Bursting
-
దీపావళి టపాసులు.. వివిధ రాష్ట్రాల నిబంధనలివే..
న్యూఢిల్లీ: చలికాలం సమీపిస్తున్న కొద్దీ దేశంలోని పలు నగరాల్లో గాలి విషపూరితంగా మారుతుంటుంది. ఇదే కాకుండా దీపావళి సందర్భంగా పటాకులు కాల్చినప్పుడు వాయు కాలుష్యం మరింత విజృంభిస్తుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని వివిధ రాష్ట్రాలు పటాకులు కాల్పడంపై నిషేధం విధించాయి. మరికొన్ని రాష్ట్రాల్లో కేవలం రెండు గంటలపాటు మాత్రమే టపాసులు వెలిగించేందుకు అనుమతినిచ్చారు.ఢిల్లీఢిల్లీ- ఎన్సీఆర్లలో అక్టోబరు 31న అంటే దీపావళి నాడు సాయంత్రం 8 నుంచి 10 గంటల మధ్యలో మాత్రమే గ్రీన్ టపాసులు కాల్చుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.మహారాష్ట్రమహారాష్ట్ర నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) సూచనల మేరకు మహారాష్ట్రలో బాణసంచా కాల్చడాన్ని నిషేధించారు. అయితే గ్రీన్ క్రాకర్స్ కాల్చడానికి మాత్రమే అనుమతి ఉంది. గ్రీన్ క్రాకర్స్ సాధారణ క్రాకర్స్ కంటే 30శాతం తక్కువ కాలుష్యాన్ని విడుదల చేసేలా తయారు చేస్తారు.పశ్చిమ బెంగాల్పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో దీపావళి సందర్భంగా కాలుష్యం గణనీయంగా పెరుగుతుంది. ఈ కారణంగా గత కొన్నేళ్లుగా ఇక్కడ సాధారణ పటాకులు పేల్చేందుకు అనుమతి ఇవ్వడం లేదు. అయితే కోల్‌కతాలో గ్రీన్ క్రాకర్లు కాల్చవచ్చు. కోల్‌కతాలో రాత్రి 8 నుండి 10 గంటల వరకు గ్రీన్ క్రాకర్స్ కాల్చడానికి అనుమతి ఉంది.పంజాబ్పంజాబ్లో గ్రీన్ క్రాకర్స్ కాల్చేందుకు మాత్రమే అనుమతి ఉంది. పంజాబ్‌లో దీపావళి రోజున (అక్టోబర్ 31) ఉదయం 4 నుండి 5 గంటల వరకు, రాత్రి 9 నుండి 10 గంటల వరకు టపాసులు కాల్చేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది.బీహార్ పెరుగుతున్న కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని బీహార్ ప్రభుత్వం రాష్ట్రంలోని నాలుగు నగరాల్లో బాణాసంచా కాల్చడాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. రాజధాని పాట్నా, ముజఫర్‌పూర్, హాజీపూర్, గయలో ఈ ఏడాది బాణాసంచా కాల్చడానికి అనుమతి లేదు. ఈ నగరాల్లో పటాకుల అమ్మకానికి లైసెన్స్ కూడా ఇవ్వలేదు. ఎవరైనా రహస్యంగా పటాకులు విక్రయిస్తున్నట్లు తేలితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది.హర్యానాదీపావళి నాడు హర్యానాలో గ్రీన్ క్రాకర్స్ మాత్రమే కాల్చాలంటూ ప్రభుత్వ ఆదేశాలు జారీ అయ్యాయి. దీపావళి నాడు రాత్రి 8 నుండి 10 గంటల వరకు, క్రిస్మస్ రోజున 11.55 నుండి 12.30 గంటల వరకు గ్రీన్ క్రాకర్లు కాల్చేందుకు అనుమతినిచ్చారు.తమిళనాడుతమిళనాడు కాలుష్య నియంత్రణ మండలి దీపావళి రోజున పటాకులు కాల్చేందుకు మార్గదర్శకాలను విడుదల చేసింది. తమిళనాడులో దీపావళి రోజున ఉదయం 6 నుంచి 7 గంటల వరకు, సాయంత్రం 7 నుంచి 8 గంటల వరకు పటాకులు కాల్చేందుకు ప్రభుత్వం సమయం నిర్ణయించింది.ఇది కూడా చదవండి: ఈసారి 33 విమానాలకు బెదిరింపులు -
