Bhagat Singh Koshyari
-
ఆ సమయంలో ఏది సరైందో అదే చేశా! మహారాష్ట్ర మాజీ గవర్నర్
మహారాష్ట్రలో శివసేన సంక్షోభం కేసులో సుప్రీంకోర్టు నాటి మహారాష్ట్ర మాజీ గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ బలపరీక్ష నిర్ణయాన్ని తప్పుపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నాటి గవర్నర్ 80 ఏళ్ల భగత్ సింగ్ కోష్యారీని మీడియా ప్రశ్నించగా..నన్ను శిక్షించిందని అనుకోవడం లేదని తెలివిగా సమాధానమిచ్చారు. కారణం తాను రాజీనామా చేశానని, మాజీ గవర్నర్‌కు శిక్ష విధిస్తారని తాను అనుకోవడం లేదంటూ కప్పిపుచ్చుకునే యత్నం చేశారు. ఒక వేళ శిక్ష విధిస్తే తాను అప్పీల్ చేసి ఉండేవాడినంటూ తన రాజకీయ చతురతను ప్రదర్శించారు కోష్యారీ. ఐతే తాను ఆ సమయంలో ఏది సరైనదో అదే చేశానని అన్నారు. అయినా సుప్రీం కోర్టు తీర్పుపై చర్చించడం జర్నలిస్టులు, లాయర్ల పని అని సెటైరికల్ సమాధానమిచ్చారు. పైగా సుప్పీంకోర్టు ఆయన నిర్ణయాన్ని తప్పు పట్టిన విషయానికి నేరుగా సమాధానం ఇవ్వకుండా ఇలా తప్పించుకునే థోరణితో సమాధానం ఇచ్చారు. ఇదిలా ఉండగా, నాటి ఘటనలో ఉద్ధవ్ థాక్రే మెజారిటీ కోల్పోయారని గవర్నర్ నిర్ధారణకు వచ్చేయడం కూడా సరికాదని అత్యున్నత న్యాయస్థానం చెప్పింది. పైగా గవర్నర్ అలా నిర్ణయించడం రాజ్యంగ విరుద్ధమని, పార్టీ వ్యవహారాల్లో ఆయన జోక్యం కూడా రాజ్యాంగ సమ్మతం కాదని తేల్చి చెప్పింది. మాజీ సీఎం థాక్రే బలపరీక్షకు వెళ్లకుండానే రాజీనామా చేశారని అందువల్లే ప్రభుత్వాన్ని పునురుద్ధరించలేమని స్పష్టం చేసింది సుప్రీం కోర్టు. కాగా, నాటి గవర్నర్ కోష్యారీ మాత్రం తన నిర్ణయం గురించి ఎటువంటి విచారం వ్యక్తం చేయకపోవడం గమనార్హం. (చదవండి: థాక్రే రాజీనామా చేయకపోయి ఉంటే.. ప్రభుత్వాన్ని పునరుద్దరించి ఉండేవాళ్లం: సుప్రీం కోర్టు) -
మహారాష్ట్రలో ఆనాడు జరిగిందిదే.. మాజీ గవర్నర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ముంబై: మహారాష్ట్రలో శివసేనకు చెందిన విల్లుబాణం గుర్తుపై రాజకీయం వేడెక్కింది. ఈ క్రమంలో మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రే.. సీఎం ఏక్నాథ్ షిండేపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించారు. కాగా, దీనిపై తాజాగా మహారాష్ట్ర మాజీ గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ స్పందించారు. అయితే, కోష్యారీ ఇండియా టుడే ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మహారాష్ట్రలో రాజ్యాంగం ప్రకారమే అంతా జరిగిందన్నారు. తమకు మెజార్టీ ఉందని షిండే, ఫడ్నవీస్ చెప్పారు. ఈ క్రమంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాతే రాజ్ భవన్లో కార్యక్రమం జరిగింది. అంతే తప్ప గవర్నర్‌గా నా పాత్ర ఏమీ లేదన్నారు. అలాగే.. ఇదే సమయంలో ఉద్ధవ్ థాక్రే తనకు మెజార్టీ ఉందని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని తన వద్దకు రాలేదన్నారు. ఏమీ మాట్లాడలేదు. దీంతో, మరో పార్టీ వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పింది.. చేసింది. రాజ్యాంగం ప్రకారమే అంతా జరిగిందన్నారు. ప్రభుత్వ ఏర్పాటుపై ప్రఫుల్ పటేల్, శరద్ పవార్, ఛగన్ భుజ్ బల్ (ఎన్సీపీ నేతలు)ను అడిగాను. అయినా ఒక్కరు కూడా.. ప్రభుత్వ ఏర్పాటుకు మెజారిటీ ఉందని లేఖ ఇవ్వలేదు. శివ సైనికుడిని సీఎం చేయాలని అనుకుంటున్నామని మాత్రం చెప్పుకుంటూ వచ్చారంతే అని కోష్యారీ వివరించారు. ఇక, కోష్యారీ గవర్నర్‌గా ఉన్న సమయంలోనే మహారాష్ట్రలో రాజకీయ అనిశ్చితి నెలకొన్న విషయం తెలిసిందే. శివసేన రెండుగా చీలిపోవడం ఆ తర్వాత బీజేపీతో కలిసి షిండే కొత్త ప్రభుత్వం ఏర్పాటు జరిగింది. ఈ క్రమంలోనే ఇటీవలే ఎన్నికల కమిషన్ కూడా శివసేన అధికారిక గుర్తు.. విల్లుబాణంను షిండే వర్గానికే కేటాయించింది. -
రాజీనామా యోచనలో మహారాష్ట్ర గవర్నర్?
