auto drivers wellfare
-
సీఎం జగన్ మాటంటే మాటే!
వైఎస్సార్సీపీ ప్రభుత్వం నేటి నుంచి మరో చరిత్రాత్మక పథకానికి శ్రీకారం చుడుతోంది. పాదయాత్రలో ఇచ్చిన మరో హామీ కార్యరూపం దాల్చుతోంది. మాట తప్పని మడమ తిప్పని కుటుంబంగా ప్రజలు పెట్టుకున్న ఆశలను వమ్ము చేయకుండా మహానేత వైఎస్సార్ తనయుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మాటను వరుసగా నిలబెట్టుకుంటున్నారు. ఒక్కొక్క హామీ అమలుకు అడుగులు వేస్తున్నారు. ఆశా కార్యకర్తల వేతనాలు. అంగన్వాడీలు, పారిశుద్ధ్య కార్మికులు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు ఇప్పటికే పెంచిన జగన్మోహన్రెడ్డి... వలంటీర్ల నియామకం, గ్రామ సచివాలయాల ఉద్యోగాలు. సచివాలయాల ఏర్పాటు. రేషన్ కార్డుదారులకు నేరుగా ఇంటికే నాణ్యమైన బియ్యం పంపిణీ. పంట నష్టపరిహారం పెంపు. ఇలా ఒకటేంటి పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నారు. తాజాగా వైఎస్సార్ వాహన మిత్ర పథకం అందులో ఒకటిగా చేరుతోంది. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : రికార్డులు సక్రమంగా నిర్వహించలేని పరిస్థితి... ఎప్పటికప్పుడు ట్యాక్స్ చెల్లించుకోలేని దుస్థితి... అసలే అంతంతమాత్రపు బతుకులు... ఆపై ఫైనాన్షియర్ల వేధింపులు... ఇలా ఒకటేంటి అనేక ఇబ్బందులను ఆటో, ట్యాక్సీవాలాలు ఎదుర్కొంటున్నారు. నెలా ఖరొస్తే చాలు భయంభయంగా గడిపే పరిస్థితి ఉంది. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఆరాటం... ఫిట్నెస్ కోసం పడిగాపులు... మరమ్మతుల కోసం ఆర్థిక ఇబ్బందులు... తదితర వాటితో నిత్యం కష్టాల కన్నీళ్లే. ఇన్ని బాధలు పడుతున్నా ఇంతవరకు ఏ ఒక్క పాలకుడు పట్టించుకోలేదు. కానీ పాదయాత్ర సమయంలో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. అధికారంలోకి రాగానే ఆటో, ట్యాక్సీ కార్మికులకు ఏటా రూ.10 వేల ఆర్థిక సాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఇప్పుడా హామీని అమలు చేస్తున్నారు. శుక్రవారం నుంచి వైఎస్సార్ వాహన మిత్ర కార్యక్రమం పేరుతో పథకాన్ని ప్రారంభిస్తున్నారు. జిల్లాలో 10,652మందికి లబ్ధి ఆటో, ట్యాక్సీ వాలాలకు చేయూతగా ప్రభుత్వం ప్రకటించిన వైఎస్సార్ వాహన మిత్ర పథకం కింద సెప్టెంబర్ 14వ తేదీ నుంచి 25వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించింది. జిల్లాలో 28,144 వాహనాలుండగా, అందులో 10,798మంది యజమానులు దరఖాస్తు చేసుకున్నారు. నమోదులో 38.49 శాతంతో రాష్ట్రంలోనే రెండో స్థానంలో జిల్లాలో నిలిచింది. వచ్చిన దరఖాస్తులను ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్ల ఆధ్వర్యంలో పరిశీలించాక 146 దరఖాస్తులను వివిధ కారణాలతో తిరస్కరించగా, మిగిలిన 10,652 దరఖాస్తులకు కలెక్టర్ ఆమోదం లభించింది. వీరందరికీ వైఎస్సార్ వాహన మిత్ర పథకం కింద సంవత్సరానికి రూ.10 వేల ప్రభుత్వ సాయం అందనుంది. రాష్ట్రవ్యాప్తంగా రూ.400 కోట్లతో లక్షా 73వేల మందికి లబ్ధి చేకూరుతుండగా అందులో మన జిల్లాకు సంబంధించి 10,652మంది ఉన్నారు. రూ.10.65 కోట్లకు పైగా లబ్ధి పొందనున్నారు. అదే పది వేలు వాహన యజమానుల దరఖాస్తులు 10,798 తిరస్కరించినవి 146 ఆమోదం పొందినవి 10,652 ఏటా పొందనున్న లబ్ధి రూ.10.65 -
టాక్సీ,ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం ఆసరా
సాక్షి, విజయవాడ: టాక్సీ, ఆటోలు నడుపుకుంటూ జీవనం సాగించేవరికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుందని రవాణాశాఖ కమిషనర్ సీఎస్సార్ ఆంజనేయులు తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి వాహన బీమా, ఫిట్నెస్, మరమ్మత్తుల నిమిత్తం రూ. 