Biriyani dinner
-
Zomato Orders 2023: వీళ్లు తిన్న నూడిల్స్‌తో భూమిని 22 సార్లు చుట్టిరావొచ్చు!
పాతొక రోత.. కొత్తొక వింత. పాశ్యాత్య సంస్కృతుల్ని, ఆహార సంప్రదాయాల్ని మనవాళ్లు ఇష్టపడుతుండడం కొత్త కాకపోవచ్చు. ఇప్పటికే వస్త్రధారణలో వెస్ట్రన్ కల్చర్‌ను దాటేసి పోయారు. తినే తిండిలోనూ అదే ధోరణిని కనబరుస్తున్నారు. సాక్ష్యం ఏంటంటారా?.. దేశీయ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో అందుకు సమాధానాలు ఇస్తోంది. 2023 మరికొన్నిరోజుల్లో ముగియనున్న తరుణంలో ఆయా ఫుడ్ డెలివరీ సంస్థ ఏడాది మొత్తం మీద ఏ ఫుడ్ ఐటమ్‌ను ఎక్కువగా డెలివరీ చేశామని విషయాన్ని వెల్లడిస్తున్నాయి. ఇటలీలో పుట్టిన పిజ్జా భారతీయులు అమితంగా ఇష్టపడే ఆహార వంటకంగా ప్రసిద్ధికెక్కుతోంది. ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో నివేదిక ప్రకారం.. 2023లో భోజన ప్రియులకు అత్యంత ఇష్టమైన ఆహార పదార్ధాలలో బిర్యానీ, పిజ్జాలు వరుస స్థానాల్ని దక్కించుకున్నాయి. ►తన ప్లాట్‌ఫామ్ మీద 10.09 కోట్ల బిర్యానీల కోసం ఆర్డర్ పెట్టుకుంటే, రెండో స్థానంలో ఉన్న పిజ్జాను 7.45 కోట్ల ఆర్డర్లు పెట్టినట్లు జొమాటో తెలిపింది. ►తద్వారా ఈ ఏడాదిలో పెట్టిన బిర్యానీ ఆర్డర్లతో ఢిల్లీలో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో 'కుతుబ్ మీనార్'ను, కోల్‌కతాలో ఉన్న ఐదు కంటే ఎక్కువ ఈడెన్ గార్డెన్ స్టేడియంలతో సమానమైన పిజ్జాలను ఫుడ్ లవర్స్ ఆర్డర్ పెట్టినట్లు పేర్కొంది. ► మూడవ స్థానంలో 4.55 కోట్ల నూడిల్స్ ఆర్డర్ పెట్టారు. ఫుడ్ లవర్స్ పెట్టిన ఆ నూడిల్స్ ఆర్డర్‌తో భూమిని 22 సార్లు చుట్టడానికి ఇది సరిపోతుందని డెలివరీ దిగ్గజం వెల్లడించింది. ►స్విగ్గీలో ఎక్కువగా కేక్‌లు ఆర్డర్ రావడంతో బెంగళూరు కేక్ కేపిటల్‌గా అవతరించింది. ఫుడ్ లవర్స్ ఈ ఏడాది అత్యధికంగా జొమాటోలో బ్రేక్ ఫాస్ట్‌ను ఆర్డర్ పెట్టుకోగా, ఢిల్లీకి చెందిన వినియోగదారులు ఎక్కువ మంది అర్ధరాత్రి ఆర్డర్ చేసుకున్నారు. ►జొమాటోకి ఈ ఏడాదిలో అత్యధికంగా బెంగళూరు నుంచి ఫుడ్ ఆర్డర్లు వచ్చాయి. ఒక్క ఆర్డర్ ఖరీదు అక్షరాల రూ.46,273. అదే సమయంలో రూ.6.6లక్షల విలువ చేసే 1389 గిఫ్ట్ ఆర్డర్లు పెట్టారు. ఆ తర్వాత ముంబై వాసులు ఒక్కరోజే 121 ఆర్డర్లు పెట్టారు. నేషన్ బిగ్గెస్ట్ ఫూడీ జాబితాలో నేషన్ బిగ్గెస్ట్ ఫూడీ జాబితాలో ముంబై నిలిచింది. ఈ ప్రాంతం నుంచి ఏడాది మొత్తం వరకు 3,580 ఆర్డర్లు రాగా.. రోజుకి కనీసం 9 ఆర్డర్లు