Ayesha Meera Murder Case
-
ఆయేషా మృతదేహానికి రీ పోస్టుమార్టం
సాక్షి, గుంటూరు: పన్నెండు ఏళ్ల క్రితం రాష్ట్రంలో సంచలనం సృష్టించిన బీఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ అధికారులు శనివారం ఆమె మృతదేహానికి రీ పోస్ట్‌మార్టం నిర్వహించారు. సీబీఐ ఎస్పీ పుట్టా విమలాదిత్య నేతృత్వంలో అధికారులు గుంటూరు జిల్లా తెనాలి చెంచుపేటలోని ముస్లింల శ్మశాన వాటికలో ఉన్న ఆయేషా సమాధిని తవ్వి, మృతదేహాన్ని వెలికితీశారు. ఆయేషా తండ్రి సయ్యద్ ఇక్బాల్‌బాషా, మత పెద్దలు, రెవెన్యూ అధికారుల సమక్షంలో సీబీఐ అధికారులు, ఫోరెన్సిక్ నిపుణుల బృందం సభ్యులు శవ పరీక్ష నిర్వహించారు. ఉదయం 8.51 గంటలకు సమాధి వద్దకు చేరుకున్న అధికారులు మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు పరీక్షలు జరిపారు. సమాధి నుంచి ఎముకలు, ఇతర అవశేషాలను సేకరించారు. వాటితో అస్థిపంజర నిర్మాణం చేసి, అణువణువునూ క్షుణ్నంగా పరిశీలించారు. కేసు దర్యాప్తునకు అవసరమవుతాయన్న భావనతో ఆయేషా మృతదేహం కింది దవడ ఎముక, ఉరోస్థి(స్టెర్నమ్), మోచేతి పైఎముక(హుమెరస్), పుర్రె ఎముకలను సేకరించి సీల్డు కవర్లు, బాక్సుల్లో భద్రపరచి, పరీక్షల కోసం హైదరాబాద్‌లోని నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీకి(సీఎఫ్ఎస్ఎల్) తరలించారు. రీ పోస్ట్‌మార్టానికి సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించకుండానే అధికారులు వెళ్లిపోయారు. రీ పోస్ట్‌మార్టం సందర్భంగా పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు. త్వరలో దోషుల గుర్తింపు? ఆయేషా హత్య కేసులో అసలు దోషులను సీబీఐ అధికారులు త్వరలో గుర్తిస్తారని సీనియర్ న్యాయవాది పిచ్చుక శ్రీనివాస్ చెప్పారు. ఏడాది క్రితం కేసు నమోదు చేసిన సీబీఐ ఇప్పటికే పలువురు సాక్షులను విచారించిందని, అంతేకాక న్యాయస్థానంలో కేసును నిరూపించేందుకు అవసరమైన శాస్త్రీయ ఆధారాలన్నింటినీ సేకరిస్తోందని తెలిపారు. అసలు దోషులను గుర్తించడంలో రీ పోస్ట్‌మార్టం నివేదిక కీలకం కానుందన్నారు. దర్యాప్తులో ఆ ఎముకలు కీలకం? ఆయేషా హత్య కేసు దర్యాప్తులో వైద్య/ఫోరెన్సిక్ నిపుణుల బృందం సేకరించిన ఎముకలు కీలకం కానున్నాయని తెలుస్తోంది. ఆయేషా మృతదేహానికి సంబంధించి పోస్ట్‌మార్టం నివేదిక తప్పుల తడకగా ఉందని, మెడ కింది భాగం, శరీరంపై అనేక గాయాలున్నాయని, వాటిని పోస్ట్‌మార్టం నివేదికలో వెల్లడించలేదని, అంతేకాక డీఎన్ఏ రిపోర్టు సైతం లోపభూయిష్టమంటూ ఆమె తల్లిదండ్రులు, వారి తరఫు న్యాయవాది ఆరోపిస్తూ వస్తున్నారు. ఆయేషా తలను తలుపుకేసి మోదడమే కాకుండా కర్ర, ఇతర ఆయుధాలతోనూ దాడి చేశారని వీరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఛాతీ ప్రాంతంలో ఉండే ఉరోస్థి, చేతికి సంబంధించిన హుమెరస్, పుర్రె, దవడ ఎముకలను నిపుణులు సేకరించారు. వీటిని అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పరీక్షించి నివేదిక రూపొందించనున్నారు. రీ పోస్ట్‌మార్టం నివేదికలో ఈ ఎముకలు కీలకంగా మారనున్నాయి. ఇప్పటికైనా న్యాయం జరగాలి మా మత ఆచారాలను పక్కనపెట్టి మరీ రీ పోస్ట్‌మార్టానికి ఒప్పుకున్నాం. 12 ఏళ్లుగా మా పోరాటం కొనసాగిస్తున్నాం. గతంలో ‘సిట్’ దర్యాప్తు దాదాపు ఏడాది పాటు జరిగినా న్యాయం జరగలేదు. ఇప్పటికైనా సీబీఐ దర్యాప్తుతో మాకు న్యాయం జరగాలి. అసలు దోషులను శిక్షించాలని కోరుతున్నాం. – శంషాద్ బేగం, ఇక్బాల్ బాషా, ఆయేషా మీరా తల్లిదండ్రులు -
అయేషా మీరా కేసు; కానిస్టేబుల్ సహా కమిషనర్ల వరకు..
