Bhumana karunakarreddy
-
‘గుండె మంటల్లో బాబు చలికాచుకుంటాడు’
-
‘గుండె మంటల్లో బాబు చలికాచుకుంటాడు’
సాక్షి, పలాస/శ్రీకాకుళం : టిట్లీ తుపాను కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతోంటే సమీక్షల పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు సహాయక చర్యలను ఆలస్యం చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి మండిపడ్డారు. సర్వం కోల్పోయిన ప్రజలు గుండెలు మండుతోంటే ఆ మంటల్లో కూడా చంద్రబాబు చలికాచుకుంటాడని విమర్శలు గుప్పించారు. తుపానుతో అల్లాడిపోయిన తమను ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని పేర్కొంటూ జల్లాలోని ఉద్ధానం, కొత్తూరు జంక్షన్, పాతపట్నం, పలాసలో ప్రజలు ఆందోళనకు దిగారు. రోడ్లపై నిరసనలు, ధర్నాలు చేశారు. పలాసలోని సున్నాదేవి సెంటర్లో జరిగిన నిరసనలో భూమన పాల్గొన్నారు. మూడు రోజులుగా అంధకారంలో మగ్గుతున్న ప్రజలకు కనీస సదుపాయలు కూడా కల్పించకపోవడం దారుణమని ఆయన నిప్పులు చెరిగారు. తుపాను బాధితులకు సాయం చేస్తామనే చంద్రబాబు ప్రకటనలు ఆయన చేసిన ఎన్నికల వాగ్దానాల తీరుగానే ఉన్నాయని ఎద్దేవా చేశారు. టిట్లీ తుపాను వచ్చిపోయిన మూడు రోజుల తర్వాత కూడా అధికారులు ప్రజలకు అందుబాటులో లేకపోవడంపై భూమనల ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు రోడ్లపైకి వచ్చి ధర్నాలు, ఆందోళనలకు దిగుతున్నారనీ, ఇది ముమ్మాటికీ చంద్రబాబు ప్రభుత్వ ప్రభుత్వ వైఫల్యేమేనన్నారు. బాబు టెక్నాలజీ ఏమైంది? బాధిత కుటుంబాలను ఆదోకోవడంలో కూడా చంద్రబాబు స్వలాభం చూసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ప్రతిదీ ఎన్నికల దృష్టితో ఆలోచించే ముఖ్యమంత్రి అధికారుల సేవలు వినియోగించుకోవడం లేదని విమర్శించారు. అధికారులు పంటనష్టం అంచనాలు వేయకపోవడంతో రైతులు తీవ్ర వేదనకు గురవుతున్నారని అన్నారు. టెక్నాలజీ వాడుకోవడంలో నేనే నెంబర్‌వన్ అని చెప్పుకునే బాబు మూడు రోజులు గడిచినా విద్యుత్ పునరుద్ధరణకై చర్యలు తీసుకోకపోవడం పట్ల నిరసన వ్యక్తం చేశారు. ఈ విషయంలో చంద్రబాబు టెక్నాలజీని వాడుకున్నట్టా? అని ప్రశ్నించారు.కాగా, పలాస-మందస హైవేపై రైతుల దర్నాతో వందలాది వాహనాలు నిలచిపోయాయి. ‘ప్రభుత్వం తీరు చూస్తుంటే.. తిండికోసం రాయలసీమలో గతంలో జరిగిన కరవుదాడులు గుర్తుకొస్తున్నాయి. ప్రజల ఆకలి తీర్చని రోజున రోడ్లపై నిలిచిన వాహనాలపై దాడులు చేసి మరీ ఆహారాన్ని తీసుకునే పరిస్థితి తలెత్తవచ్చు’ అని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా... కొత్తూరు జంక్షన్ వద్ద ఉద్రిక్తత తలెత్తింది. తహసీల్దారును గ్రామస్తులు నిర్భందించారు. తమను పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
జగన్‌ను తిట్టడమే పనిగా పెట్టుకున్న బాబు
