beach sand mining
-
బీచ్‌శాండ్ మైనింగ్‌లో అక్రమాలకు అడ్డుకట్ట
సాక్షి, న్యూఢిల్లీ: అరుదైన ఖనిజాలు, మూలకాలు లభించే బీచ్‌శాండ్ మైనింగ్‌లో అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. బీచ్‌శాండ్ మైనింగ్‌లో ప్రైవేటు సంస్థలు పాల్గొనేలా అనుమతిస్తున్న కేంద్రం.. అందులో అక్రమాలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటోందని గురువారం రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. దీనికి జితేంద్ర సింగ్ స్పందిస్తూ.. గత ఏడెనిమిదేళ్లలో జరిగిన పరిణామాలను పరిశీలిస్తే బీచ్‌శాండ్ మైనింగ్‌లో అక్రమాలు జరగకుండా తీసుకుంటున్న చర్యల్లో పురోగతి కనిపిస్తుందన్నారు. అరుదైన ఖనిజ నిక్షేపాల మైనింగ్‌లో స్మగ్లింగ్‌ను నిరోధించేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల సహకారాన్ని కోరుతున్నామని తెలిపారు. రిమోట్ ఓటింగ్‌పై పార్టీల నుంచి అభిప్రాయ సేకరణ రిమోట్ ఓటింగ్‌పై ఎన్నికల సంఘం (ఈసీ) వివిధ రాజకీయ పార్టీల అభిప్రాయాలను స్వీకరిస్తోందని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజుజు వెల్లడించారు. ఫిబ్రవరి 28లోపు తమ అభిప్రాయాలను పంపాలని ఆయా పార్టీలకు సూచించామన్నారు. ఓటింగ్ ప్రక్రియలో వలస కార్మికుల భాగస్వామ్యం పెంచేందుకు ఈసీ గతేడాది డిసెంబర్ 28న ఒక నోట్‌ను అన్ని రాజకీయ పార్టీలకు పంపిందన్నారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ‘‘వలస ఓటరును ఏ విధంగా నిర్వచించాలి, వారిని ఏ ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించాలి, రిమోట్ ఓటింగ్ విధానం, వారి ఓట్ల లెక్కింపు, వారికి ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఏ విధంగా వర్తింప చేయాలి? వంటి అంశాలపై అభిప్రాయాలు తెలియజేయాల్సిందిగా వివిధ రాజకీయ పార్టీలను కోరాం’’ అని తెలిపారు. ఏపీ హైకోర్టులో 2,41,465 కేసులు పెండింగ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 2,41,465 కేసులు, తెలంగాణ హైకోర్టులో 2,53,358 పెండింగ్‌లో ఉన్నట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. అంతేకాకుండా ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్న క్రిమినల్ కేసులను విచారించేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా మొత్తం 9 రాష్ట్రాల్లో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఉన్నాయని వెల్లడించారు. సుప్రీంకోర్టు గణాంకాల ప్రకారం ఫిబ్రవరి నాటికి సుప్రీంకోర్టులో 69,511 కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. అదే సమయంలో దేశంలో అన్ని హైకోర్టుల్లో మొత్తం 59,87,477 కేసులు పెండింగ్ ఉన్నాయని చెప్పారు. ఈ మేరకు టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి బదులిచ్చారు. -
బీచ్ శాండ్ మైనింగ్‌లో అక్రమాలను ఎలా నిరోధిస్తారు?
