Cabinet reorganization
-
ఏపీ మంత్రివర్గ కూర్పుపై కసరత్తు
-
మంత్రివర్గ కూర్పుపై కసరత్తు
-
సామాజిక న్యాయానికే మరింత పెద్దపీట?
సాక్షి, అమరావతి: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రాష్ట్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు ముహూర్తం దగ్గరపడింది. ఇందుకోసం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కసరత్తు ముమ్మరం చేశారు. సామాజిక కూర్పు, అనుభవం, జిల్లాల అవసరాల ప్రాతిపదికన ప్రస్తుత మంత్రివర్గంలో 7 నుంచి 10 మందిని కొనసాగించే అవకాశముందని తెలిసింది. కొత్తగా 14 నుంచి 17 మందికి మంత్రివర్గంలో స్థానం కల్పించనున్నారు. సీఎంగా వైఎస్ జగన్ బాధ్యతలు స్వీకరించాక మంత్రివర్గం ఏర్పాటు నుంచి రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ చైర్పర్సన్లు.. మేయర్లు, మండల పరిషత్ అధ్యక్షులు వరకూ అన్నింటా సామాజిక న్యాయానికి పెద్దపీట వేశారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మరింత ప్రాధాన్యం ఇచ్చే అవకాశముందని చెబుతున్నారు. సామాజిక న్యాయానికి అసలైన నిర్వచనం 2019 ఎన్నికల్లో 50 శాతం ఓట్లు.. 151 శాసనసభ స్థానాలు.. 22 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్సీపీ అఖండ విజయాన్ని సాధించింది. 2019, మే 30న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ జగన్.. 2019, జూన్ 8న 25 మందితో మంత్రివర్గాన్ని ఏర్పాటుచేశారు. నాటి కేబినెట్లో ఏడుగురు బీసీలకు, ఐదుగురు ఎస్సీలకు, నలుగురు కాపులకు, నలుగురు రెడ్డి సామాజికవర్గం వారికి అవకాశం కల్పించారు. గిరిజన, మైనార్టీ, క్షత్రియ, వైశ్య, కమ్మ వర్గాల నుంచి ఒక్కొక్కొరికి స్థానం కల్పించారు. గతంలో ఎన్నడూ లేనిరీతిలో 60 శాతం మంత్రి పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికే ఇచ్చి సామాజిక న్యాయానికి సిసలైన నిర్వచనం ఇచ్చారు. ఉప ముఖ్యమంత్రులుగా ఐదుగురికి అవకాశం ఇస్తే.. అందులో నలుగురు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారే. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఎస్సీ మహిళలను హోంశాఖ మంత్రిగా సీఎం జగన్ నియమించారు. రాజ్యాధికారంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు భాగస్వామ్యం కల్పించడం ద్వారా.. సంక్షేమాభివృద్ధి పథకాలను ఆ వర్గాల్లో అట్టడుగున ఉన్న వారికి చేర్చి.. అభివృద్ధి పథంలోకి తేవాలన్నదే ముఖ్యమంత్రి లక్ష్యం. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మరింత ప్రాధాన్యం ఇక రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గాన్ని మార్పుచేసి.. కొత్త వారితో ఏర్పాటు చేస్తానని.. పాత వారికి పార్టీ బాధ్యతలు అప్పగిస్తానని మొదట్లోనే సీఎం వైఎస్ జగన్ చెప్పారు. కానీ, కరోనా కారణంగా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో జాప్యం చోటుచేసుకుంది. ప్రస్తుతం కోవిడ్ తగ్గుముఖం పట్టడంతో కొత్త కేబినెట్ కూర్పుకు సీఎం జగన్ అడుగులు వేస్తున్నారు. తొలుత మంత్రివర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చిన ప్రాధాన్యం కంటే.. ఇప్పుడు మరింత అధికంగా ప్రాధాన్యత దక్కుతుందని తెలిసింది. సామాజిక కూర్పు, జిల్లాల అవసరాలు ప్రాతిపదికన మంత్రివర్గం ఏర్పాటుచేస్తారని చెబుతున్నారు. ఆశావహులు వీరే.. ► బీసీ వర్గం నుంచి ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాం, బూడి ముత్యాలనాయుడు, పొన్నాడ సతీష్‌కుమార్, విడదల రజని, జోగి రమేష్, కొలుసు పార్థసారధి, బుర్రా మధుసూదన్ యాదవ్, కరణం ధర్మశ్రీ, ఉషాశ్రీ చరణ్.. ► ఎస్సీ సామాజికవర్గం నుంచి కొండేటి చిట్టబ్బాయ్, తలారి వెంకట్రావు, ఎలీజా, రక్షణనిధి, మేరుగ నాగార్జున, కిలివేటి సంజీవయ్య, కోరుముట్ల శ్రీనివాసులు, జొన్నలగడ్డ పద్మావతి.. ► ఎస్టీ సామాజికవర్గం నుంచి కళావతి, పీడిక రాజన్నదొర, భాగ్యలక్ష్మి, ధనలక్ష్మి.. ► ఓసీ సామాజికవర్గాల నుంచి ఆర్కే రోజా, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, కాకాని గోవర్ధన్‌రెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డి ► మైనార్టీ వర్గం నుంచి హఫీజ్ ఖాన్, ముస్తఫా తదితరులు మంత్రివర్గంలో ఆశావహులుగా ఉన్నారు. -
పార్టీని గెలిపించే బాధ్యత మీదే: సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కసరత్తు చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం మంత్రులుగా ఉన్న 24 మంది స్వచ్ఛందంగా రాజీనామాలు చేశారు. గుంటూరు జిల్లా వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో అజెండా అంశాలపై చర్చ పూర్తయ్యాక మంత్రులు తమ రాజీనామా లేఖలను సీఎం జగన్‌కు సమర్పించారు. మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసినప్పుడే రెండున్నరేళ్ల తర్వాత మంత్రులను మార్చి పార్టీ బాధ్యతలు అప్పగిస్తామని.. కొత్తవారికి మంత్రులుగా అవకాశం కల్పిస్తామని చెప్పారని.. కానీ తమకు 34 నెలలపాటు మంత్రివర్గంలో ఉండే అవకాశం ఇచ్చారని సీఎం జగన్‌కు మంత్రులంతా కృతజ్ఞతలు తెలిపారు. కరోనాతో రాష్ట్ర ఆదాయం తగ్గినా.. సంక్షేమాభివృద్ధి పథకాల ద్వారా పేదల ఖాతాల్లో రూ.1.34 లక్షల కోట్లు జమ చేయడం, రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దోహదం చేసే నిర్ణయాలు తీసుకోవడంలో తమను కూడా భాగస్వాములు చేయడాన్ని ఎప్పటికీ మరువబోమన్నారు. రాజీనామాలపై ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని.. ఏ బాధ్యత అప్పగించినా చిత్తశుద్ధి.. అంకితభావంతో పనిచేస్తామని చెప్పారు. సీఎం వైఎస్ జగన్ స్పందిస్తూ.. ‘మీరు సమర్థులు, అనుభవం ఉన్నవారు కాబట్టే 2019, జూన్ 8న మిమ్మల్ని మంత్రివర్గంలోకి తీసుకున్నాను. వెయ్యి రోజులు మంత్రులుగా అద్భుతంగా పనిచేశారు. రెండేళ్లలో ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో మీకున్న అనుభవాన్ని, సమర్థతను పార్టీకి వినియోగించుకోవాలన్నదే నా ఆలోచన.. 700 రోజులు పార్టీ కోసం పనిచేయండి. మంత్రులుగా మీలో కొందరిని మార్చి.. కొందరిని కొనసాగిస్తున్నంత మాత్రాన ఎవరినీ తక్కువ చేసినట్టు కాదు. మంత్రులుగా పనిచేయడం కంటే.. ప్రజల్లో ఉంటూ పార్టీకి సేవ చేయడాన్నే నేను గొప్పగా చూస్తాను. 2024 ఎన్నికల్లో మీరు పార్టీని గెలిపించుకురండి.. మళ్లీ మీరు ఇవే స్థానాల్లో కూర్చుంటారు’ అంటూ ఉద్భోదించారు. దీనిపై మంత్రులంతా బల్లచరుస్తూ హర్షం వ్యక్తం చేశారు. పార్టీ కోసం పనిచేయడం అదృష్టంగా భావిస్తామని.. 2024 ఎన్నికల్లో పార్టీని రికార్డు స్థాయి మెజారిటీతో గెలిపిస్తామని చెప్పారు. మీరంతా అద్భుతంగా పనిచేశారు.. ఈ సందర్భంగా మంత్రులుగా మీరంతా అద్భుతంగా పనిచేశారని సీఎం వైఎస్ జగన్ వారిని ప్రశంసించారు. ‘మనపై ఎన్నో ఆశలు పెట్టుకుని 2019 ఎన్నికల్లో ప్రజలు మనల్ని గెలిపించారు. వారి ఆశలు నెరవేర్చేలా ఎన్నో కార్యక్రమాలు చేపట్టి అన్నిరకాలుగా ప్రజలకు తోడుగా నిలిచాం. వారి అభిమానాన్ని సంపాదించుకున్నాం. ఈ ప్రక్రియలో మీరు భాగస్వాములు కావడం చాలా గొప్ప విషయం’ అని అన్నారు. చరిత్రలో ఏ ప్రభుత్వం చూపని గొప్ప పనితీరుతో.. మళ్లీ మనం ప్రజల దగ్గరకు వెళ్తున్నామని చెప్పారు. ఇలాంటప్పుడు 2019లో మనకు 151 సీట్లు వచ్చినట్టుగా 2024లో ఎందుకు రావు!? కచ్చితంగా వస్తాయనే నేను విశ్వాసంతో ఉన్నాను’ అని సీఎం వైఎస్ జగన్ ధీమా వ్యక్తం చేశారు. గడపగడపకూ వెళ్లగలిగి.. ప్రజల మధ్య ఉంటే మరింత ఎదుగుతామనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని మంత్రులకు సూచించారు. జిల్లాల అభివృద్ధి మండళ్ల అధ్యక్షులుగా.. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో.. మంత్రులుగా తప్పించినవారికి భవిష్యత్తులో ఏమాత్రం గౌరవం తగ్గకుండా చూస్తానని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. వైఎస్సార్సీపీ బాధ్యతలతోపాటు కొత్తగా ఏర్పాటు చేసే జిల్లాల అభివృద్ధి మండళ్ల అధ్యక్షులుగానూ అవకాశమిస్తామని సీఎం వైఎస్ జగన్ చెప్పినట్లు విశ్వసనీయంగా తెలిసింది. జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తూ అధికారులకు దిశానిర్దేశం చేయడం జిల్లా అభివృద్ధి మండళ్ల బాధ్యత. ఈ బాధ్యతను నిర్వర్తిస్తూనే.. మీ అనుభవాన్ని, సమర్థతను వినియోగించి.. పార్టీని మరింత బలోపేతం చేయాలని వారిని సీఎం కోరారు. 2024లో జిల్లాల్లో అన్ని స్థానాల్లో వైఎస్సార్సీపీ క్లీన్‌స్వీప్ చేసేలా చూడాలని మంత్రులకు దిశానిర్దేశం చేశారు. ఈ నెల 11న మంత్రులందరూ అందుబాటులో ఉండాలని సూచించారు. -
ఏపీ మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణకు ముహూర్తం ఖరారు
-
AP: టీమ్ 24.. కొత్త జట్టు రెడీ!