* మండిపడిన వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి భూమన * ఏబీకేను ఉన్మాది అనడం చంద్రబాబు దురహంకారం సాక్షి, హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం ఏ పథకాన్ని అమలు చేయకపోయినా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని తిట్టడమే పనిగా పెట్టుకున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి మండిపడ్డారు. ఆయన ఆదివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పవిత్ర పుష్కరాలను కూడా జగన్‌ను దూషించడానికి చంద్రబాబు వాడుకోవడం శోచనీయమన్నారు. అమరావతిలో ప్రభుత్వం చేస్తున్న ఆగడాలపై బాధ్యత గలిగిన వ్యక్తిగా ప్రముఖ పాత్రికేయుడు ఏబీకే ప్రసాద్ సుప్రీంకోర్టుకు వెళితే ఆయన్ను ఉన్మాది అని, ఆయన వెనుక జగన్ కూడా ఉన్నారని విమర్శలు చేయడం పట్ల ఆయన తీవ్ర అభ్యంతరం తెలిపారు. తెలుగునాట ఉన్న ప్రముఖ పత్రికలన్నింటికీ ప్రధాన సంపాదకుడుగా వ్యవహరించిన ఏబీకేనుద్దేశించి ఇలా వ్యాఖ్యానించిన చంద్రబాబు కన్నా దురహంకారి మరెవ్వరూ ఉండరని దుయ్యబట్టారు. మతి స్థిమితం ఉన్నవారెవ్వరూ ఇలా మాట్లాడరని, చంద్రబాబు మానసిక పరిస్థితి చాలా దిగజారినట్లు ఆయన వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోందని ఎద్దేవా చేశారు. కోర్టులకు కాక రౌడీల వద్దకు వెళ్లాలా?: అమరావతి రైతులకు జరిగిన అన్యాయాలపై అసెంబ్లీలో మాట్లాడబోతే ప్రతిపక్షం గొంతు నొక్కారనీ, ప్రజా ఉద్యమాలు చేయబోతే లాఠీలతో కొట్టించారనీ ఇక న్యాయం కోసం కోర్టులకు కాక రౌడీలు, గూండాల వద్దకు వెళ్లాలా? అని భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అన్ని వ్యవస్థలనూ ప్రభావితం చేస్తూంటే బాధితుల తరపున న్యాయస్థానాన్ని ఆశ్రయించడం తప్పవుతుందా? అని ప్రశ్నించారు. బాబు అన్నట్లుగా ఏబీకేకు సుప్రీం అక్షింతలు వేయలేదని... మీరు బాధితులు కారు కనుక బాధితులైన రైతులు ఎవరైనా సుప్రీంకోర్టుకు వస్తే ఆలోచిస్తామని మాత్రమే చెప్పిందని పేర్కొన్నారు. -
'నయీంను పుట్టించిందే చంద్రబాబు'
-
'బాబూ.. దమ్ముంటే పదవులు వదిలి పోరాడాలి'
తిరుపతి: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి ఓటుకు కోట్లు కేసు భయం పట్టుకుందని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. ఆ భయం వల్లే చంద్రబాబు కేంద్రంపై ప్రత్యేక హోదా విషయంలో ఒత్తిడి తీసుకురాలేకపోతున్నారని ఆరోపించారు. తరుచూ ఢిల్లీకి వెళుతున్న బాబు ప్రత్యేక హోదాపై మాత్రం ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. వైఎస్ జగన్‌పై టీడీపీ మంత్రులు విమర్శలు చేయడం సిగ్గుచేటని అన్నారు. ప్రత్యేక హోదా కోసం ప్రాణాలు కూడా లెక్కచేయకుండా ఉద్యమిస్తున్న జగన్‌పై చేతిగాని తనం వల్లే నిందలు వేస్తున్నారని చెప్పారు. దమ్ముంటే కేంద్రంలో మంత్రి పదవులు వదిలి ప్రత్యేక హోదాపై పోరాడాలని సవాల్ విసిరారు. -
చంపడమే లక్ష్యమా?
