Buchepalli Subbareddy
-
సీఎం జగన్ హామీ.. ఏపీ సర్కార్ కీలక ఉత్తర్వులు
సాక్షి, అమరావతి/చీమకుర్తి: ప్రకాశం జిల్లాలోని మొగిలిగుండాల మినీ రిజర్వాయర్ పేరును బూచేపల్లి సుబ్బారెడ్డి మొగిలిగుండాల మినీ రిజర్వాయర్‌గా ప్రభుత్వం నామకరణం చేసింది. ఈ మినీ రిజర్వాయర్‌కు మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి పేరు పెడతామని సీఎం వైఎస్ జగన్ ఇటీవల హామీ ఇచ్చారు. ఆ హామీని అమలు చేస్తూ ఆ రిజర్వాయర్‌కు మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి మొగిలిగుండాల రిజర్వాయర్‌గా నామకరణం చేస్తూ జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ గురువారం ఉత్తర్వులిచ్చారు. చదవండి: వీఆర్వోలకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్ -
CM Jagan: చీమకుర్తిలో పర్యటించనున్న సీఎం జగన్
సాక్షి, ప్రకాశం జిల్లా: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 24న చీమకుర్తిలో పర్యటించనున్న నేపథ్యంలో వైఎస్సార్ సీపీ రీజినల్ కోఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసరెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి ఆధ్వర్యంలో కలెక్టర్ దినేష్ కుమార్, ఎస్పీ మలికాగార్గ్ భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. జాయింట్ కలెక్టర్ అభిషిక్త్ కిషోర్, ఏఎస్పీ నాగేశ్వరరావు ఏర్పాట్ల పరిశీలనలో పాల్గొన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి విగ్రహాలను ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. దానితో పాటు బహిరంగ సభ కూడా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం హెలికాప్టర్ దిగేందుకు అనువైన ప్రదేశాన్ని పరిశీలించారు. బూచేపల్లి ఇంజినీరింగ్ కాలేజీ, ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఆవరణలను పరిశీలించారు. బూచేపల్లి కల్యాణ మండపం పక్కనే చీమకుర్తి మెయిన్‌రోడ్డులో ఇప్పటికే నిర్మాణం పూర్తి కావస్తున్న వైఎస్ రాజశేఖరరెడ్డి, బూచేపల్లి సుబ్బారెడ్డి విగ్రహాలను సీఎం జగన్మోహన్రెడ్డి ప్రారంభిస్తారు. అనంతరం బీవీఎస్ఆర్ ఇంజినీరింగ్ కాలేజీలో బహిరంగ సభ నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు పరిశీలించారు. అనంతరం బీవీఎస్ఆర్ ఇంజినీరింగ్ కాలేజీలో అధికారులతో బాలినేని, బూచేపల్లి ఆధ్వర్యంలో సీఎం జగన్ పర్యటనను విజయవంతం చేసేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ యద్దనపూడి శ్రీనివాసరావు, జెడ్పీటీసీ సభ్యులు వేమా శ్రీనివాసరావు, క్రిష్టిపాటి శేఖరరెడ్డి, స్థానిక కౌన్సిలర్లు, వైఎస్సార్ సీపీ నాయకులు పాల్గొన్నారు. చదవండి: (సోనియాగాంధీ వద్దకు కోమటిరెడ్డి, మర్రి శశిధర్‌రెడ్డి!) -
మాజీ ఎమ్మెల్యే సుబ్బారెడ్డి కన్నుమూత
చీమకుర్తి/సాక్షి, అమరావతి: ప్రముఖ గ్రానైట్ పారిశ్రామికవేత్త, దర్శి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి (67) శనివారం ఉదయం హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో కన్నుమూశారు. కిడ్నీవ్యాధితో బాధపడుతూ గత రెండు వారాలుగా ఆయన చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం పూర్తిగా విషమించటంతో శనివారం తనువు చాలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. బూచేపల్లి సుబ్బారెడ్డి 2004లో దర్శి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. అనంతరం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మీద అభిమానంతో ఆయన కాంగ్రెస్ పార్టీకి అసోసియేట్ సభ్యుడిగా కొనసాగుతూ వచ్చారు. 2009లో బూచేపల్లి సుబ్బారెడ్డి రాజకీయాల నుంచి వైదొలగి రాజశేఖరరెడ్డి సూచనల మేరకు రెండో కుమారుడు బూచేపల్లి శివప్రసాదరెడ్డిని దర్శి నియోజకవర్గం నుంచి పోటీ చేయించారు. శివప్రసాదరెడ్డి రాజకీయ భవిష్యత్తుకు అండగా ఉంటూనే మరో పక్క గ్రానైట్ వ్యాపారంలో అందెవేసిన చెయ్యిగా ఎదిగారు. రాజకీయాలలోకి రాకముందు సుబ్బారెడ్డి చేసిన సేవాకార్యక్రమాలతో ప్రజల్లో గుర్తింపు పొందారు. ఆయన పార్ధివదేహాన్ని శనివారం రాత్రికి చీమకుర్తిలోని ఆయన స్వగృహానికి తీసుకొచ్చారు. ఆదివారం సాయంత్రం 3 గంటలకు అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు ప్రకటించారు. వైఎస్ జగన్ సంతాపం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి మృతి పట్ల పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం వెలిబుచ్చారు. సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
మాజీ ఎమ్మెల్యే కన్నుమూత
సాక్షి, ప్రకాశం జిల్లా : వైఎస్సార్సీపీ నేత బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఇంట్లో విషాదం నెలకొంది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శివప్రసాద్ రెడ్డి తండ్రి, దర్శి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి కన్నమూశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఆయన తుదిశ్వాస విడిచారు. సుబ్బారెడ్డి మృతి పట్ల వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి , మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. సుబ్బారెడ్డి మానవత్వం ఉన్న గొప్ప నేత అని బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. రేపు స్వగ్రామంలో సుబ్బారెడ్డి అంత్యక్రియలు జరుగుతాయని సన్నిహితవర్గాలు చెప్పాయి. 2004 ఎన్నికల్లో సుబ్బారెడ్డికి కాంగ్రెస్ దర్శి అసెంబ్లీ టికెట్ ను నిరాకరించింది. దీంతో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఘనవిజయం సాధించారు. ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కుమారుడు శివప్రసాద్ కాంగ్రెస్ తరఫున గెలిచి వైస్సార్సీపీలో చేరారు. -
వైఎస్ఆర్సీపీ నేతలపై వేధింపుల పర్వం
ఒంగోలు : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై వేధింపుల పర్వం కొనసాగుతోంది. మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి నివాసంలో ఆదాయపన్ను శాఖ అధికారులు మంగళవారం సోదాలు నిర్వహిస్తున్నారు. చీమకుర్తిలోని సుబ్బారెడ్డి ఇంట్లోనూ అధికారులు తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.