Bicycle symbol
-
ఢిల్లీలో తిష్ట వేసిన రజనీకాంత్..
నటుడు రజనీకాంత్ పార్టీ స్థాపన పనుల్లో భాగంగా మక్కల్ మన్రం పెద్దలు ఢిల్లీలో తిష్టవేశారు. ప్రధాన ఎన్నికల కమిషన్ కార్యాలయంలో శుక్రవారం పార్టీ పేరును నమోదు చేసినట్లు సమాచారం. సాక్షి, చెన్నై : రాజకీయాల్లోకి రావడం ఖాయమని రజనీకాంత్ 2017 డిసెంబర్లో చెప్పారు. ఈ డిసెంబర్ 31న పార్టీ స్థాపనపై కీలక ప్రకటన చేస్తానని ఇటీవల స్పష్టం చేశారు. వచ్చే ఏడాది జనవరిలో పార్టీ స్థాపన, ఏప్రిల్ లేదా మేలో వచ్చే అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ ఖాయమని అందరూ భావిస్తున్నారు. పార్టీ స్థాపనపై మక్కల్ మన్రం నిర్వాహకులతో రజనీకాంత్ చెన్నైలోని తన ఇంటి వద్ద శుక్రవారం మరోసారి సమాలోచనలు జరిపారు. ప్రధాన సమన్వయకర్త అర్జున్‌మూర్తి, పర్యవేక్షకులు తమిళరువి మణియన్, మక్కల్ మన్రం రాష్ట్ర నిర్వాహకులు సుధాకర్, మన్రం మాజీ అధ్యక్షులు సత్యనారాయణన్ పాల్గొన్నారు. పార్టీ పేరును రిజిస్టర్ చేయడంలో ఢిల్లీలోని ప్రధాన ఎన్నికల కమిషన్ కార్యాలయం వద్ద మక్కల్ మన్రం అగ్రనేతలు శుక్రవారం బిజీబిజీగా గడుపుతున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి న్యాయవాదుల నుంచి సలహా లు స్వీకరిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ పేరు, పతాకం, చిహ్నంపై రజనీ ఒక నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. మూడు పేర్లను సీఈసీ వద్ద నమోదు చేస్తే అందులో ఏదో ఒకదాన్ని అధికారులు ఆమోదిస్తా రు. ఈ ప్రక్రియ నెలాఖరుకు పూర్తయితే 31న పార్టీ పేరును రజనీ అధికారికంగా ప్రకటిస్తారని అంచనా. నేడు రజనీ జన్మదినం.. ఈనెలాఖరులో పార్టీని ప్రకటించబోతున్న తరుణంలో శనివారం నాటి రజనీకాంత్ 71వ జన్మదినోత్సవాలు ప్రత్యేకతను సంతరించుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అనేక కార్యక్రమాలతో అభిమానులు సందడి చేయనున్నారు. రజనీకాంత్‌కు సంపూర్ణ ఆరోగ్యం చేకూరాలని, ఎన్నికల్లో ఘనవిజయం సా«ధించాలని ప్రార్థిస్తూ మక్కల్ మన్రం నిర్వాహకులు ఎన్నూరులోని శ్రీ అంకాళ పరమేశ్వరీ ఆలయంలో శుక్రవారం ప్రత్యేక యాగాన్ని నిర్వహించారు. మక్కల్ మన్రం చెన్నై పశ్చిమం శాఖ తరఫున జిల్లా కార్యదర్శి ఆర్ రవిచంద్రన్ వెస్ట్‌మాంబళంలోని శంకరమఠంలో శుక్రవారం సాయంత్రం గోపూజ జరిపారు. అశోక్‌నగర్‌లోని ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక అభిషేకం, మహిళా విభాగం అధ్వర్యంలో రంగరాజపురంలో సంక్షేమ కార్యక్రమాలు, సైదాపేటలో అన్నదానం శనివారం నిర్వహిస్తారు. కాంగ్రెస్ ఎంపీ ఎద్దేవా.. పార్టీని స్థాపించి సినిమా షూటింగులకు వెళ్లే ఒకే ఒక రాజకీయనేత దేశమొత్తం మీద రజనీ మాత్రమేనని అంటూ కాంగ్రెస్ ఎంపీ జ్యోతిమణి ఎద్దేవా చేశారు. పార్టీ రాజకీయాలను ఎవరైనా ఎంతో సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజాక్షేత్రంలోకి దిగి పాటుపడాల్సి ఉంటుంది. అయితే పార్టీని స్థాపించిన తరువాత “అన్నాత్త’ అనే చిత్రం షూటింగ్ కోసం 40 రోజులపాటు రజనీ వెళ్లిపోతున్నట్లు వెలువడిన సమాచారం విచిత్రంగా ఉందని ఆమె అన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
రజనీ పార్టీ చిహ్నంగా సైకిల్ గుర్తు!?
