిఐ ఏటీఎం సెంటర్ దగ్గర బంగారు నగల చోరీకి పాల్పడింది... అక్కడ విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ గార్డేనని తేలింది. ఎస్బీఐ స్థానిక శాఖ వద్ద గార్డ్‌గా పనిచేస్తున్న శ్రీరాములు సోమవారం రాత్రి ద్విచక్ర వాహనంపై బ్యాంకు ఏటీఎం సెంటర్‌కు వెళ్లాడు. వాహనాన్ని నిలిపి లోపలికి వెళ్లి నగదు డ్రా చేసుకుని వచ్చాడు. ఈలోగా ఏటీఎం సెంటర్ బయట సెక్యూరిటీ గార్డ్‌గా విధులు నిర్వహిస్తున్న విశ్వనాథ్.. శ్రీరాములు ద్విచక్రవాహనంలో ఉంచిన 30 తులాల బంగారు ఆభరణాల బ్యాగును కొట్టేశాడు. నగల బ్యాగు కనిపించకపోవడంతో కంగారుపడ్డ శ్రీరాములు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా చోరీకి పాల్పడింది సెక్యూరిటీ గార్డ్ విశ్వనాథ్‌గా గుర్తించారు. అతడ్ని అదుపులోకి తీసుకుని బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. -
నమ్మితే నట్టేట ముంచాడు!
వర్ని: ఏటీఎం లోంచి డబ్బు తీసి ఇవ్వమంటే, కార్డును మార్చేసి రూ.25 వేలు డ్రా చేసుకొని ఉడాయించాడో దుండగుడు. ఈ ఘటన వర్ని మండల కేంద్రంలో చేసుకుంది. బాధితుడి కథనం మేర కు.. అక్బర్‌నగర్‌కు చెందిన సత్యనారాయణకు ఆంధ్రాబ్యాంకులో ఖాతా ఉంది. డబ్బు అవసరం కావడంతో గురువారం ఎస్బీఐ ఏటీఎం కేంద్రం వద్దకు వచ్చాడు. డ్రా చేయడం తెలియని ఆయన, పక్కనే ఉన్న అపరిచిత వ్యక్తిని సెక్యూరిటీ గార్డుగా భావించి సాయం కోరాడు. సదరు వ్యక్తి కొంతసేపు ప్రయత్నించి డబ్బు రావడం లేదని ఏటీఎం కార్డు ఇచ్చి వెళ్లిపోయాడు. బటయ కు వచ్చిన కొద్దిసేపటికే సత్యనారాయణ ఫోన్‌కు డబ్బు డ్రా చేసినట్టు మెసేజ్ రావడంతో ఉలిక్కిపడ్డాడు. ఏటీఎం వద్దకు వెళ్లగా అప్పటికే అపరిచితుడు అక్కడి నుంచి ఉడాయించాడు. ఏటీఎం కార్డును బదిలీ చేసి డబ్బు డ్రా చేసినట్టు గుర్తించిన బాధితుడు లబోదిబోమంటూ.. ఆంద్రాబ్యాంక్ మేనేజర్‌ను కలిసి వివరించాడు. ఏటీఎం కార్డును బ్లాక్ చేయాలని కోరాడు. -
డ్రా చేయకుండానే ఏటీఎం నుంచి డబ్బులు
చిత్తూరు (అర్బన్) : ఏటీఎం సెంటర్లో డబ్బులు తీసుకునేందుకు వెళ్లిన ఓ వ్యక్తికి కార్డును ఉపయోగించకుండానే నోట్లు వచ్చాయి. ఏకంగా రూ.15 వేల నగదు రావడంతో ఆశ్చర్యానికి గురయ్యాడు ఆ వ్యక్తి. అయితే తనది కాని డబ్బు వద్దని నిర్ణయించుకుని ఈ మొత్తాన్ని పోలీసులకు అప్పగించి నిజాయితీ చాటుకున్నాడు. బంగారుపాళ్యంకు చెందిన విజయకుమార్ సోమవారం చిత్తూరుకు పని మీద వచ్చాడు. కొంగారెడ్డిపల్లెలోని ఎస్బీఐ స్టేట్ బ్యాంకు ఏటీఎంలో రూ.15 వేల నగదు విత్‌డ్రా చేయడానికి ప్రయత్నించాడు. మిషన్ నుంచి నగదు రాకపోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కొద్ది సేపటి తరువాత ఎస్ఆర్.