best performance
-
Davis Cup final 2023: డేవిస్ కప్ విజేత ఇటలీ
మలాగా (స్పెయిన్): డేవిస్ కప్‌లో ఇటలీ జట్టు అత్యుత్తమ ప్రదర్శనతో అదరగొట్టింది. టోర్నీ చరిత్రలో రెండో సారి ఆ జట్టు విజేతగా నిలిచింది. 47 ఏళ్ల తర్వాత జట్టు ఖాతాలో ఈ టైటిల్ చేరడం విశేషం. టెన్నిస్‌లో వరల్డ్ కప్‌లాంటి డేవిస్ కప్‌లో చివరిసారిగా 1998లో ఫైనల్ చేరి ఓటమిపాలైన ఇటలీ... పాతికేళ్ల తర్వాత వచి్చన అవకాశాన్ని వదులుకోలేదు. ఫైనల్లో ఇటలీ 2–0 తేడాతో 28 సార్లు చాంపియన్ ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. 2003లో ఆఖరి టైటిల్ సాధించిన ఆ్రస్టేలియా గత రెండు దశాబ్దాలుగా ప్రయతి్నస్తున్నా మరో ట్రోఫీని సొంతం చేసుకోలేకపోయింది. ఈ సారి కూడా ఆ జట్టు చివరి మెట్టుపై చతికిలపడింది. తొలి మ్యాచ్‌లో ఇటలీ ఆటగాడు మటియో ఆర్నాల్డి 7–5, 2–6, 6–4 స్కోరుతో అలెక్సీ పాపిరిన్పై విజయం సాధించాడు. 2 గంటల 27 నిమిషాల పాటు సాగిన ఈ హోరాహోరీ మ్యాచ్‌లో చివరకు 22 ఏళ్ల ఆర్నాల్డిదే పైచేయి అయింది. రెండో పోరులో వరల్డ్ నంబర్ 4 జనిక్ సిన్నర్ స్థాయికితగ్గ ఆటతీరుతో చెలరేగాడు. సిన్నర్ 6–3, 6–0తో అలెక్స్‌ను చిత్తు చేశాడు. 81 నిమిషాల్లోనే ముగిసిన ఆటలో సిన్నర్ 5 ఏస్‌లు కొట్టాడు. సెమీస్‌లో దిగ్గజ ఆటగాడు జొకోవిచ్‌ను ఓడించిన జోరులో ఉన్న సిన్నర్ తుది పోరులోనూ అదే ఫామ్‌ను కొనసాగించాడు. -
జయహో భారత్ 107
‘వంద’ పతకాల లక్ష్యంతో చైనా గడ్డపై ఆసియా క్రీడల్లో బరిలోకి దిగిన భారత క్రీడా బృందం అనుకున్నది సాధించింది. శనివారంతో భారత క్రీడాకారుల ఈవెంట్స్ అన్నీ ముగిశాయి. చివరిరోజు భారత్ ఆరు స్వర్ణాలు, నాలుగు రజతాలు, రెండు కాంస్యాలతో మెరిసి ఏకంగా 12 పతకాలు సాధించింది. ఈ క్రమంలో ఆసియా క్రీడల్లో తొలిసారి ‘పతకాల సెంచరీ’ మైలురాయిని దాటింది. అంతేకాకుండా ఈ క్రీడల చరిత్రలోనే 107 పతకాలతో తమ అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది. అంతర్జాతీయ క్రీడల్లో భారత్‌కిదే గొప్ప ప్రదర్శన కావడం విశేషం. 2010లో న్యూఢిల్లీ వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ 101 పతకాలు సాధించింది. ఈ ప్రదర్శనను భారత్ అధిగమించింది. శనివారం భారత్‌కు ఆర్చరీలో రెండు స్వర్ణాలు.. కబడ్డీల్లో రెండు పసిడి పతకాలు... పురుషుల టి20 క్రికెట్లో, పురుషుల బ్యాడ్మింటన్ డబుల్స్ విభాగంలో ఒక్కో బంగారు పతకం లభించాయి. ఆదివారం కేవలం కరాటే, ఆర్టిస్టిక్ స్విమ్మింగ్ ఈవెంట్స్ జరగనున్నాయి. అనంతరం సాయంత్రం ముగింపు వేడుకలతో హాంగ్జౌ ఆసియా క్రీడలకు తెరపడుతుంది. హాంగ్జౌ: చైనా గడ్డపై భారత్ తమ పతకాల వేటను దిగ్విజయంగా ముగించింది. ఆసియా క్రీడల్లో ఎవరూ ఊహించని విధంగా 107 పతకాలతో అదరగొట్టింది. ఇందులో 28 స్వర్ణాలు, 38 రజతాలు, 41 కాంస్యాలు ఉన్నాయి. తమ పోటీల చివరిరోజు భారత్ 12 పతకాలు గెలిచి పతకాల పట్టికలో నాలుగో స్థానాన్ని ఖరారు చేసుకుంది. 