cabinet berths
-
మంత్రి పదవులపై మల్లగుల్లాలు
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో ఘన విజయంతో అధికారపీఠాన్ని కైవసం చేసుకున్న మహాయుతి కూటమి పార్టీలు అధికార పంపిణీపై మాత్రం మల్లగుల్లాలు పడుతున్నాయి. అయితే సీఎం పదవిపై స్పష్టత వచి్చనట్లు తెలుస్తోంది. ఫడ్నవిస్‌కు సీఎం పదవి ఇవ్వడంలో అడ్డంకులన్నీ తొలగిపోయినట్లు సమాచారం. కీలక పోర్ట్‌ఫోలియోలపై మూడు పార్టీలూ కన్నేయడంతో నేరుగా కూర్చుని మాట్లాడుకునేందుకు శివసేన, ఎన్సీపీ సారథులు బీజేపీ అధిష్టానంతో చర్చలు జరిపారు. గురువారం ఢిల్లీకి చేరుకున్న ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్, శివసేన చీఫ్ ఏక్నాథ్ షిండేలు మహారాష్ట్ర బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవిస్‌తో కలిసి బీజేపీ అగ్రనేత అమిత్‌షాను కలిశారు. కృష్ణమీనన్ మార్గ్‌లోనిæషా నివాసంలో చర్చలు జరిపారు. సామాజిక సమీకరణాలతోనే పోస్ట్‌లు సామాజిక సమీకరణాలను బట్టే మంత్రి పదవులను కట్టబెట్టాలని బీజేపీ యోచిస్తోంది. బీజేపీలోని ఓబీసీ లేదా మరాఠా నేతకే సీఎం పదవి కట్టబెట్టాలని చూస్తోందని తొలుత వార్తలొచ్చాయి. అన్ని పార్టీల్లో మరాఠా వర్గానికి చెందిన వాళ్లే అత్యధికంగా ఎమ్మెల్యేలుగా గెలిచినా ఆర్ఎస్ఎస్ లాబీయింగ్ బలం పనిచేస్తే బ్రాహ్మణ వర్గానికి చెందిన ఫడ్నవిస్‌కే మళ్లీ సీఎం పీఠం దక్కుతుందని ఢిల్లీలోని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అజిత్, షిండే డిప్యూటీ సీఎంలుగా ఉంటారని వార్తలొచ్చాయి. అయితే సీఎం, డిప్యూటీ సీఎం పదవులపై ఇంతవరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. ఎవరేం కోరుతున్నారు? పోర్ట్‌ఫోలియోలపై ఎవరికివారు కరీ్చఫ్ వేసేస్తున్నారు. తమ పార్టీకి ఈ శాఖలే కావాలని పట్టుబడుతున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం పట్టణాభివృద్ధి, వ్యవసాయం, ఆరోగ్య శాఖలు తమకు కేటాయించాలని ఏక్నాథ్ షిండే కోరుతున్నారు. కీలకమైన ఆర్థిక శాఖ తమకు ఇవ్వాలని ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ వర్గం డిమాండ్చేస్తోంది. అయితే మెజారిటీ సీట్లు గెలిచిన తమ వద్దే కీలకమైన శాఖలను అట్టిపెట్టుకోవాలని బీజేపీ భావిస్తోంది. గెలిచిన ప్రతి ఆరు సీట్లకు ఒక కేబినెట్ పోస్ట్ చొప్పున మంత్రి పదవులను పంచాలని ఒక సూత్రప్రాయ అంగీకారానికి వచ్చినట్లు వార్తలొచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమిలో బీజేపీ 132, శివసేన(షిండే) 57, ఎన్సీపీ( అజిత్ పవార్) 41 చోట్ల గెలిచాయి. ఒక్కో పార్టీ గెలిచిన సీట్ల సంఖ్యను బట్టి కేబినెట్ పోస్టులు కేటాయించాలని భావిస్తున్నారు. ఇన్నాళ్లూ సీఎంగా చేసిన షిండే ఇకపై డిప్యూటీ సీఎం పదవి చేబడితే పట్టణాభివృద్ధి శాఖతోపాటు మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ శాఖనూ తన వద్ద అట్టిపెట్టుకోవాలని చూస్తున్నారు. రెవిన్యూ, వ్యవసాయం, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి, పరిశ్రమలు, సామాజిక న్యాయ శాఖలను తమ పార్టీకే కేటాయించాలని డిమాండ్చేస్తున్నారు. అజిత్ డిమాండ్లు ఏంటి ? డిప్యూటీ సీఎం పోస్ట్‌తోపాటు ఆర్థికశాఖ తనకే ఇవ్వాలని ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ కోరుతున్నట్లు వినికిడి. అయితే కీలకమైన ఆర్థికశాఖతోపాటు ప్రణాళిక శాఖను తన వద్దే ఉంచేసుకోవాలని బీజేపీ ఆశిస్తోంది. వ్యవసాయం, ఆహార, పౌర సరఫరాలు తదితర శాఖలు తమకు కేటాయించాలని అజిత్ అడుగుతున్నారని తెలుస్తోంది. బీజేపీ మాటేంటి? కూటమిలో అత్యధిక సీట్లు గెలిచినందున కీలకమైన ఏ శాఖనూ కూటమి పార్టీలకు ఇచ్చేది లేదని బీజేపీ పట్టుదలగా ఉందని తెలుస్తోంది. హోం, గృహ, పట్టణాభివృద్ధి, ఆర్థికం, నీటిపారుదల, విద్యుత్, నైపుణ్యాభివృద్ధి శాఖలు తమ ఆధ్వర్యంలోనే కొనసాగాలని బీజేపీ ఆశిస్తోంది. గెలిచిన ప్రతి ఆరు సీట్లకు ఒక కేబినెట్ పోస్ట్ చొప్పున మంత్రి పదవులను పంచాలన్న సూత్రాన్ని అమలుచేస్తే బీజేపీకి 21 లేదా 22, శివసేనకు 10 లేదా 12, ఎన్సీపీకి 8 లేదా 9 మంత్రి పదవులు దక్కుతాయి. -
Modi 3.0: ఎవరికి ఏ శాఖ?.. కొనసాగుతున్న ఉత్కంఠ
