వైఎస్ జగన్ మద్దతును స్వాగతించిన దత్తాత్రేయ
న్యూఢిల్లీ: నరేంద్రమోడీ నేతృత్వంలోని ఎన్ డీఏకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మద్దతు ప్రకటించడాన్ని బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ స్వాగతించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలని వైఎస్ జగన్ కోరారని దత్తాత్రేయ వెల్లడించారు. ఎన్డీయే ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉందని దత్తాత్రేయ స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్దికి సహకరించాలని బీజేపీ పార్లమెంటరీ నేత నరేంద్రమోడీని వైఎస్ జగన్ కలిసిన సంగతి తెలిసిందే. అంశాల వారీగా ఎన్ డీఏకు వైఎస్ఆర్ కాంగ్రెస్ మద్దతు ఉంటుందని వైఎస్ జగన్ సోమవారం దేశ రాజధానిలో స్పష్టం చేశారు.