సాక్షి, న్యూఢిల్లీ: అరుదైన ఖనిజాలు, మూలకాలు లభించే బీచ్ శాండ్ మైనింగ్‌లో ప్రైవేట్ సంస్థలు పాల్గొనేలా అనుమతిస్తున్న కేంద్ర ప్రభుత్వం అందులో అక్రమాలు జరగకుండా నిరోధించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటోంది అని గురువారం రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో వైఎస్సార్సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి అనుబంధ ప్రశ్న వేశారు. దీనికి పీఎంవో సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ జవాబిస్తూ సభ్యుడు లేవనెత్తిన ప్రశ్న సరైనదేనని అన్నారు. గడచిన ఏడెనిమిదేళ్ళలో జరిగిన పరిణామాలను పరిశీలిస్తే బీచ్ శాండ్ మైనింగ్‌లో అక్రమాలు జరగకుండా నిరోధించేందుకు తీసుకుంటున్న చర్యలలో ఎలాంటి మెరుగుదల కనిపిస్తోందో స్పష్టమవుతుందని అన్నారు. గ్రానైట్ తవ్వకాల కోసం లైసెన్స్‌లు పొందిన ప్రైవేట్ సంస్థలు అణు రియాక్టర్లలో వినియోగించే థోరియం తయారీకి అవసరమైన మొనజైట్ వంటి నిక్షేపాలను భారీగా స్మగ్లింగ్ చేశారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అరుదైన ఖనిజాలు, మూలకాల స్మగ్లింగ్‌ను నిరోధించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవడం జరిగిందని మంత్రి చెప్పారు. మైనింగ్ చేస్తున్న ఖనిజ నిక్షేపాలలో వాటి వివిధ ఆకృతులను నిర్ధారించేందుకు శాటిలైట్ ఇమేజింగ్‌ను విస్తృతంగా వినియోగిస్తున్నట్లు తెలిపారు. అరుదైన ఖనిజ నిక్షేపాల మైనింగ్‌లో పాల్గొంటున్నది ప్రైవేట్ సంస్థా లేక ప్రభుత్వ రంగ సంస్థా అన్న దానితో నిమిత్తం లేకుండా స్మగ్లింగ్‌ను నిరోధించేందుకు చేపడుతున్న చర్యలలో తోడ్పడవలసిందిగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాల సహకారాన్ని పదేపదే కోరుతున్నామని అన్నారు. -
బీచ్ శాండ్ మైనింగ్ ఎక్కడాలేదు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో బీచ్ శాండ్ మైనింగ్ ద్వారా మొనాజైట్ ఖనిజాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నట్లు తాజాగా వచ్చిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని మైనింగ్ డైరెక్టర్ వి.జి. వెంకటరెడ్డి తెలిపారు. రాష్ట్రంలో 2019 నుంచి ఎక్కడా బీచ్ శాండ్ మైనింగ్ జరగడంలేదని స్పష్టంచేశారు. అసలు మైనింగ్ ఆపరేషన్స్ జరగనప్పుడు మొనాజైట్ ఖనిజాన్ని అక్రమంగా రవాణా చేయడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ఈ మేరకు గురువారం ఆయనొక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో 2019కి ముందు రెండు ప్రైవేటు సంస్థలు బీచ్ శాండ్ మైనింగ్ కార్యక్రమాలు నిర్వహించాయని.. 2019లో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రంలో హెవీ మినరల్ బీచ్ శాండ్ మైనింగ్ పూర్తిగా నిలిపివేశామన్నారు. ఇటీవల బీచ్ శాండ్ మైనింగ్‌లో అక్రమాలంటూ వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ (ఐబీఎం) ద్వారా విచారణ జరిపించాలని కేంద్ర గనుల శాఖను అణు ఇంధన శాఖ కోరిందని తెలిపారు. ఐబీఎం విచారణలో ఆ సంస్థలు మైనింగ్ నిర్వహించిన కాలంలో ఏవైనా అక్రమాలకు పాల్పడి ఉంటే అందుకు సంబంధించిన వాస్తవాలు వెలుగుచూస్తాయన్నారు. అక్రమాలు వాస్తవమని నిర్ధారణ జరిగితే బాధ్యులపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఆ రెండింటి అనుమతుల ప్రక్రియ పూర్తికాలేదు ఇక బీచ్ శాండ్ మైనింగ్ కోసం గత ఏడాది కేంద్ర అణుశక్తి సంస్థ (డీఏఈ)కు ఏపీఎండీసీ 16 ప్రతిపాదనలను సమర్పించిందని వెంకటరెడ్డి తెలిపారు. దానిలో విశాఖ జిల్లా భీమునిపట్నం పరిధిలో 90.15 హెక్టార్లు, కృష్ణాజిల్లా