Awareness Day
-
క్యాన్సర్‌ను జయించొచ్చు
క్యాన్సర్(రాచపుండు)కు ఇప్పుడు అత్యాధునిక వైద్యం అందుబాటులో ఉంది. ముందే గుర్తిస్తే పూర్తిగా నయం చేయొచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. తగు జాగ్రత్తలతో ముందుకు సాగితే క్యాన్సర్‌ను జయించడం కష్టమేమీ కాదని స్పష్టం చేస్తున్నారు. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు 2014 నుంచి ఏటా నవంబర్ 7న జాతీయ క్యాన్సర్ అవగాహన దినం నిర్వహిస్తున్నారు. క్యాన్సర్ చికిత్సలో కీలకమైన రేడియంను కనిపెట్టిన పోలాండ్ దేశానికి చెందిన మేడం క్యూరీ పుట్టిన రోజునే అవగాహన దినంగా నిర్వహించడం గమనార్హం.గుర్తించడం ఎలా?మానకుండా ఉన్న పుండ్లు, శరీరంలోని ఏ భాగంలోనైనా ఎదుగుతున్న గడ్డలు, కణుతులు, అసహజమైన రక్తస్రావం, పెరుగుతున్న పుట్టుమచ్చలు, పులిపిరి కాయలు, మింగటం కష్టంగా ఉండటం, గొంతు బొంగురుపోయి తగ్గకుండా ఉండటం, చాలా రోజులుగా ఉన్న అజీర్ణవ్యాధి తదితర లక్షణాలు ఉంటే తక్షణమే క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి.కారకాలుసిగిరెట్ పొగలో 400 రకాల హానికారక రసాయనాలు ఉంటాయి. వీటితోపాటు గుట్కా పాన్, మసాలాలు, వేపుళ్లు, నిల్వ ఉన్న పచ్చళ్లు, బేకరీ పదార్థాలు ఎక్కువగా తినడం వల్ల నోటి, పేగు, కిడ్నీ క్యాన్సర్లు వస్తాయి. ఊబకాయుల్లో మూత్రాశయ, గర్భాశయ, పేగు క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంది, పాంక్రియాటిక్ క్యాన్సర్లూ వస్తాయి. పారిశ్రామిక వ్యర్థాలు, ఫ్యాక్టరీలు వదిలే పొగల వల్ల క్యాన్సర్ వచ్చే రిస్క్ 3 నుంచి 4 శాతం ఉంటుంది.మాంసాహారాల్లో క్యాన్సర్ కణాలుతాజా కూరగాయలు, ఆకు కూరలు ఎక్కువగా తీసుకోవాలి. వీటిల్లో క్యాన్సర్ కారకాలతో పోరాడే యాంటిజెంట్స్ ఉంటాయి. మాంసాహారాల్లో క్యాన్సర్ కణాలు అధికంగా ఉంటాయి. ఇవి తినేవారు తప్పనిసరిగా వెజిటబుల్ లేదా ఫ్రూట్ సలాడ్ తినాలి. దీనివల్ల మాంసాహారంలో ఉండే క్యాన్సర్ కణాలతో సలాడ్‌లోని యాంటీజెంట్స్ పోరాడతాయి. కొవ్వుశాతం తక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే క్యాన్సర్లు వచ్చే అవకాశాలు తక్కువ. భోజనంతో తాజా పండును రోజూ తీసుకోవాలి. రోజూ కనీసం అరగంటసేపు వ్యాయామం చేయాలి. స్మోకింగ్, మద్యం, పాన్, గుట్కా లాంటి దురలవాట్లకు దూరంగా ఉండాలి.మహిళల్లో రొమ్ము, సర్వైకల్ క్యాన్సర్నాన్కమ్యూనకబుల్ డిసీజ్ ప్రోగ్రాంలో గత ఏడాది మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించగా జిల్లాలో 2,54,636 మంది రొమ్ము, సర్వైకల్, ఓరల్ క్యాన్సర్లతో బాధపడుతున్నట్లు గుర్తించారు. జిల్లాల్లో 40 మంది క్యాన్సర్ వైద్య నిపుణులు ఉండగా రోజూ వీరి వద్ద 30 నుంచి 50 మంది వరకు రోగులు వైద్యసేవలు పొందుతున్నారు. -
ఈ వ్యాధి అంత ప్రాణాంతకమా? లక్షణాలేంటి?.. వస్తే ఏం చేయాలి?
సాధారణంగా ఏ చిన్న నొప్పి వచ్చినా.. శరీరంలో ఏ చిన్న మార్పు కనిపించినా వెంటనే గూగుల్ చేస్తాం. దొరికిన సమాచారం ఆధారంగా ఏమీ కాదులే అని ఊరుకుంటాం. లేదంటే తెలిసిన డాక్టరు దగ్గరికి పరిగెడతాం. కానీ మనం అంత తేలిగ్గా గుర్తించలేని, అంతుబట్టని, అసలు పెద్దగా అవగాహనలేని రోగం ఒకటి ఉంది. అదే కుషింగ్స్ సిండ్రోమ్(సీఎస్). ఏప్రిల్ 8న కుషింగ్స్ అవేర్నెస్ డే సందర్బంగా కొన్ని వివరాలు మీకోసం.. 1912లో "పాలీగ్లాండులర్ సిండ్రోమ్"ని అమెరికన్ న్యూరో సర్జన్ డాక్టర్ హార్వే కుషింగ్ని ఈ వ్యాధిని గుర్తించారు. ఏప్రిల్ 8 ఆయన పుట్టిన రోజును పురస్కరించుకుని ప్రతీ ఏడాది ఏప్రిల్ 8న, కుషింగ్స్ అవేర్నెస్ డే జరుపుకుంటారు. కుషింగ్స్ వ్యాధిపై అవగాహన కల్పిస్తున్నారు. కుషింగ్స్ సపోర్ట్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ (CSRF) దీనిపై విస్తృతంగా అవగాహన కల్పిస్తోంది కుషింగ్స్ సిండ్రోమ్ అంటే ఏంటి? మనందరికీ కొన్ని స్టాండర్డ్ వ్యాధులు తెలుసు. ఉదాహరణకి రక్తపోటు, చక్కెర వ్యాధి, కాన్సర్, థైరాయిడ్ మొదలైనవి. వీటితోపాటు, ఇంకా పలు సమస్యలు అన్నీ ఒకేసారి మన శరీరంపై దాడి చేస్తే ఎలా ఉంటుంది? అంతా అయోమయం, గందరగోళంగా ఉంటుంది. నిజానికి ఈ వ్యాధిని ఎంత తొందరగా గుర్తించి, చికిత్స తీసుకోవడం చాలా అసవరం. సంక్లిష్టమైన ఈ ఎండోక్రైన్ రుగ్మతకు తగిన చికిత్స చేయకపోతే తీవ్రమైన పరిణామాలు కూడా సంభవించే అవకాశం ఉంది. హార్మోనల్ ఇంబాలన్స్తో వచ్చే వ్యాధి పేరే కుషింగ్స్ సిండ్రోమ్. కార్టిసాల్ అనే హార్మోన్ సాధారణ స్థాయిల కంటే ఎక్కువైతే ఇది సంభవిస్తుంది.