పురం మండలం డీకే.మర్రిపల్లెకు చెందిన బి.బాబు అనే వ్యక్తి అదే ఏటీఎంలో నగదు తీసుకోవడానికి వచ్చాడు. కార్డు ఉపయోగించేలోపే ఏటీఎం నుంచి రూ.15 వేలు బయటకు వచ్చాయి. దీన్ని తీసుకున్న కొద్ది సెకన్లలో బ్యాలన్స్ చూపే కాగితం కూడా వచ్చింది. నగదును తీసుకున్న బాబు ఆ మొత్తాన్ని చిత్తూరు వన్‌టౌన్ సీఐ నిరంజన్‌కుమార్‌కు అందజేశారు. బ్యాలెన్స్ చీటీలో ఉన్న ఆధారాలతో విజయకుమార్‌ను స్టేషన్‌కు పిలిపించిన సీఐ, ఎస్ఐ రాంభూపాల్‌లు రూ.15 వేల నగదును బాబు చేతులు మీదుగా అందచేశారు. నిజాయితీను చాటుకున్న బాబును పోలీసు అధికారులు అభినందించారు. -
బూడిదగా మారిన ఏటీఎం కేంద్రం
పెదవేగి (పశ్చిమ గోదావరి) : పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండల కేంద్రంలో ఓ బ్యాంకు ఏటీఎం అగ్ని ప్రమాదంలో పూర్తిగా దగ్ధం అయింది. మండల తహశీల్దార్ కార్యాలయం వద్దనున్న ఇండియన్ బ్యాంకు ఏటీఎంలో గురువారం అర్ధరాత్రి 1.30 గంటలకు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడంతో అగ్ని ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. మంటలకు ఏటీఎం కేంద్రంలో ఏమీ మిగలకుండా అంతా బూడిదగా మారింది. శుక్రవారం తెల్లవారుజామున గమనించిన స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చారు. బ్యాంకు మేనేజర్ చాంబర్ కూడా కొద్ది మేర దగ్ధం అయినట్టు తెలుస్తోంది. కాగా ఏటీఎం యంత్రంలో నగదు ఎంత ఉన్నదనే విషయం తెలుసుకోవడానికి బ్యాంకు సిబ్బంది ప్రయత్నం చేస్తున్నారు. -
ఏటీఎం కేంద్రంలో బురిడీ
నగదు డ్రా చేయడం తెలియని ఇద్దరిని మోసం చేసిన గుర్తుతెలియని వ్యక్తి రూ.7 వేలతో పరారు మేదరమెట్ల : ఏటీఎం కేంద్రంలో నగదు డ్రా చేయడం ఎలాగో తెలియని ఇద్దరు వ్యక్తులను మరో వ్యక్తి నమ్మించి మోసం చేశాడు. ఈ సంఘటన మేదరమెట్ల బస్టాండ్‌లోని ఏటీఎం కేంద్రంలో గురువారం జరిగింది. ఆ వివరాల్లోకెళ్తే... ఖమ్మం జిల్లాకు చెందిన బి.సీతారాములు, బి.నల్లశ్రీనులు సపోటా కాయలు కోసే పనికి కొరిశపాడు గ్రామానికి వచ్చారు. గ్రామానికి చెందిన గోలి గంగాప్రసాద్‌తో కలిసి పనులకు వెళ్తున్నారు. ముగ్గురూ స్నేహంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో సీతారాములు, నల్లశ్రీనులకు డబ్బు ఇవ్వాల్సిన ఖమ్మం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి వీరిని బ్యాంక్ అకౌంట్ నంబర్ చెప్పమని అడిగాడు. దీంతో వారు గంగాప్రసాద్ అకౌంట్ నంబర్ ఇచ్చారు. రూ.7 వేలు నగదు జమ చేశానని ఖమ్మం జిల్లాకు చెందిన వ్యక్తి ఫోన్‌చేసి చెప్పడంతో డ్రా చేసుకునేందుకు గంగాప్రసాద్ వద్ద ఏటీఎం కార్డు తీసుకుని గురువారం మేదరమెట్ల