సాక్షి, విజయవాడ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన బీఫార్మసీ విద్యార్థిని అయేషా మీరా హత్య కేసు దర్యాప్తులో సీబీఐ దూకుడు పెంచింది. ఈ కేసులో ఇప్పటికే సీబీఐ పలువురిని విచారించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అయేషా మీరా కేసును తొలుత దర్యాప్తు చేసిన పోలీసులను ప్రశ్నించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా అప్పటి కమిషనర్ సీవీ ఆనంద్ సహా, ఈ కేసులో ప్రత్యేక అధికారిగా వ్యవహరించిన నల్గొండ ఎస్పీ రంగనాథ్‌ను సీబీఐ విచారించనుంది. వీరితో సహా ముగ్గురు కమిషనర్లు, ముగ్గురు ఏసీపీలు, తొమ్మిది మంది కానిస్టేబుళ్లపై సీబీఐ విచారణ చేపట్టనుంది. అయేషా మీరా హత్యకేసు.. కృష్ణాజిల్లా విజయవాడలోని ఇంబ్రహీంపట్నం హాస్టల్లో 2007 డిసెంబర్లో ఆయేషా మీరా దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టిన పోలీసులు సత్యంబాబును 2008 ఆగస్టు 17న నిందితుడిగా అరెస్టు చేశారు. సెల్‌ఫోన్ దొంగతనం కేసులో సత్యంబాబు పట్టుబడటంతో అతడిని.. ఆయేషా హత్య కేసులో నిందితుడిగా చూపించారనే ఆరోపణలు వచ్చాయి. హత్య కేసును విచారించిన విజయవాడ మహిళా కోర్టు 2010 సెప్టెంబర్ 29న సత్యంబాబును దోషిగా నిర్ధారిస్తూ జీవిత ఖైదు విధించింది. దీంతో సత్యంబాబు హైకోర్టును ఆశ్రయించగా, అతడిని నిర్దోషిగా ప్రకటిస్తూ గత ఏడాది మార్చి 31న తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. -
అయేషా మీరా కేసు: సీబీఐ కీలక నిర్ణయం
సాక్షి, విజయవాడ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన బీఫార్మసీ విద్యార్థిని అయేషా మీరా హత్య కేసు మరో కీలక మలుపు తిరిగింది. ఇప్పటికే ఈ కేసు విచారణ చేపట్టిన సీబీఐ పలువురిని విచారించిన విషయం తెలిసిందే. తాజాగా అయేషా మీరా కేసును తొలుత దర్యాప్తు చేసిన పోలీసులను ప్రశ్నించాలనే నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో పోలీసులు తనను కావాలనే ఇరికించారని ఇప్పటికే కేసులో శిక్షపడి విడుదలైన సత్యంబాబు ఆరోపించిన విషయం తెలిసిందే. ఇక హత్య జరిగి 11 ఏళ్లు గడవటం.. కేసులో సాక్ష్యాలు ధ్వంసం కావటంతో సీబీఐ అధికారులు అప్పటి పోలీసులను విచారణపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగానే వారిని విచారించాలనే నిర్ణయానికి వచ్చారు. ఇప్పటికే 15 మందితో కూడిన పోలీసు అధికారుల జాబితాను సిద్ధం చేసిన సీబీఐ.. ఫిబ్రవరి తొలి వారంలో వారిని ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వారిచ్చే సమాచారం కేసు పురోగతికి పనికొస్తుందని సీబీఐ అధికారులు భావిస్తున్నారు. అసలేం జరిగిందంటే.. కృష్ణాజిల్లా విజయవాడలోని ఇంబ్రహీంపట్నం హాస్టల్లో 2007 డిసెంబర్లో ఆయేషా మీరా దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టిన పోలీసులు సత్యంబాబును 2008 ఆగస్టు 17న నిందితుడిగా అరెస్టు చేశారు. సెల్‌ఫోన్ దొంగతనం కేసులో సత్యంబాబు పట్టుబడటంతో అతడిని.. ఆయేషా హత్య కేసులో నిందితుడిగా చూపించారనే ఆరోపణలు వచ్చాయి. హత్య కేసును విచారించిన విజయవాడ మహిళా కోర్టు 2010 సెప్టెంబర్ 29న సత్యంబాబును దోషిగా నిర్ధారిస్తూ జీవిత ఖైదు విధించింది. దీంతో సత్యంబాబు హైకోర్టును ఆశ్రయించగా, అతడిని నిర్దోషిగా ప్రకటిస్తూ గత ఏడాది మార్చి 31న తీర్పు వెలువరించింది. -
అయేషా మీరా హత్య కేసులో దర్యాప్తు వేగవంతం
-
కోనేరు సతీష్బాబును విచారించిన సీబీఐ
రామవరప్పాడు /సాక్షి, అమరావతిబ్యూరో/నందిగామ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన బీ ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసు విచారణను సీబీఐ వేగవంతం చేసింది. హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కృష్ణాజిల్లా గూడవల్లి గ్రామ మాజీ సర్పంచ్, మాజీ మంత్రి కోనేరు రంగారావు మనవడు కోనేరు సతీష్బాబును ఆయన ఇంట్లో ఐదుగురు సభ్యులతో కూడిన సీబీఐ అధికారుల బృందం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు విచారించింది. పలు అంశాల్లో ప్రశ్నలు సంధించి సమాధానాలు రాబట్టింది. రెండు అంతస్తుల్లోని బెడ్రూమ్లు, హాల్, బీరువా, సీక్రెట్ లాక్‌లను ఓపెన్ చేసి సోదాలు నిర్వహించింది. 9 గంటల పాటు సాగిన విచారణ, సోదాల్లో పలు వస్తువులను, కంప్యూటర్ హర్డ్ డిస్క్, ఫోన్ లిస్టుల బుక్, సీడీ, డైరీలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సతీష్, ఇంట్లో పనివారి వద్ద సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని ల్యాండ్లైన్ల ఫోన్ కనెక్షన్ కట్ చేశారు. కాగా తాను నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి ఎటువంటి పరీక్షలకైనా సిద్ధమేనని సతీష్‌బాబు అన్నారు. బలవంతంగా ఒప్పించారు: సత్యంబాబు తనను బెదిరించి నేరం ఒప్పించారని ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొని జైలుకు వెళ్లి నిర్దోషిగా విడుదలయిన సత్యంబాబు పేర్కొన్నారు. ఐదుగురు సభ్యులతో కూడిన సీబీఐ బృందం కంచికచర్ల మండలం అనాసాగరంలోని ఆయన ఇంట్లో సత్యంబాబును, కుటుంబ సభ్యులను విచారించి వాంగ్మూలాన్ని రికార్డు చేసింది. తాను నిర్దోషినని, అసలు