మచిలీపట్నం తీరప్రాంతంలో 1,978.471 హెక్టార్లలో రెండు బీచ్ శాండ్ డిపాజిట్లకు ఏపీఎండీసీని ప్రాస్పెక్టివ్ లెస్సీగా డీఏఈ నియమించిందని తెలిపారు. ఇక్కడ మైనింగ్ జరిపేందుకు అనుమతుల కోసం ఏపీఎండీసీ దరఖాస్తు చేసుకుందన్నారు. అయితే, ఆ అనుమతుల ప్రక్రియ ఇంకా పూర్తికాకపోవడంవల్ల కేంద్రం ప్రతిపాదించిన ఈ రెండు బ్లాక్‌లలో ఇప్పటివరకు ఎటువంటి మైనింగ్ ప్రారంభం కాలేదని ఆయన స్పష్టంచేశారు. హెవీ మినరల్ బీచ్ శాండ్‌లో మొనాజైట్ అవశేషాలు జీరో శాతం మాత్రమే ఉండాలని, అంతకుమించి ఉన్నట్లు నిర్ధారణ అయితే సదరు మైనింగ్ లీజులను రద్దుచేయాలంటూ కేంద్రం 2019 మార్చి ఒకటిన మెమో ద్వారా రాష్ట్రానికి ఆదేశాలు ఇచ్చిందన్నారు. దాని ప్రకారం మన రాష్ట్రంలోని బీచ్ శాండ్‌లో మొనాజైట్ శాతం కేంద్రం నిర్దేశించిన దానికన్నా ఎక్కువగా ఉన్నందున అన్ని బీచ్ శాండ్ లీజులను గనుల శాఖ రద్దుచేసిందని వెంకటరెడ్డి ఆ ప్రకటనలో వివరించారు. కేంద్రానికి ఏపీ సమగ్ర వివరణ ఇక బీచ్ శాండ్ మైనింగ్‌పై కేంద్ర ప్రభుత్వం తాజాగా వ్యక్తంచేసిన సందేహాల నేపథ్యంలో ఈ ఏడాది ఏప్రిల్ 12న కేంద్ర అణు ఇంధన శాఖ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం గనుల శాఖ ద్వారా సమగ్ర వివరణ ఇచ్చిందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో బీచ్ శాండ్ మైనింగ్ జరుగుతోందని, దాని ద్వారా పర్యావరణానికి నష్టం, మైనింగ్ చట్టాలకు విఘాతం, మొనాజైట్ అక్రమ రవాణా జరిగిందంటూ వచ్చిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని కేంద్రానికి సమర్పించిన నివేదికలోనే స్పష్టంచేసిందని వెంకటరెడ్డి పేర్కొన్నారు. -
ట్రైమాక్స్ అక్రమమైనింగ్ కేసు విచారణ వాయిదా
ఢిల్లీ: ట్రైమాక్స్ సంస్థ అక్రమ మైనింగ్ పై సుప్రీంకోర్టులో గురువారం విచారణ జరిగింది. తమ తరఫు న్యాయవాది అందుబాటులో లేకపోవడంతో విచారణకు కేంద్ర ప్రభుత్వం వాయిదా కోరింది. విచారణను సుప్రీం కోర్టు పది రోజులకు వాయిదా వేసింది. శ్రీకాకుళం జిల్లా గార మండలం బీచ్ శాండ్ మైనింగ్‌పై తాము తనిఖీ చేశామని అణు ఇంధన పరిశోధన సంస్థ తెలిపింది. త్వరలోనే విచారణ నివేదికను అందజేస్తామని కోర్టుకు తెలిపింది. కోనేరు ప్రసాద్‌కు సంబంధించిన ట్రైమాక్స్ సంస్థ తవ్వకాలలో అవకతవకలు జరిగాయంటూ మాజీ కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి ఈఏఎస్ శర్మ పిటిషన్ దాఖలు చేశారు. ట్రైమాక్స్ తవ్వకాలలో విలువైన అణుఇంధన ఖనిజం యురేనియాన్ని అక్రమంగా తవ్వుకుని ప్రభుత్వానికి తెలియకుండా అమ్ముకున్నారని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ట్రైమాక్స్‌కు రాష్ట్ర గనుల శాఖ ఇచ్చిన షోకాజ్ నోటీసులపై నిర్ణయానికి ఏపీ ప్రభుత్వ న్యాయవాది గుంటూరు ప్రభాకర్ నాలుగువారాల సమయం కోరారు. విజిలెన్స్ నివేదిక ప్రకారం అక్రమ మైనింగ్ జరుగుతుందని తేలిన తరువాత కూడా లైసెన్స్ రద్దు చేయకుండా కేవలం సస్పెండ్ చేశారని ఈఏఎస్ శర్మ తరపు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కోర్టుకు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోబోతుంది కాబట్టి కేసు విచారణ ముగించాలని, ఇప్పటికే ఖనిజ తవ్వకాలు నిలిపివేశామని కోర్టుకు ట్రైమాక్స్ తరపు న్యాయవాది తెలిపారు. కేసు వాదనను కొనసాగించాల్సిన అవసరం లేదన్న ట్రైమాక్స్ తరపు న్యాయవాది వాదనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. కేంద్రప్రభుత్వ తరపు న్యాయవాది వాయిదా కోరడంతో సుప్రీంకోర్టు విచారణ వాయిదా వేసింది. -
శ్రీకాకుళంలో 2జీ స్కాం కన్నా పెద్ద కుంభకోణం!
