bandari layout
-
అక్రమాల ‘భండారం’!
సాక్షి, సిటీబ్యూరో: నిజాంపేటలోని సర్వే నంబర్ 52, 53, 54లో ఓ రియల్ ఎస్టేట్ సంస్థ 20కి పైగా విల్లాల నిర్మాణం చేపట్టింది. దాదాపు ఇవి పూర్తికావచ్చాయి. వీటికి హెచ్ఎండీఏ నుంచి బిల్డింగ్ పర్మిషన్ లేకుండానే అక్రమంగా సెల్లార్‌ను కూడా నిర్మించేశారు. గతేడాది డిసెంబర్లో ఈ అక్రమ నిర్మాణం విషయం హెచ్ఎండీఏ దృష్టికి రావడంతో పాక్షికంగా కూల్చివేసింది. ఆ తర్వాత కొంతకాలం పాటు ఈ నిర్మాణం ఆపేసి మళ్లీ మొదలెట్టారు. దీంతో హెచ్ఎండీఏ అధికారులు గత జూన్ 30వ తేదీన ఇది అక్రమ నిర్మాణమంటూ మరోసారి నోటీసు జారీ చేశారు. ఈ ఒక్కటే కాదు...ఇటువంటి అక్రమ భవన నిర్మాణాలు నిజాంపేట గ్రామ పంచాయతీ పరిధిలో కొకొల్లుగా పుట్టుకొస్తున్నాయి. అనుమతుల్లేవు...అడ్డగోలుగా అంతస్తుల మీద అంతస్తులు కట్టేశారు...కట్టిస్తూనే ఉన్నారు. వారికి గ్రామ పంచాయతీ నోటీసులు పట్టవు...హెచ్ఎండీఏ నోటీసులను కూడా బేఖాతరు చేస్తారు. రాజకీయ నేతల అండదండలు ఉండటంతో ఏకంగా నిబంధనలకే పాతరేస్తున్నారు. గతేడాది నవంబర్‌లో కురిసిన భారీ వర్షాలకు ముంపునకు గురైన నింజాంపేట భండారి లే అవుట్లో అక్రమ నిర్మాణాలను పాక్షికంగా కూల్చివేసినా అవి ఇప్పుడు పూర్తిస్థాయిలో నిర్మాణాన్ని సంతరించుకున్నాయి. హెచ్ఎండీఏ కమిషనర్ ఆ భవనాలను పూర్తిగా నేలమట్టం చేయాలని ఆదేశాలిచ్చినా అమలుకాలేదు. అక్రమ భవన నిర్మాణాలు యథావిధిగా కొనసాగుతున్నాయి. అన్నిచోట్లా నిబంధనలకు పాతరే.. గతేడాది నవంబర్‌లో వరద ముంపునకు గురైన నిజాంపేటలోని భండారి లే అవుట్లో 12 మీటర్లకు మించి (జీప్లస్ 2 కంటే ఎక్కువ) భవనాన్ని నిర్మించాలంటే ఖచ్చితంగా హెచ్ఎండీఏ నుంచి అనుమతి తీసుకోవాలి. అనుమతి ఇచ్చే అధికారం గ్రామ పంచాయతీకి లేదు. అయితే అందుకు విరుద్ధంగా ఏకంగా ఆయకట్టు భూమిలో బహుళ అంతస్తుల భవనాలను నిర్మిస్తున్నారు. అయినా అధికారులెవరూ ఇటువైపు కన్నెత్తి చూడడం లేదు. ఈ వ్యవహారం నిజాంపేట బండారి లే అవుట్లో నిత్యకృత్యంగా మారింది. అయితే నిర్మాణ సమయంలో నిబంధనలనైనా పాటించారా అంటే అదీ లేదు. ఎక్కడా సెట్‌బ్యాక్‌ను పట్టించుకోవడం లేదు. 30 అడుగుల అప్రోచ్ రోడ్ల జాడే కనపడదు. కొందరు గ్రామ పంచాయతీ నుంచి జీ ప్లస్ అనుమతులు తీసుకొని...ఏకంగా ఐదు, ఆరు, ఏడు అంతస్తుల్ని నిర్మించేశారు. ఇదంతా పక్కన పెడితే...తురక చెరువు ఆయకట్టు భూముల్లోనే వెలిసిన ఈ లే అవుట్‌కు ఎగువన ఉండే బాచుపల్లి తదితర ప్రాంతాల నుంచి వరద నీరు చేరుతుంది. అది నిండగానే అక్కడి నుంచి కాలువ ద్వారా పాపయ్య కుంటకు వస్తుంది. బిల్డర్లు కాసుల కక్కుర్తితో నీటిని చేరవేసే ఆ కాలువనే పూడ్చి రోడ్లను నిర్మించారనే విషయం గతేడాది సెప్టెంబర్‌లో కురిసిన వర్షాల పుణ్యామా అని వెలుగుచూసింది. దీంతో గతేడాది డిసెంబర్లో హెచ్ఎండీఏ మొదలు పంచాయతీ, రెవెన్యూ ప్రత్యేక డ్రైవ్‌కు శ్రీకారం చుట్టి అనుమతుల్లేని భవనాలను గుర్తించి నోటీసులు జారీ చేశారు. దాదాపు 50 వరకు అక్రమ భవన నిర్మాణాలను పాక్షికంగా కూల్చేశారు. అయితే ఇప్పుడు ఆ నిర్మాణాలన్నీ పూర్తయ్యాయి. ఒక్క భవన నిర్మాణమూ ఆగిపోలేదు. వర్షం పడితే ముంపు