ముంబై: మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కొష్యారి(80) రాజీనామాకు సిద్ధం అవుతున్నారా?.. ఈ విషయాన్ని పరోక్షంగా ఆయనే వెల్లడించడం గమనార్హం. తాను గవర్నర్ హోదా నుంచి హుందాగా తప్పుకోవాలని భావిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ వద్ద ప్రస్తావించారట. సోమవారం ఈ విషయాన్ని ధృవీకరిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది మహారాష్ట్ర రాజ్‌భవన్. ప్రధాని మోదీ తాజాగా(జనవరి 19వ తేదీన) ముంబైలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రధానితో తాను గవర్నర్ హోదా నుంచి తప్పుకోవాలని భావిస్తున్న విషయాన్ని చెప్పినట్లు గవర్నర్ కోష్యారి తెలిపారు. అంతేకాదు.. మరేయితర రాజకీయ బాధ్యతలు కూడా తనకు కేటాయించొద్దని ఆయన ప్రధానిని కోరారట. బీజేపీ సీనియర్ నేత అయిన భగత్ సింగ్ కొష్యారి.. వయో భారంతోనే ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. తన శేష జీవితాన్ని పుస్తక పఠనం, సాహిత్య రచనతో గడపాలని ఆయన నిర్ణయించుకున్నట్లు ఆ ప్రకటనలో వెల్లడించారు. ప్రధాని మోదీకి తానంటే ఎంతో అభిమానమని, కాబట్టి తాను తీసుకున్న నిర్ణయానికి సానుకూలంగానే స్పందిస్తారని భావిస్తున్నట్లు కోష్యారి ఆ ప్రకటనలో వెల్లడించారు. అలాగే మహారాష్ట్ర లాంటి రాష్ట్రానికి గవర్నర్‌గా పని చేయడాన్ని తానెంతో గౌరవంగా భావిస్తున్నట్లు వెల్లడించారాయన. ఆరెస్సెస్ మూలాలు ఉన్న కోష్యారి.. గతంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా పని చేశారు. ఉత్తర ప్రదేశ్ ఎమ్మెల్సీతో పాటు అదనంగా మంత్రి బాధ్యతలు నిర్వర్తించారు. ఆపై ఉత్తరాఖండ్ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తొలి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడయ్యారు. ఉత్తరాఖండ్‌కు రెండో ముఖ్యమంత్రిగా, ఆపై ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేగానూ ఎన్నికయ్యారు. రాజ్యసభ సభ్యుడిగా, నైనిటాల్-ఉధమ్‌సింగ్ నియోజకవర్గం తరపున ఒకసారి లోక్‌సభకూ ఆయన ఎన్నికయ్యారు. మహారాష్ట్ర గవర్నర్‌గా పని చేస్తున్న టైంలో ఆయన పలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. రాజకీయ విమర్శలతో పాటు వ్యక్తిగతంగానూ ఆయన్ని ఇబ్బంది పెట్టిన కామెంట్ ఒకటి ఉంది. మహారాష్ట్ర నుంచి గుజరాతీలను, రాజస్థానీ మార్వాడీలను గనుక వెళ్లగొడితే.. ముంబైకి దేశ ఆర్థిక రాజధాని హోదా ఉండబోదని, డబ్బే మిగలదని కామెంట్ చేసి విమర్శలు ఎదుర్కొన్నారాయన. ఈ వ్యవహారంలో బీజేపీ సైతం ఆయనకు దూరంగా ఉంటూ వచ్చింది. చివరకు వ్యవహారం పెద్దది అవుతుండడంతో.. ఆయన మరాఠ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. ఆపై కిందటేడాది నవంబర్‌లో.. ఓ యూనివర్సిటీ కార్యక్రమంలో ప్రసంగిస్తూ.. ఛత్రపతి శివాజీ మహరాజ్ పాత తరం ఐకాన్ అని, ఈ తరం వాళ్లకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్, నితిన్ గడ్కరీ లాంటి వాళ్లే ఐకాన్ అంటూ వ్యాఖ్యానించి.. మరోసారి విమర్శలు ఎదుర్కొన్నారు. -
శివాజీ వ్యాఖ్యల దుమారం: గవర్నర్‌కు సపోర్ట్‌గా..