2018 జకార్తా ఆసియా క్రీడల్లో భారత్ 16 స్వర్ణాలు, 23 రజతాలు, 31 కాంస్యాలతో కలిపి 70 పతకాలతో ఎనిమిదో స్థానంలో నిలిచింది. సురేఖ, ఓజస్ ‘స్వర్ణ’ చరిత్ర శనివారం ముందుగా ఆర్చరీలో భారత్ బాణం ‘బంగారు’ లక్ష్యాన్ని ఛేదించింది. మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో భారత స్టార్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వెన్నం జ్యోతి సురేఖ స్వర్ణం గెలిచింది. ఫైనల్లో జ్యోతి సురేఖ 149–145తో చేవన్ సో (దక్షిణ కొరియా)ను ఓడించింది. జ్యోతి సురేఖ 15 బాణాలు సంధించగా అందులో 14 పది పాయింట్ల లక్ష్యంలో... ఒకటి 9 పాయింట్ల లక్ష్యంలో దూసుకెళ్లడం విశేషం. ఓవరాల్‌గా జ్యోతి సురేఖకు ఈ ఆసియా క్రీడలు చిరస్మరణీయమయ్యాయి. ఈ క్రీడల్లో విజయవాడకు చెందిన 27 ఏళ్ల జ్యోతి సురేఖ 3 స్వర్ణాలు సాధించింది. మహిళల కాంపౌండ్ టీమ్ ఈవెంట్‌తోపాటు మిక్స్డ్ టీమ్ ఈవెంట్లోనూ సురేఖ బంగారు పతకాలు గెలిచంది. తద్వారా దిగ్గజ అథ్లెట్ పీటీ ఉష (1986 సియోల్ గేమ్స్; 4 స్వర్ణాలు, 1 రజతం) తర్వాత ఒకే ఆసియా క్రీడల్లో కనీసం 3 స్వర్ణ పతకాలు గెలిచిన భారతీయ క్రీడాకారిణిగా జ్యోతి సురేఖ గుర్తింపు పొందింది. కాంపౌండ్ వ్యక్తిగత విభాగం కాంస్య పతకం కూడా భారత్ ఖాతాలోనే చేరింది. ప్రపంచ చాంపియన్ అదితి స్వామి (భారత్) 146–140తో ఫాదిలి జిలిజాటి (ఇండోనేసియా)పై గెలిచి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. పురుషుల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో స్వర్ణ, రజత పతకాలు భారత్‌కే లభించాయి. ఫైనల్లో ఓజస్ ప్రవీణ్ దేవ్‌తలే 149–147తో అభిషేక్ వర్మ (భారత్)పై గెలిచి స్వర్ణ పతకాన్ని సాధించాడు. ఈ క్రీడల్లో ఓజస్కిది మూడో స్వర్ణం. పురుషుల కాంపౌండ్ టీమ్, మిక్స్డ్ విభాగంలో ఓజస్ పసిడి పతకాలు గెలిచాడు. సాత్విక్–చిరాగ్ జోడీ అద్భుతం ఆసియా క్రీడల బ్యాడ్మింటన్‌లో భారత్‌కు ‘పసిడి’ కల నెరవేరింది. పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీ చాంపియన్‌గా అవతరించి ఈ క్రీడల చరిత్రలో భారత్‌కు తొలిసారి బంగారు పతకాన్ని అందించింది. శనివారం జరిగిన ఫైనల్లో సాత్విక్–చిరాగ్ ద్వయం 21–18, 21–16తో చోయ్ సోల్గు–కిమ్ వన్హో (దక్షిణ కొరియా) జంటను ఓడించింది. సెమీస్‌లో మలేసియాకు చెందిన ప్రపంచ మాజీ చాంపియన్ జోడీని బోల్తా కొట్టించిన భారత జంట తుది పోరులోనూ దూకుడుగా ఆడింది. కళ్లు చెదిరే స్మాష్‌లతో, చక్కటి డిఫెన్స్‌తో కొరియా జోడీకి కోలుకునే అవకాశం ఇవ్వకుండా విజయాన్ని దక్కించుకుంది. 