balaraj
-
రేవంత్ రెడ్డిని అనుమతించొద్దంటూ పిటిషన్
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో గురువారం జరగనున్న జనజాతర సభకు టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని రాకుండా చూడాలని విద్యార్థి జేఏసీ చైర్మన్ బాలరాజ్ మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించాడు. రేవంత్ రెడ్డి వస్తే శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉన్నందున.. ఆయన్ను అడ్డుకునేలా పోలీసులకు ఆదేశాలు జారీ చేయాలని హెచ్ఆర్సీకి బాలరాజ్ పిటిషన్ సమర్పించాడు. సభకు రేవంత్‌ను అనుమతించొద్దని బాలరాజ్ కోరాడు. -
అందమైన మాయ
సతీష్, శీను, కిరణ్, బాలరాజ్ తదితరులు ముఖ్య తారలుగా మణీంద్రన్ దర్శకత్వ పర్యవేక్షణలో నాగరాజు కొట్టె నిర్మించిన చిత్రం ‘అందమైన మాయ’. ఇటీవలే టాకీపార్ట్ పూర్తయ్యింది. ఇందులో ఓ ప్రముఖ హీరోయిన్ ప్రత్యేక పాత్ర చేశారని, పోలూర్ ఘటికాచలం ఇచ్చిన డైలాగ్స్ హైలైట్‌గా నిలుస్తాయని నిర్మాతలు చెప్పారు. ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లే సినిమా ఇదని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: సత్య సోమేష్, కథ-దర్శకత్వం: దినకరన్. -
నెట్‌బాల్ కెప్టెన్లు బాలరాజ్, శిరీష
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: జాతీయ సీనియర్ నెట్‌బాల్ టోర్నమెంట్లో పాల్గొనే రాష్ట్ర పురుషుల జట్టుకు బాలరాజ్ (హైదరాబాద్) సారథ్యం వహిస్తాడు. పురుషుల జట్టుకు శిరీషా రాణి (రంగారెడ్డి) కెప్టెన్‌గా వ్యవహరించనుంది. ఈ పోటీలు మార్చి 1 (శనివారం) నుంచి 4 వరకు పాట్నాలో జరుగుతాయి. ఈ టోర్నీలో పాల్గొనే రాష్ట్ర జట్ల జాబితాను రాష్ట్ర నెట్‌బాల్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి సమ్మయ్య ప్రకటించారు. రాష్ట్ర పురుషుల జట్టు: బాలరాజ్ (కెప్టెన్), అక్తర్ పాషా (హైదరాబాద్), సాయికృష్ణ, శ్రవ ణ్ కుమార్ (కృష్ణా జిల్లా), ఓంప్రకాష్ (మెదక్), విహారి, అఖిల్ (ఖమ్మం), అనిల్ (వరంగల్), సందీప్(కరీంనగర్), మహేశ్వర్ (నిజామాబాద్), సాయి కుమార్ (రంగారెడ్డి). రాష్ట్ర మహిళల జట్టు: శిరీషా రాణి(కెప్టెన్), వేదవతి (రంగారెడ్డి), వరలక్ష్మి (పశ్చిమ గోదావరి), డి.పావని (హైదరాబాద్), ఆర్తి (ప్రకాశం), శివాని, హర్షిణి, అదితి, వాణి, దేవి వర్జిత (ఖమ్మం), రేష్మ (మెదక్), సంయుక్త (కృష్ణా), కోచ్ కమ్ మేనేజర్ విఘ్నేశ్. -
మద్యం అమ్మకాలు పెంచాలి
కరీంనగర్ క్రైం, న్యూస్‌లైన్ : కరీంనగర్, వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్ ఐదు జిల్లాల పరిధిలో మద్యం అమ్మకాలు పెంచాలని ఎక్సైజ్ కమిషనర్ అహ్మద్ నదీం అధికారులకు సూచించారు. నగరంలోని జడ్పీ సమావేశ మందిరంలో బుధవారం జరిగిన ఐదు జిల్లాల ఎక్సైజ్ అధికారుల సమీక్ష సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అధికారులు నకిలీ మద్యం అరికట్టడంతోపాటు అమ్మకాలు పెంచాలని, లెసైన్స్‌దారులకు అవసరమైన సేవలందించాలని సూచించా రు. ఐదు జిల్లాల అధికారులు, సిబ్బంది ఇచ్చిన ఒక రోజు మూల వేతనం రూ.లక్ష 7 వేల చెక్కును మృతి చెందిన ఎక్సైజ్ కానిస్టేబుల్ బాలరాజ్ కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఐదు జిల్లా ల సిబ్బందిని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్, వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన ఎక్సైజ్ డిప్యూటీ కమిష నర్లు, అసిస్టెంట్ కమిషనర్లు, సూపరింటెం డెంట్లు, అసిస్టెంట్ సూపరింటెండెంట్లు, ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.