Bullet Suresh
-
పెరుగుతున్న బలం
చిత్తూరు అర్బన్: చిత్తూరు నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతమవుతోంది. నియోజకవర్గంలో పార్టీ పటిష్టత కోసం రాజంపేట మాజీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి అనుసరిస్తున్న వ్యూహాలు కలిసి వస్తున్నాయి. ఇందులో భాగంగా చిత్తూరుకు చెందిన పలువురు టీడీపీ, స్వతంత్ర కార్పొరేటర్లు శుక్రవారం హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్రెడ్డిసమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. చేరికలు ఇలా.. రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘ కోర్ కమిటీ అధ్యక్షుడు బుల్లెట్ సురేష్, టీడీపీ నగర అధ్యక్షులు మాపాక్షి మోహన్, టీడీపీ కార్పొరేటర్లు ఆర్జి.శ్రీకాంత్ (1వ డివిజన్), ఏజి.సంపత్ (50వ డివిజన్), ఇ.ఇందు (27వ డివిజన్), చంద్రయ్య (13వ డివిజన్) వైఎస్సార్సీపీలో చేరారు. 20వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ రంజితంకు అనారోగ్యం కారణంగా ఆమె కుమారుడు ఇరువారం డేవిడ్, 42వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ ముత్తమ్మ తరఫున ఆమె తమ్ముడు ఆర్ముగం, స్వతంత్ర కార్పొరేటర్లు పి.నవీన్‌కుమార్ (2వ డివిజన్), ఎస్కె.పుష్పలత (35వ డివిజన్)లకు వైఎస్.జగన్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఇక చిత్తూరు మున్సిపల్ మాజీ చైర్మన్ భాస్కరన్, గుడిపాల మండలం కొత్తపల్లె ఎంపీటీసీ సభ్యురాలు రాజమ్మ తరఫున ఆమె కుమారుడు రాజ, రాసనపల్లె వైస్ ఎంపీపీ వేలాంగని తరఫున ఆమె భర్త రాసనపల్లె ప్రకాష్, కాంగ్రెస్ పార్టీ నగర మాజీ అధ్యక్షుడు కెపి.శ్రీధర్, దొడ్డిపల్లె మాజీ సర్పంచ్ దళవాయి శివకుమార్ తదితరులు సైతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరిని వైఎస్.జగన్మోహన్రెడ్డి సమక్షంలో పార్టీ చిత్తూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు జంగాలపల్లె శ్రీనివాసులు ఇతర నాయకులు అభినందించారు. టీడీపీ నేతలు ఆ పార్టీ సభ్యత్వానికి రాజీమానా చేసిన తర్వాతే వైఎస్సార్సీపీలో చేరడం పట్ల రాజకీయవేత్తలు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ నేతల్లో ఆందోళన.. టీడీపీ నగర అధ్యక్షుడితో పాటు ఆరుగురు కార్పొరేటర్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో చిత్తూరు టీడీపీ నేతల్లో ఆందోళన మొదలయ్యింది. చిత్తూరు టీడీపీలో ఏకపక్ష ధోరణి ఒకే సామాజికవర్గానికి పదవులను కట్టబెట్టడం లాంటి అంశాలను పార్టీలోని సొంత నేతలే అంగీకరించడం లేదు. ఇటీవల విడుదలైన వ్యవసాయ శాఖ మార్కెట్ కమిటీ పాలకవర్గంలో చైర్మన్, వైస్ చైర్మన్ పోస్టులు రెండూ ఒకే సామాజిక వర్గానికి కట్టబెడుతూ స్థానిక ప్రజాప్రతినిధి సిఫారసు చేసిన విషయం తెలిసిందే. ఇలాంటి తరుణంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన పార్టీ నగర అధ్యక్షుడితో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేటర్లు వైఎస్సార్సీపీలోకి వెళ్లడం టీడీపీకి భారీ నష్టాన్ని చేకూర్చనుంది. పైగా తమిళ ఓటర్లను ప్రభావితం చేసే బుల్లెట్ సురేష్ పార్టీలోకి వెళ్లడం అధికార పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. మరికొందరు టీడీపీ నేతలు సైతం వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారంటూ పార్టీలో చేరిన కార్పొరేటర్లు ప్రకటించడంతో చెదిరిపోతున్న క్యాడర్‌ను కాపాడుకోవడంతో పాటు వలసలు వెళ్లకుండా ఉండటానికి నానా తంటాలు పడుతున్నారు. అయితే వైఎస్.జగన్మోహన్రెడ్డిపై ప్రజల్లో రోజురోజుకూ పెరుగుతున్న ఆదరణ, ఇదే సమయంలో ప్రభుత్వ వ్యతిరేకత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కలిసొచ్చే అంశాలుగా మారుతున్నాయి. -
‘బుల్లెట్’ను చుట్టేస్తున్న కేసులు!
