BMC Election 2022
-
మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం.. వారి భేటీ అందుకేనా?
సాక్షి, ముంబై: మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) చీఫ్ రాజ్ ఠాక్రే సోమవారం ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అధికార నివాసమైన సాగర్ బంగ్లాలో భేటీ అయ్యారు. అకస్మాత్తుగా జరిగిన ఇరువురి భేటీవల్ల రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు తావిచ్చినట్లయింది. త్వరలో ముంబై, థానే, పుణే, నాసిక్ తదితర ప్రధాన కార్పొరేషన్లలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాజ్ ఠాక్రే ఫడ్నవీస్‌తో భేటీ కావడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. 2019 అక్టోబరులో ముఖ్యమంత్రి పీఠంపై శివసేన, బీజేపీ మధ్య నెలకొన్న వివాదం చివరకు తెగతెంపులు చేసుకునే వరకు దారి తీసిన విషయం తెలిసిందే. శివసేనతో తెగతెంపులు చేసుకున్న తరువాత అప్పటి నుంచి బీజేపీ, ఎమ్మెన్నెస్‌ల మధ్య సాన్నిహిత్యం కొంతమేర పెరిగిపోయింది. ముఖ్యంగా ఎమ్మెన్నెస్‌కు ముంబై, థానే, నాసిక్, పుణే కార్పొరేషన్లలో మంచి పట్టు ఉంది. దీంతో బీజేపీ, ఎమ్మెన్నెస్ మధ్య పొత్తు కుదురుతుండవచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం శివసేనకు చెందిన ఏక్నాథ్ శిందే వర్గం దేవేంద్ర ఫడ్నవీస్‌తో ఉంది. ఈ నేపథ్యంలో ఎమ్మెన్నెస్ మద్దతు కూడా లభిస్తే ఆ నాలుగు కార్పొరేషన్లలో విజయం సులభం కానుంది. దీంతో బీజేపీ కూడా ఆ దిశగా ప్రయత్నాలు చేస్తోంది. బీజేపీకి దగ్గరవుతున్న ఎమ్మెన్నెస్ ఇదిలాఉండగా బీజేపీ శివసేనతో తెగతెంపులు చేసుకున్న తరువాత దేవేంద్ర ఫడ్నవీస్, రాజ్ ఠాక్రే మధ్య సంబంధాలు కొంత బలపడ్డట్లు తెలుస్తోంది. దేవేంద్ర ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత రాజ్ ఠాక్రే ఓ లేఖ రాశారు. అందులో ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేసినందుకు ఫడ్నవీస్‌ను ప్రశంసించారు. అనంతరం రాజ్ ఠాక్రే నివాసమైన శివ్ తీర్ధ్ బంగ్లాకు వెళ్లి ఫడ్నవీస్‌తో భేటీ అయ్యారు. అదేవిధంగా రాజ్ ఠాక్రే మసీదులపై అక్రమంగా ఏర్పాటు చేసిన లౌడ్స్పీకర్లకు వ్యతిరేకంగా లేవనెత్తిన ఆందోళనకు బీజేపీ నుంచి ప్రశంసల జల్లులు కురిశాయి. అప్పుడే హిందుత్వ నినాదంపై బీజేపీ, ఎమ్మెన్నెస్ ఒక్కటవుతుండవచ్చని వార్తలు గుప్పుమన్నాయి. అప్పటి నుంచి ఇరుపార్టీల మధ్య రోజురోజుకు పెరుగుతున్న సాన్నిహిత్యం, ఈ నేపథ్యంలో తాజాగా సోమవారం రాజ్ ఠాక్రే ఫడ్నవీస్‌తో భేటీకావడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే సోమవారం జరిగిన భేటీ మర్యాదపూర్వకంగా జరిగిందా...లేక రాజకీయ పరంగా జరిగిందా.. అనేది త్వరలో బయటపడనుంది. చదవండి: (చిన్న పార్టీలకు అధికారం దక్కకుండా చేయడమే బీజేపీ ఎజెండా) ఎన్నికలకు సిద్ధమవుతున్న అన్ని పార్టీలు త్వరలో ముంబై, థానే సహా పుణే, పింప్రి–చించ్వడ్, ఉల్లాస్‌నగర్, భివండీ, పన్వేల్, మీరా–భాయందర్, షోలాపూర్, నాసిక్, మాలేగావ్, పర్భణీ, నాందేడ్, లాతూర్, అమరావతి, అకోలా, నాగ్‌పూర్, చంద్రాపూర్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఓబీసీ రిజర్వేషన్ కారణంగా తరుచూ ఈ ఎన్నికలు వాయిదా పడుతూ వస్తున్నాయి. కాని ఈ ఎన్నికల్లో తమ బలం, సత్తా ఏంటో నిరూపించుకునేందుకు అన్ని పార్టీలు నడుం బిగించాయి. ఇటీవల ఏక్నాథ్ శిందే తిరుగుబాటుతో మహావికాస్ ఆఘాడి ప్రభుత్వం కుప్పకూలిన తరువాత ఎన్నికలు జరగడం ఇదే ప్రథమం. దీంతో అధికార పార్టీతో పాటు, ప్రతిక్షాలు కూడా ఈ ఎన్నికలను ఒక సవాలుగా తీసుకుంటున్నాయి. ముఖ్యంగా గత ఐదు దశాబ్దాలకుపైగా ఒక్కటిగా ఉన్న శివసేన పార్టీ ఇప్పుడు రెండుగా చీలిపోయింది. దీంతో ఈ ఎన్నికల్లో ఏలాంటి అద్భుతం జరుగుతుంది..? ఫలితాలు ఎలా వస్తాయనే దానిపై యావత్ రాష్ట్ర ప్రజల దృష్టి ఇటువైపు ఉంది. -
చిక్కుల శివసేనకు బీఎంసీ ఎన్నికల్లో చుక్కలే!