గోదావరి పరీవాహక ప్రాంతంలో విజృంభిస్తున్న డెంగీ, విషజ్వరాలు
ఈ చిత్రంలో కనిపిస్తున్న ఊరి పేరు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలంలోని ప్రేమ్‌నగర్. ఈ గ్రామ జనాభా 300 మంది కాగా, వీరిలో 50 మందికిపైగా జ్వరాలతో బాధపడుతున్నారు. మూడు నెలల క్రితం ఇక్కడ 30 మంది జ్వరాల బారిన పడగా, గ్రామానికి చెందిన యువకుడు అవినాష్ రెండు రోజుల క్రితం చనిపోయాడు. ఇదే గ్రామంలో తీవ్ర జ్వరంబారిన పడిన ఒకే కుటుంబానికి చెందిన రాంసింగ్, ఓంసింగ్, శారన్భాయ్లను కుటుంబసభ్యులు బుధవారం మెరుగైన వైద్యానికి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఇప్పుడా గ్రామం జ్వరాలతో విలవిల్లాడుతోంది. సాక్షిప్రతినిధి, వరంగల్: జూలై ,ఆగస్టు మాసాల్లో కురిసిన ఎడతెరపి లేని వర్షాలు గోదావరి పరీవాహక ఏజెన్సీ పల్లెలను కుదిపేశాయి. ఇప్పుడా ప్రాంతాలను విషజ్వరాలు పట్టి పీడిస్తున్నాయి. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మొదలు భద్రాద్రి కొత్తగూడెం వరకు అనేక గ్రామాలు డెంగీ, మలేరియాల వలయంలో బిక్కుబిక్కుమంటున్నాయి. ఎంజీఎం ఆస్పత్రి పూర్వ వరంగల్, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల పేషెంట్లతో కిటకిటలాడుతోంది. ఆయా జిల్లా కేంద్రాల్లోని ఆస్పత్రులు జ్వరపీడితులతో నిండిపోతున్నాయి. ఇప్పటికే ఎనిమిదిమంది వృద్ధులు, మహిళలు, బాలురు మృత్యువాత పడగా, 15 నుంచి 25 రోజులైనా తగ్గని జ్వరాలతో జనం ఆందోళన చెందుతున్నారు. ఇంటింటా జ్వరపీడితులే... వర్షాలు, వరదలతో అతలాకుతలమైన జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలు.. ఇప్పుడు డెంగీ, మలేరియా, విషజ్వరాలతో విలవిలలాడుతున్నాయి. మహా ముత్తారం, గణపురం, తాడిచర్ల, రేగొండ, కాటారం, మొగుళ్లపల్లి పీహెచ్‌సీల్లో రోజుకు 150 నుంచి 250 మంది ఔట్పేòÙంట్లుగా వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు. ములుగు జిల్లా వెంకటాపురం, మంగపేట, వాజేడు, ఏటూరునాగారం మండలాల్లోని పల్లెలు మంచం పట్టాయి. జిల్లాలో గత జనవరి నుంచి 51 మలేరియా, 18 డెంగీ కేసులు నమోదయ్యాయి. పెద్దపల్లి జిల్లా మంథని, కమాన్‌పూర్, రామగిరి, ముత్తారం తదితర మండలాల్లోని 39 గ్రామాల్లో డెంగీ, విషజ్వరాలు జనాలను జడిపిస్తున్నాయి. ముత్తారం మండలంలో బేగంపేటకు చెందిన ఓ మహిళ మృతి చెందగా... డెంగీ బాధితుల సంఖ్య 89కి చేరినట్టు అధికారులు ప్రకటించారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు, దంతాలపల్లి, మరిపెడ, కొత్తగూడ, గంగారం, కేసముద్రం, గార్ల తదితర మండలాల్లో డెంగీ, విషజ్వరాలు జడలు