సాక్షి, చెన్నై: తలైవా రజనీకాంత్ రాజకీయ పయనంలో సైకిల్ చిహ్నం కీలకం కానుంది. ఈ చిహ్నం ఆయనకు దక్కేనా అన్నది పక్కన పెడితే, అన్నామలై చిత్రం గెటప్‌ను తలపించే విధంగా సైకిల్, పాల క్యాన్‌తో రజనీ స్టైల్‌ను రాజకీయ చిహ్నంగా ఎంపిక చేయడానికి నిర్ణయించినట్టు తెలిసింది. మూడు వర్ణాలతో పార్టీ జెండా సిద్ధం అవుతోంది. తమ్ముడి కోసం అన్నయ్య సత్యనారాయణ తిరువణ్ణామలైలో గురువారం యాగాది పూజలు నిర్వహించారు. రజనీకాంత్ రాజకీయ ప్రకటన సమయం ఆసన్నం అవుతోంది. ఇందుకు 20 రోజులు మాత్రమే సమయం ఉంది. దీంతో పార్టీ పేరు, చిహ్నం, జెండా విషయంగా సుదీర్ఘంగా సమాలోచన సాగునుంది. గురువారం పార్టీ ముఖ్యులు అర్జున్‌మూర్తి, తమిళరివి మణియన్ మక్కల్ మండ్రం జిల్లాల కార్యదర్శులతో భేటీ అయ్యారు. గంటల తరబడి ఈ భేటీ సాగడంతో ప్రాధాన్యత పెరిగింది. పార్టీ పేరును అత్యంత రహ్యంగా ఉంచేందుకు నిర్ణయించినా, చిహ్నం, జెండా విషయంగా లీకులు బయటకు వచ్చాయి. ప్రజల్ని ఆకర్షించే రీతిలో మూడు వర్ణాలతో రజనీ పార్టీ జెండా రూపుదిద్దుకోబోతోంది. ఆయా వర్ణాలతో జెండా రూపురేఖల నమూనా సిద్ధం చేసి, రజనీ వద్దకు తీసుకెళ్లేందుకు సమావేశంలో నిర్ణయించినట్టు సమాచారం. చదవండి: (రజనీ వెనుక కాషాయం!) పార్టీ చిహ్నంగా సైకిల్‌ను ఎంచుకునేందుకు సిద్ధమైనట్టు చర్చ. సైకిల్ చిహ్నం విషయంగా ఏదేని అభ్యంతరాలు, వివాదాలు తలెత్తే అవకాశాలు ఉండవచ్చన్న భావనతో అందుకు కొన్ని మెరుగులుదిద్దారు. రజనీ నటించిన అన్నామలై చిత్రంలో సైకిల్, పాల క్యాన్ గెటప్ అభిమానుల్ని అలరించింది. ప్రస్తుతం ఇదే ఆ పార్టీకి చిహ్నంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. సైకిల్, పాలక్యాన్‌తో రజనీ గెటప్ తరహాలో చిహ్నంపై దృష్టిపెట్టినట్టు తెలిసింది. మక్కల్ మండ్రం నిర్వాహకులు జెండా, చిహ్నం విషయంగా తమ అంగీకారం తెలిపినా, తుది నిర్ణయం రజనీకాంత్ తీసుకోవాల్సి ఉందని ఆ మండ్రం నిర్వాహకులు పేర్కొంటున్నారు. అన్నయ్య పూజలు.. రజనీకాంత్ సోదరుడు సత్యనారాయణ గురువారం తిరువణ్ణామలైకు వెళ్లారు. అయ్యన్ కోనేరు ఒడ్డున ఉన్న అరుణ గిరినాథర్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. యాగం, హోమాది పూజలు నిర్వహించినానంతరం మీడియాతో సత్యనారాయణ మాట్లాడారు. రజనీకాంత్ 31వ తేదీ రాజకీయ పార్టీ ప్రకటన చేయడం ఖాయం అని ధీమా వ్యక్తంచేశారు. ఆయన పార్టీలోకి ముఖ్యులు రాబోతున్నారని తెలిపారు. తిరువణ్ణామలైలో రజనీ పోటీ చేయాలని ఆనందమేనని, అది దేవుడి చేతిలో ఉందన్నారు. ఆథ్యాత్మికతను నమ్మని ద్రవిడ పార్టీలకు చివరి గడియలు సమీపిస్తున్నాయని ధీమా వ్యక్తం చేశారు. -
అఖిలేశ్‌కే ‘సైకిల్’
సమాజ్‌వాదీ పేరు, సైకిల్ గుర్తు సీఎం వర్గానికే కేటాయిస్తూ ఈసీ నిర్ణయం • ములాయంకు భంగపాటు • సరైన నిర్ణయం, త్వరలో పొత్తు అవకాశం: రాంగోపాల్ • అఖిలేశ్ ముస్లిం వ్యతిరేకి.. తీరు మార్చుకోకుంటే కొడుకుపై పోటీకి సిద్ధం: ములాయం న్యూఢిల్లీ, లక్నో: సమాజ్‌వాదీ పార్టీలో తండ్రీ కొడుకుల సమరంలో చివరికి తనయుడే పైచేయి సాధించాడు. సమాజ్‌వాదీ పార్టీ పేరు, గుర్తు కోసం ములాయంసింగ్, అఖిలేశ్‌ల మధ్య సాగుతున్న పోరుకు సోమవారం రాత్రి కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) ముగింపు పలికింది. అఖిలేశ్ వర్గానికే సైకిల్ గుర్తు, పార్టీ పేరును ఖరారు చేస్తూ సీఈసీ కీలక నిర్ణయం తీసుకోవడంతో ములాయం వర్గానికి భంగపాటు ఎదురైంది. ఎన్నికల సంఘం తీర్పు వెలువడిన వెంట నే తండ్రి ఆశీర్వాదం కోసం సీఎంఅఖిలేశ్.. ములాయం ఇంటికి వెళ్లగా, ఈ పోరు ఇంతటితో ఆగదని ఈసీ నిర్ణయంపై కోర్టును ఆశ్రయిస్తానంటూ ములాయం స్పష్టం చేశారు. తమకే పార్టీ గుర్తు, పేరు చెందాలంటూ ములాయం, అఖిలేశ్ వర్గాలు ఈసీ ముందు పంచాయితీ పెట్టడంతో నిర్ణయంపై కొద్ది రోజులుగా ఉత్కంఠ నెలకొంది. సైకిల్ గుర్తు ఇరు వర్గాలకు కేటాయించకుండా చెరో కొత్త గుర్తును కేటాయిస్తారంటూ ప్రచారంసాగింది. జనవరి 17 నుంచి ఉత్తరప్రదేశ్ మొదటివిడత ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండడంతో సోమవారం ఏదొ ఒక నిర్ణయం రావచ్చని అంతా ఆసక్తిగా ఎదురుచూశారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ నదీం జైదీ నేతృత్వంలోసోమవారం సమావేశమైన ఈసీ బృందం... అఖిలేశ్ వర్గానికి సమాజ్‌వాదీ పేరును వాడుకునేందుకు అనుమతించడంతో పాటు, సైకిల్ గుర్తును రిజర్వ్ చేస్తూ తీర్పునిచ్చింది. అఖిలేశ్‌దే అసలైన సమాజ్‌వాదీ: ఈసీ ‘అఖిలేశ్ నేతృత్వంలోని గ్రూపును సమాజ్‌వాదీ పార్టీగా