పెట్టినట్లు జొమాటో హైలెట్ చేసింది. బిర్యానీకి తిరుగులేదు వరుసగా 8వ సంవత్సరం సైతం స్విగ్గీలో ఎక్కువ బిర్యానీ ఆర్డర్ పెట్టినట్లు ఆ సంస్థ తన ఇయర్ ఎండర్ 2023 రిపోర్ట్‌లో తెలిపింది. ప్రతి సెకనుకు 2.5 బిర్యానీ ప్యాకెట్ల ఆర్డర్ ఇక దేశీయంగా ఉన్న ఫుడ్ లవర్స్ ప్రతి సెకండ్‌కు 2.5 బిర్యానీ ప్యాకెట్లను ఆర్డర్ పెట్టారు. వారిలో హైదరాబాద్‌కి చెందిన ఓ వ్యక్తి ఏడాది మొత్తం మీద 1633 బిర్యానీ ఆర్డర్లు పెట్టాడు. దీంతో బిర్యానీని ఎక్కువగా తినే ఫుడీల జాబితాలో హైదారబాద్ వాసులు నిలిచారు. స్విగ్గీ ఆర్డర్లో ప్రతి 6వ ఆర్డర్ ఇక్కడే నుంచే రావడం గమనార్హం. 2023లో ముంబైకి చెందిన ఓ ఫుడ్ లవర్స్ రూ. 42.3 లక్షల విలువైన ఫుడ్ ఆర్డర్లు పెట్టడం ఆసక్తికరంగా మారింది. -
జూబిలెంట్ నుంచి బిర్యానీ- దివీస్ కొత్త రికార్డ్
ముంబై, సాక్షి: దేశీ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో రోజు రికార్డుల బాటలో సాగుతున్నాయి. ప్రస్తుతం సెన్సక్స్ 117 పాయింట్లు పెరిగి 46,784కు చేరింది. నిఫ్టీ సైతం 35 పాయింట్లు బలపడి 13,717 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో సానుకూల వార్తల కారణంగా ఫాస్ట్ ఫుడ్ చైన్ కంపెనీ జూబిలెంట్ ఫుడ్ వర్క్స్, ఫార్మా రంగ దిగ్గజం దివీస్ ల్యాబొరేటరీస్ కౌంటర్లకు డిమాండ్ నెలకొంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో భారీ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం.. (బర్గర్‌కింగ్- 3 రోజుల్లో 3 రెట్లు లాభం) జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ పోర్ట్‌ఫోలియో విస్తరణలో భాగంగా జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ ఏకదమ్! పేరుతో బిర్యానీల బిజినెస్‌ను ప్రారంభించింది. తద్వారా విభిన్న రుచుల బిర్యానీలను అందుబాటులో ఉంచినట్లు కంపెనీ తెలియజేసింది. 20 రకాల బిర్యానీల నుంచి కస్టమర్లు ఎంపిక చేసుకోవచ్చని వివరించింది. ఇవి అందుబాటు ధరల్లో అంటే రూ. 99 నుంచి ప్రారంభమవుతాయని పేర్కొంది. గుర్గావ్లోని రెస్టారెంట్లో వీటిని ప్రారంభించినట్లు తెలియజేసింది. తదుపరి ఇతర ప్రాంతాలకూ విస్తరించనున్నట్లు పేర్కొంది. కంపెనీ డోమినోస్ పిజ్జా, డంకన్ డోనట్స్ బ్రాండ్లతో రెస్టారెంట్లను నిర్వహించే సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జూబిలెంట్ ఫుడ్ షేరు తొలుత ఎన్ఎస్ఈలో 8 శాతం జంప్‌చేసి రూ. 2,885ను తాకింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. ప్రస్తుతం 7.3 శాతం లాభంతో రూ. 2,873 వద్ద ట్రేడవుతోంది. గత రెండు రోజుల్లో ఈ కౌంటర్ 12 శాతం లాభపడటం గమనార్హం! (పీఎన్బీకి క్విప్ దెబ్బ- ఎంఅండ్ఎం స్పీడ్) దివీస్ ల్యాబొరేటరీస్ పటిష్ట పనితీరును చూపడం ద్వారా ఈ కేలండర్ ఏడాది(2020)లో ర్యాలీ బాటలో సాగుతున్న హైదరాబాద్ దిగ్గజం దివీస్ ల్యాబొరేటరీస్ కౌంటర్ మరోసారి జోరు చూపుతోంది. తొలుత ఎన్ఎస్ఈలో దాదాపు 4 శాతం జంప్‌చేసి రూ. 3,854ను అధిగమించింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. ప్రస్తుతం 3 శాతం లాభంతో రూ. 3,825 వద్ద ట్రేడవుతోంది. దీంతో కంపెనీ మార్కెట్ విలువ తాజాగా రూ. లక్ష కోట్ల మార్క్‌ను తాకింది. వెరసి మార్కెట్ క్యాప్ ర్యాంకులో 30వ పొజిషన్‌కు చేరుకోవడంతోపాటు.. సన్ ఫార్మా తదుపరి నిలుస్తున్నట్లు నిపుణులు తెలియజేశారు. 2020లో ఇప్పటివరకూ దివీస్ ల్యాబ్స్ షేరు 109 శాతం దూసుకెళ్లడం విశేషం! కాగా.. ఆంధ్రప్రదేశ్‌లోని ఒంటిమామిడి గ్రామపరిసరాల్లో యూనిట్-3 నిర్మాణ పనులను ప్రారంభించినట్లు ఈ నెల మొదట్లో వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇందుకు రూ. 1,500 కోట్లను ఇన్వెస్ట్ చేయనున్నట్లు కంపెనీ ఇప్పటికే తెలియజేసింది. 12-18 నెలల్లోగా ఈ ప్లాంటు కార్యకలాపాలు ప్రారంభంకాగలవని అంచనా వేస్తోంది. -
నయన్ నాతో మాట్లాడితే వారికేంటి
నటుడు ఆర్య గురించి అందరికీ తెలుసు. ఆయనంత జాలీ పర్సన్ కోలీవుడ్‌లో మరొకరు లేరేమో. ఒక నాయకీ తమను కన్నెత్తి చూడడం లేదనే కథానాయకులు చాలా మంది ఉన్నారు. అలాంటిది ఆర్య దృష్టిలో పడడానికి చాలామంది నాయికలు తహతహలాడుతుంటారనేది కోలీవుడ్ వర్గాల మాట. బిరియాని విందుతోనే హీరోయిన్లలను ఆకట్టుకుంటారనేది ఆర్యకున్న ప్రత్యేక ప్రచారం. అలాంటి ఆర్య ప్రస్తుతం మెగామాన్ విజయంతో మంచి జోష్‌లో ఉన్నారు. ఆ చిత్ర దర్శకుడు మగిళ్ తిరుమేణితో కలిసి మరో చిత్రం చేయడానికి సిద్ధమవుతున్న ఈ సంచలన నటుడితో మాటా మంతి... ప్రశ్న: మెగామాన్ విడుదల సమయంలో ఆ చిత్ర నిర్మాతకు మీరు రూ.6 కోట్లు ఇచ్చినట్లు జరుగుతున్న ప్రచారం గురించి ఏమంటారు? జవాబు: మెగామాన్ బ్రహ్మాండంగా రూపొందిన చిత్రం. అభిమానుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. అయితే చిత్ర నిర్మాణ వ్యయం అనుకున్న దానికంటే బాగా పెరిగింది. చిత్ర నిర్మాత నా స్నేహితుడు. అందువలన నేను కొంచెం ఖర్చు చేయాల్సి వచ్చింది. దాన్ని మీడియా రూ.