1982 ఆసియా క్రీడల్లో లెరాయ్–ప్రదీప్ గాంధే భారత్‌కు పురుషుల డబుల్స్‌లో కాంస్య పతకాన్ని అందించారు. ఆసియా క్రీడల్లో విజేతగా నిలవడంతో వచ్చే వారం విడుదల చేసే ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) డబుల్స్ ర్యాంకింగ్స్‌లో తొలిసారి సాత్విక్–చిరాగ్ జోడీ నంబర్‌వన్ ర్యాంక్‌ను అందుకోనుంది. దీపక్ ‘రజత’ పట్టు ఆసియా క్రీడల పురుషుల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్ ఈవెంట్‌ను భారత్ రజత పతకంతో ముగించింది. 86 కేజీల విభాగంలో దీపక్ పూనియా భారత్‌కు రజత పతకాన్ని అందించాడు. ఇరాన్ దిగ్గజ రెజ్లర్ హసన్ యజ్దానితో జరిగిన ఫైనల్లో దీపక్ 3 నిమిషాల 31 సెకన్లలో 0–10తో ‘టెక్నికల్ సుపీరియారిటీ’ పద్ధతిలో ఓడిపోయాడు. రెజ్లింగ్ నిబంధనల ప్రకారం బౌట్లో పది పాయింట్ల ఆధిక్యం సాధించిన వెంటనే ఆ రెజ్లర్‌ను విజేతగా ప్రకటిస్తారు. అంతకుముందు దీపక్ తొలి రౌండ్లో 3–2తో షరిపోవ్ (ఖతర్)పై, ప్రిక్వార్టర్ ఫైనల్లో 11–0తో రియాన్డెస్టా (ఇండోనేసియా)పై, క్వార్టర్ ఫైనల్లో 7–3తో షోటా సిరాయ్ (జపాన్)పై, సెమీఫైనల్లో 4–3తో షపియెవ్ (ఉజ్బెకిస్తాన్)పై గెలుపొందాడు. భారత్‌కే చెందిన యశ్ (74 కేజీలు), విక్కీ (97 కేజీలు), సుమిత్ మలిక్ (125 కేజీలు) ఆరంభ రౌండ్లలోనే ఓడిపోయారు. భారత జట్ల ‘పసిడి’ కూత గత ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాలను చేజార్చుకున్న భారత పురుషుల, మహిళల కబడ్డీ జట్లు ఈసారి తమ ఖాతాలోకి వేసుకున్నాయి. శనివారం జరిగిన ఫైనల్స్‌లో భారత పురుషుల జట్టు 33–29తో డిఫెండింగ్ చాంపియన్ ఇరాన్ జట్టును ఓడించగా... భారత మహిళల జట్టు 26–25తో చైనీస్ తైపీపై విజయం సాధించింది. ఆసియా క్రీడల కబడ్డీ ఈవెంట్లో భారత పురుషుల జట్టు ఎనిమిదోసారి స్వర్ణ పతకం నెగ్గగా... మహిళల జట్టు మూడోసారి పసిడి పతకం సాధించింది. చెస్‌లో డబుల్ ధమాకా వ్యక్తిగత విభాగంలో త్రుటిలో పతకాలు కోల్పోయిన భారత చెస్ క్రీడాకారులు టీమ్ ఈవెంట్లో సత్తా చాటుకొని రజత పతకాలు నెగ్గారు. పెంటేల హరికృష్ణ, ఇరిగేశి అర్జున్, గుకేశ్, ప్రజ్ఞానంద, విదిత్‌లతో కూడిన భారత పురుషుల జట్టు నిర్ణీత తొమ్మిది రౌండ్ల తర్వాత 15 మ్యాచ్ పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఫిలిప్పీన్స్‌తో జరిగిన చివరి రౌండ్లో భారత్ 3.5–0.5తో గెలిచింది. ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, వైశాలి, వంతిక, సవితాశ్రీలతో కూడిన భారత మహిళల జట్టు కూడా 15 మ్యాచ్ పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. చివరిదైన తొమ్మిదో రౌండ్లో భారత్ 4–0తో దక్షిణ కొరియాను ఓడించింది. క్రికెట్లో కనకం... తొలిసారి ఆసియా క్రీడల క్రికెట్ ఈవెంట్లో పోటీపడ్డ భారత క్రికెట్ జట్టు స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. టి20 ఫార్మాట్లో జరిగిన ఈ పోటీల్లో శనివారం భారత్, అఫ్గానిస్తాన్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. అఫ్గానిస్తాన్ 18.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 112 పరుగులు చేసిన దశలో వచ్చిన వర్షం తగ్గకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేశారు. మెరుగైన ర్యాంక్ కారణంగా భారత్‌ను విజేతగా ప్రకటించి స్వర్ణ పతకాన్ని అందించగా... అఫ్గానిస్తాన్ జట్టుకు రజతం లభించింది. స్వర్ణం నెగ్గిన భారత జట్టులో హైదరాబాద్ క్రికెటర్ తిలక్ వర్మ సభ్యుడిగా ఉన్నాడు. -
Chess Olympiad: నా అత్యుత్తమ ప్రదర్శన ఇస్తా: హరికృష్ణ
చెన్నై: స్వదేశంలో తొలిసారి జరుగుతున్న ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్‌లో తన అత్యుత్తమ ప్రదర్శన ఇస్తానని భారత గ్రాండ్‌మాస్టర్, ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ పెంటేల హరికృష్ణ తెలిపాడు. ఈనెల 28 నుంచి ఆగస్టు 8 వరకు తమిళనాడులోని మహాబలిపురంలో చెస్ ఒలింపియాడ్ జరగనుంది. 187 దేశాల నుంచి ఓపెన్, మహిళల విభాగాల్లో కలిపి మొత్తం 343 జట్లు పతకాల కోసం పోటీపడతాయి. గత నెలలో ప్రాగ్ మాస్టర్స్ టోర్నీలో విజేతగా నిలిచిన 36 ఏళ్ల హరికృష్ణ తన కెరీర్లో పదోసారి చెస్ ఒలింపియాడ్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ‘2000 నుంచి నేను చెస్ ఒలింపియాడ్‌లో పోటీపడుతున్నాను. సుదీర్ఘకాలం నుంచి దేశానికి ప్రాతినిధ్యం వహించడం గర్వంగా ఉంది. సీనియర్ ప్లేయర్‌గా మెరుగ్గా రాణించాలనే బాధ్యత ఉంది. నా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా’ అని హరికృష్ణ వ్యాఖ్యానించాడు. ‘ఆతిథ్య దేశం హోదాలో భారత్ ఓపెన్ విభాగంలో మూడు, మహిళల విభాగంలో మూడు జట్లను బరిలోకి దించనుంది. ఇప్పటికైతే పతకాల గురించి ఆలోచించడంలేదు. టోర్నీ మొత్తం నిలకడగా రాణిస్తే పతకాలు వాటంతట అవే వస్తాయి’ అని ప్రపంచ 25వ ర్యాంకర్ హరికృష్ణ అన్నాడు. -
రంజీ ట్రోఫీ 2022లో అదరగొట్టిన హీరోలు వీళ్లే..!