స్టెరాయిడ్స్ ఎక్కువ తీసుకున్నా, శరీరంలో ఉత్పత్తి అయినా ఈ వ్యాధి మన శరీరంపై దాడిచేస్తుంది. ముఖంపై చర్మం బాగా నల్లగా మారిపోవడం, జుట్టు విపరీతంగా రాలిపోవడం, ఎక్కువగా పింపుల్స్ లాంటివి ప్రధాన లక్షణాలుగా చెప్పుకోవచ్చు వీటితోపాటు మహిళల్లో అయితే గైనిక్ సమస్యలు మరింత వేధిస్తాయి. అలాగే విపరీతమైన మతిమరుపు మరో ప్రధాన లక్షణం. అయితే సమస్య ఇదీ అని తెలియక సంవత్సరాల తరబడి ఏవో మందులు వాడుతూ కాలం గడిపేస్తూ ఉంటారు. కుషింగ్స్ సిండ్రోమ్ లక్షణాలు ఊబకాయం, హైపర్ టెన్షన్, డయాబెటిస్ మెల్లిటస్, బోలు ఎముకల వ్యాధి, ఇన్ఫెక్షన్లు ,న్యూరోకాగ్నిటివ్ డిస్‌ఫంక్షన్స్ వస్తాయి. మొటిమలు, ముఖం విపరీతమైన నల్లగా మారి పోవడం బఫెలో హంప్ (మెడ వెనుక అదనపు కొవ్వు చేరి గూని లాగా ఏర్పడటం) పొత్తికడుపు చుట్టూ విపరీతంగా కొవ్వు చేరడం రక్తంలో గ్లూకోజ్ లెవల్స్ పెరగడం లేదా హైపర్ గ్లూసేమియా అధిక దాహం, అలసట, అతి మూత్రవిసర్జన, తలనొప్పి, విపరీతమైన మతిమరుపు అధిక రక్త పోటు, అవాంఛిత రోమాలు, మహిళల్లో ఋతుక్రమంలో మార్పులతో పాటు మానసిక అస్థిరత, నిరాశ, తీవ్ర భయాందోళన. పురుషుల్లో వ్యంధ్యత్వం లాంటివి కూడా సంభవిస్తాయి. మరి ఈ వ్యాధి నిర్దారణ ఎలా? చికిత్స ఏంటి? పిట్యూటరీ గ్రంధిపై ట్యూమర్, అడ్రినల్ అడెనోమా (మూత్రపిండాలపై ట్యూమర్) అది విడుదల చేసే కార్టిసాల్ ఎక్కువ కావడమే ఇన్ని విపరీతాలకు కారణం. అయితే ఎండోక్రినాలజిస్ట్ ద్వారా వ్యాధి నిర్ధారణ చేసుకోవాల్సి ఉంటుంది. మూత్రం, రక్తం, హార్మోన్ల పరీక్ష ద్వారా కుషింగ్స్ వ్యాధిని గుర్తించవచ్చు. ఈ కణితిని పూర్తిగా గుర్తించేందుకు సీటీ స్కాన్ లేదా ఎంఆర్ఐ పరీక్షలు అవసరం. పిట్యూటరీ రేడియో థెరపీ, స్టెరియాడ్ ఉత్పత్తిని నిరోధించడం, ఒక వేళ కణితి పెద్దదిగా ఉంటే ఆపరేషన్ కూడా చేయించుకోవాల్సి వస్తుంది. క్రమం తప్పకుండా వైద్యుల పర్యవేక్షణలో మందులు వాడాలి. అలాగే మానసిక ఒత్తిడికి దూరంగా ఉండాలి. మద్యపానం, ధూమపానం లాంటి అలవాట్లకు దూరంగా ఉండాలి. సమతుల ఆహారం తీసుకుంటూ, చిన్న చిన్న వ్యాయమాల ద్వారా స్వీయ రక్షణ పద్ధతులను పాటించాలి. కుషింగ్స్ వ్యాధి బారిన పడి కోలుకుంటున్న విశాఖ జిల్లా పాయకరావు పేటకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయిని విజయ భాను కోటె అనుభవం... “I” అనే సినిమా హీరో విక్రమ్ ఏదో కెమికల్ వలన హీరో వికారంగా మారిపోయినట్టే నేను కూడా దారుణంగా తయారయ్యా. అసలు నన్ను నేను గుర్తుపట్టుకోలేనంతగా ఎందుకు మారిపోయానో అర్థం అయ్యేది కాదు. దీనకి తోడు శారీరకంగా ఎన్నో సమస్యలు. ఎంతోమంది డాక్టర్స్ దగ్గరికి తిరిగి తిరిగి, ఎన్ని రకాలుగా చికిత్సలు తీసుకున్నా లాభం లేదు. ఇలా ఎందుకు జరుగుతోందో అర్థ అయ్యేదికాదు. ఈ డిప్రెషన్‌కు గెలవాలనే పట్టుదలతో విపరీతమైన పనికి అలవాటు పడిపోయాను. రోజుకు వంద పనులు కల్పించుకున్నాను. అసలు నొప్పి లేని రోజంటూ లేని నా జీవితంలో నొప్పినే నేస్తంగా భావించాను. 2021 జూన్ లో విపరీతంగా పెరిగిన రక్తపోటు వల్ల డాక్టర్ MRI ద్వారా నాదొక రేర్ డిసీజ్ అని తేలింది. దీన్ని నమ్మాలో వద్దో అర్థం కాలేదు. పదేళ్లు నరకం చూశా.. ఇప్పటికీ భరించలేని నొప్పులు కానీ పదేళ్ల నరకం తరువాత నా బాధలకు కారణం ఏంటో ఎట్టకేలకు తెలిసిందన్న ఒక్కటే సంతోషం. చాలా ప్రయత్నాల తరువాత చివరికి సర్జరీ జరిగింది. అలా నా వ్యాధిని కనిపెట్టిన ఎండోక్రినాలజిస్ట్ డాక్టర్ వంశీ కృష్ణ, నాకు సర్జరీ చేసిన న్యూరాలజిస్ట్ డాక్టర్ బి ఎస్ వి రాజు, ఇలా నాకు చికిత్స చేసిన వైద్యులందరూ నా పాలిట దేవుళ్ళు. సర్జరీ జరిగిన రెండో నెలలకి బరువు తగ్గి, నల్లటిముఖంలో కాస్త మార్పు వచ్చినా ముక్కలుగా విరిగిపోయిన పళ్ళు ఇక బాగు కావనేది అర్థం అయిపోయింది. ఇప్పటికీ ఏదైనా సర్జరీ చేయాల్సి వస్తే..ఇక ఆ బాధలు చెప్పలేను..చిన్న ఇంజెక్షన్‌కు కూడా నానా యాతన అనుభవించాలి. కదుములు కట్టేస్తాయి. అసలు నా జీవితంలో కోలుకోవడం అంటే ఏమిటో అర్థం కావడంలేదు. ఒక విధంగా నేను బ్రతికి ఉండడం గొప్ప. స్టెరాయిడ్స్ లేకుండా లేవలేను. ఏ పనీ చేయలేను. నా లాంటి కష్టాలు మరెవ్వరికీ రాకూడదనేది నా తాపత్రయం అందుకే దీనికి గురించి అందరికీ తెలియాలని ఆరాటపడుతున్నా. ఇన్ని నష్టాలు జరగకుండా ముందే వ్యాధి నిర్ధారణ కావడం చాలా ముఖ్యం. కుషింగ్స్ లక్షణాలు ఏమాత్రం కనిపించినా ముందు ఎండోక్రినాలజిస్ట్‌ను కలవాలి. హార్మోన్ టెస్ట్స్ చేయించుకోవడం చాలా అవసరం. ప్రపంచ వ్యాప్తంగా కుషింగ్స్పై పరిశోధనలు జరుగు తున్నాయి. అదే మాదిరిగా ఇండియాలో కుషింగ్స్ సిండ్రోమ్ రోగులపై మరింత పరిశోధన జరగాల్సి ఉందని.. ఈ వ్యాధి గురించి ప్రజల్లో అవగాహన రావాలి, దీనిపై విస్తృతంగా ప్రచార జరగాలి అంటారు విజయభాను. -