సాక్షి, ముంబై: ఏక్నాథ్ షిండే ప్రభుత్వంపై చేసిన తిరుగుబాటు ప్రభావంతో వచ్చే బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికలు శివసేనకు తలనొప్పిగా మారనున్నాయి. షిండే తిరుగుబాటు ఘటన బీఎంసీ ఎన్నికల్లో తీవ్రంగా ప్రభావం చూపే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గత పాతికేళ్లుగా బీఎంసీలో ఏకఛత్రాధిపత్యం చలాయిస్తున్న శివసేన ఈసారి మేయర్ పీఠాన్ని దక్కించుకోవడం అసాధ్యంగా కనిపిస్తోంది. ఒకవేళ మధ్యంతర అసెంబ్లీ ఎన్నికలు జరిగితే బీజేపీ మరింత రెచ్చిపోయి శివసేనను ఇరకాటంలో పెట్టే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బీఎంసీలో జరిగిన భారీ అవినీతి కుంభకోణానికి వ్యతిరేకంగా బీజేపీ గళం విప్పనుంది. బీజేపీ ఆరోపణలకు సమాధానమివ్వాలంటే శివసేనకు ఇబ్బందికరమైన పరిస్థితేనని చెబుతున్నారు. మేయర్ పీఠాన్ని దక్కించుకుంటూ రికార్డు సృష్టిస్తున్న శివసేన ఈసారి పాతికేళ్ల రికార్డు బ్రేక్ అయ్యే పరిస్థితి రానుంది. చదవండి: శివసేన రెబల్స్‌కు బీజేపీ భారీ ఆఫర్! దర్యాప్తు సంస్థల విచారణతో అసంతృప్తి కొద్ది నెలలుగా శివసేన, ఎన్సీపీకి చెందిన నేతలు, ఎమ్మెల్యేలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు చేసి విచారణ చేస్తుండటంతో మహా వికాస్ ఆఘాడి ప్రభుత్వంలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. బీఎంసీ ఎన్నికలు సమీపిస్తుండటం, ఈడీ విచారణ మరింత వేగవంతం కావడం వంటి వరుస ఘటనలతో శివసేనను బీజేపీ ఉక్కిరిబిక్కిరి చేసేస్తోంది. 2019లో మహావికాస్ ఆఘాడి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత బీఎంసీలో శివసేనకు మిత్రపక్షంగా ఉన్న బీజేపీ ప్రతిపక్షపాత్ర పోషిస్తోంది. గత రెండున్నరేళ్లుగా బీఎంసీలో తరుచూ ఆరోపణలు, ప్రత్యారోపణలతో లేదా వివిధ ప్రతిపాదనలను అడ్డుపెట్టుకుని ఏదో వంకతో శివసేనను ఇబ్బందుల్లో పెట్టే ఏ ఒక్క అవకాశాన్ని బీజేపీ వదులుకోలేదు. ఇప్పటికే నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎదుర్కొంటున్న ఈడీ విచారణ కారణంగా ప్రజల్లో శివసేన పేరు ప్రతిష్ట దెబ్బతింది. దీనికి తోడు ఇటీవల జరిగిన రాజ్యసభ, తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు ఇలా వరుసగా ఎదురైన పరాజయాలు, ఇప్పుడు ఏక్నాథ్ షిండే చేసిన తిరుగుబావుట కారణంగా ఎంవీఏ సర్కారు నిలుస్తుందా..? కూలుతుందా..? అనే సందిగ్ధంలో ప్రజల్లో నెలకొందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా, మహావికాస్ ఆఘాడి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత భవిష్యత్తులో జరిగే అన్ని ఎన్నికలు కలిసే పోటీచేస్తామని శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ, తాజా పరిణామాలతో ఎన్సీపీ, కాంగ్రెస్‌లు శివసేనను ఏకాకిని చేస్తాయా..? లేక వెన్నంటి ఉంటాయా అనేదానిపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. -
Mumbai: రాహుల్ గాంధీ సభపై సందిగ్ధత