ముంబై: మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీపై వ్యాఖ్యలతో వివాదంలోకి దిగారు మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ. ఛత్రపతి శివాజీ పాత ఐకాన్ అంటూ బహిరంగంగా ఆయన చేసిన వ్యాఖ్యలు మహా సర్కార్‌ను సైతం ఇరకాటంలో పడేశాయి. శివాజీని అగౌరవపరిచేలా ఆయన చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. ఈ తరుణంలో మాజీ సీఎం, ప్రస్తుత డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ సతీమణి.. గవర్నర్‌కు మద్దతుగా చేసిన వ్యాఖ్యలు ఆ అగ్నికి మరింత ఆజ్యం పోశాయి. ఫడ్నవిస్ భార్య అమృత.. గవర్నర్ కోష్యారీకి మద్దతుగా వ్యాఖ్యలు చేశారు. ‘‘వ్యక్తిగతంగా గవర్నర్‌గారు నాకు తెలుసు. మరాఠా సంస్కృతి మీద ఆయనకు ఎంతో గౌరవం ఉంది. ఆయన ఇక్కడికి వచ్చాకే మరాఠీ నేర్చుకున్నారు. మరాఠీలను ఆయన ఎంత ఇష్టపడతారో.. దగ్గరుండి మరీ చూశా. ఆయన ఏదో అన్నారని కాదు. కానీ, మనస్ఫూర్తిగా ఆయన మరాఠాను గౌరవించే మనిషే అంటూ ఆమె విలేఖరులతో చెప్పారు. ఒకవైపు శివాజీ వ్యాఖ్యల ఆధారంగా గవర్నర్‌పై మండిపడుతున్నాయి ప్రతిపక్షాలు. గవర్నర్ రీకాల్ కోసం ప్రయత్నించాలని మహా ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నాయి. ఈ తరుణంలో.. అమృతా ఫడ్నవిస్ వ్యక్తిగతంగా చేసిన వ్యాఖ్యలు బీజేపీని, బీజేపీ-షిండే శివసేన కూటమి సర్కార్‌ను మరింత ఇరకాటంలో పడేశాయి. ప్రతిపక్షాలు అమృత కామెంట్ల ఆధారంగా బీజేపీపై విరుచుకుపడుతున్నారు. మరోవైపు ఉద్దవ్ థాక్రే.. కేంద్రం అమెజాన్ పార్శిల్లో కోష్యారీని పంపించిందంటూ ఎద్దేవా చేశారు. కోష్యారీని తప్పించకపోతే.. అన్ని పార్టీలను పోగుజేసి వ్యతిరేక నిరసనలు కొనసాగిస్తామని థాక్రే హెచ్చరించారు. కేంద్రాన్ని ఉద్దేశిస్తూ.. ‘‘మీరు పంపిన శాంపిల్‌ను మీరే తీసుకెళ్లండి. ఒకవేళ ఆయన్ని ఓల్డేజ్ హోంకి పంపించాల్సి వస్తే ఆ పని చేయండి. అంతేకానీ ఈ రాష్ట్రంలో మాత్రం ఆయన్ని ఉంచకండి అంటూ వ్యంగ్యంగా కామెంట్లు చేశారు థాక్రే. మరోవైపు గవర్నర్ వ్యాఖ్యలపై నిరసన కోసం.. థాక్రే శివసేన వర్గపు నేత సంజయ్ రౌత్.. కాంగ్రెస్ పార్టీ నేత శరద్ పవార్‌ను కలిసి చర్చించారు. ఇదిలా ఉండగా.. శివాజీపై వ్యాఖ్యల నేపథ్యంలో గవర్నర్ కోష్యారీని కేంద్రం ఢిల్లీకి పిలిపించుకున్నట్లు సమాచారం. ఇదీ చదవండి: శివాజీపై గవర్నర్ వ్యాఖ్యలు.. గడ్కరీ ఏమన్నారంటే.. -
శివాజీపై వ్యాఖ్యల దుమారం.. నితిన్ గడ్కరీ ఏమన్నారంటే?