విప్పాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఏజెన్సీ ప్రాంతాల్లో మలేరియా, డెంగీ, విషజ్వరాలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు మలేరియా 162, డెంగీ 273, విషజ్వరాలు 2,35,835 కేసులు నమోదయ్యాయి. ఈ ఫొటోలో ఉన్న బాబు పేరు వర్షిత్‌కుమార్. ములుగు జిల్లా మంగపేట. రెండు రోజులనుంచి ప్రభుత్వ ఆస్పత్రిలో ఉంటున్నాడు. మలేరియా పాజిటివ్ వచి్చంది. రక్తం చాలా తక్కువ ఉందని వైద్యులు ఆస్పత్రిలో అడ్మిట్ చేసుకున్నారు. తల్లి రమ్య పక్కనే ఉంటూ సపర్యలు చేస్తోంది. వారం రోజులుగా జ్వరం తగ్గడం లేదు మాది ములుగు జిల్లా మంగపేట మండలం రమణక్కపేట. నేను మూడు నెలల గర్భవతిని. వారం రోజుల నుంచి జ్వరం వస్తోంది. తగ్గకపోవడంతో ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చా. చాలా నీరసంగా ఉంటోంది. – సరిత, రమణక్కపేట, ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో విషజ్వరాలు ఇద్దరు మహిళలు, డెంగీతో ఆరు నెలల పాప మృతి వాజేడు/కన్నాయిగూడెం: ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో విషజ్వరాలు మరణ మృదంగం మోగిస్తున్నాయి. రెండు రోజుల్లోనే ఐదుగురు చనిపోయారు. బుధవారం ఇద్దరు చనిపోగా, గురువారం మరో ముగ్గురు మృతిచెందారు. మృతుల్లో ఆరు నెలల పాప ఉండడం గమనార్హం. ములుగు జిల్లా వాజేడు మండలం మొట్లగూడెం గ్రామానికి చెందిన కుర్సం రజని (35), ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్‌లో నివాసి మనీష (30) విషజ్వరంతో మృతిచెందారు. వాజేడు మండల పరిధిలోని దేవాదుల గ్రామానికి చెందిన ఆరు నెలల పాప కూడా డెంగీ జ్వరంతో మృతిచెందినట్లు గ్రామస్తులు తెలిపారు. -
కల్తీ నూనే దందా గుట్టురట్టు
-
బడుగుల గూళ్లు బుగ్గి
అమలాపురం రూరల్ :చెమటోడిస్తే తప్ప సాపాటుకు నోచని కష్టజీవుల బతుకుల్లో చిచ్చు రగిలింది. వారి కళ్ల నుంచి నీరు ధారలు కట్టినా కనికరించని అగ్నికీలలు.. వారి కష్టార్జితాన్ని బుగ్గి చేసి గానీ శాంతించలేదు. ఎండలో, వానలో, చలిలో తమను అక్కున చేర్చుకున్న ఇళ్లు.. కళ్లెదుటే తగలబడి, మొండిగోడలతో మిగలడాన్ని చూసిన వారి గుండెల్లో ఆరని దుఃఖాగ్ని జ్వలించింది. అమలాపురం రూరల్ మండలం పేరూరు శివారు అంబేద్కర్‌నగర్‌లో గురువారం ఉదయం జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 44 ఇళ్లు దగ్ధమయ్యాయి. వీటిలో 37 పూరిళ్లు కాగా, మిగిలినవి పక్కా ఇళ్లు. ఈ ప్రమాదంలో 44 కుటుంబాలు వీధిపాలయ్యాయి. రూ.70 లక్షల ఆస్తినష్టం సంభవించింది. ఇళ్లు అంటుకున్న సమయంలో వేడిగాలులు వీచడం, రెండిళ్లలోని వంటగ్యాస్ సిలిండర్లు పేలటంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగింది. ముత్తామత్తుల భేతాళస్వామి ఇంట్లో విద్యుత్ షార్ట్‌సర్క్యూటే ప్రమాదానికి కారణమని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. గురువారం