biotechnology company
-
మన్నే మాణిక్యం!
(సాక్షి స్పెషల్ డెస్క్): వెండి కన్నా ఎక్కువ విలువైనది ఆ మన్ను.. అవును.. మీరు చదివింది నిజమే. మహారాష్ట్రలోని ఒక కుగ్రామం 2 కిలోల మట్టిని రూ. 68 లక్షలకు ఒక బయోటెక్నాలజీ కంపెనీకి అమ్మింది. ఆ మట్టిలో ఏముందో అనే కదా మీ సందేహం? ఆ మట్టిలో ఉన్న ఒక సూక్ష్మజీవి అనేక ప్రోబయోటిక్ ఉత్పత్తుల తయారీకి ఉపయోగపడుతోంది. భారతీయ జీవవైవిధ్య చట్టాల ప్రకారం.. స్థానిక జీవ వనరులను వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించుకునే కంపెనీలు తమ లాభాల్లో వాటాను స్థానిక పంచాయతీలకు పంచాలి. ఆవిధంగా దాపూర్ అనే గ్రామం నుంచి స్వీకరించిన రెండు కిలోల మట్టిలోని సూక్ష్మజీవులను ఉపయోగించుకున్నందుకుగాను సదరు కంపెనీ ఆ గ్రామ పంచాయతీకి రూ. 68 లక్షలను చెల్లించింది. ‘సూక్ష్మ’ంలో ధనందాపూర్ గ్రామం నాసిక్‌కు 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వాణిజ్య అవసరాలకు ఉపయోగపడే సూక్ష్మజీవుల కోసం అన్వేషిస్తున్న అడ్వాన్స్డ్ ఎంజైమ్ టెక్నాలజీస్ లిమిటెడ్ కంపెనీ ఈ గ్రామ పరిసరాల్లో పొలాల మట్టిలో బాసిల్లస్ కోగులన్స్ అనే సూక్ష్మజీవిని రెండేళ్ల క్రితం గుర్తించి, స్థానిక గ్రామ పంచాయతీ ద్వారా రెండు కిలోల మట్టిని తీసుకెళ్లింది. బాసిల్లస్ కోగులన్స్లోని ఎంజైమ్స్ ద్వారా కడుపులో ఆరోగ్యదాయక సూక్ష్మజీవులను, జీర్ణశక్తిని పెంపొందించేందుకు ఉపయోగపడే 42 రకాల ప్రోబయోటిక్ ఉత్పత్తులను ఈ సంస్థ తయారు చేసి విక్రయిస్తోంది.లాభాల పంపిణీ ఎలా? మన దేశంలోని జన్యు వనరుల వ్యవహారాలను జాతీయ జీవవైవిధ్య ప్రాధికార సంస్థ (ఎన్బీఏ) పర్యవేక్షిస్తుంటుంది. సూక్ష్మజీవులు, ఔషధ మొక్కలు, పశుజాతులు వంటి స్థానిక జన్యువనరులను వాణిజ్య అవసరాల కోసం ఉపయోగించుకునే కంపెనీలు యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్ (ఏబీఎస్) యంత్రాంగం ద్వారా సంబంధిత గ్రామ పంచాయతీలకు లాభాల్లో నుంచి కొంత (ఆ ఉత్పత్తుల అమ్మకం ధరలో 0.1–0.5 శాతాన్ని లేదా కొనుగోలు ధరలో 1–5%) మేరకు చెల్లించాల్సి ఉంటుంది.ఆ మొత్తంలో నుంచి ఈ వ్యవహారాన్ని పర్యవేక్షించే ఎన్బీఏ 5% నిర్వహణ ఖర్చుల కింద తీసుకొని, మిగతా 95% డబ్బును ఆ పంచాయతీకి ఇస్తుంది. 2014 నుంచి అమల్లోకి వచ్చిన ‘నగోయా ప్రొటోకాల్’అనే అంతర్జాతీయ జీవవైవిధ్య ఒడంబడిక ద్వారా ఏబీఎస్ యంత్రాంగం పనిచేస్తుంది. ఈ విధంగా దాపూర్ గ్రామ పంచాయతీ ఖాతాలోకి రూ. 67,69,359 జమ అయ్యాయి. ఆ సూక్ష్మజీవి అక్కడ మాత్రమే ఉందా?బాసిల్లస్ కోగులన్స్ సూక్ష్మజీవి దాపూర్ గ్రామ పరిసరాల్లోని మట్టిలో మాత్రమే ఉందా? అంటే.. ‘అదేం కాదు. దేశంలోని అన్ని ప్రాంతాల నేలల్లోనూ ఇది ఉంటుంది. అయితే, ఆ కంపెనీ ఈ గ్రామం నుంచి తీసుకెళ్లిన మట్టిలో నుంచి సూక్ష్మజీవిని సేకరించింది కాబట్టి వారికి లాభాల్లో వాటా చెల్లించింది’అని మహారాష్ట్ర రాష్ట్ర జీవవైవిధ్య బోర్డు అధికారులు తెలిపారు. ఇలా వచ్చిన మొత్తాన్ని గ్రామంలో సాధారణ పనుల కోసం వాడకూడదు. ఔషధ మొక్కలు, దేశీ పశు జాతులు, స్థానిక పురాతన వంగడాలు వంటి జీవవైవిధ్యాన్ని, సంప్రదాయ విజ్ఞానాన్ని, పర్యావరణాన్ని పరిరక్షించే పనులకు మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. దాపూర్ గ్రామస్తులు ఇప్పుడు అదే పనిలో ఉన్నారు.