Ranji Trophy 2021-22: దేశవాళీ అత్యుత్తమ టోర్నీ అయిన రంజీ ట్రోఫీలో సరికొత్త చరిత్ర ఆవిష్కృతమైంది. 2021-22 సీజన్లో మధ్యప్రదేశ్ సరికొత్త ఛాంపియన్‌గా అవతరించింది. గతంలో (1998-99) ఒక్కసారి మాత్రమే ఫైనలిస్ట్‌గా నిలిచిన మధ్యప్రదేశ్ తొలిసారి టైటిల్‌ను ముద్దాడింది. ఆదివారం ముగిసిన ఫైనల్లో ముంబైని 6 వికెట్ల తేడాతో చిత్తు చేయడం ద్వారా మధ్యప్రదేశ్ తమ చిరకాల కోరికను సాకారం చేసుకుంది. ఆఖరి రోజు ముంబై నిర్ధేశించిన 108 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మధ్యప్రదేశ్‌ను తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరోలు శుభమ్ శర్మ (30), రజత్ పాటిదార్ (30) విజయతీరాలకు చేర్చారు. 2021-22 సీజన్లో అత్యుత్తమ గణాంకాలపై ఓ లుక్కేద్దాం.. అత్యధిక పరుగులు- సర్ఫరాజ్ ఖాన్ (ముంబై) 9 ఇన్నింగ్స్‌ల్లో 982 పరుగులు, మధ్యప్రదేశ్‌కు చెందిన రజత్ పాటిదార్ (9 ఇన్నింగ్స్‌ల్లో 658 పరుగులు) అత్యధిక స్కోర్- సకీబుల్ గని (బీహార్) 341 అత్యుత్తమ సగటు- చేతన్ బిస్త్ (నాగాలాండ్) 311.50 అత్యధిక శతకాలు- చేతన్ బిస్త్ (5), సర్ఫరాజ్ ఖాన్ (4), శుభమ్ శర్మ (4) అత్యధిక అర్ధశతకాలు- రజత్ పాటిదార్ (5), షమ్స్ ములానీ (5) అత్యధిక ఫోర్లు- రజత్ పాటిదార్ (100) అత్యధిక సిక్సర్లు- సర్ఫరాజ్ ఖాన్ (19) అత్యధిక వికెట్లు- ముంబైకి చెందిన షమ్స్ ములానీ (45), మధ్యప్రదేశ్‌కు చెందిన కుమార్ కార్తికేయ (32) అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు- మయాంక్ మిశ్రా (7-44) అత్యధిక సార్లు 5 వికెట్ల ఘనత- షమ్స్ ములానీ (6) చదవండి: కొత్త చరిత్ర ఆవిష్కృతం.. రంజీ ట్రోఫీ విజేత మధ్యప్రదేశ్ -
హర్ష ‘హ్యాట్రిక్’ గెలుపు
వార్సా (పోలాండ్): ప్రపంచ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ హర్ష భరతకోటి అద్భుత ఆటతీరు కనబరుస్తున్నాడు. ఈ మెగా ఈవెంట్లో తొలి రోజు హర్ష తనకంటే ఎంతో మెరుగైన రేటింగ్ ఉన్న గ్రాండ్మాస్టర్లతో ఆడిన మూడు గేముల్లోనూ విజయం సాధించాడు. మూడు పాయింట్లతో మరో తొమ్మిది మందితో కలిసి ఈ హైదరాబాద్ ప్లేయర్ సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం 2484 రేటింగ్ ఉన్న హర్ష తొలి గేమ్‌లో 51 ఎత్తుల్లో రవూఫ్ మమెదోవ్ (అజర్ బైజాన్–2690)పై... రెండో గేమ్‌లో 54 ఎత్తుల్లో వ్లాదిస్లావ్ కొవలెవ్ (రష్యా– 2647)పై... మూడో గేమ్‌లో 56 ఎత్తుల్లో ఒనిష్చుక్ (ఉక్రెయిన్ –2687)పై గెలుపొందాడు. తెలంగాణకే చెం దిన మరో గ్రాండ్‌మాస్టర్ ఎరిగైసి అర్జున్ రెండు గేముల్లో గెలిచి, మరో గేమ్‌ను ‘డ్రా’ చేసుకున్నాడు. మహిళల విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ కోనేరు హంపి తొలి రెండు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని జైనాబ్ (అజర్బైజాన్)తో జరిగిన మూడో గేమ్‌లో ఓడిపోయింది. -
సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో ఏపీ ఉత్తమ ప్రదర్శన
-
అభివృద్ధిలో పైపైకి
