ఆసియాలో నీటికి ఢోకా లేదు
బీజింగ్: బ్రహ్మపుత్ర, సింధూ నదులతో పాటు ఆసియాలోని చాలా నదులల్లో నీటి నిల్వలకు ఢోకా లేదు. భవిష్యత్తులో ఆసియా ఖండం నదుల్లోని నీళ్లు అడుగంటిపోయి నీటి కటకట ఏర్పడుతుందని పర్యావరణ నిపుణులు భావిస్తున్నట్లు ఏమి జరగదని ఒక కొత్త అధ్యయనంలో ఈ మేరకు వెల్లడైంది.
రానున్న దశాబ్దాల్లో ఆసియా నదుల్లో నీటి నిల్వలు పెరగనున్నట్లు అధ్యయనం తేల్చింది. చైనా, భారత్ ఇతర ఆగ్నేయాసియా దేశాల్లో చాలా వేగంగా సామాజిక, ఆర్థిక అభివృద్ధి విస్తరించడమే దీనికి కారణమని స్వీడన్లోని గొతేన్బర్గ్ వర్సిటీ ప్రొఫెసర్ డెలియాంగ్ చెన్ పేర్కొన్నారు.