C-DAC
-
మరో సూపర్ కంప్యూటర్ను అభివృద్ది చేసిన సీ-డీఏసీ
బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్సీ) కోసం సీ-డీఏసీ మరొక అత్యంత శక్తివంతమైన సూపర్ కంప్యూటర్ను అభివృద్ది చేసింది. 3.3 పెటాఫ్లాప్స్ సామర్థ్యాన్ని ఈ సూపర్ కంప్యూటర్ కలిగి ఉంది. పరమ్ ప్రవేగా అని పిలిచే ఈ సూపర్ కంప్యూటర్ భారతీయ విద్యా సంస్థలో ఇన్స్టాల్ చేసిన వాటిలో అతిపెద్దది. దీనిని సెంటర్ ఫర్ డెవలప్ మెంట్ ఆఫ్ అడ్వాన్స్ డ్ కంప్యూటింగ్(సీ-డీఏసీ) రూపొందించింది. సూపర్ కంప్యూటర్లో ఉపయోగించే చాలా భాగాలు భారతదేశంలో అభివృద్ధి చేసిన సాఫ్ట్ వేర్ సహాయంతో తయారు చేశారు. దేశవ్యాప్తంగా విభిన్న పరిశోధన & విద్యా అన్వేషణల కోసం నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్(ఎన్ఎస్ఎమ్) కింద ఈ సూపర్ కంప్యూటర్ నియమించబడింది. ఎన్ఎస్ఎమ్ ఇప్పటివరకు 17 పెటాఫ్లాప్స్ క్యుమిలేటివ్ కంప్యూటింగ్ శక్తితో భారతదేశం అంతటా 10 సూపర్ కంప్యూటర్ వ్యవస్థలను ఏర్పాటు చేసింది. "ఈ సూపర్ కంప్యూటర్లు అధ్యాపక సభ్యులు & విద్యార్థులు ప్రధాన ఆర్ అండ్ డి కార్యకలాపాలను నిర్వహించడానికి ఎంతగానో సహాయపడ్డాయి. వీటితో జెనోమిక్స్ & ఔషధ ఆవిష్కరణ, పట్టణ పర్యావరణ సమస్యలను అధ్యయనం చేయడం, వరద హెచ్చరిక & అంచనా వ్యవస్థలను ఏర్పాటు చేయడం, టెలికామ్ నెట్ వర్క్స్ కోసం ఆప్టిమైజ్ చేయవచ్చు" అని ఐఐఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది. పరమ్ ప్రవేగా అంటే ఏమిటి? పరమ్ ప్రవేగా అంటే హై-పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ క్లాస్ ఆఫ్ సిస్టమ్స్ కలిగిన ఒక సూపర్ కంప్యూటర్. సీపీయు నోడ్స్ కోసం ఇంటెల్ జియోన్ కాస్కేడ్ లేక్ ప్రాసెసర్లు, జిపియు నోడ్స్ పై ఎన్ విడియా టెస్లా వి100 కార్డులు ఉన్నాయి. సీ-డీఏసీ అందించే హార్డ్ వేర్ పైన సాఫ్ట్ వేర్ సహాయంతో హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్(హెచ్‌పిసి) అప్లికేషన్లను అభివృద్ధి చేయడానికి ఉపయోగపడుతుంది. భారతదేశంలో విజయ్ పాండురంగ్ భట్కర్ అనే వ్యక్తి పరం సూపర్ కంప్యూటర్ అభివృద్ధికి పునాది వేశారు. ఆలా 1991 సంవత్సరంలోనే మొదటి పరం -8000 అనే సూపర్ కంప్యూటర్ను తయారుచేశారు. ఆ తర్వాత 1998వ సంవత్సరంలో పరం-10000 పేరుతో కొత్తగా అభివృద్ధి చేశారు. అప్పటినుండి పరం సిరీస్ నుండి వచ్చిన శివాయ్, పరం-బ్రహ్మ, ప్రతుష్ ,మిహిర్ అనే సూపర్ కంప్యూటర్లు సాంకేతికంగా అభివృద్ధి చెందుతూ వచ్చాయి. ఈ పరం సిరీస్ సూపర్ కంప్యూటర్స్ ని పూనేలోని సీ-డీఏసీ రూపొందించింది. పరం సిరీస్ సూపర్ కంప్యూటర్స్ అభివృద్ధిలో కీలక పాత్ర పోచింనందుకు గాను భారత ప్రభుత్వం పరం సూపర్ కంప్యూటర్ పితామహకు విజయ్ పి భట్కర్ ని పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులు ఇచ్చి సత్కరించింది. (చదవండి: ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన విమానం.. కేవలం గంటలో!) -
ఉద్యోగాలు