సాక్షి, అమరావతి: కరోనా మహమ్మారి ప్రజల ప్రాణాలను హరించడమే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక రంగాన్ని అతలాకుతలం చేసింది. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ ఆర్థికాభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ దూసుకెళ్తోంది. ఈ విషయం ఇండియా టుడే స్టేట్ ఆఫ్ స్టేట్స్–2020 అధ్యయనంలో వెల్లడైంది. ఒక్క ఆర్థిక రంగంలోనే కాదు. పర్యాటక రంగంలోనూ ఏపీ మెరుగైన ప్రదర్శన కనబరుస్తోందని ఆ అధ్యయనం పేర్కొంది. వివిధ రంగాల్లో దేశం, రాష్ట్రాలు జూన్ నుంచి అక్టోబర్ వరకూ సాధించిన ప్రగతిపై మార్కెటింగ్ అండ్ డెవలప్మెంట్ రీసెర్చ్ అసోసియేట్స్ (ఎండీఆర్ఏ)తో కలిసి ఇండియా టుడే సంస్థ అధ్యయనం చేసింది. కరోనా ప్రతికూల పరిస్థితులను అధిగమించి 12 రంగాల్లో (ఆర్థిక, పర్యాటకం, మౌలిక సదుపాయాలు, సమ్మిళిత అభివృద్ధి, పరిపాలన, శాంతిభద్రతలు.. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, పరిశుభ్రత, పర్యావరణం, విద్య, ఆరోగ్యం, వ్యవసాయం) రాష్ట్రాలు సాధిస్తున్న ప్రగతిని.. వివిధ మార్గాల్లో సేకరించిన డేటాతో పరిశీలించింది. ఆ విభాగాల్లో రాష్ట్రాలను ఉత్తమ ప్రదర్శన (బెస్ట్ పెర్ఫార్మింగ్), అత్యుత్తమ మెరుగైన (మోస్ట్ ఇంప్రూవ్డ్), ఓవరాల్ కేటగిరీలుగా విభజించింది. వాటికి అనుగుణంగా స్కోర్ ఇచ్చింది. ఆయా విభాగాల్లో ఉత్తమ రాష్ట్రాలను విజేతలుగా పేర్కొంది. ఈ అధ్యయనంలో భాగంగా 35 వేల చదరపు కి.మీ.ల భౌగోళిక విస్తీర్ణం లేదా 5 మిలియన్ల కంటే ఎక్కువ జనాభా కలిగిన 20 రాష్ట్రాలను పెద్ద రాష్ట్రాలుగానూ, అంతకంటే తక్కువ విస్తీర్ణం, జనాభా కలిగిన రాష్ట్రాలను చిన్న రాష్ట్రాలుగానూ వర్గీకరించింది. వీటికి అనుగుణంగా ర్యాంకులు ఇచ్చింది. రెండేళ్ల క్రితం పది.. ఇపుడు ఏడో స్థానం ఓవరాల్ బెస్ట్ పెర్ఫార్మింగ్ పెద్ద రాష్ట్రాల విభాగంలో 2018లో పదో స్థానంలో ఉంటే.. గతేడాది ఎనిమిదో స్థానానికి చేరింది. ఇప్పుడు ఏడో స్థానంలోకి దూసుకొచ్చింది. మోస్ట్ ఇంప్రూవ్డ్ పెద్ద రాష్ట్రాల విభాగంలో 2018లో మన రాష్ట్రం ఎనిమిదో ర్యాంకులో నిలిస్తే.. గతేడాది రెండో ర్యాంకును సాధించింది. ఈ ఏడాది అదే ర్యాంకును నిలబెట్టుకుంటూ స్థిరమైన అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోందని ఇండియా టుడే అధ్యయనం వెల్లడించింది. ఈ అధ్యయనంలో వెల్లడైన ముఖ్యాంశాలు ఇవీ.. ► మోస్ట్ ఇంప్రూవ్డ్ పెద్ద రాష్ట్రాల విభాగంలో ఆర్థిక రంగం, పర్యాటక రంగంలో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో నిలిచింది. ► ఓవరాల్ మోస్ట్ ఇంప్రూవ్డ్ పెద్ద రాష్ట్రాల విభాగంలో 2,000 మార్కులకుగానూ 1,194.8 మార్కులను సాధించిన ఏపీ రెండో స్థానంలో నిలిచింది. ► ఓవరాల్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ పెద్ద రాష్ట్రాల విభాగంలో 2,000 మార్కులకుగానూ 1,147.7 మార్కులను సాధించిన ఏపీ ఏడో స్థానానికి చేరుకుంది. ► కరోనా కట్టడిలో వందకు 65.8 మార్కులను సాధించిన రాష్ట్రం మూడో స్థానంలో నిలిచింది. -
అత్యుత్తమ సీఎంలలో వైఎస్ జగన్‌కు మూడో స్థానం
-