క్యాన్సర్‌ను గుర్తించడం ఎలా?
గుంటూరు మెడికల్: పూర్వం రాచపుండుగా పిలువబడే క్యాన్సర్ వ్యాధి వస్తే మరణమే శరణ్యం అనే పరిస్థితులు ఉండేవి. అయితే ప్రస్తుతం ఆధునిక వైద్య విజ్ఞానం ఎంతో అభివృద్ధి చెందటంతో క్యాన్సర్‌ను పూర్తిగా నయం చేస్తున్నారు. ప్రజల్లో వ్యాధిపై అవగాహన కలి్పంచేందుకు 2014లో నాటి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్థన్ జాతీయ క్యాన్సర్ అవగాహన దినం ప్రకటించారు. క్యాన్సర్ చికిత్సలో కీలకమైన రేడియంను పోలాండ్ దేశానికి చెందిన మేడం క్యూరీ కనిపెట్టారు. క్యాన్సర్‌కు వ్యతిరేకంగా న్యూక్లియర్ ఎనర్జీ, రేడియోథెరపీ క్యాన్సర్ వైద్య సేవలను ఆమె వృద్ధి చేశారు. ఆమె పుట్టన రోజు నవంబర్ 7. దీంతో ప్రతి ఏడాది నవంబర్ 7న నేషనల్ క్యాన్సర్ అవేర్నెస్ డేను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం. క్యాన్సర్‌ను గుర్తించడం ఎలా? మానకుండా ఉండే పుండు, శరీరంలోని ఏ భాగంలోనైనా ఎదుగుతున్న గడ్డ, ఎదుగుతున్న కణుతులు, అసహజమైన రక్తస్రావం, పెరుగుతున్న పుట్టుమచ్చలు, పులిపిరి కాయలు, మింగడం కష్టంగా ఉండటం, గొంతు బొంగురుపోయి తగ్గకుండా ఉండటం, చాలా రోజులుగా ఉన్న అజీర్ణ వ్యాధి తదితర లక్షణాలు ఉంటే తక్షణమే క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. క్యాన్సర్ కారకాలు.. సిగరెట్ పొగలో 400 రకాల హానికారక రసాయనాలు ఉంటాయి. వీటి ద్వారా నోటి క్యాన్సర్, ప్రేగు క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్లు వస్తాయి. గుట్కా, పాన్‌పరాగ్ వల్ల నోటి క్యాన్సర్, ప్రేగు సంబంధిత క్యాన్సర్లు వస్తాయి. మసాలాలు, వేపుళ్లు, నిల్వ ఉన్న పచ్చళ్లు, బేకరీ పదార్థాలు ఎక్కువగా తింటే నోటి క్యాన్సర్, ప్రేగు క్యాన్సర్లు వస్తాయి. ఊబకాయుల్లో మూత్రాశయ క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్, ప్రేగు క్యాన్సర్, పాంక్రియాటిక్ క్యాన్సర్లు వస్తాయి. పారిశ్రామిక వ్యర్థాలు, ఫ్యాక్టరీలు వదిలే పొగలవల్ల క్యాన్సర్ రిస్క్ 3 నుంచి 4 శాతం ఉంటుంది. క్యాన్సర్ రాకుండా.. తాజా కూరగాయలు, ఆకుకూరలు తీసుకోవాలి. వీటిల్లో క్యాన్సర్ కారకాలతో పోరాడే యాంటిజెంట్స్ ఉంటాయి. మాంసాహారం తీసుకునేవారు తప్పనిసరిగా వెజిటబుల్ లేదా ఫ్రూట్ సలాడ్ తినాలి. దీనివల్ల మాంసాహారంలో ఉండే క్యాన్సర్ కణాలతో సలాడ్‌లోని యాంటీజెంట్స్ పోరాడతాయి. కొవ్వుశాతం తక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువ. భోజనంతో తాజా పండును ప్రతి రోజూ తీసుకోవాలి. ప్రతి రోజూ కనీసం అరగంట సేపు శారీరక వ్యాయామం చేయాలి. స్మోకింగ్, మద్యం, పాన్, గుట్కా లాంటి దురలవాట్లకు దూరండా ఉండాలి. జిల్లాలో బాధితులు.. నాన్‌కమ్యూనకబుల్ డిసీజ్ ప్రోగ్రామ్‌లో మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించగా జిల్లాలో 2,54,636 మంది రొమ్ముక్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు గుర్తించారు. జిల్లాలో 40 మంది క్యాన్సర్ వైద్య నిపుణులు ఉండగా ప్రతి రోజూ వీరి వద్ద 20 నుంచి 30 మంది వరకు వైద్య సేవలు పొందుతున్నారు. అందుబాటులో ఆధునిక వైద్యం క్యాన్సర్‌ను నయం చేసే ఆధునిక వైద్య పద్ధతులు నేడు అందుబాటులో ఉన్నాయి. ముందస్తుగా వ్యాక్సిన్లు వేయించుకోవడం ద్వారా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నుంచి రక్షణ పొందవచ్చు. వ్యాధి వచ్చే అవకాశాలు ఉన్నవారు (హైరిస్క్) ముందస్తుగా పరీక్షలు చేయించుకోవడం చాలా మంచిది. లిక్విడ్ బయాప్సీ, పెట్‌స్కాన్, ఇమ్యునోహిస్టోకెమిస్ట్రి వంటి అత్యాధునిక వైద్య పద్ధతుల ద్వారా అతి తక్కువ సమయంలో, ప్రాథమిక స్థాయిలోనే పలు రకాల క్యాన్సర్లను గుర్తించి నివారించవచ్చు. డాక్టర్ ఎంజీ నాగకిషోర్, సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్, గుంటూరు -
సిగ్గెక్కువ.. కానీ, కాటేస్తే వందమంది ఖతం!