బస్టాండ్‌లోని ఏటీఎం కేంద్రానికి వచ్చారు. అయితే, నగదు డ్రా చేయడం ఎలాగో తెలియకపోవడంతో వీరిని గమనించిన ఓ గుర్తుతెలియని వ్యక్తి.. తాను డ్రాచేసి ఇస్తానని చెప్పి కార్డు తీసుకుని పిన్‌నంబర్ అడిగి తెలుసుకున్నాడు. కానీ, వారిని బురిడీ కొట్టించి అతని వద్ద ఉన్న మరో నకిలీ కార్డును మిషన్‌లోపెట్టి చూసి అకౌంట్లో నగదు లేవని నమ్మించాడు. అదే కార్డును వారికి అందజేశాడు. వారు ఏటీఎం కేంద్రంలో నుంచి బయటకు వచ్చిన వెంటనే తాను దాచిన అసలు కార్డు ద్వారా రూ.7 వేలు నగదు డ్రా చేసుకుని పరారయ్యాడు. గంగాప్రసాద్ సెల్‌ఫోన్‌కు నగదు డ్రాచేసినట్లు మెసేజ్ రావడంతో ఫోన్‌చేసి అసలు విషయం తెలుసుకున్న సీతారాములు, నల్లశ్రీను లబోదిబోమన్నారు. -
రివాల్వర్‌తో బెదిరించి..
- ఏటీఎంలో యువతి నుంచి న గలు, సెల్‌ఫోన్, ఏటీఎం కార్డు చోరీ - హైదరాబాద్ యూసుఫ్‌గూడలో ఘటన హైదరాబాద్: డబ్బులు డ్రా చేసేందుకు ఏటీఎంకు వెళ్లిన యువతిని ఓ అగంతకుడు రివాల్వర్‌తో బెదిరించి కాల్పులు జరిపాడు. ఆమె వద్ద నుంచి రూ. 65 వేలు విలువచేసే బంగారు నగలు, ఏటీఎం కార్డు,సెల్‌ఫోన్‌ను దోచుకుని పారిపోయాడు. హైదరాబాద్‌లోని ఎస్ఆర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం ఈ సంఘటన జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా తాటిపాకకు చెందిన శ్రీలలిత మధురానగర్‌లోని ఓ హాస్టల్లో ఉంటూ బేగంపేటలోని సాఫ్ట్వేర్ సంస్థలో ఉద్యోగం చేస్తోంది. కాగా, శ్రీలలిత బుధవారం ఉదయం 7.30 గంటలకు డబ్బులు డ్రా చేసేందుకు యూసుఫ్‌గూడలోని ఎస్బీఐ బ్యాంకు ఏటీఎంకు వెళ్లింది. ఏటీఎం కార్డు తీస్తుండగా ముఖానికి ముసుగు వేసుకొని వచ్చిన ఓ అగంతకుడు రివాల్వర్ చూపెట్టి ఒంటిపై ఉన్న నగలు తీసి ఇవ్వాలని ఆమెను బెదిరించాడు. అందుకు ఆమె నిరాకరించడంతో రివాల్వర్‌తో ఏటీఎంలోనే కాల్పులకు తెగబడ్డాడు. తర్వాత ఆమె వద్ద ఉన్న బంగారు ఆభరణాలతో పాటు, సెల్‌ఫోన్, ఏటీఎం కార్డు , పాస్వర్డ్ నంబరు తీసుకుని పారిపోయాడు. జరిగిన ఘటనపై స్థానికుల సహాయంతో సదరు యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా, ఏటీఎం సెంటర్లో కాల్పులు జరిగిన ప్రదేశాన్ని ఇన్స్పెక్టర్ రమణగౌడ్ పరిశీలించారు. ఏటీఎంకు కొద్దిదూరంలో పడి ఉన్న బుల్లెట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రివాల్వర్ పేలిన సమయంలో పెద్ద శబ్దం వచ్చిందని, స్థానికంగా మెట్రోరైల్ పనులు నడుస్తున్నందున పెద్దగా పట్టించుకోలేదని స్థానికులు తెలిపారు. సీసీ కెమెరా ఫుటేజీలో ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు దుండగుడు ముఖానికి గుడ్డ కట్టుకుని ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అతడ్ని పట్టుకునేందుకు ప్రత్యేక టీంలు ఏర్పాటు చేశామని తెలిపారు. -