ఇప్పటికే పలు పోలీసు కేసులతో సతమతం తాజాగా పావని కేసులో శ్రీముఖాలు 9న హాజరుకావాలని నోటీసులు రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం నాయకుడు, చిత్తూరు చెందిన అధికారపార్టీ నేత బుల్లెట్ సురేష్ మరో కేసులో చిక్కుకున్నారు. ఇప్పటికే ఎర్రచందనం స్మగ్లింగ్ కేసు, చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న సురేష్.. ఎర్రచందనం అంతర్జాతీయ మహిళా స్మగ్లర్ సంగీత చటర్జీ విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తాజాగా చిత్తూరులో పలువురు మహిళల్ని మోసం చేసి 8 కిలోల వరకు బంగారు ఆభరణాలు కాజేసిన పావని ఎపిసోడ్.. బుల్లెట్‌కు కొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది. కేసు విచారణలో భాగంగా ఈనెల 9న తమ ముందు హాజరు కావాలని వన్‌టౌన్ పోలీసులు సురేష్‌కు నోటీసులు జారీ చేయడం చిత్తూరులో హాట్ టాపిక్‌గా మారింది. చిత్తూరు (అర్బన్): బుల్లెట్ సురేష్‌ను రెండేళ్ల క్రితం ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో చిత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. కొన్నాళ్ల పాటు జైల్లో ఉన్న సురేష్ తరువాత బెయిల్‌పై విడుదల అయ్యారు. గత ఏడాది నవంబరులో చిత్తూరు మేయర్‌గా ఉన్న అనురాధ, ఆమె భర్త కటారి మోహన్ల హత్య కేసులో సైతం సురేష్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు మళ్లీ అరెస్టు చేయడం, ఇటీవల బెయిల్‌పై బయటకు రావడం తెలి సిందే. ఈ మధ్యే కోల్‌కత్తాకు చెందిన ఎర్రచందనం స్మగ్లర్ లక్ష్మన్ భార్య సంగీత చటర్జీను అరెస్టు చేసిన పోలీసులు పలు విషయాలను రాబట్టారు. తప్పుడు గన్ లెసైన్సును సురేష్‌కు ఇచ్చినట్లు, దీని ద్వారా ఓ తుపాకీను అమ్మినట్లు లక్ష్మన్ పోలీసులకు చెప్పారు. దీనిపై విచారణ సాగిస్తున్న పోలీసులు సురేష్‌పై చట్టరీత్యా చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఇక తాజాగా చిత్తూరు నగరంతో పాటు చుట్టుపక్కల మండలాల్లోని పలువురు మహిళలను మోసం చేసి దాదాపు 8 కిలోల బంగారు ఆభరణాలను మాయం చేసిన పావని, మేయర్ దంపతుల హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న చింటూ, హరిదాస్‌లతో కలసి తమ ను బెదిరించినట్లు పలువురు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పావని, ఆమె భర్త చరన్‌లను అరెస్టు చేసి న్యాయస్థానం అనుమతితో 9 రోజుల కస్టడీకు తీసుకున్నారు. పావని దంపతుల్ని విచారిస్తున్న పోలీసులు బుల్లెట్ సురేష్‌పై దృష్టి సారించారు. పోలీసుల విచారణలో పావని సురేష్ పేరు ప్రస్తావించడంమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. బుల్లెట్ సురేష్ గురువారం పోలీసుల విచారణకు హాజరయ్యే క్రమంలో ఎలాంటి పరిణామాలు జరుగుతాయోనని సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఈ కేసుల్లో తమకు ఎలాంటి సంబంధం లేదని, చిత్తూరు నగరంలో ఎమ్మెల్యే విజయానికి కృషి చేసిన తమకు ఇలాంటి ఇబ్బందులు వస్తుంటే అధికారపార్టీ నాయకులు మౌనం వహిస్తున్నారని ఇటీవల సురేష్ కుటుం బ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజా ఘటన తో టీడీపీ నాయకులపై వారు మరింత గుర్రుగా ఉన్నట్లు సమాచారం. -
మేయర్ హత్య కేసులో సురేష్ లోంగుబాటు
-
‘ఎర్ర’పట్టు వదిలారు!
ఎర్రచందనం స్మగ్లర్ బుల్లెట్ సురేష్‌కు బెయిలు అరెస్టయిన 10 మంది అంతర్జాతీయ స్మగ్లర్లపై పీడీయాక్టు నమోదుకాని వైనం ఫైలు కలెక్టరేట్‌కు వెళ్లినా పీడీయాక్టు ఆలస్యం కావడం ఇదే ప్రథమం అంతర్జాతీయ స్మగ్లర్లలో కొందరిని బెయిల్‌పై పంపేందుకే ‘పీడీ’ నమోదులో ఆలస్యం! కొత్త అధికారుల పాలనలో ‘పాత దూకుడు’ కనిపించని వైనం అంతా అనుకున్నట్టే జరుగుతోంది.. ఎర్రచందనం దొంగల అరెస్టు పర్వంలో పట్టు సడలుతోంది. స్మగ్లింగ్‌కు కర్త, కర్మ, క్రియగా ఉన్న 10మంది అంతర్జాతీయ స్మగ్లర్లు అరెస్టయి నెలరోజులు దాటినా ఇప్పటి వరకు వారిపై పీడీ యాక్టు నమోదు చేయలేదు. మరో బడా స్మగ్లర్ బుల్లెట్ సురేష్‌కు బెయిల్ మంజూరైంది. కొత్త అరెస్టుల పర్వం మందగించింది. మొత్తం మీద తాజా పరిణామాలు చూస్తుంటే పాత అధికారులు ‘ఉడుంపట్టు’ సాగించిన ‘ఆపరేషన్ రెడ్’పై కొత్త అధికారులు పూర్తిగా ‘పట్టు’ సడలించారు. ‘ఎర్ర’పట్టు వదిలారు! సాక్షి, టాస్క్‌ఫోర్స్: మూన్నెళ్ల కిందట ప్రారంభమైన ‘ఆపరేషన్రెడ్’లో అప్పటి కలెక్టర్ రాంగోపాల్, ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ సయోధ్యతో మంచి ఫలితాలు వచ్చాయి. 196 మంది స్మగ్లర్లతో జాబితాను సిద్ధం చేసుకున్న పోలీసులు 45 రోజుల్లో (జూలై 15లోపు) 175మందిని అరెస్టు చేశారు. వారి విచారణలో మరో 800 మంది దొంగలను గుర్తించారు. ఇందులో పదిమంది అంతర్జాతీయ స్మగ్లర్లను అరెస్టుచేశారు. దీంతో పోలీసుల పనితీరుపై అప్పట్లో ప్రశంసలు వెల్లువెత్తాయి. అరెస్టయిన వారిలో 14 మందిపై పీడీ యాక్టు కూడా నమోదైంది. పీడీయాక్టుకు సిఫార్సు చేస్తూ అప్పటి ఎస్పీ రామకృష్ణ పంపిన ఫైలుకు రెండు, మూడు రోజుల్లోనే రాంగోపాల్ ఆమోదముద్ర వేశారు. దీంతో భాస్కర్‌నాయుడు, మహేశ్‌నాయుడు, రెడ్డినారాయణ, శ్రీశైలం ఆంజనేయులు, నాగరాజునాయక్, విజయానందబాబు, గజ్జెల శ్రీనివాసరెడ్డి, అన్బు, శేషు, సెల్వం, రమేశ్‌రెడ్డి, రఘునాథరెడ్డి, జానకిరామన్పై ‘పీడీ’ నమోదైంది. అంతర్జాతీయ స్మగ్లర్లపై కూడా పీడీ నమోదు చేస్తామని రామకృష్ణ అప్పట్లో ప్రకటించారు. చెప్పిన ట్టుగా ఫైలును కలెక్టర్ సిద్ధార్థ్ జైన్‌కు పంపించారు. గతంలో 2,3 రోజుల్లోనే నమోదైన పీడీయాక్టు ఇప్పుడు నెలరోజులు పైబడినా నమోదు చేయకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దొంగలను పట్టుకున్నపుడు తాము పడ్డ కష్టం ప్రస్తుతం జిల్లా పాలన పగ్గాలు చేపట్టిన ఇద్దరు ప్రధాన అధికారులకు తెలీడం లేదని, అందుకే పీడీ నమోదు నుంచి ‘ఆపరేషన్ రెడ్’ వరకూ అన్నిటిపైన ‘పట్టు’ పూర్తిగా సడలించారని పలువురు టాస్క్‌ఫోర్స్, జాయింట్ ఆపరేషన్ పోలీసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బుల్లెట్ సురేష్‌కు బెయిల్ పోలీసుల జాబితాలో పేరుమోసిన ఎర్రచందనం స్మగ్లర్ బుల్లెట్ సురేష్‌ను జూలై 7న చిత్తూరు పోలీసులు అరెస్టుచేశారు. అతనిపై దాదాపు 20 కేసులు ఉన్నట్టు అరెస్టు సమయంలో పోలీసులు వెల్లడించారు. పీడీయాక్టు నమోదు చేస్తామని కూడా ఏఎస్పీ, ఓఎస్డీలు తెలిపారు. అయితే ప్రభుత్వ పెద్దళ్ల ఒత్తిళ్లతో పీడీ నమోదు చేయలేదు. ఒక్క కేసూ నమోదుకాని వారిపై పీడీ నమోదు చేసిన పోలీసులు అధిక సంఖ్యలో కేసులు ఉన్న సురేష్‌పై మాత్రం నమోదు చేయలేదు. పైగా అరెస్టయిన సురేష్ రిమాండ్‌లో పోలీసుల అదుపులో కంటే వైద్యం పేరుతో బయటే ఎక్కువగా ఉన్నాడు. చివరకు ప్రభుత్వ పెద్దల సహకారంతో ‘బెయిల్’ తీసుకుని దర్జాగా ‘ఎర్ర’వ్యవహారంలో నుంచి బయటకు వచ్చారు. వారిపై పీడీ ఎందుకు నమోదు చేయలేదో..? అరెస్టయిన 10 మంది అంతర్జాయతీయ స్మగ్లర్లంతా ప్రపంచవ్యాప్తంగా నెట్‌వర్క్‌ను విస్తరింపజేసి స్మగ్లింగ్‌ను నడిపినవారు. ఒక్కొక్కరి సంపాదన నెలకు కోట్ల రూపాయల్లో ఉంది. వీరప్పన్ అనుచరుడు రియాజ్, స్మగ్లింగ్ ముఠా డాన్ లక్ష్మణ్, హమీద్ లాంటి నేరగాళ్లు ఉన్నారు. వీరిపై పీడీయాక్టు నమోదు చేసేందుకు కొత్తగా కలెక్టర్‌గా బాధ్యతలు తీసుకున్న సిద్ధార్థ్‌జైన్‌కు పనిఒత్తిడితో తీరికలేకపోవడంతోనేఫైలుపై సంతకంచేయలేదని అంతా భావించా రు. అయితే ప్రభుత్వ పెద్దల జోక్యంతోనే ఫైలును కలెక్టర్ పక్కనపడేశారని అధికారవర్గాలు చెబుతున్నాయి. త్వరలో వీరిలో ముగ్గురికి బెయిల్ కూడా వచ్చే అవకాశం ఉందని, ఇప్పటికే బెయిల్ ప్రయత్నాలు మొదలయ్యాయని కూడా తెలిసింది. అరెస్టయిన అంతర్జాతీయ స్మగ్లర్లలో ఒకరిద్దరు మినహా అందరూ ఇతర రాష్ట్రాల దొంగలు. అయినా వారిపై కూడా పీడీ నమోదు చేయడంలో జాప్యం జరుగుతోందంటే అందుకు కారణాలేంటో.. దొంగల అనుచరులు ఏస్థాయిలో ‘లాబీయింగ్’ జరుపుతున్నారో ఇట్టే తెలుస్తోంది. పీడీ యాక్టుకు సిఫార్సుకు కలెక్టరేట్‌కు చేరిన దొంగల జాబితా ఇదే: రియాజ్, ఆయిల్మ్రేశ్, శర్వణన్, లక్ష్మణ్‌నాయక్, గుణశేఖర్, హమీద్‌ఖాన్, రఫీ, ఆసిఫ్ అలీఖాన్, విక్రమ్ మెహందీ, లక్ష్మణన్, చంద్రశేఖరరెడ్డి. -
ఎర్రదొంగలకు ‘పచ్చ’ తివాచీ!
పీడీ యాక్టు నిందితుడికి జెడ్పీటీసీ టికెట్ ఎంపీపీ బరిలో నిలిచిన మరో బడా స్మగ్లర్ కుటుంబం ఎన్నికల్లో టీడీపీలో క్రియాశీల పాత్ర పోషించిన మరికొందరు నేరచరితులు తాజాగా టీడీపీ నేత బుల్లెట్ సురేష్ అరెస్ట్ రాజమండ్రి జైలులో రెడ్డినారాయణ, మహేష్‌నాయుడు సాక్షి ప్రతినిధి, కడప/చిత్తూరు నూతన ఆంధ్రప్రదేశ్‌లో నేరగాళ్లకు స్థానంలేకుండా చేస్తామంటూ హూంకరిస్తున్న ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చేతల్లో వారితోనే అంటకాగుతున్నారని తెలుస్తోంది. శేషాచలం అడవుల్లోని విలువైన ఎర్రచందనాన్ని దోచుకుంటున్న స్మగ్లర్లకు పార్టీ టికెట్లిచ్చి పోటీ చేయించడమే ఇందుకు నిదర్శనమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబుకు అత్యంత సన్నిహితులైన రెడ్డినారాయణ, మహేష్‌నాయుడు రాయలసీమలో ఎర్రచందనం స్మగ్లర్లుగా పేరుమోశారు. వారిపై వైఎస్సార్, చిత్తూరు జిల్లాల్లో అనేక స్మగ్లింగ్ కేసులు నమోదయ్యాయి. వైఎస్సార్ జిల్లా యంత్రాంగం 2010లో పీడీయాక్టు కూడా ప్రయోగించింది. అనంతరం కూడా వారు స్మగ్లింగ్ కార్యకలాపాలను నిర్వహిస్తూనే వచ్చారు. వారే 2012లో రాయచోటి, రాజంపేట ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల గెలుపు కోసం విశేషంగా కృషి చేశారు. చిత్తూరు జిల్లాకు చెందిన మరో ఎర్రచందనం స్మగ్లర్ బుల్లెట్ సురేష్‌పై 20 కేసులు ఉన్నాయి. పది రోజుల కిందట సురేష్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు సోమవారం రాత్రి అరెస్టు చేసినట్లు చూపించారు. ఆయన 2014 ఎన్నికల్లో చిత్తూరు ఎమ్మెల్యే డీకే సత్యప్రభ విజయానికి తీవ్రంగా కృషి చేయడం గమనార్హం. వెన్నుతట్టి ఎన్నికల్లో ప్రోత్సాహం ఎర్రచందనం స్మగ్లర్లుగా గుర్తింపుబడ్డా, పీడీ యాక్టులో జైలు కెళ్లినా పర్వాలేదు... ఎన్నికల్లో పోటీ చేసి గెలవండంటూ వైఎస్సార్ జిల్లా సంబేపల్లె జెడ్పీటీసీ స్థానాన్ని రెడ్డినారాయణకు టీడీపీ కేటాయించింది. ఆ ఎన్నికల్లో ఆయన పోటీచేసి ఓడిపోయారు. మహేష్నాయుడి కుటుంబానికి సుండుపల్లె ఎంపీపీ పదవి కేటాయిస్తూ, ఆయన తల్లికి రెడ్డివారిపల్లె ఎంపీటీసీ టికెట్ అప్పగించారు. ఆమె గెలిచినప్పటికీ ఎంపీపీ పదవి మాత్రం దక్కలేదు. రెడ్డినారాయణ, మహేష్‌నాయుడు ఇరువురూ ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో ఉన్న ఎర్రచందనం కేసుల కారణంగా పీడీయాక్టులో రాజమండ్రి జైల్లో ఉన్నారు. వీరికే కాకుండా సుండుపల్లెలో మరో ఎర్రచందనం స్మగ్లర్ పటాల రమణ సోదరుడు వీరమల్లనాయుడుకు జెడ్పీటీసీ టికెట్ ఇచ్చారు. పటాల రమణపై పలు ఎర్రచందనం అక్రమ రవాణా కేసులు నమోదయ్యాయి. ఒంటిమిట్ట మండలం చింతరాజుపల్లె టీడీపీ ఎంపీటీసీగా గెలుపొందిన సుబ్బానాయుడుపై సైతం కేసులున్నాయి. మైదుకూరు మండలంలో బడా స్మగ్లర్ శ్రీని వాసులనాయుడు సైతం టీడీపీలో క్రియాశీల భూమిక పోషించేవారు. ప్రస్తుతం పీడీ యాక్టులో రాజమండ్రి జైల్లో ఉన్నారు. ఆయన సోదరుడు వెంకటసుబ్బయ్య స్మగ్లర్‌గా రికార్డులకు ఎక్కారు. టీడీపీ మైదుకూరు ఇన్చార్జి పుట్టా సుధాకర్‌యాదవ్ ముఖ్య అనుచరుడు చినమల నరసింహులు యాదవ్ ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో ఉన్నారు. వీరంతా ఎన్నికల్లో టీడీపీ తరఫున చురుకైన పాత్ర పోషించారు. ఎర్రదొంగల్లో తెలుగు తమ్ముళ్లే అధికం అధికార పార్టీ నేతల అండదండలతో ఎర్రచందనం అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. మొత్తం 198మంది ఎర్రదొంగలున్నట్లు గుర్తించిన పోలీసులు ఇప్పటివరకూ 110మందికిపైగా అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. వీరిలో ఎక్కువమంది టీడీపీ నేతలే ఉండటం గమనార్హం. అరెస్టు కాకుండా తప్పించుకు తిరుగుతున్న వారిలో చిత్తూరు జిల్లా టీడీపీ ప్రచార కార్యదర్శి వసంత్, మధుతో పాటు మరికొందరు సీనియర్ నేతలు ఉన్నారు. వీరిలో కొందరిపై ఇదివరకే పీడీ యాక్టు నమోదు చేశారు. ఇప్పుడు వారిపై పీడీ యాక్టు తొలగించడంతో పాటు, మిగిలిన దొంగలపై పీడీ యాక్టు నమోదు కాకుండా పోలీసులపై ఒత్తిడి తెచ్చేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. ఎర్రదొంగల అక్రమ సంపాదనలో వాటాలు ఉండటంతో వారిని రక్షించడం టీడీపీ కీలక నేతలకు అనివార్యంగా మారిందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇతని పేరు బుల్లెట్ సురేష్. చిత్తూరు టీడీపీ నేత. ‘ఎర్ర’చందనం స్మగ్లింగ్‌లో ఆరితేరిన వ్యక్తి. 20 కేసులు ఉన్నాయి. చిత్తూరు టూటూన్ పోలీసు స్టేషన్లో రౌడీషీట్ కూడా ఉంది. 2014 ఎన్నికల్లో చిత్తూరు ఎమ్మెల్యే డీకే సత్యప్రభ విజయానికి తీవ్రంగా కృషి చేశారు. చిత్తూరు తాలూకా, టూటౌన్, భాకరాపేట, యాదమరి, చిత్తూరుతో పాటు పలు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఇతడు రెడ్డి నారాయణ. వైఎస్సార్ జిల్లా సంబేపల్లె మండలం గుట్టపల్లె వాసి. ఇతడు కూడా రాయచోటి నియోజకవర్గం టీడీపీలో కీలక నేత. ఆ పార్టీ కీలక నేతలతో సన్నిహిత సంబంధాలున్నాయి. ఇతనిపై పీడీ యాక్టు కూడా నమోదైంది. రాయచోటి, పీలేరు, గంగవరం, కేవీపల్లె, వీరబల్లితో పాటు పలు స్టేషన్లలో పలు ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులు నమోదయ్యాయి. ఇతని పేరు మహేష్ నాయుడు. వైఎస్సార్ జిల్లా సుండుపల్లె మండలం చప్పిడివాండ్లపల్లె. మహేష్ తల్లి శ్రీదేవి టీడీపీ తరఫున ఎంపీటీసీ సభ్యురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మహేష్‌పై రెండుసార్లు పీడీ యాక్టు నమోదైంది. కేవీపల్లె, పీలేరు, కలకడతో పాటు పలు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. రాజంపేట నియోజకవర్గంలో టీడీపీ కీలక నేత. -
పోలీసుల అదుపులో బుల్లెట్ సురేష్ ?
ఆయిల్ రమేష్ కూడా చెన్నై ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ కోసం చిత్తూరుకు తరలింపు! సాక్షి, చిత్తూరు: పేరుమోసిన ఎర్రచందనం స్మగ్లర్ బుల్లెట్ సురేష్‌ను పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. కొద్ది రోజు లుగా అజ్ఞాతంలో ఉన్న సురేష్ విదేశాలకు వెళ్లేందుకు చెన్నై ఎయిర్‌పోర్టుకు వెళ్లగా అక్కడ తమిళనాడు, ఆంధ్ర పోలీసుల జాయింట్ ఆపరేషన్‌కు చిక్కినట్లు సమాచారం. సురేష్‌తోపాటు మరో ఎర్రచందనం స్మగ్లర్ ఆయిల్ రమేష్‌ను కూడా అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. బుల్లెట్ సురేశ్‌పై 9 కేసులున్నాయి. కొంతకాలం గా టీడీపీ నేతల ఆశీస్సులతో తప్పించుకుని తిరుగుతున్నాడు. ఇటీవల చంద్రబాబు జిల్లా పర్యటనకు వచ్చినపుడు చిత్తూరు ఎమ్మెల్యే సత్యప్రభ నివాసంలో అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డిని సురేష్ కలిశారు. ఈ విషయంపై ఈనెల 17న ‘మర్మమేమిటి గోపాలా?’ శీర్షికతో ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. అలాగే 3 కేసులున్న వారిపై పీడీయాక్టు నమోదు చేయాలనే నిబంధన ఉందని, కానీ 9 కేసులున్నా బుల్లెట్ సురేష్‌ను పోలీసులు అరెస్టు చేయడం లేదని ఈనెల 21న ‘పసుపు స్మగ్లర్లకు పోలీసుకవచం’ అనే శీర్షికతో ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీంతో పోలీసులు సురేష్‌పై ప్రత్యేక దృష్టి సారించి అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. సురేశ్ నేరచరిత్రను చెప్పే కేసులు ఇవే.. క్రైం నెంబరు నమోదైన స్టేషన్ 62-2011 చిత్తూరు తాలుకా 18-2011 చిత్తూరు టూ టూన్ 32-2011 భాకరాపేట 95-2010 యాదమరి 60-2012 చిత్తూరు వన్‌టౌన్ 120-2012 చిత్తూరు వన్‌టౌన్ 153-2012 ఆర్మ్యాక్టు వీటితోపాటు మరో రెండు కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. -
మర్మమేమిటి గోపాలా?