ఛత్రపతి శివాజీపై వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా మహారాష్ట్ర రాజకీయం మరోసారి వేడెక్కింది. శివాజీపై మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ చేసిన వ్యాఖ్యలు పొలిటికల్‌గా సంచలనంగా మారాయి. దీంతో, సీఎం ఏక్నాథ్ షిండే అనుకూల ఎమ్మెల్యేలు సైతం గవర్నర్ వ్యాఖ్యలను తప్పుపడుతున్నారు. షిండే వర్గం-బీజేపీ కూటమిలో ప్రకంపనలు రేపుతున్నాయి. అంతటితో ఆగకుండా గవర్నర్‌ను బదిలీ చేయాలనే డిమాండ్ తెరమీదకు తెస్తున్నారు. ఈ క్రమంలో గవర్నర్ భగత్‌సింగ్ కోష్యారీ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు. బీజేపీ మిత్రపక్ష నేత, సీఎం ఏక్నాథ్ షిండే తీరును గడ్కరీ సోమవారం తప్పుబట్టారు. ఈ సందర్భంగా నితిన్ గడ్కరీ.. శివాజీ మహారాజ్ మాకు దేవుడు. మా తల్లిదండ్రుల కంటే ఎక్కువగా ఆయనను పూజిస్తాం అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక, గడ్కరీ వ్యాఖ్యలతోనైనా మహారాష్ట్రలో ఈ పొలిటికల్ ప్రకంపనలకు తెరపడుతుందో లేదో చూడాల్సిందే. అయితే, మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ ఔరంగాబాద్‌లోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మరాఠ్వాడా విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ప్రసంగిస్తూ.. మహారాష్ట్రలో చాలా మంది ఆరాధ్య నాయకులు ఉన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ పాతకాలం నాటి ఆరాధ్య దైవం. ఇప్పుడు బీఆర్ అంబేద్కర్, నితిన్ గడ్కరీ ఉన్నారు అంటూ కామెంట్స్ చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలపై శివసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకంగా షిండే వర్గంలోని ఎమ్మెల్యేలు కూడా గవర్నర్‌పై ఆగ్రహం వ్యక్తం చేయడం విశేషం. -
శివాజీపై తీవ్ర వ్యాఖ్యలు.. సీఎం షిండే వర్గంలో చిచ్చుపెట్టిన గవర్నర్!
మహారాష్ట్ర రాజకీయం రసవత్తరంగా మారింది. ఛత్రపతి శివాజీపై మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ చేసిన వ్యాఖ్యలు పొలిటికల్‌గా సంచలనంగా మారాయి. గవర్నర్ వ్యాఖ్యలను ఉద్ధవ్ థాక్రే వర్గం, శివసేన నేతలు తప్పుబడుతున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేపై ఆయన వర్గానికే చెందిన ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, గవర్నర్ కోష్యారీ వ్యాఖ్యలపై శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గైక్వాడ్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. గవర్నర్‌ను తక్షణమే బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. కోష్యారీ గతంలో కూడా ఇలాగే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. ఛత్రపతి శివాజీ మహారాజ్.. ప్రపంచలోని మరే ఇతర వ్యక్తితోనూ పోల్చలేరని అన్నారు. మహారాష్ట్ర చరిత్ర తెలియని వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధకరమని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ పార్టీకి, సీనియర్ నేతలకు ఇక్కడి చరిత్ర తెలిసినట్టు లేదని చురకలు అంటించారు. ఇప్పటికైనా తన తప్పు తెలుసుకుని గవర్నర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే, షిండే వర్గానికి చెందిన ఎమ్మెల్యే ఇలాంటి కామెంట్స్ చేయడంతో మహారాష్ట్ర రాజకీయాలు చర్చనీయాంశంగా మారాయి. Shiv Sena MLA Sanjay Gaikwad of Chief Minister Eknath Shinde's faction on Monday demanded that Maharashtra Governor Bhagat Singh Koshyari be shifted out of the state for his recent remarks about Chhatrapati Shivaji Maharaj.https://t.co/bvMkSHjnQS — Economic Times (@EconomicTimes) November 21, 2022 ఇక, అంతకుముందు.. గవర్నర్ వ్యాఖ్యలపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఖండించారు. గవర్నర్‌ను తక్షణమే తొలగించాలంటూ డిమాండ్ చేశారు. అసలు షిండే మహారాష్ట్ర బిడ్డేనా? అని నిలదీశారు. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండ్ వెంటనే రాజీనాయాలన్నారు. ఈ ఏడాది వ్యవధిలో గవర్నర్ కోష్యారీ నాలుగుసార్లు ఛత్రపతి శివాజీని అవమానిస్తూ వ్యాఖ్యలు చేశారన్నారు రౌత్. అయినా మహారాష్ట్ర ప్రభుత్వ మౌనంగానే ఉందంటూ విరుచుకుపడ్డారు. అయితే, మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ ఔరంగాబాద్‌లోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మరాఠ్వాడా విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ప్రసంగిస్తూ.. శివాజీ మహారాజ్ పాత విగ్రహం అయిపోయాయని, ఇప్పుడూ మీకు బాబాసాహెబ్ అంబేద్కర్ నితిన్ గడ్కరీ వంటి వారెందరో అందుబాటులో ఉన్నారని వ్యాఖ్యానించారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు మహారాష్ట్రలో పెనుదుమారం రేపాయి. -
ఛత్రపతి శివాజీపై వ్యాఖ్యల దుమారం... ఏక్నాథ్ షిండ్‌పై విమర్శలు
ముంబై: ఛత్రపతి శివాజీపై మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. అలాంటి వ్యాఖ్యలు చేస్తుంటే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే అలా ఎలా చూస్తూ... కూర్చొన్నారంటూ శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ మండిపడ్డారు. గవర్నర్ భగత్ సింగ్‌ని తక్షణమే తొలగించాలంటూ డిమాండ్ చేశారు. అసలు షిండే మహారాష్ట్ర బిడ్డేనా? అని నిలదీశారు. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండ్‌ని కూడా రాజీనామ చేయాలంటూ డిమాండ్ చేశారు. గవర్నర్ భగత్ సింగ్ ఈ ఏడాది వ్యవధిలో నాలుగుసార్లు ఛత్రపతి శివాజీని అవమానిస్తూ వ్యాఖ్యలు చేశారన్నారు రౌత్. అయినా మహారాష్ట్ర ప్రభుత్వ మౌనంగానే ఉందంటూ విరుచుకుపడ్డారు. ఆత్మగౌరవ నినాదం ఇచ్చి మరీ శివసేనను విచ్ఛిన్నం చేసి ఉద్ధవ్ ఠాక్రేపై తిరుగుబాటు చేసిన షిండేకు ప్రస్తుతం ఆ ఆత్మగౌరవం ఏమైందంటూ ఎద్దేవా చేశారు. ఇంతకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాలు కూడా శివాజీ మహారాజ్ ఔరంగజేబుకు ఐదు సార్లు క్షమాపణలు చెప్పారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి వ్యాఖ్యలకు మహారాష్ట్రకు క్షమాపణ చెప్పడమే కాకుండా తక్షణమే గవర్నర్‌ని తొలగించాలి అని ఒత్తిడి చేశారు . తాము కాంగ్రెస్ నాయకుడు రాహల్ గాంధీ భారత్ జోడో యాత్రలో భాగంగా వీర సావర్కర్‌పై చేసిన వ్యాఖ్యలను ఖండించి తమ పార్టీ నిరసన తెలిపిందని గుర్తు చేశారు. బీజేపీ బహిరంగంగానే శివాజీ మహారాజ్‌ని పలుమార్లు విమర్మించిందన్నారు. కాబట్టి షిండే రాజీనామ చేయాలని, బీజేపీతో కలిసి ప్రభుత్వంలో కొనసాగకూడదంటూ సీరియస్ అయ్యారు. ఈ మేరకు మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ ఔరంగాబాద్‌లోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మరాఠ్వాడా విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ప్రసంగిస్తూ.... శివాజీ మహారాజ్ పాత విగ్రహాలు అయిపోయాయని, ఇప్పుడూ మీకు బాబాసాహెబ్ అంబేద్కర్ నితిన్ గడ్కరీ వంటి వారెందరో అందుబాటు ఉన్నారని వ్యాఖ్యానించారు. ఉద్ధవ ఠాక్రే వర్గానికి చెందిన వ్యక్తులకు గవర్నర్ చేసిన ఈ వ్యాఖ్యలు మింగుడుపడం లేదు. దీంతో గవర్నర్ గొప్ప గొప్ప వ్యక్తులను అగౌరవపరిచే వ్యక్తి అంటూ పెద్ద ఎత్తున్న విమర్శలు గుప్పించారు. రాహుల్ వీర సావర్కర్‌పై చేసిన వ్యాఖ్యలకు బీజేపీ బూట్లతో దాడి చేస్తోంది. మరీ ఇప్పుడూ గవర్నర్ చేసిన పనికి రాజ్‌భన్‌పైకి చెప్పులతో వెళ్లాలంటూ మండిపడ్డారు. గవర్నర్ వ్యాఖ్యలు ప్రకారం కృష్ణుడు, రాముడు పాత్ర విగ్రహాలు అయిపోయాయి కాబట్టి ఇప్పుడూ మనం కొత్త దేవతలను ఆరాధించాలా అని సంజయ్ రౌత్ ప్రశ్నించారు. అలాగే శివసేన పార్టీ అధికార ప్రతినిధి ఆనంద్ దూబే ఛత్రపతి శివాజీ మహారాజ్ మా ఆరాధ్యదైవం మాత్రమే కాదు, ఎప్పటికీ అందరికి ఆదర్శప్రాయుడని అన్నారు. (చదవండి: రాహుల్ సావర్కర్ వ్యాఖ్యలపై దుమారం.. కాంగ్రెస్‌తో శివసేన తెగదెంపులు?) -
Maharashtra: ‘గవర్నర్ కోటా’తో మళ్లీ ఎరవేస్తారా?