ఈ భూమ్మీద సమస్త జీవరాశుల్లో సర్పాలు ఉన్నాయి. కానీ, మనుషుల భయాలు, అపోహలతో వాటి జనాభా తగ్గిపోతూ వస్తోంది. ఇది ఎంతవరకు సరైందన్నది పక్కనపెడితే.. చాలామందిలో చెడును చెప్పడానికి ‘పాములాంటోడు’ అని వర్ణిస్తుంటారు. కానీ, అవి అంత ప్రమాదకరమైనవి మాత్రం కావు. ఈ భూమ్మీద దాదాపు 4 వేల జాతుల దాకా పాములు ఉన్నాయి. ఎప్పటికప్పుడు కొత్తగా కనుగొంటూ పోతున్నారు. ఈ మొత్తంలో 650కి(25 శాతం) పైగా జాతులు మాత్రమే విషపూరితమైనవని సైంటిస్టులు ఇప్పటిదాకా(జులై 7 రిపోర్ట్ ప్రకారం) గుర్తించారు. అందులోనూ 200 జాతుల(10 శాతం) పాముల నుంచి మాత్రమే మనిషికి ముప్పు ఉంటోందని తేల్చారు. కానీ, అవేం పట్టించుకోకుండా కనిపిస్తే చంపేస్తూ.. వాటి జనాభాను తగ్గించేస్తున్నారు. అందుకే వాటి పరిరక్షణ కోసం, పాములన్నీ ప్రమాదకరమైనవి కాదని జనాల్లో అవగాహన కల్పించాలని.. అందుకోసం ఓ రోజు ఉండాలని జులై 16న వరల్డ్ స్నేక్ డే ను నిర్వహిస్తున్నారు కొందరు(స్నేక్ సొసైటీలు). ప్రతీ ఏడాది ఇదే థీమ్‌తో ముందుకు సాగుతున్నారు. వాసన కోసం నాలిక పాములకు చూపు సామర్థ్యం చాలా తక్కువ. చెవుల్లేకున్నా వినికిడి శక్తి కూడా పరిమితంగానే ఉంటుంది. పాము కింది దడవలో ఉన్న ఎముకలు శబ్దతరంగాలను పసిగడతాయి. కానీ, వాసన విషయంలో మాత్రం గొప్ప సామర్థ్యం కలిగి ఉంటాయి. అవి నాలుకతోనే వాసనను పసిగడతాయి. అందుకే ఎప్పుడూ అవి నాలికను అలా బయటకు ఆడిస్తుంటాయి. అత్యంత విషపూరితమైనవి విషానికి ప్రాథమిక కొలమానం ఎల్డీ 50. లెథాల్ డోస్ 50 పర్సంట్ టెస్ట్ అని పిలుస్తారు దీన్ని. ఈ పద్దతిలో పాముల విషాన్ని పరిశీలించే.. అత్యంత విషపూరితమైన ప్రమాదకరమైన పాముల జాబితాను సిద్ధం చేస్తుంది ఇంటర్నేషనల్ స్నేక్ సొసైటీ. ఈస్ట్రన్ బ్రౌన్ స్నేక్.. ఆస్ట్రేలియాలో కనిపించే అత్యంత ప్రమాదకరమైన పాము జాతి. దీని విషం నిమిషాల్లో మనిషిలో అంతర్గతంగా రక్త స్రావం అయ్యేలా చేస్తుంది. కిడ్నీలను పాడు చేస్తుంది. ఒక్కోసారి మెదడుకు చేరి పక్షవాతాన్ని కలగజేస్తుంది. చివరికి రక్తం గడ్డకట్టేలా చేసి మనిషి ప్రాణం తీస్తుంది. టైగర్ స్నేక్ ఎలాపిడ్ జాతికి చెందిన టైగర్ స్నేక్ పాములు కూడా ఆస్ట్రేలియా గడ్డపైనే కనిపిస్తాయి. ఒంటిపై ఉండే మచ్చల కారణంగా వాటికి టైగర్ స్నేక్ అనే పేరొచ్చింది. నివాస ప్రాంతాల్లో ఎక్కువగా సంచరిస్తూ.. అరగంటలో మనిషి మరణానికి కారణం అవుతుంటాయి. టైగర్స్నేక్స్ విషం నాడీ వ్యవస్థ మీద ప్రభావం చూపెడుతుంది. కండరాల్లో రక్తం గడ్డ కట్టేలా చేస్తుంది. కోబ్రా తరహాలో పడగ విప్పి.. భయపెడుతుంది. ఇన్‌ల్యాండ్ టైపాన్ ఈ భూమ్మీద అత్యంత విషపూరితమైన పాము ఇది(అనధికారికంగా). వంద గ్రాముల విషంతో వంద మందిని చంపగలిగే సామర్థ్యం ఉన్న పాము ఇది. వంద గ్రాముల విషాన్ని ఒకే కాటుతో దింపగలదు ఇది. కానీ, ఎల్డీ50 ప్రకారం(త్వరగా ప్రాణం తీసే లెక్కప్రకారం).. లిస్ట్ వల్ల మూడో ప్లేస్ ఇవ్వాల్సి వచ్చింది. ఈ విషం ప్రభావంతో గంటలో ప్రాణం పోవడం ఖాయం. ఇవి జనారణ్యానికి దూరంగా ఏకాంతంగా బతుకుతాయి. ఈ పాముకి ‘సిగ్గు’ ఎక్కువ అని అంటుంటారు. మనుషులను చూస్తే.. ఇవి వేగంగా పాక్కుంటూ వెళ్లి ఓ మూల దాక్కుంటాయి. అలా ఈ డేంజర్ స్నేక్కు ‘సిగ్గున్న పాము’గా ముద్దు పేరు వచ్చింది. రస్సెల్స్ వైపర్ ఆసియాలో అత్యంత ప్రమాదకరమైన పాము జాతిగా పేరుంది రస్సెల్స్ వైపర్‌కి. అంతేకాదు ఎక్కువ మరణాలకు కారణమైన జాతి కూడా ఇదే. దీనిని గుర్తించడం కూడా చాలా తేలిక. భయంతో ఉన్నప్పుడు అది గట్టిగా శబ్దం చేస్తుంటుంది. కాటు వేసిన మరుక్షణం నుంచే విషం శరీరంలోకి ఎక్కేస్తుంటుంది. ఒక్క రస్సెల్స్ వైపర్ గక్కే విషంతో లక్షా యాభై వేల ఎలుకలను చంపొచ్చనేది సైంటిస్టుల మాట. బ్లూ క్రాయిట్ ఆసియాలో ప్రమాదకరమైన