గుర్తిస్తున్నాం. పార్టీ పేరును వాడుకునేందుకు అఖిలేశ్ వర్గానికే అర్హత ఉంది. ఎన్నికల గుర్తుగా వాడుకునేందుకు సైకిల్ గుర్తును రిజర్వ్ చేస్తున్నాం’ అంటూ ఎన్నికల సంఘం తన ఉత్తర్వుల్లోపేర్కొంది. అఖిలేశ్ వర్గం 228 మంది ఎమ్మెల్యేలకు గాను 205 మంది అఫిడవిట్లు, 68 మంది ఎమ్మెల్సీలకు 56, 24 మంది ఎంపీలకుగాను 15, 46 మంది జాతీయ కార్యవర్గ సభ్యులకుగాను 28 మంది, 5,731 జాతీయ కన్వెన్షన్ ప్రతినిధులకు గాను4,400 మంది అఫిడవిట్లు సమర్పించినట్లు ఈసీ తెలిపింది. ములాయం వైపు నుంచి ఎలాంటి అఫిడవిట్లు రాలేదంది.అఖిలేశ్ నివాసం వద్ద సంబరాలుఈసీ తీర్పుపై పార్టీ ప్రధాన కార్యదర్శి రాంగోపాల్‌యాదవ్ స్పందిస్తూ... ‘పార్టీ గుర్తు, పేరును దక్కించుకునేందుకు ములాయం వర్గం వద్ద ఎలాంటి సరైన ఆధారాలు లేవు. ఈ నిర్ణయంతో ముఖ్యమంత్రి చాలా సంతోషంగా ఉన్నారు’ అని చెప్పారు.యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు అవకాశాలపై స్పందిస్తూ.. పార్టీ అధ్యక్షుడు ఆ విషయాన్ని నిర్ణయిస్తారని, త్వరలో పొత్తు కుదరవచ్చంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. తీర్పు అనంతరం లక్నోలోని 5– కాళిదాస్ మార్గ్‌లో ఉన్న సీఎం నివాసం వద్దకార్యకర్తలు, నేతలు సంబరాలు చేసుకున్నారు. వందలాది మంది మద్దతుదారులు అఖిలేశ్ నివాసానికి చేరుకుని బాణసంచా పేలుస్తూ.. నృత్యాలు చేశారు. మరోవైపు, ములాయం వర్గం మాత్రం ఎటూ తేల్చుకోలేక సందిగ్ధంలో పడింది. సోమవారం ములాయంను కలిశాక అఖిలేశ్ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసిన ఫొటో మొదటి నుంచి పోటాపోటీగా... జనవరి 1న అఖిలేశ్‌ను పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నియమిస్తూ లక్నోలో నిర్వహించిన జాతీయ సమావేశం నిర్ణయం తీసుకుంది. ములాయం సోదరుడు శివపాల్‌ను రాష్ట్ర అధ్యక్షుడిగా నుంచి తొలగించడంతోపాటు అమర్‌సింగ్‌ను పార్టీ నుంచిబహిష్కరించారు. దీటుగా స్పందించిన ములాయం.. తానే ఎస్పీ జాతీయాధ్యక్షుడినంటూ..రాంగోపాల్ యాదవ్‌ను బహిష్కరిస్తున్నట్లుగా ప్రకటించారు. అఖిలేశ్ కీలుబొమ్మ: ములాయంముస్లిం ఓటు బ్యాంకు చేజారకుండా ఉండేందుకు కొడుకు అఖిలేశ్‌పై ములాయంసింగ్‌యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు. ముస్లింల పట్ల అఖిలేశ్‌కు వ్యతిరేక అభిప్రాయం ఉందని, ఆ ధోరణి మార్చుకోకపోతే... తన కొడుకుపై పోటీ చేస్తానని చెప్పిపార్టీ కార్యకర్తల్ని ఒక్కసారిగా షాక్‌కు గురిచేశారు. లక్నోలోని సమాజ్‌వాదీ పార్టీ ప్రధాన కార్యాలయంలో కార్యకర్తల్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ‘ముస్లిం వర్గానికి చెందిన వ్యక్తిని రాష్ట్రానికి డీజీపీగా నియమించాలని చెప్పడంతో అఖిలేశ్ 15 రోజులునాతో మాట్లాడలేదు. డీజీపీ పదవిని ముస్లిం చేపట్టడం అతనికి ఇష్టం లేదు. రాంగోపాల్ యాదవ్ చేతుల్లో కీలుబొమ్మగా మారిపోయాడు. రాంగోపాల్ బీజేపీ ఆదేశాల మేరకు పనిచేస్తున్నాడు. నేను ముస్లింల కోసమే బతుకుతా.. వారి కోసమేమరణిస్తా. ముస్లిం ప్రయోజనాల కోసం కొడుకుతో పోరుకైనా సిద్ధం’ అని ములాయం అన్నారు. పార్టీ దాదాపుగా చీలిపోయిందని అంగీకరిస్తూ... చీలికను అడ్డుకోవడంతో తాను నిస్సహాయుడినని చెప్పారు. సైకిల్ గుర్తు, పార్టీ పేరు కేటాయింపులో ఈసీతనకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే కోర్టును ఆశ్రయిస్తానన్నారు. ‘పార్టీ అభివృద్ధికి నేను ఎన్నో త్యాగాలు చేశాను. అఖిలేశ్ నా మాట వినకుండా అనేక మంది మంత్రుల్ని తొలగించాడు. కారణాల్లేకుండా సీనియర్ మంత్రుల్ని తప్పించాడు.రాంగోపాల్ చేతుల్లో పావుగా మారి నా కొడుకు తిరుగుబాటు చేస్తే నేనేం చేయగలను’ అంటూ ఉద్వేగంగా ప్రసంగించారు. అఖిలేశ్ తనకు వ్యతిరేకంగా మారాడని, ఇలా చేస్తాడని ఊహించలేదన్నారు. మహాకూటమి ఏర్పాటుకు యత్నాలు బీజేపీ అధికారంలోకి రాకుండా కాంగ్రెస్‌తో కలసి మహా కూటమి ఏర్పాటుకు అఖి లేశ్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఎన్నికల గుర్తుపై అడ్డంకులు తొలగిపోవడంతో కాంగ్రెస్, రాష్ట్రీయ లోక్‌దళ్, ఎన్సీపీలతో పొత్తును రెండు, మూడు రోజుల్లో ఖరారుచేసేందుకు అఖిలేశ్ వర్గం ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో అఖిలేశ్ చర్చలు జరపనున్నట్లు సమాచారం. 100 సీట్లలో పోటీకి కాంగ్రెస్ పట్టుబడుతుండగా, రాష్ట్రీయ లోక్‌దళ్‌కు 25–30 సీట్లు కేటాయించాలని ఎస్పీ అవగాహనకువచ్చినట్లు తెలుస్తోంది. ఎన్సీపీ 25 సీట్లను డిమాండ్ చేయవచ్చని భావిస్తున్నారు. -
సైకిల్ గుర్తు రిజర్వ్!