10 వేలు ఇవ్వనుందని, దీని కోసం రూ.400 కోట్ల నిధుల్ని విడుదల చేయనుందని వెల్లడించారు. రహదారి భద్రత కోసం 50 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. ఈ నిధులతో భద్రతా ప్రమాణాలు పెంపొందించేందుకు అవసరమైన పరికరాలు కొనుగోలు చేస్తామన్నారు. ఆరు నెలల కాలంలో 9 జిల్లాల్లో సైంటిఫిక్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 100 షోరూంలలో తనిఖీలు నిర్వహించామని, వాహనాల శాశ్వత రిజిస్ట్రేషన్లలో అక్రమాలు జరిగినట్టు బయటపడిందని అన్నారు. ఇన్వాయిస్లు తక్కువగా చూపించి ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి కొట్టిన వారిపై చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. ఈ క్రమంలొ గుంటూరు జిల్లాకు చెందిన గౌతమ్ హీరో షోరూమ్‌పై చర్యలు తీసుకున్నామని తెలిపారు. అనంతపురంలోని మారుతి డీలర్‌పై 41 లక్షల రూపాయలు టాక్స్‌లు, అదనంగా 41.41 లక్షల రూపాయలు జరిమానా విధించామన్నారు. అక్రమాలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
ప్రతి ఆటోడ్రైవర్‌కు రూ.10 వేలు
సాక్షి, ఏలూరు: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆటోడ్రైవర్లను ఆర్థికంగా ఆదుకుంటామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీయిచ్చారు. రవాణా శాఖ నిబంధనలను అనుసరించి పలు రకాల పత్రాలు చేయించుకోవడంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్న ఆటోడ్రైవర్లకు రూ.10వేల ఆర్థిక సాయం అందిస్తామని వెల్లడించారు. 161వ రోజు ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా ఏలూరు పాతబస్‌స్టాండ్ వద్ద జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన ఆయన.... అన్ని జిల్లాల్లోని ఆటోడ్రైవర్ల అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ‘‘వెళ్లిన ప్రతిచోటా ఆటోడ్రైవర్లు నన్ను కలుస్తున్నారు. రోజంతా కష్టపడితే మూడు నుంచి ఐదొందలు వస్తాయని, అందులో నుంచి రోజూ 50 రూపాయలు లేదా వంద రూపాయలను చంద్రబాబు ప్రభుత్వం లాక్కుంటున్నదని చెప్పారు. రవాణా శాఖ నిబంధనల ప్రకారం ఆటోకు ఫిట్నెస్, ఇన్సురెన్స్, రోడ్ టాక్స్ పత్రాలు లేనందున పోలీసులు డబ్బులు వసూళ్లు చేస్తున్నట్లు డ్రైవర్లు చెప్పారు. ఆ పత్రాలు చేయించుకోవాలంటే అదనంగా కనీసం 10వేల రూపాయలన్నా ఖర్చవుతుందని రోజూ ఇబ్బందులు పడుతున్నామని వివరించారు. ఈ నేపథ్యంలో.. రాబోయే ప్రజాప్రభుత్వంలో ఆటోడ్రైవర్లను ఆదుకుంటామని హామీ ఇస్తున్నా. సొంత ఆటోను నడుపుకొనే డ్రైవర్లకు ఆటో ఫిట్నెస్, ఇన్సురెన్స్, రోడ్ టాక్స్ పత్రాలు చేయించుకోవడానికి అవసరమైన డబ్బును ప్రభుత్వమే ఇస్తుంది. తద్వారా ప్రమాద బీమా కూడా లభిస్తుంది. డ్రైవర్లు, ప్రయాణికులు అందరికీ ఊరట కలిగించే అంశమిది..’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. -
ప్రతి ఆటోడ్రైవర్‌కు రూ.10 వేలు ఆర్థిక సాయం
-
ఆటోడ్రైవర్ల సంక్షేమానికి కృషి
ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ ‘గుడిమళ్ల’తో కలిసి ప్రచారం పోచమ్మమైదాన్ : ఆటోడ్రైవర్ల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ తెలిపారు. వచ్చే నెల 1వ తేదీన ప్రపంచ ఆటోడ్రైవర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని చేపట్టనున్న ర్యాలీ, బహిరంగ సభను విజయవంతానికి ప్రచారం లో భాగంగా శుక్రవారం ఆటో ర్యాలీ నిర్వహిం చారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆటోడ్రైవర్ల యూనియన్(టాడూ) ఆధ్వర్యంలో నిర్వహిం చిన ఈ ర్యాలీని వరంగల్ భద్రకాళి దేవాలయం సమీపంలో యూనియన్ గౌరవ అధ్యక్షుడు గుడిమళ్ల రవికుమార్‌తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఆటోలోనే పలు అడ్డాల ను సందర్శించి ఆటోడ్రైవర్ల సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ ఆటోడ్రైవర్ల సంక్షేమానికి ప్రత్యేక నిధి ఏర్పాటుచేయాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉందని తెలిపారు. అనంతరం గుడిమళ్ల రవికుమార్ మాట్లాడుతూ ఏనుగులగడ్డలో జరిగే బహిరంగ సభకు డ్రైవర్లు తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టాడు జిల్లా కన్వీనర్ మేకల రవీందర్, యూనియన్ నాయకులు యాకూబ్, జిలుకర స్వామి, ఇసంపెల్లి సంజీవ, మంద శ్రీధర్‌రెడ్డి, గౌని రాజు, హరిచంద్రునాయక్, జయరాం, పసునూరి బాబు, చీకటి కుమార్ తదితరులు పాల్గొన్నారు.