సాక్షి, ముంబై: ముంబై నగరంలో రాహుల్ గాంధీ సభ నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. శివాజీపార్క్ మైదానంలో ఈ నెల 28వ తేదీన నిర్వహించ తలపెట్టిన కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమానికి ముంబై పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో పోలీసుల నిర్ణయాన్ని సవాలు చేస్తూ కాంగ్రెస్ ముంబై అధ్యక్షుడు భాయి జగ్తాప్ సోమవారం బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సభకు అనుమతిచ్చేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆ పిటిషన్లో కోర్టును కోరారు. అయితే, ఈ పిటిషన్‌పై విచారణ జరిగే లోపే కాంగ్రెస్ నాయకులు ఆ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. దీంతో కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ సభ ముంబైలో జరుగుతుందా? లేదా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇదిలావుండగా, శివసేన నేత, ఎంపీ సంజయ్ రౌత్ కొద్ది రోజుల కిందట ఢిల్లీ వెళ్లారు. అక్కడ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో భేటీ అయ్యారు. అనంతరం సంజయ్ రౌత్ మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ డిసెంబర్లో ముంబై పర్యటనకు వస్తున్నారని తెలిపారు. ఆ ప్రకారం కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ ముంబై పర్యటన తేదీలను సైతం ఖరారు చేశారు. కాంగ్రెస్ పార్టీ 137వ వార్షికోత్సవ వేడుకలు ఈ నెల 28వ తేదీన శివాజీ పార్క్ మైదానంలో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సభలో రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా మార్గదర్శనం చేయాల్సి ఉంది. దీంతో శివాజీ పార్క్ మైదానంలో భారీ వేదిక, టెంట్లు, ఇతర ఏర్పాట్లు చేయడానికి వీలుగా ఈ నెల 22వ తేదీ నుంచి 28వ తేదీ వరకు మైదానాన్ని బుక్ చేసుకునేందుకు అనుమతివ్వాలని బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)కి దరఖాస్తు చేసుకున్నారు. కానీ, శివాజీ పార్క్ మైదానం, పరిసరాలను సైలెన్స్ జోన్‌గా ప్రకటించి సుమారు పదేళ్లవుతోంది. (చదవండి: ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. మొదలైన ఫిరాయింపుల పర్వం?) దీంతో ఇక్కడ గణతంత్ర దినోత్సవం, రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం, స్వాతంత్య్ర దినోత్సవం, శివాజీ జయంతి, అంబేడ్కర్ వర్ధంతి తదితర కీలక కార్యక్రమాలు మినహా రాజకీయ పార్టీల సభలు, సమావేశాలకు అనుమతి లేదంటూ బీఎంసీ, పోలీసులు అనుమ తి నిరాకరించారు. దీంతో అటు వార్షికోత్సవ వేడుకలకు సమయం దగ్గర పడుతుండటంతో భాయి జగ్తాప్ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. సభకు అనుమతిచ్చేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోర్టును కోరారు. అయితే, కోర్టులో విచారణ జరిగే లోపే కాంగ్రెస్ నాయకులు ఆ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. కాంగ్రెస్ నాయకులు ఆ పిటిషన్‌ను ఎందుకు ఉపసంహరించుకున్నారనేది ప్రస్తుతం చర్చనీయాంశమైంది. తాజా పరిణామాల నేపథ్యంలో ముంబైలో రాహుల్ గాంధీ సభపై సందిగ్ధత నెలకొంది. (చదవండి: 18 ఏళ్లకు ఆడపిల్ల ప్రధానిని ఎన్నుకోగలిగితే... పెళ్లెందుకు చేసుకోకూడదు!) -
2014 నుంచి ఆ ఓట్లన్నీ బీజేపీకే.. చెక్ పెట్టేందుకు..