మూడో స్థానంలో నిలిచిన సీఎం వైఎస్ జగన్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడోస్థానంలో నిలిచారు. జులై 15 నుంచి 27 మధ్య ఇండియా టుడే మూడ్ ఆఫ్‌ది నేషన్ నిర్వహించిన సర్వేలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. కాగా.. అత్యంత ప్రజాదరణ కలిగిన సీఎంలలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌కు ప్రథమ స్థానం దక్కగా.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రెండో స్థానంలో నిలిచారు. తెలంగాణ సీఎం కేసీఆర్ తొమ్మిదో స్థానంలో నిలిచారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(4), ఇతరులు(5), బిహార్ సీఎం నితీశ్‌కుమార్(6), మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే(7), ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్(8), రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లట్(10) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. 19 రాష్ట్రాల్లోని 97 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఈ సర్వే జరిగింది. జులై 15 నుంచి 27 మధ్య 12,021 మందితో టెలిఫోన్ ఇంటర్వ్యూ ద్వారా అభిప్రాయాలు సేరరించారు. (సామాజిక ఆసుపత్రుల్లోనూ ఆక్సిజన్ బెడ్లు) -
జాతీయ క్రికెట్ టోర్నీకి శ్రీనివాస్ ఎంపిక
నెక్కొండ: నెక్కొం డ మండల కేం ద్రానికి చెందిన గోపగాని శ్రీనివా స్ నవంబర్‌లో ఢి ల్లీలో జరిగే జాతీ య క్రికెట్ క్రీడల కు ఎంపికయ్యాడు. స్థానిక శ్రీ వికాస్ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న శ్రీనివాస్ ఇటీవల మహబూబ్‌నగర్‌లో జరిగిన అండర్–19 క్రికెట్ పో టీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చాడు. జాతీయ స్థాయికి ఎంపికైన శ్రీనివాస్‌ను కళాశాల యాజమాన్యం శాలువతో సన్మానించి మె మెంటో అందజేసింది. కళాశాలల డైరెక్టర్లు తిప్పని వెంకన్న, చల్లా క్రిష్ణారెడ్డి, కూతురు మహేందర్‌రెడ్డి, తాటిపర్తి అంజన్‌రెడ్డి, కొత్త మధూకర్‌రెడ్డి, దేవేందర్‌రెడ్డి, నాగరాజు, రవి, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ రెం టల ఆనందరావు పాల్గొన్నారు. -
పోలీస్ అధికారులు, సిబ్బంది పనితీరు భేష్
వరంగల్ : ఇటీవల ఎస్సై, కానిస్టేబుళ్ల పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన దేహదారుఢ్య పోటీల్లో అధికారులు, సిబ్బంది పనితీరు బాగుందని రూరల్ ఎస్పీ అంబర్ కిషోర్‌ఝూ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం జరిగిన సమావేశంలో డీపీఓ సిబ్బంది, అధికారులకు ఆయన ప్రశంసా పత్రాలు అందించి అభినందించారు. అభ్యర్థుల ఆధార్‌కార్డ్, ధ్రువీకరణ పత్రాల పరిశీలన, బయోమెట్రిక్‌లో వేలిముద్రలను సేకరించడంలో అధికారులు, సిబ్బంది పనితీరు బాగుందన్నారు. కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా తగిన గుర్తింపు ఉంటుందన్నారు. సమావేశంలో డీపీఓ ఈఓ నారాయణరెడ్డి, సూపరింటెండెంట్లు నాగేందర్‌సింగ్, మహమూద్, రమాదేవి, ఫర్హానా, సీఐలు జానీ నర్సింహులు, శ్రీనివాస్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.