సాక్షి, అమరావతి: రాష్ట్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై సీఎం వైఎస్ జగన్ కసరత్తు చేస్తున్నారు. బుధవారం విజయవాడలోని రాజ్‌భవన్‌లో గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌తో సమావేశమైన సీఎం వైఎస్ జగన్ తొలుత పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా ఏర్పాటైన కొత్త జిల్లాల గురించి వివరించారు. మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణపై ఈ సందర్భంగా గవర్నర్‌తో చర్చించినట్లు తెలిసింది. కొత్త మంత్రుల ప్రమాణస్వీకార తేదీల గురించి కూడా గవర్నర్‌తో చర్చించినట్లు సమాచారం. ఈ నెల 11వతేదీన నూతన మంత్రులతో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించే అవకాశం ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సముచిత ప్రాధాన్యం కల్పించి సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ నూతన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వైఎస్సార్సీపీ వర్గాలు వెల్లడించాయి. నేడు మంత్రివర్గ భేటీ నూతన మంత్రివర్గంపై తుది కసరత్తు చేస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించనున్నారు. సంక్షేమ, అభివృద్ధి పథకాలపై చర్చించనున్నారు. ప్రస్తుత మంత్రివర్గంతో నిర్వహించే చివరి సమావేశం ఇదే కానుందని వైఎస్సార్సీపీ వర్గాలు వెల్లడించాయి. ఈ భేటీ తర్వాత మంత్రులు రాజీనామాలు చేసే అవకాశం ఉంది. ఆదిలోనే స్పష్టత.. 2019 ఎన్నికల్లో 50 శాతానికిపైగా ఓట్లతో 151 శాసనసభ, 22 లోక్‌సభ స్థానాలను గెలుచుకుని వైఎస్సార్సీపీ ఆఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. 2019 మే 30న వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. జూన్ 8న మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. రెండున్నరేళ్ల తర్వాత కొత్త వారికి మంత్రులుగా అవకాశం కల్పిస్తామని, మంత్రివర్గం నుంచి బయటకు వచ్చినవారికి పార్టీ బాధ్యతలు అప్పగిస్తామని తెలిపారు. రెండున్నరేళ్లకు ఒకసారి చొప్పున ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని సీఎం వైఎస్ జగన్ స్పష్టత ఇచ్చారు. కరోనా మహమ్మారి వల్ల మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో కొంత జాప్యం జరిగింది. ఆ ప్రభావం పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణపై దృష్టి సారించారు. సామాజిక న్యాయానికి పెద్దపీట.. మంత్రివర్గంలో సామాజిక న్యాయానికి సీఎం జగన్ పెద్దపీట వేశారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో 60 శాతం మంత్రి పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఇచ్చి సామాజిక న్యాయాన్ని చేతల్లో చూపించారు. ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఐదుగురికి, బీసీల నుంచి ఏడుగురికి, ఎస్టీల నుంచి ఒకరికి, మైనార్టీల నుంచి ఒకరికి, కాపు సామాజిక వర్గం నుంచి నలుగురికి, కమ్మ సామాజిక వర్గం నుంచి ఒకరికి, రెడ్డి సామాజిక వర్గం నుంచి నలుగురికి, క్షత్రియుల నుంచి ఒకరికి, వైశ్య సామాజిక వర్గం నుంచి ఒకరికి మంత్రివర్గంలో అవకాశం కల్పించారు. ఉప ముఖ్యమంత్రులుగా ఐదుగురిని నియమించగా వారిలో నలుగురు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలవారే కావడం గమనార్హం. తొలిసారిగా ఎస్సీ మహిళ మేకతోటి సుచరితను హోంమంత్రిగా నియమించారు. ఇప్పుడు కూడా అదే పంథాను కొనసాగిస్తూ సామాజిక న్యాయానికి పెద్దపీట వేయనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. గవర్నర్‌తో సీఎం వైఎస్ జగన్ భేటీ సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్ బుధవారం గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌తో సమావేశమయ్యారు. ఈ నెల 11న రాష్ట్ర మంత్రివర్గాన్ని పునర్య్వవస్థీకరిస్తారన్న సమాచారం నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. విజయవాడలోని రాజ్‌భవన్‌కు బుధవారం సాయంత్రం 5.15 గంటలకు చేరుకున్న సీఎం వైఎస్ జగన్‌కి గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా, ఇతర అధికారులు స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ హరిచందన్‌తో సీఎం వైఎస్ జగన్ దాదాపు 50 నిమిషాలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రివర్గ పునర్య్వవస్థీకరణ గురించి సీఎం గవర్నర్‌కు వివరించినట్టు సమాచారం. ఇటీవల చేపట్టిన జిల్లాల పునర్విభజనతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి సీఎం వైఎస్ జగన్ గవర్నర్‌కు వివరించారు. -
కొలువుదీరిన రాజస్తాన్ కొత్త కేబినెట్
జైపూర్: రాజస్థాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మూడేళ్ల తర్వాత కేబినెట్ పునర్వ్యవస్థీకరణ సజావుగా సాగింది. ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్, అసమ్మతి నాయకుడు సచిన్ పైలెట్ వర్గాలకు సమ ప్రాధాన్యం ఇస్తూ మంత్రివర్గానికి రూపకల్పన జరిగింది. మొత్తంగా 15 మంది కొత్త మంత్రులు ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. వారిలో 11 మంది కేబినెట్ హోదా కలిగిన వారు కాగా, నలుగురు సహాయమంత్రులు ఉన్నారు. రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో కొత్త మంత్రులతో గవర్నర్ కల్రాజ్ మిశ్రా ప్రమాణం చేయించారు. కొత్త మంత్రివర్గంలో సచిన్ వర్గానికి చెందిన అయిదుగురికి చోటు లభించింది. గత ఏడాది ముఖ్యమంత్రి గహ్లోత్‌పై సచిన్ పైలెట్ తిరుగుబాట బావుటా ఎగురవేసిన సమయంలో ఆయన వెంట ఉంటూ వేటుని ఎదుర్కొన్న విశ్వేంద్ర సింగ్, రమేష్ మీనాలను తిరిగి కేబినెట్లోకి తీసుకున్నారు. పైలెట్ వర్గ ఎమ్మెల్యేలైన హేమరామ్ చౌధరి, బ్రిజేంద్రసింగ్ ఒలా, మురారిలాల్ మీనాలకు సహాయ మంత్రులు పదవులు దక్కాయి.కొత్త కేబినెట్‌పై సచిన్ సంతృప్తి వ్యక్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా శుభసందేశాన్ని అందిస్తుందన్నారు.రాజస్థాన్ కాంగ్రెస్ ఐక్యంగా ముందుకు వెళుతుందని, 2023లో అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ఖాయమని చెప్పారు. ప్రమాణ స్వీకారనంతరం ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ విలేకరులతో మాట్లాడుతూ అన్ని వర్గాలకు సమాన ప్రాధాన్యం ఇచ్చేలా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కేబినెట్లో చోటు కల్పించామన్నారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా సచిన్? ఉప ముఖ్యమంత్రి , పీసీసీ అధ్యక్ష పదవుల్ని పోగొట్టుకున్న అసమ్మతి నాయకుడు సచిన్ పైలెట్ పాత్ర కాంగ్రెస్‌లో ఎలా ఉండబోతోంది? ఇప్పుడు అందరిలోనూ ఇదే ఆసక్తి రేపుతోంది. ఇటీవల కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతో సచిన్ పైలెట్ సమావేశమైనప్పుడు పార్టీలో తన స్థానంపై చర్చించారని, 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తానని సోనియా హామీ ఇచ్చినట్టుగా పైలెట్ శిబిరం ప్రచారం చేస్తోంది. అప్పటివరకు పార్టీ ప్రధాన కార్యదర్శి, ఏదైనా రాష్ట్రానికి ఇన్చార్జ్ చేసే అవకాశాలు ఉన్నాయి. మరో రాష్ట్రానికి ఇన్చార్జ్గా వెళ్లినప్పటికీ రాజస్థాన్ రాష్ట్ర రాజకీయాల్లో ఇక సచిన్ కీలకంగా వ్యవహరించనున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఉత్తరప్రదేశ్ రాష్టానికే ఇన్చార్జ్ చేసే అవకాశాలు కూడా ఉన్నట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రియాంకగాంధీతో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉండాలని సచిన్‌కి ఇప్పటికే అధిష్టానం సంకేతాలు పంపినట్టుగా సమాచారం. ఇక ఎన్నికలు జరిగే అయిదు రాష్ట్ర్రాల్లోనూ సచిన్ స్టార్ క్యాంపైనర్‌గా కూడా వ్యవహరిస్తారు. -
కేబినెట్ విస్తరణతో యూపీలో అసంతృప్తి షురూ