• ఎస్పీ గుర్తుపై ఇరువర్గాల వాదలను విన్న ఈసీ • వీలైనంత త్వరలో నిర్ణయం వెలువరుస్తామని ప్రకటన సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తర ప్రదేశ్‌లోని అధికార సమాజ్‌వాదీ పార్టీ గుర్తు (సైకిల్)పై రేగిన వివాదంలో తమ నిర్ణయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం రిజర్వ్ చేసింది. యూపీ శాసనసభ ఎన్నికలకు జనవరి 17 నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభమవుతున్న తరుణంలో గుర్తుపై శుక్రవారం తేలుతుందని భావించినా.. ఫలితం కోసం వేచిచూడక తప్పలేదు. పార్టీ పేరు, ఎన్నికల గుర్తు సైకిల్‌పై దాదాపుగా 5 గంటలసేపు ములాయం వర్గం, అఖిలేష్ వర్గాల వాదనలను విన్న ఈసీ.. తమ నిర్ణయాన్ని సాధ్యమైనంత త్వరగా వెలువరుస్తామని స్పష్టం చేసింది. ములాయం తరపున శివ్‌పాల్, అమర్‌సింగ్.. అఖిలేశ్ వర్గం తరపున రాంగోపాల్ యాదవ్, నరేశ్ అగర్వాల్ ఈసీ ముందు హాజరయ్యారు. మాదంటే మాదే! కేంద్ర ఎన్నికల సంఘం ముందు యూపీ సీఎం అఖిలేశ్ తరపున కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్, రాజేశ్ ధవన్ వాదనలను వినిపించారు. అటు ములాయం వర్గం కూడా గుర్తు తమకే ఇవ్వాలని కోరింది. ఇరు వర్గాల వాదనలు విన్న ఎన్నికల సంఘం ఆదేశాలను రిజర్వ్ చేసింది. ఇరువర్గాలు సమర్పించిన వివరాల ప్రకారం ఏ గ్రూపునకు మెజారిటీ ఉందో తేల్చిన తర్వాతే గుర్తుపై ఈసీ స్పష్టత నిస్తుంది. సదరు వర్గానికి ఎన్నికల గుర్తును కేటాయించే విషయం పరిశీలనకు వస్తుంది. గుర్తు స్తంభింపజేసే ఆప్షన్ ఈసీ ముందున్నది నిపుణులంటున్నారు. గుర్తు తమకే దక్కుతుందని అఖిలేశ్ వర్గం ధీమాగా ఉంది. త్వరలోనే తమ వర్గం అభ్యర్థుల జాబితా ప్రకటిస్తామని తెలిపింది. అటు, అఖిలేశ్ వర్గంతో కూటమికట్టే విషయాన్ని కాంగ్రెస్ ఖండించలేదు. పరిస్థితులకు అనుగుణంగా ఎటువంటి నిర్ణయాలైనా వెలువడొచ్చని కాంగ్రెస్ తెలిపింది. -
కాంగ్రెస్ కు సైకిల్ దక్కేనా?
సాక్షి, చెన్నై: తమకు మళ్లీ సైకిల్ చిహ్నం దక్కేనా అన్న ఆశాభావంతో తమిళ మానిల కాంగ్రెస్ వర్గాలు ఎదురు చూపుల్లో పడ్డారు. సీటు కోసం నాలుగు వేల మందికి పైగా ఆశావహులు దరఖాస్తులు చేసుకున్నారు.రాష్ట్ర కాంగ్రెస్‌లో ఒకప్పుడు అగ్ర నేతగా జీకేమూపనార్ తన సత్తాను చాటిన విషయం తెలిసిందే. ఆ పార్టీతో ఏర్పడ్డ విభేదాలతో బయటకు వచ్చిన మూపనార్ 1996లో తమిళ మానిల కాంగ్రెస్‌ను ఏర్పాటు చేశారు. ఈ పార్టీ రెండు అసెంబ్లీ, మూడు లోక్ సభ ఎన్నికల్ని ఎదుర్కొంది. రెండు అసెంబ్లీ, ఒక లోక్ సభ ఎన్నికల్లో సైకిల్ చిహ్నంతో తన సత్తాను తమిళ మానిల కాంగ్రెస్ చాటుకుంది. మూపనార్ మరణంతో పార్టీ పగ్గాల్ని ఆయన తనయుడు జీకే వాసన్ చేపట్టారు. తదుపరి చోటు చేసుకున్న పరిణామాలతో పార్టీని మళ్లీ కాంగ్రెస్‌లో కలిపేశారు. ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఏర్పడ్డ విబేధాలతో బయటకు వచ్చిన జీకేవాసన్ మళ్లీ తన తండ్రి స్థాపించిన తమిళ మానిల కాంగ్రెస్‌ను తెర మీదకు తెచ్చి అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం అవుతున్నారు. పొత్తు వ్యవహారంలో జాగ్రత్తగా వ్యవహరిస్తూ, మళ్లీ బల నిరూపణ దిశగా వాసన్ తన వ్యూహాల్ని అమలు చేస్తూ వస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలబడే ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. పదో తేదీ నుంచి అన్ని జిల్లాల్లో సాగిన ఈ దరఖాస్తుల పర్వానికి స్పందన బాగానే వచ్చిందని చెప్పవచ్చు. నాలుగు వేల మందికి పైగా ఆశావహులు తమ కంటే తమకు సీటు కావాలని దరఖాస్తులు చేసుకుని ఉన్నారు. ఇక, జీకే వాసన్ తమ నియోజకవర్గంలో అంటే, తమ నియోజకవర్గంలో పోటీ చేయాలంటూ దరఖాస్తులు సమర్పించుకున్న వాళ్లూ ఉన్నారు. ఇక, విల్లివాక్కం సీటు కోసం ఆ పార్టీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి బి జవహర్ బాబు దరఖాస్తు చేసుకున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా, తమకు మళ్లీ సైకిల్ చిహ్నం దక్కేనా అన్న ఎదురు చూపుల్లో తమిళ మానిల కాంగ్రెస్ వర్గాలు పడ్డాయి. సైకిల్ గుర్తు దక్కేనా: సైకిల్ చిహ్నం మళ్లీ దక్కించుకునేందుకు ఇప్పటి నుంచే ఎన్నికల యంత్రాంగానికి విన్నవించుకునే పనిలో పడ్డారు. తమకు గతంలో కేటాయించిన చిహ్నం మళ్లీ దక్కే రీతిలో చర్యలు తీసుకోవాలని లేఖలు సంధించేందుకు సిద్ధమయ్యారు. అయితే, ఇది వరకు పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన విషయం తెలిసిందే. ఈ దృష్ట్యా, తమిళ మానిల కాంగ్రెస్ పేరు పాతే అయినా, కొత్తగా ఆవిర్భవించిన పార్టీ పరిధిలోకి రావడం ఖాయం. రానున్న ఎన్నికల్లో తన సత్తాను చాటుకున్న తదుపరి శాశ్వత చిహ్నం ఈ పార్టీకి దక్కుతుంది. అందువల్ల ఈ సారి ఆ పార్టీ అభ్యర్థులందరికీ సైకిల్ చిహ్నం దక్కేనా అన్న ప్రశ్న బయలు దేరి ఉన్నది. స్వతంత్ర అభ్యర్థులు ఆ చిహ్నం కోసం రంగంలోకి దిగితే, సంక్లిష్ట పరిస్థితులు తప్పవు. అయితే, ఈ పరిస్థితి బయలు దేరకుండా ముందస్తుగా ఎన్నికల యం త్రాంగాన్ని ఆశ్రయించి సైకిల్‌ను దక్కిం చుకునే ప్రయత్నాలకు టీఎంసీ వర్గాలు సిద్ధమయ్యాయి. ఈ విషయంగా పార్టీ నే త ధర్మరాజు పేర్కొంటూ, తమకు సైకిల్ చిహ్నం మళ్లీ దక్కుతుందన్న నమ్మకం ఉందని, తప్పకుండా ఆ చిహ్నం మీదే ఎన్నికల బరిలో తమ అభ్యర్థులు ఉంటారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.