సాక్షి, ముంబై: వచ్చే ఏడాది బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పలు పార్టీలు ఓటర్లను ఆకర్శించే ప్రయత్నాలు ప్రారంభించాయి. ప్రాంతాలు, మతాల ప్రాతిపదికన ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆ ప్రయత్నాల్లో భాగంగా తమ తమ పార్టీల్లోని ప్రభావం చూపగల నాయకులకు పదవులు కట్టబెడుతున్నాయి. ఈ మేరకు శివసేనకు చెందిన మొహిసిన్ షేక్‌కు యువసేన ఉపకార్యదర్శి పదవిని అప్పగించింది. కాంగ్రెస్‌తో తెగతెంపులు చేసుకొని బీజేపీలో చేరిన మాజీ మంత్రి కృపాశంకర్ సింగ్‌కు మహారాష్ట్ర ప్రదేశ్ ఉపాధ్యక్ష పదవిని కట్టబెట్టారు. దీంతో వచ్చే బీఎంసీ ఎన్నికల్లో మైనారిటీలు, ఉత్తర భారతీయుల ఓట్లు తమకే పోలవుతాయని ఇటు శివసేన, అటు బీజేపీ లెక్కలు కడుతున్నాయి. సుమారు 96 లక్షల మంది ఓటర్లు దేశ ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబై నగరంలో సుమారు 96 లక్షల మంది ఓటర్లున్నారు. వీరిలో 70–80 శాతం మంది మరాఠీ ఓటర్లు కాగా, మిగతావారు గుజరాత్, రాజస్తాన్, ఇతర ఉత్తర భారత రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ సెటిలైన ఓటర్లు. అయితే, సాధారణంగా ఏ ఎన్నికలోనైనా మరాఠీ ఓట్లు చీలిపోగా గుజరాతీ, మార్వాడీ, ఉత్తర భారతీయుల ఓట్లు గంప గుత్తగా ఒకే పారీ్టకి పోలవుతాయి. దీంతో స్థానిక ఓటర్లతో పోలిస్తే ఉత్తర భారతీయులు, మైనార్టీల ఓట్లే ఏ ఎన్నికలోనైనా కీలక పాత్ర పోషిస్తాయి. దీంతో బీఎంసీ, అసెంబ్లీ, లోక్‌సభ, ఇతర స్థానిక సంస్ధలు ఇలా ఎలాంటి ఎన్నికలు వచి్చన ప్రతీసారి అన్ని పార్టీల నాయకులు ఉత్తర భారతీయులను, మైనార్టీలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఆ ఓట్లన్నీ బీజేపీకే.. ఇదిలావుండగా 2014 నుంచి ఉత్తర భారతీయ, యువ మరాఠీ ఓటర్లు సహా ఉన్నత వర్గాల ఓటర్లు బీజేపీ దిశగా మళ్లారు. ఇప్పుడు పరిస్థితులు తారుమారయ్యాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి పీఠంపై నెలకొన్న వివాదంతో శివసేన, బీజేపీలు విడిపోయిన సంగతి తెలిసిందే. ఫలితంగా ఉత్తర భారతీయుల ఓట్లు చీలిపోయే ప్రమాదం ఏర్పడింది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా వారిని మరింత ఆకర్శించేందుకు బీజేపీ కొత్త ప్రణాళికలు రూపొందించడం ప్రారంభించింది. అందుకు పదోన్నతులు కల్పించే అంశాన్ని తెరమీదకు తెచి్చంది. ముంబైలో ఉత్తర భారతీయ ఓటర్లు దాదాపు 20 లక్షల మంది ఉన్నారు. ఈ ఓట్లు 2014 నుంచి బీజేపీకే పోలవుతున్నాయి. బీజేపీకి చెక్ పెట్టేందుకు ఇటీవల బీజేపీలో చేరిన కృపాశంకర్ సింగ్‌కు ఉత్తర భారతీయ ఓటర్లలో మంచి పట్టు ఉంది. దీంతో సింగ్‌ను ప్రదేశ్ ఉపాధ్యక్షుడిగా నియమించారు. మరోపక్క బీజేపీకి చెక్ పెట్టేందుకు శివసేన కూడా ప్రయత్నాలు చేస్తోంది. మరాఠీ ఓట్లతో పాటు కీలక పాత్ర పోషించే మైనార్టీల ఓట్లపై ఆ పార్టీ దృష్టి సారించింది. గత బీఎంసీ ఎన్నికల్లో పశ్చిమ అంధేరీ, ములుండ్ నియోజకవర్గాలలో శివసేన కార్పొరేటర్లు ఒక్కరు కూడా గెలవలేకపోయారు. దీంతో శివసేనకు కొత్త ఓటు బ్యాంకును ఏర్పా టు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ముంబైలో 16 లక్షలకుపైగా మైనార్టీ ఓటర్లున్నారు. దీంతో మొహిసిన్ షేక్‌ను యువసేన ఉప కార్యదర్శిగా నియమిస్తే లాభపడతామని శివసేన భావించి ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. చదవండి: BMC Polls 2022: నటులపై కాంగ్రెస్ దృష్టి, సోసూ పేరు కూడా -
