breakfast menu
-
బ్రేక్‌ఫాస్ట్‌లో ఇవి తీసుకుంటున్నారా.. పండ్ల రసంతో ట్యాబెట్లు తీసుకుంటే!
మంచి పోషక విలువలు కలిగిన ఆహారాన్ని ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటే అది శరీరానికి ఒక రోజుకు అవసరమయ్యే శక్తిని అందివ్వడమే కాకుండా ఆ రోజులో మిగతా సమయం అంతా అతిగా తినటాన్ని కూడా నియంత్రించి శరీరంలో సమతుల్యతను కాపాడుతుందన్న ఆరోగ్య నిపుణుల సలహా అందరికీ తెలిసిందే. చెప్తున్నారు. అయితే ఏది పడితే అది అనారోగ్యకరమైన తిండి తినడం కంటే కూడా బ్రేక్‌ఫాస్ట్ చేయకపోవడమే చాలా ఉత్తమం అంటున్నారు న్యూట్రిషనిస్టులు. ఒకవేళ కొన్నిసార్లు మీరు బ్రేక్‌ఫాస్ట్ చేయకుండా వెళ్లిన సందర్భాల్లో మంచి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటే ఎలాంటి సమస్యా ఎదురు కాదు. ఉండదు. గుడ్లు ఒక అధ్యయనం ప్రకారం ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో గుడ్లు తీసుకుంటే ఆ వెంటనే కడుపు నిండినట్లుగా అనిపిస్తుంది. ఆ రోజులోని మిగతా సమయంలో తీసుకునే ఆహారం కూడా ఎక్కువ, తక్కువ కాకుండా కావాల్సిన మేరకే తీసుకుంటాం. తద్వారా శరీరంలో కేలరీలు తగ్గుతాయి. అంతేకాకుండా రక్తంలో షుగర్, ఇన్సులిన్ స్థాయులు నియంత్రణలో ఉంటాయని వెల్లడైంది. గుడ్ల సొనలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కంటికి బలాన్నిస్తాయి. ఇవి శరీరానికి కావాల్సిన ముఖ్యమైన ప్రోటీన్లు, పోషకాలు అందజేస్తాయి. ఓట్ మీల్ బ్రేక్‌ఫాస్ట్ తయారు చేసుకునే సమయం లేనప్పుడు ఓట్ మీల్‌కు ఓటెయ్యడం ఉత్తమం. దీనిని చాలా సులువుగా తయారు చేసుకోగలగడమే గాక చాలా ఉత్తమమైనది కూడా. ఎందుకంటే, ఓట్ మీల్స్‌లో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోటీన్లు ఉంటాయి. ఇవి శరీరంలోని కొవ్వును అదుపు చేయడంలో తోడ్పడతాయి. రక్తపోటు, ఊబకాయం, హృద్రోగ సమస్యలు ఉన్నవారికి ఓట్ మీల్ మంచి బ్రేక్‌ఫాస్ట్. ఓట్ మీల్‌ను పాలతో కలుపుకొని తినడం లేదా ఉప్మాలా తిరగమోత వేసుకుని తినడం వల్ల ఈ సుగుణాలు అందుతాయి. చదవండి: Recipe: పాలిచ్చే తల్లికి తగిన శక్తినిచ్చే ఆహారం.. తామర గింజలతో పాంజిరి పండ్లు మీ రోజు ఫలవంతంగా సాగాలంటే ఉదయాన్నే పొట్టను పండ్లతో నింపేస్తే సరి. పండ్లు ఆరోగ్యానికి ఎంత మంచివో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీటిలో ఎన్నో విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. కావాల్సినంత ఫైబర్, శరీరానికి అవసరమయ్యే హైడ్రేషన్ కూడా పండ్ల ద్వారా లభిస్తుంది. ఒక కప్పు ఆపిల్ ముక్కలు, లేదా సిట్రస్ జాతికి చెందిన నారింజ, సంత్ర పండ్లు లేదా బెర్రీస్ ఏవైనా సరే మంచి బ్రేక్‌ఫాస్ట్ జాబితాలో ఉంటాయి. చదవండి: Health Tips: బెండకాయ తరచూ తింటున్నారా? పెద్ద పేగు క్యాన్సర్.. ఇంకా నట్స్, సీడ్స్ నట్స్ తినటానికి రుచిగా ఉండటమే కాదు, వాటి నుంచి శరీరానికి లభ్యమయ్యే పోషకాలు కూడా అధికంగానే ఉంటాయి. నట్స్ లో కేలరీలు చాలా ఉన్నా కొవ్వు ఏ మాత్రం రాదు. బరువు తగ్గటానికి నట్స్ చాలా ఉపయోగకరం, వీటిలో మెగ్నీషియం, పొటాషియం లాంటి మినరల్స్ శరీరానికి అందుతాయి. రోజు ఉదయం గుప్పెడు నట్స్ తీసుకోవటం ఆరోగ్యకరం. అలాగే ఫ్లాక్స్ సీడ్స్ అంటే అవిసె గింజలు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఫ్లాక్స్ సీడ్స్ శరీరంలో షుగర్ లెవెల్స్‌ను నియంత్రణలో ఉంచుతూ, ఇన్సులిన్ ను అందిస్తాయి. బ్రెస్ట్ క్యాన్సర్ లాంటి ప్రాణాంతక రోగాలనుంచి రక్షణ లభిస్తుంది. ఒక విషయం సాధారణంగా అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఎవరైనా టాబ్లెట్స్ వేసుకోవడం సహజమే. ఐతే మంచినీళ్లతో మాత్రలు వేసుకుంటే ఫర్వాలేదు కానీ కొందరు టాబ్లెట్లను రకరకాల పద్ధతుల్లో వేసుకుంటుంటారు. అందులో భాగంగా పండ్ల రసంతో మాత్రలు తీసుకుంటే బాగా పని చేస్తాయనే ఉద్దేశ్యంతో నారింజ లేదా నిమ్మరసంతో కలిపి మాత్రలను మింగే ప్రయత్నం చేస్తుంటారు. అయితే ఇలా చేయడం వల్ల మేలు జరగకపోగా, ప్రమాదం ఎదురుకావొచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. నారింజ లేదా ఇతర సిట్రస్ పండ్లను తీసుకున్నప్పుడు, సిట్రస్ పండ్లలో ఉండే రసాయనాలు పేగులో చర్య జరిపి ఔషధం ప్రభావాన్ని తగ్గిస్తాయి. వీటి రసంతో ఔషధాన్ని తీసుకోవడం వల్ల ప్రేగు కణాలు వాటి రూపాన్ని మార్చుకుంటాయి. ఫలితంగా ఔషధంలో ఉన్న రసాయనం పనిచేయకుండా పోయే ప్రమాదం ఉంది. కనుక అలా చేయరాదని వైద్యులు చెబుతున్నారు. -
బడుల్లో బ్రేక్‌ఫాస్ట్
సాక్షి, నారాయణఖేడ్(మెదక్) : పేద విద్యార్థుల్లో పౌష్టికాహార లోపం సమస్య తీర్చడంతోపాటు, పాఠశాలల హాజరు శాతం పెంచాలన్న సదుద్దేశంతో ప్రభుత్వం పాఠశాలల విద్యార్థులకు మధ్యాహ్న భోజనానికి తోడు ఉదయం పూట అల్పాహారం (బ్రేక్‌ఫాస్ట్) కూడా వడ్డించాలని యోచిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తుండడంతో కొన్నేళ్లుగా విద్యార్థుల హాజరు శాతం పెరుగుతూ వస్తోంది. దీనికి తోడు పిల్లల్లో పౌష్టికాహార లోపం సమస్య కూడా కొంత వరకు తీర్చగలుగుతున్నారు. దీనికి తోడు ఉదయం పూట అల్పాహారం కూడా అందించాలని ప్రభుత్వం యోచిస్తుండడంతో జిల్లాలోని లక్ష పై చిలుకు ప్రాథమిక పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఇప్పటివరకు ఒక్కొక్కరికి మధ్యాహ్న భోజనం కోసం రూ.4.13 ఇచ్చే వారు. ఇప్పటి నుండి రూ.4.35లకు పెంచారు. ప్రాథమికోన్నత పాఠశాలల్లో విద్యార్థులకు రూ.6.18 నుండి రూ.6.51కి పెంచారు. విద్యార్థులకు వారంలో రెండు రోజులపాటు గుడ్డును అందిస్తున్నారు. గతంలో ఒక్కో గుడ్డుకు రూ.4 చెల్లించగా, ఇప్పుడు రెండు రూపాయిలు పెంచి రూ.6 చెల్లించనున్నారు. ప్రస్తుతం విద్యార్థులకు సన్న బియ్యంతో భోజనం అందిస్తున్నారు. పెరిగిన ధరలతో విద్యార్థులందరికీ నాణ్యమైన భోజనం అందనుంది. విద్యార్థులకు మేలు జరగనుంది. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం వల్ల విద్యార్థుల్లో పౌష్టికాహారం లోపం సమస్య తీర్చడానికి తోడు విద్యార్థుల హాజరు శాతం పెరిగేందుకు దోహద పడుతుంది. ఆయా పాఠశాలల్లో చదువుతున్న చిన్నారులు తీవ్ర పౌష్టికాహార లేమితో బాధపడుతున్నారు. ఒక పూట ఆహారం అందించడం వల్ల కొంతవరకు సమస్య తగ్గింది. రెండు పూటలా ఆహారం అందిస్తే వారిలో పౌష్టికాహార లేమి చాలా మటుకు దూరం చేయవచ్చు. ఉచితంగా ఆహారం అందించడం ద్వారా పేద కుటుంబాల పిల్లలు బడులకు వచ్చే అవకాశమూ ఉంటుంది. అల్పాహారంలో భాగంగా విద్యార్థులకు