న్యూఢిల్లీ, సాక్షి: కేంద్ర కేబినెట్‌లోఎవరికి ఏ శాఖ అన్నదానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. సాయంత్రం మంత్రి వర్గ సమావేశం జరుగనుంది ఈ లోపే మంత్రలకు శాఖల కేటాయింపు జరిగే అవకాశం ఉంది. లేదంటే భేటీలోనే మంత్రి శాఖలు ఖరారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు ఏ శాఖలు దక్కుతాయనేదానిపై ఆసక్తి నెలకొంది. మోదీ కేబినెట్లో తెలంగాణ నుంచి ఇద్దరికి, ఆంధ్రా నుంచి ముగ్గురికి కేబినెట్లో చోటు దక్కింది. కిషన్‌రెడ్డి, రామ్మోహన్నాయుడుకి కేబినెట్లో చోటు దక్కగా, పెమ్మసాని, వర్మ, బండి సంజయ్‌కు సహాయ మంత్రులుగా బెర్త్‌లు దక్కాయి.ఇదీ చదవండి: కేంద్ర మంత్రులకు శాఖల కేటాయింపులో మోదీ మార్క్! -
‘మహా’ కేబినెట్; శివసేనకే ఎక్కువ
ముంబై: మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ల కూటమి ‘మహారాష్ట్ర వికాస్ అఘాడి’ సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు చురుగ్గా జరుగుతున్నాయి. పదవులు పంపకంపై మూడు పార్టీలు అంగీకారానికి వచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. శివసేనకు ముఖ్యమంత్రితో పాటు 15 మంత్రి పదవులు లభించాయి. ఎన్సీపీకి ఉప ముఖ్యమంత్రితో పాటు 13 కేబినెట్ బెర్త్‌లు దక్కాయి. కాంగ్రెస్‌కు స్పీకర్‌తో పాటు 13 మంత్రి పదవులు లభించినట్టు తెలుస్తోంది. వైబీ చవాన్ భవన్లో బుధవారం మధ్యాహ్నం జరిగిన సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఈ భేటీలో శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌లతో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు అహ్మద్ పటేల్, మాణిక్‌రావ్ ఠాక్రే పాల్గొన్నారు. మంత్రివర్గ కూర్పు, శాఖల కేటాయింపుపైనా ఈ సమావేశంలో చర్చించినట్టు తెలుస్తోంది. ‘మహారాష్ట్ర వికాస్ అఘాడి’ శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా గురువారం శివాజీ పార్క్‌లో ప్రమాణం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ను ఆహ్వానించినట్టు కాంగ్రెస్ నేత విజయ్ వాడెట్టివర్ తెలిపారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అందరూ హాజరు కావాలని తమ ఎమ్మెల్యేలను ఆదేశించినట్టు ఎన్సీపీ నేత అజిత్ పవార్ వెల్లడించారు. 400 మంది రైతు కుటుంబాలకు ఆహ్వానం ఆత్మహత్య చేసుకున్న 400 మంది రైతు కుటుంబాలను తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఉద్ధవ్ ఠాక్రే ఆహ్వానించారు. మహారాష్ట్ర నవ నిర్మాణ సేన(ఎంఎన్ఎస్) అధినేత రాజ్ ఠాక్రేకూ ఆహ్వానం పంపారు. కాగా, ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తామని శివసేన నాయకుడు సంజయ్ రౌత్ తెలిపారు. (చదవండి: సుప్రియ.. తండ్రికి తగ్గ తనయ) -
తలసాని, తుమ్మల సహా ఆరుగురికి మంత్రి పదవులు
-
తలసాని, తుమ్మల సహా ఆరుగురికి మంత్రి పదవులు
హైదరాబాద్: టీడీపీని వీడి టీఆర్ఎస్లో చేరిన సనత్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ యాదవ్, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావులకు మంత్రి పదవులు ఖరారయ్యాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆరుగురి పేర్లతో కొత్త మంత్రుల జాబితాను రాజ్‌భవన్‌కు పంపారు. శ్రీనివాస్ యాదవ్, తుమ్మలతో పాటు మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్యేలు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, వరంగల్ జిల్లాకు చెందిన చందూలాల్, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఇంద్రకరణ్ రెడ్డి మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. మంగళవారం ఉదయం రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్ కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. వీరి చేరికతో తెలంగాణ కేబినెట్లో మంత్రుల సంఖ్య 18కి చేరుకుంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక కేసీఆర్ మంత్రి వర్గాన్ని విస్తరించడం ఇదే తొలిసారి. కాగా తాజా విస్తరణలో మహిళలకు స్థానం దక్కలేదు. సీనియర్ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్‌కు మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని ఆయన అనుచరులు నిరసన చేపడుతున్నా జాబితాలో చోటు దక్కలేదు.