బయోడైవర్సిటీ రిజిస్టరే కీలకం జన్యు వనరులను గుర్తించి, నమోదు చేసినప్పుడే వాటిని ఉపయోగించుకునే కంపెనీల నుంచి లాభాల్లో వాటా పొందటం సాధ్యమవుతుంది. ఈ ప్రక్రియలో ‘పీపుల్స్ బయోడైవర్సిటీ రిజిస్టర్’(పీబీఆర్)ల పాత్ర కీలకం. రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఉండే జీవవైవిధ్య బోర్డుల పర్యవేక్షణలో గ్రామ పంచాయతీల ద్వారా బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ కమిటీల(బీఎంసీ)ను ఏర్పాటు చేశారు. గ్రామంలోని పెద్దలు, సంప్రదాయ విజ్ఞానవంతులు, రైతులు ఇందులో సభ్యులుగా ఉంటారు. బీఎంసీ గ్రామ స్థాయిలోని పరిసరాల్లో ఏయే జన్యు వనరులు ఉన్నాయో గుర్తించి రిజిస్టర్లో నమోదు చేస్తుంది.ఆ రిజిస్టర్‌లోని జన్యు వనరులను ఏ కంపెనీ అయినా ఉపయోగించుకుంటే చట్టప్రకారం లాభాల్లో నుంచి స్థానిక సమాజానికి వాటా పంచాలన్నది నియమం. అయితే, దేశవ్యాప్తంగా 2,76,653 బీఎంసీలు ఏర్పాటైనప్పటికీ, చురుగ్గా పనిచేస్తున్నవి కొన్ని మాత్రమే. 2017–2025 మధ్యకాలంలో విదేశీ కంపెనీల నుంచి రూ. 140 కోట్లు, దేశీయ కంపెనీల నుంచి రూ. 52 కోట్లను స్థానిక సమాజాలకు పంపిణీ చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. -
వైభవ్ జెమ్స్, కంకార్డ్ బయోటెక్ ఐపీవోలకు గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: విశాఖపట్టణం కేంద్రంగా కార్యకలాపాలు విస్తరించిన వైభవ్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్‌తోపాటు రేర్ ఎంటర్‌ప్రైజెస్‌కు పెట్టుబడులున్న కంకార్డ్ బయోటెక్ త్వరలో పబ్లిక్ ఇష్యూకి రానున్నాయి. ఇందుకు వీలుగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఆగస్ట్‌లో కంకార్డ్, సెప్టెంబర్‌లో వైభవ్ సెబీకి ప్రాథమిక ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేశాయి. ఇతర వివరాలు చూద్దాం.. వైభవ్ జెమ్స్ బంగారు ఆభరణాల విక్రేత వైభవ్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ పబ్లిక్ ఇష్యూకి సెబీ అనుమతించింది. ఐపీవోలో భాగంగా కంపెనీ రూ. 210 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా ప్రమోటర్ సంస్థ గ్రంధి భారత మల్లికా రత్న కుమారి(హెచ్‌యూఎఫ్) 43 లక్షల షేర్లను ఆఫర్ చేయనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో పేర్కొంది. ఈక్విటీ జారీ నిధులలో రూ. 12 కోట్లను 8 కొత్త షోరూముల ఏర్పాటుకు వినియోగించనుంది. రెండేళ్లపాటు ఇన్వెంటరీ కొనుగోలుకి మరో రూ. 160 కోట్లు కేటాయించనుంది. సాధారణ కార్పొరేట్ అవసరాలకు సైతం నిధులను వెచ్చించనుంది. బంగారం, వజ్రాలు, ప్లాటినం, వెండి ఆభరణాలను కంపెనీ విక్రయిస్తోంది. అంతేకాకుండా విశేష బ్రాండు ద్వారా ప్రీమియం జ్యువెలరీని అందిస్తోంది. కంకార్డ్ బయోటెక్ ఫెర్మంటేషన్ ఆధారిత బయోఫార్మాస్యూటికల్ ఏపీఐల తయారీ కంపెనీ కంకార్డ్ బయోటెక్ పబ్లిక్ ఇష్యూకి సెబీ అనుమతించింది. ఐపీవోలో భాగంగా పీఈ సంస్థ క్వాడ్రియా క్యాపిటల్‌కు చెందిన హెలిక్స్ ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్స్ రూ. 