బీఎంసీ పీఠమే లక్ష్యం.. సినీ నటులపై దృష్టిపెట్టిన కాంగ్రెస్
సాక్షి, ముంబై: బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ తమ అస్త్రశ్రస్తాలను సిద్ధం చేసుకుంటోంది. ఈసారి బీఎంసీ పీఠాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. బీఎంసీలో గత 25 ఏళ్లుగా ఆధిపత్యం చలాయిస్తున్న శివసేనను ఎలాగైనా గద్దె దింపి తమ బలం పెంచుకోవాలని చూస్తోంది. దీనికోసం సినీనటుల సేవలను వినియోగించుకోవాలని అనుకుంటోంది. అవసరమైతే రితేశ్ దేశ్‌ముఖ్, సోనూసూద్, మిలింద్ సోమణ్లలో ఒకరిని మేయర్ అభ్యర్థిగా ప్రకటించాలని భావిస్తోంది. ఈ మేరకు ముంబై కాంగ్రెస్ నేతలు రాష్ట్ర నాయకత్వానికి ఇప్పటికే సూచించినట్లు సమాచారం. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే బీఎంసీ ఎన్నికల్లో తమ అభ్యర్థులకు కచ్చితంగా ఓట్లు పడతాయని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. ఒకవేళ అదే జరిగితే బీఎంసీ ఎన్నికల్లో శివసేన, కాంగ్రెస్‌ల మధ్య పోరు రసవత్తరంగా మారే అవకాశాలున్నాయి. రాష్ట్ర ప్రభుత్వంలో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ భాగస్వామ్య పారీ్టలుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే, బీఎంసీ ఎన్నికల్లో పోటీచేసే అంశంపై ఈ మిత్ర పక్షాల మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి. బీఎంసీ ఎన్నికల్లో కలిసి పోటీ చేద్దామని శివసేన అంటుంటే, తాము ఒంటరిగానే బరిలోకి దిగుతామని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఒంటరిగా పోటీ చేస్తేనే పార్టీ బలపడుతుందని ముంబై కాంగ్రెస్ నేతలు ఇప్పటికే పలుమార్లు సంకేతాలిచ్చారు. అంతేగాక, దివంగత ముఖ్యమంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ తనయుడు, నటుడు రితేశ్ దేశ్‌ముఖ్ రాజకీయాల్లోకి వస్తారని చర్చ జరుగుతోంది. అది ఈ ఎన్నికల్లోనే జరగవచ్చని కాంగ్రెస్ నేతలు అనుకుంటున్నారు. దీనిపై సోషల్ మీడియాలో కూడా చర్చలు నడుస్తున్నాయి. మరోవైపు ఈ ఊహాగానాలను ఇప్పటికే సోనూ సూద్ తోసిపుచ్చారు. చదవండి : స్పెషల్ ఒలింపిక్స్ గేమ్స్: సోనూ సూద్‌కు అరుదైన గౌరవం బీఎంసీలో అధికారం చేజిక్కించుకోవాలంటే ఉత్తర భారతీయులు, మైనారిటీ ఓట్లు ముఖ్యం కానున్నాయి. ప్రజల్లో నటీనటులపై ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని వచ్చే ఎన్నికల్లో రితేష్ దేశ్‌ముఖ్, సోనూసూద్, మిలింద్ సోమణ్లలో ఒకరిని మేయర్ అభ్యర్థిగా ప్రకటిస్తే గెలుపు ఖాయమని ముంబై కాంగ్రెస్ భావిస్తోంది. బీఎంసీలో గత 25 ఏళ్లుగా శివసేనదే ఆధిపత్యం. దీంతో ఈసారి ఎలాగైనా శివసేన ఆధిపత్యానికి చెక్ పెట్టి, తమ పట్టు నిలుపుకోవాలని ముంబై కాంగ్రెస్ నేతలు పట్టుదలతో ఉన్నారు. -
‘నేడు సూరత్– రేపు ముంబై’
ముంబై సెంట్రల్: ‘నేడు సూరత్– రేపు ముంబై’ ఈ సరికొత్త నినాదంతో ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చే ఏడాది జరగబోయే ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై దృష్టి సారించింది. ఇటీవలే జరిగిన గుజరాత్, సూరత్ నగర కార్పొరేషన్ ఎన్నికల్లో అనూహ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ చెప్పుకోదగ్గ విజయాన్నే సాధించి, 27 సీట్లను కైవసం చేసుకుంది. అదే ఉత్సాహంతో ఇప్పుడు ముంబై మున్సిపల్ ఎన్నికల కోసం సరికొత్త వ్యూహంతో సిద్ధమవుతోంది. రాబోయే