ఆయేషా ఎవరో తనకు తెలియదని, హత్య ఎలా జరిగిందో తెలియదని, కేవలం విచారణ పేరుతో రాత్రి సమయంలో వచ్చి తనను తీసుకెళ్లారని చెప్పాడు. నేరం అంగీకరించాల్సిందిగా బలవంతం చేశారని, తాను అంగీకరించకపోవడంతో తన తల్లిని, చెల్లిని చంపేస్తామంటూ బెదిరించి మరీ ఒప్పించారని తెలిపాడు. ఈ క్రమంలో తనను శారీరకంగా, మానసికంగా పోలీసులు వేధించారని, నేరం అంగీకరించకపోతే ఎన్కౌంటర్ చేస్తామని బెదరించడంతో మరో గత్యంతరం లేక నేరాన్ని అంగీకరించానని సత్యంబాబు సీబీఐ అధికారుల వద్ద వాపోయాడు. సత్యంబాబు వాంగ్మూలాన్ని నమోదు చేసిన తరువాత ఆయేషా హత్యకు గురయిన ఇబ్రహీంపట్నంలోని లక్ష్మీదుర్గ హాస్టల్‌ను పరిశీలించారు. ఇప్పటికే ఆయేషామీరా కేసులో కీలకమైన సాక్ష్యాలు ధ్వంసం అయిన ఘటనలో ముగ్గురు విజయవాడ మహిళా కోర్టు సిబ్బందిపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సంగతి తెలిసిందే. -
అయేషా హత్య కేసు : సత్యంబాబు సంచలన వ్యాఖ్యలు
సాక్షి, విజయవాడ : తన తల్లిని, చెల్లిని చంపుతామని పోలీసులు బెదిరించడంతోనే నర్సింగ్ విద్యార్థిని అయేషా మీరా(19) హత్య కేసులో తాను నేరం ఒప్పుకోవాల్సి వచ్చిందని సత్యంబాబు సంచలన వ్యాఖ్యలు చేశాడు. శుక్రవారం ఈ కేసు విచారణలో భాగంగా సీబీఐ ముందు హాజరైన సత్యంబాబు అనంతరం మీడియాతో మాట్లాడాడు. తాను నేరం అంగీకరించకపోతే ఎన్కౌంటర్ చేస్తానని పోలీసులు బెదిరించారని తెలిపాడు. నిర్భయ కేసులో ఏ విధంగా న్యాయం జరిగిందో అదే విధంగా ఆయేషా హత్య కేసులో కూడా న్యాయం జరగాలని, దీనికోసం సీబీఐ అధికారులకు పూర్తిగా సహకరిస్తానని చెప్పాడు. ఈ రోజు విచారణలో సీబీఐ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చానని పేర్కొన్నాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన అయేషా మీరా హత్య కేసులో అసలు నిందితులను పట్టుకోవడంలో ఏపీ పోలీసులు విఫలమవ్వటంతో హైకోర్టు ఈ కేసును సీబీఐకి బదిలీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ హత్య కేసు విచారణ చేపట్టిన సీబీఐ దూకుడు పెంచింది. శుక్రవారం సత్యంబాబుతో పాటు ఇబ్రహీంపట్నం శ్రీ దుర్గా హాస్టల్ నిర్వాహకులను విచారించింది. అసలేం జరిగిందంటే.. కృష్ణాజిల్లా విజయవాడలోని ఇంబ్రహీంపట్నం హాస్టల్లో 2007 డిసెంబర్లో ఆయేషా మీరా దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టిన పోలీసులు సత్యంబాబును 2008 ఆగస్టు 17న నిందితుడిగా అరెస్టు చేశారు. సెల్‌ఫోన్ దొంగతనం కేసులో సత్యంబాబు పట్టుబడటంతో అతడిని.. ఆయేషా హత్య కేసులో నిందితుడిగా చూపించారనే ఆరోపణలు వచ్చాయి. హత్య కేసును విచారించిన విజయవాడ మహిళా కోర్టు 2010 సెప్టెంబర్ 29న సత్యంబాబును దోషిగా నిర్ధారిస్తూ జీవిత ఖైదు విధించింది. దీంతో సత్యంబాబు హైకోర్టును ఆశ్రయించగా, అతడిని నిర్దోషిగా ప్రకటిస్తూ గత ఏడాది మార్చి 31న తీర్పు వెలువరించింది. -
అయేషా హత్య కేసు విచారణలో దూకుడు పెంచిన సీబీఐ
-
అయేషా హత్య కేసు : దూకుడు పెంచిన సీబీఐ
సాక్షి, విజయవాడ : సంచలనం సృష్టించిన నర్సింగ్ విద్యార్థిని అయేషా మీరా(19) హత్య కేసు విచారణలో సీబీఐ దూకుడు పెంచింది. శుక్రవారం ఉదయం నుండి సత్యంబాబును సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. సత్యం బాబు కుటుంబ సభ్యుల స్టేట్ మెంట్‌ను సీబీఐ అధికారులు రికార్డ్ చేసుకుంటున్నారు. విజయవాడలోని నందిగామ సమీపంలోని అనగమసాగరం గ్రామంలో సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. 'ఈ కేసుతో నాకు ఎటువంటి సంబంధం లేదు. ఆయేషా మీరా కేసులో పోలీసులు నన్ను చిత్రహింసలు పెట్టారు. నేరం అంగీకరించక పోతే ఎన్కౌంటర్ చేస్తానని బెదిరించారు. నేను బతికేందుకు కనీస ఉపాధి కూడా లేదు' అని సీబీఐ అధికారులతో సత్యం బాబు తెలిపారు. ఇబ్రహీంపట్నం శ్రీ దుర్గా హాస్టల్ నిర్వాహకులను సైతం సీబీఐ అధికారులు విచారించనున్నారు. ఈ కేసులో ఇప్పటికే విజయవాడ కోర్టుకు చెందిన ముగ్గురు కోర్టు సిబ్బందిపై సీబీఐ అధికారులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. కేసు డాక్యుమెంట్లు, సాక్ష్యాలు ధ్వంసం అయిన అంశంపై పి.కుమారి, పి. వెంకటకుమార్, వై సుబ్బారెడ్డిలపై కేసు నమోదు చేశారు. అయేషా మీరా కేసులో అసలు నిందితులను పట్టుకోవటంలో ఏపీ పోలీసులు విఫలమవ్వటంతో హైకోర్టు ఈ కేసును సీబీఐకి బదిలీ చేసిన సంగతి తెలిసిందే. -
సీబీఐకి ఆయేషా హత్య కేసు
సాక్షి, హైదరాబాద్: గుంటూరు జిల్లా తెనాలికి చెందిన బీఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసు దర్యాప్తు బాధ్యతలను హైకోర్టు గురువారం కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కు అప్పగించింది. ఈ కేసుకు సంబంధించిన వస్తు సాక్ష్యాలు (మెటీరియల్ ఆబ్జెక్ట్స్) ఇప్పటికే నాశనమైన నేపథ్యంలో ఈ కేసుకు ఓ తార్కిక ముగింపు తీసుకు రావాలని సీబీఐకి హైకోర్టు స్పష్టం చేసింది. వస్తు సాక్ష్యాల నాశనం వెనుక ఎవరున్నారు? ఏ ఉద్దేశంతో వారు వాటిని నాశనం చేశారు? తదితర విషయాలను దర్యాప్తులో తేల్చాలంది. ఆయేషా హత్య, వస్తు సాక్ష్యాల నాశనంపై వేర్వేరుగా రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేసి దర్యాప్తు చేయాలని స్పష్టం చేస్తూ ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. తమ కుమార్తె హత్య కేసుపై సిట్ చేసే పునర్ దర్యాప్తును హైకోర్టే పర్యవేక్షించాలని, లేని పక్షంలో సీబీఐకి దర్యాప్తు బాధ్యతలను అప్పగించాలని కోరుతూ శంషాద్ బేగం, సయ్యద్ ఇక్బాల్ బాషాలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన సీజే నేతృత్వంలోని ధర్మాసనం గురువారం మరోసారి దానిని విచారించింది. -
