ఆటోడ్రైవర్ల సంక్షేమానికి కృషి
-
ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్
-
‘గుడిమళ్ల’తో కలిసి ప్రచారం
పోచమ్మమైదాన్ : ఆటోడ్రైవర్ల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ తెలిపారు. వచ్చే నెల 1వ తేదీన ప్రపంచ ఆటోడ్రైవర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని చేపట్టనున్న ర్యాలీ, బహిరంగ సభను విజయవంతానికి ప్రచారం లో భాగంగా శుక్రవారం ఆటో ర్యాలీ నిర్వహిం చారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆటోడ్రైవర్ల యూనియన్(టాడూ) ఆధ్వర్యంలో నిర్వహిం చిన ఈ ర్యాలీని వరంగల్ భద్రకాళి దేవాలయం సమీపంలో యూనియన్ గౌరవ అధ్యక్షుడు గుడిమళ్ల రవికుమార్‌తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఆటోలోనే పలు అడ్డాల ను సందర్శించి ఆటోడ్రైవర్ల సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ ఆటోడ్రైవర్ల సంక్షేమానికి ప్రత్యేక నిధి ఏర్పాటుచేయాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉందని తెలిపారు. అనంతరం గుడిమళ్ల రవికుమార్ మాట్లాడుతూ ఏనుగులగడ్డలో జరిగే బహిరంగ సభకు డ్రైవర్లు తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టాడు జిల్లా కన్వీనర్ మేకల రవీందర్, యూనియన్ నాయకులు యాకూబ్, జిలుకర స్వామి, ఇసంపెల్లి సంజీవ, మంద శ్రీధర్‌రెడ్డి, గౌని రాజు, హరిచంద్రునాయక్, జయరాం, పసునూరి బాబు, చీకటి కుమార్ తదితరులు పాల్గొన్నారు.