ఏటీఎం సెంటర్లో కాల్పులు
హైదరాబాద్: డబ్బులు డ్రా చేసేందుకు ఏటీఎంకు వెళ్లిన యువతిని ఓ అగంతకుడు రివాల్వర్‌తో బెదిరించి కాల్పులు జరిపాడు. ఆమె వద్ద నుంచి సుమారు 65 వేలు విలువచేసే బంగారు నగలు, ఏటీఎం కార్డు,సెల్‌ఫోన్‌ను దోచుకుని పారిపోయాడు.ఈ సంఘటన నగరంలోని ఎస్ఆర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చివు గోదావరి జిల్లా తాటిపాక ప్రాంతానికి చెందిన శ్రీలలిత మధురానగర్‌లోని దీక్షిసధన్ మహిళా హాస్టల్లో ఉంటూ బేగంపేటలోగల సాఫ్ట్వేర్ సంస్థలో ఉద్యోగం చేస్తోంది. ఉదయం 7.30గంటల సమయంలో డబ్బులు తెచ్చుకునేందుకు యూసుఫ్‌గూడకు వెళ్లే మార్గంలో ఉన్న ఎస్బీఐ బ్యాంకు ఏటీఎంకు వెళ్లింది. ఏటీఎం కార్డు తీస్తుండగా ముఖానికి గుడ్డకట్టుకుని లోపలికి వచ్చిన ఓ అగంతకుడు రివాల్వర్ తీసి ఆమె తలకు పెట్టాడు. అరవకుండా తాను చెప్పింది చేయాలంటూ బెదిరించాడు. ఒంటిపై ఉన్న నగలు తీసి ఇవ్వాలని అడిగాడు. ముందు ఆమె నిరాకరించడంతో తనవద్ద ఉన్నది డమ్మి రివాల్వర్ అనుకుంటున్నావా అంటూ కాల్పులు జరిపాడు. దీంతో తీవ్రంగా భయపడ్డ సదరు యువతి మెడలోని చైన్, చేతిరింగు, చెవిదుద్దులు తీసి ఇచ్చింది. సెల్‌ఫోన్‌తోపాటు ఏటీఎం కార్డు, పాస్వర్డ్ నంబరు తీసుకుని పారిపోయాడు. జరిగిన సంఘటనతో తీవ్ర భయాందోళకు గురైన లలిత కొద్దిసేపటితరువాత తేరుకుని స్థానికుల సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
ఏటీఎం నుంచి వస్తుండగా కత్తితో దాడి
బాలానగర్ (హైదరాబాద్) : గుర్తు తెలియని దుండగుడి చేతిలో కత్తిపోటుకు గురైన ఓ వ్యక్తి ఆస్పత్రి పాలయ్యాడు. ఈ సంఘటన హైదరాబాద్ కూకట్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. వివరాల ప్రకారం.. కృష్ణా జిల్లా గుడివాడ మండలం గురుజాలకు చెందిన మరీదు వెంకటనర్సింహారావు(29) అనే వ్యక్తి బాలానగర్‌లో నివాసం ఉంటూ మాదాపూర్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తుంటాడు. సోమవారం రాత్రి తన ఇంటి సమీపంలోని ఏటీఎంకు వెళ్లి డబ్బు డ్రా చేసుకొని తిరిగి వస్తుండగా ఓ గుర్తు తెలియని వ్యక్తి కత్తితో పొడవబోయాడు. అప్రమత్తమైన నర్సింహారావు చేతిని అడ్డుగా పెట్టడంతో కత్తి చేతికి బలంగా గుచ్చుకుంది. అతడు కేకలు వేయటంతో ఆగంతకుడు పారిపోయాడు. స్థానికులు, కుటుంబ సభ్యులు క్షతగాత్రుడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే తమకు ఎవరితోనూ విభేదాలు లేవని అతని భార్య విజయలక్ష్మి వెల్లడించింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ఎనీ టైం మోసం..