అయేషా మీరా హత్యకేసులో మలుపు
-
అయేషా మీరా హత్యకేసులో కీలక మలుపు
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన బీఫార్మసీ విద్యార్థిని అయేషా మీరా హత్య కేసు మరో కీలక మలుపు తిరిగింది. ఈ హత్య కేసుకు సంబంధించిన రికార్డులన్నీ విజయవాడ కోర్టులో ధ్వంసమయ్యాయని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) హైకోర్టుకు తెలిపింది. ఉమ్మడి హైకోర్టులో కేసు నడుస్తున్నప్పుడే రికార్డులు ధ్వంసమయ్యాయని సిట్ అధికారులు ధర్మాసనానికి తెలిపారు. దీనిపై ఆగ్రహించిన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం రికార్టుల ధ్వంసంపై విచారణకు ఆదేశించింది. నాలుగు వారాల్లో నివేదిక సమర్పించాలని రిజిస్టార్ జనరల్‌కు ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో పోలీసు విచారణ కంటే సీబీఐ దర్యాప్తే మేలని ధర్మాసనం అభిప్రాయపడింది. దీనిలో భాగంగా సీబీఐని సైతం సుమోటో ప్రతివాదిగా చేర్చించింది. అసలేం జరిగిందంటే.. కృష్ణాజిల్లా విజయవాడలోని ఇంబ్రహీంపట్నం హాస్టల్లో 2007 డిసెంబర్లో ఆయేషా మీరా దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టిన పోలీసులు సత్యంబాబును 2008 ఆగస్టు 17న నిందితుడిగా అరెస్టు చేశారు. సెల్‌ఫోన్ దొంగతనం కేసులో సత్యంబాబు పట్టుబడటంతో అతడిని.. ఆయేషా హత్య కేసులో నిందితుడిగా చూపించారనే ఆరోపణలు వచ్చాయి. హత్య కేసును విచారించిన విజయవాడ మహిళా కోర్టు 2010 సెప్టెంబర్ 29న సత్యంబాబును దోషిగా నిర్ధారిస్తూ జీవిత ఖైదు విధించింది. దీంతో సత్యంబాబు హైకోర్టును ఆశ్రయించగా, అతడిని నిర్దోషిగా ప్రకటిస్తూ గత ఏడాది మార్చి 31న తీర్పు వెలువరించింది. అంతేకాకుండా ఈ దర్యాప్తు బాధ్యతను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)కు అప్పగిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది. కాగా హైకోర్టు నిర్ణయంపై అయేషా మీరా తల్లిదండ్రులు, మహిళా సంఘాలు హర్షం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. -
ఆయేషా కేసు : నార్కో పరీక్షల తీర్పు వాయిదా
సాక్షి, హైదరాబాద్: బి.ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్యాచార కేసులో ఏడుగురు అనుమానితులకు నార్కో పరీక్షలపై తీర్పు వాయిదా పడింది. ఈ కేసులో ప్రధాని నిందితులకు నార్కో ఎనాలసిస్ నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) హైదరాబాద్ హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసు పునర్విచారణలో భాగంగా ప్రధాన నిందితులకు నార్కో ఎనాలిసిస్ పరీక్షకు అనుమతిని విజయవాడలోని ట్రయిల్ కోర్టు నిరాకరించడంతో హైకోర్టును ఆశ్రయించింది. నిందితుల అంగీకారం లేకుండా నార్కో టెస్టులను నిర్వహించరాదన్న సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఉదహరిస్తూ స్థానిక కోర్టు సిట్ అభ్యర్థనను తోసిపుచ్చింది. దీనిపై వాదనల అనంతరం హైదరాబాద్ హైకోర్టు న్యాయమూర్తి ఎన్. బాలయోగి తన తీర్పును వాయిదా వేశారు. అయితే హాస్టల్ వార్డెన్, ఆమె భర్త మాత్రమే ఈ పరీక్షలకు అంగీకరించగా, మిగిలిన వారు నిరాకరించారు. ఆయేషా మీరా హత్య కేసులోప్రధాన నిందితులు కోనేరు సతీష్ బాబు(కాంగ్రెస్ మాజీమంత్రి కోనేరు రంగారావు మనవడు) అబ్బురి గణేష్, చింతా పవన్‌కుమార్‌తోపాటు, హాస్టల్ వార్డెన్ ఐనంపూడి పద్మ, ఆమె భర్త శివ రామకృష్ణ, ఆయేషా రూం మేట్స్, సౌమ్య, కవితకు ఈ పరీక్షలు నిర్వహించాలని ఎస్ఐటీ పేర్కొంది. నార్కో ఎనాలలిసిస్, బ్రెయిన్ ఎలక్ట్రికల్ ఆసిలేటింగ్ సిగ్నేచర్ ప్రొఫైలింగ్ టెస్ట్ (BEOSP) నిర్వహించాలని కోరింది. అలాగే ఈ ఫలితాలను గుజరాత్‌లోని ఫోరెన్సిక్ సైన్స్ లాబోరేటరీ (FSL) కు పంపించాలని కోరింది. మరోవైపు ఆయేషా హత్య కేసులో సాక్ష్యాలను మాయం చేశారని ఆరోపిస్తూ ఆయేషా తల్లిదండ్రులు గత నెలలో మరోసారి ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ పలుకుబడితో నేరస్తులను కాపాడేందుకు తమ కూతురి బట్టలు, ఇతర సాక్ష్యాలను నాశనం చేశారని ఆరోపించారు. కాగా 2007, డిసెంబరు 27న ఆయేషా మీరా (17) విజయవాడ ఇబ్రహీంపట్నంలోని లేడీస్ హాస్టల్లో దారుణ హత్యకు గురైంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణల ఎదుర్కొన్న సత్యం బాబుకు 2010లో విజయవాడలోని మహిళా సెషన్స్ కోర్టు జీవిత ఖైదు విధించింది. అయితే 2017, ఏప్రిల్‌లో సత్యంబాబును హైదరాబాద్ హైకోర్టు నిర్దోషిగా విడుదల చేయడంతోపాటు, కేసు దర్యాప్తు చేసిన పోలీసు అధికారులపై చర్య తీసుకోవాలని ఆదేశించింది. దీంతో కేసును తిరిగి దర్యాప్తు చేయాలని ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. -
సహ విద్యార్థినులను ప్రశ్నించలేదేం?
సాక్షి, హైదరాబాద్: బీఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసుపై సిట్ చేస్తున్న దర్యాప్తుపై హైకోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఆయేషా మీరాతోపాటు హాస్టల్లో ఉన్న విద్యార్థినుల వాంగ్మూలాన్ని ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించింది. ‘ఆయేషా హత్య జరిగిన హాస్టల్లో వంద మంది ఉన్నారు.అలాంటి చోట ఆయేషాను తలమీద కొట్టి హత్య చేస్తే పక్కనే ఉన్నవాళ్లు ఏమీ మాట్లాడటం లేదంటే అందుకు భయమే కారణం కావచ్చు. ఇప్పుడు సాగుతున్న దర్యాప్తును చూస్తుంటే, గతంలో విచారించిన వాళ్లనే మళ్లీ విచారిస్తున్నట్లు ఉంది. నిష్పాక్షికంగా, నిజాయితీగా దర్యాప్తు జరపండి’అని సిట్‌ని ఉద్దేశించి కోర్టు వ్యాఖ్యానించింది. దర్యాప్తు పురోగతికి సంబంధించిన వివరాలతో సీల్డ్ కవర్లో నివేదిక సమర్పించాలని సిట్‌కు నేతృత్వం వహిస్తున్న విశాఖ రేంజ్ డీఐజీ సీహెచ్ శ్రీకాంత్‌కు స్పష్టం చేసింది.తదుపరి విచారణను జూలై 13కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి కొంగర విజయలక్ష్మిలతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. -
అయేషా మీరా కేసులో హైకోర్టు కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన బీఫార్మసీ విద్యార్థిని అయేషా మీరా హత్యకేసు పునర్విచారణకు హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. ఈ దర్యాప్తు బాధ్యతను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)కు అప్పగిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది. కోర్టు పర్యవేక్షణలోనే ఈ విచారణ జరగాలని సూచిస్తూ, దర్యాప్తు పూర్తి చేసి ఏప్రిల్ 28లోగా తొలి నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అలాగే ఈ కేసును విచారణ చేస్తున్న సిట్ అధికారులను న్యాయస్థానం అనుమతి లేకుండా బదిలీ చేయరాదని ఆదేశించింది. విశాఖ డీఐజీ శ్రీకాంత్ నేతృత్వంలో ఏర్పడ్డ సిట్‌లో సభ్యులుగా హైమవతి, లక్ష్మీ, షెహెరున్నీసా బేగం కొనసాగనున్నారు. కాగా కృష్ణాజిల్లా విజయవాడలోని ఇంబ్రహీంపట్నం హాస్టల్లో 2007 డిసెంబర్లో ఆయేషా మీరా దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టిన పోలీసులు సత్యంబాబును 2008 ఆగస్టు 17న నిందితుడిగా అరెస్టు చేశారు. సెల్‌ఫోన్ దొంగతనం కేసులో సత్యంబాబు పట్టుబడటంతో అతడిని.. ఆయేషా హత్య కేసులో నిందితుడిగా చూపించారనే ఆరోపణలు వచ్చాయి. హత్య కేసును విచారించిన విజయవాడ మహిళా కోర్టు 2010 సెప్టెంబర్ 29న సత్యంబాబును దోషిగా నిర్ధారిస్తూ జీవిత ఖైదు విధించింది. దీంతో సత్యంబాబు హైకోర్టును ఆశ్రయించగా, అతడిని నిర్దోషిగా ప్రకటిస్తూ గత ఏడాది మార్చి 31న తీర్పు వెలువరించింది. కాగా హైకోర్టు తాజా నిర్ణయంపై అయేషా మీరా తల్లిదండ్రులు, మహిళా సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. -
సత్యంబాబు సంచలన వ్యాఖ్యలు
విజయవాడ: ఆయేషా మీరా హత్యతో తనకు సంబంధం లేదని నిందితుడు సత్యంబాబు పేర్కొన్నాడు. పోలీసులు బెదిరించడం వల్లే చేయని నేరాన్ని ఒప్పుకున్నానని వెల్లడించాడు. తన తల్లిని, చెల్లిని ఎన్ కౌంటర్ చేస్తామని దర్యాప్తు అధికారులు బెదిరించారని సంచలన వ్యాఖ్యలు చేశాడు. అప్పటి పరిస్థితుల్లో గత్యంతరం లేక నేరాన్ని అంగీకరించినట్టు చెప్పాడు. సత్యంబాబు ఆరోపణలను స్పెషల్ ఇన్వెస్టిగేషన్ అధికారి రంగనాథ్ తోసిపుచ్చారు. ఆయేషా మీరాను సత్యంబాబు హత్య చేసినట్టు స్వయంగా అంగీకరించాడని తెలిపారు. చాలా నేరాల్లో అతడు నిందితుడని, బాధితులను విచారిస్తే నేరాల చిట్ట బయటపడుతుందన్నారు. సత్యంబాబు అమాయకుడు, ఇరికించారనేది అబద్ధమన్నారు. సాంకేతికంగా కేసును హైకోర్టు కొట్టేసినా సుప్రీంకోర్టులో ఏం జరుగుతుందో వేచి చూడాలన్నారు. సత్యంబాబును అరెస్ట్ చేశాక నందిగామలో ఒక్క నేరం జరగలేదని వెల్లడించారు. -
ఇది దేవుడిచ్చిన తీర్పు: సత్యంబాబు
రాజమహేంద్రవరం క్రైం/విజయవాడ: ‘‘ఇది దేవుడిచ్చిన తీర్పు. తొమ్మిదేళ్ల నిరీక్షణ ఫలితంగా న్యాయమే గెలిచిం ది’’ అని పిడతల సత్యంబాబు అన్నాడు. ఆయేషామీరా హత్యకేసులో నిర్దోషిగా తేలిన సత్యంబాబు రాజమ హేంద్రవరం సెంట్రల్ జైలునుంచి ఉద్విగ్న పరిస్థితుల మధ్య ఆదివారం ఉదయం విడుదల య్యాడు. సత్యంబాబును నిర్దోషిగా పేర్కొంటూ హైకోర్టు శుక్రవారమే తీర్పు ఇచ్చినప్పటికీ, సంబంధిత ఉత్తర్వులు జైలు అధికారులకు అందడంలో తీవ్రజాప్యం చోటు చేసుకుంది. మాల సంక్షేమ సంఘం ఉద్యోగుల విభాగం నాయకుడు చెట్లపల్లి అరుణ్‌కుమార్ కోర్టు ఉత్తర్వులను హైదరాబాద్ నుంచి ఓ ప్రైవేటు బస్సులో ఆదివారం ఉదయం 8.05 గంటలకు రాజమహేంద్రవరం తీసుకొచ్చారు. ఉత్తర్వులను జైళ్లశాఖ డీఐజీ చంద్రశేఖర్ పరిశీలించి, ఉదయం 8.15 గంటలకు జైలు అధికారులకు అందజేశారు. అన్ని లాంఛ నాలూ పూర్తయ్యాక సత్యంబాబును జైలు నుంచి విడుదల చేశారు. అనంతరం సత్యం బాబు మాట్లాడుతూ తల్లి రుణం తీర్చుకుంటానని, చెల్లెలికి వివాహం చేయాల్సి ఉందని తెలిపాడు. తాను జైలుపాలవడంతో తన కుటుంబం దుర్భర పరిస్థితులను ఎదుర్కొందని ఆవేదన చెందాడు. కుమార్తెను పోగొట్టుకున్న ఆయేషా మీరా తల్లిదండ్రులకు కూడా ప్రభుత్వం న్యాయం చేయాలని కోరాడు. -
