bus-truck collision
-
రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది మృతి
ఇస్లామాబాద్ : పాకిస్థాన్‌లోని సింధు ప్రావిన్స్‌లో బస్సు - ట్రక్కు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది దుర్మరణం చెందారు. మరో 35 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను తట్టాలోని ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు పోలీసులు చెప్పారు. కరాచీ నుంచి బస్సు షదాద్ కోట్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదం శనివారం అర్థరాత్రి చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. -
బస్సును ఢీ కొన్న ట్రక్: 27 మంది మృతి
ప్రయాణికులతో వెళ్తున్న బస్సును ట్రక్క్ ఢీ కొన్న ఘటనలో 27 మంది మృతి చెందారు. ఆ ఘటన సూడాన్‌లోని కర్తోమ్ పట్టణంలో చోటు చేసుకుంది. ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని ... క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని పోలీసులు తెలిపారు. మృతుల్లో ఏడుగురు మహిళలతోపాటు ఓ చిన్నారి ఉందని పోలీసులు వెల్లడించారు. ఆ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. -
బస్సు - ట్రక్ ఢీ: 18 మంది మృతి
పశ్చిమ నేపాల్‌లోని పర్వత ప్రాంతంలో బస్సు, ట్రక్ ఢీ కొని 18 మంది మృతి చెందగా, మరో 31 మంది తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు వెల్లడించారు. అగ్రాకచ్చి జిల్లాలోని బుత్వాల్ వైపు వెళ్తున్న బస్సు.... ఎదరుగా వస్తున్న ట్రక్‌ను నార్పనీ ప్రాంతంలో ఢీ కొట్టిందని తెలిపారు. తీవ్రంగా గాయపడిన 23 మంది క్షతగాత్రులను హెలికాప్టర్ ద్వారా వైద్య సహాయం కోసం బుత్వాల్లోని లుంబిని జోనల్ ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. ట్రక్‌ను ఢీ కొన్న బస్సు దాదాపు 150 మీటర్ల మేర పర్వత ప్రాంతం నుంచి కిందకి పడిపోగా... దాదాపు 200 గ్యాస్ సిలెండర్లతో వెళ్తున్న ట్రక్ మాత్రం రోడ్డుపై తిరగబడిందన్ని పేర్కొన్నారు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే ట్రక్ డ్రైవర్, మరో ముగ్గురు ట్రక్ నుంచి దూకి వేసినట్లు చెప్పారు. మృతులు, క్షతగాత్రులంతా బస్సులోని ప్రయాణికులేని పోలీసులు వివరించారు. ఆ ప్రమాద సంఘటనపై సమాచారం అందుకున్న అధికారులు సంఘటన స్థలానికి జీపులో బయలుదేరారు. ఆ క్రమంలో వారు ప్రయాణిస్తున్న వాహనం ప్రమాద స్థలంలో బోల్తా పడింది. ఆ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరి కొంత మంది తీవ్రంగా గాయపడ్డారు.