ముంబై మున్సిపల్ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో 227 సీట్లలో పోటీ చేస్తామనీ ఆ పార్టీ ఇప్పటికే ప్రకటించింది. రూ.39 వేల కోట్ల వార్షిక బడ్జెట్ కలిగిన ముంబై నగర పాలిక సంస్థ దేశంలోనే ధనిక మున్సిపల్ కార్పొరేషన్‌గా గుర్తింపు పొందింది. దేశంలోని కొన్ని చిన్న రాష్ట్రాల బడ్జెట్ కంటే ఈ బడ్జెట్ పెద్దది. మున్సిపల్ ఎన్నికల కోసం ఆమ్ఆద్మీ పార్టీ నేత ప్రీతీ శర్మను బాధ్యురాలిగా నియమించింది. ఇప్పటి నుంచే ఎన్నికల ప్రచారానికి వ్యూహాత్మకంగా శ్రీకారం చుట్టిన ప్రీతి మాట్లాడుతూ, ‘ముంబై, సూరత్ సంస్కృతుల్లో ఎంతో స్వారూప్యత ఉందని, ఈ రెండు నగరాల మౌలిక సమస్యలు కూడా దాదాపు ఒకే రకంగా ఉంటాయని పేర్కొన్నారు. సూరత్ ప్రజల మాదిరిగానే ముంబై ప్రజలు కూడా సరికొత్త ప్రత్యామ్నాయాన్ని కోరుకుంటున్నారని, రాబోయే ఎన్నికల్లో ఆమ్ఆద్మీ పార్టీ చెప్పుకోదగ్గ విజయాల్ని సొంతం చేసుకుంటుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే 2014లో ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన సుందర్ బాలకృష్ణ మాత్రం ప్రీతీ శర్మ వ్యాఖ్యలతో విభేదించారు. ‘సూరత్ పరిస్థితి వేరని, ముంబైలో ఆమ్ ఆద్మీ పార్టీకి చెప్పుకోదగ్గ కేడర్ లేదన్నారు. ఇక్కడి స్థానిక పార్టీ వ్యవహారాల్లో ఢిల్లీ పెద్దలు అనవసరమైన జోక్యం చేసుకొని పెత్తనం చెలాయిస్తారని, ఆమ్ ఆద్మీకి ముంబైలో విజయం సాధించడం అంత సులువేం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. చదవండి: అంబానీ ఇంటివద్ద కలకలం : మరో కీలక పరిణామం 1975 ఎమర్జెన్సీ కాల దోషం పట్టిన అంశం: సంజయ్ రౌత్ -
శివసేనకు చెక్: పట్టు బిగిస్తున్న బీజేపీ
సాక్షి, ముంబై : దేశంలోనే అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ అయిన బృహన్ ముంబై కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికలకు ప్రధాన పార్టీలు సిద్ధమవుతున్నాయి. అధికార శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీతో పాటు ప్రతిపక్ష బీజేపీ ఈ ఎన్నికను ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. దేశ ఆర్థిక రాజధానితో పాటు అత్యధిక ఆధాయం కలిగిన నగరం కావడంతో ఈ ఎన్నిక ఎంతో ప్రధాన్యత సంతరించుకుంది. దీంతో ఈ ఎన్నికల్లో కచ్చితంగా గెలవాలని పార్టీలన్నీ కంకణం కట్టుకున్నాయి. అయితే ఈసారి ముంబైలో మరాఠా అంశం ఎక్కువగా వినిపిస్తోంది. బీఎంసీలో గెలవాలంటే మరాఠీలను ప్రసన్నం చేసుకోవాలని ఆయా పార్టీలు పావులు కదుపుతుండటం గమనార్హం. శివసేతో విభేదాల కారణంగా అధికార పీఠానికి దూరమైన బీజేపీ ఎలాంటి వ్యూహాలు రచిస్తుందోనని రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. మరోవైపు శివసేనకు బీఎంసీలో మంచి పట్టు ఉండటంతో ఈసారి పోటీ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. మిషన్ 120.. 120 స్థానాలు గెలవాలని భారతీయ జనతా పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు బీజేపీ ‘మిషన్–120’కి శ్రీకారం చుట్టింది. 