'ఆయేషా' కేసులో హైకోర్టు సంచలన తీర్పు
-
మిస్టరీగానే ఆయేషా హత్య
- సత్యం బాబు నిర్దోషి అన్న హైకోర్టు - అసలు దోషులెవరో తేలని వైనం సాక్షి, గుంటూరు: ఆయేషా మీరా హత్య కేసులో సత్యంబాబు నిర్దోషి అని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువరించడంతో అసలు హంతకులు ఎవరు, ఎందుకు చంపారనే అంశం మిస్టరీగానే మిగిలింది. తెనాలికి చెందిన ఆయేషా మీరా నిమ్రా కాలేజీలో 2007లో బీఫార్మసీలో చేరింది. కళాశాల యాజమాన్యం సూచనతో సమీపంలోని దుర్గా లేడీస్ హాస్టల్లో చేరింది. క్రిస్మస్ సెలవులకు ఇంటికి వచ్చి డిసెంబర్ 26వ తేదీ రాత్రి తిరిగి హాస్టల్‌కు వెళ్లిన ఆయేషా.. దారుణ స్థితిలో శవమై తేలింది. ఈ హత్య కేసులో తొలుత హాస్టల్లో వంట చేసే మనిషిని అనుమానించి విచారించారు. ఆ తరువాత లడ్డు అనే మరో వ్యక్తిని, అతని స్నేహితుడు కరీంనగర్‌కు చెంది న వ్యక్తిని విచారించారు. ఆయేషా మీరా మేన మామను, మరో సమీప బంధువును కేసులో చేర్చడానికి యత్నించి చివరకు సత్యంబాబును నిందితుడిగా చేర్చారు. అప్పట్లో దివంగత మాజీ ఉప ముఖ్యమంత్రి కోనేరు రంగారావు మనవడిపై ఆరోపణలు వెల్లువెత్తాయి. అప్పటి విజయవాడ పోలీసు కమిషనర్ ఆనంద్ కేసును పర్యవేక్షించారు. 12 గంటల్లోనే దోషుల పేర్లు వెల్లడిస్తానని ఆయన చెప్పినా వివిధ కారణాలతో ప్రకటించలేదు. ఆయన సీపీగా ఉన్నంత వరకు కేసు విచారణ వేగంగా జరిగింది. అయితే, ఆనంద్ బదిలీతో కేసు మొత్తం తారు మారైంది. సత్యంబాబు సెల్‌ఫోన్ దొంగతనం కేసులో 2008 సంవత్సరం ఆగస్టు 17న అరెస్టు అయ్యాడు. అసలు దోషుల్ని కాపాడాలనే యోచనతో పోలీ సులే సత్యంబా బును ఇరికించారనే ఆరోపణలు అప్పట్లోనే వెల్లు వెత్తాయి. హత్య జరిగిన రోజు హాస్టల్ సత్యంబాబు హాస్టల్ వెనుక భాగం నుంచి గోడదూకి లోపలికి వచ్చా డని పోలీసులు చార్జిషీటులో పేర్కొన్నారు. కానీ పోలీసు జాగి లాలు ఆ వైపు వెళ్ళకుండా, ప్రధాన మార్గౖ మెన మెట్లపై నుంచి వెళ్లాయి. సత్యంబాబు నిర్దోషి అని హైకోర్టు ప్రకటించిన నేపథ్యంలో.. అసలు దోషులెవరో తేల్చేందుకు కేసును పునర్విచా రించాలనే డిమాండ్లు ఊపందుకుంటున్నాయి. అసలు దోషుల్ని శిక్షిస్తేనే ఆయేషా ఆత్మకు శాంతి - ఆయేషా మీరా తల్లిదండ్రుల డిమాండ్ తెనాలి: సత్యంబాబు నిర్దోషి అని తాము మొదటి నుంచీ చెబుతూనే ఉన్నామని, పోలీసులు వినలేదని ఆయేషా మీరా తల్లిదండ్రులు షంషా ద్ బేగం, ఇక్బాల్ బాషాలు చెప్పారు. ఈ కేసులో సత్యంబాబు నిర్దోషి అని శుక్రవారం హైకోర్టు తీర్పు వెలువరించిన అనంతరం గుంటూరు జిల్లా తెనాలిలో వారు విలేకరులతో మాట్లాడారు. హాస్టల్ వార్డెన్ కోనేరు పద్మ నోరు తెరిస్తే 5 నిమిషాల్లో కేసు పరిష్కారం అవుతుందని షంషాద్ బేగం అన్నారు. వార్డెన్ పద్మ, ఆమె భర్త అయినంపూడి శివరామకృష్ణ, హాస్టల్ విద్యార్థులు కవిత, సౌమ్య, ప్రీతి, కోనేరు సతీష్, కోనేరు సురేష్, అబ్బూరి గణేష్, చింతా పవన్‌కుమార్ నిందితులనేది తమ వాదనగా చెప్పారు. వారి రాసలీలలు తమ పాప చూసిందనే ఆమెను చంపేశారని ఆరోపించారు. ఇప్పటికైనా అసలు దోషుల్ని çపట్టుకొని శిక్షిస్తేనే తమ పాప ఆత్మకు శాంతి కలుగుతుందని పేర్కొన్నారు. ఇప్పటికైనా కేసును తిరిగి దర్యాప్తు చేయాలని విజ్ఞప్తి చేశారు. -
ఎనిమిదేళ్ల సత్యం ‘చెర’ ముగింపు
