burqa
-
ప్రియురాలి కోసం బురఖా వేషంలో ప్రియుడు
-
గణేష్ మండపంలో బుర్ఖాతో డ్యాన్సులు.. అరెస్టు
చెన్నై: గణేష్ చతుర్థి ఉత్సవాల్లో ఓ యువకుడు బుర్ఖా ధరించి డ్యాన్సులు వేయడం వివాదాస్పదంగా మారింది. బుర్ఖా ధరించి డ్యాన్సులు వేయడాన్ని ఆక్షేపిస్తూ ఫిర్యాదులు రావడంతో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. తమిళనాడులోని వెల్లూరులో ఈ ఘటన జరిగింది. గణేష్ చతుర్థి ఉత్సవాల్లో ఓ యువకుడు డ్యాన్సులు చేస్తున్న వీడియో సోషల్ మీడియోలో వైరల్ అయింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదులు అందాయి. బుర్ఖా ధరించి డ్యాన్సులు వేయడాన్ని తప్పుబడుతూ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు సదరు యువకున్ని అరుణ్ కుమార్‌గా గుర్తించి అరెస్టు చేశారు. రెండు వర్గాల మధ్య ఘర్షణకు కారణమయ్యేలా ఉందని పోలీసులు తెలిపారు. వినాయక ఉత్సవాల్లో మతపరమైన భావాలను దెబ్బతీస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరికలు జారీ చేశారు. డ్యాన్స్‌లో పాల్గొన్న ఇతర యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇదీ చదవండి: కెనడాలో పిల్లలు.. భారతీయ తల్లిదండ్రుల్లో ఆందోళన -
బుర్ఖా ధరించి బాయ్స్ డ్యాన్స్.. కాలేజీ ఈవెంట్‌పై దుమారం!
బెంగళూరు: కర్ణాటకలో హిజాబ్ వివాదం మరోమారు తెరపైకి వచ్చింది. మంగళూరులోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో బుర్ఖా ధరించి నలుగురు విద్యార్థులు బాలీవుడ్ పాటకు డ్యాన్స్ చేశారు. బుర్ఖా ధరించి నలుగురు బాయ్స్ నృత్యం చేస్తున్న వీడియో వైరల్‌గా మారిన క్రమంలో వారిని సస్పెండ్ చేసింది కాలేజీ యాజమాన్యం. ప్రస్తుతం ఈ సంఘటన కర్ణాటకలో వివాదాస్పదంగా మారింది. సెయింట్ జోసెఫ్ ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో నలుగురు బాయ్స్ బుర్ఖా ధరించి నృత్యం చేశారు. ఈ వీడియో వైరల్‌గా మారిన క్రమంలో కళాశాల యాజమాన్యంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. మతపరమైన సెంటిమెంట్‌ను దెబ్బతీసేలా ఇలాంటి డ్యాన్సులకు అనుమతి ఇవ్వటమేంటని పలువురు ప్రశ్నించారు. మరోవైపు.. బాలీవుడ్ సాంగ్‌కు తాము అనుమతించలేదని, విద్యార్థులు తమకు తెలియకుండా స్టేజ్ పైకి వెళ్లారని కాలేజీ అధికారులు తెలిపారు. తమ కళాశాల మార్గదర్శకాలను ఉల్లంఘించారని పేర్కొన్నారు. ‘కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ముస్లిం వర్గానికి చెందిన విద్యార్థులు స్టేజ్‌పైకి వెళ్లి డ్యాన్స్ చేశారు. అప్పుడు తీసిన వీడియో వైరల్‌గా మారింది. అది కళాశాల ఆమోదించిన కార్యక్రమంలో భాగం కాదు. వేదికపైకి వెళ్లి డ్యాన్స్ చేసిన నలుగురు విద్యార్థులను సస్పెండ్ చేశాం. దర్యాప్తు జరుగుతోంది.’ అని కళాశాల ప్రిన్సిపాల్ ఓ ప్రకటన చేశారు. మతసామరస్యాలను దెబ్బతీసే కార్యక్రమాలను తాము ప్రోత్సహించమని స్పష్టం చేశారు. This is from #Mangaluru, #Karnataka. In an Event at St.Joseph Engineering College, Mangaluru students seen wearing #Burkha and performing obscene steps for a item song mocking #Burqa & #Hijab.#DakshinKannada #Mangalore #StJosephEngineeringCollege pic.twitter.com/Q6jmN5p77F — Hate Detector 🔍 (@HateDetectors) December 7, 2022 ఇదీ చదవండి: ప్రధాని మోదీ విదేశీ పర్యటనలు.. ఐదేళ్లలో ఖర్చు ఎంతో తెలుసా? -
బురఖా ధరించి కోర్టుకు వచ్చిన వ్యక్తి.. ఎందుకంటే..?
