bystanders
-
ఢిల్లీలో మళ్లీ బాంబు బెదిరింపు కలకలం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఆగంతకుల బాంబు బెదిరింపులు మరోసారి కలకలానికి కారణమయ్యాయి. బాంబులతో పేల్చేస్తామంటూ ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(ఐజీఐ)తోపాటు ఎనిమిది ఆస్పత్రులకు ఈ–మెయిల్ హెచ్చరికలు అందాయి. మే ఒకటో తేదీన దేశ రాజధాని పరిధిలోని 150కి పైగా స్కూళ్లకు కూడా ఇదేవిధంగా బెదిరింపు మెయిళ్లు అందడం, పూర్తిస్థాయిలో తనిఖీల అనంతరం అవన్నీ వట్టివేనని తేలడం తెల్సిందే. ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో ఐజీఐ టెరి్మనల్–3లో బాంబులు పెట్టినట్లు మెయిల్ అందడంతో తనిఖీలు చేపట్టారు. భారీగా పోలీసులను మోహరించారు. అంతకుముందు, మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఢిల్లీ ప్రాంతంలోని 8 ఆస్పత్రులకు బెదిరింపులు అందాయి. అదేవిధంగా, గుజరాత్‌లోని అహ్మదాబాద్ విమానాశ్రయానికి బెదిరింపు మెయిల్ అందింది. అప్రమత్తమైన అధికారులు హుటాహుటిన ఆయాచోట్లకు ఫైరింజన్లను పంపించారు. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో పోలీసు బృందాలు పూర్తి స్థాయి తనిఖీలు చేపట్టాయి. ఎటువంటి అనుమానాస్పద వస్తువులు, పేలుడు పదార్థాలు కనిపించలేదని ఢిల్లీ నార్త్‌జోన్ డీసీపీ ఎంకే మీనా చెప్పారు. బురారీ ఆస్పత్రి, సంజయ్ గాంధీ మెమోరియల్ హాస్పిటల్, దాదాదేవ్ హాస్పిటల్, గురు తేజ్ బహదూర్ హాస్పిటల్, బారా హిందూరావ్ హాస్పిటల్, జనక్‌పురి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ ఆస్పత్రి, అరుణా అసఫ్ అలీ గవర్నమెంట్ ఆస్పత్రులకు ఈ బెదిరింపులు వచ్చాయి. -
తప్పించుకోవడానికి వేరే మార్గం లేక..
మాస్కో: తాము నివాసముంటున్న అపార్టుమెంటు ఫ్లాటులో మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలతో ఏం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది. బయటకు వెళ్లడానికి ఉన్న అన్ని దారులు మూసుకుపోయాయి. అక్కడి నుంచి కిందకు దూకితే కానీ బతికి బట్టకట్టే అవకాశం లేదని ఇంటికి పెద్ద కుటుంబసభ్యులకు తేల్చి చెప్పాడు. వారిలో గుండె సమస్యతో బాధపడుతున్న 11 నెలల చిన్నారి కూడా ఉంది. బాల్కని చివరన నిలుచొని కొద్దిసేపు సహాయం కోసం ఎదురు చూసినా ఎలాంటి సహకారం అందలేదు. దారిన పోయే వారు ఆ ఇంట్లో నుంచి పొగలు రావడం గమనించి సమయస్పూర్తితో ఆలోచించి, సమిష్టిగా వారిని కాపాడాలని నిర్ణయం తీసుకున్నారు. అనుకున్నదే తడవుగా దాదాపు 20 మంది వరకు ఒకే చోట చేరారు. బాధితులను పైనుంచి దూకాల్సిందిగా గట్టిగా అరిచారు. ఓ వైపు దట్టమైన పొగ, కమ్ముకొస్తున్నమంటలు చేసేదేమీ లేక దేవున్ని ప్రార్థిస్తు ఒక్కొక్కరుగా కిందకు దూకడం మొదలు పెట్టారు. ఎక్కడ కింద ఉన్న వారి చేతిలో వారు పడకుండా పడిపోతారేమో అని చూసేవారంతా నరాలు తెగే ఉత్కంఠతో చూస్తూనే ఉండిపోయారు. రష్యాలోని మాస్కో సమీపంలోని స్ట్రునినోలో ఈ సంఘటన చోటు చేసుకుంది. మొదట ఆ కుటుంబంలోని చిన్నారి జెన్యూని(11 నెలలు) ఐదో అంతస్తు నుంచి కిందకు విసిరడంతో అక్కడే ఉన్న వారు బ్లాంకెట్‌లో పట్టుకున్నారు. ఆ తర్వాత కుటుంబంలోని మరో చిన్నారిని కూడా కిందకు విసిరారు. తమ ఇద్దరు పిల్లలు క్షేమంగా కిందకు చేరిన తర్వాత తల్లి ఎలినా కూడా బాల్కని నుంచి కిందకు దూకింది. ఇక చివరగా తండ్రి విటలీ వంతు వచ్చింది.బాల్కని చివరి అంచుల్లో నిలుచొని ఒక్కసారిగా ఆకాశంలోకి చూసి దేవుడా నువ్వే దిక్కు అనుకొని దూకాడు. చివరకు కుటుంబ సభ్యులందరూ క్షేమంగా ఆ దుర్ఘటన నుంచి బయటపడటంతో అక్కడున్న వారందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే పొగ, మంటలతో కుటుంబ పెద్ద విటలీకి స్వల్ప గాయాలవ్వడంతో ఆతడిని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.