బజార్హత్నూర్ మండలం గిర్నూర్ గ్రామానికి చెందిన శనిగారపు నర్సయ్య అవసరానికి డబ్బులు తీసుకునేందుకు గత సెప్టెంబర్‌లో ఇచ్చోడలోని ఓ ఏటీఎం సెంటర్‌కు వెళ్లాడు. అతని వెంట ఓ ఇద్దరు వ్యక్తులు ఏటీఎంలోకి వెళ్లి మాటల్లో పెట్టారు. అతని వద్ద నుంచి ఏటీఎం కార్డు దొంగిలించారు. అనంతరం అతని ఖాతా నుంచి రూ.25 వేలు కాజేశారు. జిల్లాలోని ఏటీఎం సెంటర్లలో జరుగుతున్న మోసాలకు ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఇలా ఎంతో మంది బాధితులు మోసపోతున్నారు. లక్షల రూపాయలు పోగొట్టుకుంటున్నారు. - ఏటీఎం సెంటర్లలో కనిపించని సెక్యూరిటీ గార్డులు - పనిచేయని సీసీ కెమెరాలు - మోసాలకు పాల్పడుతున్న దుండగులు - పట్టించుకోని బ్యాంక్ సిబ్బంది ఆదిలాబాద్ క్రైం : జిల్లాలో ఏటీఎం సెంట ర్ల నిర్వహణ అత్యంత దారుణంగా తయారైంది. ఎక్కడా సెక్యురిటీ గార్డులు ఉండ డం లేదు. వాటి నిర్వహణను గాలికొదిలేశారు. ఇదే అదునుగా భావించి మోసకారు లు రెచ్చిపోతున్నారు. మాయమాటలతోఅమాయకులను బుట్టలో వేసుకుని ఏటీఎం కార్డులను మా ర్చేసి.. వేల రూపాయలు దండుకుంటున్నారు. ఇలా ఆర్థిక నేరాలు రోజురోజకు శృతి మించుతున్నా బ్యాంకు యాజమాన్యాలు మాత్రం తమకు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వినియోగదారులకు మెరుగైన సేవలందించాలనే ఉద్దేశంతో బ్యాంకులు పోటాపోటీగా ఏటీఎం సెంటర్లు ఏర్పాటు చేస్తున్నా.. రక్షణ చర్యలు మాత్రం విస్మరిస్తున్నాయి. నిత్యం లక్షలాది రూపాయలు డ్రా చేసే ఈ కేంద్రాల వద్ద కనీసం సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేయకపోవడంతో వినియోగదారులు భయూందోళనకు గురవుతున్నారు. జిల్లాలో మొత్తం 200లకుపైగా ఏటీఎం కేంద్రాలున్నాయి. వీటి నుంచి వినియోగదారులు కోటి రూపాయలకు పైగా ప్రతిరోజూ నగదు డ్రా చేస్తున్నట్లు తెలుస్తోంది. భద్రత గాలికి.. ఏటీఎం సెంటర్ల వద్ద భద్రత కల్పించాల్సిన బాధ్యత సంబంధిత బ్యాంకులపైనే ఉంది. జిల్లాలోని చాలా ఏటీఎంల వద్ద భద్రత గాలిలో దీపంలా ఉంది. చాలా కేంద్రాల వద్ద సెక్యూరిటీ గార్డులు కనిపించడం లేదు. పైగా ఏటీఎం కేంద్రాల లోపల సీసీ కెమెరాలు కూడా పనిచేయడం లేదు. దీనికి కారణం చాలా వరకు బ్యాంకులు ఆర్థిక భారం పడుతుందనే ఉద్దేశంతో నియమించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్ని బ్యాంకులు బ్యాంక్ వద్ద ఉన్న ఏటీఎం సెంటర్ వద్ద, ముఖ్యమైన పాయింట్ల వద్ద మాత్రమే సెక్యూరిటీ గార్డును