సాక్షి, కరీంనగర్: భార్య తనపై పెట్టిన కట్నం వేధింపుల కేసులో కోర్టు వాయిదాలకు నిందితుడు బుధవారం బురఖా వేసుకొని జిల్లా కోర్టు ఆవరణలోని పీసీఆర్ కోర్టుకు హాజరయ్యేందుకు రావటం సంచలనం రేపింది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ గ్రామానికి చెందిన పల్లె శ్రీనివాసరెడ్డిపై అతడిభార్య కట్నం వేధింపుల కేసు పెట్టింది. వాయిదాలకు కోర్టుకు హాజరవుతున్నాడు. మధ్యలో ఓ వాయిదాకు హాజరు కాకపోవడంతో కోర్టు అతడిపై వారెంట్ జారీ చేసింది. భార్య తరఫువారితో ప్రాణభయం ఉండటం, వారెంట్‌పై పోలీసులు పట్టుకోకుండా ఉండేందుకు బురఖా ధరించి కోర్టుకు వచ్చాడు. కొందరు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. టూటౌన్ పోలీసులు శ్రీనివాస్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఇతనివెంట తండ్రి, తల్లి, చెల్లి రాగా.. పోలీసులు అరెస్టు చేయడంతో తండ్రి మల్లారెడ్డి వెంటతెచ్చుకున్న పురుగుల మందు తాగి కిందపడిపోయాడు. వెంటనే ఆస్పత్రికి తరలించారు. తరువాత తనపై ఉన్న వారెంటును తొలగించుకునేందుకు శ్రీనివాసరెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకోగా కోర్టు అనుమతి ఇచ్చింది. తన భార్య తప్పుడు కేసు పెట్టి ఇబ్బందికి గురి చేస్తోందని, ప్రాణ భయం ఉండడంతో ఇలా బురఖా ధరించి వచ్చానని శ్రీనివాస్‌రెడ్డి ఏడ్వడం కలవరపరిచింది. (క్లిక్: ‘ఊపిరి’ పోసిన ఎస్ఐ) -
బురఖా బ్యాన్పై వెనక్కి తగ్గిన సంజయ్
సాక్షి, ముంబై: బురఖా నిషేధంపై ఇటీవల సామ్నా సంపాదకీయంలో చేసిన వ్యాఖ్యలు శివసేన ఎంపీ, పార్టీ అధికార ప్రతినిధి సంజయ్ రావుత్ ఆదివారం ఉప సంహరించుకున్నారు. దీంతో గత వారం రోజులుగా జరుగుతున్న ఈ వివాదానికి తెరపడినట్లు అయింది. గత నెలలో శ్రీలంకలో ఈస్టర్ వేడుకల సందర్బంగా వివిధ చర్చిల్లో వరుస పేలుళ్లు వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తరువాత పేలుళ్లకు ఓ ఉగ్రవాద సంస్ధ బా«ధ్యత వహిస్తూ ప్రకటన చేసింది. దీంతో దేశ ప్రజల భద్రత దృష్ట్య శ్రీలంకా ప్రభుత్వం ముస్లిం మహిళలు బుర్ఖా ధరంచడంపై నిషేధం విధించింది. చదవండి: (బురఖా బ్యాన్‌కు కేంద్ర మంత్రి నో..) ఇదే తరహాలో భారతదేశంలో కూడా బుర్ఖాలను నిషేధించాలని శివసేన పార్టీ పత్రిక సామ్నా సంపాదకీయాలో సంజయ్ రావుత్ ఇటీవల వ్యాఖ్యలు రాసిన సంగతి తెలిసిందే. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా ముస్లిం సంఘాలు, మహిళల నుంచి నిరసనలు వెల్లువెత్తాయి. ఆ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ర్యాలీలు నిర్వహించి కలెక్టర్లకు వినతి పత్రాలు సమర్పించారు. సర్వత్రా వ్యతిరేకత రావడంతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కసాగింది. దీంతో పరిస్ధితులు అదుపుతప్పక ముందే సంజయ్ రావుత్ ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించారు. ఇది కేవలం తన వ్యక్తిగత అభిప్రాయమని, వాస్తవ సంఘటనలపై విశ్లేషణలో ఒక భాగంగానే సంపాదకీయంలో పొందుపరిచామని స్పష్టం చేశారు. బుర్ఖా నిషేధించాలని శివసేన పార్టీగాని, ఆ పార్టీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేగాని డిమాండ్ చేయలేదని సంజయ్ వెల్లడించారు. -
ఫోటోతో సమాధానం చెప్పిన రెహమాన్
బుర్ఖా వివాదం అనంతరం సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ షేర్ చేసిన ఓ ఫోటో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. 24 గంటల్లోపే ఈ ఫోటోను దాదాపు 2 లక్షల మంది లైక్ చేశారు. ‘హలో ఇండియా మ్యాగజైన్’ ఫోటో షూట్ సందర్భంగా తీసిన ఈ ఫోటోలో రెహమాన్ పిల్లలు ఖతీజా, రహిమా, అమీన్ ముగ్గురు ఉన్నారు. అయితే ఈ ఫోటోలో కూడా ఖతీజా బుర్ఖా ధరించే ఉన్నారు. అమీన్, రహీమ మాత్రం మోడ్రన్ దుస్తులు ధరించి ఫోటో షూట్లో పాల్గొన్నారు. రెహమాన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ ఫోటో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఒక్క ఫోటోతో విమర్శించే వాళ్ల నోళ్లు మూయించారంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. View this post on Instagram Raheema ,Khatija and Ameen posing for Hello magazine 😊 A post shared by @ arrahman on Feb 8, 2019 at 4:54am PST రెహమాన్ ఆస్కార్ అవార్డు సాధించి పదేళ్లయిన సందర్భంగా ముంబైలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి ఖతీజా బుర్ఖాలో రావడంతో కొంతమంది విమర్శనాస్త్రాలు సంధించిన సంగతి తెలిసిందే. రెహమాన్ సంకుచిత స్వభావం కలవాడని, బుర్ఖా ధరించాలని కూతురిపై ఒత్తిడి తెచ్చాడని ఆరోపించారు. వీటిపై స్పందించిన ఖతీజా.. వ్యక్తిగత స్వేచ్ఛను తన తల్లిదండ్రులు గౌరవిస్తారని తెలిపారు. బుర్ఖా ధరించడాన్ని తాను గౌరవంగా భావిస్తానని ఖతీజా వెల్లడించారు. -
తెలియకుండా మాట్లాడొద్దు