పసుపు రంగు చొక్కా కూడా వేసుకొచ్చా ముఖ్యమంత్రి సభలో లేకపోవడం దురదృష్టకరం 1300 కోట్ల ఎగుమతులు అక్రమంగా జరుగుతున్నాయి అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు హైదరాబాద్ శ్రీకాకుళం జిల్లాలో బీచ్‌శాండ్ పేరుతో జరుగుతున్న అతిపెద్ద కుంభకోణం గురించి బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు అసెంబ్లీలో తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రత్యేకంగా తాను 'పసుపు' రంగు చొక్కా వేసుకుని వచ్చానని ఆయన ప్రస్తావించారు. ఈ కుంభకోణం గురించి తెలుసుకుంటుంటే తనకు మైండ్ బ్లోయింగ్... బుర్ర తిరిగిపోయింది అని ఆయన చెప్పారు. ఇది 2జీ స్పెక్ట్రమ్ స్కాం కంటే కూడా చాలా పెద్దస్థాయిలో జరుగుతోందని అన్నారు. బడాబాబులకు ఇందులో ప్రమేయం ఉందని, రూ. 1300 కోట్ల ఖనిజ ఎగుమతులు అక్రమంగా జరుగుతున్నా ఇంతవరకు ప్రభుత్వం దృష్టికి రాకపోవడం దారుణమని చెప్పారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో ఈ అంశంపై ఆయన అధికార పక్షాన్ని దుమ్ము దులిపారు. ఎక్కడైనా ఒక ఇంటి నిర్మాణం కోసం ఇసుక తీసుకెళ్తుంటే మాత్రం లారీ ఆపి.. జరిమానాలు విధించే అధికారులు, వేరే రాష్ట్రానికి ఇంత పెద్ద మొత్తంలో ఖనిజం తరలిపోతుంటే రహదారి పర్మిట్లు సైతం ఇచ్చి పంపేస్తున్నారని విష్ణుకుమార్ రాజు మండిపడ్డారు. టైమెక్స్ మినరల్స్ అని చెప్పి ఈస్ట్ వెస్ట్ మినరల్స్‌కు అనుమతి ఇచ్చారని అన్నారు. దీనిమీద అడిగితే, ఇది ఎప్పుడో 2006 నుంచి జరుగుతోందన్నారని, ఇంత పెద్ద కంపెనీ, పెద్ద పెద్ద నేతలతో సంబంధమున్న వ్యక్తికి ఎలా ఆపుతామని చెప్పారని ఆయన అన్నారు. తర్వాత కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమావేశానికి వెళ్తే మొత్తం విషయాలు తెలిశాయని, వీళ్లు చేసిన దుర్మార్గపు పనులు అన్నీ ఇన్నీ కావని తెలిపారు. మొత్తం 93 కంపెనీల ద్వారా 40 దేశాలకు రూ. 1300 కోట్ల రూపాయల విలువైన ఖనిజాన్ని ఎగుమతి చేశారన్నారు. అసలు ఎన్ఓసీ లేని చోట కూడా విచ్చలవిడిగా బీచ్‌శాండ్ తవ్వేశారని ఆయన చెప్పారు. వేల కోట్ల రూపాయల ఖనిజం ఎగుమతి అవుతున్నా, ప్రభుత్వానికి వచ్చేది మాత్రం కేవలం ముష్టి 2 శాతం మాత్రమేనని, సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో రిజిస్టర్ చేసినా, అంతకంటే ఎక్కువ వస్తుందని ఆయన అన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకుని కేంద్రాన్ని కోరితే, వారి అనుమతితో ఇక్కడే దీన్ని ప్రాసెస్ చేసి ఉపయోగించుకోవచ్చని సూచించారు. విజిలెన్స్ డిపార్టుమెంటులో జరిగిన అక్రమాలు అన్నీఇన్నీ కావని చెప్పారు. దురదృష్టం కొద్దీ ఇంత ముఖ్యమైన అంశంపై చర్చ జరుగుతుంటే ముఖ్యమంత్రి సభలో లేరని, ఖనిజాల విషయంలో సంస్కరణలు తీసుకురాకపోతే చాలా కష్టం అవుతుందని ఆయన చెప్పారు. అయితే.. ఇదే అంశంపై మాట్లాడిన టీడీపీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు మాత్రం, ఈ పరిశ్రమ మీద ఆధారపడి అనేక మంది పేదలు ఉపాధి పొందుతున్నారని, అందువల్ల దీనిపై చర్యలు తీసుకునే ముందు ఈ అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు.