BK Hariprasad
-
‘బీకే హరిప్రసాద్‌ను పదవి నుంచి తొలగించాలి’
న్యూఢిల్లీ : బీజేపీ జాతీయాధ్యక్షడు అమిత్ షా అనారోగ్యాన్ని ఉద్దేశిస్తూ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు బీకే హరిప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హరిప్రసాద్‌ను పార్టీ జనరల్ సెక్రటరీ హోదా నుంచి తొలగించాలంటూ బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ హరిప్రసాద్‌ను తొలగించకపోతే ఈ వ్యాఖ్యలకు రాహుల్ గాంధీ కూడా మద్దతిస్తున్నట్లు భావించాల్సి వస్తుందని తెలిపారు. ఈ విషయం గురించి బీజేపీ అధికార ప్రతినిధి జీవిఎల్ నర్సింహ్మ రావు మాట్లాడుతూ.. ‘రెండు నాల్కల ధోరణిని ప్రదర్శిండం కాంగ్రెస్ స్వభావం. ఒక వైపు రాహుల్ గాంధీ జైట్లీ అనారోగ్యం గురించి విచారం వ్యక్తం చేస్తూంటే.. మరో వైపు హరి ప్రసాద్ లాంటి వాళ్లు ఇలా విషం కక్కుతారు. వీరి గురించి జనాలకు బాగా తెలుసు. ఒక వేళ వారు(రాహుల్) నిజంగానే హరిప్రసాద్ వ్యాఖ్యల్ని సమర్థించకపోతే.. అతని చేత అమిత్ షాకు బహిరంగ క్షమాపణలు చెప్పించాల’ని డిమాండ్ చేశారు. అమిత్ షా స్వైన్ ఫ్లూతో బాధపడుతూ.. ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నాయకుడు హరిప్రసాద్.. కర్ణాటకలో కాంగ్రెస్ - జేడీఎస్ కూటమిని చీల్చడానికి ప్రయత్నించడం వల్లే అమిత్ షా అనారోగ్యం పాలయ్యారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. -
మా జోలికి వచ్చారు.. స్వైన్‌ఫ్లూ సోకింది
బెంగళూరు/న్యూఢిల్లీ: కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు బీకే హరిప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్–జేడీఎస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు యత్నించడం వల్లే బీజేపీ చీఫ్ అమిత్ షాకు స్వైన్ ఫ్లూ సోకిందని ఎద్దేవా చేశారు. బెంగళూరులో బీజేపీకి వ్యతిరేకంగా గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..‘కొందరు ఎమ్మెల్యేలు ఇప్పటికే రాష్ట్రానికి తిరిగివచ్చారు. దీంతో అమిత్ షాకు జ్వరం వచ్చింది. అది మామూలు జ్వరం కాదు.. స్వైన్ ఫ్లూ జ్వరం. కర్ణాటక ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు యత్నిస్తే కేవలం స్వైన్ ఫ్లూనే కాదు.. వాంతులు, విరేచనాలు వస్తాయని అర్ధం చేసుకోవాలి’ అని అన్నారు. దీంతో కేంద్ర మంత్రులు రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్, ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, పీయూష్‌గోయల్‌తో పాటు పలువురు బీజేపీ నేతలు హరిప్రసాద్‌పై విరుచుకుపడ్డారు. ఫ్లూ జ్వరానికి చికిత్స ఉందనీ, కానీ హరిప్రసాద్‌కున్న మానసిక అనారోగ్యాన్ని తగ్గించడం కష్టమని గోయల్ విమర్శించారు. ఈ విషయమై కాంగ్రెస్ అధికార ప్రతినిధి ప్రియాంక చతుర్వేది స్పందిస్తూ.. బీజేపీ నేతల అనారోగ్యాన్ని కాంగ్రెస్ కోరుకోదని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి జైట్లీ కోలుకోవాలని కాంగ్రెస్ అధినేత రాహుల్‌గాంధీ ట్వీట్‌చేసిన విషయాన్ని ఆమె గుర్తుచేశారు. అమిత్ స్వైన్‌ఫ్లూ జ్వరంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో బుధవారం చేరిన సంగతి తెలిసిందే. -
విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా కాంగ్రెస్ ఎంపీ
సాక్షి, న్యూఢిల్లీ : రాజ్యసభ డిప్యూటీ చైర్పర్సన్ పదవికి విపక్షాల అభ్యర్ధిగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ బీకే హరిప్రసాద్ పేరును ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ సినియర్ నేత, ఎంపీ బీకే హరిప్రసాద్ కర్ణాటక నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ఆయన పేరును ప్రతిపాదిస్తూ సీపీఐ నేత డీ. రాజా ప్రకటించారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవికి ఆగస్ట్ 9న ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే. ఆ మేరకు పార్టీల మద్దతు కోరేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. కాంగ్రెస్ అభ్యర్ధికి ఆమ్ ఆద్మీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, టీడీపీ మద్దతు ఇచ్చే అవకాశం ఉందని ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు తెలిపారు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో విపక్షాలకు ఈ ఎన్నిక కీలకం కానుంది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ ఒరిస్సా సీఎం నవీన్ పట్నాయక్‌ను మద్దతు కోరారు. దీనిపై స్పందించిన నవీన్.. తాము ఇదివరకు జేడీయూ అభ్యర్ధికి మద్దతు ఇస్తామని నితీష్‌కు మాట ఇచ్చినట్లు తెలిపారు. ఎన్డీయే అభ్యర్ధిగా జేడీయూకి చెందిన హరివంశ్ నారాయణ్ సింగ్‌ను బరిలో నిలిపిన విషయం తెలిసిందే. బిహార్ సీఎం నితీష్ కుమార్ తమ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌కి, ఒరిస్సా సీఎం నవీన్ పట్నాయక్‌కు ఫోన్ చేసిన విషయం తెలిసిందే. బీజేపీకి బలం లేదు రాజ్యసభలో బీజేపీకి తగిన సంఖ్యా బలం లేదని, తమ అభ్యర్థి హరి ప్రసాద్ విజయానికి తగిన బలం ఉందని కాంగ్రెస్ పక్ష ఉప నేత ఆనంద్ శర్మ తెలిపారు. ఏకగ్రీవ ఎన్నిక కోసం బీజేపీ తమను సంప్రదించలేదని, తమతో సంప్రదించకుండానే అధికార పార్టీ అభ్యర్థిని నేరుగా ప్రకటించిందని ఆయన తెలిపారు. విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా చాలా మంది పేర్లను పరిశీలించిన తనంతరం హరి ప్రసాద్‌ను ఎంపిక చేసినట్లు ప్రకటించారు. సభలో బలబలాలెంత ప్రస్తుతం 244 మంది సభ్యులున్న రాజ్యసభలో డిప్యూటీ చైర్మన్‌గా గెలిచేందుకు 123 సభ్యుల మద్దతు కావాలి. ప్రస్తుతం ఎన్డీయే కూటమికి 90 మంది సభ్యుల మద్దతు ఉంది. మరోవైపు ప్రతిపక్షాలు 112 మంది ఎంపీలతో రాజ్యసభలో బలంగా కన్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తటస్థంగా ఉన్న అన్నాడీఎంకే(12), బీజేడీ(9), ఇండియన్ నేషనల్ లోక్‌దళ్(1), పీడీపీ(2), శివసేన(3), టీఆర్ఎస్(6), వైఎస్సార్సీపీ(2)లపై ఇరు పక్షాలు దృష్టిసారించాయి. -
మోడీ ప్రధాని అభ్యర్థిత్వంపై బీజేపీలోనే ఏకాభిప్రాయం లేదు
‘మీట్ ది ప్రెస్’లో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి బి.కె.హరిప్రసాద్ సాక్షి, బెంగళూరు : మోడీ ప్రధాని అభ్యర్థిత్వంపై బీజేపీలోని సభ్యులకే ఏకాభిప్రాయం లేదని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి బి.కె.హరిప్రసాద్ పేర్కొన్నారు. బెంగళూరు ప్రెస్‌క్లబ్, రిపోర్టర్స్ గిల్డ్ సంయుక్త ఆధ్వర్యంలో శనివారమిక్కడ నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’లో విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు హరిప్రసాద్ సమాధానమిచ్చారు. బీజేపీ వికాస పురుషుడని చెప్పుకుంటున్న వాజ్‌పేయి, లోహ పురుషుడని చెప్పుకుంటున్న అద్వానీలను ఎన్నికల్లో ఓటమి అనంతరం ఆ పార్టీ పక్కకు పెట్టేసిందని, ఈ ఎన్నికల్లో పార్టీ ఓడిపోతే నరేంద్రమోడీ పరిస్థితి కూడా అదేనని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గుజరాత్లో 2003 వరకు బీజేపీ ఓడిపోతూనే వచ్చిందని, గోద్రా ఘటన తర్వాత మొదటి ఎన్నికలను మతవాదం పేరిట, రెండోసారి గుజరాత్ ఆత్మాభిమానం పేరిట, మూడోసారి అభివృద్ధి పేరు చెప్పుకొని మోడీ గెలిచారని అన్నారు. రెతుల దగ్గర నుంచి వేల ఎకరాలను బలవ ంతంగా లాక్కొని, రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచామని చెప్పుకుంటున్న మోడీకి అవినీతి, పాలనాలోపాల గురించి మాట్లాడే నైతికతే లేదని హరిప్రసాద్ విమర్శించారు.