ముంబై: తన తండ్రిని విమర్శించిన వారికి ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కుమార్తె ఖతీజా దీటుగా సమాధానం ఇచ్చారు. రెహమాన్ ఆస్కార్ అవార్డు సాధించి పదేళ్లయిన సందర్భంగా ముంబైలో ఇటీవల ఓ వేడుక జరిగింది. ఈ కార్యక్రమంలో రెహమాన్, ఖతీజాల భావోద్వేగ ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. అదేసమయంలో విమర్శలు కూడా వచ్చాయి. ఖతీజా బుర్ఖాలో రావడంతో కొంతమంది విమర్శనాస్త్రాలు సంధించారు. రెహమాన్ సంకుచిత స్వభావం కలవాడని, బుర్ఖా ధరించాలని కూతురిపై ఒత్తిడి తెచ్చాడని ఆరోపించారు. దీనిపై ఖతీజా ఫేక్బుక్లో స్పందించింది. ‘నా జీవితం పట్ల నాకు స్పష్టమైన అవగాహన ఉంది. నాకు నచ్చినట్టుగానే నేను ఉంటాను. నాకు నచ్చిన దుస్తులు ధరిస్తాను. వాస్తవ పరిస్థితులు తెలియకుండా దయచేసి సొంత తీర్పులు ఇవ్వకండి. ఇటీవల జరిగిన వేడుకలో వేదికపై మా నాన్నతో జరిపిన నేను జరిపిన సంభాషణపై మంచి స్పందన వచ్చింది. అలాగే కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. నా తండ్రి ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారని కొంతమంది విమర్శించారు. ఇలాంటి వారికి నేను చెప్పేది ఒక్కటే. వ్యక్తిగత స్వేచ్ఛను నా తల్లిదండ్రులు గౌరవిస్తారు. బుర్ఖా వేసుకోవడం నాకు ఇష్టం. బుర్ఖా ధరించడాన్ని గౌరవంగా భావిస్తాన’ని ఖతీజా వెల్లడించింది. విమర్శకుల నోళ్లు మూయించేందుకు రెహమాన్ కూడా తన ట్విటర్లో ఓ ఫొటో షేర్ చేశారు. నీతా అంబానీతో తన భార్య సైరా, కుమార్తెలు ఖతీజా, రహీమ దిగిన ఫొటోను ‘ఫ్రీడం టూ చూజ్’ పేరుతో ట్విటర్లో పెట్టారు. ఖతీజా మినహా సైరా, రహీమ బుర్ఖాలు లేకుండానే ఉన్నారు. తన ఇష్టప్రకారమే ఖతీజా బుర్ఖా ధరించిందని ఈ ఫొటో ద్వారా స్పష్టం చేశారు. (మనస్సాక్షే దారి చూపుతుంది!) The precious ladies of my family Khatija ,Raheema and Sairaa with NitaAmbaniji #freedomtochoose pic.twitter.com/H2DZePYOtA — A.R.Rahman (@arrahman) February 6, 2019 -
బుర్ఖా, నిఖాబ్ బ్యాన్.. కాదంటే జరిమానా
స్టాక్‌హోమ్ : డెన్మార్మ్లోని హోర్షొల్మ్ ప్రాంతంలో ఒక షాపింగ్ మాల్ దగ్గర ఇద్దరు స్త్రీలు గొడవ పడుతున్నారు. వారిలో ఒక స్త్రీ, మరో ముస్లిం మహిళ(28) ధరించిన ‘నిఖాబ్’ / ‘హిజాబ్’ (ముఖాన్ని కప్పి ఉంచి వస్త్రం)ను తొలగించే ప్రయత్నం చేస్తోంది. దాంతో ఆ ముస్లిం యువతి ‘నిఖాబ్’ తొలగిపోయింది. ఆమె వెంటనే దాన్ని సవరించుకుంది. ఇంతలో పోలీసులు వెళ్లి ఆ గొడవ సద్దుమణిగేలా చేశారు. అనంతరం ఆ ముస్లిం యువతికి జరిమానా విధించారు. అంతేకాక ఇది తొలిసారి కాబట్టి మీకు ఒక అవకాశం ఇస్తున్నాం. ‘ఒకటి జరిమానా చెల్లించాలి లేదా నిఖాబ్ ధరించి మీరు బహిరంగ ప్రదేశాలకు రాకుడదు’ అని చెప్పారు. దాంతో ఆ మహిళ రెండో దాన్ని (నిఖాబ్ ధరించి బహిరంగ ప్రదేశాలకు రాకుండా ఉండటం) ఎంచుకుంది. ముస్లిం మహిళ అన్నప్పుడు నిఖాబ్ ధరించడం సాంప్రదాయం కదా. మరి జరిమానా ఎందుకు విధించారు..? ఎందుకంటే చాలా యూరోప్ దేశాలతో పాటు డెన్మార్క్‌లో కూడా ఈ ఆగస్టు 1 నుంచి ముఖాన్ని కప్పి ఉంచే బుర్ఖా, నిఖాబ్, మాస్క్‌లు, స్కార్ఫ్‌లను నిషేధించారు. బహిరంగ ప్రదేశాల్లోకి వచ్చేటప్పుడు వీటిని ధరించి వస్తే జరిమానా విధిస్తున్నారు. అసలు ముస్లిం మహిళలు అనగానే బుర్ఖా లేదా నిఖాబ్ ధరించిన వారి రూపాలు మన కళ్ల ముందు మెదులుతాయి. ముస్లిం దేశాల్లో వీటిని ధరించకుండా ఆడవారు బయటకు రావడం నిషేధం. కానీ యూరోప్ దేశాల్లో ఇందుకు విరుద్ధమైన నిబంధనలు రూపొందిస్తున్నారు. బహిరంగ ప్రదేశాలకు వచ్చినప్పుడు మహిళలు బుర్ఖా లేదా నిఖాబ్ ధరించ కూడదంటూ నిషేధాజ్ఞలు జారీ చేస్తున్నారు. కానీ ముస్లిం మహిళలు ఇందుకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు. మానవ హక్కుల సంఘం వారు కూడా వీరికి మద్దతిస్తూ, మహిళల హక్కులను గౌరవించాలని డిమాండ్ చేస్తున్నారు. -
యోగి సభలో ముస్లిం మహిళ బుర్ఖా విప్పించారు..!
-
యోగి సభలో ముస్లిం మహిళ బుర్ఖా విప్పించారు..!
బాలియా: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బహిరంగ సభలో ఓ ముస్లిం మహిళా కార్యకర్తకు చేదు అనుభవం ఎదురైంది. సభకు హాజరైన ఆ మహిళ బుర్ఖాను తొలగించాలని పోలీసులు ఆదేశించారు. దీనికి సంబంధించిన ఓ వీడియో కూడా బయటకు వచ్చింది. ఈఘటనపై బాలియా ఎస్పీ అనిల్ కుమార్ స్పందించారు. అయితే మహిళను బుర్ఖా తొలగించించాలన్న ఈ ఘటనకు సంబంధించి తమకు సమాచారం అందలేదన్నారు. అయితే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సభలో ఎవరూ నల్లటి వస్త్రాలు చూపరాదన్న ఆదేశాలు ఉన్నాయని మాత్రం తెలిపారు. ఈ ఘటనపై విచారణ చేపట్టి సరైన చర్యలు తీసుకుంటామన్నారు. మరోవైపు బుర్ఖాను ఎందుకు తొలగించాలని పోలీసులు...ఎందుకు ఆదేశించారో తనను తెలియదని ఆ ముస్లి మహిళ పేర్కొంది. అయితే ఆ మహిళతో పాటు ఆమె భర్త కూడా బీజేపీ కార్యకర్తలే కావడం గమనార్హం. కాగా ఆదివారం మీరట్‌లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ప్రచార సభలో కొందరు సీఎం యోగికి వ్యతిరేకంగా నల్ల జెండాలను చూపించారు. అయితే ఆ ఆందోళన కారులను ... బీజేపీ కార్యకర్తలు చితకబాదారు. మళ్లీ అలాంటి ఘటన జరగకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ముస్లిం మహిళను బుర్ఖా తొలగించాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. -
