నమ్మితే నట్టేట ముంచాడు!
వర్ని: ఏటీఎం లోంచి డబ్బు తీసి ఇవ్వమంటే, కార్డును మార్చేసి రూ.25 వేలు డ్రా చేసుకొని ఉడాయించాడో దుండగుడు. ఈ ఘటన వర్ని మండల కేంద్రంలో చేసుకుంది. బాధితుడి కథనం మేర కు.. అక్బర్‌నగర్‌కు చెందిన సత్యనారాయణకు ఆంధ్రాబ్యాంకులో ఖాతా ఉంది. డబ్బు అవసరం కావడంతో గురువారం ఎస్‌బీఐ ఏటీఎం కేంద్రం వద్దకు వచ్చాడు. డ్రా చేయడం తెలియని ఆయన, పక్కనే ఉన్న అపరిచిత వ్యక్తిని సెక్యూరిటీ గార్డుగా భావించి సాయం కోరాడు. సదరు వ్యక్తి కొంతసేపు ప్రయత్నించి డబ్బు రావడం లేదని ఏటీఎం కార్డు ఇచ్చి వెళ్లిపోయాడు.
బటయ కు వచ్చిన కొద్దిసేపటికే సత్యనారాయణ ఫోన్‌కు డబ్బు డ్రా చేసినట్టు మెసేజ్ రావడంతో ఉలిక్కిపడ్డాడు. ఏటీఎం వద్దకు వెళ్లగా అప్పటికే అపరిచితుడు అక్కడి నుంచి ఉడాయించాడు. ఏటీఎం కార్డును బదిలీ చేసి డబ్బు డ్రా చేసినట్టు గుర్తించిన బాధితుడు లబోదిబోమంటూ.. ఆంద్రాబ్యాంక్ మేనేజర్‌ను కలిసి వివరించాడు. ఏటీఎం కార్డును బ్లాక్ చేయాలని కోరాడు.