2022లో బీఎంసీ ఎన్నికలు జరగనున్నాయి. సిట్టింగ్ కార్పొరేటర్లు తమ తమ వార్డు పరిధిలో పెండింగ్‌లో పడిపోయిన అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేయడానికి ప్రాధాన్యత ఇవ్వాలని బీజేపీ అధిష్టానం ఆదేశించింది. బీఎంసీ ఎన్నికలకు సంబంధించిన కులాల రిజర్వేషన్ ఎన్నికల కమిషన్ నుంచి జాబితా విడుదల కాగానే బరిలో ఎలా ముందుకెళ్లాలి, ఎవరిని దింపాలనే దానిపై వ్యూహం రూపొందిస్తామని బీజేపీ నేతలు స్పష్టం చేశారు. ఇక కాంగ్రెస్ ముంబై కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా చరణ్‌సింగ్ సప్రాను, ప్రచార సమితీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి నసీం ఖాన్, సమన్వయ సమితి అధ్యక్షుడిగా అమర్జీత్ మన్హాస్, మ్యానిఫెస్టో, పబ్లిషింగ్ సమితీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి సురేశ్ శెట్టి తదితరులను నియమించి ముంబై ఎన్నికలకు సిద్ధం చేసింది. పట్టు బిగిస్తున్న కమలం.. వచ్చే బీఎంసీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలా..? లేక ఒంటరిగా పోటీ చేయాలా..? అనే దానిపై మహావికాస్ ఆఘాడీ ప్రభుత్వంలోని శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీలు తర్జన భర్జన పడుతున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ బీఎంసీ ఎన్నికల్లో ఎలా ముందుకెళ్లాలనే దానిపై ఇప్పటి నుంచే వ్యూహం రచిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీచేసిన శివసేన ఫలితాల తరువాత ముఖ్యమంత్రి పదవిపై నెలకొన్న వివాదం తారాస్థాయికి చేరుకుంది. చివరకు అది తెగదెంపులు చేసుకునే వరకు దారితీసింది. దీంతో ప్రతిపక్షాలైన కాంగ్రెస్, ఎన్సీపీతో జతకట్టి మహావికాస్ ఆఘాడీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఊహించని విధంగా జరిగిన ఈ పరిణామాలతో ఒంటరైన బీజేపీకి నష్టాన్నే చేకూర్చింది. దీంతో వచ్చే బీఎంసీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసి శివసేనకు తగిన బుద్ది చెప్పాలని బీజేపీ నాయకులు భావిస్తున్నారు. దీంతో మిషన్–120 సంకల్పంతో ముందుకెళ్లాలని బీజేపీ నిర్ణయం తీసుకుంది. బీఎంసీలో మొత్తం 227 స్థానాలున్నాయి. 2017లో జరిగిన కార్పొరేషన్ ఎన్నిల్లో శివసేన, బీజేపీ సొంత బలంపై పోటీ చేశాయి. ఆ సమయంలో శివసేన 97, బీజేపీ 83 స్థానాలు గెలుచుకున్నాయి. కాగా, ఇదివరకు బీజేపీ మొత్తం 227 స్థానాల్లో 100 సీట్లకే పోటీచేసి ఎక్కువ కార్పొరేటర్లను గెలిపించుకునేది. కాని 2017లో మొదటిసారి వేర్వేరుగా పోటీచేసి శివసేనకు బీజేపీ మింగుడు పడకుండా చేసింది. ములుండ్, పశ్చిమ అంధేరీ ప్రాంతాల్లో మొత్తం బీజేపీ కార్పొరేటర్లే విజయఢంకా మోగించారు. ఇలా నగరంతోపాటు ఉప నగరాల్లో అనేక చోట్ల బీజేపీకి మంచి పట్టు ఉంది. దీంతో ఈసారి మిషన్–120 çసంకల్పాన్ని సక్సెస్ చేయాలనే కమలం నాయకులు పట్టుదలతో ఉన్నారు. శివసేనకు చెక్.. బీఎంసీ ఎన్నికలు 2022 ఫిబ్రవరిలో జరిగే అవకాశాలున్నాయి. ఎన్నికలకు నాలుగైదు నెలల ముందు వార్డుల రిజర్వేషన్ జాబితా విడుదలవుతుంది. రిజర్వేషన్ జాబితా విడుదల కాగానే వెంటనే ఎన్నికల పనిలో నిమగ్నమవుతామని బీజేపీ సీనియర్ నాయకులు తెలిపారు. బీజేపీ ముంబై అధ్యక్షుడు మంగల్‌ప్రభాత్ లోఢా మార్గదర్శనంలో, అలాగే ఇతర నాయకులు నేతృత్వంలో బీఎంసీ ఎన్నికలకు వెళతామని బీజేపీ కార్పొరేటర్, ప్రతినిధి బాలచంద్ర శిర్షాట్ స్పష్టంచేశారు. అసెంబ్లీ ఎన్నికల తరువాత ప్రభుత్వం ఏర్పాటులో నమ్మక ద్రోహం చేసిన శివసేనకు ఎలాగైన బుద్ది చెప్పాలని ఉద్ధేశంతో బీఎంసీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నామని కమలం నాయకులు తెలిపారు. -
బీజేపీ మిషన్ @120