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఉత్తర్‌ప్రదేశ్‌లో మరోసారి అధికారంలోకి వచ్చేందుకు ఏ చిన్న అవకాశాన్ని సైతం కమలదళం వదులుకోవట్లేదు. తాజాగా జరిగిన కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో సామాజిక సమీకరణాలపై దృష్టిపెట్టేందుకు పెద్ద ఎత్తున చేసిన కసరత్తు కారణంగా, ఎన్డీఏలో భాగస్వామ్యపక్షమైన అప్నాదళ్ అధ్యక్షురాలు అనుప్రియా సింగ్ పటేల్‌కు సహాయ మంత్రి పదవి దక్కింది. అయితే బీజేపీ మిత్రపక్షంగా ఉన్న నిశాద్ పార్టీ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో నిశాద్ పార్టీ అధ్యక్షుడు సంజయ్ నిశాద్ ఇప్పుడు ఆగ్రహంగా ఉన్నారు. తప్పులు సరిదిద్దుకోవాల్సిందే నిషాద్ పార్టీ (నిర్బల్ ఇండియన్ షోషిత్ హమారా ఆమ్ దళ్) వ్యవస్థాపకుడు సంజయ్ నిషాద్ తన కుమారుడు ఎంపీ ప్రవీణ్ నిషాద్‌ను కేంద్ర మంత్రివర్గంలో చేర్చకపోవడంపై నిరాశ వ్యక్తం చేశారు. కొన్ని సీట్లలో ప్రభావం చూపే అప్నా దళ్ అనుప్రియ పటేల్‌కు కేబినెట్లో చోటు దక్కించుకోగలిగితే, 160 సీట్లలో ప్రభావం చూపే ప్రవీణ్ నిషాద్‌ను మంత్రిమండలిలో ఎందుకు చేర్చలేదని ఆయన ప్రశ్నించారు. నిషాద్ వర్గానికి చెందిన ప్రజలు ఇప్పటికే బీజేపీని వీడుతున్నారని, ఇప్పటికైనా పార్టీ తన తప్పులను సరిదిద్దుకోకపోతే, రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో తగిన మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించారు. ప్రస్తుతం తాను బీజేపీతోనే ఉన్నానని, అయితే బీజేపీ అధిష్టానం ఈ విధంగా నిషాద్లను విస్మరిస్తూ ఉంటే, రాబోయే సమయంలో తన వ్యూహాన్ని పునః పరిశీలించాల్సి ఉంటుందని తెలిపారు. 18 శాతం నిషాద్‌లు మోసపోయారు ప్రవీణ్ నిషాద్‌ను మంత్రివర్గంలో చేర్చకపోవడం నిషాద్ సమాజానికి జరిగిన ద్రోహం అని సంజయ్ నిషాద్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో 18 శాతం ఉన్న నిషాద్ సమాజం మరోసారి మోసానికి గురైందని, కేవలం 4 నుంచి 5 శాతం ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని అనుప్రియా పటేల్‌ను ఉద్దేశించి విమర్శించారు. 2017లో జరిగిన గోరఖ్‌పూర్ ఉపఎన్నికలో సంజయ్ నిషాద్ కుమారుడు ప్రవీణ్ నిషాద్ ఎస్పీ అభ్యర్థిగా యోగి ఆదిత్యనాథ్ కంచుకోటలో బీజేపీ అభ్యర్థిపై విజయం సాధించి వెలుగులోకి వచ్చారు. అయితే, 2019 ఎన్నికల సందర్భంగా ప్రవీణ్ నిషాద్ కాషాయ కండువా కప్పుకొని సంత్ కబీర్ నగర్ సీటు నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసి గెలిచారు. ప్రవీణ్ నిషాద్ ప్రస్తుతం బిజెపి ఎంపిగా ఉండగా, అతని తండ్రి నిషాద్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు. కేబినెట్లో చోటుదక్కలేదన్న కారణంతో ఒకవేళ పార్టీని వీడితే ఆయన ఎంపీ పదవిని కోల్పోయే ప్రమాదం ఉంది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో సంజయ్ నిషాద్, బీజేపీతో కేవలం బెదిరింపు రాజకీయాలు నడుపుతున్నార న్న చర్చ మొదలైంది. కేబినెట్లో సామాజిక సమీకరణాలు వచ్చే ఏడాదిలో ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి మంత్రివర్గ విస్తరణలో పెద్దపీట వేశారు. యూపీ కోటాలో ఓబీసీ, బ్రాహ్మణ, దళిత సామాజిక వర్గాలకు ప్రాధాన్యత లభించింది. అనుప్రియా పటేల్ కుర్మి సామాజిక వర్గ ప్రతినిధిగా ఉన్నారు. తూర్పు యూపీ, బుందేల్‌ఖండ్ ప్రాంతంలోని కుర్మి ఓట్లపై ఆమె ప్రభావం చూపుతారు. బి.ఎల్.వర్మ లోధి ఓటు బ్యాంకుపై ప్రభావం చూపుతారని బీజేపీ అధిష్టానం విశ్వసిస్తోంది. కౌషల్ కిషోర్ యూపీ బీజేపీ షెడ్యూలు కులాల ఫ్రంట్ అధ్యక్షుడిగా ఉన్నారు. భాను ప్రతాప్ సింగ్ వర్మను కేబినెట్లో చేర్చడం ద్వారా ఆయన షెడ్యూలు కులాల ఓట్లపై ప్రభావం చూపగలరని బీజేపీ భావిస్తోంది. అజయ్ మిశ్రా బ్రాహ్మణ వర్గ ప్రతినిధిగా నూతన కేబినెట్లో స్థానం సంపాదించుకున్నారు. -
మిషన్ 2022పై కమలదళం కసరత్తు
సాక్షి, న్యూఢిల్లీ: 2024లో జరుగబోయే సార్వత్రిక ఎన్నికలకు ముందు... సెమీఫైనల్స్‌గా భావిస్తున్న ఉత్తర్‌ప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికలపై కమలదళం కసరత్తును వేగవంతం చేసింది. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ కీలక నాయకులు, ముఖ్యమైన కేంద్రమంత్రులతో వరుస సమావేశాలు నిర్వహించి ప్రభుత్వం, పార్టీ భవిష్యత్తు కోసం అనుసరించాల్సిన వ్యూహాలు, తమ బలాలు, బలహీనతలు, వివిధ రాష్ట్రాల్లో బీజేపీ విజయావకాశాలు, లోపాలు తదితర అంశాలపై చర్చించన విషయం తెలిసిందే. బీజేపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నేతృత్వంలో శనివారం కీలక సమావేశం జరిగింది. ఇందులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, రైల్వే మంత్రి పీయూష్ గోయల్, వ్యవసాయమంత్రి నరేంద్ర సింగ్ తోమర్, పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, మహిళా, శిశు అభివృద్ధిశాఖ మంత్రి స్మృతి ఇరానీ సహా పలువురు కేంద్ర మంత్రులు, పార్టీ ప్రధాన కార్యదర్శులు, ఇతర పదాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వచ్చే ఏడాది జరుగనున్న ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా అసెంబ్లీ ఎన్నికలపై ప్రత్యేకంగా దృష్టిసారించి సమీక్ష నిర్వహించారు. వీటిలో పంజాబ్ మినహా మిగిలిన రాష్ట్రాలన్నీ బీజేపీ పాలనలో ఉన్నాయి. సెమీఫైనల్స్‌కు ప్రణాళికలు రెడీ దేశంలోనే పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తుంది. ఇక్కడ 80 లోక్‌సభ నియోజకవర్గాలు ఉండటంతో, కేంద్రంలో ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి రావడాని కైనా నిర్ణయాత్మకశక్తిగా ఉంటుంది. అందువల్లే యూపీ అసెంబ్లీ ఎన్నికలను సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగే సెమీఫైనల్స్‌గా భావిస్తుంటారు. ఈ కారణంగా మరొకసారి ఉత్తరప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చేందుకు సర్వశక్తులు ఒడ్డే పనిలో కమలదళం తలమునకలైంది. ఈ నేపథ్యంలో కేంద్రం తీసుకున్న నిర్ణయాలు, పథకాల అమలు, వివిధ శాఖల నిధుల కేటాయింపుల వంటి వాటిని ప్రజల్లోకి ఏరకంగా తీసుకెళ్లాలనే అంశాలపై శనివారం చర్చించినట్లు తెలిసింది. యూపీలో పార్టీ బలోపేతంతో పాటు, నాయకుల మధ్య ఉన్న విబేధాలు, అంతర్గత సమస్యలను తొలగించేందుకు కొన్ని రోజులుగా కసరత్తు చేస్తున్నారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు సైతం కమలదళం ప్రణాళికలను సిద్ధం చేసుకుందని సమాచారం. ఒకవైపు ధరల పెరుగుదల, ఆర్థిక మాం ద్యం, ద్రవ్యోల్బణం కారణంగా సహజంగా ప్రజల్లో వచ్చే ప్రభుత్వ వ్యతిరేకతను ఏవిధంగా తగ్గించుకోవాలనే అంశంపై దృష్టిపెట్టారు. కరోనా కారణంగా ఏర్పడిన పరిస్థితులు ప్రతికూలంగా మారకుండా ఉండేందుకు అనుసరించాల్సిన ప్రణాళికలపై వ్యూహ రచన చేస్తున్నారు. -
స్థానిక సంస్థల మంత్రిగా సిద్ధూ ఔట్
చండీగఢ్: పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ తన కేబినెట్ సహచరుడు నవజ్యోత్‌సింగ్ సిద్ధూపై కొరడా ఝుళిపించారు. చండీగఢ్‌లో గురువారం కేబినెట్ పునర్వ్యవస్థీకరణ చేపట్టిన పంజాబ్ సీఎం స్థానిక సంస్థలు, టూరిజం, సాంస్కృతిక వ్యవహారాల మంత్రి బాధ్యతల నుంచి సిద్ధూను తప్పించారు. అనంతరం విద్యుత్, పునరుత్పాదక ఇంధనవనరుల మంత్రిత్వశాఖను సిద్ధూకు అప్పగించారు. ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో పంజాబ్‌లోని పట్టణ, నగర ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రదర్శనపై సీఎం అమరీందర్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా సిద్ధూ సరిగ్గా వ్యవహరించలేదనీ, అందువల్లే కాంగ్రెస్ నిరాశాజనక ప్రదర్శన చేసిందని అభిప్రాయపడ్డారు. తన అనాలోచిత చర్యలతో కాంగ్రెస్ లక్ష్యాలను దెబ్బతీశారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో చండీగఢ్‌లో గురువారం నిర్వహించిన కేబినెట్ భేటీకి సిద్ధూ గైర్హాజరయ్యారు. మరోవైపు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టిన అనంతరం సీఎం అమరీందర్ మాట్లాడుతూ.. తాజా మార్పుల వల్ల పాలనలో మరింత పారదర్శకతతో పాటు ప్రభుత్వ విభాగాలను మరింత సమర్థవంతంగా నడపడం వీలవుతుందని అభిప్రాయపడ్డారు. కాగా, ఇప్పటివరకూ సిద్ధూ నిర్వహించిన స్థానిక సంస్థలు టూరిజం శాఖను ఛత్రంజి సింగ్‌కు అమరీందర్ అప్పగించారు. ఆరోగ్యం–కుటుంబ సంక్షేమ శాఖను బల్బీర్ సిద్ధూకు, త్రిప్త్ బజ్వాకు ఉన్నత విద్య, పశుపోషణ–డైరీ, చేపల పెంపకం మంత్రిత్వశాఖలను కేటాయించారు. గుర్ప్రీత్ సింగ్‌కు రెవెన్యూశాఖను, విజయేందర్ సింగ్లాకు పాఠశాల విద్య, రవాణా శాఖను రజియా సుల్తాన్‌కు, స్త్రీ, శిశు సంక్షేమ శాఖను అరుణా చౌదరికి సీఎం అప్పగించారు. నన్ను బలిపశువును చేశారు: సిద్ధూ సీఎం అమరీందర్ సింగ్ విమర్శలను మంత్రి సిద్ధూ తిప్పికొట్టారు. ‘పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంలో నేను కీలకపాత్ర పోషించా. నాకు కష్టపడకుండా ఏదీ రాలేదు. గత 40 ఏళ్లుగా నేను అంతర్జాతీయ క్రికెటర్‌గా, క్రికెట్ వ్యాఖ్యాతగా, టీవీ కార్యక్రమాల్లో రాణిస్తున్నా. అలాగే యువతలో స్ఫూర్తి పెంపొందించేందుకు దేశవ్యాప్తంగా 1300కుపైగా మోటివేషనల్ కార్యక్రమాల్లో ప్రసంగించాను. పట్టణ ప్రాంతాల్లో అభివృద్ధి కోసం రూ.10,000 కోట్లు కేటాయించాం. దీంతో ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పంజాబ్‌లోని అమృత్సర్, జలంధర్, పటియాలా, ఎస్ఏఎస్నగర్ సహా పలు పట్టణాల్లో గెలిచింది. కానీ సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ప్రదర్శనకు అందరూ నా శాఖనే బాధ్యులుగా చేశారు. నేను అమరీందర్‌ను నా పెద్దన్నగా భావిస్తాను. ఆయన మాటలను ఎల్లప్పుడూ గౌరవించాను. ఏదైనా విషయముంటే నన్ను వ్యక్తిగతంగా పిలిచి అమరీందర్ మాట్లాడాల్సింది. కానీ ఆయన తీరు నాకు బాధ కలిగించింది. ఇప్పుడు మంత్రిమండలి సమిష్టి బాధ్యత ఏమైంది? సీఎం కుర్చీ నా కుర్చీకి 3 అంగుళాల దూరంలోనే ఉన్నప్పటికీ నాపై అమరీందర్‌కు విశ్వాసం లేదు. నా పేరు, విశ్వసనీయత, పనితీరుపై వచ్చే విమర్శలను దీటుగా తిప్పికొడతా. నేను ఎప్పటికీ కాంగ్రెస్‌వాదినే’ అని సిద్ధూ స్పష్టం చేశారు. -