నియమించుకుంటున్నాయి. ఇతర పాయింట్ల వద్ద నియమించడం లేదు. ముఖ్యంగా పట్టణ, మండల కేంద్రాల్లో ఉండే ఏటీఎంల వద్ద భద్రత ఉండడం లేదు. ఏటీఎం సెంటర్లకు ఆటోమెటిక్‌గా మూసుకునే గ్లాస్ డోర్ ఉండాలి. జిల్లాలో ఇలాంటి ఎక్కడా కనిపించవు. ఎల్లప్పుడూ తలుపులు తెరిచే ఉంటాయి. దీంతో దుండగులు నేరుగా లోపలికి ప్రవేశించి వినియోగదారులు డబ్బులు డ్రా చేసే సమయంలో మాయమాటలు చెప్పడంతోపాటు వారి ఏటీఎం కార్డులను దొంగిలిస్తున్నారు. ఎలాగోలా పిన్‌కోడ్ తెలుసుకుని పెద్ద ఎత్తున నగదు డ్రా చేసి మోసం చేస్తున్నారు. పోలీసుస్టేషన్లో కేసు పెట్టినా.. మళ్లీ ఆ డబ్బులు తిరిగి వస్తాయన్న గ్యారంటీ లేదు. ఇలా కొంత మంది మోసపోయిన వారు పోలీసులను కూడా ఆశ్రయించడం లేదని తెలుస్తోంది. నగదు లేకున్నా.. ఓపెన్‌గానే.. జిల్లాలో ఏటీఎం సెంటర్ల భద్రత ఒక ఎత్తయితే.. వాటి నిర్వహణ వినియోగదారులకు మరింత చికాకు కనిపిస్తున్నాయి. చాలా వరకు ఏటీఎం సెంటర్లు ఎప్పుడు చూసినా సాంకేతిక కారణాలతో పనిచేయడం లేదని,ఏటీఎంలో నో మనీఅంటూ బోర్డులు దర్శనమిస్తాయి. ఏటీఎంలలో అవసరం మేరకు డ బ్బులు నిల్వ ఉంచడం లేదని వినియోగదారులు పేర్కొంటున్నారు. దీనివల్ల తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందని వారు వాపోతున్నారు. ఈ పరిస్థితి నెలలో మొదటి వారం మరింత కష్టంగా ఉంటోంది. ఈ వారంలో ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగులు వేతనాలు తీసుకునేందుకు ఏటీఎంల బాట పడుతారు. ఆ సమయంలో డబ్బులు లేవని బోర్డులు దర్శనమివ్వడంతో నిరాశగా ఇంటిముఖం పట్టాల్సిన పరిస్థితి నెలకొంది. భద్రత ఏర్పాటు చేసుకోవాలి.. - ఎల్.రఘు, వన్‌టౌన్ సీఐ ఏటీఎం సెంటర్లలో బ్యాంక్‌లు కచ్చితంగా భద్రత ఏర్పాటు చేసుకోవాలి. ఇటీవల ఆదిలాబాద్‌లోని ఓ బ్యాంక్ ఏటీఎం సెంటర్ అద్దంను గుర్తు తెలియని దుండుగులు పగులగొట్టిన సంఘటన జరిగింది. గతంలో బ్యాంక్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి సెక్యూరిటీ గార్డులను నియమించుకోవాలని, భద్రతకు పాటించాల్సిన చర్యలపై సూచించాం. అరుునా పట్టించుకోవడం లేదు. అవాంఛనీయ సంఘటనలు జరిగితే బ్యాంక్ అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ప్రతి ఏటీఎంలో సెక్యురిటీ గార్డు, సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి. -
‘ఏటీఎం’ నిందితుణ్ణి పట్టిస్తే 3 లక్షలు
-
‘ఏటీఎం’ నిందితుణ్ణి పట్టిస్తే 3 లక్షలు