తప్పదా...? నిజాంపేట భండారీ లే అవుట్లో వెలుస్తున్న అక్రమ నిర్మాణాల వల్ల మరోసారి ముంపు తప్పదా అన్న భయం స్థానికుల్లో వ్యక్తమవుతోంది. గతేడాది గుర్తించి పాక్షికంగానే కూల్చివేసిన భవనాలను మళ్లీ పూర్తిస్థాయిలో నిర్మిస్తుండడంతో వరద ముంపును ఎదుర్కోవాల్సి వస్తుందని అంటున్నారు. అక్రమ నిర్మాణాలు పుట్టుకొస్తున్నా అధికారులు చూసీచూడనట్టు వ్యవహరించడం, పీకలమీదకు వచ్చాక నోటీసులు జారీ చేసి పాక్షికంగా కూల్చడం పరిపాటిగా మారిందని, పూర్తిస్థాయిలో చర్యలు తీసుకుంటేనే ఇక్కడ ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని స్థానికులు అభ్యర్థిస్తున్నారు. ఈ విషయంలో జాప్యం జరగకుండా వెంటనే రంగంలోకి దిగాలని కోరుతున్నారు. గతంలో పాక్షికంగా కూల్చివేసిన ఓ భవనం... -
నిద్రలేస్తే యమ స్ట్రిక్ట్
-
భండారి లేఅవుట్లో అక్రమ కట్టడాల కూల్చివేత
హైదరాబాద్: నగరంలో అక్రమ కట్టడాల కూల్చివేత పనులను అధికారులు తిరిగి ప్రారంభించారు. కూకట్పల్లి పరిధిలోని నిజాంపేట-భండారీ లేఅవుట్లో అక్రమ కట్టడాలను మంగళవారం కూల్చి వేశారు. మొత్తం 8 అపార్టుమెంట్లను కూల్చివేస్తున్నట్లు హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. భవన యజమానులు అధికారులతో వాగ్వాదానికి దిగడంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసుల సహకారంతో అక్రమ కట్టడాలను అధికారులు తొలగిస్తున్నారు. ఈ కూల్చివేతల పనుల్లో హెచ్ఎండీఎ అధికారులతో పాటు నిజాంపేట గ్రామ పంచాయితీ సిబ్బంది పాల్గొన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కాలనీ మునిగిపోయి నీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డ విషయం తెలిసిందే. -
ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న రాజధాని
- బండారీ లే అవుట్, ధరణీనగర్లలో వరద తగ్గుముఖం హైదరాబాద్: వారం రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలతో అతలాకుతలమైన రాజధానిలో సోమవారం వర్షం తెరిపినీయడంతో క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. వర్షాలకు భారీగా దెబ్బతిన్న రహదారులకు జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ విభాగం అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. నిజాంపేట్‌లోని బండారీ లే అవుట్, ధరణీనగర్లలో వరద తగ్గుముఖం పట్టింది. ఇంకా బండారీ లే అవుట్‌లోని 15 అపార్ట్మెంట్ల సెల్లార్లలో వరదనీరు నిలిచి ఉంది. పరిస్థితి అదుపులోనే ఉండడంతో సైన్యం, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను వెనక్కి రప్పించారు. వరద బాధితులకు జీహెచ్ఎంసీ, స్థానిక పంచాయతీ అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఆహారం, మంచినీరు అందజేస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖ శిబిరాలు ఏర్పాటుచేసి అవసరమైన మందులను అందజేస్తోంది. వరద ముంపులో చిక్కుకున్న బేగంపేట్ నాలా పరీవాహక ప్రాంత ప్రజలు సోమవారం తేరుకున్నారు. రహదారులతో పాటు ఇళ్లలోకి చేరిన వరద నీరు కూడా తొలగిపోవడంతో బురదను తొలగించే పనిలో స్థానికులు నిమగ్నమయ్యారు. బేగంపేట్ అల్లంతోటబావి, మయూరిమార్గ్, ప్రకాశ్‌నగర్ ఎక్స్టెన్షన్, బ్రాహ్మన్వాడీ, వడ్డెరబస్తీల్లో రోడ్లపై బురద మాత్రం అలాగే ఉంది. ముంపునకు గురైన బేగంపేట్‌లోని దేవనార్ అంధుల పాఠశాల విద్యార్థులకు దసరా సెలవులను ముందుగానే ప్రకటించి ఇళ్లకు పంపించినట్లు యాజమాన్యం తెలిపింది. కాగా రాగల 24 గంటల్లో నగరంలో భారీ వర్షం కురిసే అవకాశాలున్నట్లు బేగంపేట్‌లోని వాతావరణ శాఖ తెలిపింది. సోమవారం ఉదయం వరకు వర్షపాతం ఇలా... కాగా సోమవారం ఉదయం 8.30 గంటల వరకు నగరంలో పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. ఉప్పల్‌లో 1.6 సెం.మీ, కుత్బుల్లాపూర్‌లో 1.4, బహదూర్‌పురాలో 1.2, సరూర్‌నగర్‌లో 1.5, బాలానగర్‌లో ఒక సెంటీమీటరు చొప్పున వర్షపాతం నమోదైంది. -
బండారి లే అవుట్ నుంచి సాక్షి గ్రౌండ్ రిపోర్ట్
-
నిజాంపేట్‌లో అన్నదాన కార్యక్రమం
-
తెలంగాణలో మరో ఐదురోజులు భారీ వర్షాలు
హైదరాబాద్ : తెలంగాణలో మరో అయిదు రోజులు భారీ వర్షాలు కురియనున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది. దీని ప్రభావంతో నగరంతో పాటు తెలంగాణవ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. కాగా ఇప్పటికే కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రం తడిసి ముద్దయింది. నగరంలో ఇంకా పలు ప్రాంతాలు వరద నీటిలోనే ఉన్నాయి. మరోసారి భారీ వర్ష సూచనతో ప్రజలు ఆందోళనకు గురి అవుతున్నారు. రెండో రోజు కూడా వారికి నిద్ర కరువు నిజాంపేటలోని తుర్క చెరువు ఉగ్రరూపం దాల్చడంతో చెరువు కింద ఉన్న బండారి లేఅవుట్ కాలనీలో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. భయంతో నిద్రలేకుండా రెండో రోజు కూడా సహాయం కోసం వేచిచూస్తున్నారు. తుర్క చెరువు చిన్న తూము తెరవడంతో కాలనీలోకి నీరు చేరడంతో పాటు కాలనీలో నుంచి నీరు బయటికి వెళ్ళే పరిస్థితి లేకపోవడంతో నీరు కాలనీలోనే సెల్లార్ల నిండా ఉంది. జిల్లా అగ్నిమాపక శాఖ అధికారులు సెల్లార్లలో నీరు మోటార్లద్వారా బయటికి పంపించేందుకు తీవ్ర యత్నం చేస్తున్నప్పటికీ తూము నీరు ప్రవాహం తగ్గకపోవడంతో నీరు తగ్గడంలేదు. దీంతో ఇళ్ళల్లో ఉన్న వృద్దులు, పిల్లలు బయటికి రాలేని పరిస్థితి దాపురించింది. రెండు రోజులుగా విద్యుత్ సరఫరా లేదు. మంచినీటిసరఫరా లేదు. పాలు, ఆహార పదార్ధాల కోసం రోడ్లపై ఉన్న నీటిలోనుంచి బయటికి వెళ్ళాల్సి వస్తుంది. ఇదిలా ఉండగా ప్రజలు తమ బాధను వచ్చిన ప్రతి ప్రజాప్రతినిధికి, అధికారికి విన్నవించిన సమస్యకు పరిష్కారం దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు నిజాంపేట బండారి లేఅవుట్లో నీట మునిగిన అపార్ట్మెంట్లను మంత్రి కేటీఆర్ ఇవాళ పరిశీలించారు. ఈ సందర్భంగా తమ కాలనీకి శాశ్వత పరిష్కారం చూపించాలని మంత్రికి మహిళలు పెద్దపెట్టున మొరపెట్టుకున్నారు. కొంతమంది కాలనీ వాసులు లే అవుట్‌కు విరుద్దంగా నిర్మాణాలు వెలిశాయని కూడా ఫిర్యాదు చేశారు. దాదాపు మూడు గంటల పాటు మంత్రి వెంట మహిళలు తమ బాధలను వివరించారు. ఇలాంటి ప్రకృతి వైఫరీత్యాలు ఏర్పడినపుడు ప్రభుత్వం చేసే సహాయ కార్యక్రమాలకు ప్రజలు సహకరించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.