- ‘ఆయేషా’ కేసులో సత్యంబాబు నిర్దోషి: హైకోర్టు - పోలీసులు అన్యాయంగా ఈ కేసులో ఇరికించారు - అసలు నేరస్తులను తప్పించేందుకే ఇలా చేశారు - అత్యాచార వాదనను పోలీసులే తెరపైకి తెచ్చారు - కింది కోర్టు విధించిన జీవిత ఖైదు, జరిమానా రద్దుచేస్తూ తీర్పు సాక్షి, హైదరాబాద్ సంచలనం సృష్టించిన బీ ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసులో నిందితుడుగా ఉన్న పిడతల సత్యంబాబును హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. దళితుడైన సత్యంబాబును పోలీసులు ఈ కేసులో అన్యాయంగా ఇరికించారని తేల్చింది. అసలు ఆయేషాపై అత్యాచారం జరిగిందన్న వాదనను పోలీసులే తెరపైకి తెచ్చారని తేల్చి చెప్పింది. అసలైన నేరస్తులను తప్పించేందుకు, వాస్తవాలను కప్పిపుచ్చి కోర్టును తప్పుదోవ పట్టించేందుకే ఇలా చేశారంది. సత్యంబాబుకు కింది కోర్టు విధించిన జీవితఖైదు, జరిమానాలను రద్దు చేసింది. ఏదైనా ఇతర కేసులో అతని అవసరం ఉంటే తప్ప, తక్షణమే అతన్ని విడుదల చేయాలని ఆదేశించింది. జరిమానాగా అతను ఏదైనా మొత్తాన్ని చెల్లించి ఉంటే దానిని తిరిగి అతనికి వాపసు ఇవ్వాలని స్పష్టం చేసింది. అంతేకాక అతనికి ఖర్చుల కింద రూ.లక్ష చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు సి.వి.నాగార్జునరెడ్డి, ఎం.ఎస్.కె.జైశ్వాల్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం సంచలన తీర్పు వెలువరించింది. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ఆయేషా మీరా కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలోని శ్రీదుర్గా లేడీస్ హాస్టల్లో ఉంటూ.. నిమ్రా కాలేజీలో బీ ఫార్మసీ అభ్యసించేది. 27.12.2007న హాస్టల్లో ఆమెపై అత్యాచారం చేసి, హత్య చేసిన ఘటన అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపిన పోలీసులు చివరకు సత్యంబాబును అరెస్ట్ చేశారు. అతనే ఆయేషా మీరాను హత్య చేశాడంటూ అభియోగం మోపారు. దీనిపై విచారణ జరిపిన విజయవాడ మహిళా కోర్టు సత్యంబాబును దోషిగా నిర్ధారిస్తూ హత్య చేసినందుకు జీవితఖైదు, రూ.1,000 జరిమానా, అత్యాచారం చేసినందుకు పదేళ్ల జైలుశిక్ష, జరిమానా విధిస్తూ 29.9.2010న తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాలు చేస్తూ సత్యంబాబు అదే ఏడాది అక్టోబర్‌లో హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. ఈ అప్పీల్‌పై ధర్మాసనం సుదీర్ఘ విచారణ జరిపింది. అసలు నిందితులను పట్టుకునే ఉద్దేశం లేదు ఆయేషాను సత్యంబాబే హత్య చేశారనేందుకు నిర్దిష్టమైన ఆధారాలను చూపడంలో పోలీసులు దారుణంగా విఫలమయ్యారని ధర్మాసనం పేర్కొంది. పోలీసులు ఎవరో ఒకరిని నేరస్తునిగా చూపాలన్న దిశగానే దర్యాప్తు చేశారే తప్ప, అసలైన నిందితులను పట్టుకునే ఉద్దేశంతో దర్యాప్తు చేయలేదని హైకోర్టు ఆక్షేపించింది. పోలీసులు చెప్పిన సిద్ధాంతాన్నే కింది కోర్టు విశ్వసించిందని తెలిపింది. సత్యంబాబుపై ఉన్న కేసులను కోర్టులు కొట్టేసినప్పటికీ, అతన్ని పోలీసులు కరగడుగట్టిన నేరస్తుడిగా చిత్రీకరించారని పేర్కొంది. శక్తివంతమైన రాజకీయ కుటుంబాన్ని కాపాడేందుకు పోలీసులు తనను అన్యాయంగా ఈ కేసులో ఇరికించారని సత్యంబాబు చెబుతున్న దానిపై అభిప్రాయాన్ని వ్యక్తం చేసేందుకు తమ ముందున్న సాక్ష్యాలు సరిపోవడం లేదని తెలిపింది. అది సూపర్‌మ్యాన్ మాత్రమే చేయగల ఫీట్... ‘8 అడుగుల గోడను రెండుసార్లు ఎక్కి దిగి, రెండోసారి రోకలి బండను ఓ చేత్తో పట్టుకుని ఆ గోడను ఎక్కి ఆయేషా గదికి సత్యంబాబు వెళ్లాడన్న పోలీసుల వాదనపై ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది. ‘5.5 అడుగుల ఎత్తు, 50 కేజీల బరువున్న వ్యక్తి 8 అడుగుల గోడను, ఒక చేత్తో రోకలి బండను పట్టుకుని, ఒంటిచేత్తో ఎక్కడం ఎలా సాధ్యం. ఇది సూపర్‌మ్యాన్ మాత్రమే చేయగల ఫీట్. సామాన్య వ్యక్తికి సాధ్యం కాని పని. అలాగే సాక్షుల వాంగ్మూలం, చార్జిషీట్లోని విషయాలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. తనకు ఐ లవ్ యూ చెప్పేందుకు నిరాకరించిందన్న కోపంతోనే ఆయేషాను సత్యంబాబు చంపాడని ఓసారి, లైంగిక వాంఛ తీర్చుకోవడానికే వెళ్లాడని మరోసారి పోలీసులు చెబుతున్నారు. అంతేకాక ఆయేషా గదికి వెళ్లి కాగితాలు, పెన్నులు, పెన్సిల్ తీసుకుని లేఖలు రాసినట్లు కూడా చెబుతున్నారు. ఇది నిజమైతే సత్యంబాబు అక్కడ చాలాసేపు ఉండి ఉంటాడు. అత్యాచారం, హత్య చేసిన వ్యక్తి అంతసేపు ఉంటాడా? పక్కనే 55 మంది ఇతర విద్యార్థినులు నిద్రిస్తున్నారు. మానవ నైజం ప్రకారం ఘోరమైన చర్యకు పాల్పడిన ఎటువంటి వ్యక్తయినా భయంతో ఘటనా స్థలం నుంచి వెంటనే పారిపోతాడు. కానీ సత్యంబాబు అలా చేయకుండా అక్కడే ఉండి తీరిగ్గా వెళ్లారని పోలీసులు చెప్పడం ఆమోదయోగ్యం లేదు. పోలీసులు చెప్పిన ఈ కథనాన్ని కింది కోర్టు నమ్మింది. కాని మేం మాత్రం నమ్మలేం. అత్యాచారం పోలీసులు అల్లిన కథ... అత్యాచార కథను పోలీసులే తెరపైకి తెచ్చారు. కోర్టును తప్పుదోవ పట్టించేందుకే ఇలా చేశారు. చనిపోయిన, స్పృహలోలేని స్థితిలో మహిళ ఉన్నప్పుడు మర్మాంగాలకు గాయం కాకుండా సంభోగం జరపడం సాధ్యం కాదని వైద్య పుస్తకాలు చెబుతున్నాయి. ఆయేషా శరీరంపై గానీ, మర్మాంగంపై గానీ ప్రతిఘటనకు సంబంధించి ఎటువంటి గాయాలు లేవు. కాబట్టి ఆయేషాపై సత్యంబాబు ఒకటి కాదు రెండుసార్లు అత్యాచారానికి పాల్పడ్డారన్న పోలీసుల వాదనల్లో వాస్తవం లేదని తేలిపోయింది. అసలు ఆయేషా తల్లి అనుమానం చేసిన వ్యక్తికి నార్కో అనాలసిస్ టెస్ట్ చేసేందుకు కోర్టు అనుమతి ఇచ్చినా.. పోలీసులు ఎందుకు ఆ టెస్ట్ చేయలేదో మాకు అర్థం కాకుండా ఉంది..’అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పరిహారం చెల్లింపు ఆదేశాలిచ్చే పరిధి మాకు లేదు సత్యంబాబు తప్పేమీ లేకపోయినా అతన్ని విచారించి.. హింసించి.. నిర్బంధించారని ధర్మాసనం తేల్చింది. సత్యంబాబు, అతని కుటుంబానికి జరిగిన దారుణమైన నష్టానికి, వారు అనుభవించిన శారీరక, మానసిక వ్యథకు ఆర్థికపరమైన పరిహారం చెల్లింపునకు ఆదేశాలు జారీ చేసే పరిధి తమకు లేనందున, అటువంటి ఆదేశాలు ఇవ్వలేకపోతున్నామని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వంపై దావా వేసే విషయంలో నిర్ణయాన్ని అతనికే వదిలేస్తున్నామంది. ప్రస్తుత కేసులో బాధ్యులెవరో గుర్తించి, వారిపై చట్ట ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు ఈ కేసును అపెక్స్ కమిటీకి నివేదించాలని ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. నేడు సత్యంబాబు విడుదల! రాజమహేంద్రవరం క్రైం: హైకోర్టు సత్యంబా బును నిర్దోషిగా పేర్కొనడంతో.. తూర్పు గోదావరి జిల్లా రాజమహేం ద్రవరం సెంట్రల్ జైలు వద్ద ఉత్కంఠ నెలకొంది. సత్యంబాబును 2010లో రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్ కు తీసుకువచ్చారు. అప్పటి నుంచి జైల్లోనే ఉండి విచారణ ఎదుర్కొంటున్నారు. శుక్ర వారం విడుదలకు కోర్టు ఆదేశించినా సం బంధిత పత్రాలు సెంట్రల్ జైలుకు రాలేదు. శనివారం హైకోర్టు నుంచి ఉత్తర్వులు అందిన తర్వాత లాంఛనాలు పూర్తి కాగానే సత్యంబాబు విడుదలయ్యే అవకాశం ఉంది. నా బిడ్డకు నరకం చూపించారు: సత్యంబాబు తల్లి మరియమ్మ నందిగామ రూరల్ (నందిగామ): ‘నా కొడుకు నిర్దోషి అని మొదటి నుంచి చెబుతూనే ఉన్నా. అయినప్పటికీ పోలీసులు పట్టించుకోలేదు. ఉద్దేశ పూర్వకంగా తప్పుడు కేసులు బనాయించి ఎనిమిదేళ్లపాటు నా కుమారుడికి నరకం చూపించారు. నా బిడ్డను అష్టకష్టాలకు గురిచేసిన వారు అంతకంతకు అనుభవిస్తారు..’ అని పిడతల సత్యనారాయణ అలియాస్ సత్యంబాబు తల్లి మరియమ్మ ఉద్వేగపూరిత స్వరంతో వ్యాఖ్యానించారు. ఆయేషా మీరా హత్య కేసులో సత్యంబాబు ఎనిమిదేళ్లుగా జైలు జీవితం అనుభవిస్తున్నాడు. శుక్రవారం హైకోర్టు వెలువరించిన తీర్పుతో సత్యంబాబు స్వగ్రామమైన కృష్ణా జిల్లా నందిగామ పట్టణ శివారు అనాసాగరంలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. మరియమ్మ మాట్లాడుతూ.. తన కుమారుడి విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుతో సామాన్యులకు సైతం న్యాయం జరుగుతుందని, ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుందన్న విషయం రుజువైందని అన్నారు. రోజూ తన కొడుకు రాక కోసం ఎదురుచూస్తున్నానని చెప్పారు. -
‘సత్యంబాబుకు సంబంధం లేదని ఆనాడే చెప్పాం’
-
‘సత్యంబాబుకు సంబంధం లేదని ఆనాడే చెప్పాం’
గుంటూరు : తమ కుమార్తె ఆయేషా మీరా హత్యకేసులో సత్యం బాబు ఎలాంటి సంబంధం లేదని తాము ఆనాడే చెప్పామని మృతురాలి తల్లిదండ్రులు అన్నారు. కాగా అప్పట్లో సంచలనం సృష్టించిన బీఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా కేసులో శిక్ష అనుభవిస్తున్న సత్యం బాబును హైకోర్టు ఇవాళ (శుక్రవారం) నిర్దోషిగా ప్రకటించింది విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయేషా తల్లిదండ్రులు శంషాద్ బేగం, ఇక్బాల్ బాషా మాట్లాడుతూ ....నిబద్ధత గల అధికారుల చేత ఆయేషా కేసును రీ ఓపెన్ చేయించి విచారణ చేపట్టాలన్నారు. ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని వారు డిమాండ్ చేశారు. సత్యంబాబు కుటుంబసభ్యులకు రూ.కోటి పరిహారం ఇవ్వాలని ఆయేషా తల్లిదండ్రులు సూచించారు. కేసు త్వరగా పరిష్కారం కావాలంటే కోనేరు రంగారావు కుటుంబసభ్యులు, కోనేరు పద్మ, ఐనంపూడి శివరామకృష్ణను విచారణ చేయాలన్నారు. కాగా 2007లో ఆయేషా విజయవాడ ఇబ్రహీంపట్నంలోని ఓ ప్రయివేట్ హాస్టల్లో దారుణ హత్యకు గురైంది. ఈ కేసులో సత్యంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే తన కుమారుడు నిరపరాధి అంటూ అతడి తల్లి హైకోర్టును ఆశ్రయించింది. మరోవైపు ఆయేషా మీరా తల్లిదండ్రులు కూడా తమకు న్యాయం చేయాలని, దోషులను శిక్షించాలంటూ పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే.