Brooks
-
దందా దర్జాగా..
ఖమ్మంరూరల్: అక్రమార్కులు వాగులు, వంకలు వదలకుండా యథేచ్ఛగా ఇసుకను తోడేస్తున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా ట్రక్కులకొద్దీ తరలిస్తూ దర్జాగా దందా కొనసాగిస్తున్నారు. పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని తెలిసినా.. వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తూ ట్రాక్టర్లలో ఇసుకను రవాణా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లాలో ఇంత దందా నడుస్తున్నా రెవెన్యూ, మైనింగ్, పోలీసు అధికారులు ఇసుక అక్రమ రవాణాదారుల పట్ల చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఖమ్మం నగరం, రూరల్, అర్బన్ ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఊపందుకోవడంతోపాటు భవన నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. ఇందులో ప్రతి పనికి ఇసుక అవసరం ఉండడంతో అక్రమ వ్యాపారులు దీనిని వారికి అనుకూలంగా మార్చుకుంటున్నారు. ప్రభుత్వ నిబంధనలను గాలికొదిలి ఇష్టానుసారంగా ధరలు పెంచి ఇసుకను విక్రయిస్తున్నారు. జిల్లాలోని వాగులు, వంకల్లో నుంచి అనుమతి లేకుండా ఇసుకను తరలించి లక్షలు గడిస్తున్నారు. ట్రాక్టర్ ఇసుకను రూ.6వేల నుంచి రూ.7వేల చొప్పున అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లాలోని తిరుమలాయపాలెం, ముదిగొండ, కూసుమంచి, ఖమ్మం రూరల్, నేలకొండపల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. సోలీపురం, కాకరవాయి, పిండిప్రోలు, హైదర్‌సాయిపేట ప్రాంతాల్లోని ఆకేరు, పాలేరు కాల్వల నుంచి ఇసుకను ట్రాక్టర్ల ద్వారా నిత్యం తరలిస్తూనే ఉన్నారు. కూసుమంచి మండలంలోని పాలేరు ఏరు, జక్కేపల్లి ఏరు, రాజుపేట, ఈశ్వరమాదారం పరిధిలోని పాలేరు ఏటి నుంచి, సూర్యాపేట జిల్లా మోతె మండలం ఉర్లుగొండ, తుమ్మగూడెం ఏటి నుంచి కూసుమంచి మండలం నాయకన్‌గూడెం ద్వారా ఇసుకను యథేచ్ఛగా తరలిస్తున్నారు. ఖమ్మం రూరల్ మండలం తనగంపాడు, కస్నాతండా, కాచిరాజుగూడెం, మహబూబాబాద్ జిల్లా ముల్కలపల్లి, చిలుక్కోయలపాడు నుంచి ఇసుకను ట్రక్కుల్లో రవాణా చేస్తున్నారు. రూరల్ మండలం వెంకటగిరి పరిసర ప్రాంతాల నుంచి అర్ధరాత్రి, పట్టపగలు నిత్యం ట్రాక్టర్లలో ఇసుకను ఖమ్మం నగరానికి తరలిస్తున్నారు. నేలకొండపల్లి మండలం పైనంపల్లి, రామచంద్రాపురం, సుర్ధేపల్లి గ్రామాల పరిధిలోని పాలేరు ఏటి నుంచి ఇసుకను యథేచ్ఛగా తరలిస్తున్నారు. ముదిగొండ మండలం గంధసిరి నుంచి ప్రతి రోజూ రాత్రి వేళల్లో వందల ట్రక్కుల ఇసుక ఎలాంటి అనుమతులు లేకుండా తరలుతూనే ఉంది. ‘వాల్టా’ ఉల్టా.. ఇదిలా ఉండగా.. ఎక్కడైనా ఇసుక తవ్వాలంటే ముందుగా అధికారుల నుంచి అనుమతి పొందాలనేది ప్రభుత్వ నిబంధన. ఇందుకోసం వాల్టా చట్టాన్ని ఏర్పాటు చేసింది. దీనికి జిల్లాస్థాయిలో కలెక్టర్ చైర్మన్, మండలస్థాయిలో తహసీల్దార్ చైర్మన్‌గా వ్యవహæరిస్తారు. అలాగే భూగర్భ జలవనరుల ఏడీ కూడా ఇందులో సభ్యుడిగా ఉంటారు. వీరి అనుమతితోనే ఇసుకను తవ్వాల్సి ఉంటుంది. అది కూడా ఇసుక తవ్వే ప్రాంతంలో భూగర్భ జలవనరులకు ఎటువంటి ఇబ్బంది ఉండదనుకుంటేనే సంబంధిత అధికారులు తవ్వకాలకు అనుమతిస్తారు. నిబంధనల ప్రకారం ఎక్కడైనా ఇసుకను లోతుగా తవ్వకూడదు. అలా చేస్తే భూగర్భ జలాలు ఇంకిపోవడమే కాకుండా భవిష్యత్‌లో నీటి కొరత ఏర్పడుతుంది. దీంతో నిబంధనల ప్రకారం అనుమతి తీసుకొని ఇసుకను తవ్వాల్సి ఉంటుంది. నిబంధనలు గాలికి.. నిబంధనలను తుంగలో తొక్కిన అక్రమార్కులు కాల్వలు, ఏటిలో నుంచి ఇసుకను తరలిస్తూనే ఉన్నారు. అధికారులు కూడా చూసీచూడనట్లు వ్యవహరించడంతో ఈ వ్యవహారమంతా అధికారుల కనుసన్నల్లోనే జరుగుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తూతూ మంత్రంగా ఇసుక ట్రాక్టర్లను పట్టుకోవడం.. తర్వాత పైరవీలు చేయగానే వాటిని వదిలేస్తుండటంతో అక్రమార్కులు తమకేమీ కాదులే అనే ధీమాతో తమ పని తాము చేసుకుపోతున్నారు. ఎక్కడైనా పేదలు ఇళ్ల నిర్మాణానికి ట్రక్కు ఇసుక కావాలంటే రూ.8వేల పైచిలుకు పలుకుతోంది. వాస్తవంగా పేదలు తమ అవసరాలకు ఇసుక కొనాలంటే ట్రక్కు ఇసుక ధర వేలల్లో పలకడంతో పేదలు తీవ్రంగా నష్టపోతుండగా.. çఅక్రమార్కులు మాత్రం లక్షలు దండుకుంటున్నారు. పట్టించుకోని అధికారులు అక్రమ ఇసుక రవాణాను అరికట్టాల్సిన రెవెన్యూ, మైనింగ్, పోలీస్ అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారులు చూసీచూడనట్లు ఉండటం వల్లే రెచ్చిపోయి మరీ పగలు, రాత్రి తేడా లేకుండా ఇసుకను తరలిస్తున్నారు. వారం రోజుల క్రితం తిరుమలాయపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఏకంగా ఏడు ట్రాక్టర్ల ఇసుకను అక్రమ రవాణాదారులు తరలిస్తుండగా.. అక్కడి పోలీసులు పట్టుకున్నారు. అనంతరం ట్రాక్టర్ యజమానులకు జరిమానా విధించగా.. ఎంతో కొంత జరిమానా కట్టి తమ పని కానీయొచ్చనే ధీమాతో అక్రమార్కులు ఉన్నారు. ఏదేమైనా అధికారుల మెతక వైఖరితోనే ఇసుక రవాణా నిరంతరం కొనసాగుతోంది. మా పరిధిలో లేదు.. జిల్లాలో తరలుతున్న ఇసుక అక్రమ రవాణాను అరికట్టాల్సింది స్థానిక తహసీల్దార్లే. మేము కేవలం ప్రభుత్వపరంగా పెద్ద పెద్ద నదుల నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తే పట్టుకుని చర్యలు తీసుకుంటాం. అయినా మా దృష్టికి వస్తే ఇసుక అక్రమ రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. – నర్సింహారెడ్డి, మైనింగ్ ఏడీఏ ఎవరినీ వదిలిపెట్టం.. అక్రమంగా ఇసుక తరలించే వారిపై ఇప్పటికే అనేకమార్లు చర్యలు తీసుకున్నాం. ఈ విషయంలో ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇసుక అక్రమ రవాణాపై తమ సిబ్బందిచే నిఘా మరింతగా పెంచుతాం. ట్రాక్టర్లు ఇసుక రవాణా చేస్తున్నట్లు కనిపిస్తే పట్టుకుని సీజ్ చేస్తాం. – నర్సింహారావు, ఖమ్మం రూరల్ తహసీల్దార్ ఖమ్మం రూరల్ మండలంలో అక్రమంగా తరలుతున్న ఇసుక -
ఘట్కేసర్లో పొంగి పొర్లుతున్న వాగులు
-
వరంగల్ అతలాకుతలం
ఎడతెరిపి లేని వర్షం ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు కొట్టుకుపోయిన రోడ్లు.. నీటమునిగిన పంటలు జిల్లా కేంద్రాన్ని ముంచెత్తిన వరద పొంగిపొర్లిన నాలాలు.. రాకపోకలకు అంతరాయం పాఠశాలలకు సెలవు ప్రకటించిన కలెక్టర్ జిల్లా యంత్రాంగం అప్రమత్తం సహాయక చర్యల్లో నిమగ్నం నగరంలో పునరావాస కేంద్రాలు పరిస్థితిని సమీక్షిచిన డిప్యూటీ సీఎం, కలెక్టర్ హన్మకొండ అర్బన్ : భారీ వర్షాలకు జిల్లా అతలాకుతలమైంది. 12మండలాల్లో 12 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ వర్షపాతం నమోదైంది. జిల్లాలోని 90 శాతానికి పైగా చెరువులు మత్తడి పోస్తున్నాయి. వరద ఉధృతికి 56 చెరువులకు గండ్లు పడ్డాయి. చాలా చోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి. 17 ఇళ్లు పూర్తిగా, 168 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. 14 గొర్రెలు, ఒక ఎద్దు మృత్యువాత పడ్డాయి. హన్మకొండ గోపాల్‌పూర్‌లోని 33/11కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ పూర్తిగా నీటమునిగింది. వరంగల్ నగరంలోని చాలా కాలనీలు జలమయమయ్యాయి.ఽ సుమారు 6వేల మందిని 17 పునరావాస కేంద్రాలకు తరలించారు. డ్రెయినేజీలు పొంగిపొర్లడంతో చాలాచోట్ల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. నర్సంపేట మండలం మాదన్నపేట గ్రామంలో బలుసుపూరి కృష్ణ చెరువులో చేపలు పట్టడానికి వెళ్లి వరదలో పడి గల్లంతయ్యాడు. 26వేల హెక్టార్లు పంటన ష్టం భారీ వర్షాలు అన్నదాతను దెబ్బతీశాయి. వర్షాల కారణంగా జిల్లా వ్యాప్తంగా 26వేల హెక్టార్లు పంటనష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. వరి, పత్తి, మిర్చి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. పంట నష్టం పెరగకుండా ఉండేందుకు అధికారులు అప్రమత్తంగా ఉంటూ రైతులకు తగు సూచనలు ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. నగరంలో ఉప ముఖ్యమంత్రి పర్యటన నగరంలో వర్షాల వల్ల నీట మునిగిన కాలనీలను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సందర్శించారు. హన్మకొండలోని గోపాల్పూర్, ఎస్ఆర్నగర్, శ్యామల గార్డెన్ ప్రాంతాల్లో వరద పరిస్థితిని పరిశీలించారు. అధికారులు ప్రమత్తంగా ఉండి అవసరమైన చర్యలు తీసుకోవాలని అదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని వారికోసం ప్రత్యేకంగా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి భోజనం ఏర్పాట్లు చేయాలని యంత్రాంగాన్ని ఆదేశించారు. స్థానిక ఎమ్మెల్యేలు వరద ప్రాంతాల్లో పర్యటించారు. కలెక్టర్ అత్యవసర సమావేశం వర్షాలపై వాతావరణ శాఖ నుంచి ముందస్తు సమాచారం అందడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. కలెక్టరేట్లో టోల్ ఫ్రీ నంబర్‌తో కంట్రోల్ రూం 24గంటలూ పనిచేసే విధంగా ఏర్పాటు చేశారు. రెవెన్యూ, పోలీస్, నీటిపారుదల, పశు సంవర్థక శాఖ. వైద్యారోగ్యశాఖ, వ్యవసాయ శాఖల ఉన్నతాధికారులతో జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ శుక్రవారం ఉదయం అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. అధికారులకు సెలవులు రద్దు చేశారు. అధికారులు స్థానికంగా అందుబాటులో ఉంటూ వర్షాలు, వరదల విషయంలో ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. అన్ని ఆర్డీఓ కార్యాలయంలో వరదల సమాచారం విషయంలో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రతి చెరువును అధికారులు సందర్శించి పరిస్థితి సమీక్షించాలని, గండ్లు పడకుండా అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవాలని చెప్పారు. భారీ వర్షాల కారణంగా జిల్లాలోని పాఠశాలలకు కలెక్టర్ సెలవు ప్రకటించారు. ప్రైవేటు స్కూల్స్, కాలేజీలు చాలావరకు తెరుచుకోలేదు. అత్యధికంగా గీసుకొండలో 20 సెం.మీ వర్షం గురువారం రాత్రి నుంచి కుండపోతగా కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని దాదాపు అన్ని మండలాల్లో అత్యదిక వర్షపాతం నమోదైంది. గోవిందరావుపేట, డోర్నకల్ మండలాలు మినహా మిగతా మండలాల్లో సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం నమోదైంది. 12 మండలాల్లో 12సెం.మీ కన్నా ఎక్కువ వర్షం కురిసింది. భూపాలపల్లి మండలంలో ప్రస్తుతం అతి తక్కువ వర్షపాతం(0.5సెం.మి) నమోదైంది. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు జిల్లాలో నమోదైన వర్షపాతం వివరాలు ఇలా వున్నాయి.. చేర్యాల-11.4 సెం.మీ, మద్దూరు 13.5, నర్మెట 11.5 జనగామ 8.4, లింగాలఘణపురం 11.1. రఘునాథ్‌పల్లి 14. స్టేషన్‌ఘన్‌పూర్ 13.6, ధర్మసాగర్ 18.1, హసన్‌పర్తి 10.5, హన్మకొండ 16, వర్ధన్నపేట 9.9, జఫర్‌గఢ్ 9.6, పాలకుర్తి 6.9, దేవరుప్పుల 9, కొండకండ్ల 12, రాయపర్తి 5.3, తొర్రూరు 7.3, నెల్లికుదురు 7.5, నర్సింహులపేట 4. మరిపెడ 3.3, డోర్నకల్ 1.8, కురవి 5, మహబూబాబార్ 5.2, కేసముంద్రం 7.8, నెక్కొండ 13, గూడూరు 10, కొత్తగుడ 12.5, ఖానాపూర్ 12.7, నర్సంపేట 11.4, చెన్నారావుపేట 11.5, పర్వతగిరి 7.2, సంగెం 13.1, నల్లబెల్లి 9, దుగ్గొండి 10, గీసుకొండ 20, ఆత్మకూరు 5.6, శాయంపేట-5.6, పరకాల 2.5, రేగొండ 3.1, మొగుళ్లపల్లి 2.8, చిట్యాల 3.2, భూపాలపల్లి 0.5, గణపురం 1.9, ములుగు 4.3, వెంకటాపురం 3.2, గోవిందరావుపేట 2.8, తాడ్వాయి 4, ఏటూరునాగారం 1.9, మంగపేట 6.2, వరంగల్ 12.4 సెం.మీ వర్షపాతం నమోదైంది. -
కుమ్మరించిన వాన
మూడు రోజులైంది ఒకటే వాన... కాసేపు తెరిపిస్తే... గంటపాటు కుమ్మరింపు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం జిల్లామొత్తం చూపిస్తోంది. నాలుగు మండలాలు మినహా అంతటా ఒక మోస్తరు వానలు కురిశాయి. వాగులు, చెరువులు నిండగా... నదులు మాత్రం స్థిరంగానే ఉన్నాయి. జనజీవనానికి మాత్రం కాస్త ఆటంకం ఏర్పడుతోంది. వ్యవసాయానికి ఇవి అనుకూలమని నిపుణులు చెబుతున్నారు. శ్రీకాకుళం పాతబస్టాండ్ : జిల్లా వ్యాప్తంగా మూడు రోజులుగా ఆగకుండా ఒక మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. అల్ప పీడన ప్రభావంవల్ల శనివారం భారీగానే వర్షం కురిసింది. దీని ప్రభావంవల్ల వేసవిలో ఎండిన చెరువులు, చిన్నచిన్న వాగులు కాస్త జలసిరితో కళకళలాడుతున్నాయి. వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్ప పీడనం క్రమంగా బలపడి శనివారం నాటికి వాయుగుండంగా మారింది. దీనికితోడు నైరుతి రుతుపవనాలు కూడా సహకరించడంతో అనుకున్నదాని కంటే అధికంగా వర్షాలు కురుస్తున్నాయి. ఖరీఫ్ సీజన్ ఈ ఏడాది అలస్యంగా వస్తుందని రైతులు భావించినా అల్పపీడనం అనుకూలించంతో రైతులు తమ పనుల్లో తలమునకలయ్యారు. జిల్లాలో ప్రధానంగా వంశధార, నాగావళి, బాహుదా తదితర నదులు నిలకడగా ఉన్నాయి. నాగావళి నదిపై శ్రీకాకుళం పాత బిడ్జి వద్ద పాదచారుల కోసం వేసిన కాజ్వే నీటి ప్రవాహానికి కొట్టుకుపోయింది. నాగావళి, వంశధారలో సాధారణంగానే నీరు ప్రవహిస్తోంది. మరో రెండు రోజులపాటు వానలు అధికంగా కురిసినట్టయితే నదిలో ప్రవాహం పెరిగే అవకాశం ఉంది. ఒడిశాలోనూ అల్పపీడన ప్రభావం ఉండటంవల్ల క్యాచ్మెంట్ ఏరియాలో భారీవర్షాలు కురిసినట్టయితే జిల్లాలో నదులు పొంగవచ్చు. సాధారణం కంటే అధికమే... జిల్లాలో జూన్ నెల సాధారణ వర్షపాతం కంటే 21 మండలాల్లో అధికంగానే నమోదైంది. 4 మండలాల్లోనే తక్కువగా నమోదైంది. ఈ నెల సాధారణ వర్షపాతం 5125.9 మిల్లీ మీటర్లుకాగా ఇప్పటికే 4446 మి.మీటర్ల వర్షం పడింది. జిల్లా వ్యప్తంగా శుక్రవారం 233.8 మి.మీలు వర్షం కురవగా, శనివారం 734 మి.మీలు కురిసింది. సగటున శనివారం 19.3 మి.మీలు వాన కురిసింది. అత్యధికంగా సీతంపేటలో 32మి.మీ., లావేరులో 33.2 మిమీ, రణస్టలంలో 35, జి సిగడాంలో 34,8, గారలో 31.2, సంతబొమ్మాళిలో 30.2, వంగరలో 27.4, నరసన్నపేటలో 28, పోలాకిలో 29.8, కోటబొమ్మాళిలో 26.6, నందిగాంలో 29.2, సంతకవిటిలో 10.4, భామినిలో 7.2, హిరమండలంలో 8.4, బూర్జలో 6, సరుబుజ్జిలిలో 7.6, సోంపేటలో 10.2 మి.మీలు వర్షపాతం నమోదైంది. జూన్ నెలలో సగటున రణస్థలంలో 35మి.మీలు, జి.సిగడాంలో 34,8, లావేరులో 33.2, సీతంపేటలో 32, గారలో 31.2, సంతబొమ్మాళిలో 30.2 మి.మీలు వర్షాలు పడ్డాయి. తక్కువగా బూర్జలో 6, భామినిలో 7.2, సరుబజ్జిలిలో 7.6. హిరమండలంలో 7.8మి.మీలు కురిశాయి. -
న్యూ బిగినింగ్..!
మనసు పారేసుకోవడానికి వయసుతో పనిలేదని చెప్పకనే చెప్పాడు హాలీవుడ్ స్టార్ కీను రీవ్స్. యాభై ఏళ్ల ఈ హీరో బ్రిటిష్ మోడల్ బ్రూక్‌తో ప్రేమాయణం మొదలుపెట్టాడు. ఇటీవల కాలిఫోర్నియాలోని ఓ జిమ్‌లో తారసపడ్డ వీరిద్దరూ కళ్లూ.. కళ్లూ కలిపి.. ఫోన్ నంబర్లు ఇచ్చిపుచ్చుకుని.. డేటింగ్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేసుకున్నారట. ఇక అక్కడి నుంచి ‘సందడే సందడి’ అని ఓ ఆంగ్ల పత్రిక కథనం. రీసెంట్గా బాయ్‌ఫ్రెండ్ డేవిడ్ మాకింతోష్కు గుడ్‌బై చెప్పి మెంటల్‌గా కాస్త అప్సెట్ అయిన బ్రూక్‌కు రీవ్స్‌తో రొమాన్స్ ఎంతో రిలీఫ్నిస్తుందట!