పాలు, పండ్లు ఇవ్వాలని అధికారులు యోచిస్తున్నారు. ఈ మేరకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ దీనిపై కసరత్తు చేస్తోంది. అల్పాహారం అందించడం వల్ల దేశవ్యాప్తంగా సుమారు 12లక్షల ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలల్లో చదివే 12 కోట్ల మంది చిన్నారులకు లబ్ధి చేకూరుతోందని అధికారులు అంచనా వేశారు. త్వరలోనే ప్రయోగాత్మకంగా కొన్ని జిల్లాల్లో ఆరంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో 862 ప్రాథమిక పాఠశాలలు ఉండగా ఇందులో 48,614మంది విద్యార్థులు, 199 ప్రాథమికోన్నత పాఠశాలలు ఉండగా ఇందులో 16,470మంది విద్యార్థులు ఉన్నత పాఠశాలలు 203 ఉండగా ఇందులో 62,360 మంది విద్యార్థులు చదువుతున్నారు. జిల్లా మొత్తంలో 1,264పాఠశాలల్లో 1,27,444మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. పథకం అమలుతో ఈ విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. ధరల పెంపుతో భోజనం మెరుగు.. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనం మెనూ చార్జీలు పెరిగాయి. దీంతో వారికి నాణ్యమైన భోజనం అందనుంది. గతంలో ధరలు తక్కువగా ఉండడంతో నాణ్యమైన భోజనం అందించడం నిర్వాహకులకు కష్టంగా మారేది. రోజురోజుకూ కూరగాయల ధరలతో పాటు, నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరుగుతున్నాయి. అందుకు అనుగుణంగా మధ్యాహ్న భోజనం ధరలు పెరగకపోవడంతో నిర్వాహకులు నాణ్యమైన ఆహారాన్ని అందించలేని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కేటగిరీల వారీగా మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. -
మెక్‌డీలో ఇక మసాలా దోశ బర్గర్లు, అండా బుర్జీ!
ఇంతకాలం పీజాలు, బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైస్ అంటూ విదేశీ రుచులను మాత్రమే అందిస్తూ వచ్చిన బహుళజాతి సంస్థ మెక్‌డోనాల్డ్స్ రెస్టారెంట్ ఇప్పుడు దారి మార్చుకుంది. మసాలా దోశ బర్గర్లు, మొలాగా పోడి సాస్, అండా భుర్జీ.. ఇలాంటి వాటన్నింటినీ తన బ్రేక్‌ఫాస్ట్ మెనూలో చేరుస్తోంది. ముంబైలో త్వరలోనే మెక్‌డోనాల్డ్స్ రెస్టారెంటులో ఈ స్వదేశీ బ్రేక్‌ఫాస్ట్ మెనూ రానుంది. ఇంతకాలం ఫ్రై ఐటెమ్స్ మీదే ఎక్కువగా దృష్టిపెట్టిన ఈ సంస్థ.. ఈ కొత్త రుచులను మాత్రం గ్రిల్డ్ పద్ధతిలో అందిస్తామని చెబుతోంది. ముంబైలోని మొత్తం 44 మెక్‌డీ ఔట్లెట్లలో ఈనెల 13 నుంచి కొత్త రుచులు అందుబాటులోకి వస్తాయి. రూ. 30 నుంచి రూ. 135 వరకు ధరలలో ఇవి ఉన్నాయి. మెక్‌డెలివరీ, టేకెవే కియోస్క్‌ల ద్వారా కూడా ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను అందిస్తామని చెబుతున్నారు. త్వరలోనే దేశవ్యాప్తంగా కూడా ఈ కొత్త మెనూను అందిస్తామన్నారు. ఎక్కువమంది బ్రేక్‌ఫాస్ట్ సెగ్మెంటులోకే వస్తున్నారని, అందువల్ల ఈ మార్కెట్ మరింత విస్తరించే అవకాశం ఉందని వెస్ట్‌లైఫ్ డెవలప్మెంట్ సంస్థ వైస్ చైర్మన్ అమిత్ జతియా చెప్పారు. ఈ సంస్థ పశ్చిమ, దక్షిణ భారతదేశాల్లోని 240 మెక్‌డీ రెస్టారెంటులను నిర్వహిస్తోంది. అందుకోసమే తాము వెస్ట్రన్ సర్వీసుల కంటే భారతీయ బ్రేక్‌ఫాస్ట్ మార్కెట్లోకి వస్తున్నామని ఆయన తెలిపారు.