బీజేపీకే పరిమితమైన కేబినెట్ విస్తరణ
-
నిర్మల చేతికి 'రక్షణ'
గోయల్‌కు రైల్వే.. సురేశ్ ప్రభుకు వాణిజ్యం - అనూహ్యంగా శాఖల కేటాయింపులు - కొత్త వారిలో ముగ్గురికి స్వతంత్ర, మిగిలిన వారికి సహాయ హోదాలు - 2019 ఎన్నికలు, రాజకీయ వ్యూహంతోనే శాఖల కేటాయింపు న్యూఢిల్లీ: సంచలనాలు, అనూహ్య నిర్ణయాలకు పెట్టిందిపేరైన ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షా ద్వయం ఆదివారం నాటి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలోనూ తమ మార్కును చూపింది. సరిగ్గా పనిచేసే మంత్రులకు సరైన గౌరవం దక్కుతుందని తరచూ చెబుతున్న ప్రధాని.. వాణిజ్య శాఖ (స్వతంత్ర) మంత్రిగా ఉన్న నిర్మలా సీతారామన్‌కు ఏకంగా చాలా కీలకమైన రక్షణ శాఖను కేటాయించి అందరినీ ఆశ్చర్యపరిచారు. నిర్మలా సీతారామన్ భారత రక్షణ శాఖకు తొలి పూర్తిస్థాయి మహిళా మంత్రిగా నిలిచారు. అంతకుముందు 1970ల్లో ఇందిరా గాంధీ ప్రధానిగా రక్షణ శాఖను తనే నిర్వహించారు. నిన్నటి వరకు స్వతంత్ర మంత్రులుగా ఉన్న పీయూష్ గోయల్ (రైల్వే), ధర్మేంద్ర ప్రధాన్ (పెట్రోలియం), ముక్తార్ అబ్బాస్ నఖ్వీ (మైనారిటీ వ్యవహారాలు)లకూ కేబినెట్ హోదాతో ప్రమోషన్ కల్పించారు. పలువురు సీనియర్ మంత్రుల శాఖల్లోనూ భారీగానే మార్పులు చేశారు. కొత్తగా చేరిన తొమ్మిది మంది మంత్రులకు స్వతంత్ర, సహాయ హోదాలు కల్పించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రాష్ట్రపతి భవన్లో మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రధాని మోదీ, అమిత్ షా, బీజేపీ ముఖ్యనేతలు, పలువురు కేంద్ర మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా, కొత్త మంత్రుల్లో అల్ఫోన్స్ కణ్ణాంథనం, హర్దీప్ సింగ్ పురీలు ఎంపీలు కాదు. ఆర్నెలల్లో వీరు పార్లమెంటుకు ఎన్నిక కావాల్సి ఉంటుంది. ఈ విస్తరణలో ఎన్డీయేలోని ఇతర పక్షాలకు చోటు కల్పించకపోవటం గమనార్హం. భారీగా మార్పులు తాజా కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో నిర్మలా సీతారామన్‌కు రక్షణ శాఖను కేటాయించటమే అత్యంత ఆసక్తికర మార్పు. దీనిపై బీజేపీతోపాటుగా వివిధ పార్టీల్లో, రాజకీయ విశ్లేషకుల్లోనూ ఆశ్చర్యం వ్యక్తమైంది. కేబినెట్ ప్రమోషన్ దొరికినా.. నిర్మలకు రక్షణ మంత్రిగా బంపర్ బొనాంజా ఉంటుందని ఎవరూ ఊహించలేదు. రెల్వే శాఖకు రాజీనామా చేసిన సురేశ్ ప్రభుకు వాణిజ్య, పరిశ్రమల బాధ్యతలు అప్పగించారు. మొదట సురేశ్ ప్రభుకే రక్షణ శాఖ ఇస్తారని జోరుగా ప్రచారం జరిగింది. విద్యుత్ శాఖ మంత్రిగా మంచిపేరు తెచ్చుకున్న పీయూష్ గోయల్‌కు రైల్వే శాఖను అప్పగించారు. రైల్వేతోపాటు బొగ్గు మంత్రిత్వ శాఖ కూడా గోయల్ వద్దే ఉంది. కేబినెట్ ప్రమోషన్ పొందిన ధర్మేంద్ర ప్రధాన్‌కు గతంలో ఉన్న పెట్రోలియం శాఖకు అదనంగా నైపుణ్యాభివృద్ధి బాధ్యతలిచ్చారు. ఉమ బాధ్యతలు గడ్కారీకి రోడ్లు, షిప్పింగ్ మంత్రి నితిన్ గడ్కారీకి ఉమాభారతి నిర్వహించిన గంగానది పునరుజ్జీవం, జలవనరుల శాఖను అదనంగా కేటాయించారు. నమామి గంగే ప్రాజెక్టుకోసం భారీగా నిధులు కేటాయించినా అనుకున్న పని జరగకపోవటంతో ఉమాభారతిపై మోదీ అసంతృప్తితో ఉన్నట్లు వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో ఉమాభారతి కేబినెట్ హోదా ఉన్నా.. ప్రాధాన్యం లేని తాగునీరు, పారిశుద్ధ్య మంత్రిత్వ శాఖను కట్టబెట్టారు. ముక్తార్ అబ్బాస్ నఖ్వీకి కేబినెట్ హోదా కల్పిస్తూ మైనారిటీ వ్యవహారాల శాఖ పూర్తి బాధ్యతలు అప్పగించారు. మోదీ మంత్రివర్గంలో కేబినెట్ హోదాతో మైనారిటీ నేత లేకపోవడంతో నఖ్వీకి ప్రమోషన్ దొరికింది. దివంగత మంత్రి అనిల్ దవే నిర్వహించిన పర్యావరణ శాఖ బాధ్యతలను కేబినెట్ మంత్రి హర్షవర్ధన్‌కు అదనంగా కేటాయించారు. ఇరానీకీ అందలం వెంకయ్యనాయుడు రాజీనామా తర్వాత సమాచార, ప్రసార శాఖ తాత్కాలిక మంత్రిగా ఉన్న స్మృతి ఇరానీకి ఆ శాఖ పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించారు. దీంతోపాటుగా జౌళి శాఖ బాధ్యతలు కూడా ఇరానీ వద్దే ఉన్నాయి. విజయ్ గోయల్ నుంచి క్రీడలు, యువజన సర్వీసుల శాఖను రాజ్వర్ధన్ సింగ్ రాథోడ్ (స్వతంత్ర)కు అప్పగించారు. సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రిగా కూడా రాథోడ్ బాధ్యతలు నిర్వర్తిస్తారు. గోయల్‌కు పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రిగా, గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిగా ప్రధాని నిర్ణయించారు. సంతోశ్ గంగ్వార్‌కు దత్తాత్రేయ నిర్వహించిన కార్మిక, ఉపాధి శాఖ బాధ్యతలు, గిరిరాజ్ సింగ్‌కు చిన్న, మధ్య తరహా పరిశ్రమల బాధ్యతలు అప్పగించి ప్రమోషన్ ఇచ్చారు. కొత్త మంత్రుల బాధ్యతలు మాజీ దౌత్యవేత్త హర్దీప్ పురీ, మాజీ ఐఏఎస్ అల్ఫోన్స్ కణ్ణాంథనం, మాజీ హోంశాఖ కార్యదర్శి ఆర్కే సింగ్‌లు తాజా విస్తరణలో స్వతంత్ర హోదాలో మంత్రులుగా నియమితులయ్యారు. అల్ఫోన్స్‌కు పర్యాటక శాఖ, పురీకి గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖలు కేటాయించారు. వెంకయ్యనాయుడు నిర్వర్తించిన శాఖలను పురీకి అప్పగించారు. ఆర్కే సింగ్‌కు విద్యుత్, పునరుత్పాదక మంత్రిత్వ శాఖ బాధ్యతలు ఇచ్చారు. మిగిలిన ఆరుగురు సహాయ మంత్రులుగా నియమితులయ్యారు. మాజీ ముంబై కమిషనర్ సత్యపాల్ సింగ్‌ను మానవ వనరుల అభివృద్ధి, జల వనరులు, గంగా పునరుజ్జీవ శాఖల సహాయ మంత్రిగా మోదీ నిర్ణయించారు. శివ ప్రతాప్ శుక్లా ఆర్థిక శాఖ, అశ్విని కుమార్ చౌబే వైద్యం, వీరేంద్ర కుమార్ మహిళా శిశుసంక్షేమం, అనంత్ హెగ్డే నైపుణ్యాభివృద్ధి, గజేంద్ర సింగ్ షెకావత్ వ్యవసాయ శాఖలకు సహాయ మంత్రులుగా నియమితులయ్యారు. కుల సమీకరణాలతో పక్కాగా! కేరళలో పట్టుకోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న బీజేపీ.. మాజీ ఐఏఎస్ అధికారి అల్ఫోన్స్ (క్రిస్టియన్)కు స్వతంత్ర హోదా ఇచ్చింది. విద్యావంతులు, క్రిస్టియన్ల సంఖ్య ఎక్కువగా ఉన్న కేరళలో అల్ఫోన్స్ ఎంపిక పార్టీకి మేలు చేస్తుందని బీజేపీ ఆలోచన. నఖ్వీకి కేబినెట్లో, అల్ఫోన్స్‌ను మంత్రి మండలిలో తీసుకోవటం ద్వారా మైనారిటీలను ఆకట్టుకోవాలనేది మోదీ వ్యూహంగా కనబడుతోంది. ఎన్డీయే చచ్చిపోయింది: శివసేన మంత్రివర్గ విస్తరణలో తమకు అవకాశం కల్పించకపోవటంపై శివసేన మండిపడింది. ‘ఎన్డీయే దాదాపు చచ్చిపోయింది. కూటమి పార్టీల సమావేశానికే అది పరిమితమైంది. ప్రభుత్వంలో మా పాత్రే లేదు. పార్లమెంటులోనో, రాష్ట్రపతి ఎన్నికప్పుడో.. మా మద్దతు అవసరమైనప్పుడే మేం బీజేపీకి గుర్తొస్తాం’ అని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ విమర్శించారు. కాగా, మాజీ అధికారులను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవటాన్ని కాంగ్రెస్ విమర్శించింది. ‘కేంద్ర మంత్రి మండలిని వయోవృద్ధుల క్లబ్‌గా మార్చేశారు. దేశంలో సగటు యువత వయసు 27 అయితే.. సగటు మంత్రి వయసు 60.44’ అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనీశ్ తివారీ ఎద్దేవా చేశారు. అప్పుడు అడ్వాణీని అరెస్ట్ చేశారు! బీజేపీ అగ్రనాయకుడు అడ్వాణీని ఒకప్పుడు అరెస్టు చేసిన ఐఏఎస్ అధికారి నేడు మోదీ మంత్రివర్గంలో సభ్యుడయ్యారు. ఆయనే రాజ్ కుమార్ సింగ్. 