దక్కన్ గ్రామీణ బ్యాంక్ హైదరాబాద్‌లోని దక్కన్ గ్రామీణ బ్యాంక్ (డీజీబీ) వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. - ఆఫీసర్ (స్కేల్ -3): 4 - జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ (స్కేల్ -2): 13 - అగ్రికల్చరల్ ఆఫీసర్: 2 - ఐటీ ఆఫీసర్: 4 - లా ఆఫీసర్: 1 - ట్రెజరీ మేనేజర్: 1 - మార్కెటింగ్ ఆఫీసర్: 1 అర్హతలు: సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు ఏడాది నుంచి మూడేళ్ల అనుభవం అవసరం. ఐబీపీఎస్ ఆర్ఆర్బీస్ కామన్ రిటెన్ ఎగ్జామినేషన్-2013 అర్హత ఉండాలి. - ఆఫీసర్ (స్కేల్-1): 61 - ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్): 111 అర్హతలు: ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీతోపాటు ఐబీపీఎస్ ఆర్ఆర్బీస్ కామన్ రిటెన్ ఎగ్జామినేషన్-2013 అర్హత సాధించాలి. వయసు: 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: సెప్టెంబర్ 19 వెబ్సైట్: http://www.dgbhyd.com/ సీ-డాక్, హైదరాబాద్ సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (సీ-డాక్) వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. - ప్రాజెక్టు ఆఫీసర్: 2 అర్హతలు: మాస్ కమ్యూనికేషన్/జర్నలిజం/ సోషల్ వర్క్‌లో మాస్టర్స్ డిగ్రీ ఉండాలి. సంబంధిత విభాగంలో మూడేళ్ల అనుభవం అవసరం. - ప్రాజెక్ట్ సర్వీస్ సపోర్ట్: 1 అర్హతలు: ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. ఫైన్ ఆర్ట్స్‌లో డిగ్రీ ఉన్న వారికి ప్రాధాన్యం. కనీసం ఐదేళ్ల అనుభవం అవసరం. వయసు: 30 ఏళ్లకు మించకూడదు. ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా. ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: సెప్టెంబర్ 12 వెబ్సైట్: http://www.cdac.in/ -
ఉద్యోగాలు
సీడాక్‌లో ప్రాజెక్ట్ ఇంజనీర్స్ సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్(సి-డాక్) కింద పేర్కొ న్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ప్రాజెక్ట్ ఇంజనీర్- 2 అర్హతలు: కంప్యూటర్ సైన్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో బీఈ/బీటెక్/ఎంసీఏ ఉండాలి. సంబంధిత విభాగంలో 2-3 ఏళ్ల అనుభవం ఉండాలి. వయసు: 32 ఏళ్లకు మించకూడదు. ప్రాజెక్ట్ ఇంజనీర్-1 (ప్రాజెక్ట్ కోఆర్డినేటర్) అర్హతలు: కంప్యూటర్ సైన్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో బీఈ/బీటెక్/ఎంసీఏ ఉండాలి. రెండు నుంచి మూడేళ్ల అనుభవం ఉండాలి. వయసు: 30 ఏళ్లకు మించకూడదు. ప్రాజెక్ట్ అసిస్టెంట్-1 సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్) అర్హతలు: ఇంజనీరింగ్‌లో డిప్లొమా లేదా కంప్యూటర్ సైన్స్‌లో డిగ్రీ. సంబంధిత రంగంలో రెండేళ్ల అనుభవం ఉండాలి. వయసు: 35 ఏళ్లకు మించకూడదు ప్రాజెక్ట్ అసిస్టెంట్-1(ఫ్యాకల్టీ/ట్రైనర్) అర్హతలు: ఇంజనీరింగ్‌లో డిప్లొమా లేదా కంప్యూటర్ సైన్స్‌లో డిగ్రీ. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్‌గా రెండేళ్ల అనుభవం ఉండాలి. వయసు: 35 ఏళ్లకు మించకూడదు. చివరి తేది: ఆగస్టు 19 వెబ్సైట్: http://cdac.in