అసలే వాతావరణం రగులుతుండగా.. ఈ అగ్నిప్రమాదంతో పేరూరు, పరిసర గ్రామాల్లో గాలి నిప్పులకొలిమి నుంచి వచ్చినట్టు మరింత వేడెక్కింది. పేలిన వంటగ్యాస్ సిలిండర్లు కొబ్బరి తోటల మధ్యనున్న అంబేద్కర్ నగర్లో దాదాపు 300 కుటుంబాలు జీవిస్తుండగా అందరూ రోజు కూలీలే. ఉదయమే దాదాపు 100 కుటుంబాలకు చెందిన వారు కూలి పనులకు వెళ్లిపోయారు. మరికొందరు కాలనీకి కొంచెం దూరంలోని ఓ ఇంట జరుగుతున్న పెళ్లి విందుకు వెళ్లారు. కాలనీ అంతా దాదాపు ఖాళీగా ఉన్న 11 గంటల సమయంలో భేతాళస్వామి ఇంటి నుంచి పొగలు, మంటలు వచ్చాయి. విందు జరుగుతున్న చోటి నుంచే వాటిని గమనించిన కాలనీవాసులు గుండెలు బాదుకుంటూ పరుగులు తీశారు. అప్పటికే అగ్నికీలలు అనేక ఇళ్లను చుట్టుముట్టాయి. పొలాల్లో పనులకు వెళ్లిన వారూ దూరం నుంచే అగ్నికీలలను గమనించి పరుగుపరుగున ఇళ్లకు వచ్చారు. కొందరు తమ ఇళ్లలోని కొన్ని వస్తువులను చేరువలోని కొబ్బరి తోటల్లోకి విసిరేశారు. ఇదే సమయంలో కాలిపోతున్న రెండిళ్లలో వంట గ్యాస్ సిలిండర్లు పెనుశబ్దంతో పేలటంతో భీతిల్లి చెల్లాచెదురయ్యారు. కొందరు తెగించి తమ ఇళ్లలోని గ్యాస్ సిలిండర్లను బయటకు తెచ్చి కొబ్బరితోటలోకి చేర్చారు. దీంతో ప్రమాద తీవ్రత తగ్గింది. ప్రమాద తీవ్రతను పెంచిన పడమటి గాలి అసలే వడగాలులతో భగ్గుమంటున్న వాతావరణం అగ్నిప్రమాదంతో మరింత ఉగ్రరూపం దాల్చింది. అదే సమయంలో పడమటిగాలి జోరు కావడంతో అగ్నికీలలు ఒక ఇంటి నుంచి మరో ఇంటికి వేగంగా వ్యాపించాయి. ప్రమాదాన్ని కళ్లారా చూసిన బాధితుల్లో కొందరు దిగ్భ్రాంతితో స్థాణువులయ్యారు. కొందరు వృద్ధులు, మహిళలు తీవ్రవేదనతో సొమ్మసిల్లిపోయారు. దక్కించుకున్న వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉన్న కొబ్బరి తోటల్లో.. నిస్సహాయంగా విలపిస్తున్న బాధితులను చూస్తే యుద్ధభూమిలా కనిపించింది. నీరు లేక పెరిగిన నష్టం ఇళ్లు అంటుకోగానే కొందరు సమాచారం అందించడంతో ఆర్డీఓ ప్రియాంక, డీఎస్పీ వీరారెడ్డి అమలాపురం, ముమ్మిడివరం, కొత్తపేటల నుంచి, చమురు సంస్థలైన కెయిర్న్ ఎనర్జీ, గుజరాత్ పెట్రోలియం, ఓఎన్జీసీల నుంచి అగ్ని మాపక శకటాలను రప్పించారు. ఈ ఆరు శకటాల్లో ఉన్న నీటిని విరజిమ్మినా మంటలు అదుపులోకి రాలేదు. వాటిలో మళ్లీ నీరు నింపుదామంటే అక్కడ నీరు అందుబాటులో లేదు. దాంతో శకటాలను కొంతదూరంలో ఉన్న చెరువు వద్దకు తీసుకువెళ్లి నీటిని నింపుకొని వచ్చారు. ఈ వ్యవధిలో మంటలు విజృంభించి, నష్టం మరికొంత పెరిగింది. జిల్లా అగ్నిమాపకాధికారి ఉదయ్‌కుమార్, సహాయ అగ్నిమాపకాధికారి ప్రశాంతికుమార్ పరిస్థితిని సమీక్షించారు. అమలాపురం తహశీల్దారు నక్కా చిట్టిబాబు, డీఎల్పీఓ జె.వి.ఎస్.ఎస్.శర్మ, ఇన్‌ఛార్జి ఎంపీడీఓ కె.