ఆస్ట్రియాలో బురఖాపై నిషేధం
వియాన్నా : మొహం కనిపించకుండా మాస్క్‌లు ధరించడాన్ని ఆస్ట్రియా ప్రభుత్వం నిషేధించింది. ఇందులో ముస్లిం మహిళలు సంప్రదాయంగా ధరించే బురఖాలను కూడా చేర్చింది. అంతేకాక ఆసుపత్రుల్లో ఆపరేషన్ల సమయంలే ధరించే ఫేస్ మాస్క్‌లను కూడా బయట ప్రదేశంలో ధరించరాదని ఆస్ట్రియా ప్రభుత్వం సోమవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ చట్టాన్ని అతిక్రమించిన వారిపై చర్యలు కఠినంగా ఉంటాయని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. ఇప్పటికే బురఖాను ఫ్రాన్స్, బెల్జియం, జర్మనీ తదితర దేశాలు నిషేధించాయి. -
అక్కడ బురఖా ధరిస్తే ఆరున్నర లక్షల ఫైన్
బెర్న్: బహిరంగ ప్రదేశాల్లో ముఖం కనిపించకుండా బురఖాలు ధరించడాన్ని స్విడ్జర్లాండ్లోని టిసినో రాష్ట్రం నిషేధించింది. 2013, సెప్టెంబర్‌లో బురఖాలపై స్థానిక ప్రభుత్వం రెఫరెండమ్ నిర్వహించింది. అందులో ప్రతి ముగ్గురిలో ఇద్దరు బహిరంగ ప్రదేశాల్లో ముస్లిం మహిళలు బురఖాలు ధరించడాన్ని నిషేధించాలనే రెఫరెండమ్‌కు సానుకూలంగా ఓటు వేశారు. ఇప్పడు ఆ రెఫరెండమ్ ప్రకారం తీసుకొచ్చిన చట్టాన్ని టిసినో రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. ఇలా బురఖాలను నిషేధించడం ఫెడరల్ చట్టానికి వ్యతిరేకం కాదని కేంద్ర ప్రభుత్వం కూడా సమర్థించింది. నిషేధాన్ని ఉల్లంఘించి ముఖం కనపడకుండా బురఖాలు ధరించిన పక్షంలో ఆరున్నర వేల రూపాయల నుంచి ఆరున్నర లక్షల రూపాయల వరకు జరిమానా విధిస్తారు. ఎప్పటి నుంచి ఈ చట్టాన్ని అమలులోకి తీసుకొచ్చేది మాత్రం స్థానిక ప్రభుత్వం వెల్లడించలేదు. దుకాణాలు, మాల్స్, రెస్టారెంట్లు, ప్రభుత్వ కార్యాలయాలు తదితర ప్రదేశాల్లో బురఖాలు ధరించకుండా చట్టం తీసుకొచ్చామని, ఈ చట్టం గురించి పర్యాటకుల్లో అవగాహన కల్పించేందుకు విమానాశ్రయాల్లోనే వారికి ముందుగా తెలియజేస్తామని రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి ఒకరు తెలియజేశారు. బురఖా ముసుగుల్లో టెర్రరిస్టు కార్యకలాపాలు, దోపిడీలు, దొంగతనాలకు పాల్పడకుండా నిరోధించడం కోసమే ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. బహిరంగ ప్రదేశాల్లో బురఖాలు ధరించడాన్ని నిషేధించిన దేశాల్లో స్విడ్జర్లాండ్ మొదటిదేమీ కాదు. ఫ్రాన్స్ 2010లోనే ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. చట్టాన్ని ఉల్లంఘిస్తే ఆ దేశంలో 3,500 నుంచి 15,000 రూపాయల వరకు జరిమానా విధిస్తారు.