2.09 కోట్లకుపైగా విలువైన షేర్లను విక్రయానికి ఉంచనుంది. కంకార్డ్లో దివంగత రాకేశ్ జున్‌జున్‌వాలా, ఆయన భార్య రేఖ ఏర్పాటు చేసిన రేర్ ఎంటర్‌ప్రైజెస్‌కు సైతం పెట్టుబడులున్నాయి. కంపెనీ ప్రధానంగా అంకాలజీ, యాంటీఫంగల్, యాంటీబాక్టీరియల్ తదితర ప్రత్యేక విభాగాలలో కార్యకలాపాలు విస్తరించింది. గుజరాత్లో మూడు తయారీ ప్లాంట్లను కలిగి ఉంది. 2022 మార్చికల్లా కంపెనీ 56 బ్రాండ్లతో 65 ప్రొడక్టులను రూపొందిస్తోంది. వీటిలో 22 ఏపీఐలు, 43 ఫార్ములేషన్లు ఉన్నాయి. వీటికి అదనంగా వివిధ దేశాలలో 120 డీఎంఎఫ్‌లను దాఖలు చేసింది.వైభవ్ జెమ్స్ ఐపీవోకు ఓకేకంకార్డ్ బయోటెక్‌కూ సెబీ అనుమతి -
పంచాయతీ నిధులు పక్కదారి
మేడ్చల్, న్యూస్‌లైన్: ఆయన ఓ బడా నాయకుడు.. ఇంకేముందు ‘రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా’ అన్నట్లు నాయకుడు తలచుకుంటే జరగని పనేముంటుంది. మండలపరిధిలోని అత్వెల్లిలో ఉన్న ఓ రాజకీయ నేత భూమిలో కార్పొరేట్ పాఠశాల కోసం ఓ సంస్థ ముందుకొచ్చింది. నెలనెలా అద్దె వస్తుండటంతో నిబంధనలకు విరుద్ధంగా చకచకా మూడు నెలల్లో నిర్మాణం చేపట్టి పాఠశాలను ప్రారంభించారు. పాఠశాల పక్కనే ఓ బయోటెక్నిక్ కంపెనీ ఉంది. పాఠశాల నుంచి మురికి నీరు వెళ్లడానికి తన పొలం అడ్డుగా ఉండడంతో సదరు నాయకుడు తన పొలాల్లోకి రాకుండా డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాలని గ్రామ పంచాయతీపై ఒత్తిడి తెచ్చాడు. పాలక వర్గం లేకపోవడం (ఎన్నికల విషయం కోర్టులో ఉంది)తో పంచాయతీ అభివృద్ధి కమిటీ ఎస్సీ కాలనీ నుంచి వాగు వరకు మురికి కాలువ నిర్మాణానికి ప్రతిపాదించింది. వెంటనే అనుమతులు వచ్చాయి. ఎస్సీ కాలనీ నుంచి పనులు మొదలు పెట్టకుండా సదరు నాయకుడి పొలం నుంచి పాఠశాల దాటేంతవరకు దాదాపు రూ.8 లక్షల వెచ్చించి భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. పాఠశాల నుంచి వచ్చే మురికి నీటిని కాలువకు అనుసంధానం చేశారు. కింది భాగంలో కాలువను పూర్తి చేయకుండా హరిజనుల పొలాల్లోకి మురికి కాలువను అసంపూర్తిగా వదిలేశారు. పైభాగంలో ఎస్సీ కాలనీ మురుగు నీరు వెళ్లేందుకు కొత్తగా నిర్మించిన పైపులైన్‌కు అనుసంధానం చేయలేదు. దీంతో కాలనీ నుంచి వచ్చే మురికి నీరంతా బయోటెక్నిక్ కంపెనీ ఎదుట ఉన్న ప్లాట్లలోకి చేరి మురికి కూపంలా మారింది. ఎస్సీ కాలనీ నుంచి వాగు వరకు వేయాల్సిన మురికి కాలువను కేవలం నాయకుడికి చెందిన స్థలం వరకు మాత్రమే పూర్తి చేసి నిధులు లేవని అధికారులు చేతులు దులుపుకున్నారు. ఇబ్బందులు పడుతున్న రైతులు, కాలనీవాసులు నాయకుడి స్వార్థం కోసం పంచాయతీ అధికారులు అనాలోచితంగా డ్రైనేజీ నిర్మించడంతో ఎస్సీ కాలనీ ప్రజలు, రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కాలనీకి సమీపంలో మురికి నీరు వదిలేయడంతో మురికి కూపంగా మారింది. దీంతో దోమల బెడద, దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నారు. కాలువను పూర్తిగా నిర్మించకుండా ఎస్సీ పొలాల్లోకి మురికి నీరు వదిలేయడంతో రైతులు దిగాలు చెందుతున్నారు. తప్పులు దొర్లాయి.: నర్సింహారెడ్డి, గ్రామ కార్యదర్శి అత్వెల్లి ఎస్సీ కాలనీ నుంచి వాగు వరకు మురికి కాలువ నిర్మించడంలో కొన్ని తప్పులు దొర్లాయి. ఇళ్ల నుంచి పనులు మొదలు పెట్టకుండా మధ్యలో మొదలు పెట్టడంతో డ్రైనేజీ సమస్య ఏర్పడింది. రాజకీయ నాయకుల ఒత్తిళ్లతో ఏ పనీ సరిగా చేయలేకపోతున్నాం.