జానకిరామయ్య, పేరూరు సర్పంచ్ పెచ్చెట్టి చంద్రమౌళి సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించారు. బాధితులను ఆదుకుంటాం : ఉప ముఖ్యమంత్రి రాజప్ప పేరూరు అగ్నిప్రమాద బాధితులను ఆదుకుంటామని ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప హామీ ఇచ్చారు. ఆయన, ఎంపీ పండుల రవీంద్రబాబు ఫోన్లో బాధితులతో మాట్లాడారు. కేబినెట్ సమావేశంలో ఉన్న రాజప్ప ప్రమాదవార్త తెలుసుకుని ఆర్డీఓ ప్రియాంక, డీఎస్పీ వీరారెడ్డిలతో ఫోన్లో మాట్లాడి సహాయ చర్యల వివరాలను తెలుసుకున్నారు. జిల్లాకు వచ్చిన వెంటనే బాధితులను పరామర్శిస్తామని ఎంపీపీ అభ్యర్థి బొర్రా ఈశ్వరరావు, సర్పంచ్ చంద్రమౌళిలకు చెప్పారు. ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు బాధితులను ఫోన్,లో పరామర్శించారు. మాజీ మంత్రి మెట్ల సత్యనారాయణరావు బాధితులను పరామర్శించారు. -
నకిలీ మద్యం గుట్టురట్టు..!
మహేశ్వరం, న్యూస్‌లైన్:వ్యవసాయ పొలంలో తయూరుచేస్తున్న నకిలీ మద్యాన్ని ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మహేశ్వరం సీఐ ఎం.డి.బషీరుద్దీన్ తెలిపిన వివరాలు.. కందుకూరు మండలం దెబ్బడగూడ గ్రామ శివారులో నగరానికి చెందిన శ్యాంలాల్ పొలాన్ని అదే గ్రామానికి చెందిన డేరంగుల పెద్ద రాములు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. అయితే మహబూబ్‌నగర్ జిల్లా కోడేరు మండలం ఎత్వం గ్రామానికి చెందిన రవీందర్‌రెడ్డితో ఇతనికి పరిచయుం ఉంది. వీరిద్దరూ కలిసి మూడు నెలలుగా పొలంలో రాత్రి వేళ గుట్టుచప్పుడు కాకుండా నకిలీ మద్యాన్ని తయూరు చేస్తున్నారు. ఇక్కడ తయూరు చేసిన నకిలీ మద్యాన్ని మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్‌కు తరలించి వీరు సొవుు్మ చేసుకుంటున్నారు. ఈ విషయుమై సవూచారం అందుకున్న ఎక్సైజ్ అధికారులు బుధవారం రాత్రి ఎక్సైజ్ సూపరింటెండెంట్ అంజన్‌రావు, డిప్యూటీ కమిషనర్ రాజశేఖర్రావుల ఆదేశాల మేరకు వీరి స్థావరంపై దాడి చేసి నకిలీ వుద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అధికారులు స్వాధీనం చేసుకున్న వాటిలో రెండు డ్రమ్ముల రెక్టిఫైడ్ స్పిరిట్ మత్తు పదార్థం, 15 కాటన్ల నకిలీ వుద్యం బాటిళ్లు, 30 లీటర్ల విస్కీ, డూప్లికేట్ లేబుల్స్, 10 కిలోల ప్లాస్టిక్ మూతలు, ఒక హైడ్రోమీటర్, 30 లీటర్ల ఫ్యారమిల్ ప్లవర్, ఓ స్కూటర్ ఉన్నాయి. వీటి విలువ రూ. 1.20 లక్షల వరకు ఉంటుందని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. పెద్ద రాములును అరెస్టు చేసి గురువారం రిమాండ్‌కు తరలించామని, ప్రధాన నిందితుడు రవీందర్‌రెడ్డి పరారీలో ఉన్నారని సీఐ తెలిపారు. అయితే ఇదివరకే వుహబూబ్నగర్లోని పలు కేసుల్లో రవీందర్‌రెడ్డి నిందితుడిగా ఉన్నట్లు ఆయున తెలియ జేశారు. ఈ దాడిలో ఎక్సైజ్ టాస్క్ఫోర్సు సీఐలు లక్ష్మణ్‌నాయక్, భాస్కర్‌రావు తదితరులు పాల్గొన్నారు.