1990లో అడ్వాణీ రథయాత్ర చేపట్టిన సమయంలో బిహార్‌లో పనిచేస్తున్న సింగ్...సమస్తీపూర్‌లో అడ్వాణీని అరెస్టు చేశారు. అప్పటి వీపీ సింగ్ ప్రభుత్వానికి బీజేపీ మద్దతిస్తుండేది. అడ్వాణీ అరెస్టుతో వీపీ సింగ్‌కు బీజేపీ మద్దతు ఉపసంహరించడంతో నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం కూలిపోయింది. ఆ సమయంలోనే బీజేపీ బలమైన పార్టీగా ఎదిగింది. అనంతరం అడ్వాణీ హోం మంత్రిగా ఉండగా రాజ్ కుమార్ సింగ్ ఆ శాఖ సంయుక్త కార్యదర్శిగా కూడా పనిచేశారు. 2013లో రాజకీయాల్లోకి వచ్చి 2014లో ఎంపీ అయ్యారు. పాలన + రాజకీయం = తాజా మార్పులు పాలనాపరమైన మార్పులతోపాటుగా 2019 సార్వత్రిక, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల లక్ష్యంగానే పునర్వ్యవస్థీకరణ జరిగింది. పనితీరు సరిగాలేని మంత్రులతో రాజీనామా చేయించటం ద్వారా.. తమ ప్రభుత్వం సుపరిపాలనపైనే దృష్టిపెట్టిందని ప్రధాని మోదీ చెప్పే ప్రయత్నం చేశారు. మాజీ అధికారులను మంత్రివర్గంలోకి తీసుకోవటమూ ఇందులో భాగంగానే అని అర్థమవుతోంది. నిర్మలా సీతారామన్ బలమైన రాజకీయ నేత కానప్పటికీ.. దక్షిణభారతంలో పార్టీని బలోపేతం చేసే ప్రయత్నాల్లో భాగంగానే కీలక రక్షణ శాఖ బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. ఎల్పీజీ సబ్సిడీ తొలగించటం, పేదలకు ఉచిత ఎల్పీజీ కనెక్షన్లను సమకూర్చటం విషయాల్లో ప్రశంసలు అందుకున్న పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు కేబినెట్ హోదా ఇవ్వటం ద్వారా 2019 ఎన్నికల్లో ఒడిశాలో పార్టీని మరింత బలోపేతం చేయాలనేది మోదీ ఆలోచన. అమిత్ షా రచిస్తున్న ఒడిశా వ్యూహంలో భాగంగానే ఈ మార్పులు జరిగినట్లు స్పష్టమవుతోంది. ఆనందంతో మాటలు రావట్లేదు: నిర్మలా సీతారామన్ ‘ఇంత పెద్ద బాధ్యతలు అప్పగించిన ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు. అమిత్‌షా, మంత్రివర్గ సీనియర్లు గడ్కారీ, రాజ్‌నాథ్ సింగ్, సుష్మాస్వరాజ్‌లకు ధన్యవాదాలు. ఇకపై సీసీఎస్ (కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ)లో ఇద్దరు మహిళలు ఉండబోతున్నారు. ఇది కీలక నిర్ణయం. నన్ను నమ్మి కీలకమైన బాధ్యతలు అప్పగించారు. సర్వశక్తులూ ఒడ్డి పనిచేస్తా’ అని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ తర్వాత రక్షణ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మహిళ కూడా నిర్మలే కావడం విశేషం. నిన్నటి వరకు వాణిజ్య శాఖ బాధ్యతలు నిర్వర్తించిన నిర్మలా సీతారామన్ తాజా విస్తరణలో రక్షణ శాఖకు ప్రమోషన్ పొందారు. తనకు కీలక బాధ్యతలు అప్పగించడంపై స్పందించేందుకు మాటలు రావడం లేదని ఆమె పేర్కొన్నారు. మదురై నుంచి మహిళా రక్షణ మంత్రి వరకు.. తమిళనాడులోని మదురైలో 1959లో మధ్యతరగతి కుటుంబంలో నిర్మలా సీతారామన్ జన్మించారు. తల్లి సావిత్రి, తండ్రి నారాయణన్ సీతారామన్ రైల్వే ఉద్యోగి. తిరుచురాపల్లిలో బీఏ ఎకనమిక్స్.. ఢిల్లీ జేఎన్‌యూలో ఎకనమిక్స్‌లో ఎమ్మే, ఇంటర్నేషనల్ స్టడీస్‌లో ఎంఫిల్ పూర్తి చేశారు. అనంతరం లండన్‌లోని అగ్రికల్చర్ ఇంజనీర్స్ అసోసియేషన్, ప్రైస్‌వాటర్ హౌజ్ కూపర్స్, బీబీసీ వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో పనిచేశారు. 2003–2005లో జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా ఉన్న సమయంలో సుష్మా స్వరాజ్‌తో పరిచయం కారణంగా బీజేపీ వైపు ఆకర్శితులయ్యారు. 2006లో ఈమె బీజేపీలో చేరారు. 2010లో నితిన్ గడ్కారీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నసమయంలో ఈమె పార్టీ అధికార ప్రతినిధిగా పనిచేశారు. నేదురుమల్లి జనార్ధన రెడ్డి మృతితో ఖాళీ అయిన రాజ్యసభ సీటుకు టీడీపీ సాయంతో ఆమె ఎంపికయ్యారు. ప్రస్తుతం కర్ణాటక నుంచి రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నారు. ఈమె భర్త పరకాల ప్రభాకర్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మీడియా సలహాదారుగా ఉన్నారు. వీరికి ఓ కూతురు. ఈమె ఢిల్లీలో జర్నలిస్టు. నిర్మలకు శాస్త్రీయ సంగీతం అంటే ఇష్టం. కుటుంబం ప్రోత్సాహం కారణంగానే ఈ స్థాయికి ఎదిగానని ఆమె చెబుతారు. హైదరాబాద్‌లోని ప్రణవ స్కూల్ వ్యవస్థాపక డైరెక్టర్లలో నిర్మలా సీతారామన్ ఒకరు. -
కేబినెట్ పునర్వ్యవస్థీకరణ దిశగా..
-
కేబినెట్ పునర్వ్యవస్థీకరణ దిశగా..
♦ పార్టీ పదవులు, గవర్నర్లు, నామినేటెడ్ పోస్టుల నియామకంపైనా... ♦ కార్యాచరణ ప్రారంభించిన ప్రధాని మోదీ సాక్షి ప్రత్యేక ప్రతినిధి, న్యూఢిల్లీ: రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు, పార్లమెంటు సమావేశాలు పూర్తవడంతో పార్టీ పదవులు, కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై ప్రధాని నరేంద్ర మోదీ దృష్టి పెట్టారు. ఆరు రాష్ట్రాలకు గవర్నర్లు, ప్రభుత్వంలోని ఇతర కీలక పదవులనూ ఆయన భర్తీ చేయనున్నారు. వీలైనంత త్వరగా ఈ ఖాళీలను భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ప్రధాని కార్యాచరణ ప్రారంభించినట్లు బీజేపీ, ప్రధానమంత్రి కార్యాలయ వర్గాల సమాచారం. ‘ఈ ఏడాది గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌ల్లో వచ్చే ఏడాది ఆరంభంలో పలు ఇతర రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. వీలైనంత త్వరగానే ఈ పునర్వ్యవస్థీకరణ జరుగుతుంది. 2019 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఈ ఖాళీల భర్తీ ఉంటుంది’ అని బీజేపీ ముఖ్యనేత ఒకరు తెలిపారు. అన్నాడీఎంకేలోని రెండు వర్గాలు విలీనమైనట్లు ధ్రువీకరణ జరిగితే.. ఆ పార్టీని ఎన్డీయేలో చేర్చుకోవడంతోపాటు ఒకరికి కేబినెట్లో చోటు కల్పించే అవకాశాలున్నట్లు చెప్పారు. జేడీయూ నుంచి ఒకరికి కేబినెట్లో చోటు దక్కవచ్చన్నారు. వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతిగా ఎన్నికవటంతో ఆయన చేపట్టిన సమాచార, ప్రసార శాఖ, పట్టణాభివృద్ధి, పట్టణ పేదరిక నిర్మూలన శాఖలు.. అరుణ్ జైట్లీ వద్ద అదనంగా ఉన్న రక్షణ శాఖ, దివంగత మంత్రి అనిల్ దవే నేతృత్వంలోని అటవీ, పర్యావరణ శాఖలను భర్తీ చేయాల్సి ఉంది. 75 ఏళ్లు దాటిన కల్రాజ్ మిశ్రాతోపాటుగా సరైన పనితీరు కనబరచని మంత్రులపైనా వేటు తప్పదని తెలుస్తోంది. కొత్తగా ఎంపిక చేసుకునే మంత్రులు, వారి శాఖల విషయంలో ప్రాంతీయ, కుల సమీకరణాలను ప్రధాని పరిగణనలోకి తీసుకోనున్నారని సమాచారం. వివాదాస్పద రికార్డులున్న వారికి సీనియారిటీ ఉన్నా చోటు దక్కకపోవచ్చని తెలుస్తోంది. అటు పార్టీలోనూ చాలాకాలంగా పునర్వ్యవస్థీకరణ జరగలేదు. 2014లో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికవరకూ పదాధికారుల బాధ్యతలు మార్చలేదు. పార్టీలో ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులకు కేంద్ర మంత్రి వర్గంలో చోటు కల్పించటంతో పార్టీలో వారి పదవులు ఖాళీగానే ఉన్నాయి. మధ్యప్రదేశ్, తమిళనాడు, బిహార్, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ రాష్ట్రాలకు పూర్తిస్థాయి గవర్నర్లను నియమించనున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకూ కొత్త గవర్నర్లను కేటాయించే అవకాశాలున్నట్లు చర్చ జరుగుతోంది. ఎలక్షన్ కమిషనర్ (ముగ్గురికి గానూ ఇద్దరే బాధ్యతల్లో ఉన్నారు), నీతి ఆయోగ్‌కు కొత్త సభ్యులు, బ్యాంకులకు నామినేటెడ్ పోస్టులు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కమిషన్ల పదవులనూ మోదీ వీలైనంత త్వరగా భర్తీ చేయనున్నారని సమాచారం. కేబినెట్లోకి రాం మాధవ్? కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో ఆంధ్రప్రదేశ్ బీజేపీ నుంచి ఒకరికి చోటు దక్కనుం దనే ఊహాగానాలు వినబడుతు న్నాయి. విశాఖ ఎంపీ హరిబాబు లేదా పార్టీ ప్రధాన కార్య దర్శి రాంమాధవ్‌లలో ఒకరికి బెర్త్ ఖాయమని తెలుస్తోంది. ఆగస్టు 28 నుంచి ఏపీలో పర్యటించనున్న అమిత్ షా ఇప్పటికే పరిస్థితులను అధ్యయనం చేస్తున్నట్లు సమాచారం. ఇన్నాళ్లూ టీడీపీ తెరచాటు పార్టీ గా ఉన్న బీజేపీని సొంత కాళ్లపై నిలబెట్ట డం అమిత్ షాకు అంత సులువేం కాదు. వెంకయ్య ఉపరాష్ట్రపతిగా ఎన్నికవడంతో రాంమాధవ్, హరిబాబుల్లో ఒకరిని కేబినెట్లోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. -
శివాజీకి అవకాశం వచ్చేనా..?