పాముల్లో దీని పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంటుంది. దీని విషయం నాడీ వ్యవస్థపై ప్రభావం చూపెడుతుంది. చికిత్స అందినా సగం మంది చనిపోతుంటారు. అంత ప్రమాదకరమైంది ఈ పాము విషం. ఇవి విషపూరితమైన పాముల్నే ఆహారంగా తీసుకుంటాయి. జనసంచారానికి దూరంగా పగటి పూట పచ్చిక బయళ్లలో, అడవుల్లో స్వేచ్ఛగా సంచరిస్తుంటాయి ఇవి. బూమ్స్లాంగ్ క్లౌబ్రిడ్ కుటుంబంలో అత్యంత విషపూరితమైన పాము జాతి ఇది. రంగు రంగుల్లో ఉంటాయి ఇవి. విషం అంత విషపూరితమైనది కాకపోయినా.. రక్తస్రావం కారణంగా ప్రాణం పోతుంటుంది. అందుకే ప్రమాదకరమైన పాముల లిస్ట్‌లో చేర్చారు. అయితే ఇవి మనుషులు కనిపిస్తే.. దూరంగా వెళ్లిపోతుంటాయి. ఇవి దాడులు చేసే సందర్భాలు చాలా తక్కువ. చెట్ల మీద ఉంటూ పక్షుల్ని, పురుగులని తింటాయి. మోజావే రాటెల్స్నేక్ అమెరికా నుంచి పాము జాతుల్లో అత్యంత విషపూరితమైన లిస్ట్‌లో ఫస్ట్ కనిపించేది ఇదే. రక్తం, నాడీ వ్యవస్థపై ప్రభావం చూపెడుతుంది దీని విషం. నైరుతి అమెరికా పప్రాంతంలో ఎక్కువ మరణాలు సంభవించేది ఈ పాముల వల్లే. స్టిలెట్టో స్నేక్ పరిణామంలో చిన్నగా ఉండి, కలుగుల్లో దాక్కునే పాము ఇది. కానీ, విషపూరితమైంది. అయితే అదృషవశాత్తూ ఇది ఎక్కువ విషాన్ని కక్కదు. కానీ, దీని విషం ఎంత ప్రమాదకరమంటే.. కణజాలాన్ని దెబ్బ తీయడంతో పాటు గుండె పనితీరును స్తంభింపజేస్తుంది. అంతేకాదు వీటిని పట్టడం కూడా అంత ఈజీ కాదు. కోరలు కూడా విచిత్రంగా వంగి ఉంటాయి. కాబట్టి, నేరుగా కాకుండా వంగి మరీ కాటు వేస్తుంది స్టిలెట్టో. సా స్కేల్డ్ వైపర్ ఇది అంత విషపూరితమైన పాము కాదు. కానీ, ప్రమాదకరమైన జాతిలో ఒకటి. భారత్ తో సహా చాలా దేశాల్లో ఇవి కనిపిస్తుంటాయి. చిన్నసైజులో ఉన్నప్పటికీ అగ్రెసివ్‌గా ఇవి దాడులు చేస్తాయి. వైపర్ జాతి పాముల్లాగే రక్తం గడ్డకట్టించి చంపుతాయి. అయితే విరుగుడు వెంటనే ఇవ్వకపోతే బతకడం కష్టం. ఇసుకలో దాక్కుని వేటాడుతుంటాయి. ఒకవేళ దగ్గరగా వెళ్లాలని ప్రయత్నిస్తే.. గట్టిగా శబ్ధం చేస్తూ భయపెడుతుంటాయి. కింగ్ కోబ్రా విషానికి బ్రాండ్ అంబాసిడర్ ఈ జాతి. అత్యంత పొడవైన విషపూరితమైన పాము కింగ్ కోబ్రా. పైన చెప్పుకున్నంత రేంజ్లో వీటిలో విషం లేకపోయినా.. ఎక్కువ పరిమాణంలో విషం చిమ్మడం, కాటు వేయడంతో పాటు రూపంతోనే భయపెట్టేస్తుంటాయివి. ఇక ఆడ పాము గూడుకట్టి గుడ్లు పెట్టాక.. మగపాముతో కలిసి కాపలా కాస్తుంటుంది. వీటితో పాటు కోస్టల్ టైపాన్, బాండెడ్ క్రాయిట్, కామన్ డెత్ ఆడర్, సముద్రంలో ఉండే బీక్డ్ సీ స్నేక్, ఆఫ్రికన్ డేంజరస్ స్నేక్ జాతి ‘బ్లాక్ మాంబా’, చైనీస్ కోపర్హెడ్, సౌత్ అమెరికన బుష్‌మాస్టర్, ఫర్ డె డాన్స్, బెల్చర్స్ సీ స్నేక్, బ్లూ మలయన్ కోరల్ స్నేక్.. ఆ తర్వాతి స్థానాలో ఉన్నాయి. ఇక వీటితో పాటు విషం లేని బుక్స్నేక్(నార్త్ అమెరికా, అమెరికా), కొండ చిలువ జాతికి చెందిన పాములు, జెనస్ యూనెక్టస్కు చెందిన వాటర్ బోస్(అనకొండ) కూడా ఈ భూమ్మీద ఉన్నాయి. అదృష్టం అంటే దీనిదే.. చాలాకాలం కిందట వైరల్ అయిన వీడియో ఇది How could we dedicate #WorldSnakeDay to anything else? 🐍#PlanetEarth2 pic.twitter.com/B4YxSxqmvm — BBC Earth (@BBCEarth) July 16, 2018 "I'm asking you to respect these creatures, because they have a right to be on Earth, the same way we do." We know many of you may be scared of snakes but it's #WorldSnakeDay, so we asked the 'Snake Man of Lagos' - Dr Mark Ofua - why it's so important we protect them. 🐍 pic.twitter.com/DgWc12NvoS — BBC News Africa (@BBCAfrica) July 16, 2019 -
వారిపై హింస, అకృత్యాలు భారత్‌లోనే కాదు..
