B.Dattatreya
-
'మంత్రి పదవికి ఎవరు అడ్డుపడ్డారనేది..మాట్లాడను'
న్యూఢిల్లీ: హైదరాబాద్ లో శాంతి భద్రతల అంశంలో గవర్నర్కు అధికారాలివ్వడం అనుమానాలు కలిగించే విధంగా ఉన్నాయని సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ అన్నారు. గవర్నర్ అధికారాలపై నెలకొన్న అనుమానాలు నివృత్తి చేయాలని హోంమంత్రిని కోరానని ఆయన తెలిపారు. యూపీఏ నిర్ణయాల వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని దత్తాత్రేయ విమర్శించారు. గవర్నర్కు అధికారాలివ్వడంపై తొలుత బీజేపీనే ప్రశ్నించిందనే విషయాన్ని దత్తాత్రేయ గుర్తు చేశారు. అయితే తెలంగాణ బిల్లును అడ్డుకోవద్దని టీఆర్ఎస్ వాళ్లే మమ్మల్ని కోరడం వల్లనే తాము పూర్తి స్థాయిలో వ్యతిరేకించలేదని ఆయన అన్నారు. నాకు మంత్రి పదవి రాకపోవడానికి కారణం...ఎవరనేదానిపై మాట్లాడదలచుకోలేదని దత్తాత్రేయ ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. తెలంగాణలో సమగ్ర సర్వే నిర్వహించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. బీసీల జనాభా ఎంత ఉందో సర్వేలో తేలుతుందని దత్తాత్రేయ మరో ప్రశ్నకు సమాధానమిచ్చారు. -
చంద్రబాబు అసలు రంగు బయటపడింది
-
చంద్రబాబు అసలు రంగు బయటపడింది: దత్తాత్రేయ
హైదరాబాద్: విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రద్దు చేయడం అప్రజాస్వామికమని సికింద్రాబాద్ ఎంపీ దత్తాత్రేయ అన్నారు. రెండు ప్రాంతాలు రెండుకళ్లన్న అనే చంద్రబాబునాయుడు అసలు రంగు బయటపడిందని దత్తాత్రేయ వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రాంతానికి అన్యాయం చేసి.. ఆంధ్ర ప్రదేశ్ కే న్యాయం చేస్తారనుకోలేదని దత్తాత్రేయ విమర్శించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేవ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని దత్తాత్రేయ అన్నారు. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న పీపీఏ వివాదానికి కేంద్ర ప్రభుత్వం సానుకూల పరిష్కారం అందిస్తుందనే ఆశాభావాన్ని దత్తాత్రేయ వ్యక్తం చేశారు. -
అయ్యో పాపం దత్తన్న..
తెలంగాణ ప్రాంతంలో బీజేపీలో సీనియర్ నాయకుడిగా ఉన్న బండారు దత్తాత్రేయకు ప్రధాని నరేంద్రమోడీ షాకిచ్చారు. గతంలో కేంద్రమంత్రిగా పనిచేసిన అనుభవంతో మంత్రి పదవి గ్యారంటి అనే గంపెడాశతో ఢిల్లీ ఫ్లైయిట్ ఎక్కిన దత్తనకు నిరాశే మిగిలింది. తనకు కేంద్రమంత్రి పదవి దక్కపోవడంపై బీజేపీ సీనియర్ నేతల దృష్టికి తీసుకెళ్లిన ప్రయోజనం లేకపోయినట్టు తెలుస్తోంది. సికింద్రాబాద్ లోకసభ నుంచి భారీ మెజార్టీతో ఎంపికైన దత్తాత్రేయ మంత్రి పదవి దక్కుతుందని లష్కర్ నేతలు కూడా ఎదురు చూశారు. సికింద్రాబాద్ లోకసభ టికెట్ ను దత్తన్నకు కేటాయింపు వ్యవహారంపై కూడా పెద్ద రచ్చ జరిగింది. సికింద్రాబాద్ లోకసభ నుంచి పోటీ చేయాలని బీజేపీ తెలంగాణ ప్రాంత అధ్యక్షుడు కిషన్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నం చేశారు. అయితే దత్తన్న తన పలుకుబడితో టికెట్ దక్కించకున్నా.. మంత్రి పదవిని చేజిక్కించుకోలేకపోయారనే వాదన రాజకీయ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. అయితే లోకసభ మొదటి సమావేశాల తర్వాత జరగబోయే విస్తరణలో మంత్రి పదవి దక్కుంతుందని దేశ రాజధానిలో సీనియర్ బీజేపీ నేతలు భరోసా ఇచ్చారట. ఏది ఏమైనా శాఖ కేటాయించకుండా షాక్ ఇవ్వడంపై దత్తన్న వర్గం గుస్సాగా ఉందంట. -
వైఎస్ జగన్ మద్దతును స్వాగతించిన దత్తాత్రేయ
న్యూఢిల్లీ: నరేంద్రమోడీ నేతృత్వంలోని ఎన్ డీఏకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మద్దతు ప్రకటించడాన్ని బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ స్వాగతించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలని వైఎస్ జగన్ కోరారని దత్తాత్రేయ వెల్లడించారు. ఎన్డీయే ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉందని దత్తాత్రేయ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్దికి సహకరించాలని బీజేపీ పార్లమెంటరీ నేత నరేంద్రమోడీని వైఎస్ జగన్ కలిసిన సంగతి తెలిసిందే. అంశాల వారీగా ఎన్ డీఏకు వైఎస్ఆర్ కాంగ్రెస్ మద్దతు ఉంటుందని వైఎస్ జగన్ సోమవారం దేశ రాజధానిలో స్పష్టం చేశారు.