ముందస్తు తర్ఫీదులో భాగంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌కు మంత్రి పదవి కట్టబెట్టడానికి రంగం సిద్ధమవుతోంది! రేపో మాపో రాష్ట్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరుగుతుందనే ప్రచారంతో ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరోవైపు మంత్రి పదవి కోసం ఎవ్వరికివారు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అంటూ జరిగితే జిల్లా నుంచి కళా వెంకటరావుకు కచ్చితంగా చోటు లభిస్తుందనే ఊహాగానాలు చాలాకాలంగా ఉన్నాయి. ఇక సీనియర్ ఎమ్మెల్యే గౌతు శ్యామసుందర శివాజీ ఎప్పటినుంచో మంత్రి పదవి ఆశిస్తున్నారు. ఇక సామాజికవర్గం కోటాలో కూన రవికుమార్, మహిళా కోటాలో గుండ లక్ష్మీదేవి కూడా తమ ప్రయత్నాలు చేసుకుంటున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఉత్తరాంధ్ర సమీకరణాలతో సిక్కోలు జిల్లా రాజకీయాలతో ముడిపడి ఉండటంతో మంత్రి అచ్చెన్నాయుడికి మార్పు తప్పదనే వాదనలు ఉన్నాయి. సాక్షి ప్రతినిధి శ్రీకాకుళం: ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు లోకేష్‌తో పాటు టీడీపీలోకి ఫిరాయించిన నాయకులకు మంత్రి పదవులు కట్టబెట్టాలంటే ప్రస్తుతం ఉన్న మంత్రిమండలిలో మార్పులు చేర్పులు తప్పని పరిస్థితి. మంత్రివర్గ కూర్పులో ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి ప్రధానంగా సామాజికవర్గాల కోటానే కీలకం. ప్రస్తుత మంత్రి మండలిలో జిల్లా నుంచి కింజరాపు అచ్చెన్నాయుడు, విజయనగరం నుంచి సిక్కోలుకే చెందిన కిమిడి మృణాళిని, విశాఖ జిల్లా నుంచి చింతకాయల అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉంటుందంటూ రెండేళ్లుగా చంద్రబాబు ఊరిస్తూనే ఉన్నారు. దీంతో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిమిడి కళావెంకటరావుకు ఎప్పటికైనా బెర్త్ లభిస్తుందని ఆయన అనుచరగణమంతా ఆశలు పెంచుకున్నారు. అయితే కళావెంకటరావు గతంలో ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్లి సొంతగూటి చేరడమే మైనస్ కావడంతో ఆయన కుటుంబానికే చెందిన మృణాళినికి మంత్రి పదవి లభించింది. ఇప్పుడు ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న విజయనగరం జిల్లాకే చెందిన బొబ్బిలి ఫిరాయింపు ఎమ్మెల్యే సుజయ్‌కృష్ణ రంగారావుకు బెర్త్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. బొబ్బిలి రాజుకు చోటు ఇస్తే... తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ నుంచి ఫిరాయించి వచ్చిన తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు టీఆర్ఎస్ ప్రభుత్వంలో చోటు కల్పించడంపై అప్పట్లో పచ్చపార్టీ శ్రేణులన్నీ అగ్గిమీద గుగ్గిలమయ్యాయి. చివరకు ప్రమాణం స్వీకారం చేయించి గవర్నరు కూడా తప్పు చేశారన్నట్లుగా ఆరోపణలు గుప్పించారు. ఇప్పుడు అదే గవర్నరు చంద్రబాబు ప్రభుత్వంలో చేరాలనుకొని పార్టీ ఫిరాయించిన నాయకులతో మంత్రిగా ప్రమాణం చేయించాల్సిన పరిస్థితి. వాటన్నింటినీ పక్కనబెట్టేసి బొబ్బిలి రాజు సుజయ్‌కు మంత్రి పదవి కట్టబెడితే ఉత్తరాంధ్రలో సమీకరణాలు మారిపోనున్నాయి. ఆయన వెలమ (ఓసీ) సామాజికవర్గానికి చెందినప్పటికీ కింజరాపు అచ్చెన్నాయుడు, చింతకాయల అయ్యన్నపాత్రుడులను అదే కోటాలో లెక్క గట్టేస్తున్నట్లు వినికిడి. అంటే ఉత్తరాంధ్రలో ఒకే సామాజికవర్గం నుంచి ముగ్గురు మంత్రి మండలిలో ఉంటారు. దీన్ని ఇద్దరికి పరిమితం చేయాలంటే అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు ఇద్దరిలో ఒకరికి పదవీత్యాగం తప్పదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అచ్చెన్నకు పదవీగండం... టీడీపీలో కింజరాపు ఎర్రన్నాయుడికి ఉన్న పలుకుబడి, ఆయన అకాల మరణం నేపథ్యంలో అచ్చెన్నాయుడికి మంత్రి పదవి లభించింది. ఇందుకోసం చంద్రబాబు జిల్లాలో సీనియర్ నాయకులైన గౌతు శివాజీ, కళావెంకటరావులను పక్కనబెట్టేశారు. అప్పటి నుంచి వారి మధ్య సయోధ్య లేదని, గ్రూపు రాజకీయాలు ఎక్కువయ్యాయని పార్టీలోనే అసంతృప్తి వ్యక్తమవుతోంది. పునర్వ్యవస్థీకరణ అంటూ జరిగితే తమకు కేబినెట్లో బెర్త్ లభిస్తుందని శివాజీ, కళావెంకటరావు ఎప్పటినుంచో ఆశిస్తున్నారు. ఇటీవల వంశధార నిర్వాసితుల పరిహారం విషయంలో అచ్చెన్నాయుడు చంద్రబాబు ఆగ్రహానికి గురవ్వడం, జిల్లాలో అన్నీ తానే అయి వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు రావడం తదితర కారణాలతో ఆయనకు పదవీగండం తప్పదనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. విజయనగరం జిల్లాలో సుజయ్‌కు మంత్రి పదవి ఇవ్వాలంటే మృణాళిని తప్పించాల్సి ఉందని, ఆమె స్థానంలో కళా వెంకటరావుకు చోటు కల్పిస్తారనే వాదన ఉంది. అలా సుజయ్, కళావెంకటరావులకు చోటు లభిస్తే అచ్చెన్నాయుడికి పదవీ గండం తప్పదు. ఉత్తరాంధ్రలో సామాజిక కోణంలోనే సమీకరణాలు ఉంటే గంటా శ్రీనివాసరావుతో సరిపడని చింతకాయల అయ్యన్నపాత్రుడినే చంద్రబాబు తప్పిస్తారని, అచ్చెన్నాయుడి పదవికి ఇబ్బంది ఉండబోదనే ధీమా అచ్చెన్న అనుచరుల్లో కనిపిస్తోంది. ఊహల పల్లకిలో..! జిల్లాలో మరో సీనియర్ నాయకుడైన శివాజీ కూడా ఎప్పటి నుంచో మంత్రి పదవిని ఆశిస్తున్నారు. లోకేష్‌తో సామాజిక కోణంలో సంబంధాలు నెరపుతున్న శివాజీ అల్లుడు ఆ దిశగా మార్గం సుగమం చేసేందుకు పావులు కదుపుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్న శివాజీ అల్లుడి ప్రయత్నాలు ఎంతవరకూ నెరవేరుతాయో చూడాల్సిందే. మరోవైపు కాళింగ సామాజికవర్గం నుంచి ప్రభుత్వ విప్ కూన రవికుమార్ కూడా మంత్రి పదవిని ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే మృణాళినిని తప్పిస్తే ఉత్తరాంధ్ర నుంచి మహిళా కోటాలో మంత్రి పదవి కోసం మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ భార్య లక్ష్మీదేవి కూడా ఆశిస్తున్నట్లు వినికిడి. చివరకు ఎవ్వరికి బెర్త్ లభిస్తుందో, ఎవ్వరికి పదవీ త్యాగం తప్పదో రెండు మూడు రోజుల్లో తేలిపోతుందని టీడీపీ వర్గాల్లో చర్చ జోరుగా సాగుతోంది. -
కేబినెట్‌కు కొత్తకళ
యువతకు పెద్దపీట రాజ్‌భవన్‌లో అట్టహాసంగా వేడుక మంత్రులుగా 13 మంది ప్రమాణం స్వీకారం ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్ 9 మందికి క్యాబినెట్ హోదా బెంగళూరు : రాష్ట్ర మంత్రి మండలి పునర్ వ్యవస్థీకరణలో భాగంగా ఆదివారం 13 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో తొమ్మిది మందికి క్యాబినెట్ ర్యాంకు హోదా కల్పించారు. చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తున్న మంత్రి మండలి పునర్ వ్యవస్థీకరణకు అధిష్టానం శనివారం మధ్యాహ్నం గ్రీన్ సిగ్నల్ పడిన విషయం తెల్సిందే. దీంతో మంత్రి మండలిలోకి తీసుకునే వారికి ఢిల్లీ నుంచే సమాచారం అందించారు. సీఎం సిద్ధరామయ్య సూచన మేరకు ఆదివారం ఉదయమే బెంగళూరు చేరుకున్న వారంతా సాయంత్రం మూడున్నరలోపు తమ కుటంబ సభ్యులు, అనుచరులతో రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. అనంతరం సరిగ్గా నాలుగు గంటలకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, గవర్నర్ వ జుభాయ్రుడాభావ్వాలాలు రాజ్‌భవన్‌లోని గ్లాస్‌హౌస్ వేదిక పైకి చేరుకున్నారు. అనంతరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరవింద్ జాదవ్ గవర్నర్ వజుభాయ్ రుడాభాయ్ వాలా అనుమతి పొంది మంత్రుల ప్రమాణ స్వీకారాన్ని లాంఛనంగా ప్రారంభించారు. గవ ర్నర్ వజుభాయ్ రుడాభాయివాలా క్యాబినెట్ స్థాయి మంత్రి పదవులు దక్కించుకున్న తొమ్మిది మందిలో మొదట కాగోడు తిమ్మప్ప, రమేష్‌కుమార్, బసవరాజరాయరెడ్డి, తన్వీర్‌సేఠ్, హెచ్.వై మేటితో మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం ఎస్.ఎస్ మల్లికార్జున, శాసనమండలి సభ్యుడు ఎం.