ఎర్రచందనం స్మగ్లర్‌తో ములాఖత్ అయిన మంత్రి బొజ్జల స్మగ్లర్ టీడీపీ నేత కావడంతో పీడీ యాక్ట్ వద్దంటూ ఆదేశాలు స్మగ్లర్ల ఆటకట్టిస్తానంటూ స్మగ్లర్తోనే సమావేశంపై విమర్శలు మాటలకు చేతలకు పొంతన కుదరకపోవడం అంటే ఇదేనేమో. ఎర్రచందనం స్మగ్లర్ల ఆటకట్టిస్తానంటూ బీరాలు పలుకుతున్న అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఆ స్మగ్లర్తోనే రహస్యంగా సమావేశం కావడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. సదరు స్మగ్లరు టీడీపీ నేత కావడంతో పీడీ యాక్ట్ ప్రయోగించవద్దని ఆదేశించడంతో ఆయన చిత్తశుద్ధి ఏ పాటిదో అర్థమవుతోంది. సీఎం చంద్రబాబునాయుడు సోమవారం కుప్పం పర్యటన నేపథ్యంలో అటవీ శాఖ మంత్రి బొజ్జల అక్కడికి పయనమయ్యారు. మార్గమధ్యంలో చిత్తూరులో ఎమ్మెల్యే డీకే.సత్యప్రభ ఇంటికెళ్లి కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. అదే సమయంలో చిత్తూరుకు చెందిన బుల్లెట్ సురేష్ ఎమ్మెల్యే సత్యప్రభ ఇంటికి చేరుకుని బొజ్జలతో రహస్యంగా మంతనాలు జరిపారు. బుల్లెట్ సురేష్‌పై తొమ్మిది క్రిమినల్ కేసులున్నాయి. రౌడీషీట్ కూడా ఉంది. ఎర్రచందనం స్మగ్లింగ్‌లో ఆయనది అందెవేసిన చేయి అని టీడీపీ వర్గాలే స్పష్టీకరిస్తున్నాయి. క్రిమినల్ కేసులు మూడుకు మించి ఉంటే పీడీ యాక్ట్‌ను వర్తింపజేయవచ్చు. పైగా టీడీపీ నేతలే బుల్లెట్ సురేష్‌ను ఎర్రచందనం స్మగ్లర్‌గా అభివర్ణిస్తున్న నేపథ్యంలో ఆయనపై పీడీ యాక్ట్‌ను అమలుచేయవచ్చు. బుల్లెట్ సురేష్ స్వేచ్ఛగా సంచరిస్తున్నా ఆయనపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఎర్రచందనం స్మగ్లర్లు ఏ పార్టీకి చెందిన వారైనా వదలబోమని ప్రకటించిన 24 గంటల్లోనే మంత్రి బొజ్జల చిత్తూరులో సోమవారం బుల్లెట్ సురేష్‌తో రహస్యంగా సమావేశమయ్యారు. అరగంట మంతనాలు జరిపారు. సమావేశం పూర్తయిన తర్వాత పోలీసుల ముందే బుల్లెట్ సురేష్ తన వాహనంలో వెళ్లిపోయారు. ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత బొజ్జల ఉన్నతాధికారులకు ఫోన్ చేసి ఆయనపై ఎలాంటి చర్యలూ తీసుకోవద్దని మౌఖికంగా ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. అందువల్లే పోలీసులు అతనిపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. టీడీపీకి చెందిన ఎర్రచందనం స్మగ్లర్లను అటవీ శాఖ మంత్రి రక్షిస్తున్నారనడానికి ఇదే తార్కాణం.