ఆరు కోట్లుగా ప్రచారం చేస్తోంది. మెగామాన్ నా చిత్రం. దాని విడుదల ఆగకూడదని కొంచెం సాయం చేశాను. చిత్రం విజయం సాధించడంతో ఆనందంగా ఉంది. ప్రశ్న: ఒక నిర్మాతగా చిత్ర నిర్మాణంపై మీ అభిప్రాయం? జవాబు: నేను అమరకావ్యం చిత్రాన్ని నిర్మించాను. అది ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. సినిమాలో జయాపజయాలు పెద్ద విషయాలు కావు. ఒక చిత్రం ప్లాప్ అయితే సినిమా రంగమే వేస్ట్ అని భావించే వాళ్లు ఇక్కడ ఏమీ సాధించలేరు. ఒక చిత్రంలో అపజయం పొందితే మరో చిత్రంలో జయించాలని పట్టుదలతో పని చేసే వారే ఇక్కడ రాణించగలరు. ప్రశ్న: ప్రస్తుతం సినిమా రంగంలో పోటీతత్వం బాగా పెరిగింది. మీకు భయం అనిపిస్తుందా? జవాబు: సినిమాలో నిరంతరం బిజీగా ఉండడం సాధారణ విషయం కాదు. నా విషయం చెప్పాలంటే 2005లో నటుడిగా రంగప్రవేశం చేశాను. ఇప్పటి వరకు కథా నాయకుడిగా నిలుదొక్కుకుని కొనసాగుతున్నానంటే నా అభిమానులే కారణం. వారు ఏదో గొప్ప విషయాలు ఉంటాయని ఆశించి నా చిత్రాలు చూడడానికి రారు. రెండున్నర గంటలు సరదాగా చూసి ఎంజాయ్ చేద్దాం అని భావిస్తుంటారు. వారు కోరుకునే అంశాలతో నా చిత్రాలలో అందించడానికి ప్రయత్నిస్తుంటాను. ప్రశ్న: మిమ్మల్ని ప్రముఖ నాయికలతో కలుపుతూ తరచూ వదంతులు ప్రచారం అవుతుండడానికి కారణం? జవాబు: ఇక్కడ ఒక విషయం స్పష్టం చేయాలి. నేను సినిమా రంగానికి చెందిన వాడిని. ఇక్కడి వారితోనేగా మాట్లాడగలను. ఇతర రంగాల వారితో ఏమీ మాట్లాడగలను. సహ నటీమణులు సినిమాల గురించి ఏమైనా అడిగినప్పుడు తగిన సమాధానం ఇస్తుంటాను. సదభిప్రాయంతో మాట్లాడడం వలన సహ నటీమణులు నాతో స్నేహంగా మసలుకుంటారు. దీన్ని వక్రంగా చూసేవాళ్లు వదంతులు ప్రచారం చేస్తుంటారు. ప్రశ్న: ఇతర హీరోయిన్లకంటే నయనతారను ప్రత్యేకంగా చూస్తారని, ఆమెతో ప్రేమాయణం సాగిస్తున్నారన్న ప్రచారం గురించి? జవాబు: నయనతార మంచి స్నేహితురాలు. ఆమె ప్రవర్తన విధానం నచ్చుతుంది. స్నేహానికి గౌరవం ఇస్తుంది. స్నేహితుడనే భావంతోనే నాతో మసలుకుంటుంది. ఇందులో తప్పేముంది? అయినా నయనతార నాతో మాట్లాడితే ఇతరులకేమిటట. మా ఇద్దరి మధ్య మంచి స్నేహం మినహా ప్రేమ, గీమా ఏమీ లేదు. ప్రశ్న: ఇంతకీ పెళ్లెప్పుడు చేసుకుంటారు? జవాబు: నటుడు విశాల్ నాకు క్లోజ్ ఫ్రెండ్. అయితే నా కంటే కొంచెం సీనియర్. తను పెళ్లి చేసుకున్న తరువాతే నేను చేసుకోవాలని భావిస్తున్నాను. అయితే విశాల్ తల్లి నాకు ఫోన్ చేసి చెడామడా తిట్టేస్తుంటారు. ఇద్దరూ కలసి నాటకాలాడుతున్నారా? అంటూ చీవాట్లు పెడుతుంటారు. ఏదో విధంగా మేం ఆమెకు కథలు చెబుతూ కాలం నెట్టుకొస్తున్నాం.