ఆర్ సీతారాం, సంతోష్‌లాడ్, రమేష్జారకిహోళిల మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. చివరిగా ప్రియాంక్‌ఖర్గే, రుద్రప్పలమాణి, ప్రమోద్ మద్వరాజ్, ఈశ్వర్ఖండ్రేలు మంత్రులుగా దేవుడి పేరుమీద ప్రమాణ చేశారు. మొత్తం అరగంటలోపు ముగిసిన ఈ ప్రమాణస్వీకారానికి దాదాపు వెయ్యిమంది హాజరయ్యారు. రాజ్‌భవన్ బయట కూడా భారీ ఎల్ఈడీ స్క్రీన్‌ను ఏర్పాటు చేసి ప్రమాణ స్వీకారోత్సవాన్ని ప్రసారం చేశారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన జ్వాలలు రగలడంతో రాష్ట్ర హోంశాఖ భారీ భద్రత ఏర్పాట్లు చేసింది. కాగా, నూతన మంత్రుల ప్రమాణస్వీకారం అనంతరం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధ్యక్షతన విధానసౌధలో మంత్రి మండలి సమావేశం జరిగింది. ఇందులో మంత్రి మండలిలో స్థానం పొం దిన 13 మందితో పాటు మిగిలిన మంత్రులు కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో కష్టపడి పనిచేసి పార్టీకి, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని నూతనంగా అమాత్య పదవులు దక్కించుకున్నవారికి దిశా నిర్దేశం చేశారు. అంతేకాకుండా వచ్చేనెల 4 నుంచి ప్రారంభం కానున్న శాసనసభ సమావేశాల్లో నూతన మంత్రులకు సహకారం అందించాలని మిగిలిన మంత్రులకు సిద్ధరామయ్య సూచించారు. యువతకు పెద్దపీట.. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మంత్రి మండలి పునర్ వ్యవస్థీకరణలో యువతకు పెద్దపీట వేశారు. నూతనంగా తమ మంత్రిమండలిలోకి తీసుకున్న 13 మందిలో ఆరుగురు నలభై నుంచి యాభై ఏళ్ల మధ్య ఉన్నవారే. వీరిలో అత్యంత పిన్నవయస్కుడు ఎమ్మెల్యే సంతోష్‌లాడ్ కాగా కురువృద్ధుడు కాగోడు తిమ్మప్పకు ప్రస్తుతం 82 ఏళ్లు. ఇదిలా ఉండగా నూతనంగా మంత్రి మండలిలోకి తీసుకున్న వారిలో ఐదుగురు గతంలో వివిధ మంత్రి పదవులు పొందగా మొదటిసారి మంత్రి పదవులు లభించిన వారు ఎనిమిది మంది. మొదటిసారి మంత్రి పదవులు దక్కించుకున్నవారిలో అత్యంత సీనియర్ కాంగ్రెస్ నాయకుడైన కే.ఆర్ రమేశ్‌కుమార్‌తో పాటు మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ప్రియాంక ఖర్గే, ప్రమోద్ మధ్వరాజ్లు కూడా ఉన్నారు. 14 మందిని తొలగించడానికి గవర్నర్ అనుమతి మంత్రి మండలి పునర్ వ్యవస్థీకరణలో భాగంగా ప్రస్తుత మంత్రిమండలి నుంచి 14 మందిని తొలగించడానికి వీలుగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సూచించిన పేర్లకు గవర్నర్ వజుభాయ్ రుడాభాయ్ వాలా ఆదివారం మధ్యాహ్నం పచ్చజండా ఊపారు. దీంతో శ్యామనూరు శివశంకరప్ప (ఉద్యానశాఖ), వీ.శ్రీనివాసప్రసాద్ (రెవెన్యూశాఖ), వినయ్‌కుమార్ సూరకే (పట్టణాభివృద్ధిశాఖ), సతీష్జారకి హోళి (లఘుపరిశ్రమలశాఖ), బాబురావ్చించనసూర్(జౌళిశాఖ),శివకుమార్తంగడి(చిన్ననీటిపారుదళశాఖ), ఎస్.ఆర్ పాటిల్ (ఐటీ,బీటీ శాఖ), మనోహర్ తాహశీల్దార్ (అబ్కారీశాఖ), అభయ్‌చంద్రజైన్ (యువజన,క్రీడలశాఖ), దినేష్ గుండూరావ్ (పౌరసరఫరాలశాఖ), ఖమరుల్ ఇస్లాం (మైనారిటీసంక్షేమ), కిమ్మెన రత్నాకర్ (ప్రాథమిక విద్యాశాఖ),పరమేశ్వర్న ాయక్ (కార్మికశాఖ), అంబరీష్ (గృహ నిర్మాణ శాఖ)లు మంత్రి మండలి నుంచి స్థానాలు కోల్పోయారు. ఇందులో అంబరీష్ పేరు చివరి క్షణంలో చేర్చినట్లు సమాచారం. ఈ జిల్లాలకు మంత్రి భాగ్య లేదు మంత్రి మండలి పున ర్వ్యవస్థీకరణ తర్వాత ఎనిమిది జిల్లాలకు చెందిన శాసనసభ్యులకు మంత్రి మండలిలో స్థానం దక్కలేదు. మంత్రి భాగ్యం దొరకని జిల్లాల జాబితాలో రాయచూరు, చిక్కబళ్లాపుర, చిక్కమగళూరు, కొడగు, బళ్లారి, బెంగళూరు గ్రామాంతర, మండ్య, యాదగిరిలు చేరాయి. -
మంత్రుల గుండెల్లో రైళ్లు
పనిచేయనివారికి ఉద్వాసన యువ ఎమ్మెల్యేలకు పదవులు త్వరలో మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణ సిద్ధు యోచన 21న ఢిల్లీకి సీఎం బెంగళూరు : ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఢిల్లీ పర్యటన రాష్ట్ర మంత్రివర్గంలోని సీనియర్ అమాత్యుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ఈ పర్యటన తర్వాత మంత్రి వర్గ విస్తరణతో పాటు పునర్వ్యవస్థీకరణ కూడా ఉండబోతోందన్న సమాచారంతో వారికి కునుకు పట్టడం లేదు. చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తున్న మంత్రి వర్గ విస్తరణతో పాటు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి చురుగ్గా తీసుకె ళ్లడంలో విఫలమైన వారిని మంత్రి వర్గం నుంచి తొలగించేందుకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సన్నద్ధమయ్యారు. ఇందుకు సంబంధించి సీఎం సిద్ధరామయ్య ఇటీవల బెంగళూరులో మాట్లాడుతూ త్వరలో ‘మంత్రి వర్గ పునర్వవస్థీకరణ, విస్తరణ’ ఉంటుంది. అని పేర్కొన్న విషయం తెలిసిందే. దీంతో మంత్రి వర్గ పునర్వవస్థీకరణలో భాగంగా ఎవరికి ఉద్వాసన పలుకుతారనే విషయంపై సీనియర్ మంత్రుల్లో భయం నెలకొంది. ఈ నెలలో రెండు సార్లు ఢిల్లీ వెళ్లినా ఎన్నికల హడావుడిలో ఉన్న కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, యువరాజు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ సిద్ధుకు దొరకలేదు. ఎన్నికల ప్రక్రియ ముగియడమేకాకుండా రేపు (గురువారం) ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. దీంతో మంత్రి వర్గ విస్తరణ విషయమై చర్చించడానికి సిద్ధును ఢిల్లీ రావాల్సిందిగా సూచన అందినట్లు సమాచారం. దీంతో సిద్ధు ఈనెల 22న ఢిల్లీ వెళ్లనున్నారు. ఇదే సమయంలో గత మూడేళ్లల్లో ప్రభుత్వం సాధించిన విజయాలను కూడా సిద్ధు హై కమాండ్‌కు నివేదిక రూపంలో అందజేయనున్నారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో పార్టీ కార్యకలాపాలు ఇటీవల చోటు చేసుకున్న రాజకీయ మార్పులు తదితర విషయాల పై చర్చించడానికి వీలుగా కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు జీ.పరమేశ్వర్ కూడా ఈనెల 21న ఢిల్లీ వెళ్లనున్నారు. సీనియర్ మంత్రులపై వేటు... మంత్రి మండలి పునఃరచన, విస్తరణలో సీనియర్ మంత్రులకు ఉద్వాసన తప్పదని తెలుస్తోంది. ఉద్యానశాఖను నిర్వహిస్తున్న శ్యామనూరు శివశంకరప్ప వమోభారంతో బాధపడుతుండటం వల్ల ఆయనను మంత్రి పదవి నుండి తప్పించాలని సిద్ధరామయ్య భావిస్తున్నట్లు సమాచారం. ఇక రెవెన్యూ శాఖను నిర్వహిస్తున్న శ్రీనివాస్‌ప్రసాద్ అనారోగ్య కారణాలతో తన శాఖను సమర్థవంతంగా నిర్వహించలేక పోతున్నారని హైకమాండ్‌కు నివేదిక అందింది. ఇక గృహ నిర్మాణ శాఖ బాధ్యతలు నిర్వర్తిస్తున్న అంబరీష్ ప్రజలతో పాటు అధికారులతో కూడా మమేకం కాలేకపోతున్నట్లు ముఖ్యమంత్రికి ఫిర్యాదులు అందుతున్నాయి. అంతేకాకుండా చాలా కాలంగా ఈయన ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో ఎడమొహం పెడమొహంగా ఉంటూ వస్తున్న విషయం తలిసిందే. దీంతో ఈ రెబల్‌స్టార్ కూడా ‘తొలగింపు’ జాబితాలో ఉన్నట్లు సమాచారం. ఇలా ప్రస్తుతం మంత్రి మండలిలో ఉన్న దాదాపు 10 మందిని తొలగించి ఆ స్థానంలో యువ ఎమ్మెల్యేలకు స్థానం కల్పించాలని సిద్ధరామయ్య ఆలోచన. అంతేకాకుండా మరికొందరు సీనియర్లను సైతం మంత్రి మండలి పునఃవ్యవస్థీకరణలో భాగంగా వారి శాఖలను మార్చాలని సిద్ధరామయ్య భావిస్తున్నట్లు సమాచారం. మంత్రి వర్గంలోని సీనియర్లు తన మాట వినకపోవడం వల్లే సిద్ధరామయ్య ఈ నిర్ణయానికి వచ్చారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ‘మేడం, యువరాజు’ ఆమోదం కూడా... మంత్రి వర్గం మరింత చురుగ్గా పనిచేసేందుకు గాను అసమర్థులైన మంత్రులను తప్పించి వారి స్థానంలో కార్యదక్షత ఉన్న యువ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులను అప్పగించాలని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో పాటు పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ సిద్ధరామయ్యను గతంలోనే ఆదేశించారు. ఆమేరకు సిద్ధరామయ్య నివేదిక తయారు చేసినట్లు తెలుస్తోంది. ఈ నూతన నివేదిక పై మేడం, యువరాజుతోతో సీఎం సిద్ధరామయ్య ఆమోద ముద్ర వేయించుకుని రానున్నట్లు కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా మంత్రి పదవుల పై ఆశలు పెట్టుకున్న మోటమ్మ, మాలికయ్యగుత్తేదార్ వంటి సీనియర్ నాయకులు కూడా ఢిల్లీలో మకాం వేసి జోరుగా లాబియింగ్ జరుపుతున్నారు. -
పవన్‌కల్యాణ్ మద్దతూ ప్లస్ పాయింటే..