పెద్దవాళ్లను గౌరవించడం భారత సంస్కృతి నేర్పే తొలి పాఠం. ఇది ఎంతమంది బుర్రలకు ఎక్కిందో తెలియదు కానీ...ముదిమి మీదపడ్డ పండుటాకులను వీధులపై వదిలేసే వాళ్లను.. కని పెంచిన తల్లిదండ్రులను ఆస్తి కోసం, డబ్బు కక్కుర్తితో రకరకాల హింస పెట్టే వాళ్లనూ..మనం అప్పుడప్పుడూ చూస్తూనే ఉంటాం. ప్రభుత్వాలా పట్టించుకోవు.. న్యాయస్థానాలు అప్పుడప్పుడు కొరడా ఝళిపిస్తాయి కానీ.. మళ్లీ అవే ఘటనలు.. అందరూ సిగ్గుపడాల్సిన పరిస్థితులు! ఇదంతా ఎందుకంటే... ఈ అంశంపై అవగాహన ఎంత పెరిగితే..పండుటాకులకు అంత మేలు కాబట్టి! పైగా రేపు వరల్డ్ ఎల్డర్స్ అబ్యూస్ అవేర్నెస్ డే కూడా! ప్రపంచమంతా ఇదే తీరు.. వృద్ధులపై హింస, అకృత్యాలు ఒక్క భారత్‌కే పరిమితం కాదు. ప్రపంచమంతా ఇదే తీరు. 2017 నాటి లెక్కల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా అరవై ఏళ్ల పైబడ్డ ప్రతి ఆరుగురిలో ఒకరు ఏదో ఒక రకమైన హింస, నిర్లక్ష్యానికి గురవుతున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు ఇంటర్నేషనల్ నెట్వర్క్ ఫర్ ద ప్రివెన్షన్ ఆఫ్ ఎల్డర్ అబ్యూస్ (ఐఎన్పీఈఏ) 2006లో ఏటా జూన్ 15న ఎల్డర్స్ అబ్యూస్ అవేర్నెస్ డే నిర్వహించాలని ప్రతిపాదించింది. ఐక్యరాజ్యసమితి దీన్ని 2011లో గుర్తించింది కూడా. ఐరాస సభ్యదేశాలు, పౌర హక్కుల సంఘా లు, స్వచ్ఛంద సంస్థలు ఈ సమస్య పరిష్కారానికి తమదైన రీతిలో కృషి చేయాలని ఐరాస పిలుపునిచ్చింది. 2017లో సుమారు 28 దేశాల్లో నిర్వహించిన 52 అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే.. ఆరవై ఏళ్లపైపడ్డ వారిలో 15.7 శాతం మంది ఏదో ఒక రూపంలో హింసను ఎదుర్కొంటున్నారు. మానసిక హింస అంటే తిట్టడం, చులకన చేయడం వంటివి సుమారు 11.6%మంది.. వృద్ధుల సొమ్ము లాగేసుకోవడం, దొంగిలించడం వంటివి 6.8% మంది ఎదుర్కొంటున్నారు. ఇక నిర్లక్ష్యానికి గురయ్యే వారు 4.2% కాగా, కొట్టడం, గాయపరచడం వంటివి ఎదుర్కొంటున్న వారు 2.5% మంది. ఇవి చాలవన్నట్లు దాదాపు ఒక శాతం వృద్ధులు లైంగిక హింసనూ ఎదుర్కోవాల్సి వస్తుండటం శోచనీయమైన అంశం. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. వయోవృద్ధులపై హింస ఘటనలు అందరికీ తెలిసే అవకాశాలు చాలా తక్కువ. హింసకు పాల్పడే వాళ్లు ఎక్కువగా కుటుంబ సభ్యులే కావడం ఒక కారణం. ప్రస్తుత కరోనా మహమ్మారి కారణంగానూ వృద్ధులపై హింసాత్మక ఘటనలు పెరిగిపోవడంతోపాటు, ఆర్థిక వ్యవస్థ మందగమనం వల్ల చాలాచోట్ల వారి ఆదాయం, పెన్షన్లు కూడా తగ్గిపోతున్నట్లు సమాచారం. 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా 60 ఏళ్లపైబడ్డ వారి సంఖ్య కనీసం 200 కోట్లకు చేరుకుంటుందని, వృద్ధుల హక్కుల రక్షణకు ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోని పక్షంలో వారిపై హింస మరింత పెరిగే అవకాశముందని ఐరాస హెచ్చరిస్తోంది. ఇవన్నీ ఆ వర్గంలోనే... 1. భౌతిక హింస.. కొట్టడం, తన్నడం, తోసేయడం, తగు రీతిలో ముందులు వాడకపోవడం, పరిమితులు విధించడం. 2. మానసిక, ఎమోషనల్ హింస.. తిట్టడం, బెదిరించడం, అగౌరవపరచడం, నిర్బంధించడం, ఏకాంతంలో ఉంచడం, కట్టడి చేయడం. 3. లైంగిక హింస.. అనుమతి లేకుండా లైంగిక చర్యలకు పాల్పడటం 4. ఆర్థిక పీడన.. వృద్ధుల ఆస్తులు, సొమ్మును దుర్వినియోగం చేయడం, తస్కరించడం. 