తాడిపత్రి రూరల్ : రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక టీడీపీ నేతలు ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలను అమలు చేయడం పక్కకు పెట్టి, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేస్తూ అంతమొందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి విమర్శించారు. తాడిపత్రి మండలం వీరాపురం గ్రామంలో శనివారం టీడీపీ నేతల దాడిలో గాయపడిన నారాయణ, సుబ్బమ్మ, వెంకట్రాముడు, పుల్లారెడ్డి, కర్రెప్ప, వినోద్‌కుమార్‌ల కుటుంబ సభ్యులను మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంతవెంకటరామిరెడ్డి, ఉరవకొండ ఎమ్మెలే విశ్వేశ్వరరెడ్డి, జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ, నియోజకవర్గం సమన్వయకర్తలు వీఆర్ రామిరెడ్డి, రమేష్‌రెడ్డిలతో కలిసి ఆయన పరామర్శించారు. దాడికి గురైన వారి ఇళ్ల వద్దకు వెళ్లి వారిని ఓదార్చారు. అంతకు ముందు వైఎస్సార్సీపీ నాయకులు వీరాపురం సుంకిరెడ్డి, అనిల్ కుమార్ రెడ్డి, వంశీవర్ధన్‌రెడ్డి, హారీష్రెడ్డిలను కలసి సంఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. జేసీ దివాకర్ రెడ్డి వద్ద 30 సంవత్సరాలుగా ఉన్న తాము ఇటీవల ఎన్నికల సమయంలో వైఎస్సార్సీపీలోకి రావడంతో వారు కక్ష్యకట్టారన్నారు. వారి ప్రోద్బలంతోనే టీడీపీ నాయకులు తమను హత్య చేసేందుకు ఇళ్లపైకి వచ్చారని వారు వివరించారు. అడ్డు వచ్చిన ఆరు మందిపై విచక్షణా రహితంగా దాడి చేయడంతో వారు ఇప్పుడు కోలుకోలేని విధంగా కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. పార్టీ అధినేత తమను పంపిచారని మీరు భయపడాల్సిన పనిలేదని, పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని సుంకిరెడ్డి కుంటుంబ సభ్యులకు కరుణాకర్‌రెడ్డి, వై.ఎస్.వివేకానందరెడ్డి భరోసా ఇచ్చారు. దాడికి గురైన వారి తరుఫున న్యాయ పోరాటం చేస్తామని ధైర్యం చెప్పారు. సంఘటన చోటుచేసుకున్న ప్రాంతాన్ని వారు పరిశీలించారు. ఈ సందర్భంగా వైఎస్ వివేకానంద రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో పార్టీ మారారని కక్షగట్టి దాడి చేయడం సబబు కాదన్నారు. ఇలాంటి దాడులకు వైఎస్ఆర్సీపీ బెదరదని చెప్పారు. మడకశిర నియోజకవర్గం సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామి మాట్లాడుతూ.. పెద్ద మాదిగగా అండగా ఉంటానని చెప్పిన చంద్రబాబు ఇపుడేం చెబుతారని ప్రశ్నించారు. ఈ దాడిపై కేంద్ర ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. మానవ హక్కుల కమిషన్ సుమోటోగా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామంలో పర్యటించిన పార్టీ నేతల్లో వై.వెంకట్రామిరెడ్డి, సాంబశివారెడ్డి, తిప్పేస్వామి, సోమశేఖర్‌రెడ్డి, నవీన్‌నిశ్చల్, ఎర్రిస్వామిరెడ్డి, చావ్వా రాజశేఖర్‌రెడ్డి, బోరంపల్లి అంజనేయులు, మీసాల రంగన్న, కోర్రపాడు హేసేన్పీరా, పామిడి వీరాంజినేయులు, అలమూరు శ్రీనివాసులరెడ్డి, సూర్యనారాయణరెడ్డి, రవీంద్రారెడ్డి, పాశం రంగస్వామి యాదవ్, కంచం రామ్మోహన్‌రెడ్డి, వి.ఆర్.వెంకటేశ్వరరెడ్డి, వి.ఆర్.విఘ్నేశ్వర్‌రెడ్డి, అలూరు రామచంద్రారెడ్డి, దీలిప్రెడ్డి, మున్నా, రంగనాథ్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, వెంకట్రామిరెడ్డి హరినాథ రెడ్డి, తేజ, బోంబాయి రమేష్‌నాయుడు, రఘునాథ్‌రెడ్డి, పురుషోత్తం రెడ్డి, కందిగోపుల మురళి ప్రసాద్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, సంపత్, శ్రీకాంత్‌రెడ్డి, రామమునిరెడ్డి ఉన్నారు.