సాక్షి ప్రతినిధి, కాకినాడ : జిల్లాలోని కమలదళంలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. నిఘా వర్గాల నివేదికల ఆధారంగా భవిష్యత్‌లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరుగుతుందని అటు టీడీపీ, ఇటు బీజేపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆ ముహూర్తం ఎప్పుడొస్తే అప్పుడు జిల్లాకు మరో మంత్రి పదవి, అది కూడా బీజేపీ కోటాలో అవకాశం దక్కుతుందని కమళశ్రేణు మధ్య చర్చ జరుగుతోంది. పొరుగున ఉన్న పశ్చిమగోదావరి జిల్లా నుంచి కేబినెట్లో ప్రాతినిధ్యం వహిస్తున్న దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు స్థానే జిల్లా నుంచి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఆ పార్టీ సీనియర్ నేత సోము వీర్రాజు పేరు కమాండ్ పరిశీలనలో ఉందనే ప్రచారం ఆ పార్టీలో జోరుగా సాగుతోంది. మంత్రి మాణిక్యాలరావు, వీర్రాజులది ఒకే సామాజికవర్గం. విస్తరణలో మాణిక్యాలరావు స్థానే మంత్రి పదవిని వీర్రాజుకు కట్టబెట్టే ఆలోచనతో పార్టీ అధిష్టానం ఏకాభిప్రాయం కోసం ప్రయత్నిస్తోందని సమాచారం. నిఘా వర్గాలతో పాటు సీఎం చంద్రబాబు సొంత నివేదికలు మాణిక్యాలరావుకు వ్యతిరేకంగా వచ్చాయంటున్నారు. అదేవిధంగా తన శాఖలో ఉన్నతాధికారి మార్పు కోసం మంత్రి కోరిన సందర్భంలో కూడా సీఎం సుముఖత వ్యక్తం చేయలేదని చెబుతున్నారు. అవసరమైతే అమాత్య పదవినే మార్పు చేస్తాం కానీ ఆ అధికారిని మార్పు చేసేది లేదని ఖండితంగా చెప్పినట్టు విశ్వసనీయ సమాచారం. ఈ నేపథ్యంలోనే మంత్రివర్గ విస్తరణలో మాణిక్యాలరావు విషయంపై నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు. ఈ విషయాన్ని పసిగట్టారో ఏమో తెలియదు కానీ.. మాణిక్యాలరావు ఇటీవల చంద్రబాబుని అవకాశమొచ్చినప్పుడల్లా ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపిస్తోందని కమలం పార్టీలో చర్చించుకుంటున్నారు. ఆయన టీడీపీ నేతలకంటే పోటీపడి మరీ బాబును పొగడ్తలతో ముంచెత్తుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. పవన్ మద్దతూ ప్లస్ పాయింటే.. ఎన్నికల్లో అధిష్టానం టిక్కెట్టు ఇస్తానన్నా వీర్రాజు తిరస్కరించారు. తన స్థానే రాజమండ్రి సిటీకి డాక్టర్ ఆకుల సత్యనారాయణ పేరును వీర్రాజే ప్రతిపాదించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాగా మంత్రి విస్తరణలో ఆకుల కూడా మంత్రి పదవి కోసం ప్రయత్నిస్తున్న వారిలో లేకపోలేదు. ఇప్పటికే రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే పదవిలో ఆకుల ఉండగా.. ఇప్పుడు అదే ప్రాంతానికి, అదే సామాజిక వర్గానికి చెందిన వీర్రాజుకు ఎమ్మెల్సీ పదవి కేటాయించి మంత్రి పదవిని ఇస్తే జిల్లాలోని ఇతర ప్రాంతాలకు, ఇతర సామాజిక వర్గాల నుంచి వచ్చే అసంతృప్తులపై కూడా అధిష్టానం ఆరా తీస్తోంది. అయితే ఆవిర్భావం నుంచి క్రమశిక్షణ కలిగిన నేతగా హైకమాండ్‌లో పేరున్న వీర్రాజుకు ఇవేమీ అడ్డురావనే వాదన కూడా ఉంది. గత ఎన్నికల సమయంలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ను నరేంద్రమోడీ వద్దకు తీసుకువెళ్లింది కూడా ఆయనేనంటున్నారు. ఈ క్రమంలో పవన్ మద్దతు పుష్కలంగా ఉండటం కూడా తోడై వీర్రాజుకు ఎమ్మెల్సీ ఖాయమైందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సీఎం చంద్రబాబు రప్పించుకున్న నివేదికలు, బీజేపీ హై కమాండ్‌లో పలుకుబడి వెరసి మాణిక్యాలరావు స్థానే వీర్రాజు పేరును బీజేపీ ప్రతిపాదిస్తుందనే ప్రచారం ఆ పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఈ పరిణామాలతోనే.. పదవిని పదిలం చేసుకునే ఆరాటంతో మాణిక్యాలరావు సీఎం బాబును ఆకాశానికి ఎత్తుతున్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. అయినా పార్టీ అధిష్టానం నిర్ణయం వీర్రాజుకు సానుకూలంగా ఉంటే మాణిక్యాలరావు మంత్రి పదవికి ఎసరు ఖాయమంటున్నారు. బీజేపీ కోటాలో పశ్చిమకు దక్కిన అమాత్య పదవిని తూర్పులో భర్తీ చేస్తారంటున్నారు. వారిద్దరిది ఒకే సామాజికవర్గం కావడంతో సామాజికంగా పెద్దగా వచ్చే ఇబ్బంది కూడా ఉండదన్న కమలం పార్టీ ఆలోచనగా ఉంది. అదే జరిగితే జిల్లాలో ప్రస్తుతం ఉన్న రెండు మంత్రి పదవులకు (ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు) అదనంగా మరోటి చేరనుంది. -
9నే కేబినెట్ పునర్వ్యవస్థీకరణ
-
9నే కేబినెట్ పునర్వ్యవస్థీకరణ
ఆదివారం మధ్యాహ్నం 1:30కి ముహూర్తం! గోవా సీఎం సహా 10 కొత్త ముఖాలకు చోటు శివసేనకు రెండు పదవులు ఖాయం టీడీపీకీ కేబినెట్ బెర్త్ దక్కే అవకాశం న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం తన మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించనున్నారు. కేంద్రంలో మే నెలలో అధికారం చేపట్టాక తొలిసారి చేపట్టనున్న ఈ పునర్వ్యవస్థీకరణలో గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ సహా 10 కొత్త ముఖాలకు మోదీ తన కేబినెట్లో చోటు కల్పించనున్నట్లు తెలుస్తోంది. అలాగే పలువురు మంత్రుల శాఖల్లో మార్పుచేర్పులు చేయడంతోపాటు మిత్రపక్షాలైన టీడీపీ, శివసేనకు కూడా ఈ పునర్వ్యవస్థీకరణలో మంత్రి పదవులను మోదీ కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. కేబినెట్ బెర్తుల కోసం శివసేన నుంచి ఇద్దరు ఎంపీల పేర్లను సిఫార్సు చేయాల్సిందిగా ప్రధాని కార్యాలయం (పీఎంవో) ఇప్పటికే కోరినట్లు ఆ పార్టీ నేత ఒకరు వెల్లడించారు. ఈ నెల 11 నుంచి మోదీ 10 రోజులపాటు మయన్మార్, ఆస్ట్రేలియా, ఫిజీ దేశాల పర్యటనకు వెళ్తుండటం, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ భూటాన్ పర్యటన ముగించుకొని శనివారం స్వదేశం చేరుకోనుండటంతో ఆదివారం మధ్యాహ్నం 1:30కి కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు మూహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా కుమారుడు జయంత్ సిన్హా, హర్యానాకు చెందిన జాట్ నేత బీరేందర్‌సింగ్, హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన ఎంపీ అనురాగ్ ఠాకూర్, బీహార్‌కు చెందిన నేత గిరిరాజ్ సింగ్, రాజస్థాన్‌కు చెందిన కల్నల్ సోనారామ్ చౌధురి, గజేంద్రసింగ్ షెకావత్, మహారాష్ట్రకు చెందిన నేత హన్స్‌రాజ్ ఆహిర్ల పేర్లు మంత్రి పదవుల రేసులో వినిపిస్తున్నాయి. ప్రణాళికా సంఘం స్థానంలో ఏర్పాటు చేసిన కొత్త సంస్థకు శివసేన నేత, కేంద్ర మాజీ మంత్రి సురేశ్ ప్రభును అధిపతిగా నియమించి కేబినెట్ హోదా ఇవ్వొచ్చని తెలుస్తోంది. అలాగే ఆ పార్టీ నుంచి మరొకరికి సహాయ మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. మంత్రి పదవి స్వీకరిస్తా: పారికర్ కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో తనకు రక్షణశాఖను కేటాయించే అవకాశం ఉందన్న వార్తలపై గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ఎట్టకేలకు మౌనం వీడారు. కేంద్రంలో బాధ్యత (మంత్రి పదవి) స్వీకరించేందుకు సిద్ధమేనని గురువారం పణజీలో ప్రకటించారు. ప్రధాని అప్పగించే ఏ బాధ్యతనైనా అంగీకరించాల్సిందిగా బీజేపీ చీఫ్ అమిత్ షా సూచించారని... అందుకు తాను సిద్ధంగానే ఉన్నట్లు పణజీలో విలేకరులతో మాట్లాడుతూ వెల్లడించారు. ‘‘రాష్ట్రం నుంచి కేంద్రానికి మారడం నాకు పెద్దగా ఇష్టంలేదు. ఎందుకంటే... గోవాపై నాకు అవ్యాజ ప్రేమ ఉంది. గోవాలో ఐదేళ్లపాటు పాలన సాగించాల్సిందిగా ప్రజలు తీర్పు ఇచ్చారు. పదవీకాలం పూర్తికాకుండా మధ్యలోనే వెళ్లడం సరికాదనేది నా భావన. కానీ దేశం నా సేవలు కోరుకుంటే ఆ బాధ్యత స్వీకరించాలని నా మనసు చెబుతోంది. అయితే గోవాకు నా సేవలు ఎప్పుడు అవసరమైతే అప్పుడు నేను అక్కడ ఉంటా’’ అని పారికర్ తెలిపారు. కాగా, పారికర్ శనివారం తన సీఎం పదవికి రాజీనామా చేస్తారని... అదే రోజు ఆయన వారసుడి పేరును పార్టీ కేంద్ర పార్లమెంటరీ బోర్డు ప్రకటించనుందని బీజేపీ వర్గాలు తెలిపాయి. అదే రోజు నూతన సీఎం ప్రమాణస్వీకారం కూడా ఉంటుందని చెప్పాయి. మనోహర్ పారికర్ వారసుడిగా గోవా సీఎం రేసులో ఆర్ఎస్ఎస్ మూలాలున్న ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మీకాంత్ పార్సేకర్తోపాటు అసెంబ్లీ స్పీకర్ రాజేంద్ర ఆర్లేకర్ పేరును అధిష్టానం పరిశీలిస్తున్నట్లు బీజేపీ నేత ఒకరు చెప్పారు.