5. నిర్లక్ష్యం చేయడం, వదిలేయడం... కూడు, గూడు, నీడ కల్పించకపోవడంతోపాటు వైద్యం అందించకపోవడం. ఈ సంఘటనలు ఒక్కసారి కాకుండా పదే పదే జరిగే అవకాశాలు చాలా ఎక్కువ. వృద్ధులపై హింస ప్రధానంగా రెండు వర్గాల నుంచి ఎదురవుతోంది. వృద్ధులపై హింస ప్రధానంగా రెండు వర్గాలనుంచి ఎదరవుతోంది ఒకటి : కుటుంబ సభ్యులు.. రెండు : 90 శాతం మంది ఆరోగ్యసేవలు అందించేవాళ్లు (నర్సులు, ఆసుపత్రి సిబ్బంది) ఈ అంశానికి సంబంధించిన సమాచారం చాలా తక్కువ. అమెరికాలో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం.. నర్సింగ్ హోమ్‌లు, ఆసుపత్రుల్లోనూ ఈ హింస ఎక్కువగానే ఉంది. ఫిర్యాదులు 4 శాతమే ఎందుకు? వృద్ధులు తమపై జరిగే హింసపై ఫిర్యాదు చేసేది చాలా తక్కువ. అవమానంగా భావించడం ఇందుకు ఒక కారణమైతే, ఫిర్యాదు చేస్తే ప్రతి చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్న భయం రెండోది. అలాగే తమను హింసించిన వారు (కుటుంబ సభ్యులు) సమస్యల్లో చిక్కుకుంటారన్న ఆందోళన, ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియకపోవడం కూడా కారణాలే. సగం దేశాల్లో వ్యవస్థలే లేవు... వృద్ధులపై జరిగే హింసను అడ్డుకునేందుకు ప్రభుత్వాలు తగిన వ్యవస్థలను ఏర్పాటు చేయాల్సి ఉండగా... 60 శాతం దేశాల్లో ఇలాంటి ఏర్పాట్లే లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. కేవలం 17 శాతం దేశాలు తమ దేశాల్లో వృద్ధుల పరిస్థితి ఏమిటన్న విషయంపై సర్వే నిర్వహించాయి. భారత్‌లో ఏజ్‌వెల్ ఇండియా అనే సంస్థ కొంత కాలం క్రితం ఈ అంశంపై ఒక సర్వే నిర్వహించింది. దాని ప్రకారం వృద్ధులపై హింసకు సామాజిక, ఆర్థిక స్థాయిలకు సంబంధం లేదు. అన్ని వర్గాల కుటుంబాల్లోనూ హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అంతేకాదు... సుమారు 71% వృద్ధులు తమ కుటుంబ సభ్యులు, బంధువుల చేతుల్లోనే హింసకు గురవుతున్నారు. అవహేళనకు గురవుతున్నారు. కుటుంబం ఆర్థిక స్థితి, ఇరుకిరుకు ఇళ్లు, వ్యక్తిగత సమస్యలు, దీర్ఘకాలిక వ్యాధులు వృద్ధులపై హింసకు ప్రధాన కారణాలుగా ఈ సర్వే గుర్తించింది. పడిపోతున్న నైతిక విలువల మాట సరేసరి అని చెప్పింది. వృద్ధులపై భౌతిక హింస కారణంగా అమెరికాలోనే ఏటా దాదాపు 53 లక్షల డాలర్ల వ్యయం అవుతున్నట్లు ఒక అధ్యయనం స్పష్టం చేసింది. నిజానికి ఈ సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వాలు చేయాల్సింది చాలా ఉంది. ఆరోగ్య రంగంతోపాటు ఇతర రంగాల్లోనూ సామాజికంగా, ఆరోగ్యపరంగా జరిగే నష్టాన్ని వివరించడం ఇందులో ఒకటి. అలాగే వృద్ధులపై హింసను ప్రజారోగ్య సమస్యగా గుర్తించడంతోపాటు ఏదైనా సమస్య ఎదురైతే సంప్రదించేందుకు వీలుగా ఒక అధికారిని నియమించడం, హింస నివారణకు తగిన చట్టాలు చేయడం, చర్యలు తీసుకోవడం కూడా ప్రభుత్వాల బాధ్యతే. భారత్‌లో పరిస్థితి కొంత మెరుగు! భారత్‌లో ప్రస్తుతం అరవై ఏళ్ల పైబడ్డ వారు సుమారు పది కోట్ల మంది ఉంటారని గణాంకాలు చెబుతున్నాయి. జీవన ప్రమాణాలు, ఆరోగ్య సౌకర్యాలు పెరుగుతున్న కారణంగా 2030 నాటికి దేశంలో వృద్ధుల సంఖ్య 38 శాతం పెరుగుతుందని అంచనా. వీరిపై హింసాత్మక ఘటనలు పెరుగుతున్నప్పటికీ ప్రభుత్వం వృద్ధులను కాపాడేందుకు కొద్దోగొప్పో చట్టాలను చేసింది కూడా. 2017లో ఢిల్లీ హైకోర్టు తీర్పు ప్రకారం హింసకు దిగుతున్న పిల్లలను ఇంట్లోంచి వెళ్లగొట్టే అధికారం తల్లిదండ్రులకు సంక్రమించింది. ఆస్తి సొంతానిది కాకపోయినా, చట్టపరంగా అధీనంలో ఉన్నదైతే చాలు. ఈ చట్టం కారణంగా చాలామంది వృద్ధులకు సొంతిల్లు లేదా తమ అధీనంలో ఉన్న ఇంట్లోనే బిడ్డల దయాదాక్షిణ్యాలపై ఉండాల్సిన అవసరం తప్పుతుంది. తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్ల పోషణ విషయంపై భారత ప్రభుత్వం 2007లో చేసిన చట్టం కూడా వృద్ధులను హింస నుంచి రక్షించేదే. తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత కొడుకులదని 2007నాటి చట్టంలో పేర్కొనగా 2013లో పోషణ విషయమైన తల్లిదండ్రులు సంతానానికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేయవచ్చునని సవరించారు. 2018లో ఇంకో సవరణ చేస్తూ పోషణభారం కేవలం కొడుకులు, కోడళ్లపైనే కాకుండా కూతుళ్లు, అల్లుళ్లకూ ఉంటుందని కూడా విస్పష్టంగా పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి జిల్లాలోనూ వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేసేందుకు, నిర్వహణ బాధ్యతలు చేపట్టేందుకు ఈ చట్టం అనుమతిచ్చింది. తల్లిదండ్రులు తమ నెలవారీ ఖర్చుల కోసం సంతానానికి దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా ఈ చట్టం కల్పిస్తోంది. చట్టాన్ని ఉల్లంఘించిన పిల్లలకు రూ.ఐదు వేల వరకూ జరిమానా, 3 నెలల జైలుశిక్ష, లేదా రెండు శిక్షలు కలిపి విధించవచ్చు. ఈ చట్టాలపై అవగాహన లేకపోవడం వల్ల చాలామంది వృద్ధులు హింసను సహిస్తున్నారని అంచనా. -