సాక్షి, ముంబై: మహావికాస్ ఆఘాడి ప్రభుత్వం హయాంలో పంపించిన గవర్నర్ నామినేటెడ్ 12 మంది ఎమ్మెల్సీల జాబితాను మహారాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీ సోమవారం రద్దు చేశారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే కార్యాలయానికి రాసిన లేఖలో గవర్నర్ కార్యాలయ వర్గాలు స్పష్టం చేశాయి. దీంతో ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తాజాగా మరో జాబితా గవర్నర్‌కు పంపించాల్సి ఉంటుంది. గవర్నర్ ద్వారా నామినేట్ అయ్యే 12 మంది ఎమ్మెల్సీల పదవులు ఖాళీగా ఉన్నాయి. దీంతో గత మహా వికాస్ ఆఘాడి ప్రభుత్వం 2020 నవంబర్‌లో 12 మంది సభ్యుల పేర్లతో కూడిన జాబితాను ఆమోదం కోసం గవర్నర్‌కు పంపించింది. కాని గవర్నర్ ఈ జాబితాను ఆమోదించకుండా సంవత్సర కాలంపాటు పెండింగులో ఉంచారు. ఆ తరువాత శిందే 50 మంది మద్దతుదారులతో తిరుగుబాటుచేసి శివసేన నుంచి బయటపడ్డారు. అనంతరం బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసింది. దీంతో ప్రభుత్వం మారిపోవడంతో గతంలో మహా వికాస్ ఆఘాడి పంపించిన జాబితా నిరుపయోగంగా మారింది. దీంతో ఈ జాబితాను రద్దు చేయాలంటూ ఇటీవల ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు గవర్నర్‌కు లేఖ రాశాయి. దీనిపై స్పందించిన గవర్నర్ కార్యాలయం ఆఘాడి ప్రభుత్వం పంపించిన జాబితాను రద్దు చేస్తున్నట్లు అధికారికంగా లేఖ రాసింది. దీంతో శిందే వర్గం నుంచి, ఫడ్నవీస్ వర్గం నుంచి ఎంతమందికి ఎమ్మెల్సీ పదవి వరిస్తుందనేది ఆసక్తిగా మారింది. ఇటీవల కొత్తగా ఏర్పడిన బీజేపీ ప్రభుత్వం తాజాగా మళ్లీ 12 మంది ఎమ్మెల్సీల పేర్లతో కూడిన జాబితా రూపొందించి గవర్నర్‌కు పంపించాల్సి ఉంటుంది. అప్పట్లో శిందేతోపాటు శివసేన పార్టీ నుంచి బయటపడిన మద్దతుదారులు ఎమ్మెల్సీ పదవి కోసం ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్పటికే మంత్రివర్గ విస్తరణలో చోటు లభించకపోవడంతో అనేక మంది ఎమ్మెల్యేలు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో త్వరలో రెండో దశ మంత్రివర్గ విస్తరణ ఉంటుందని చెప్పి వారిని సంతృప్తిపరిచే ప్రయత్నం చేశారు. రెండో దశ మంత్రివర్గ విస్తరణకు ముందే గవర్నర్ నామినేటెడ్ 12 మంది ఎమ్మెల్సీల అంశం తెరమీదకు వచ్చింది. దీంతో కనీసం ఎమ్మెల్సీ పదవులు కట్టబెట్టి కొందరినైన సంతృప్తి పరిచే ప్రయత్నం చేస్తుండవచ్చని శిందే వర్గం ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. లేదంటే అసంతృప్తి హద్దులుదాటి శిందే వర్గం నుంచి బయటపడే ప్రమాదం లేకపోలేదు. దీంతో శిందే, ఫడ్నవీస్ వర్గం నుంచి 12 మంది ఎమ్మెల్సీలను నియమించాల్సి ఉంటుంది. ఇందులో శిందే వర్గం నుంచి, ఫడ్నవీస్ వర్గం నుంచి ఎంతమంది ఎమ్మెల్యేలకు అవకాశం లభిస్తుందనేది వేచిచూడాల్సి ఉంటుంది. ఇదిలాఉండగా శీతాకాల అసెంబ్లీ సమావేశాలు డిసెంబర్ 19వ తేదీ నుంచి నాగ్‌పూర్‌లో ప్రారంభం కానున్నాయి. దీంతో ఈ సమావేశాలకు ముందే ఖాళీగా ఉన్న 12 మంది ఎమ్మెల్సీ పదవులను భర్తీ చేసే ప్రయత్నం శిందే, ఫడ్నవీస్ చేయనున్నారు. చదవండి: మహారాష్ట్ర రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్ ప్రభుత్వానివి కుట్ర రాజకీయాలు: ఎన్సీపీ ఎమ్మెల్సీలుగా 12 మంది పేర్లను ప్రతిపాదించాలని గతంలో మహా వికాస్ అఘాడి చేసిన సిఫార్సును ఉపసంహరించుకోవాలని ఏక్నాథ్ శిందే నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఎన్సీపీ సోమవారం తీవ్రంగా విమర్శించింది. గవర్నర్ కోటా కింద మరింత మంది నేతలను అధికార శిబిరంలోకి లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని ఆ పార్టీ ఆరోపించింది. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని గత ప్రభుత్వం రెండేళ్ల క్రితం ఎమ్మెల్సీలుగా నామినేషన్ కోసం 12 మంది పేర్లను సిఫారసు చేసింది,అయితే ఫైల్‌ను గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీ ఆమోదించలేదు. ఎంవీఏ సూచించిన 12 పేర్లలో ప్రముఖంగా కాంగ్రెస్‌ను వీడి శివసేనలో చేరిన నటి ఊర్మిళ మటోండ్కర్ కూడా ఉన్నారు. ఈ సిఫార్సును ఉపసంహరించుకున్నట్లుగా పరిగణించాలని శిందే ప్రభుత్వం గవర్నర్‌కు లేఖ రాసిందని, కొత్త ప్రభుత్వ నిర్ణయాన్ని కోశ్యారీ అంగీకరించారని ఆదివారం ముఖ్యమంత్రి కార్యాలయ అధికారి ఒకరు తెలిపారు. కాగా, తాజాగా నామినేషన్ల జాబితాను త్వరలో అందజేస్తామని శిందే ప్రభుత్వం గవర్నర్‌కు తెలిపింది. ఎన్సీపీ ప్రధాన అధికార ప్రతినిథి మహేష్ తపసే సోమవారం మాట్లాడుతూ, ‘శిందే ప్రభుత్వం యొక్క రాజ్యాంగ చెల్లుబాటు ప్రశ్నార్థకంగా ఉంది. దానిపై సుప్రీంకోర్టు తీర్పు కోసం వేచి ఉంది’ అని గత ఎంవీఏ ప్రభుత్వం సిఫార్సు చేసిన పేర్లను రద్దు చేయాలనే నిర్ణయం విపక్షాలకు చెందిన మరింత మందిని ఆకర్షించడానికి బీజేపీ–శిందే శిబిరంలోని నేతలు ‘క్యారెట్’ అని విమర్శించారు. ఎంవీఏ ప్రభుత్వం గతంలో తీసుకున్న నిర్ణయాలను అధిగమించాలనే ఏకైక ఎజెండాతో శిందే మంత్రివర్గం నడుస్తోంది’ అని తపసే ఆరోపించారు. ఈ చర్యద్వారా మహారాష్ట్రలో ఓటర్ల మనోభావాలు బీజేపీ–శిందే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేగంగా మారుతున్నాయని ఆయన పేర్కొన్నారు. -
మహారాష్ట్ర ప్రజలకు గవర్నర్ కోశ్యారీ క్షమాపణలు
ముంబై: మహారాష్ట్ర ప్రజలకు ఆ రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ క్షమాపణలు చెప్పారు. ఇటీవల ఓ కార్యక్రమం వేదికగా గుజరాతీలు, రాజస్థానీలు లేకుంటే మహారాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగా ఉండదని చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. ఈ క్రమంలో రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పారు గవర్నర్. ఈ మేరకు మరాఠీలో క్షమాపణలు చెబుతూ ట్వీట్ చేశారు. జులై 29న అందేరీలో జరిగిన కార్యక్రమానికి హాజరైన సందర్బంగా.. ‘మహారాష్ట్ర నుంచి ముఖ్యంగా ముంబై, థానేల నుంచి గుజరాతీలు, రాజస్థానీలు వెళ్లిపోతే.. ఇక్కడ డబ్బులే ఉండవు. దేశానికి ఆర్థిక రాజధానిగా ముంబై కొనసాగదు.’అంటూ పేర్కొన్నారు. దీనిపై రాజకీయ దుమారం చెలరేగింది. ఆయనపై శివసేన, కాంగ్రెస్ సహా ఇతర పార్టీలు తీవ్ర విమర్శలు గుప్పించాయి. కష్టపడి పనిచేసే మరాఠీలను అవమానించారని, వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాయి. మరోవైపు.. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ సైతం తప్పుపట్టారు. ఆ వ్యాఖ్యలు గవర్నర్ వ్యక్తిగతమని, దానిని తాము ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. मा. राज्यपालांचे निवेदन pic.twitter.com/3pKWHYgPp8 — Governor of Maharashtra (@maha_governor) August 1, 2022 ఇదీ చదవండి: మహారాష్ట్ర గవర్నర్ వ్యాఖ్యలపై దుమారం.. రాజీనామాకు డిమాండ్! -
ఇంకానయం! దేశానికి దిక్కనలేదు!!