సాక్షి, ముంబై: వచ్చే బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కచ్చితంగా 120 స్థానాలు గెలవాలని భారతీయ జనతా పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు బీజేపీ ‘మిషన్–120’కి శ్రీకారం చుట్టింది. 2022లో బీఎంసీ ఎన్నికలు జరగనున్నాయి. సిట్టింగ్ కార్పొరేటర్లు తమ తమ వార్డు పరిధిలో పెండింగ్‌లో పడిపోయిన అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేయడానికి ప్రాధాన్యత ఇవ్వాలని బీజేపీ అధిష్టానం ఆదేశించింది. బీఎంసీ ఎన్నికలకు సంబంధించిన కులాల రిజర్వేషన్ ఎన్నికల కమిషన్ నుంచి జాబితా విడుదల కాగానే బరిలో ఎలా ముందుకెళ్లాలి, ఎవరిని దింపాలనే దానిపై వ్యూహం రూపొందిస్తామని బీజేపీ నేతలు స్పష్టం చేశారు. పట్టు బిగిస్తున్న కమలం.. వచ్చే బీఎంసీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలా..? లేక ఒంటరిగా పోటీ చేయాలా..? అనే దానిపై మహావికాస్ ఆఘాడీ ప్రభుత్వంలోని శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీలు తర్జన భర్జన పడుతున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ బీఎంసీ ఎన్నికల్లో ఎలా ముందుకెళ్లాలనే దానిపై ఇప్పటి నుంచే వ్యూహం రచిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీచేసిన శివసేన ఫలితాల తరువాత ముఖ్యమంత్రి పదవిపై నెలకొన్న వివాదం తారాస్థాయికి చేరుకుంది. చివరకు అది తెగదెంపులు చేసుకునే వరకు దారితీసింది. దీంతో ప్రతిపక్షాలైన కాంగ్రెస్, ఎన్సీపీతో జతకట్టి మహావికాస్ ఆఘాడీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఊహించని విధంగా జరిగిన ఈ పరిణామాలతో ఒంటరైన బీజేపీకి నష్టాన్నే చేకూర్చింది. దీంతో వచ్చే బీఎంసీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసి శివసేనకు తగిన బుద్ది చెప్పాలని బీజేపీ నాయకులు భావిస్తున్నారు. మిషన్–120 సంకల్పంతో ముందుకెళ్లాలని బీజేపీ నిర్ణయం తీసుకుంది. బీఎంసీలో మొత్తం 227 స్థానాలున్నాయి. 2017లో జరిగిన కార్పొరేషన్ ఎన్నిల్లో శివసేన, బీజేపీ సొంత బలంపై పోటీ చేశాయి. ఆ సమయంలో శివసేన 97, బీజేపీ 83 స్థానాలు గెలుచుకున్నాయి. కాగా, ఇదివరకు బీజేపీ మొత్తం 227 స్థానాల్లో 100 సీట్లకే పోటీచేసి ఎక్కువ కార్పొరేటర్లను గెలిపించుకునేది. కాని 2017లో మొదటిసారి వేర్వేరుగా పోటీచేసి శివసేనకు బీజేపీ మింగుడు పడకుండా చేసింది. ములుండ్, పశ్చిమ అంధేరీ ప్రాంతాల్లో మొత్తం బీజేపీ కార్పొరేటర్లే విజయఢంకా మోగించారు. ఇలా నగరంతోపాటు ఉప నగరాల్లో అనేక చోట్ల బీజేపీకి మంచి పట్టు ఉంది. దీంతో ఈసారి మిషన్–120 సంకల్పాన్ని సక్సెస్ చేయాలనే కమలం నాయకులు పట్టుదలతో ఉన్నారు. శివసేనకు చెక్! బీఎంసీ ఎన్నికలు 2022 ఫిబ్రవరిలో జరిగే అవకాశాలున్నాయి. ఎన్నికలకు నాలుగైదు నెలల ముందు వార్డుల రిజర్వేషన్ జాబితా విడుదలవుతుంది. రిజర్వేషన్ జాబితా విడుదల కాగానే వెంటనే ఎన్నికల పనిలో నిమగ్నమవుతామని బీజేపీ సీనియర్ నాయకులు తెలిపారు. బీజేపీ ముంబై అధ్యక్షుడు మంగల్‌ప్రభాత్ లోఢా మార్గదర్శనంలో, అలాగే ఇతర నాయకులు నేతృత్వంలో బీఎంసీ ఎన్నికలకు వెళతామని బీజేపీ కార్పొరేటర్, ప్రతినిధి బాలచంద్ర శిర్షాట్ స్పష్టంచేశారు. అసెంబ్లీ ఎన్నికల తరువాత ప్రభుత్వం ఏర్పాటులో నమ్మక ద్రోహం చేసిన శివసేనకు ఎలాగైన బుద్ది చెప్పాలని ఉద్ధేశంతో బీఎంసీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నామని కమలం నాయకులు తెలిపారు. (చదవండి: ఫడ్నవిస్‌తో శరద్ పవార్ భేటీ..!)