అనంతపురం, న్యూస్‌లైన్: కర్ణాటక రాజ దాని బెంగళూరులోని ఏటీఎం కేంద్రంలో సుమారు పది రోజుల కిందట పట్టపగలే ఓ మహిళపై దారుణంగా దాడికి పాల్పడిన అగంతకుడి ఆచూకీ నేటికీ లభ్యం కాలేదు. దీంతో పోలీసులు నిందితుణ్ణి పట్టిచ్చిన వారికి ప్రకటించిన నజరానాను రూ.లక్ష నుంచి 3 లక్షలకు పెంచారు. ఇప్పటికే కర్ణాటక ప్రకటించిన నజరానా రూ. లక్షతోపాటు అనంతపురం పోలీసుల తరఫున మరో రూ.2 లక్షలు బహుమతి ఇస్తామని చిత్తూరు, అనంతపురం రేంజ్ డీఐజీ బాలకృష్ణ బుధవారం రాత్రి అనంతపురంలో ప్రకటించారు. అదేసమయంలో కర్ణాటక పోలీసులు, ఆంధ్రప్రదేశ్ పోలీసులతో కలిసి నిందితుడి కోసం గాలింపును ముమ్మరం చేసినట్టు చెప్పారు. ఇదిలావుంటే, సదరు నిందితుడే ధర్మవరంలో ప్రమీలమ్మ అనే మహిళను హత్య చేసి ఏటీఎం కార్డులు ఎత్తుకెళ్లాడని నిర్ధారణకు రావడంతో పోలీసులు ఉలిక్కి పడ్డారు. దీంతో ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిందితుడి కోసం జల్లెడ పడుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటి వరకు నిందితుణ్ణి పోలివున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించి వదిలేశారు. -
‘ఏటీఎం దుండగుడి’ ఆచూకీ ఇస్తే నజరానా
సాక్షి ప్రతినిధి, బెంగళూరు/హిందూపురం: బెంగళూరులోని ఓ ఏటీఎం కేంద్రంలో మహిళపై దాడికి పాల్పడిన దుండగుడి ఆచూకీ చెబితే రూ.లక్ష బహుమతి ఇస్తామని బెంగళూరు అదనపు పోలీసు కమిషనర్ ప్రణబ్ మొహంతి గురువారం ప్రకటించారు. సమాచారాన్ని ఇచ్చిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామన్నారు. 9480801101, 9480801011 నంబర్లకు ఫోన్, ఎస్ఎంఎస్లు ద్వారా సమాచారాన్ని ఇవ్వవచ్చని వెల్లడించారు. కాగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు జ్యోతి ఆరోగ్యం కాస్త మెరుగు పడిందని చీఫ్ న్యూరో సర్జన్ ఎన్కే. వెంకట రమణ చెప్పారు. సెల్‌ఫోన్ హిందూపురంలో విక్రయం: దుండగుడు దాడి చేసిన తర్వాత కాజేసిన సెల్‌ఫోన్‌ను హిందూపురంలో విక్రయించగా కర్ణాటక పోలీసులు దానిని స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. మంగళవారం ఉదయం దాడి చేసిన దుండగుడు అదే రోజు సాయంత్రం హిందూపురానికి వచ్చాడు. అక్కడ అంబేద్కర్ సర్కిల్లో ఉన్న ఒక సెల్‌ఫోన్ దుకాణంలోకి వెళ్లి తాను బెంగళూరు నుంచి వచ్చానని, పర్సు పోయిందని, చార్జీలకు డబ్బు లేదని సెల్‌ఫోన్ తీసుకుని డబ్బు ఇవ్వాలని కోరాడు. సెల్‌ఫోన్ దుకాణదారుడు అబూజర్.. ఆ నోకియా 2700 మోడల్ సెల్‌ఫోన్‌కు