ఇంకానయం! దేశానికి దిక్కనలేదు!! -
గవర్నర్ వివాదాస్పద వ్యాఖ్యలు..స్పందించిన దేవేంద్ర ఫడ్నవీస్
సాక్షి ముంబై: మహారాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీ ముంబై నగరంపై చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని లేపాయి. గుజరాతీ, రాజస్థానీయులు ముంబైని వీడితే ముంబైలో డబ్బులుండవని, దీంతో దేశ ఆర్థిక రాజధానిగా పిలువబడుతున్న ముంబై ఆ గుర్తింపును కోల్పోతుందంటూ భగత్‌సింగ్ కోశ్యారీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై ప్రజల్లో తీవ్ర అక్రోశం వెల్లువెత్తుతోంది. ముఖ్యంగా ఆయన చేసిన వ్యాఖ్యలు మరాఠీ ప్రజలతోపాటు మహారాష్ట్రను అవమానించినట్టేనని, ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలపై రాజకీయ నాయకులతోపాటు అనేక మంది ముంబైకర్లు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడంతోపాటు క్షమాపణకు డిమాండ్ చేస్తున్నారు. మరాఠీ ప్రజల పాత్ర కీలకం: ఫడ్నవీస్ మహారాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీ వ్యాఖ్యలను నేను సమర్థించలేనని ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పేర్కొన్నారు మహారాష్ట్ర అభివృద్ధిలో మరాఠీ ప్రజల పాత్ర కీలకమైనదని, దీన్ని ఎవరు కాదనలేరన్నారు. వ్యాపార రంగంలో కూడా ప్రపంచవ్యాప్తంగా మరాఠీ ప్రజల కీర్తిప్రతిష్టలున్నాయి. రాష్ట్ర అభివృద్ధిలో వేర్వేరు రాష్ట్రాల ప్రజలుకూడా సహకరించారని, కానీ మరాఠీ ప్రజల సహకారమే అత్యధికమైందన్నారు. ఈ విషయం నాకు తెలిసి గవర్నర్‌కు కూడా తెలుసని, ఆయన ఏ సందర్బంలో మాట్లాడారో స్వయంగా గవర్నరే స్పష్టం చేయాలని ఫడ్నవీస్ పేర్కొన్నారు. చదవండి: గవర్నర్ వ్యాఖ్యలు వ్యక్తిగతం, మేము సమర్థించం: సీఎం ఏక్నాథ్ షిండే గవర్నర్ క్షమాపణ చెప్పాలి: నానా పటోలే మహారాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీ మరాఠీ ప్ర జలకు క్షమాపణలు చెప్పాలని మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు నానా పటోలే డిమాండ్ చేశారు. భగత్‌సింగ్ కోశ్యారీ చేసిన వ్యాఖ్యలు మరాఠీ ప్రజలను అవమానపరిచేలా ఉన్నాయన్నారు. దీంతో ఆయన వెంటనే మరాఠీ ప్రజలకు క్షమాపణలు చెప్పాలన్నా రు. అదేవిధంగా గుజరాతీ, రాజస్థాన్ ప్రజల కారణంగా ముంబై, మహారాష్ట్రకు పేరు రాలేదని ముంబై, మహారాష్ట్ర వారిని పెంచిపోషించిందన్నారు. అదేవిధంగా అదానీ, అంబానీలకు కూడా పేరు ప్రతిష్టలు ముంబై, మహారాష్ట్ర ఇచ్చిందన్నారు. కానీ ఆయన ఈ విధంగా ఛత్రపతి శివాజీ మహరాజ్, మహారాష్ట్రను తన వ్యాఖ్యల ద్వారా అవమానించా రని దీనిపై ఆయన వెంటనే తన మాటలను వెనక్కి తీసుకుంటూ క్షమాపణలు కోరాలన్నారు. అదేవిధంగా బీజేపీ ఆయనను వెంటనే మహారాష్ట్ర నుంచి రీకాల్ చేయాలని డిమాండ్ చేశారు.