సింగిల్.. జోష్ ఫుల్
నేడు సింగిల్స్ అవేర్నెస్ డే మనకు నచ్చిన వారికి మనం నచ్చలేదు. మనల్ని మెచ్చిన వారు మనకి నచ్చలేదు. ఫైనల్‌గా మిగిలింది ఒంటరి ప్రయాణం. సోషల్ యానిమల్గా పుట్టిన మనిషి సింగిల్‌గా సెటిలవ్వాలంటే సింపుల్ థింగ్ కాదు. కానీ, జంటగా ఉన్న వారిని మించిన ఆనందాలను అందుకుంటున్న ‘ఏక్ నిరంజన్’లు సిటీలో ఉన్నారు. అలాంటి వారినుద్దేశించిందే ఈ సింగిల్స్ అవేర్నెస్ డే! ..:: ఎస్.సత్యబాబు కొన్ని సర్వేల ఫలితాల ప్రకారం.. వాలెంటైన్స్ డే రోజున 60 శాతం మంది ఒంటరితనంలో కుంగిపోతున్నారట. ఇందులో 7 శాతం మంది తీవ్రమైన ఫస్ట్రేషన్‌కు గురవుతున్నారట. ఇలాంటి పరిస్థితుల నుంచీ, రొమాంటిక్ రిలేషన్షిప్లో లేని వ్యక్తుల ఆవేదనలో నుంచి పుట్టిందీ ‘డే’. వాలెంటైన్స్‌డే తర్వాతి రోజును పలు దేశాల్లో సింగిల్స్ అవేర్నెస్ డే ఆర్ అప్రిషియేషన్ డే (ఎస్ఏడీ), క్విర్కీ ఎలోన్ డే అనీ వ్యవహరిస్తారు. ఒంటరిగా ఉండడం శాపం కాదని, బంధాల్లేకపోయినా ఆనందంగా ఉండగలమని చెప్పడానికి ఈ రోజును ప్రత్యేకించారు. ఫిబ్రవరి 15న అమెరికా మహిళల్లో 15 శాతం మంది తమకు తామే ఫ్లవర్స్ పంపించుకుంటారట. చైనాలో మాత్రం నవంబరు 11న సింగిల్స్ డే సెలబ్రేట్ చేసుకుంటారు. ఆ రోజున నాలుగు ఒకట్లు వస్తాయి కాబట్టి అది సింగిల్ లైఫ్‌కు మద్దతిచ్చే సంఖ్య అని భావిస్తారు. ఏం చేస్తారు? ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున సింగిల్ ఈవెంట్స్, ట్రావెలింగ్ చేస్తారు. వాలెంటైన్స్ డే కలర్ అయిన రెడ్‌కు పూర్తి వ్యతిరేకంగా భావించే గ్రీన్ కలర్‌ను ధరిస్తారు. అసలు రిలేషన్స్ అంటే ఇష్టమే లేని వాళ్లు బ్లాక్ ధరిస్తారు. అలాగే సింగిల్ అవేర్నెస్ డే శుభాకాంక్షలు తెలిపే కార్డులు, బహుమతులు, దీని కోసం ప్రత్యేకించిన పాటలు సైతం అందుబాటులో ఉన్నాయి. ఒంటరితనం కాదు దయనీయం... ఒంటరిగా ఉండడం కూడా వేడుక చేసుకోదగిన విషయమేనని ఎస్ఏడీ రూపకర్తలు అంటున్నారు. ఇప్పటికే రిలేషన్లో ఉన్న చాలామంది ఒంటరి జీవితమే మేలనుకుంటున్నారనే విషయాన్ని వీరు గుర్తు చేస్తున్నారు. ‘ఎస్ అయామ్ సింగిల్. అండ్ అయామ్ ఓకే’ అని సగర్వంగా చెప్పాలంటున్నారు. కారణాలేమైనా.. నగర జీవనంలో ఒంటరితనాన్ని ఎంచుకునే వారు పెరిగిపోతున్నారు. ‘ఏ వయసులోనైనా మనిషికి తోడు అవసరం. అది పెళ్లి, స్నేహం, లివిన్ రిలేషన్షిప్... ఇలా ఏ రూపంలోనైనా దొరకవచ్చు. అయితే అది దొరకనంత మాత్రాన దురదృష్టవంతులం అనుకోకూడదు. సింగిల్‌గా ఉన్నవారికి ఆ లోన్లీ ఫీలింగ్ తొలగించేందుకు కృషి చేస్తున్నాం’ అంటున్నారు తోడునీడ ఆర్గనైజేషన్‌కి చెందిన రాజేశ్వరి. ఒక్కరై రావడం... ఒక్కరై పోవడం... పుట్టుకలోనూ, పోవడంలోనూ మనం ఒంటరులమే. లైఫ్‌లో మనల్ని మనం ప్రేమించలేకపోతే ఎవర్నీ ప్రేమించలేం. మనల్ని మనం నెంబర్‌వన్‌గా ట్రీట్ చేసుకోవాలి. అప్పుడే సింగిల్‌గా ఉండడం జాలి పడాల్సిన విషయం కాదని తెలుస్తుంది. సరైన సోల్‌మేట్ దొరికితే సరే... లేకుంటే సింగిల్‌గా ఉండడంలోనూ ఆనందం ఉంది. - సురేష్, సినీనటుడు సంతోషిస్తున్నా... ఒంటరిగా ఉండడం బాధపడాల్సిన విషయమేమీ కాదు. మనకు నచ్చినట్టు, మనం కోరుకున్నట్టు జీవించడానికి అదో మంచి చాన్స్. మీ సమయం, మీ నిర్ణయాలు, మీ ఆర్థికస్వేచ్ఛ.. అన్నీ మీవే. పిటీ అనే మాటే లేదు. ఆల్ హ్యాపీస్. సింగిల్‌గా ఉండడంలోని హాయిని నేను ఎంజాయ్ చేస్తున్నా. - ఆర్.జె.భార్గవి, రేడియో మిర్చి