రూ.800 ఇస్తాననడంతో అతడికి విక్రయించాడు. అబూజర్ బుధవారం ఆ సెల్ఫోన్లో సిమ్‌కార్డు వేసుకున్నాడు. సెల్‌ఫోన్‌పై నిఘా ఉంచిన కర్ణాటక పోలీసులు వెంటనే హిందూపురం పోలీసులకు సమాచారం అందించారు. తర్వాత అబూజర్‌ను బెంగళూరు నుంచి వచ్చిన పోలీసు బృందం అదుపులోకి తీసుకుని విచారించింది. అతడితో బాటు మరో ఇద్దరిని కర్ణాటక తీసుకెళ్లినట్లు సమాచారం. అయితే సీసీటీవీ ఫుటేజ్ ద్వారా దుండగుడిని గుర్తించామని అతడిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నామని కర్ణాటక డీజీపీ తెలిపారు. కాగా, సెల్‌ఫోన్‌ను కర్ణాటక పోలీసులకు అప్పగించామని, అబూజర్‌ను వారే విచారిస్తున్నారని హిందూపురం సీఐ శ్రీనివాసులు తెలిపారు. -
ఏటీఎం సెంటర్లో మహిళపై దాడికి పాల్పడ్డ దుండగుడు
బెంగళూరు: నగరంలోని ఏటీఎం సెంటర్లో డబ్బులు డ్రా చేస్తున్న ఓ మహిళ(38)పై గుర్తు తెలియని దుండగుడు దాడి చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. మహిళ ఏటీఎం నుంచి డబ్బులు తీసుకునేందుకు మంగళవారం ఉదయం ఏటీఎంకు వెళ్లిన సమయంలో ఈ దారుణమైన సంఘటన సంభవించింది. కార్పోరేషన్ బ్యాంక్ ఉద్యోగిగా పనిచేస్తున్న ఆ మహిళ ఏటీఎంలోకి వెళ్లిన వెంటనే అదే అదునుగా భావించిన ఒక గుర్తు తెలియని వ్యక్తి ఆమె వెనుక ప్రవేశించి షట్టర్ మూసివేసి దాడికి పాల్పడ్డాడు. అతనితో ఆమె కాసేపు ప్రతిఘటించింది. కాగా, ఆ దుండగుడు ఆమెను విచక్షణరహితంగా గాయపరిచి మహిళ వద్ద ఉన్న బ్యాగుతో ఉడాయించాడు. దాడితో సృహ కోల్పోయిన ఆ మహిళ కాసేపటికి లేచి కేకలు వేయడంతో రోడ్డుపై వెళ్లే వారు ఏటీఏం తలుపులు తెరవడంతో ఈ ఉదంతం బయటపడింది. అతని చేతిలో ఉన్న కత్తితో ఆమెను తీవ్రంగా గాయపరిచిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో స్పష్టంగానే కనబడ్డాయి. ఆ దుండుగుడు దాడి చేయడానికి ముందుగానే సిద్ధమైనట్లు అతని వద్దనున్న మారణాయుధాల్ని బట్టి తెలుస్తోంది. ఈ దారుణమైన సంఘటన చోటు చేసుకోవడానికి ఏటీఎం వద్ద సరైన రక్షణ లేకపోకడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఇటువంటి సంఘటనలు ఎన్ని చోటు చేసుకుంటున్నా ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనపడుతోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన బెంగళూరు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ మహిళ తీవ్రంగా గాయపడటంతో విక్టోరియా ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.